" మీరేమీ అనుకోకపోతే మీకొక మాట చెప్తాను సార్ ".
" ఏంటది? కృష్ణమూర్తి గారు చెప్పడానికి ఏముంది " .
"సార్ ..! ఇన్నేళ్లు ఈ కంపెనీ బాద్యతలు సక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు . మీరు మా లాంటి పనివాల్లపై చూపించే ప్రేమ , గౌరవం ఇంకెవరూ చూపించలేరేమమో ? , మరి మీకు కూడ వయస్సు పెరిగిపోతోంది ...అందుకని.... "
"ఆ అందుకని ఏంటో చెప్పుండి కృష్ణమూర్తి గారు " .
"ఏం లేదు సార్ మీ తర్వాత మీ కొడుకు అరుణ్ మమ్మల్ని , ఈ కంపెనీని బాగా చూసుకుంటాడని భావిస్తున్నాము సార్".
" ఏంటి ?. అరుణ్ మీద మీకున్న విశ్వాసం నాకు నచ్చింది .కానీ వాడికి ఇంకా వాడి బాధ్యతల గురించి సరిగ్గా తెలీదు . వాడి కన్నా అర్జున్ కే బాద్యతలు గురించి ఎక్కువగా తెలుసు అని నేననుకుంటున్నాను కృష్ణమూర్తి గారు "
" అదేంటి సార్ ఎంతైనా అరుణ్ పెద్దవాడు కదా!".
"ఇప్పడెందుకు అవన్నీ కృష్ణమూర్తి గారు . వదిలేయండి ".
"సారీ సార్" .
"ఛ ..ఛ అలాంటిది ఏమీ లేదు కృష్ణమూర్తి గారు . మిమ్మల్ని బాధపెట్టాలని చెప్పట్లేదు ".
" పర్లేదు సార్ ".
" ఆ మర్చిపోయాను . రేపు అరుణ్ పుట్టినరోజు . మన స్టాఫ్ అంతా రేపు రాత్రి డిన్నర్ పార్టీకి రమ్మని చెప్పండి . సరేనా ".
"అలాగే సార్ తప్పకుండా చెప్తాను" .
నైట్ డిన్నర్ పార్టీ :
" నమస్తే కృష్ణమూర్తి గారు . ఏదీ మన స్టాఫ్ ఇంకా రానేలేదు " .
"అందరూ గిఫ్ట్ లు కొనడానికి వెళ్లారు సార్. వచ్చేస్తుంటారు . ఇదుగో మాటల్లోనే వచ్చేస్తున్నారు సార్".
" ఆ రండి. రండి. ఇంత ఆలస్యం అయితే ఎలా ?" అని అఖిలేశ్ తన స్టాఫ్ ని పలకరించాడు.
ఇంతలో పార్టీ మొదలైంది....
అరుణ్ కొత్తబట్టలలో మెరిసిపోతూ బయటికి వచ్చాడు . కేక్ కట్టింగ్ అయిపోయింది . అందరూ భోజనాలు చేస్తున్నారు . ఇంతలో ఒక క్యాటరింగ్ బాయ్ పొరపాటున కాలు జారి అరుణ్ వేసుకున్న షర్ట్ పై చట్నీ పడేశాడు . దాంతో ఆ క్యాటరింగ్ బాయ్ ని తిట్టి, కొట్టాడు అరుణ్. ఆ క్యాటరింగ్ బాయ్ సారీ చెప్పినా ...అరుణ్ ఊరుకోలేదు. దీంతో అఖిలేశ్ వెళ్లి అరుణ్ ని ఆపాడు.
" అతను పొరపాటు గా ఆ పని చేశాడని చెప్తున్నాడుగా . ఇందులో అతని తప్పేమీ లేదు. వదిలేయ్ అరున్ " .
"లేదు డాడీ ఈ లేబర్ వెదవలు ఇలానే ఉంటే ఎక్కువ చేస్తుంటారు" అని అరుణ్ అన్నాడు .
"ఏంటీ లేబర్ వెదవలా! .ఒకప్పుడు నేను కూడా ఒక లేబర్ అని గుర్తుపెట్టుకో అరుణ్. పనివాల్లను మనం ఎప్పుడూ గౌరవించాలి , ఆదరించాలి. అంతేగాని వారిని అగౌరపరిచేలా మాట్లాడరాదు".
