Read sarayu by pothumudi srinivas in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • సరయు

    అర్జున్ అతని కార్ లో, తన భార్య (అనిత) మరియు అయదు సంవత్సరాల క...

  • అంతం కాదు - 61

    సత్యయుగ గ్రహం: కల్కి కోసం శిక్షణఇక అక్కడ కట్ చేస్తే, మళ్ళీ హ...

  • అర్ధం కాని ప్రేమ”

    చదువంటే భయపడే ఒక యువకుడి జీవితంలోకి అనుకోని అతిథిలా అడుగుపెట...

  • K A.U

    చార్మినార్ రక్తపాతం (The Bloodbath of Charminar) దృశ్యం 1: చ...

  • addu ghoda

    Scene: Interior – Car – Eveningకథ పేరు అడ్డుగోడ…కారు లోపల వా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

సరయు

అర్జున్ అతని కార్ లో, తన భార్య (అనిత) మరియు అయదు సంవత్సరాల కొడుకు ( సుహాస్) తో కలసి వికారాబాద్ లో వీకెండ్ గడపడానికి వెళ్తున్నాడు. 
Fm లో పాటలు వస్తుంటే.. అర్జున్ Fm ని ఆపి తన ప్లే లిస్ట్ లోని ఇళయరాజా సాంగ్స్ పెట్టాడు.
అనిత అసహనంగా చూస్తూ " Fm లో పాటలు బాగానే ఉన్నాయ్ కదా" అని అంటుంది మూతి ముడుచుకుని..
" సాంగ్స్ తో పాటు యాడ్స్ కూడా బాగానే ఉంటాయి, అయినా నీ సోదే భరించడం కష్టం మధ్యలో ఇవి కూడానా " అని కొంటెగా అంటాడు అర్జున్..
"ఏంటి నాది సోదా" అని కోపం నటిస్తూ అతని బుజం పై కొడుతుంటుంది అనిత. ఇంతలో ఇద్దరి మధ్యలోకి సుహాస్ వచ్చి "మామ్... డాడ్... Please స్టాప్, మీ సోది వల్ల నేను Doreman చూడలేక పోతున్న" అని అనే సరికి ఇద్దరు గొడవ పడడం ఆపేసి ఒకరి మొఖం ఒకరు చూసుకుని నవ్వుకుంటారు.
ఉన్నటుండి "దన్.. ధన్ " అంటూ పెద్ద శబ్దం. రెప్ప పాటులో ఒక టిప్పర్ లారీ అర్జున్ కార్ ని డీ కొట్టి వెళ్ళిపోయింది.
నుజ్జు నుజ్జు అయిన కార్ నుండి అర్జున్ అతి కష్టం మీద బయటకు వచ్చి " అనిత.... సుహాస్ " అని గట్టిగా అరుస్తూ నేలపైన పడి ఏడుస్తుంటాడు. నిసహాయ స్థితిలో.. రక్తపు మాడుగులో పడి ఉన్న అర్జున్ కళ్లు నెమ్మదిగా మూత బడ్డాయి..
అర్జున్ ఉన్నటుండి ఉలిక్కిపడి లేచి,కళ్లు తెరిచి చూస్తే అతను బెడ్ రూమ్లో ఉన్నాడు.. సమయం రాత్రి 09:00 గంటలు అయ్యింది. అతని చేతితో బెడ్ కింద తడిమి చూసాడు అక్కడ ఒక కాలీ బాటిల్ మాత్రమే కనిపించింది...
వతైన గడ్డం, మెడవరకు పెరిగిన హెయిర్ తో, ఆరడుగుల అర్జున్ రోడ్ పైన నడుచుకుంటూ వెళ్తుంటే... వెళ్లే పోయే అమ్మాయిలందరి చూపులు అతని వైపుకె మరళుతున్నాయి.. అయినప్పటికీ అర్జున్ ఏమి పట్టించుకోకుండా 'మధుసాల' బార్ లోపలకి వెళ్లి అతను ఎప్పుడూ కూర్చునే టేబుల్ నెంబర్ 9 దగ్గర కూర్చున్నాడు. Dim light లో కిషోర్ కుమార్ (ఓల్డ్ ) సాంగ్స్ ప్లే అవుతూ bar ambience ప్రశాంతం గా ఉంది. అర్జున్ ఆర్డర్ చెయ్యకుండానే 'జహీర్', రెండు లార్జ్ విస్కీ పెగ్స్ లో ఫుల్ గా ఐస్ క్యూబులు వేసి అతనికి సర్వ్ చేసి "గుడ్ ఈవెనింగ్ సార్" అని విష్ చేసాడు. అర్జున్ సరే సరే అన్నట్టు తలవూపి పెగ్ సిప్ చేసాడు. 2 ఇయర్స్ నుండి జహీర్.. అతనికి సర్వ్ చేస్తున్నాడు కానీ ఒక్క సారి కూడా అర్జున్ అతనితో మాట్లాడలేదు. అందరూ మత్తులో మునుగుతూ నెమ్మదిగా మరింత మత్తులోకి దించుతున పాటలు వింటూ ఎంజాయ్ చేస్తుంటే,.. ఉన్నట్టుండి డోర్ ఓపెన్ అయిన శబ్దం వినిపించింది. ఒక్క సారిగా అందరూ బయటకు చూస్తూ అలాగే ఉండిపోయారు... డోర్ లోపలకి రెడ్ కలర్ హై హీల్స్, రెడ్ కలర్ లాంగ్ skirt వేసుకుని dark పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని, ఎంతటి వాడినైనా చూపు తిప్పకుండ చెయ్యగల అందాల రాసి (sarayu) నడుచుకుంటూ వస్తుంది.
