Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమించిన వ్యక్తి

ఈ స్టోరీ కి స్టికర్ రూపంలో అభిమానం తెలిపినా, లేదా కామెంట్ రూపంలో అభిమానం తెలిపినా ఒకే.
Let's Read now.
ఆడియో కథ అందుబాటులో ఉంది. More details please check our Profile picture or profile details.

ప్రేమ్ మేడ పై మందు తాగుతూ, గుండెల నిండా భారంతో ఆకాశం వైపు చూసి" ఎందుకే నా ప్రియ ను నాకు కాకుండా చేశావ్!, ఏం పాపం చేసిందని తనని అంత త్వరగా తీసుకెళ్లావ్" అని ఈ లోకాన్ని తిడుతున్నాడు.ఆ మాటలు విన్న ప్రేమ్ చెల్లి అక్కడి వచ్చి "ఇక్కడ ఒంటరిగా కూర్చోని బాధ పడితే ఫలితమేమిటి?. సరే ..రా వచ్చి కొద్దిగా అన్నం అయినా తిందురా " అని అంది.
"నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్లి తినేసెయ్" అన్నాడు.
"నీకేన బాధ, నాకు లేదా ఎంటి?, ఎంత ఏడ్చినా పోయిన మనిషి తిరిగి రాదు కదా!" అంది చెల్లి.
ఇదేమీ పట్టించుకోకుండా ప్రేమ్ తన జేబులోని సిగరెట్టు ని తీసి లైటర్ తో వెలిగించుకొంటున్నాడు.
" ఇలా తనని తలుచుకుంటూ, ఏమీ తినకుండా నీ ఆరోగ్యం పాడుచేసుకుంటే ఎలా?. తను చనిపోయి ఇంకా మూడు రోజులే అవుతోంది. తనకి పిండ ప్రదానం చేయాలి గుర్తుందా!" అని ఏడుపు గొంతు తో అంది.
ప్రేమ్ ఏమి పలకలేదు. అది చూసి, అతని చెల్లి అక్కడి నుంచి ఏడుస్తూ కిందకు వెళ్ళిపోయింది. ప్రేమ్ అలా చాలా సేపు ఆకాశం వైపు చూస్తూ అలానే మంచంలో పడుకున్నాడు.

.......................సూర్యుడు ఉదయిస్తున్నాడు ...............................

ప్రేమ్ చెల్లి అయిన శ్వేత పొద్దుగానే లేచి ఇంటి పనులు చేసుకుంటోంది. అలా పనులు పూర్తి చేసుకున్న పిమ్మట , ప్రేమ్ ని లేపడానికి మేడ మీదకు వెళ్ళింది. ప్రేమ్ తన భార్య అయిన ప్రియ ఫోటో నీ గుండెలపై పెట్టుకుని పడుకున్నాడు. శ్వేత ప్రేమ్ ని తట్టి "త్వరగా లేయి రా, మనకి ఈ రోజు చాలా పనుంది " అని అంటూ పక్కన్నున్న మందు సీసాలను తీసి చెత్తబుట్టలో పడేస్తోంది. ప్రేమ్ ఎంతకీ లేవ్వలేదు.
"ఎంత చెప్పినా నిద్ర లెయ్యవా?" అని శ్వేత ప్రేమ్ ని అరుస్తోంది. ఎంత కీ ఎటువంటి కదలికలు లేక పోవటంతో శ్వేత ప్రేమ్ ముఖం పై వున్న ఆ దుప్పటి ని తీసి , అతని చేతిని పట్టుకుని లాగడానికి ప్రయత్నించింది. చేయి చల్లబడడం చూసి , ఛాతి పై తల పెట్టి అతని గుండె చప్పుడుని వినడానికి ప్రయత్నించింది.ఆమెకు అతని గుండె చప్పుడు వినబడక పోయేసరికి భయంతో సుధాకర్ కి ఫోన్ చేసి అక్కడి విషయం చెప్పింది శ్వేత. ప్రేమ్ నీ గుండెలకు హత్తుకుని " రెయ్! ప్రేమ్ లేవరా! నన్ను వదిలి ఎలా వెల్లిపోతావు?" అని బిగ్గరగా ఏడవసాగింది.
కాసేపటికి ప్రేమ్ friend అయిన సుధాకర్ అక్కడికి వచ్చి , తన sthethascope తో ప్రేమ్ heart beat ni check చేశాడు. అప్పటికే ప్రేమ్ చనిపోయి చాలా సేపు అయింది అని గ్రహించాడు సుధాకర్. ఇక సుధాకర్ కూడా ఏడుపు ఆపుకోలేక ప్రేమ్ కాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఇక అతనికి అంతిమ సంస్కారాలు సుధాకరే నిర్వహించాడు. ప్రేమ్ శరీరాన్ని , ప్రియ సమాధి పక్కనే పూడ్చారు.
బతికున్నంగా వాళ్ళు సంతోషం గా లేక పోయినా , చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగడానికి ప్రేమ్ శరీరాన్ని , ప్రియ సమాధి పక్కనే పూడ్చారు.