" లేదు డాడీ. వాడి స్టేటస్ ఏంటి ?,నా స్టేటస్ ఏంటి?. నేను మీ కొడుకును డాడీ" అని అరుణ్ అన్నాడు.
" స్టేటస్.. తండ్రి స్టేటస్ ని, నీ స్టేటస్ అనుకుంటున్నావు! డబ్బును చూసి మిడిసిపడుతున్నావు. పని లో కష్టం తెలీక ఇలా మాట్లాడుతున్నావు. నా స్టేటస్ ను పక్కన పెట్టి నీకంటూ ఏముందో చూసుకోని మాట్లాడు అరుణ్ " అని అఖిలేష్ తన కొడుకుతో అన్నాడు . ఇంతలో తమ్ముడు అర్జున్ వచ్చి అన్నకు సర్ది చెప్తున్నాడు.
"నువ్వేంట్రా నాకు చాలా చెప్పేది సవతి కొడకా" అని అన్నాడు అరుణ్ .
అఖిలేశ్ ఈ మాట విన్న క్షణం అరుణ్ ని ఇంటినుండి బయటికి గెంటేసి బాధ్యతలు , గౌరవం , అనుబంధాలు తెలీని నీకు కంపెనీ ఛైర్మెన్ పదవికి అనర్హులు. నీ కంటూ ఒక అర్హత సంపాదించుకున్నప్పడు రా . నా పేరును వాడకుండా నువ్వు పైకిరా. చూద్దాం . అంతవరకు నువ్వు ఈ ఇంట్లో ఉండద్దు .వెళ్లిపో అని అన్నాడు. అరుణ్ షర్ట్ విడిచి అక్కడే పడేసి బాధతో వెళ్లిపోయాడు . స్టాఫ్ అంతా బాధపడుతున్నారు . అఖిలేశ్ ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి వెళ్లిపోయాడు.
ఆ రాత్రి జోరుగా వర్షం కురుస్తోంది. ఉరుములు , మెరుపులతో ఆకాశం గర్జిస్తోంది. అరుణ్ వానలో తడిసి ముద్దయ్యాడు .ఆ రాత్రికి బస్ స్టాప్ లో నే పడుకున్నాడు. ఉదయం అయింది. ప్రొద్దున్నే చలికి వణుకుతున్నాడు అరుణ్ . వానలో నానడంతో జ్వరం కూడా వచ్చింది.
సమయం 7:00 కావడంతో విద్యార్థులు , ఉద్యోగస్తులు బస్ స్టాప్ లకు వచ్చేశారు. అరుణ్ ఇంకా అక్కడే ఉన్నాడు . కాసేపటికి లేచాడు. అక్కడున్న కాలేజ్ ఆడపిల్లలు అరుణ్ చూసి నవ్వుతున్నారు. ఏంటి నవ్వుతున్నారు మీరు . do you know who am i అని అన్నాడు వారితో. ' ఆ ఎవరేంటి నువ్వు ' పోలీస్ వా , గూండా నా అని ఎగతాలి చేశారు . దీంతో వారితో ఏమీ అన్లేక అక్కడ నుండి వెళ్లిపోయాడు .అలా ఊరంతా తిరుగుతున్నాడు. దగ్గర ఉన్న డబ్బంతా అయిపోయింది . అరుణ్ డెబిట్ కార్డ్ ని బ్లాక్ చేశాడు అఖిలేశ్. తినడానికి డబ్బులేక విలవిల్లాడి పోయాడు అరుణ్.పిచ్చిపట్టిన వాడిలా తిరుగుతున్నాడు . అలా తిరుగుతూ చివరికి ఒక పెంకుల కొట్టం వద్ద కళ్లుతిరిగి పడిపోయాడు . అందులో ఉండే ఒక అవ్వ బయటికి వెళ్తూ అతనిని చూసింది. అతన్ని ఎంత పిలిచినా పలుకలేదు.
