Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మామూలు అదృష్టవంతులు కాదు

2019 మే నెల, విశాఖపట్నం అశోక్ నగర్ కాలనీ 3వ వీధిలో 4 ఇల్లులు ఉన్నాయి. మొదటిది విక్కీ వాళ్ళ ఇల్లు. రెండవది లక్కీ వాళ్ళ ఇల్లు. మూడవది మిక్కీ వాళ్ళ ఇల్లు. నాలుగవది ట్రీక్కీ వాళ్ళ ఇల్లు.విక్కీ, మిక్కీ అబ్బాయిలు.లక్కీ, ట్రీక్కీ అమ్మాయిలు. నలుగురు చిన్ననాటి నుంచి ప్రాణ స్నేహితులు. అశోక్ నగర్ కాలనీ లోనే పుట్టి పెరిగారు. నలుగురు చిన్ననాటి నుండి ఒకే పాఠశాల ఒకే తరగతి. 9వ తరగతి పూర్తి చేసి ఇప్పుడు వేసవి సెలవులను ఆస్వాదిస్తున్నారు. నలుగురికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఒక రోజు ఉదయం విక్కీ వాళ్ళ నాన్న విక్కీతో"అరేయ్ విక్కీ! ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాలి. అత్తయ్య ఫోన్ చేశారు"అంటాడు. అప్పుడు విక్కీ మనసులో "ఇది ఏంటి! Holidays మొత్తం క్రికెట్ ఆడుకోవాలి అనుకున్నాము కదా! ఇప్పుడు ఊరెళితే బానే ఉంటది. కానీ క్రికెట్ ఆడుకుంటే ఇంకా బాగుంటది కదా.No ఊరు వెళ్ళడాలు అవి కుదరవు అని చెప్పేద్దాం."అనుకుంటాడు. అప్పుడు విక్కీ వాళ్ళ నాన్నతో"ఏంటి నాన్న? ఇప్పుడే కదా సెలవులు మొదలయ్యాయి. అప్పుడే వెళ్ళిపోవాలా? అమ్మమ్మకి కూడా కొంచెం విశ్రాంతి ఇవోచ్చు కదా" అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న"ఫోన్ చేసింది మీ అమ్మమ్మ ఎ రా!" అని అంటాడు.అప్పుడు విక్కీ"ఏంటి నాన్న నువ్వు! అమ్మమ్మ ఏదో మాటవరసకి పిలిస్తే వెళ్లిపోవడమే? RTC busలో కూడా ఒక seat వృద్ధులకి ఇస్తారు."అని అంటాడు. వాళ్ల నాన్న "RTC busకి, దీనికి సంబంధం ఏంటి రా ?!! ఇప్పుడు RTC bus ఎందుకు?!"అని అంటాడు.విక్కీ"అదంతా నాకు తెలియదు! మనం వెళ్లట్లేదు అంతే! నేను ఆడుకోవడానికి వెళ్తున్నా 11 గంటలకి వస్తాను "అని చెప్పి ఆడుకోడానికి వెళ్తాడు.విక్కీ మైదానానికి వెళ్లి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటం మొదలుపెడతాడు. ఈ నలుగురు స్నేహితులకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ నలుగురు స్నేహితులు క్రికెట్ ఆటలో 6 కొట్టడంలో కంటే కాలనీలో ఉన్న వాళ్ల ఇంటి అద్దాలు పగలకొట్టడంలో గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్లు. అలాగే ఆరోజు కూడా విక్కీ బ్యాటుతో బంతిని కొడితే అది వెళ్లి కాలనీ ప్రెసిడెంట్ ఇంటి కిటికీ అద్దానికి తగిలి కిటికీ అద్దం పగిలిపోతుంది. అప్పుడు లక్కీ "పరిగెత్తండి పరిగెత్తండి ప్రెసిడెంట్ మావయ్య వచ్చేస్తున్నాడు మనల్ని చూస్తే అంతే సంగతి" అంటుంది.లక్కీ విక్కీతో " ఏరా విక్కీ! చెప్పేది నీకే పరిగెత్తు ప్రెసిడెంట్ మామయ్యకి పగలగొట్టింది నువ్వే అని తెలిస్తే మీ ఇంటికి వచ్చి మీ నాన్నకి చెప్తాడు మీ నాన్న గురించి తెలుసుగా నీకు వారం రోజులు తిండి ఉండదు" అంటుంది. విక్కీ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తాడు. విక్కీ ఇంటికి వెళ్ళాక"ఇక్కడే ఉంటే దొరికిపోయే ప్రమాదముంది ఊరెళ్ళి పోవడమే మంచిది"అని మనసులో అనుకుంటాడు. అప్పుడే విక్కీ వాళ్ల నాన్న వస్తాడు. అప్పుడు వాళ్ళ ఇద్దరి మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
నాన్న: అదేంట్రా విక్కీ! 11 గంటలకి వస్తాను అని చెప్పి 10:30 కే వచ్చేసావ్?
