Read how to control in our mind and heart by kaliyuga kavi in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మనసు కట్టడి

మనిషి నిత్య జీవితంలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనలో ఎన్నో ప్రశ్నలు ఎన్నో సమస్యలు నిత్యం ఎదురవుతూనే ఉంటాయి. సరిగ్గా ఆలోచిస్తే లేదా సరిగ్గా చూస్తే ప్రతి ప్రశ్నకు జవాబు, ప్రతి సమస్యకి పరిష్కారం మన చుట్టుపక్కలే ఉంటుంది కానీ చాలామంది పరిష్కారాన్ని వెతకడంలో విఫలం అవుతూ ఉంటారు. 
ఇలా విఫలం అయ్యే క్రమంలో తన పైన తనకు పట్టుదల కోల్పోయి హంతకులుగా మారడం లేదా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించడము లేదా చెప్పుడు మాటలుకి లోనవ్వడం జరుగుతూ ఉంటాయి. 
మనసు నియంత్రణ అనేది ఈ సమాజంలో నేటి కాలానికి ప్రతి మనిషి తప్పక పాటించాల్సిన ఒక నియమంలో ఉండాలి  ఉండి తీరాలి.
ఇది ఒక సమాజం ఇక్కడ ఇలాగే బ్రతకాలి అని కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనలని పాటించకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా బతికే వారు కూడా ఉన్నారు
ఎలాగైనా బ్రతకాలి అని నియమాలు అడవిలో ఉంటాయి…. ఇలాగే బతకాలి అనే నియమాలు సమాజంలో ఉంటాయి 
కానీ ప్రస్తుత సమాజం అడవిలా మారిపోయింది ఎలాగైనా బతకాలి అనే ధోరణి మనసులో రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇలా మనసుపై నిలకడ లేకుండా తనని తాను నియంత్రించుకోకుండా ఉండడం వల్ల జరిగే ప్రమాదాలు సమాజానికి ముప్పులా మారాయి. ధర్మ సూక్ష్మల గురించి ఆలోచించడానికి ఇది కురుక్షేత్రం కాదు సమాజం కనబడే మంచి చెడులని మాత్రమే మనిషిని నిర్ణయిస్తాయి. అదే ప్రతి మనిషి పాటించాలి కూడా కాని అలా పాటించకుండా తమకు నచ్చినట్టుగా తమ ఆలోచనలని విస్తరిస్తూ తమ జీవనాన్ని సాగిస్తాం అనుకునేవారు, తాము ఈ సమాజం కంటే వేరు అని తమకు తాము అనుకుంటారు కానీ తమపైన ఈ సమాజానికి ఒక భిన్న అభిప్రాయం ఉంటుంది.సమాజం ఏమనుకున్నా పరవాలేదు కానీ తమకు నచ్చినట్టుగా జీవనాన్ని సాగిస్తాం అనుకునేవారు తమకు నచ్చినట్టుగానే ఉండొచ్చు కానీ దానికి కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. 
ఒక ఉదాహరణకి చెప్పుకుంటే 
ఒక తాబేలు  తన చుట్టుపక్కల అలికిడి లేదా ఏదైనా శబ్దం అయిన లేదా తనకి ముప్పు అని తెలిసినా తన అవయవాలని అన్నిటిని డిప్పలోపడికి లాక్కుంటుంది.
 అలాగే మనిషి తనకి చెడుగా భావించిన వాటన్నిటినుండి తాబేలు లాగా తన మనసులని నియంత్రించుకోగలగాలి 
మనసుకి ఆలోచనకి నిత్య యుద్ధం ప్రతి మనిషి సొంతం  . . . . ఈ యుద్ధాన్ని జయించి ముందుకు వెళ్లడమే జీవితం 
ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే ఇంద్రియాలు అయినా చర్మం ముక్కు నాలుక చెవులు కండ్లు తమ తమ ధర్మాలను చేస్తాయి.
 వినటం, వాసన చూడడం, స్పర్శ, ఈ వివరాలు అన్నిటిని మెదడులోని ఆలోచనకి దాని నుండి మనసుకి చేరుతాయి ఆయ వివరాలు సేకరించిన తర్వాత ఆ పనిని చేయాలా వద్దా అని ఇటు మనసు, అటు ఆలోచన రెండు పోటీపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి ఈ మనసుకి ఆలోచనకి భేదాభిప్రాయాలు ఏర్పడి నిర్ణయాలు తీసుకోవడంలో లోపం ఏర్పడి సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అసలైన సమస్యలు ఏర్పడతాయి. కానీ నిర్ణయాలు తీసుకునే ముందు ఆ నిర్ణయం వల్ల పంచంద్రియాలు కలిగిన ఈ శరీరానికి లేదా సమాజంలో ఈ శరీరానికి ఉన్న పేరుకి లాభం చేకూరుతుందా? నష్టం చేకూరుతుందా? లేదా దానివల్ల ఇతరులకి ఏదైనా ఉపయోగం ఉందా? అని ఇలా అన్నింటికి పరిగణలోకి తీసుకుకొని అంచనా వేసుకోగలిగితే, తీసుకునే నిర్ణయాల్లో ఎటువంటి లోపం అనేది ఉండదు. 
ఒకవేళ నువ్వు నీ మనసుకి ఆలోచనకి మధ్యన ఆగిపోతూ నిర్ణయాలు తీసుకొలెని స్థితిలో ఉన్నట్లు అయితే సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిని గుర్తించి అతనిని నమ్మడమే ఉత్తమమైన మార్గం భగవద్గీతలో అర్జునుడు అంతటివాడే తన మనసు చెల్ల చెదురైనప్పుడు శ్రీకృష్ణుడు హితబోధ చేసి సరైన మార్గంలో నడిపించాడు
 ఒక మనిషి తన పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఉన్న ఈ మధ్యకాలంలో ఎన్నో మంచి పనులు చెడు పనులు చేస్తాడు. ఒక మనిషి సంపూర్ణ కాలం జీవిస్తే తన చివరి కాలంలో ఎటువంటి పనులు చేయలని స్థితికి వస్తాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు మనిషి చేసేది కేవలం ఆలోచించడం మాత్రమే ఆ దశలో మనిషి నిరంతరం ఆలోచిస్తూ తాను చేసిన మంచి చెడులను ప్రతి కార్యాన్ని నెమరు వేసుకుంటాడు. .  ఇలా అంతా ఆలోచించిన తర్వాత తాను చేసిన మంచి చెడులను లెక్క కట్టిన తర్వాత తన మనసు ప్రశాంతంగా ఉండాలా లేదా చేసిన చెడులు ఎక్కువగా ఉండటం వలన నిరంతరం వాటి గురించి ఆలోచిస్తూ నరకయాతన పడాల అన్నది మొదలవుతుంది.
 నువ్వు చేసే ప్రతి పనికి సమాధానం అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా నీకు నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది అలా నీ మనసుకి నువ్వు చెప్పే సమాధానం నిన్ను మనశ్శాంతి వైపు నడిపేలా ఉండాలి .
 పైన చెప్పిన పదాలను అన్నిటినీ అర్థం చేసుకొని ఒకరోజు అలా ఉండి చూడు నచ్చితే ప్రతిరోజు అలానే జీవించు . . .

                               . . .కలియుగ కవి