వారి ఇద్దరి కథ తెలియాలంటే పూర్తిగా(వినాల్సిందే) చదవాల్సిందే.👇

ఇది గడిచిపోయి సంవత్సరం అవుతోంది. ప్రేమ్ చెల్లెలు అయిన శ్వేత ను సుధాకరే పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్ళికి సుధాకర్ చెల్లెలు స్ఫూర్తి అన్నీ తానే దగ్గరుండి పెళ్లి పనులు చూసుకుంది. ఒక సాఫ్ట్వేర్ అయిన స్పూర్తి ఎప్పుడు చూసినా ఉద్యోగం రీత్యా వేరే ఊరులో అన్నకు దూరం గా ఉండాల్సి వచ్చేది. ఇలా మళ్లీ అన్న పెళ్ళికి మాత్రమే వచ్చింది. ఆ సాయంత్రం చుట్టాలంతా ఎవరి వూర్లకు వాళ్ళు వెళ్ళిపోయాక,స్ఫూర్తి తన అన్న వద్దకు వచ్చి కూర్చుని, అన్న వొడిలో పడుకుంది.

"ఎన్నాళ్ళయింది అన్నయ్య ఇలా నీ వొడిలో పడుకుని, నాకు మళ్లీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి" అని అంది.

సుధాకర్ చిరునవ్వు నవ్వి , తనని జోకొడుతున్నాడు.
"అన్నా! వదిన నీకు ఎలా, ఎక్కడ పరిచయం?" అని అడిగింది.

" ఎందుకని అలా అడుగుతున్నావు?"

" ఏం లేదు,వదిన అంత బాగా మాట్లాడుతుంటే నూ..."

"అదేం లేదమ్మా! , శ్వేత నా ఫ్రెండ్ కి చెల్లెలు, తరచూ వారి ఇంటికి వెళ్తుంటాను కాబట్టి ఈమె నాకు పరిచయం".

" వదిన వాళ్ళ అమ్మా , నాన్న ఏమయ్యారు ?" అని అడిగింది.

" వాళ్ళు అమ్మానాన్న లు వారి చిన్నప్పుడే చనిపోయారు, తనకు అన్నీ తన అన్న మాత్రమే ".

"ఇప్పుడు అతను ఎక్కడున్నాడు అన్నయ్యా!, పెళ్ళికి కూడా రాలేదు".

"ఎలా వస్తాడమ్మ! అతను చనిపోయి సంవత్సరం అవుతోంది".

" అతనికి ఏమైంది అన్నయ్య ?, ఎలా చనిపోయాడు?" అని అడిగింది.

స్ఫూర్తి ఆ విషయం అడగ్గానే సుధాకర్ మనసులో ఏదో తెలియని బాధ. అప్పుడు తన చెల్లెలి తో "లవ్ విషయం వల్ల చనిపోయాడు. అయినా ఆ విషయాలు మళ్లీ, మళ్లీ గుర్తుకు చేసుకున్నప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది " అని అంటూ అక్కడి నుండి కళ్ళనీళ్ళు పెట్టుకుని, తన రూం కు వెళ్ళిపోయాడు.

సూర్యుడు ఉదయించే సమయం అయ్యింది.ఇంట్లో వాళ్ళందరూ ఇంకా నిద్ర లేవ లేదు. స్ఫూర్తి ఆ రోజు త్వరగా లేచింది. ఇల్లంతా చిందర వందరగా ఉండడం చూసి తానే ఇల్లంతా శుభ్రం చేస్తోంది. మేడ పైన ఉన్న చెత్త ను కూడా శుభ్రం చేస్తుండగా, సొఫ కింద ఉన్న ఒక పుస్తకం ఒకటి తనకి దొరికింది. స్ఫూర్తి ఆ పుస్తకాన్ని తీసి సోఫా పై పెట్టి తన పని తాను చూసుకుంటోంది. ఇంతలో ఆ పుస్తకం లోని పేజీలు గాలికి అటూ, ఇటూ, తిరుగుతుండగా అందులోంచి ఒక ఫోటో కొట్టుకొచ్చింది ఆమె వద్దకు. చెత్త ను ఎత్తుతున్న సమయంలో ఆ ఫోటో ను చూసి , దాన్ని తీసుకుని మళ్లీ ఆ బుక్ లో పెడుతుండగా ఆ ఫోటో వెనుక ఏదో రాసిన దానిని చూసి, దాన్ని చదివింది స్ఫూర్తి. అది చదివిన తను, ఆ బుక్ ఎవరిది అని అందులోని మాటర్ చదవసాగింది.