విక్కీ: పోయే కలం వచ్చి!
నాన్న: ఏంటి?
విక్కీ: అదే ఊరు పోవాలి కదా! అందుకే త్వరగా వచ్చాను
నాన్న: ఉదయం వద్దు అన్నావ్ కదా ?
విక్కీ: అప్పుడు పగల లేదు కదా!
నాన్న: ఏమన్నావ్?
విక్కీ: అదే వెలగ లేదు కదా అంటున్న! అమ్మమ్మ విశ్రాంతి తీసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లి అమ్మమ్మకి సహాయం చేయాలి అనే ఆలోచన ఉదయం వెలగలేదు కదా అంటున్న.
నాన్న: సరే ఆలోచిద్దాం.
విక్కీ: అదేం లేదు ఇప్పుడే వెళ్ళిపోదాం.తయారైపోండి
ఇలా విక్కీ ఇంట్లో వాళ్ళందరినీ తొందర పెడతాడు.ఇంట్లో వాళ్ళందరూ ఇంటి నుండి 11:30 కే బయలుదేరుతారు. కాలనీ ప్రెసిడెంట్ మైదానం దగ్గరికి వచ్చేటప్పటికీ అక్కడ ఎవరూ లేరు ఇంకా పగిలిన అద్దం గురించి ఎవరిని అడగాలో తెలియక మౌనంగా కొత్త అద్దాన్ని చూసుకుంటాడు. ఈ నలుగురు స్నేహితులు వాళ్ళ వాళ్ల అమ్మమ్మల ఇంటికి సెలవులకు వెళ్తారు. అందరూ జూన్ నెలలో తిరిగి విశాఖపట్నానికి వస్తారు.10వ తరగతి మొదలైంది. పదోతరగతి మొదలైనప్పటికీ ఈ నలుగురు ప్రతిరోజు సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వచ్చాక మైదానానికి వెళ్లి ఆడుకునే వాళ్ళు. ఆడుకుని ఇంటికి వచ్చాక T.V చూసేవారు. కానీ పొరపాటున కూడా చదువుకునేవారు కాదు. ఇలా నాలుగు నెలలు గడిచిపోయాయి. సెప్టెంబర్ మాసం వచ్చింది. సెప్టెంబర్ లో క్వార్టర్లీ పరీక్షలు ఉంటాయి. క్వార్టర్లీ పరీక్షలలో ఈ నలుగురు ఫెయిల్ అవుతారు. మిక్కీ తెలుగులో ఫెయిల్ అయ్యాడు. లక్కీ హిందీ లో ఫెయిల్ అయ్యింది. ట్రీక్కీ Englishలో ఫెయిల్ అయ్యింది. విక్కీ mathsలో ఫెయిల్ అయ్యాడు.social మరియు science లో నలుగురు ఫెయిలయ్యారు. విక్కీకి 97/600 మార్కులు వస్తాయి. లక్కీ కి 98/600 మార్కులు వస్తాయి.ట్రీక్కీకి 99/600 మార్కులు వస్తాయి.మిక్కీకి 100/600 మార్కులు వస్తాయి. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
లక్కీ:ఆ....ఆ...ఆ మిక్కీ!! మా అందరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవుగా...100 మార్కులు తెచ్చుకున్నావు ఇంకేంటి come on మా అందరికీ party ఇవ్వాలి నువ్వు!!
మిక్కీ: (party కావాలా?!! ఓ పని చేస్తాను. మా నాన్న దగ్గరికి వెళ్లి "నాన్నగారు నేను మూడు subjectలలో ఫెయిల్ అయ్యాను.కానీ నా స్నేహితుల కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్నను కాబట్టి వాళ్లకి party ఇవ్వడానికి ఒక 500 రూపాయలు కావాలి"అని చెప్తాను. అప్పుడు మా నాన్న నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపేస్తాడు. తర్వాత సముద్రం దగ్గర ఉన్న శారద థియేటర్ లో 20-40,20-40,30-60,30-60 అని black ticketలు అమ్ముకుని వచ్చిన డబ్బులతో మీకు party ఇస్తాను.party కావాలంట party. పాస్ అయినవాళ్ళే చేసుకోవట్లేదు మనకెందుకే party? కావాలంటే 1 రూపాయి తో ఒక chocolate కొంటాను మీ ముగ్గురు పంచుకొని తినండి అదే party ) అని కోపంతో అంటాడు.
