వెన్నెల పూలు
ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్
కొట్ర శివ రామ కృష్ణ
అప్పుడు అరవింద్ కి నాలుగు సంవత్సరాలు, సుస్మిత కి సంవత్సరంన్నర వయసులు వుండివుండొచ్చు. వాళ్ళిద్దర్నీ ఇప్పుడు తామంతా ఉంటున్న ఇంట్లో సర్వెంట్ మైడ్స్ దగ్గర వదిలి, తను ఈ బంగ్లాకి చలపతి కామవాంఛ తీర్చడానికి వచ్చింది. అప్పుడు వర్ధన్ వర్మ ఎదో బిజినెస్ పనిమీద వూరు వెళ్తూ ఒక వారం వరకూ రానని చెప్పాడు. ఆ పని జరగక తను వెంటనే వచేస్తాడని తామిద్దరూ అనుకోలేదు. ఎప్పుడూ తలుపులన్నీ జాగ్రత్తగా గడియపెట్టివుంచే తాము, ఆ రోజు మర్చిపోయారు. వర్ధన్ వర్మ తిన్నగా ఈ బెడ్ రూమ్ లోకి వచ్చి పశువులకన్నా హీనంగా సెక్స్ లో పాల్గొంటూవున్న తమిద్దరినీ చూసాడు.
అప్పటికే వర్ధన్ వర్మ కి చిన్న హార్ట్ ప్రాబ్లెమ్ వుంది. డాక్టర్ ఆయనకి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. అసలు ఏ హార్ట్ ప్రాబ్లెమ్ లేకపోయినా, అప్పుడు ఆయన చూసిన దృశ్యం ఉన్నపాటుగా చంపగల శక్తివున్నటువంటిది. అసలే హార్ట్ ప్రాబ్లెమ్ వున్న అయన తట్టుకోగలడా?
రెండు చేతులతో గుండె పట్టుకుని కుప్పకూలిపోయిన ఆయన దగ్గరికి తాను పూర్తినగ్నం గా వున్నానన్న విషయం కూడా పట్టించుకోకుండా చలపతిని కిందకి తోసి, తను కిందకి దుమికి వెళ్ళింది. ఆయన పక్కనే కూచుని, ఆయన తలని తన ఒళ్ళోకి తీసుకుని కన్నీళ్లు కారిపోతూండగా ఆయన మొహంలోకి తాను చూస్తూన్నప్పుడు, ఆయన చూపుని తను తట్టుకోలేకపోయింది. అది కోపమో, అసహ్యమో, జుగుప్సో వాటన్నిటికీ మించినదో తనకి బోధపడలేదు. ఆయనకి భోరుమని ఏడుస్తూ జరిగినదంతా చెప్పాలని వుంది. కానీ అందుకు అవకాశం లేదు. తనని అలా చూస్తూనే ప్రాణాలు వదిలేశారు ఆయన.
"వీడు ఇలా చచ్చి మనకి విషయం చాలా తేలిక చేసేసేడు కదా."
వర్ధన్ వర్మ చనిపోయాడని తెలియగానే చలపతి అన్న మాట విన్నాక, వాడిని ముక్కలు కింద నరకాలన్న తన కోరికని ఎలా అణుచుకుందో తనకే తెలీదు. ఆ తర్వాత కూడా ఇంకా వాడు తమని దోచుకోవడానికి, తనని అనుభవించడానికి సహకరిస్తూవున్నప్పుడు తనని తనే ఎంత అసహ్యించుకుందో. కానీ తనకి తప్పలేదు. తన గత జీవితానికి సంభందించిన రుజువులు, ఇంకా ఆ క్యాసెట్ వాడిచేతుల్లో వున్నాయి. వాడు తమ కుటుంబం మొత్తాన్ని బజారున పడేసి, తమ పరువంతా తీసేగలడు. తనని అందరూ అసహ్యించుకుంటారు అని భయపడలేదు, కానీ తమ పిల్లల్ని కూడా అందరూ అసహ్యించుకుంటారని ఆగింది.
ఎంతకాలం గడిచినా వాడికి తనమీద మోజు మాత్రం తీరలేదు. కావలిసినంత దోచుకో, ఇంక తనని విడిచిపెట్టమని అడిగినా వినలేదు. అలాగే వాడు తనని అనుభవించే తీరూ మారలేదు.
"నీకు అరవయ్యేళ్ళ వయసు వచ్చినా, నీ అందం ఎక్కడా తగ్గలేదు. మొదటిరోజు నిన్ననుభవించినపుడు ఎలా వున్నావో ఈరోజు అలాగే వున్నావు."