" అది మార్గశిర మాసం. నా స్నేహితురాలు కవిత, తన పెళ్లికి నన్ను కూడా ఆహ్వానించింది . నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఆమె పెళ్ళికి,పెళ్ళి బస్ లో వెళ్ళాను.తన పెళ్లిని ఎక్కడో దూరాన, కొండలలో ఉన్న నరసింహ స్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని తన జేజి మొక్కుకుందట. అందుకే అందరూ అక్కడకు చేరుకోవడానికి బస్లో ప్రయాణించాల్సి వచ్చింది. అయితే అదే నా ప్రేమకు తొలి మెట్టు గా నిలిచింది. అందరం బస్ లో పాటలు పాడుకుంటూ, మంచి మ్యూజిక్ ప్లే చేసుకుంటూ వెళ్తున్నాము. అప్పుడే మా ఇద్దరి చూపులు ఒకరికొకరు ని చూసుకున్నాయి. స్నేహితులందరూ చీటీలు వేసి ఎవరు పేరు వస్తే ,వాళ్ళు తాము చెప్పిన వారితో , ఒకరి కళ్ళలో ఒకరు కళ్ళు పెట్టి చూడాలని, ఎవరైతే అలా చూడలేక ఓడిపోతారో , వారు 500 రూపాయలు అయిన ఇవ్వాలి , లెందంటే అందరి ముందు 50 గుంజీలు అయిన తీయాలి అని పోటీలు పెట్టుకున్నారు. అందులో కి నన్ను కూడా లాగారు నా స్నేహితులు.

మొదటి చీట్టీలో వచ్చిన పేర్లు గల జంట ఓడిపోయారు, ఫలితంగా డబ్బులకు బదులు వారు గుంజీలు తీశారు. మిగతావారు కూడా చివరివరకు వచ్చి గెలవలేక పోయారు. నేను తప్పించు కున్నాను అనుకునే లోపే నా పేరు గల చిట్టీ వచ్చిందని చెప్పారు స్నేహితులు. అప్పుడు వాళ్ళు , వాళ్లకు తెలియకుండానే , నేను మొదట చూసిన వ్యక్తి నే నాకు సెలక్ట్ చేసి ఆటలోకి దించారు. నేను భయం తో అలాగే ఉండిపోగా , అతనే మొదటగా నా కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. నేను కూడా మెల్లిగా అలానే అతని కళ్ళలోకి చూస్తూ ఉన్నాను. అలా 10 నిముషాలు అయినా అలానే ఇద్దరం ఒకరి కళ్లలోకి ఒకళ్ళం చూస్తూనే ఉన్నాం. ఇంతలో స్పీడ్ బ్రేకర్ కారణంగా బస్ కాస్త షేక్ అయ్యింది. ఆ కుదుపుకు మేమింద్దరం ఒకరి మీద ఒకరం పడిపోయాము. బస్ లో ఉన్న అందరూ మమ్మల్ని చూసి ఆశ్చర్య పోయారు. దాంతో పోటీ అయితే ముగిసింది."పోటీలో నువ్వే గెలిచావు" అని చెప్పారు స్నేహితులు . అలా మేము మా చూపుల వల లోంచి బయటికి వచ్చాము. అప్పటికే అలసిపోయిన అందరూ ఇక ఆటలు ఆపి , పెళ్లి జరిగే ప్రదేశం ఎప్పుడు వస్తుందా అని అందరం ఎదురుచూస్తున్నాం. దారిలో గాలి, వాన కుంభవృష్టి తలపించే విధంగా పడుతోంది. ఆ వానలో బస్ డ్రైవర్ కొండలోయలో కి ఘాట్ రోడ్డు గుండా చాక చక్యంగా నడుపుతూ వెళ్తున్నాడు.

అలా రాత్రి 10:30 PM సమయానికి మేము అక్కడ కు చేరుకున్నాము. అక్కడ చూట్టూ కొండలతో కూడిన చెట్లతో వాతావరణం చాలా చల్లగా,మేఘాలు కిందకు లాగినట్టు,పొగ మంచు దట్టంగా కప్పేసింది. ఆ పోగ మంచులో ఒకరికొకరు కనడడం లేదు. మేము అక్కడ దిగి కళ్యాణ మండపం పైన ఉన్న రూముల లోకి వెళ్ళిపోయాము. మేము అక్కడ మొత్తం నాలుగు రోజులు స్టే చెయ్యాలి కాబట్టి, మా బట్టలు బ్యాగుల బరువు కూడా అలాగే ఉంది మరి. ఆ బరువును మోసుకుంటూ ఎట్టకేలకు రూముల కు చేరుకున్నాము. రూముకు నలుగురు చొప్పున , నేను నా ముగ్గురు స్నేహితురాల్లను ఒకే రూం లో వుండే విధంగా చూసుకున్నాము. ఇక మేము త్వరగా స్నానాలు చేసి , భోజనం తినడానికి రెడీ అయ్యాము. చూస్తే అక్కడ ఇంకా భోజనాలు వండుతున్నారు. అంత సేపు మేము ఉండలేక స్వామి నీ దర్శించుకుందామని గుడిలోకి వెళ్తే, తలుపులు మూసేసారు. అప్పుడే నాకు, నా వ్యక్తి మళ్లీ కనబడ్డాడు పెళ్ళికొడుకు ఉమేష్ , సుధాకర్ ల తో కలిసి.అక్కడే నాకు సుధాకర్ కూడా పరిచయం అయ్యాడు.
"ఇక్కడికి పక్కనే జలపాతం ఉంది, మీకు ఆ నీళ్ళ శబ్దాలు వినబడడం లేదా?" అని పెళ్ళికొడుకు అన్నాడు మాతో.