ఆ చుట్టు ప్రక్కల వాల్లు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అక్కడి డాక్టర్ లు అతనికి ట్రీట్ మెంట్ చేసారు. అవ్వ ఇంకా అక్కడే ఉంది .అలా కోలుకున్న అరుణ్ అక్కడున్న డాక్టర్ లతో తనకు జరిగిన విషయం తెలుసుకుని ఆ అవ్వ వద్దకు వచ్చి కృతజ్ఞతలు తెలిపాడు. అలా అక్కడినుండి మళ్లీ తిరగడం ప్రారంభించాడు . అలా రెండువారాలకు తన ప్రాణస్నేసహితుడైన కిరణ్ కంటబడ్డాడు. అరుణ్ ని మొదట కనుగొనలేకపోయినా , తర్వాత అతని వాలకం చూసి అరుణ్ అని పలికరించి జరిగిన విషయం తెలుసుకున్నాడు కిరణ్. " ఇదంతా విడిచిపెట్టు . నాతో పద నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. మంచి తిండి దొరుకుతుంది. జీతం నెలకి ఇరభైవేలు వస్తుంది . చేస్తావా రా ? "అన్నాడు కిరణ్. ఏ పనైనా చేస్తానన్నాడు అరుణ్ . అలా కిరణ్ తో కలసి అతని ఊరికి వెళ్లాడు అరుణ్.
మరుసటిరోజు ఉదయం .
"రేయ్ !అరుణ్ లెయ్..ఈ రోజేనిన్ను ఉద్యగంలో జాయిన్ చేస్తాను" అని కిరణ్ అరుణ్ ని తడుతూ నిద్రలేపుతున్నాడు . అరుణ్ లేచి గబా గబా తయారయ్యాడు.
" ఓకే పద వెళ్దాం!" అని ఇద్దరూ దారిలో మాట్లాడుకుంటూ వెళ్తున్నారు .
"ఇంతకీ నువ్వు చేసే జాబ్ ఏంట్రా ? "అని అరుణ్ కిరణ్ ని ప్రశ్నించాడు .
"ముందు నడువు.. అంతవరకు ఏమీ మాట్లాడకు సరేనా...!" అని కిరణ్ బదులిచ్చాడు . ఇద్దరూ ఒక బిల్డింగ్ వద్ద ఆగారు.
" వార్నర్ క్యాటరింగ్ సర్వీసెస్ "
" ఇదేంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు నన్ను, ఏమైనా ఈవెంట్ ఉందా మీ ఇంట్లో " అని అరుణ్ ప్రశ్నిస్తున్నాడు కిరణ్ ని. మూసుకుని లోపలకి పద అంతా తెలుస్తుంది అని చెప్పి కిరణ్ అరుణ్ తో కలసి ఆ బిల్డింగ్ లోకి వెళ్లాడు. ఏంట్రా ఇన్ని రోజులు ఎక్కడికి చచ్చావ్ ? అని ఆఫీసులోని వ్యక్తులు కిరణ్ ని అడుగుతున్నారు.
" రే..ముందు నీ పని చూసుకో..., రేయ్.. ఒక్క సారి వెనక్కి రారా!, ముందు ఫ్యాంటు జిప్ పెట్టుకో. ఆ తర్వాత నన్ను అందువు గానీ పో.. " అని అతనికి ఝలక్ ఇచ్చాడు కిరణ్. ఆఫీసులోకి వెళ్లగానే చల్లగా ఏసీ గాలి కొడుతోంది. ఉండు జుట్టు దువ్వుకో. లోపలికి వెళ్దాం . అని కిరణ్ అరుతో చెప్పి ఓనర్ ఛాంబర్ లోకి వెళ్లారు ఇద్దరూ.
" ఏరా కిరణ్ . రెండురోజులు ఎక్కడికి పోయావురా.?" అని ఓనర్ ప్రశ్నించాడు . "అంటే...అది...అది నువ్వు మొన్న కొత్త ఈవెంట్ మేనేజర్ కావలన్నావు కదా అందుకే నా ఫ్రెండ్ ని తీసుకురాడానికి వెళ్లాను"అని అన్నాడు కిరణ్.
" మరి నీ ఫ్రెండ్ ఎక్కడా? " అని అన్నాడు ఓనర్.
"ఇదిగో పక్కనే ఉన్నాడు కదా !".
" ఓహ్.. ఇతనేనా ! ఏమి చదుకున్నావు బాబు " అని అన్నాడు ఓనర్.
"ఎమ్. బి. ఏ చేశాను సార్".
" ఏంటి ? ఎమ్.బి.ఏ చేశావా . వేరే ఉద్యోగం దొరకలేదయ్యా నీకు . నీ క్వాలిఫికేషన్ కి మంచి జాబ్ చేయవచ్చయ్యా " అని ఓనర్ అరుణ్ తో అన్నాడు.
