Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఒక వేళ అమ్మాయి దేవదాసు అయితే

కాలంలో అమ్మాయిలు ,అబ్బాయిలు ప్రేమించుకోవడం సర్వసాధారణం . కానీ మామూలుగా అమ్మయిల కోసం అబ్బాయిలు దేవదాసులు కావడం మనం చూసి ఉంటాం కానీ ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి దేవదాసు అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద ఈ కథ కొనసాగుతుంది.

మాధవ్ .ఈయన ఒక స్కుల్ టీచర్. ఇతను వీల్ల ఊరికి దూరంలో ఉండే నానపల్లి గ్రామంలో టీచిఃగ్ చేసే వాడు .అక్కడే ఒక రూం తీసుకొని ఉంటున్నాడు . ఈయన్ని రమేష్ ఒకసారి రోడ్లో తన మనీ బ్యాగ్ పోగొట్టుకోవడం వలన వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది . మాధవ్ రమేష్ తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు....అలా ఒకరోజు రమేష్ తన కాలేజి నుండి ఇంటికి పోకుండా మాథవ్ ఇంటికి వెళ్లాడు.అపుడు మాధవ్ సారు రమేష్ తో ఏంటి రమేష్ ఎప్పుడు నా రూంకి రమ్మన్నా వచ్చేవాడివి కాదు , మరి ఇప్పుడు రావడానికి గల కారణం ఏంటి అన్నాడు .రమేష్ మాధవ్ తో "ఏంటి సార్ రాకూడదా చెప్పండి వెళ్లిపోతా " అని అన్నాడు.మాధవ్ "అరే !రమేష్ అలా కాదురా , ఎందుకింత మూడీగా ఉన్నావ్ " అని అన్నాడు. రమేష్ ఏమీ లేదని చెప్పాడు. మాథవ్ రమేష్ తో "రేయ్ నేను ఒక టీచర్ ని రా. పిల్లల మనస్తత్వాన్ని ,ఆటిటూడ్ నేను పసిగట్టలను.చెప్పు ఏం జరిగిందో "అని అన్నాడు. .

అప్పుడు రమేష్ తన కధని చెప్పడం మొదలుపెట్టాడు.
" అది 2009 .అందిరిలాగా నేను కూడా పదవతరగతిలో 550 మార్కులు సాధించాను .అలా నేను మా ఊర్లో ఉండే గవర్నమెంట్ కాలేజిలో ఇంటర్ కి జాయిన్ అయ్యా.బాగానే చదివేవాన్ని కాబట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ లో 430 వచ్చాయి....అలా సెకెండ్ ఇయర్ మొదలైంది...ఆ సమయంలో నాకు మ్యాధ్స్ లో కొన్ని డవుట్స్ ఉన్నాయి వాటిని ఎలాగైనా నాకు అర్థమయ్యేలా చెప్పమంటూ వచ్చింది ప్రమీల .నేను ఆమెకు నాకు వచ్చినంత మేరకు ఆమె డవుట్స్ క్లారఫై చేశా .అలా ఆమెకు, నాకు పరచయమేర్పడింది .అలా రోజూ క్లాస్ అయిపోగానే నా దగ్గర కు వచ్చి తనకు ఏ సబ్జెక్టులో డవుట్స్ ఉంటే అవి చెప్పించుకునేది....అలా ఆమె నన్ను చాలా ఇష్టపడేది.కానీ నాకు ఎవరినీ ప్రేమించాలనే ఆలోచన లేదు నా డ్రీం అంతా I.A.S. కావడం మీదే ఉంది....కానీ ఆమెకి మాత్రం నా మీద రోజు రోజుకూ ప్రేమ ఎక్కువైంది. ఎంతలా అంటే కాలేజిలో లెక్షలర్ల పాఠాలకు బదులు నన్ను చూస్తూ ఉండిపోయేంతగా... అలా ఇంటర్ పరీక్షలు కంప్లీటు చేసుకొని డిగ్రీకి చేరా.ఆమె అప్పుడు కూడా నా కోసం నేను చదివే కాలేజిలో చేరింది.అక్కడ కూడా ఇదే తంతు .నాకు అది చెప్పు , ఇది చెప్పు అంటూ నేనుండే రూం వద్దకు వచ్చేది .నేను ఎన్నో సార్లు చెప్పా నేనుండే రూం వద్దకు ఎందుకు వస్తున్నావ్ .నన్ను వదిలేయ్ .అని చెప్పాను .ఆమె నాతో నేను నిన్ను లవ్ చేస్తున్నా నీ కోసం చావడానికైనా రెడీ అంటూ చెయ్యి కోసుకుంది . రక్తం కారుతోంది . నేను తనకి ఫస్ట్ అయిడ్ చేసి హిస్పటల్ కి తీసుకెళ్లా .