విక్కీ: అవును రా మిక్కీ!! అది నిజమే ఫెయిల్ అయ్యాను అని ఇంట్లో తెలిస్తే నా పని అవుట్.
ట్రీక్కీ: ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలుసా? వచ్చే హాఫ్ ఇయర్లీ పరీక్షలలో కచ్చితంగా పాస్ అవుతాం అని ఇంట్లో promise చెయ్యాలి. అప్పుడు coating కొంచెం తగ్గిస్తారు
ఈ విధంగా ట్రీక్కీ చెప్పినట్టు ఈ నలుగురు స్నేహితులు వాళ్ల ఇళ్లల్లో వచ్చే హాఫ్ ఇయర్లీ పరీక్షలలో కచ్చితంగా పాస్ అవుతాం అని మాట ఇస్తారు. పిల్లల మాట మీద నమ్మకంతో వాళ్ల తల్లిదండ్రులు ఈసారికి క్షమిస్తారు. అలా పరీక్షలు అయిపోయాయి. సెప్టెంబర్ నెల కూడా గడిచిపోయింది. అక్టోబర్ నెల మొదలైంది దసరా సెలవులు మొదలయ్యాయి. సెలవులు అయిపోయాక ప్రతిరోజు చదువుకోవాలని ఈ నలుగురు స్నేహితులు నిర్ణయించుకుంటారు. దసరా సెలవులు కూడా గడిచిపోతాయి. అక్టోబర్ నెల అయిపోయాక నవంబర్ నెల నుండి ప్రతిరోజు కచ్చితంగా చదువుకోవాలని నలుగురు స్నేహితులు నిర్ణయించుకుంటారు. నవంబర్లో డిసెంబర్ నుండి చదువుకోవాలని నిర్ణయించుకుంటారు. డిసెంబర్ నెల కూడా వచ్చేసింది. డిసెంబర్ నెలలో నలుగురు కొంచెం కొంచెం చదువుకోవడం మొదలు పెడతారు.డిసెంబర్ నెలలో హాఫ్ ఇయర్లీ పరీక్షలు జరిగాయి. ఈసారి ఈ నలుగురు స్నేహితులు అన్నట్టుగానే అన్ని subjectలలో పాస్ అయ్యారు. ఈ నలుగురు స్నేహితులకి అన్ని subjectలలో 40 మార్కుల కంటే ఎక్కువ మార్కులే వస్తాయి. కానీ maths లో మాత్రం అందరికీ 40 కంటే తక్కువ మార్కులు వస్తాయి. మిక్కీకి mathsలో 38 మార్కులు వస్తాయి. అయితే మిక్కీ 40 మార్కులకు అత్యాశ పడి టీచర్ దగ్గరికి వెళ్లి ఇంకో 2 మార్కులు వెయ్యమని అడుగుతాడు. అప్పుడు టీచర్ పేపర్ మొత్తం చూసి తప్పులు వెతికి ఇంకో రెండు మార్కులు తీసేసి 36 మార్కులు వేస్తుంది. అప్పుడు మిక్కీ ఎంతో బాధపడతాడు. మిక్కీ తన మార్కులను పెంచుకోవాలని నిర్ణయించుకుంటాడు. స్నేహితులతో కలిసి మార్కుల చీటీను దొంగతనం చేసి తన మార్కులు మార్చుకోవాలి అనుకుంటాడు. మిక్కీ principal గది వెనక ఉన్న కాళీ స్థలంలో తన స్నేహితులకు ఈ విషయం గురించి చెప్తాడు.మిగిలిన ముగ్గురు స్నేహితులు కూడా మిక్కీ చెప్పిన దానికి సరే అంటారు. తర్వాత రోజు మధ్యాహ్నం లక్కీ తన పుస్తకం చూపించడానికి అని staff room లో ఉన్న maths teacher దగ్గరికి వెళ్తుంది. అప్పుడు లక్కీ టీచర్కి తెలియకుండా అక్కడే ఉన్న మార్కుల చీటీను దొంగతనం చేస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్లి దొంగతనం చేసిన మార్కుల చీటీని ఎవరూ చూడనప్పుడు notice board వెనుక దాస్తుంది. తర్వాత మిక్కీ మరియు విక్కీ ఆ మార్కుల చీటీని తీసుకొని అందులో వీళ్ళ నలుగురి పేర్లను గుర్తించి నలుగురికి 40 మార్కులు వేసుకుంటారు. సవరించిన మార్కుల చీటీని తీసుకువెళ్లి ఎవరూ చూడని సమయంలో తిరిగి staff roomలో పెట్టేస్తారు. తర్వాత రోజు మధ్యాహ్నం ఈ నలుగురు స్నేహితులని vice Principal గదికి పిలుస్తారు. ఈ నలుగురు స్నేహితులు వాళ్ళు చేసిన పని గురించి తెలిసిపోయింది ఏమో అనే భయంతో వెళ్తారు. ఈ నలుగురు స్నేహితులు vice Principal గదిలోకి వెళ్తారు. అక్కడే maths teacher మరియు ఆ సంవత్సరమే కొత్తగా చేరిన principal కూడా ఉండడం చూసి ఇంకా భయపడతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
Vice Principal: మీ నలుగురు మార్కుల చీటీని దొంగతనం చేసి అందులో మీ మార్కులను పెంచుకుని మళ్ళీ తీసిన చోట పెట్టేశారు. అవునా? కాదా?