" కొన్ని పరిస్తితుల వల్ల నేను ఈ జాబ్ కి వచ్చాను సర్.మీరు ఉండమంటే ఉంటాను. లేదంటే వద్దు సార్" అని అన్నాడు అరుణ్ ఓనర్ తో.
"అలాంటిదేమీ లేదయ్యా. నువ్వు నాకు బాగా నచ్చావు. నీ గుడ్ స్పీకింగ్ బాగా నచ్చింది. రేపే జాయిన్ అవ్వు సరేనా . నా వద్ద అంతా వయసుమల్లిన వాల్లు పనిచేస్తున్నారు. నీ లాంటి ఎడుకేషన్ పర్సన్ , యంగ్ మెన్ నాకు చాలా అవసరం " అని ఓనర్ రంగ అరుణ్ తో అన్నాడు .
"ఇంతకీ నా రూమ్ ఎక్కడా సార్ ?" అని అరుణ్ అన్నాడు.
" రూమేంటి ? " అని ఓనర్ అన్నాడు.
" అబ్బే అదేం లేదు చిన్నాన . ఉండటానికి రూము ఏదైనా ఇస్తారా ?" అని అంటున్నాడు అంతే అని కిరణ్ మాటలను డైవర్ట్ చేసాడు.
" ఓకే...చిన్నాన ఇక వెళ్తాను . పదరా.."అని కిరణ్ డోర్ తీసి అరుణ్ ని బయటకు తోస్తున్నాడు . "అదేంట్రా ? నువ్వు నాకు ఇప్పించే జాబ్ ఇదా" అని అరుణ్ ప్రశ్నించగా కిరణ్ ఇలా " రేయ్! ఇన్నేళ్లు ఇక్కడే పనిచేస్తున్నా నాకు ఈవెంట్ మేనేజర్ పోస్ట్ ఇవ్వలేదు . నీకు అది దక్కింది. ఏదో నీకు సాయం చేద్దామని చూస్తే ఇలా అంటావేంట్రా " అని కిరణ్ అన్నాడు.
"సరే , సరే ... సారీ కిరణ్. పద ఇంటికి వెళ్దాం" అని అరుణ్ ,కిరణ్ తో అన్నాడు. అలా ఆ రోజు గడిచింది. మరుసటి రోజు. ఉదయాన్నే లేచాడు అరుణ్ . కిటికీ తీసి అటూఇటూ చూస్తున్నాడు. ప్రద్దున్నే పసుపురంగు చీరకట్టుకుని ఇంటి ముంగిట ఒక అమ్మాయి ముగ్గు వేయడం చూసాడు అరుణ్ . అలా ఆమెను చూస్తూ ఉన్నాడు . ఆమె ముగ్గు వేసి లోపలికి వెళ్లిపోయింది. ఉదయాన్నే షేవింగ్ చేసుకుని స్నానం చేసాడు అరుణ్ . కిరణ్ కాసేపటికి లేచాడు. స్నానం చేసి తయారయ్యాడు కిరణ్ కూడా. ఇద్దరూ కలసి వెళ్లారు ఆఫీసుకి. అక్కడ అడ్రసు కనుకున్నాడు కిరణ్ . మళ్లీ ఇద్దరూ అక్కడి నుండి బైకులో ఒక కళ్యాణమండపానికి చేరుకున్నారు. ఇక్కడే మనం పని చేయాలి అని కిరణ్ అన్నాడు . " అంటే ఇప్పుడు నేను కూడా వచ్చినవాల్లందరికీ భోజనాలు వడ్డించాలా ? " అని అరుణ్ అడిగాడు .
" ఆ !అవును. ఇంకేమనుకున్నావు" అన్నాడు కిరణ్.
అరుణ్ కి తను ఎందువల్ల బయటికి గెంటివేయబడ్డాడో గుర్తుచేసుకుంటున్నాడు . ఏం చేస్తాం ఏదైనా చేయాల్సిందే. పనిచేయకపోతే డబ్బు రాదు .అందుకని పని చేయడం మొదలుపెట్టాడు. అలా ఆ పనిలో ఎంతో మందికి భోజనం వడ్డించే క్రమంలో క్యాటరింగ్ బాయ్ కష్టాలు మెల్లి మెల్లిగా అర్థంచేసుకోసాగాడు.
