Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

డార్క్ నెట్ ఎపిసోడ్ - 7

అలా తరువాత ఆర్య భాస్కర్ కి కాల్ చేస్తాడు.ఆర్య భాస్కర్ కి కిరణ్ చనిపోయిన విషయం చెప్పుతాడు. ఈ విషయం విన భాస్కర్ చాలా షాక్ అవుతాడు.అలా ఆర్య కి అలాగే భాస్కర్ కి మధ్య సంభాషణ జరుగుతుంది.

( భాస్కర్ ) : మీరు చెప్పే దాకా నాకు కిరణ్ గారు చనిపోయిన విషయం తెలియదు.

 సార్ అని  భాస్కరు ఆర్య తో చెప్తాడు.

( ఆర్య ) : చూడండి భాస్కర్ గారు మీరు కిరణ్ గారి కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. మీరు కిరణ్ గారికి ప్రాజెక్ట్ ఇచ్చిన 20 నిమిషాలకి కిరణ్ గారి కి ఒక unknown number నుండి కాల్ వచ్చింది. అలా కిరణ్ ఆ unknown number ని లిఫ్ట్ చేసేడు. తరువాత కిరణ్ ఆ కాల్ లిఫ్ట్ చేసి హలో అన్ని అనగానే అక్కడికి అక్కడే చెవి లో నుండి రక్తం కారి కింద పడి గిల్ల గిల్ల లాడుతూ చనిపోయాడు.

అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.

ఈ మాట విన భాస్కర్ చాలా షాక్ అవుతాడు.

( భాస్కర్ ) : ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు. సార్  జస్ట్ ఒక unknown number కాల్ లిఫ్ట్ చేసి హలో అనగానే కిరణ్ గారు చెవి లో నుండి  రక్తం కారి  కింద పడి  గిల్లా గిల్లాగా ఆడుతూ చనిపోవడం ఏంటి సార్ ఇది చాలా వింతగా ఉంది. వినడానికి ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు అయితే  మీరేం చెప్పుతున్నారో అసలు అర్థం కావడం లేదు. 

 సార్ అని  భాస్కర్ ఆర్య తో చెప్తాడు.

( ఆర్య ) : నాకు కూడా అర్థం కావడం లేదు. భాస్కర్ అసలేం జరుగుతుందో  అసలేం జరుగబోతుందో  అన్ని నువ్వు ఏమనుకోనంటే నిన్ను నీతో ఒక మాట చెప్తాను. అలాగే నిన్ను ఒక మాట అడుగుతాను.

 అని ఆర్య  భాస్కర్ తో  చెప్తాడు.

( భాస్కర్ ) : అడగండి సార్  మీరేం అడగాలి అన్ని అనుకుంటునారో అడగండి సార్ నేనేం అనుకోను 

అన్ని భాస్కర్ ఆర్య తో చెప్తాడు.

( ఆర్య ) : అదేం లేదు. భాస్కర్ గారు నాకు కొంచెం మీ పై  అనుమానం గా ఉంది. కానీ నేను మీ పై అనుమానం పడడానికి  ఒక కారణం కూడా ఉంది.

 అని ఆర్య  భాస్కర్ తో  చెప్తాడు.

( భాస్కర్ ) : అసలు ఏం  మాట్లాడుతున్నారు సార్ మీరు మీరేం మాట్లాడుతున్నారో మీకు అయిన అర్థమవుతుందా సార్  కిరణ్ గారి ని చంపితే నాకు ఏం వస్తుంది. సార్  మీరే చెప్పండి.

అన్ని భాస్కర్ ఆర్య తో చెప్తాడు.

( ఆర్య ) : చూడండి భాస్కర్  గారు మీకు ఏం వస్తుంది. మీకు ఏం రాదు. అనేది నాకు అయితే తెలియదు. కానీ కిరణ్ గారి కి మీరు ఇచ్చిన ప్రాజెక్టు  ఓకే చేసిన తర్వాత అంటే మీరు ప్రాజెక్టు కిరణ్ గారి కి ఇచ్చిన తరువాత  ఇలా జరిగింది. మీరు ప్రాజెక్టు కిరణ్ గారి కి ఇచ్చి మీ ప్రాజెక్టు వర్క్ చెయ్ అన్న తర్వాత మీరు కిరణ్ గారి కంపెనీ తో ప్రాజెక్ట్ వర్క్  డీల్ ఓకే చేసిన తర్వాత మీరు కిరణ్ గారి కంపెనీ తో  అనుసందమైన తర్వాత  కిరణ్ గారి కి 20 నిమిషాల తరువాత  ఒక unknown number నుండి కాల్ వచ్చింది. కిరణ్ గారు ఆ కాల్ లిఫ్ట్ చేసిన  వెంటనే ఎలా చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు. ఆ unknown number కి అలాగే మీ ప్రాజెక్టు కి ఏమైనా సంబంధం ఉందా? అని మాకు చాలా అనుమానం ఉంది. నేను కాబట్టి మీ తప్పు ఉందో లేదో అని  విచారిస్తున్న  అది వేరే వాళ్ళు అయితే  మీరే కిరణ్ గారిని చంపిందని  జైల్లో వేసేవారు. ఇది మాత్రం గుర్తుకూ పెట్టుకోండి సార్ 

అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.