లక్కీ: అవును సార్!
Principal: చేసిందంతా చేసి మళ్లీ ధైర్యంగా మేము చేసాము అని చెప్పుకుంటున్నారు!!. పరీక్షలకు ద్రోహం చేసే వీళ్ల లాంటి వాళ్లు పాస్ అవ్వకూడదు. నలుగురిని maths లో ఫెయిల్ చెయ్యండి. వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పండి. నేను వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడాలి ఈరోజే రమ్మని చెప్పండి vice Principal గారు.!!!!!
లక్కీ: principal గారు! మీరు మా అమ్మానానలతో మాట్లాడే ముందు నేను ఇప్పుడు మీతో మాట్లాడొచ్చా?
Principal: మాట్లాడు!! చెప్పు ఏం చెప్తావో చెప్పు!
లక్కీ: ఇలా అడుగుతున్నాను అని తప్పుగా అనుకోవద్దు. మీరు చాలా సంవత్సరాలుగా తెలుగు teacher గా మరియు principal గా పనిచేస్తున్నారు కదా?!!
Principal: అవును!! అయితే ??
లక్కీ:10వ తరగతిలో తెలుగులో మొదటి పాఠంలో నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటి?
Principal: ఆడిన మాట నిలబెట్టుకోవడం, మాట తప్పకుండా జీవించడం.
లక్కీ: ఇన్ని సంవత్సరాలుగా మీరు ఈ పాఠం చెప్తున్నారు కదా? పాఠం అయిపోగానే ఈ పద్యం పరీక్షలో 5 మార్కులకు వస్తుంది, ఈ భావం పరీక్షలో 5 మార్కులకు వస్తుంది, ఫలానా question and answer పరీక్షలో వస్తుంది అనే తప్ప ఇన్ని సంవత్సరాలలో ఒక్కరోజైనా ఈ పాఠం అయిపోయాక "ఈ పాఠం లో ఉన్న నీతి మాట నిలబెట్టుకోవడం. మీరు కూడా మీ జీవితాలలో ఎప్పుడు మాట తప్పకుండా బ్రతకాలి"అని పిల్లలతో చెప్పారా??? మీరు చెప్పే పాఠం కేవలం పిల్లల పరీక్షల కోసమే!!!. పిల్లలు కూడా పరీక్షలు అయ్యేవరకు పాఠాన్ని గుర్తు పెట్టుకుంటున్నారు. పరీక్షలో 10 points తెచ్చుకుంటున్నారు పరీక్షలు అయిపోయిన తరువాత రోజే అన్ని మర్చిపోతున్నారు. మీరు నేర్పుతున్న చదువు report card లో 10 points అని కనిపించడానికి తప్ప ఇంక దేనికి ఉపయోగపడలేదు. మేము కేవలం పరీక్షలకు మాత్రమే ద్రోహం చేసాం కానీ పిల్లల జీవితాల కోసం కాకుండా కేవలం report cardలో ఏ ఉపయోగం లేని మార్కులు తెప్పించడానికి చదువు చెప్తూ మీరు విద్యకే ద్రోహం చేస్తున్నారు. కానీ మేము అలాంటి వాళ్లం కాదు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆడిన మాట తప్పలేదు. మాకు report cardలో మార్కులు రాకపోవచ్చు కానీ పాఠశాలలో నేర్చుకున్న ప్రతి పాఠం జీవితంలో పాటిస్తాము. మాలాంటి మాటమీద నిలబడే వాళ్లకి board exam లో 10 points తెచ్చుకోవడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఇంకా మీరు మా అమ్మానాన్నలతో మాట్లాడాలి అనుకుంటే మీ ఇష్టం Madam!!