అలా రోజూ క్యాటరింగ్ బాయ్ లా పని చేయడం మొదలుపెట్టి ఆరు నెలలు కావస్తోంది. ఓ రోజు జోరుగా వర్షం కురవసాగింది . ఆ రోజు క్యాటరింగ్ పని త్వరగా అయిపోవడంతో అరుణ్ కిరణ్ లు అలా షాపింగ్ కి వచ్చారు .షాపింగ్ పూర్తి చేసుకుని తిరిగవస్తున్న వీరు. కిరణ్ ఒక అంగడిలో తనకు కావలసిన వస్తువులు తీసుకుంటున్నాడు. అరుణ్ అలా ఆ షాపువైపే చూస్తున్నాడు. అలా సడన్ గా వెనుదిరుగుతూ వెనుక వచ్చే ఒక అమ్మాయిని చూసుకోకుండా తగిలాడు. ఆమె ఎవరో కాదు అరుణ్ రోజూ ప్రొద్దున్నే చూసే ముగ్గు వేసే అమ్మాయి. ఆమె కళ్లు కనిపించట్లేదా అని తిడుతోంది. ఆ వానలో అరుణ్ తను పట్టుకున్న గొడుగును వదిలేసి ఆమె ఎంత తిడుతున్నా అలా చూస్తుండిపోయాడు . ఆమె అక్కడ గొడవ పడటంతో ఆమె చెవి కమ్మ ఊడి రోడ్డుమీద పడింది.
ఆమె అది గమణించుకోకుండా వెళ్లిపోయింది. అరుణ్ కింద పడిన ఆమె కమ్మను చూసి తీసుకున్నాడు. అయితే ఆమెకిచ్చేలోపు ఆమె అక్కడినుండి ఆటోలో వెళ్లిపోయింది. ఇంతలో " ఏంట్రా ? వానలో అలా తడుస్తున్నావు. గొడుగు ఏమైంది. " అని ప్రశ్నించాడు అరుణ్ వానకు నానుతూ . అది గాలికి ఎగిరిపోయింది. పద ఇంటికెళ్దాం అని అక్కడినుండి వానకు తడిసిపోతూ ఇంటికి చేరుకున్నారిద్దరూ . ఆ రోజు రాత్రి అరుణ్ ఆమె కమ్మను తీసి చూస్తుండిపోయాడు .
కిరణ్ దాన్ని చూసి " ఎవర్రా ఆ అమ్మాయి? "అని అడిగాడు.
"ఏ అమ్మాయి?" అని అన్నాడు అరుణ్ .
" ఇంకెవరు నీ చేతిలో ఉన్న కమ్మ ఏ అమ్మాయిది?,ఎక్కడుంటుంది తను?ఏమైనా కనుకున్నావా! " అని అన్నాడు కిరణ్.
" ఆ తెలుసు" అని సమాధానమిచ్చాడు అరుణ్.
" అయితే ఎక్కడ తన ఇళ్లు? " అని ప్రశ్నించాడు కిరణ్ .
అరుణ్ కిటికీలోంచి దూరంగా ఉన్న ఇళ్లు చూపించి అదే తన ఇళ్లు. రోజు తన పద్దున్నే ముగ్గు వేసేటపుడు చూస్తుంటాను అని అన్నాడు అరుణ్.
" అంటే నువ్వు రోజూ చూస్తున్నది నా చెల్లి అమృత నా. అందుకేనా రోజూ నువ్వు ప్రద్దున్నే లేచేది " అని మనసులో అనుకున్నాడు కిరణ్.
" ఒరేయ్ తను నా చెల్లిరా " అని అన్నాడు కిరణ్. "నిజమా కిరణ్ "అయితే మనమిద్దరం బావబామర్థులం అనమాట. చూడరా విధి కూడా మనల్నిద్దరిని ముందే కలిపింది ఆమె కోసం అని అన్నాడు అరుణ్ .
"తన పేరేంటో చెప్పు బావా !" అని అడిగాడు అరుణ్ .
" తన పేరు అమృతవల్లి . ఈ మధ్యే బి. టెక్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చింది " అని చెప్పాడు కిరణ్.
అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒక పక్క అరుణ్ తమ్ముడు అర్జున్ తన అన్న అరుణ్ కోసం వెతుకుతున్నాడు .ఎక్కడా అన్న ఆచూకీ గురించి తెలుసుకోలేకపోయాడు . ఇది ఇలా ఉండగా ఓ రోజు అమృత తండ్రికి ఆక్సిడెంట్ అయిందని తెలిసి ఆస్పత్రికి బయలుదేరారు ఇద్దరూ . అక్కడ ఆయనికి ఏమీ కాలేదని తెలుసుకున్నారు . కానీ కాళ్లు , చేతులకు తీవ్రమైన గాయాలు కావడంతో కోలుకోవడానికి సంవత్సరం పడుతుందని డాక్టర్లు చెప్పడంతో చాలా బాధపడ్డారిద్దరూ. ఈ విషయం కిరణ్ తన పిన్నికి చెప్పాడు . ఆమె , అమృత హుఠాహుఠిన అక్కడికి చేరుకుని తన భర్తకి ఎలా ఉందని ఏడుస్తూ అరుణ్ కిరణ్ లను అడిగింది.వారు జరిగిన విషయం చెప్పారు . అరుణ్ అక్కడినుండి దిగాలుగా బయటికి వెళ్తున్నాడు . ' ఆగండి . మిమ్మల్నే అరుణ్ గారు . మా నాన్నను సమయానికి కాపాడినందుకు మీకు కృతజ్ఞతలు. ఆ రోజు మిమ్మల్ని అలా తిట్టిండకూడదు ' అని అరుణ్ కి సారీ చెప్పింది అమృత . ఆ విషయం ఆ రోజే మరిచిపోయే. అయినా మీ నాన్నను కాపాడింది నేను కాదు . వేరే వ్యక్తి అతనే కిరణ్ కి ఫోన్ ఇలా జరిగిన విషయం అంతా చెప్పాడు. వీలైతే అతనికి చెప్పండి కృతజ్ఞతలు అని అన్నాడు అరుణ్. అన్నట్టు మరిచిపోయాను ఇదుగో నీ కమ్మ ఆ రోజు నన్ను తిడుతూ ఉండగా నీకమ్మ జారవిడుచుకున్నావు . ఆ రోజు నుండి ఇది నాతో ఉండిపోయింది అని అన్నాడు అరుణ్.
వారం రోజులు గడిచాయి .
ఓనర్ లేక క్యాటరింగ్ చెప్పేవాళ్లు సంఖ్య కూడా తగ్గింది. దీంతో అమృత తన తండ్రి పనిని తనే చేయడం మొదలు పెట్టింది . పడిపోయిన బిజినెస్ ని మళ్లీ అభివృధ్ధి లోకి తేవడం మొదలు పెట్టింది . ఇలా క్యాటరింగు బాయ్స్ కావాలని వచ్చేవాల్ల సంఖ్య పెరిగింది. అరుణ్ , కిరణ్ లు కంపెనీ బాద్యతలు ను దగ్గర ఉండి చూసుకుంటూ అందులో పని చేసే పెద్దవాల్ల దృష్టిలో మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి క్యాటరింగ్ సర్వీసెస్ గా వార్నర్ క్యాటరింగ్ సర్వీస్ పేరు తెచ్చుకునేలా కృషి చేశారు ఇద్దరూ . అలా అమృత కు అరుణ్ పై ప్రేమ మొలక పెరిగి పెద్దదయింది. తన ప్రేమ విషయం అరుణ్ తో చెప్పింది అమృత . అరుణ్ కూడా అమృతని ఇలా రోజూ పొద్దున్నే చూసేవాడిని అని నేను నిన్ను ముందునంచే ప్రేమిస్తున్నాననే విషయం కూడా చెప్పాడు . ఇది ఇలా ఉండగా ఒకవైపు ఆపోజిట్ క్యాటరింగ్ వాళ్లు వీరిపై మండిపడుతున్నారు .