అరవింద్ తామిద్దరినీ పూర్తినగ్నం గా సెక్స్ లో పాల్గొంటూవుండగా చూసిన రోజున చలపతి అన్న మాటలివి. మరి ఆ మాటలు అరవింద్ విన్నాడో లేదో తనకి తెలీదు.
మెదడుని ఆలోచనలు పిచ్చెక్కిస్తూవున్నా, కుర్చీలో అలాగే కూచునివుండిపోయింది శకుంతల.
&&&
"ఇప్పుడు నీ కళ్ళు బరువెక్కుతూ వున్నాయి........... నీ కళ్ళు బరువెక్కుతూ వున్నాయి........ నీకంతా పూర్తి ప్రశాంతంగా, హాయిగా వుంది. .......... నీకంతా పూర్తి ప్రశాంతంగా హాయిగా వుంది."
సమీర మాటలు పనిచేస్తున్నట్టుగా అరవింద్ మొహం చాలా ప్రశాంతం గా హాయిగా వుంది. ఒక్క సమీర మాటలు తప్ప ఇంకే శబ్దం వినిపించడం లేదు.
"ఇప్పుడు నీ ఒళ్ళు బరువెక్కుతూ వుంది. నీ ఒళ్ళు బరువెక్కుతూ వుంది. నీకు నిద్రలోకి జారిపోతున్నట్టుగా వుంది. నీకు నా మాటలు తప్ప వేరే ఏమీ వినిపించడం లేదు."
మళ్ళీ ఆగింది సమీర. సమీర తో పాటుగా అక్కడవున్న అందరికీ ఒక్కవిషయం అర్ధం అయింది. సమీర మాటలు అరవింద్ మీద పనిచేస్తూవున్నాయి.
"ఇప్పుడు నీకు నీ గతం గుర్తుకువస్తూ వుంది. నీకు నీ మొత్తం గతం అంతా గుర్తుకు వస్తూంది."
సమీర అలా అనగానే అరవింద్ గతాన్ని గుర్తుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నట్టుగా అతని మొహం ముడతలు పడింది. పిడికిళ్లు బిగుసుకున్నాయి. అక్కడున్న అందరిలోనూ కూడా అదిచూసి టెన్షన్ మొదలైంది.
"నీకు పెద్దగా స్ట్రెస్ లేకుండానే, స్ట్రైన్ లేకుండానే నీకు నీ గతం అంతా గుర్తుకువస్తుంది. నీకు చాలా ఈజీగా నీ గతం గుర్తుకువస్తుంది. నా మాటలు నీకు బలాన్ని ఇస్తాయి."
సమీర అలా అనగానే అరవింద్ మొహం మీద ముడతలు పోయి ప్రశాంతం గా మారింది. ఇంకప్పుడు సమీర ఏం అనబోతూవుంది అని అందరూ ఆసక్తిగా చూస్తూవున్నారు.
"ఇప్పుడు నీకు నీ గతం చాలా తేలికగా గుర్తుకువస్తుంది. నువ్వు నీ గతాన్ని గుర్తుచేసుకుని నా ప్రశ్నలకి సమాధానం ఇస్తావు."
సమీర ఆలా అనగానే అక్కడ అందరిలోనూ వుత్ఖంట పెరిగిపోయింది. ఆసక్తి ఇంకా పెరిగిపోయింది.
అరవింద్ మౌనంగా, ప్రశాంతమైన మొహంతో అలాగే వున్నాడు.
"ఇప్పుడు నీ పేరు నీకు గుర్తుకు వస్తుంది. నీ పేరేమిటో నువ్వు నాకు చెప్తావు."
సమీర అలా అనగానే "ఏంటి వదినా. తన పేరేమిటో తనకి గుర్తుచేసుకోవాల్సిన అవసరమేమిటి? మనం తనకి చెప్పాము కదా." వెనకనుండి సుస్మిత అంది.
"ఎవరూ ఎలాంటి మాటలు మాట్లాడొద్దు. మధ్యలో డిస్టర్బ్ చెయ్యొద్దు. నేను చేసేది నన్ను చెయ్యనివ్వండి." వెనక్కి తిరక్కుండానే కోపం గా అలా అన్నాక, అరవింద్ మొహం లోకి అలాగే చూస్తూ అంది సమీర. "ఇప్పుడు నువ్వు గుర్తుచేసుకుని నీ పేరేమిటో చెప్తావు.."