Principal: నన్నే ప్రశ్నిస్తూ ఇంత మాట్లాడావ్ కదా! సరే మీ అమ్మానాన్నలకి ఏమి చెప్పను జరిగిందంతా మర్చిపోతాను మీ నలుగురికి ఇప్పుడు Maths లో 40 మార్కులు వెయ్యమని చెప్తాను.కానీ ఒక condition!!! నిజంగా మీరు అంత గొప్ప వాళ్ళే అయితే. మాటమీద నిలబడే వాళ్ళే అయితే board exams లో 10 points తెచ్చుకుంటాము అని నాకు మాటివ్వండి!! అలా మాటిస్తే ఇప్పుడు మీరు చేసింది మర్చిపోతాను.!! మాటిచ్చే ధైర్యం మీకు ఉందా? 10 points తెచ్చుకునే తెలివి మీకు ఉందా?
లక్కీ: సరే! Board examsలో ప్రతి subjectలో 10 points తెచ్చుకుంటాము అని నలుగురి తరపున నేను మాటిస్తున్నాను. Principal గారు మేము మాట తప్పడం ఇప్పటివరకు జరగలేదు ఇంక జరగదు.!
Principal:వీళ్ళు నలుగురు Mathsలో 40 మార్కులు వచ్చాయి అని వాళ్లంతట వాళ్లే వేసుకున్నారు కదా వాటిని అలాగే ఉంచండి vice Principal గారు !!!ఇంక మీరు వెళ్ళవచ్చు పిల్లలు.all the best.
నలుగురు స్నేహితులు గదిలో నుండి వెళ్లిపోయిన తర్వాత vice Principal మరియు principal మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
Vice Principal: principal గారు వాళ్లని అలా వదిలేసారు ఏంటి?
Principal: ఈ నలుగురిలో ఒక power ఉంది vice Principal గారు!!! అదేంటో సమయం వచ్చినప్పుడు వాళ్లకే చెప్తాను.
అలా డిసెంబర్ మాసం కూడా గడిచిపోతుంది. కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఈ నలుగురు స్నేహితులు 2020 జనవరి 1వ తేదీన "సంక్రాంతి సెలవులు అయిపోయాక కచ్చితంగా చదువుకోవడం మొదలు పెట్టాలి" అని నిర్ణయించుకుంటారు.అలా సంక్రాంతి సెలవులు కూడా అయిపోతాయి.ఈ నలుగురు స్నేహితులు ఫీబ్రవరి నేల నుండి చదువుకోవడం మొదలు పెడదాం అని వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఇంతలో internal మార్కుల కోసం projectలు చెయ్యాలి అని , ప్రాజెక్టులు చేస్తేనే internal మార్కులు వేస్తాము అని పాఠశాల యాజమాన్యం తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ నలుగురు స్నేహితులు project పనులు పూర్తయిన తర్వాత చదువుకోవడం మొదలు పెడదామని అని మళ్ళీ వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకుంటారు. పాఠశాల యాజమాన్యం project mannel అనే పుస్తకాలను పిల్లలందరికీ అమ్ముతారు. పిల్లలందరినీ ఆ పుస్తకంలో చూసి ప్రాజెక్టు పని పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా వ్రాయమంటారు. అందరు పిల్లలు ప్రాజెక్టు పనులను పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా రాస్తారు. కానీ ఈ నలుగురు స్నేహితులు తమ సొంత సృజనాత్మకత ఉపయోగించి ప్రాజెక్టు పనులు చేస్తారు.ఈ నలుగురు ప్రాజెక్ట్ పనులు సొంత సృజనాత్మకత ఉపయోగించి చెయ్యడం వల్ల కొన్ని తప్పులు చేస్తారు. ఈ తప్పుల వల్ల వాళ్ల టీచర్లు ఈ నలుగురికి internal మార్కులు పూర్తిగా వెయ్యరు. అది తెలుసుకొని ఈ నలుగురు స్నేహితులు టీచర్లను బ్రతిమిలాడి మార్కులు వేయించుకోవాలని staff room కి బయలుదేరుతారు. కానీ అక్కడే principal ఉండడం ఈ నలుగురు గమనించాలేదు. ముందు ఈ నలుగురు ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
ట్రీక్కీ: మేడం! అందరికీ ప్రాజెక్టు పనిలో 20/20 వేశారు. కానీ మాకు 20/20 వెయ్యలేదు.! మాకు కూడా వేయండి!
ఇంగ్లీష్ టీచర్: ఎలా వేస్తాను? అందరూ ఒకలా రాశారు‌. మీ నలుగురు మాత్రం ఇంకోలా రాశారు.