" అవునా! అందుకే నా ఇంత శబ్దం వస్తోంది ఇక్కడ! పదండి వెళ్దాం!" అని స్వప్న మమ్మల్ని వెంటబెట్టుకుని ఆ నీళ్ళ వద్దకు తీసుకెల్లింది.
ఆ జలపాతం చాలా ఎత్తుగా ఉండటం చూసి , ఇంత రాత్రి అక్కడ ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదని అంతా వెనక్కి వచ్చేశాము.
అలా కాసేపటికి భోజనాలు రెడీ అయ్యాయి అని చెప్పారు. అందరూ ఆ వాతరణానికి వణుకుతూ భోజనాలు లాగించేసారు. అలా ఆ రాత్రి ఆనందంగా గడిచింది.

తెల్లవారగానే...పెళ్లి లో భాగంగా పెళ్లి తంతులు మొదలయ్యాయి. ఇక కవిత , ఉమేష్ లు పెళ్ళి తంతుల తో ముస్తాబు కావడం లాంటి ఆచారాలు లో బిజీ అయిపోయారు.
నా సెల్ నంబర్ ని ఎవరిని అడిగి కనుకున్నాడో కానీ , నాకు ఒకేసారి ఆరోజు ఒక కొత్త నంబర్ నుండి ఇన్ని మిస్డ్ కాల్స్ రావడం చూసి నేను ఆశ్చర్యపోయాను. ఆ ఫోన్ చేసింది ఎవరని తిరిగి call చేస్తే పోలేదు.

అది కొండ ప్రాంతం అయినందున అక్కడికి cell phone సిగ్నల్స్ సరిగ్గా రాలేదు. అక్కడి వాళ్ళను అడిగితే కేవలం landline ఫోన్స్ నుండి మాత్రమే సిగ్నల్ అందుతుంది అని చెప్పారు.అప్పుడు ఆ కొత్త నంబర్ కి landline నుంచి ట్రై చేశాను. ఫోన్ రీచ్ అవ్వట్లేదనే చెబుతోంది.సర్లే, అని అక్కడి నుండి పెళ్లి తంతులు జరిగే వద్దకు వెళ్ళాను.అక్కడ వారిద్దరు కి చేసే తంతు చూసి చాలా అన్నందిస్తునే...నా కళ్ళు ఎవరి కోసమో వెతుకుతున్నాయి. ఇంతలో అతను కనిపించగానే నా కళ్ళు నేలను చూశాయి . ఆ కార్యక్రమం పూర్తి కాగానే, నేను రూముకు వెళ్తున్నాను. ఇంతలో అటు వైపు ఎవరూ రాకపోవడం తో అతను నా వద్ద వచ్చి "నీతో కొంచెం మాట్లాడాలి, ఇందాక నీకు ఫోన్ చేసింది నేనే, నీ కోసం ఆ జలపాతం వద్ద వేచి చూస్తుంటాను" అని చెప్పి అక్కడినుండి వెళ్ళిపోయాడు. మనసులో వెళ్దామా.. వద్దా అని నాతో, నాకే గొడవ స్టార్ట్ అయ్యింది. చివరికి నా మనసు అతని వద్దకు వెళ్ళమనే కోరి, అతని వద్దకు నన్ను వెళ్లేలా చేసింది. అలా ఆ రోజు మేము ఒకరి గురించి ఒకరం మనసు విప్పి మాట్లాడుకున్నాము. ఆ మరుసటి రోజు పెళ్లికొడుకు కి గిఫ్ట్ కొనడం కోసం అక్కడికి దగ్గరలో ఉన్న టౌన్ కి ప్రేమ్ సుధాకర్ ని అడిగి పెళ్లి వారి జీప్ నీ తీసుకుని వెళ్తుండగా , ఆ ఛాన్స్ మళ్లీ రాదని నేను కూడా పెళ్లి కూతురికి గిఫ్ట్ కొనడానికి అని చెప్పి అతనితో ఆ జీప్ లో వెళ్ళాను.

