రామాపురం అనే ఒక గ్రామం
ఆది ఒక పల్లె స్కూల్స్ హాస్పిటల్ ఇతర సౌకర్యాలు ఆ గ్రామంలో ఉండేవి కావు కానీ
వ్యవసాయం అనే దానికి మాత్రం పెట్టింది పేరు ఊర్లో ఎక్కడ చూసినా పచ్చని పొలాలు
ఊరి ప్రజలు కూడా పగలు అంత వ్యవసాయం చేసుకుంటూ రాత్రిళ్ళు వీధి దీపాల కింద జీవనం అన్నట్టు ఉండేది
కానీ కొన్నాళ్ళకి కరెంటు సౌకర్యం వచ్చింది కానీ అది ఎప్పుడూ ఉంటుందో ఎప్పుడూ పోతుందో అన్నట్టు ఉండేది వల్ల బ్రతుకులు చీకట్లో అన్నట్టు ఉండేది
రోడ్డు సౌకర్యం పెద్దగా లేదు
ఉన్న మట్టి రోడ్డు లోనే ఒక బస్ ఆ బస్ కూడా
ఈ రోజు ఒక బస్ వెళ్తే ఆ బస్ తిరిగి రావటానికి
ఒక రోజు అంటే మరుసటి రోజు అలాంటి ఊరు
ఆది
ఇప్పుడున్న ఆటో బైక్స్ కార్లు అలాంటివి అంటే కూడా ఆ ఊరికి తెలియవు కానీ పల్లె నుంచి పట్నం వలస వెళ్ళి వచ్చిన వాళ్ళ కొందరు కొన్ని సౌకర్యాలు కొనుక్కోగలిగారు కాని ఆ ఊర్లో ఉన్న రోడ్డు కి అవి పని చేయకుండా అయ్యి పక్క ఊర్లలో కారు షేడ్స్ లలో నెలల తరబడి ఉండేవి
ఇక
స్కూల్ అంటే ఏవో చిన్న చిన్న స్కూల్ అవి కూడా ఎక్కడో శిథిల అవస్థలో ఉన్న భవనాలు...
ఇక హాస్పిటల్ అంటే ఏమి లేవు ఎక్కడో పక్క ఊర్లో చిన్న చిన్న డాక్టర్స్ అక్కడికి వెళ్ళి చూపించుకొనే. సౌకర్యం లేక అంత చుట్టు పక్కల ఉండే నాటు వైద్యం.... మంత్ర సానులు ఇలా
ఏదైనా పెద్ద జబ్బు అలాంటివి వస్తె మనిషి ప్రాణం పోవడమే తప్ప పెద్దగా జ్ఞానం విజ్ఞానం లేని మనుషులు లా ఉండే వాళ్ళు
ఎప్పుడైనా అంటే ఏడాది కో ఎప్పుడో మెడికల్ క్యాంప్ అంటూ వైద్యులు వాళ్ళు కొన్నాళ్ళే ఉండేవారు ఊళ్ళో సరైన సదుపాయాలు లేక వాళ్ళు కూడా ఇబ్బంది పడలేక కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేవారు
ఉన్న కొద్ది పాటి రోజుల వైద్యం అన్న కొందరే వెళ్ళి చూపించుకొనే వాళ్ళు
ఇక్కడ నాటు వైద్యులు నాటు మందులు అంటూ అలవాటు అయ్యి ఆసుపత్రి అంటే భయం తో వెళ్లేవారు కాదు
వీళ్లలో చైతన్యం కోసం అప్పుడప్పుడు వచ్చిన వైద్యులు కొన్ని మాటలు చెప్తూ వాళ్ళకి అవగాహన కల్పించే వారు ఆది కొన్నాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ పాత కథే మళ్ళీ వాళ్ళ జీవన విధానం అంతే
కానీ
ఈ మధ్య గ్రామం వేగం గా అభివృద్ధి చెందుతూ వస్తుంది .....