డాక్టర్ కి జరిగిన విషయం చెప్పా .తనకి ట్రీట్ మెంట్ చేసిన తర్వాత ఆ డాక్టర్ నాతో తనకు చాలా బ్లడ్ పోయింది వెంటనే బి నెగిటివ్ బ్లడ్ అరేంజ్ చేయగలరా అన్నాడు. అప్పుడు నేను నాది కూడా బి నెగిటివ్ సార్ నా బ్లడ్ తీసుకోమని చెప్పా . అప్పుడు డాక్టర్ నా బ్లడ్ ని చెక్ చేసి నీ బ్లడ్ ఆమెకు ఎక్కించలేము ఎందుకంటే నీ బ్లడ్ చెడిపోతోంది. కొన్ని రోజులకు నీ బ్లడ్ కూడా పూర్తగా చెడిపోతుంది దాని వలన నువ్వు చనిపోయే అవకాశం ఉంది .అప్పుడు నేను దీనికి పరీస్కారం ఏమైనా ఉందా అని డాక్టర్ ని అడుగగా అతను దీనికి ఒకటే పరిష్కారం నువ్వు రక్త మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది అని అన్నాడు .నీకు బ్లడ్ కాన్సర్ ఉందన్నాడు. అపుడు నేను షాక్ అయ్యా. డాక్టర్ ఆమెకు వేరే వాల్ల బ్లడ్ ని ఎక్కించడానికి ప్రయత్నించాడు .ఇంతలో నా ఫ్రెండ్ ప్రకాష్ తన బంధువులు ఎవరో ఈ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని చూద్దామని రాగా వాడిని నేను తన బ్లడ్ గ్రూప్ అడగ్గా "నాది బి నెగిటివ్ రా ,అయినా ఇక్కడెందుకున్నావ్?" అని అడిగాడు నా ఫ్రెండ్ .నేను జరిగిన విషయం అంతా చెప్పాను. ప్రకాష్ తనకి బ్లడ్ల్ని డొనేట్ చేశాడు. అలా తనకి అయిన హాస్పిటల్ కర్చు కట్టేసి నారూంకి వెళ్లా. ఈ విషయం తను తన ఇంట్లో చెప్పలేదు .నేను కూడా ఈ విషయం నా ఇంట్లో చెప్పలేదు....

మరుసటి రోజు కాలేజికి వెళ్లా . మళ్లీ ఇంటికి వెల్లే సమయంలో తను కలిసి "నీకేమైంది .నేను నీకు నచ్చలేదా , బాగోలేనా .మరి ఏంటి నీ ప్రాబ్లమ్ "అని అంది. అపుడు నేను అలాంటిది ఏమి లేదని చెప్పా.అపుడు తనకి నేనేమి చెప్పలేదు. తను ఇంకేమీ అనకుండా వెళ్లిపోయింది . మరుసటి రోజు కాలేజికి వెళ్లా.తను రాలేదు.అలా వారం గడిచింది.తనకేమైందని తన ఫ్రెండ్స్ ని అడగగా ,వారిలో ఒకామె ఇలా అంది-"నువ్వు తనకి దక్కవనే బాధలో రోజూ తను హాస్టల్లో మందు సిగరెట్లకు బానిస అయిపోయి తెల్లవార్లు నిన్నే తలచుకుంటూ తెగ తాగుతూ ఉంటోంది. ఏమైందని అడిగితే ఏమీ చెప్పలేదు .ఇలా తాగితే ఎలా ,నీ ఆరోగ్యం ఏమైతుందనేది లేదా అంటే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది" అని తన ఫ్రెండ్ చెప్పింది. ఆ మాట విన్న క్షణమే నేను తన హాస్టలకు వెళ్లా .అక్కడ తను తాగుతూ ఉంది.నీకేమైనా పిచ్చా అని గట్టిగా చెంపకేసి కొట్టా.అపుడు తను" కొట్రా !ఎంతైనా నిన్ను ప్రేమించాను కదా అందుకే ఇంతచులకనైపోయానులే" అని అంది.
"ఏమైందని ,ఇలా తాగుతున్నావు?"అని నేను అన్నాను.
అప్పుడు తను "ఇంకేం కావాలి! నీకు బ్లడ్ కాన్సర్ అంట కదా!" అని అంది.
"అయితే ఇప్పుడేంటి?" అన్నాను నేను.

"అందుకే .నేను కూడా నీతో పాటే చనిపోయి నీతో వస్తా"అంది.