అలా గిఫ్ట్ కొనడానికి అక్కడి కి దగ్గర్లో ఉండే చిన్న టౌన్ కి చేరుకున్నాము. అక్కడ మాకు కావలసిన గిఫ్ట్ లు తీసుకుని, దారిలో వచ్చే హోటల్ లో భోజనం చేసి , అక్కడక్కడ ఆగుతూ.. మంచి ,మంచి ఫోటోలు తీసుకున్నాం. దారిలో ఒకరికొకరం మాట్లాడుకుంటూ, వెళ్తున్నాము. అలా దారిలో ఒక అవ్వ మా జీప్ నీ ఆపి, తనని అక్కడికి దగ్గర్లో వచ్చే హై వే రోడ్డు వద్ద ఆపమని అడుగగా , జాలిపడి ఎక్కించుకున్నాడు ప్రేమ్. ఆ అవ్వ మమ్మల్ని చూసి భార్యా ,భర్తలు అనుకుందేమో" మీకు ఎంత మంది పిల్లలు?" అని అడిగింది. ప్రేమ్ అయితే అది విని కూడా, వినబడనట్టు గా నటిస్తున్నాడు. అప్పుడు నేను ప్రేమ్ ని ఆటపట్టించడానికి అవ్వతో తమాషాగా "చూడు అవ్వా పిల్లలు వద్దంటున్నాడు అవ్వా!" అని ఒక్కమాట అన్నాను. అంతే, అప్పుడు ఆ అవ్వ ప్రేమ్ ని రక ,రకరకాల ప్రశ్నలతో తెగ విసిగించేసింది.నేను అయితే బయటికి నవ్వలేదు కానీ, లో లోపలే తెగ నవ్వుకున్నాను. ఇక ఆ అవ్వను రోడ్డు వద్ద దింపేసి మేము వేగంగా వెళ్తున్నాము. అవ్వను అక్కడ దించేసాక ప్రేమ్ నాతో " ఏంటండీ! తమాషా కి కూడా మీరు ఈ ముసలోళ్ళ వద్ద ఇలాంటి మాటలు చెప్పకండి, ఎవరైనా వింటే నిజంగానే నాకు ఏదో లోపముందని అనుకుంటారు" అని అన్నాడు. ఆ విషయం అనగానే నేను అప్పటి నుండి అనుచుకున్న నవ్వంతా ఆపుకోలేక బయటికి గట్టిగా నవ్వడం మొదలెట్టాను.నన్ను చూసి అతను కూడా నవ్వడం స్టార్ట్ చేసాడు. అలా మేము సరదాగా మళ్లీ గుడి వద్దకు చేరుకున్నాం.

తెల్లవారితే పెళ్లి అయిపోతుంది. ఆ రోజు రాత్రి మేము ఎవ్వరూ లేని ఏకాంత ప్రదేశం లో ఉన్న ఒక గుడిలో కలుసుకున్నాము. ప్రేమ్ నా ఒడిలో పడుకుని, తన చెల్లి , ఫ్రెండ్స్, తన జాబ్ గురుంచి న అనేక విషయాలు చెప్పాడు. నేను కూడా ప్రేమ్ కి నా గురుంచి, మా వాళ్ళ గురుంచి చెప్పుకుంటూ ఆ రాత్రి చాలా సేపు అక్కడ ఏకాంతంగా గడిపాము. ఆ మరుసటి రోజు ఫ్రెండ్ పెళ్లి అయిపోయాక , అందరం ఇంటికి అదే బస్ లో వెళ్తూ...ఎవరి స్టాప్ లో వాళ్ళు దిగి వెళ్ళిపోయాం. అలా మేము మా ఫోన్ కాంటాక్ట్ ద్వారా మాట్లాడుకుంటున్నా , నా మనసులో ఏదో తెలియని వెలితి. నా మనసు అతని కోసం ఆరాట పడ్తుండడం నేను గ్రహించాను. అందుకే ప్రేమ్ నీ surprise చేసేకి అతని పుట్టిన రోజు నాడు తనకి తెలియకుండా, సుధాకర్ సాయంతో , అతని ఇంటికి వెళ్ళి, రాత్రంతా కష్టపడి డెకరేట్ చేసి, అతన్ని సర్ప్రైజ్ చేశాను. అలా ఆ రోజు ప్రేమ్ చెల్లి నాకు బాగా పరిచయం అయ్యింది. తను ' వదినా ' అని పిలిచినప్పుడల్లా నా మనసులో, ఏదో తెలియని అదొకరకమైన ఫీలింగ్ కలిగేది. అలా ప్రేమ్ కి నేను మరింత దగ్గరయ్యాను. అతనికి నా మీద ఉన్న ఒపీనియన్ కూడా తెలిశాక ఇంకా ఆనందం వేసింది. అలా మాకు తెలియకుండానే మా మనసుల తో పాటు , మా శరీరాలు కూడా కలిశాయి.ఇక మా ప్రేమ విషయం మా ఇంట్లో వాళ్లకు చెప్పే లోపే , మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చూపులని అరెంజ్ చేశారు.