ట్రీక్కీ: మేడం! ఆ ప్రాజెక్టులో ఎవరైనా ఐదుగురిని వాళ్లు స్వచ్ఛభారత్ కోసం ఎలా పని చేస్తున్నారో survey చెయ్యమని ఉంది. అది కూడా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా చూసి రాస్తే ప్రాజెక్ట్ అనే మాటకి అర్థమే ఉండదు కాద! Survey చెయ్యకుండా పుస్తకంలో చూసి ఉన్నదున్నట్టుగా రాయడం సరైన పని కాదు కానీ వాళ్లందరికీ 20/20 వేశారు. నిజంగా survey చేసి ప్రాజెక్టు పని పూర్తిచేసిన మాకు మాత్రం 20/20 వెయ్యట్లేదు.
అప్పుడే వాళ్ల మధ్యలోకి principal వస్తుంది.
Principal: ఇంగ్లీష్ టీచర్! వీళ్ళు బోర్డ్ ఎగ్జామ్ లో 10 పాయింట్లు తెచ్చుకుంటాం అని మంగమ్మ శపథం చేశారు!! వాళ్లకి మనం వేసే internal మార్కులు అడ్డు రాకూడదు. ఎందుకంటే తర్వాత 10 పాయింట్లు రాకపోతే మళ్లీ మనమే 10 పాయింట్లు రాకూడదని internal మార్కులు పూర్తిగా వెయ్యకుండా మోసం చేశాం అని అన్నా అంటారు. పూర్తి మార్కులు వెయండి.
ఇంగ్లీష్ టీచర్: సరే మేడం! ఈ నలుగురికి 20/20 వేస్తాను.
Principal: మీ నలుగురికి ప్రతి సబ్జెక్టులో internal మార్కులు 20/20 వచ్చేలా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి 10 పాయింట్లా పనిలో ఉండండి. వెళ్లండి!!!!
ట్రీక్కీ: థాంక్యూ! Principal గారు.!
అలా ఈ నలుగురు పూర్తి internal మార్కులు సాధిస్తారు. ఈ నలుగురు ఇంకా చదవడం మొదలు పెడదాం అనుకుంటారు. ఇంతలో ఫిబ్రవరి నెల కూడా గడిచిపోతుంది. మార్చి నెల మొదలవుతుంది. మార్చి నెల మొదలైనప్పటికీ ఈ నలుగురికి ఏ సబ్జెక్టులోనూ కనీసం మొదటి పాఠం కూడా రాదు. ఇంతలో ప్రభుత్వం మార్చి నెల 23వ తేదీ నుండి బోర్డు పరీక్షలు మొదలవుతాయని ప్రకటిస్తుంది. పరీక్షలకు 20 రోజుల సమయం కూడా లేకపోయినా ఈ నలుగురు స్నేహితులు కచ్చితంగా బోర్డు పరీక్షలలో 10 పాయింట్లు వస్తాయన్న నమ్మకంతో ఉంటారు.ఈ 20 రోజుల్లో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఈ నలుగురు అనుకున్నట్టుగానే మార్చి 18వ తేదీన కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలన కోసం ప్రభుత్వం లాక్ డౌన్ విధిస్తుంది. ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తుంది. ఈ నలుగురు స్నేహితులు ఎంతో సంతోషిస్తారు. ఈ నలుగురు స్నేహితులు మళ్లీ పరీక్షలు ఎప్పుడు పెడతారో ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చదువుకుందామని నిర్ణయించుకుంటారు. ఏప్రిల్ నెల మొదలవుతుంది.2019లో విక్కీ క్రికెట్ ఆడుతూ పగలగొట్టిన అద్దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుండి ఈ నలుగురు కొంచెం కొంచెం డబ్బు దాచుకుంటూ వచ్చారు ఆ డబ్బు ఇప్పుడు కొత్త కిటికీ అద్దం కొనుక్కోడానికి సరిపోయేంత అయ్యింది. విక్కీ ఒక చిన్ని చీటీలో "మేము చేసిన తప్పుకి మమ్మల్ని క్షమించండి. దానికి నష్టపరిహారం ఇప్పుడు చెల్లిస్తున్నాము"అని రాస్తాడు. ఈ నలుగురు కిటికీ అద్దం కోసం దాచిన డబ్బుని మరియు ఈ చిన్ని చీటీని ఎవరూ చూడని సమయంలో కాలనీ ప్రెసిడెంట్ ఇంటి గుమ్మం దగ్గర పెట్టి వచ్చేస్తారు. ఏప్రిల్ నెల కూడా