మళ్ళీ మొహం మీద ముడుతలతో స్ట్రగుల్ స్టార్ట్ అయింది అరవింద్ లో.
"నా మాటలు నీకు బలాన్ని ఇస్తాయి. నువ్వు స్ట్రగుల్ అవ్వకుండానే నీ గతాన్ని గుర్తుచేసుకోగలుగుతావు. నీ పేరు నాకు చెప్పగలుగుతావు. ఇప్పుడు నువ్వు నీ పేరు.........."
"అరవింద్." సమీర ని మధ్యలో కట్ చేసి అన్నాడు అరవింద్.
"ఇది తను గుర్తుచేసుకుని చెప్పాడో, లేకపోతె మనం చెప్పింది గుర్తుండి చెప్పాడో నాకు అర్ధం కావట్లేదు." పక్కన కూచున్న శరత్ తో చిన్న గొంతుతో అంది సుస్మిత.
"తన వార్నింగ్ గుర్తుంది కదా. ఇంకేం మాట్లాడకు. జస్ట్ చూస్తూండు." శరత్ కూడా చిన్న గొంతుతో అన్నాడు.
"నీకు నీ మామ్, ఇంకా సిస్టర్ గుర్తుకువస్తారు. వాళ్ళ పేర్లు నువ్వు చెప్తావు."
మళ్ళీ అరవింద్ మొహం మీద ముడతలు కనిపించి, పిడికిళ్లు బిగుసుకున్నాయి.
"అరవింద్ ఇదంతా గుర్తుచేసుకునే చెప్తున్నాడు. లేకపోతె అలా స్ట్రైన్ అవ్వాల్సిన అవసరం లేదు." వెనకనుండి చిన్నగొంతుతో తనూజ అంది.
"ప్లీజ్....." అది వినిపించి వెనక్కి తిరిగి కోపంగా చూసింది సమీర.
"సారీ." వెంటనే సైలెంట్ అయిపోయింది తనూజ.
మళ్ళీ అరవింద్ మొహంలోకి చూస్తూ అదే అంది సమీర.
"నా మామ్ పేరు శకుంతలా దేవి. నా సిస్టర్ పేరు సుస్మిత." వెంటనే చెప్పాడు అరవింద్.
"ఇప్పుడు నీ చిన్నతనం నీకు గుర్తుకువస్తుంది. నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావో చెప్తావు."
మళ్ళీ ముడుతలతో నిండిపోయింది అరవింద్ మొహం. మరోసారి సమీర అదే రిపీట్ చెయ్యగానే, తను చిన్నతనం లో చదువుకున్న స్కూల్ పేరు చెప్పేసాడు అరవింద్.
"గాడ్! బ్రో కి తన గతం గుర్తుకు వచ్చేస్తూంది." సమీర వార్నింగ్ కూడా మర్చిపోయి అనేసింది సుస్మిత.
అది పట్టించుకోకుండా ఇంకా అరవింద్ కి గతానికి సంభందించిన ప్రశ్నలు అడిగింది సమీర. కొద్దిగా స్ట్రగుల్ అవుతూనే వాటన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాడు అరవింద్. ఆ హిప్నోటిజం అలా వర్క్ అవుట్ అయి, అరవింద్ కి అన్నీ గుర్తుకువస్తూన్నందుకు అందరికీ చాలా ఆనందంగానూ, ఇంకా చాలా ఆసక్తిగాను వుంది.
"నువ్విప్పుడు నీ ఫ్రెండ్ చింటూ గురించి చెప్తావ్."
"చింటూ నాకు మంచి ఫ్రెండ్. నేనేం కావాలన్నా చేస్తాడు. నాకు తనంటే చాలా ఇష్టం." సమీర అడగ్గానే చెప్పాడు అరవింద్.
ఒక్కసారి అక్కడ వాతావరణం అంతా చాలా వేడిగా మారిపోయింది చింటూ గురించి ప్రస్తావన వచ్చి, దానికి అరవింద్ అలా సమాధానం చెప్పగానే.
"నీకు చింటూ మీద కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయా?"
"అందరిమీద వచ్చినట్టే నాకు చింటూ మీద అప్పుడప్పుడు కోపం వచ్చేది." చిరునవ్వుతో అన్నాడు అరవింద్.
"నీకు ఇటీవల ఎప్పుడన్నా చింటూ మీద బాగా కోపం వచ్చిందా?"
"ఇటీవల కాలం లో..........." మళ్ళీ ముడతలు పడింది అరవింద్ మొహం. "........ఎస్, ఒక సమయం లో నాకు చింటూ మీద బాగా కోపం వచ్చింది."