______________________________________________________
Part -2) Audio Story on
TELUGU STORYTUBE only

నాకు ఆ పెళ్లి చూపులు ఇష్టం లేదని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా నా మాట వినే వాళ్ళు ఎవరూ లేరు. నా అనుమతి లేకుండానే మా మామ కొడుకు సురేంద్ర తో నా పెళ్లిని నిశ్చయించారు. సురేంద్ర కు నా ప్రేమ విషయం చెప్పడానికి ఎంత ట్రై చేసినా అతను అర్థం చేసుకోలేదు. అలా నా లో నేనే మదన పడుతూ ఉండగా , ప్రేమ్ నాకు ఫోన్ చేసి , నన్ను కలవాలని ఉందని అన్నాడు. నేను నా విషయం గురుంచి చెప్తే , అతని రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి, నేను అతనికి ఎలాగోలాగ తనతో వస్తానని చెప్పాను. అలా అమ్మతో ఆఫీసుకి వెళ్తున్న అని చెప్పి ఆ రోజు ఆఫీసుకి వెళ్లకుండా, అతని వద్దకు వెళ్ళాను. ఆ తరువాత రోజు నేను ఆఫీసుకు నా ఫ్రెండ్ తో కలిసి వెళ్ళాను.ఆ రోజు ఎందుకో కడుపులో తిప్పుతున్నట్టు అనిపిస్తూ, వాంతులు అవ్వటం జరిగింది.
అలా ఉన్న కూడా నేను నా పనిని చేసి తిరిగి ఇంటికి వెళ్తున్నప్పుడు సడెన్ గా కళ్ళు తిరగడం స్టార్ట్ అయ్యింది. ఆ విషయం తనకి చెబుతుండగానే నేను స్పృహ కోల్పోయాను. తానే నన్ను ఎలాగోలాగ హాస్పిటల్ కి తీసుకెళ్ళింది. కొద్దిసేపటికి లేచిన నేను, తనని నాకు ఏమైంది అని అడుగగా... నాకు ఆమె చెప్పిన విషయం ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆనందం గా అనిపించాయి. బాధ పడాలో లేక ఏడ్వాలో తెలీలేదు నాకు. మా ప్రేమ విషయం తనకి కూడా తెలుసు. అందుకే , ఆ రోజే నాకు క్యాన్సర్ అన్న విషయం ఎవరికీ చెప్పొద్దు అని స్వప్న తో మాట తీసుకున్నాను. నేను ఆ విషయమై బాధ పడుతూ ఇంట్లో జరిగిన విషయాలు తనకి చెప్పుకున్నాను.అలా కాలం గడిచేకొద్దీ నా శరీరంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.మా అమ్మ అనుమానంతో ఎందుకు నీ కడుపు అంతగా అవుతోందని అడగ్గా నేను మా ప్రేమ గురుంచి, మా మధ్య జరిగిన విషయం గురుంచి చెప్పాను. మా అమ్మ ఏమీ అనలేదు కానీ , నాన్న మాత్రం నన్ను కట్టె తీసుకుని విరిగే వరకూ కొట్టాడు. అయినా నేను పల్లెత్తు మాట కూడా మా నాన్న ను అనలేదు.ఎందుకంటే అది కన్న వారి ప్రేమ కనుక ".