( భాస్కర్ ) : సార్ మీరు నన్ను విచారించడం లో ఏటువంటి తప్పులేదు. ఎందుకంటే మీ స్థానం లో ఉంటే ఎవరికి అయినా నా మీద అనుమానం వస్తుంది సార్ మీరు చెప్పింది నిజమే సార్ మీ స్థానం లో వేరే వాళ్ళు ఉంటే నేనే నేరస్తుడిని అని నన్ను జైల్లో వేసేవారు  సార్ కానీ మీరు నా తప్పు ఉందో లేదో అన్ని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి నిర్ణయం అయినా కొంచెం అలోచించి తీసుకోవాలి సార్ 

అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : అవును భాస్కర్ గారు  ఎందుకంటే కొని సార్లు కొద్దిపాటి  నిర్లక్ష్యం కూడా కొండంత  సమస్య కి దారి తీస్తుంది.

అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.

( భాస్కర్ ) : ఏమో సార్  నాకు అయితే ఏం అర్థం కావడం లేదు. సార్ కిరణ్ గారి చావు కి నాకు అయితే ఏటువంటి సంబంధం లేదు సార్  అసలు ఏం జరుగుతుంది. అన్ని కూడా నాకు అర్ధం కావడం లేదు సార్

అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.

( ఆర్య ) : చూడండి భాస్కర్ గారు  మీరేం కంగారు పడకండి. మీరే నేరస్థుడు  అన్ని నేను అనడం లేదు. కానీ మీ పే అనుననం ఒకటి ఉంది. అన్ని అంటున్న మీరు తప్పు చెయ్యలేదు. అన్ని మీకు నమ్మకం ఉంది. కదా అది చాలు భాస్కర్ గారు కానీ నాకు చెప్పకుండా మీరు ఈ సిటీ దాటి వెళ్ళకూడదు.

అన్ని ఆర్య భాస్కర్ తో చెప్పుతాడు.

( భాస్కర్ ) : అలాగే సార్ నేను మీకు చెప్పకుండా ఈ సిటీ అలాగే ఈ ఊరు కూడా దాటి వెళ్ళాను 

అన్ని భాస్కర్ ఆర్య తో చెప్పుతాడు.

అలాగే భాస్కర్ తన కంపెనీ కి వెళతాడు.

ఆర్య కి ఏం జరుగుతుందో ఎవరి మీద అనుమాన పడాలో అలాగే ఎవరి మీద అనుమానం పడకూడదో అన్ని అర్ధం కాదు.

అలా ఆర్య పోలీస్ స్టేషన్ లో ఉన్న గోడ ని గట్టిగ కొడుతాడు. అప్పుడు స్టేషన్ పైన నుండి ఒక fir కాపీ కింద కి పడుతుంది.ఆర్య ఆ fir కాపీ ఏంటి అన్ని చూస్తాడు. ఆ fir కాపీ లో కిరణ్ ఎలా అయితే చనిపోయాడో అలాగే రాజేష్ అనే వ్వక్తి విజయవాడ లో అలాగే unknown number లిఫ్ట్ చేసేక హలో అనగానే చెవి నుండి రక్తం కారి నెల మీద పడి గిల్ల గిల్ల లాడుతూ చనిపోయి ఉంటాడు.

ఇది చుసిన ఆర్య చాలా షాక్ అవుతాడు.

అంటే కిరణ్ చావు కి అలాగే విజయవాడ లో జరిగిన రాజేష్ చావు కి ఏమైనా సంబంధం ఉందా అన్ని ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు.

ఇంతటి తో డార్క్ నెట్ ఎపిసోడ్ 7 ముగిసింది.

ఇంతటి అయిపోలేదు.

ఆర్య భాస్కర్ ని విచారించేటపుడు ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అనేది అడగడం మరిచి పోయి ఉంటాడు. అలాగే కిరణ్ చావు కి విజయవాడ లో జరిగిన రాజేష్ చావు కి ఏమైనా సంబంధం ఉందా? లేదా? అన్ని తెలుసుకోవాలి అన్ని అనుకుంటే డార్క్ నెట్ ఎపిసోడ్ 8 కోసం ఎదురు చూస్తూ ఉండాలి.

కొనసాగుతుంది.