గ్రామంలో ఎక్కడ చూసినా పట్న వాతావరణం నెలకొంటుంది
చాలా వేగం గా అభివృద్ధి లోకి వచ్చింది ....
గ్రామంలో ఉన్న వాళ్లు ఆరా తీశారు కానీ వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు కానీ
గ్రామం మాత్రం పట్న వాతావరణానికి తక్కువ అని కాకుండా రోడ్లు హాస్పిటల్స్ స్కూల్స్ ఆ గ్రామానికి ఇవి అవసరం అవుతాయో అవి మాత్రం గ్రామం లో సర్దుబాటు అవుతున్నాయి .....
ఇలాంటి టైమ్ లోనే ఆ ఊర్లో ఒక స్కూల్ హాస్పిటల్ ఓపెనింగ్ మహా సభ అని అన్నారు....
ఊరి ప్రజలు అంతా ఆ ఓపెనింగ్ కి వచ్చారు
ఓపెనింగ్ సభలో
ఒక యువకుడు మాట్లాడుతూ.....
చిన్న కథ చెప్పాడు.....
ఆది ఏంటో మనం కూడా విందాం రీడర్స్ ......
ఒక్కప్పుడు ఇదే గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు....
అతనికి పెద్ద కలలు... కానీ
పరిస్థితులు చిన్నవి.... చదవాలంటే డబ్బు లేదు..... ఇంట్లో సహాయం చేసే వాళ్లు లేరు......
అందరూ ఒకే మాట చెప్పేవారు
నీ వల్ల కాదు....నువ్వు ఏమి చేయలేవు
అని
రాము కి ఆ మాట గుండెల్లో సూది ఎప్పుడూ
అలా
అని రాము నిరాశ పడలేదు.....
రాము రాత్రిళ్లు వీధి దీపం కింద చదివేవాడు...... పగలు కూలీ పని చేసేవాడు.....
అతని మీద నవ్వేవాళ్లు చాలామంది...
హేళన చేసే వాళ్ళు కొంత మంది లైట్ కింద చదివి ఎవరు పెద్దవాళ్లు అవుతారు? అని.....
ఒకరోజు అతని టీచర్ అడిగాడు..
ఇంత కష్టం ఎందుకు పడుతున్నావు?
రాము నవ్వి చెప్పాడు
సార్… చీకట్లో కూర్చుని ఉండటం కంటే చిన్న దీపం వెలిగించడమే మంచిది...
సంవత్సరాలు గడిచాయి.....
అదే గ్రామానికి ఒక పెద్ద అధికారి వచ్చాడు కొత్త స్కూల్ అండ్ హాస్పిటల్ ప్రారంభానికి...
అని ఒక నిమిషం ఆగి
కంగు మంటున్న గొంతు తో
అతడే రాము....
సిద్ధార్థ్ రామ్ అని చేతులు పైకి ఎత్తి చెప్పాడు ..
చప్పట్ల వర్షం ......
నాకు పెద్ద వెలుగు అవసరం లేదు.... చిన్న దీపం సరిపోతుంది…
అది ఆరిపోకుండా కాపాడితే చాలు....
ఒకప్పుడు
అతని మీద నవ్విన వాళ్లే ఈ రోజు నిలబడి చప్పట్లు కొట్టారు.....
గుండెలో పట్టుదల నేను సాధించగలను అనే సంకల్ప బలం ఉంటే ఎదైనా సాధించొచ్చు
రాము స్టేజ్ మీద నిలబడి అందరిని చూస్తూ ఒక మాట మాత్రమే అన్నాడు నేను ఈ ఊరికి వెలిగించినది ఒక దీపం మాత్రమే….
కానీ ఈ రోజు వెలిగింది మొత్తం ఊరు...
అని స్పీచ్ ముగించాడు.....
చప్పట్లు కొడుతున్న వారు కళ్ళలో నీళ్ళు మనసులో ఆనందం ఆ ఊర్లో పెరిగిన చిన్న మొక్క ఈ రోజు వృక్షం లా ఆ ఊరికి నీడ లా అయ్యింది అని ......