అందులో అంత వరకే ఉంది. ఆ రాత ను చదివిన స్ఫూర్తి కి ఆ తరువాత ఏం జరిగిందని తెలుసుకోవాలనే ఆరాటం మొదలయ్యింది. ఆ విషయమై అతని అన్నను లేపడానికి రూం వద్దకు వెళ్లగా , అతని అన్న ఇంకా నిద్రపోతున్నాడు. ఆమె వదిన తనని చూసి " స్ఫూర్తి! ఎంటి పొద్దున్నే ఇటువైపు వచ్చావ్! మీ అన్న తో ఏమైనా పనుందా?"అని అడిగింది.
"అబ్బే ఏమీ లేదు వదినా..వూరికే వచ్చాను" అని అంది స్ఫూర్తి.
"సరే! అయితే మీ అన్న నిద్ర లేచాక అతనికి చెప్తాను, సరేనా!" అని అంది ఆమెతో.
తను చెప్పకుండానే , అన్న తో స్ఫూర్తి మాట్లాడాలని భావిస్తోంది అని పసిగట్టింది శ్వేత. సరే, అని స్ఫూర్తి అక్కడికి నుండి వెళ్ళిపోయింది. ఫ్రెష్ అయిన తరువాత స్ఫూర్తి తన అన్న వద్దకు వెళ్తుండగా , అన్ననే తన రూం వద్దకు వచ్చాడు. స్ఫూర్తి కి ఆరాటం ఎక్కువ వుండడంతో ఆ బుక్ లో మాటర్ నీ చదివాను అని, ఆ తరువాత వారికి ఏమైందని అని సుధాకర్ నీ అడిగింది.
"నువ్వు పొద్దున్నే రూం కి వచ్చి , నా గురుంచి అడిగావని మీ వదిన అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, నువ్వు ఆ బుక్ చదివింటావు అని. కాకపోతే ఆ బుక్ నీ నేను సెల్ఫ్ లో పెట్టినట్టు గుర్తు. నీకు ఆ బుక్ ఎలా దొరికింది అనేదే ఆలోచిస్తున్నా?" అని అన్నాడు.
"నాకు ఈ బుక్ సోఫా కింద దొరికింది" అని అంది స్ఫూర్తి.
' Ohh! నేను అందులోని మేటర్ చదివిన బాధలో దాన్ని అక్కడే పడేశాను అన్నమాట!'అని స్ఫూర్తి తో సుధాకర్ అన్నాడు.
"అబ్బా ఆ రోజు ఏమీ జరిగింది అన్నయ్యా! అంటే నువ్వు ఏదేదో అంటున్నావ్!" అని స్ఫూర్తి విసుక్కుంటూ అంది.
అప్పుడు సుధాకర్ ఆమెతో " ముందు నాకు కూడా అంత వరకే తెలుసమ్మా!. కానీ ఆ రోజు నేను తెలిసిన వాళ్ళ హాస్పిటల్ కి పని మీద వెళ్లగా సడెన్ గా ప్రియ నాకు అక్కడ కనిపించింది. తనకు ఏం జ్వరమొచ్చిన మా హాస్పిటల్ కి వచ్చేది. అలాంటి తను , ఆ రోజు ఈ హాస్పిటల్ కి ఎందుకొచ్చింది అని ఆలోచిస్తూ అక్కడ రిసెప్షన్ లో ఉన్న వ్యక్తి ని, ఇప్పుడు వెళ్ళిన ఒకామె ఎవరికోసం వచ్చింది అని అడిగాను.అప్పుడు అతను "ఆమె ఎవరికోసం రాలేదని, ఆమె ఒక క్యాన్సర్ పేషంట్" అని చెప్పాడు. అది నమ్మని నేను, అతనితో అడిగి ప్రియ details ని తీసుకుని , ఆ డాక్టర్ క్యాబిన్ కీ వెళ్ళి చూపించి ఈ నంబర్ గల పేషంట్ ఎందుకు ఈ ఆస్పత్రికి వచ్చిందని అడిగాను. "అదేంటి మీరు డాక్టరే కదా!, అందులో ఉన్నది మీకు అర్థం కాలేదా!" అని అక్కడున్న లేడీ డాక్టర్ నాతో అంది.
అప్పుడు నేను" నేను నమ్మకనే కదా.. ఈ విషయం గురుంచి తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను" అని ఆమెతో అన్నాను. అప్పుడే ఆమె ప్రియ గురుంచి అసలు నిజాలు చెప్పి , తనకు ఇప్పుడు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉందని చెప్పింది. అది తెలిశాక నేను ఆగలేక పోయాను. ఈ విషయం వెంటనే ప్రేమ్ కి చెప్పాను. ఈ విషయం తెలిసిన ప్రేమ్, వెంటనే ప్రియ వద్దకు వెళ్లి ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదని తనని ప్రశ్నించాడు.' ఏ విషయం? ' అని తను అడగ్గా ... "నీకు క్యాన్సర్" అని నాకు ఎందుకు చెప్పలేదు అని ప్రియ ను గట్టిగా ప్రశ్నించగా , ప్రియ నిజం దాచలేక అతన్ని గట్టిగా హత్తుకుని, ఏడుస్తూ ..ఇక నేను, నీతో కొన్ని రోజులే ఉండగలను అని అంటూ ఏడుస్తోంది. సురేంద్ర కు ఇలా తను గర్భవతి అని , క్యాన్సర్ ఉందని తెలిసి ఆ పెళ్లిని cancel చేసుకున్నాడు. ఆ తరువాత ప్రియని ఇంటి వద్ద దిగిపెడుతుండగా వాళ్ళ నాన్న ప్రియని మళ్లీ ఇంట్లోకి రావద్దని , ఆమె కు సంబందించిన బట్టలు, బుక్కులు, నగలు, ఆమె పెళ్లి కోసం దాచిన డబ్బు ను అన్నీ బయటికి విసిరిగొట్టాడు.అది చూసి ప్రియ బాధతో, ప్రేమ్ పై ఉన్న ప్రేమ ను చంపుకోలేక ఆ డబ్బు, నగలు, బట్టలు అన్నీ తీసుకుని అక్కడే పెట్టేసి, తన పుస్తకాలు మాత్రం తీసుకుని, వారి తల్లితండ్రులకు నమస్కరించి, "నన్ను క్షమించండి " అని చెప్పి అక్కడి నుండి తను ప్రేమ్ తో వచ్చేసింది. నేను అప్పుడు వారి పక్కనే ఉన్నాను. ఆ వారం లోనే మంచి ముహూర్తాన ప్రేమ్ ప్రియని పెళ్ళి చేసుకున్నాడు. ప్రియ తల్లితండ్రులు ను పెళ్ళికి పిలిచినా , ఎవరూ వారి పెళ్ళికి రాలేదు.ఆ మరుసటి రోజు నేను తనని నా హాస్పిటల్ కు తీసుకెళ్ళి డాక్టర్స్ తో చెకప్ చేస్తున్నాను. వాళ్ళు నాతో "ఇప్పుడున్న పరిస్థితిలో ఆమెకు అబార్షన్ చేయడం మంచిదని " నా తోటి డాక్టర్లు చెప్పగా..నేను తనకి ఈ విషయం చెప్పలేనని వారి తో చెప్పాను. దాంతో ఆ డాక్టర్లే ప్రియ తో " నువ్వు ఉన్న condition లో అబార్షన్ చేయించుకోడం మంచిది, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం ఉండచ్చు, ఒక వేళ మీకు ఏమైనా జరగరానిది ఏమైనా జరిగితే నీతో పాటే నీ కడుపులోని బిడ్డ కూడా చనిపోతుంది " అని అన్నారు. అయినా తను అవన్నీ పట్టించుకోకుండా ఆ డాక్టర్ల తో "నేను చనిపోయే లోపు అయినా, నా ప్రేమ్ వారసున్ని తన కు అందించే పోతానని" చెప్పింది. ఆ క్షణం ప్రేమ్ అక్కడి నుండి పక్కకు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడని నేను వెళ్లి చూడగా అతను అలా పక్కకు వెళ్ళి ఏడుస్తూ ఉండడం నేను చూసాను.