"అది ఎప్పుడు, ఎందుకని?"
అక్కడ అందరూ ఊపిరి తియ్యడం కూడా మర్చిపోయి, అరవింద్ చెప్పేది వింటున్నారు.
"ఒకరాజు సాయంత్రం నేను ఆఫీస్ లో ఉండగా వాడు నా దగ్గరికి వచ్చాడు. ఆ మర్నాడు నేను మా పాత బంగ్లాలో ఒకచోట దాక్కుని చూస్తే, నాకొక కొత్తవిషయం తెలుస్తుందని చెప్పాడు. నేను వాడిని ఎంతగా అడిగినా అదేమిటో చెప్పలేదు. నాతోపాటుగా వాడినీ అక్కడికి రమ్మన్నా, దానికి వాడు అంగీకరించలేదు. దానితో వాడిమీద నాకు కోపం వచ్చింది. వాడిమీద ఆ రోజు గట్టిగా అరిచాను. దానితో వాడు అక్కడినుండి వెళ్ళిపోయాడు తప్ప అదేమిటో నాకు చెప్పలేదు."
"ఇంతకీ ఆ రోజు నువ్వు ఆ బంగ్లాకి వెళ్ళావా? చింటూ చెయ్యమన్నట్టుగా చేశావా?"
"ఎస్, ఆ మర్నాడు నేను ఆ బంగ్లాకి వెళ్ళాను. చింటూ దాక్కోమన్న చోట దాక్కుని నాకు తెలియబోయే ఆ కొత్త విషయం గురించి వెయిట్ చేసాను."
"ఇంతకీ ఆ కొత్త విషయం ఏమిటో తెలిసిందా?"
అరవింద్ మొహం మీద మళ్ళీ ముడతలు వచ్చాయి. పిడికిళ్లు బిగుసుకున్నాయి. అప్పటివరకూ పడనంత స్ట్రైన్ అరవింద్ పడుతున్నాడని అక్కడివాళ్ళకి అర్ధం అయింది. అక్కడవాళ్ళెవరూ కూడా ఆ మూమెంట్లో అనుభవిస్తూన్నంత టెన్షన్, ఉత్కంఠ అంతకుముందెప్పుడూ అనుభవించలేదు. అంతా మర్చిపోయి చెవులు రిక్కుంచుకుని అరవింద్ చెప్పబోయేది వినడానికి సిద్ధం గా వున్నారు.
"అరవింద్ అదేమిటో నువ్వు గుర్తుచేసుకోగలుగుతావు. అదేమిటో........." సమీర టెన్షన్ పడుతూనే కంప్లీట్ చెయ్యబోయింది.
"గుర్తుకు వచ్చింది. అదేమిటో నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది." పెద్దగా అరిచి కుర్చీలోనుంచి లేచి నిలబడ్డాడు అరవింద్. "అది నేను ఇప్పటివరకూ మర్చిపోబట్టే వాళ్ళు ప్రాణాలతో వున్నారు."
"ఏమిటన్నయ్యా? ఏమిటది?" అరవింద్ దగ్గరికి వెళ్లి, అతన్ని రెండుచేతులతో పట్టుకుని ఆతృతగా అడిగింది సుస్మిత. "నాకు అసలు ఏమీ అర్ధం కావడం లేదు."
"నాకూ ఏమీ అర్ధం కావడం లేదు." రెండు చేతులతో మొహం కప్పుకుని కుర్చీలో మళ్ళీ కుప్పకూలిపోయాడు అరవింద్. "అసలు అది, అది ఎలా సాధ్యం అయింది? ఆ పతిత అలా ఎలా చెయ్యగలిగింది? అదీ వాడితోనా?" ఏడుస్తూ అన్నాడు అరవింద్.
"నువ్వు విషయం ఏమిటో చెప్పకుండా ఆలా మాట్లాడకు అన్నయ్యా." ఆదుర్దాగా అరిచింది సుస్మిత.
"చెప్తే ఎలా తట్టుకుంటావమ్మా? ఆ నిజం తట్టుకోలేక నాకు మతిపోయింది. నువ్వేమయిపోతావో." మొహం మీద నుండి చేతులు తొలగించి సుస్మిత మొహంలోకి చూస్తూ ఏడుస్తూనే అన్నాడు అరవింద్.
"ఈ సస్పెన్స్ కన్నా ఏదన్నా నయమే. అదేమిటో చెప్పు, అదేమిటో చెప్పు." అరవింద్ భుజాలు పట్టుకుని బలంగా కదుపుతూ అడిగింది సుస్మిత.