గడిచిపోతుంది. మే నెల మొదలవుతుంది. పదవతరగతి పరీక్షలు జూన్ నెల 6వ తేదీ నుండి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఒకరోజు ఈ నలుగురు క్రికెట్ ఆడుతుంటే వాళ్ల principal కనిపిస్తుంది. Principal విక్కీ తో"మేము వెనకపడి చదవమని గుర్తు చేసిన మీరు పాస్ అవడం కష్టం అలాంటిది రెండు నెలలు కనీసం పుస్తకం కూడా పట్టుకోలేదు. జూన్ నెలలో పరీక్షలు నిర్వహిస్తే మీకు 10 పాయింట్లు కాదు కదా కనీసం మీరు పాస్ అవడం కూడా కష్టమే"అని అంటుంది. అప్పుడు విక్కీ"లేదు మేడం! మాకు ఇంకా నమ్మకం ఉంది. ఏదో ఒక అద్భుతం కచ్చితంగా జరుగుతుంది. మాకు కచ్చితంగా 10 పాయింట్లు వస్తాయి. మేము ఆడిన మాట నిలబెట్టుకుంటాము."అని అంటాడు. సరే చూద్దామని principal అక్కడ నుండి వెళ్ళి పోతుంది. ఈ నలుగురు స్నేహితులు అనుకున్నట్టుగానే అద్భుతం జరుగుతుంది జూన్ 6వ తేదీన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తుంది. పదవతరగతి పరీక్షల ఫలితాలు internal మార్కుల ద్వారా విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటిస్తుంది. జూన్ నెల 30వ తేదీన పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అవుతాయి. ఈ నలుగురు స్నేహితులకి వాళ్ళ principal ,internal మార్కులు పూర్తిగా వేయిచడం వల్ల ఈ నలుగురికి 10 పాయింట్లు వస్తాయి. ఆడిన మాట నిలబెట్టుకున్నమని ఈ నలుగురు ఎంతో సంతోషిస్తారు. జూలై నెల మొదలవుతుంది ఒకరోజు principal విక్కీకి ఫోన్ చేసి మిగిలిన స్నేహితులను తీసుకొని తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది. వాట్స్అప్లో తన ఇంటి చిరునామా పంపిస్తుంది. వాళ్లు తమ principal ఇంటిని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ తమ కాలనీ ప్రెసిడెంట్ ఇల్లు ఉంటుంది. అది చూసి ఈ నలుగురు ఆశ్చర్యపోతారు. విక్కీ principalకి ఫోన్ చేసి ఇది మా ప్రెసిడెంట్ గారి ఇల్లు అని చెప్తాడు. అప్పుడు principal ఆ ఇంటి లోపలికి వెళ్ళండి అని చెప్తుంది. ఈ నలుగురు స్నేహితులు లోపలికి వెళతారు. అక్కడ principal ఉండడం చూసి ఆశ్చర్యపోతారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ ఇలా జరుగుతుంది.
మిక్కీ: అంటే మీరు!!!?
Principal: అవును!! ప్రెసిడెంట్ మీకు మావయ్య అయితే నేను మీకు అత్త అవుతాను. మీరు నన్ను vice Principal గదిలో మొదటిసారి చూశారు. కానీ నేను మిమ్మల్ని పదవ తరగతిలో చేరకముందే 2019లో విక్కీ మా ఇంటి కిటికీ అద్దాన్ని పగలగొట్టిన రోజే మొదటిసారిగా చూశాను. నేను ఆరోజు మా ఇంటి మేడ మీదే ఉన్నాను.మీరు అలా కిటికీ అద్దాన్ని పగలగొట్టి పారిపోయినప్పుడు మీ మీద అసహ్యం కలిగింది. మీతో మాట్లాడడం కూడా ఇష్టం లేక పగలగొట్టింది మీరే అని తెలిసినా మా ఆయనకి చెప్పలేదు.మీరు నేను చేరిన పాఠశాలలో విద్యార్థులు అని తెలిశాక మీ మీద మొదటి నుండే దృష్టి పెట్టాను. ఆ రోజు మీరు maths మార్కుల చీటీ దొంగతనం చేసిన తర్వాత రోజు ఆ విషయం అందరికీ ఎలా తెలిసింది అని ఆలోచించారా?!!!!
లక్కీ: ఆలోచించలేదు!! అవును ఎలా తెలిసింది?