( ఆడియో స్టోరీ అందుబాటులో ఉంది)
( Pls read till end story)

అలా కొన్ని నెలలు గడిచాయి. ఆ రోజు తనకి సీమంతం జరిగిన రోజు. ఆ రోజు నేను, మా ఫ్రెండ్స్ అందరూ కలిసి, ప్రేమ్ ఇంట్లో చాలా సంతోషం గా గడిపాము. ఆ మరుసటి ఏమైందో కానీ ఆమె నిద్రలోనే చనిపోయింది అని ఫోన్ వచ్చింది నాకు. అలా తను , ప్రేమ్ తో కొన్ని నెలలు కూడా గడపకుండానే , మా అందరినీ వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది. నాకు తెలిసినంత వరకు ఇదే అత్యంత విషాదమైన ప్రేమ కథ . ఆమె చనిపోయిన మూడవ రోజు కే ప్రేమ్ కూడా ' ప్రేమించిన వ్యక్తి ' కోసం అదే విధంగా చనిపోవడం మాకు ఇంకా పెద్ద బాధను కలిగించింది. మా ఫ్రెండ్స్ కవిత, ఉమేష్, స్వప్న లు కూడా అక్కడికి వచ్చారు. అలా అతని శరీరాన్ని ప్రియ సమాధి పక్కనే పూడ్చితే నైనా వారి ఆత్మలకు శాంతి దొరుకుతుందని , తన సమాధి పక్కనే పూడ్చాము.అందుకే వారి కథ ను మేము తలచుకున్నప్పుడల్ల అందరికీ చాలా భాద వేస్తుంది" అని సుధాకర్ స్ఫూర్తి తో చెప్పాడు. అది విన్న స్ఫూర్తి కంట్లో నీళ్ళు తిరిగాయి. ఏమీ మాట్లాడకుండా, అక్కడి నుండి ఆ బుక్ తీసి భద్రంగా, ఆ సెల్ఫ్ లో పెట్టి ,అన్న ఒడిలో బాధతో పడుకుండిపోయింది.

ప్రేమించిన వ్యక్తి కోసం ఒక ఆడది కానీ ,మగవాడు వాడు కానీ, ఏమైనా చేయగలరని ఈ కథ మీకు చెప్పకనే చెబుతుంది. ఈ కథ ఎలా ఉందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో తెలుపగలరు అని ఆశిస్తూ .....

Audio stories available on Our YouTube channel.

Search Exactly this name " TELUGU STORYTUBE ".
It's our own free stories podcast channel, if you interested please visit our channel.

Welcome our digital Audio stories channel.

Am trying to reply for ur reviews as possible as my free time.

✍️ A Writer of this story
Amarnath Peddakotla MBA
Founder of Telugu StoryTube
Inside India Telugu
Tadipatri.

Thank you for read this story.

keep follow this account for new stories.