ఊర్లన్నీ తిరిగి అర్జున్ అలసిపోయి తెలిసిన పెళ్లి కి అక్కడే ఉన్న పెళ్లి మంటపంలోకి వచ్చాడు . ఆకలితో ఉన్న అర్జున్ భోజనశాలకు వెళ్లాడు . అక్కడ టిఫిన్ తిని చేతులు కడుక్కుంటుండగా కొందరు వ్యాపారులు మాట్లాడుకునేది విని వాల్లు క్యాటరింగ్ వారి బ్యాగులలో పెళ్లివారి నగలని వేసే దృష్యాన్ని వీడియో తీసాడు. ఎలాగైనా ఈ విషయం క్యాటరింగ్ ఓనర్ వాల్లకి చెప్పలనుకున్నాడు అర్జున్. కానీ అదే సమయంలో ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో వారితో మాట్లాడుతూ ఉండిపోయాడు అర్జున్ . పెళ్లి నగలు పోవడంతో పెళ్లివారు నగల కోసం వచ్చినవారందరి బ్యాగులను వెతకసాగారు . అలా చివరికి వంట గదిలోని క్యాటరింగ్ వాల్ల బ్యాగులను కూడా వెతికారు. అందులో పెళ్లి నగలు అవి ఉన్నాయని చూసారు పెళ్లివారు . పౄళ్లికి వచ్చిన వాళ్లు క్యాటరింగ్ వాల్లని తిట్టసాగారు.
అందరూ క్యాటరింగ్ ఓనర్ అయిన అమృత ని తిట్టారు దానితో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కిరణ్ ని అతని తో వచ్చిన మిగతా స్టాఫ్ ని పెళ్లికి వచ్చిన వాల్లు బయటికి తోసేసారు. . అరుణ్ వారికి ఇది మేము చేసింది కాదని చెప్పినా వారు వినలేదు. ముందు ఇక్కడి నుండి వెళ్తారా లేదా అని భోజనానికి వచ్చిన వారు , పెళ్లివారు , అరుణ్ ని బయటకు కాలర్ పట్టుకుని కొడుతూ తోసేయబోతున్నారు. ఇంతలో అర్జున్ వచ్చి అక్కడ ఉన్న తన అన్నని వాళ్లు కొట్టడం చూసి...అతని వద్దకి తన బాడీగార్డ్ లని పంపించి "ఆగండి !రేయ్ చెయ్యి తీరా ఎవరనుకుంటున్నావు అతను . ఇండియాలోనే నెం .1 సాఫ్టవేర్ కంపెనీ అయిన sailendra software companies కి కాబోయే C.E.O. అతను తలచుకుంటే ఇప్పటికిప్పుడు మిమ్మల్ని , మీ ఆస్తులు ని కొనేయగలడు. అంతెందుకు ఇప్పుడు మీరు నిల్చున్న భూమి ని కూడా కొనేయగలడు . అటువంటి స్టేటస్ అతనిది . అలాంటి ఆయననే దొంగ అని అంటారా .ఇదిగో ఈ వీడియో చూడండి వీల్లే మీ నగలను దొంగలించి వీరు బ్యాగులలో వేశారు . ఇప్పటికైనా నిజం తెలిసింది కదా అందరూ ఆయనకి అతని స్టాఫ్ కి క్షమాపణ చెప్పండి " అని అన్నాడు అర్జున్ పెళ్లికి వచ్చినవారితో . వారంతా క్యాటరింగ్ వారికి క్షమాపణలు చెప్పారు. కిరణ్ , అమృత ఇంకా తన స్టాఫ్ సభ్యులు అందరూ అరుణ్ గురించిన నిజం తెలుసుకొన్న షాక్ లోంచి బయటకు రాలేకపోయారు. కాసేపటికి తేరుకున్నారందరూ. అలా క్యాటరింగ్ పని వల్ల అతని జీవితం కొత్త బాటలు వేసింది. తన తండ్రి అఖిలేష్ అరుణ్ ప్రవర్తనలో మార్పును గమనించి అతనిని తన కంపెనీకి సీ. ఈ. వో . ని చేశాడు. అంతేకాదు. అమృత తన తండ్రితో వారి ప్రేమ విషయం చెప్పింది. అలా వారిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. కిరణ్ ని తన పి.ఏ. గా అపాయింట్ చేసుకున్నాడు అరుణ్.
నీతి :
ఈ సమాజంలో అందరూ తమ తోటివారితో గౌరవం ఇచ్చిపుచ్చుకొని బ్రతకాలి. ఎవరినీ తక్కువగా చూడరాదు. ఈ కధలో అరుణ్ తన తమ్ముడిని ఇన్నేళ్లు ఒక పిన్ని కొడుకు గా చూశాడు కానీ ఎప్పుడూ తన సొంత తమ్ముడిగా చూడనేలేదు. తన మాట దురుసుతో ఫ్యామిలీకి దూరం అయ్యాడు. చివరికి తన తప్పుతెలుసుకుని , పనివిలువ తెలుకుని మంచి వ్యక్తిగా మారాడు అరుణ్ .