Principal: మీరు ఆ రోజు మార్కుల చీటీని దొంగతనం చేయాలని మాట్లాడుతున్ప్పుడు నా గది వెనుకే మాట్లాడుకున్నారు. నా గదిలో నుండి నేను మొత్తం విన్నాను. అలా vice Principal పేరుతో నేనే మిమ్మల్ని పిలిపించాను. మీరు దొంగతనం చేసినప్పుడు నాకు మీ మీద ఉన్న అసహ్యం ఇంకా పెరిగింది. కానీ లక్కీ నన్ను నిలదీసి నా తప్పులు నాకు చూపించినప్పుడు మొదటిసారిగా మీ మీద గౌరవం కలిగింది.అవును ఇన్ని సంవత్సరాలుగా పిల్లలకు మార్కులు వస్తే చాలు అనే ఆలోచనతోనే పాఠాలు చెప్పాను కానీ వాళ్ళ జీవితాల కోసం ఎప్పుడు చెప్పలేదు.అప్పటి నుండి నన్ను నేను మార్చుకున్నాను పిల్లలకి పాఠంలో ఉన్న నీతిని నేర్పించడం మొదలుపెట్టాను. నన్ను నిలదీసినప్పుడు మీ ధైర్యం నచ్చింది. సరిగ్గా ఒక్క పాఠం కూడా రాకపోయినా పది పాయింట్లు తెచ్చుకుంటాం అని శపథం చేసినప్పుడు మీలో ఉన్న నమ్మకం ఇంకా నచ్చింది. ప్రతి ఒక్కరూ ప్రాజెక్టు పనిలో పుస్తకాలలో చూసి ఉన్నదున్నట్టు రాస్తే మీరు మాత్రమే నిజంగా ఎలా చేయాలో అలా చేశారు.! అప్పుడు విద్య మీద మీకు ఉన్న గౌరవం, మీలో ఉన్న గొప్ప సృజనాత్మకత నాకు కనిపించాయి. పరీక్షలు దగ్గరకు వస్తున్న పరిస్థితులు చేయి జారి పోతున్న ఏదో ఒక అద్భుతం జరుగుతుంది అని మీరు అన్నప్పుడు మీ నమ్మకం నన్ను కదిలించింది. సంవత్సరం క్రితం పగలగొట్టిన కిటికీ అద్దాన్ని అందరూ మర్చిపోయారు అని తెలిసిన దాని కోసం మీ డబ్బులు దాచుకొని మా ఇంటి గుమ్మం ముందు పెట్టి వెళ్ళిపోయినప్పుడు మీ వ్యక్తిత్వాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు రా!!! కరోనా వైరస్ వచ్చి మీ పరీక్షలు రద్దు అయినందుకు కాదు! మీ దగ్గర ఒక power ఉంది అందుకు మీరు అదృష్టవంతులు.ఆ power ఏంటో తెలుసా? ఐకమత్యం.!!!!! అవును మీ నలుగురిలో ప్రతి ఒక్కరూ మిగిలిన ముగ్గురి గురించే ఎక్కువ ఆలోచిస్తారు. అందుకే మీరు ప్రతి సారి గెలుస్తున్నారు. ఆ రోజు లక్కీ విక్కీని హెచ్చరించకపొతే ఆ రోజే విక్కీ అద్దం పగలగొట్టినందకు దొరికిపోయేవాడు. మార్కుల చీటీని దొంగతనం చేసిన తర్వాత విక్కీ, మిక్కీ స్వార్థంతో వాళ్ళ ఇద్దరి మార్కులే మార్చుకోకుండా నలుగురి మార్కులు మార్చారు. ఆరోజు లక్కీ నన్ను నిలదీసి మాట్లాడినప్పుడు,"నాకు ఏం జరిగినా,నాకు సహాయం చేయడానికి నా ముగ్గురు స్నేహితులు ఉన్నారు లే"అనే ధైర్యం నాకు లక్కీ లో కనిపించింది.ట్రీక్కీ మీ నలుగురి కోసం ఇంగ్లీష్ టీచర్నీ మీ నలుగురికి మార్కులు వెయ్యమని బ్రతిమిలాడింది. అందుకే మీలో ప్రతి ఒక్కరికి ఈరోజు 10 పాయింట్లు వచ్చాయి.ఒక్కసారి ఊహించండి మీలో ఐకమత్యం లేకపోతే ఇవేవి మీరు చేసే వారు కాదు కదా. మీలో ఐకమత్యం లేకపోతే 10 పాయింట్లు కాదు కదా కనీసం పాస్ కూడా అయ్యే వారు కాదు. అందుకే చెప్తున్నా ఐకమత్యమే మీ బలము. ఏదైతేనే ఆడిన మాట నిలబెట్టుకున్నారు గా. మీరు గొప్ప వాళ్ళు అని ఒప్పుకుంటున్నాను.ఎన్ని కష్టాలు వచ్చినా ఐక్యమత్యంతో కలిసి ఉన్న మీలాంటి స్నేహితులు అందరూ "మామూలు అదృష్టవంతులు కాదు"

అలా మాట్లాడుకుంటూ ఆ రోజంతా ఆ నలుగురు స్నేహితులు వాళ్ల principal అత్త, president మావయ్యల ఇంట్లోనే గడిపేస్తారు.