"నీకెవరు చెప్పారు ,ఈ విషయం?" అని నేనుఅన్నా.
అప్పుడు తను" నీకు అనవసరం అని అంది ".సరే ఇదే నీ నిర్ణయం అయితే నేను ఈ కాలేజీని వదిలేస్తున్నా అని చెప్పేసి ఇంటికి కూడా వెళ్లకుండా నీ దగ్గరకు వచ్చానని చెప్పాడు . అపుడు మాధవ్ " మరి నిన్ను ప్రేమిస్తున్న అమ్మాయి సంగతేంటి ?"అని అన్నాడు. మాధవ్ సార్ రమేష్ తో ఇలా అన్నాడు "కాదు రమేష్ నీకు బ్లడ్ కాన్షరా .నేను నమ్మలేక పోతున్నాను . వెంటనే ఈ విషయం మీ అమ్మా నాన్నలకు చెప్పు "అన్నాడు . రమేష్ "వద్దు సార్ నా వల్ల కాదు నా తల్లిదండ్రులు నా వల్ల బాధలు పడటం నేను చూడలేను, వారికి ఈ విషయం తెలయకపోడమే మేలు " అని అన్నాడు . ఇంతలో రమేష్ కి ప్రకాష్ ఫోన్ చేసి "రేయ్ ఇక్కడ నీ కోసం ప్రమీల చనిపోయే స్థితికి వచ్చింది "అని చెప్పాడు. రమేష్ హుఠాహుఠిన అక్కడి నుండి వెళ్లిపోయాడు .రమేష్ వెంటనే ఆమె హాస్టలకు వెళ్లిచూశాడు.తను అప్పటి లాగే తాగుతూ ఉన్నందున మత్తులో ఉండిపోయింది. రమష్ మాటలు విన్న ప్రమీల ఆ మత్తులోనే అతన్ని చూస్తూ "ఏంటి మళ్లీ వచ్చావ్ !
నేనేమైతే నీకెందకు?,వెళ్లిపో" అని అంది. రమేష్ ఆమెని గట్టిగా హత్తుకొని "నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా ఇంకెప్పుడూ నిన్ను వదలను, నేను నిన్ను నా నుండి దూరం చేస్తేనైనా నువ్వు మారతావని అనుకున్నా కానీ ఇలా నువ్వు నా కోసం తాగి చెడిపోతుంటే చూడలేను .తన వారికే న్యాయం చేయలేని నా లాంటి వాడు కలెక్టర్ జాబ్ కి అనర్హుడు" అని అన్నాడు. ప్రమీల రమేష్ తో "లేదురా నాదే తప్పు నిన్ను నీ ఆశయం అర్థం చేసుకోకుండా నిన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నా నువ్వు నా కోసం రాలేదనే బధలో ఇలా చేశా ఇంకెప్పుడూ నిన్ను డిస్టర్బ్ చేయను "అని అంది . అప్పుడు రమేష్ మళ్లీ తన డిగ్రీ మీద ఫోకస్ చేశాడు .....అలా డిగ్రీ పూర్తి చేశారు రమేష్ ,ప్రమీల....అలా రమేష్ సివిల్ ఎగ్జామ్ లో పాస్ కావడం , అనేక కష్టాలను ఎదుర్కొని రమేష్ ఎట్టకేలకు తన డ్రీం ప్రకారం కలెక్టర్ అయ్యాడు ...రమేష్ ,ప్రమీలను వివాహం చేసుకున్నాడు. ... ఇక్కడ అందరి డవుట్ ఏంటి అంటే మరి అతని కాన్సర్ సంగతీ అని... రమేష్ తనకున్న బ్లడ్ క్యాన్సర్ నీ ఉద్యోగం వచ్చిన తరువాత దానికి తగిన చికిత్స తీసుకుని నయం చేసుకున్నాడు .

ఈ కధలో మనకు అర్థమైనది ఏంటి అంటే అమ్మాయిల ప్రేమకోసం అబ్బాయిలు దేవదాసులు అయిపోతుంటారు , కానీ అమ్మాయిలు కూడా తాము ప్రేమించినవారికోసం దేవదాసులు అయిపోతారు అని ఈ కథ వలన తెలుస్తుంది.

ఇక్కడ అబ్బాయిలు మాత్రమే ఎక్కువగా ప్రేమిస్తారని కాదు‌ , అమ్మాయిలు కూడా మన కంటె ఎక్కువ గాఢంగా ప్రేమించేవారు ఉన్నారని మనం తెలుసుకోవాలి ....

అయితే నిజమైన దేవదాసు లాగా వీరి కధ అంతరించిపోలేదు గానీ ఈ విధంగా ఇద్దరూ ఒకటై ఒక కొత్త తరపు కధని సృష్టించగలిగారు.
ఈ కధ పాఠకులకు నచ్చుతుందని ఆశిస్తూ.......
✍ a story by
Peddakotla Amarnath