"ఆ బంగ్లాలో, ఆ రూంలో నీకూ నాకూ అమ్మనని చెప్పుకునే ఆ పతిత, ఇంకా వాడు వాడు........" అంటూ ఆగాడు అరవింద్.
"అన్నయ్య ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది?" షాక్ తో అరిచింది సుస్మిత. "ఇంతకీ వాడెవరు?"
"వాళ్ళిద్దర్నీ ముక్కలకింద నరికిగానీ నేనేమీ మాట్లాడను." మరోసారి కోపంగా కుర్చీలోనుండి లేచాడు అరవింద్.
"అరవింద్ నువ్వు నాకు మాట ఇచ్చావ్. నా మాట వింటానన్నావ్." అరవింద్ ముందు నిలబడి అతన్ని రెండు చేతులతో పట్టుకుని ఆపుతూ అంది సమీర.
"ఇంకే విషయంలోనన్నాసరే. కానీ నేను ఈ విషయం లో ఎవరిమాటా వినను. వాళ్ళిద్దర్నీ చంపకుండా నేను ఉండలేను."
"అయితే అది నువ్వు నా శవాన్ని దాటుకుని వెళ్లి చెయ్యి. నేను ప్రాణాలతో ఉండగా నిన్ను ఇక్కడనుండి కదలనివ్వను." అరవింద్ చుట్టూ తన పట్టుని బిగిస్తూ మొండిగా అంది సమీర.
"నా తల్లి ఎలాటిదో తెలిసిన తరువాత కూడా నా మీద నీ ప్రేమ అలాగే ఉందా?" సమీర మొహం లోకి చూస్తూ అన్నాడు అరవింద్.
"అది ప్రేమ అరవింద్. అదెప్పుడూ మారదు." దృఢస్వరం తో అంది సమీర. "అయినా నీ తల్లి ఎలాంటి పరిస్థితులలో అలాచేసిందో. మనకి నిజాలన్నీ ఇంకా తెలియవు."
వాళ్ళలా మాట్లాడుకుంటూవుండగా శరత్ సుస్మిత దగ్గరికి వచ్చి తనని రెండుచేతులలోకి తీసుకున్నాడు.
"భయపడకు శరత్. నాకు నిజం అర్ధం అయింది. నువ్వు ఇప్పటికీ నన్ను అసహ్యించుకోకుండా ఉండగలిగితే, నీ ప్రేమ మీద నా నమ్మకం అలాగే ఉంటుంది." రెండుచేతులతో మొహం కప్పుకుని భోరుమంది సుస్మిత.
"ఇప్పుడే నీ వదిన చెప్పిందిగా. నిజమైన ప్రేమ ఎప్పుడూ మారదు. ఎలాంటి విషయాలు తెలిసినా అది మామూలుగానే ఉంటుంది." తనని ఇంకా దగ్గరకి హత్తుకుంటూ అన్నాడు శరత్.
"నీలాగే నాకూ మతిపోయివుంటే ఎంత బావుండేది అన్నయ్యా. ఆలా ఎందుకు జరగలేదు? నేనెందుకు నీలా అన్నీ మర్చిపోలేదు?" శరత్ కౌగిలినుండి విడిపించుకుని ఇంకా గట్టిగా ఏడుస్తూ అడిగింది సుస్మిత.
"అందరి విషయం లోనూ ఒక్కలాగే జరగాలని ఏమీ లేదు." నిట్టూరుస్తూ అంది సమీర. "ఈ విషయం ఇలాంటిదే అయివుంటుందని నేనూహించాను. అందుకనే నీ అన్నయ్యకి హిప్నోటైజ్ చేసి గతం గుర్తుచెయ్యడానికి నేను భయపడ్డాను. మీరు ఇద్దరూ ఇలా బాధపడడం నాకు చాలా కష్టమైన విషయం."
"ఇంతకీ మన అమ్మతో అక్రమ సంభందం పెట్టుకున్న ఆ వెధవ ఎవడు అన్నయ్యా? వాడెవడు?" సమీర ఏం అందో వినపడనట్టుగానే గట్టిగా అడిగింది సుస్మిత.
"ఈ కళ్ళతో చూసి నేను నమ్మలేకపోయాను. వాడితో అమ్మకి అక్రమ సంభందం తట్టుకోలేకే నాకు మతిపోయింది. వాడు .........వాడు........" చెప్పలేనట్టుగా ఆగాడు అరవింద్.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)