సరయు నేరుగా వచ్చి అర్జున్ ఎదురుగా కూర్చుని "నేను నీతో మాట్లాడాలి" అని అంటుంది. చుట్టూ ఉన్న వారు ఆశ్చర్యంగా ఇద్దరి వైపు చూస్తుండగా...అర్జున్ కళ్లు పెద్దవి చేసి vaallavaipu చూడగానే అందరూ తలదించుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు.
"ఎమ్ మాట్లాడాలి"? అని పెగ్ సిప్ చేసాడు.
ఆమె అతనికి దగ్గరగా వచ్చి "ఒకర్ని చంపాలి" అని అనగానే ఆమె వైపు షాకింగ్ గా 2 సెకండ్స్ చూసి.. గట్టిగ నవ్వుతూ... "Vodka or beer !... ఇక్కడ స్టార్ట్స్ కూడా బాగుంటాయ్.. చెప్పు ఎమ్ ఆర్డర్ చేయమంటావ్" ? అని వెటకారంగా అడుగుతాడు అర్జున్. 
"నేను సీరియస్ గా మాట్లాడుతున్న నిజంగా ఒకర్ని చంపాలి" అని ఓర్పుగా చెబుతుంది. 
అర్జున్ కోపంగా "నేను సీరియస్ గా చెప్తున్నా నువ్వు అనుకున్న పర్సన్ నేను కాదు అని" అంటూ వెనక్కి తిరిగి రెండు వేళ్ళు zaheer కి చూపించిగానే, అతను మరొక రెండు పెగ్స్ తీసుకొచ్చి టేబుల్ పైన పెడతాడు.
సరయు రెండు చేతులు కట్టుకుని అర్జున్ కళ్ళలోకి నేరుగా చూస్తూ "నాకు తెలిసిన వ్యక్తి నాకు ఒకటి చెప్పాడు, నువ్వు కలవబోయే వ్యక్తి నార్మల్ పర్సన్ కాదని. అతనికి టైం తో పని లేదు, ప్లేస్ తో పని లేదు, వెపన్స్ తో పని లేదు గుండి సూదైనా చాలు గుండె ఆగిపోయేలా చేయగలడని. ఇండియన్ కమాండోస్ చేసిన ఆపరేషన్స్ లో చచ్చిన వాళ్ళ కన్నా అతను చంపిన శవాల గుట్టలే ఎక్కువని. అతని పేరు అర్జున్ అంట. నిజమేనా అర్జున్"! అని అనగానే అర్జున్ కళ్లు ఎర్రగా మారిపోతాయి.. వేగంగా ఒక పెగ్ సిప్ చేసి. "నేనేంటో తెలిసి కూడా నా కళ్ళలోకి చూస్తూ మాట్లాడుతున్నావా"? అని అడగగానే సరయు చిన్నగా నవ్వుతూ.."ఎమ్ చేస్తావ్ మహా అయితే చంపుతావు... అదేదో డబ్బు తీసుకుని చంపు ఏమంటావ్" అని అతని రెండో పెగ్ తీస్కుని ఆమె కూడా ఒక సిప్ వేస్తుంది.
"నేను అవన్నీ మానేసి చాలా కాలం అయింది, ఇక పై చెయ్యాలి అని కూడా అనుకోవడం లేదు" అని పైకి లేచి వెళ్ళబోతుంటే.. సరయు అతని చేతిని పట్టుకుని "please ఇది నా లైఫ్ మేటర్, కావాలంటే ఎంత money అయినా ఇస్తాను" అని దీనంగా అతని కళ్ళలోకి చూస్తుంది. అర్జున్ ఒక్క సెకండ్ ఆలోచించి.. "నాకు తెలిసిన ఏజెన్సీ ఉంది... వాళ్ళు నిన్ను చూడరు నువ్వు వాళ్ళని చూడవు,ఈవెన్ వాళ్ళని నేను కూడా చూడలేదు. ఫోటో పంపిస్తే చాలు పని ఫినిష్ చేస్తారు. ఒక్క సారి process స్టార్ట్ అయ్యాక నువ్వు వద్దు అనుకున్న నేను ఆపాలనుకున్న వాళ్ళని చంపకుండా వదలరు.. ఇందుకు నీకు ఇష్టమైతే మాట్లాడతాను" అని అతని మాట ముగించే లోపే "నాకు ఓకే" అని సరయు exciting గా అంటుంది. అర్జున్ ఆమె తొందర చూసి సరే "ఫోన్ నెంబర్ ఇవ్వు" అని అంటాడు వెంటనే ఆమె అతని మొబైల్ తీస్కొని నెంబర్ సేవ్ చేసి "థాంక్ యూ.. నీ కాల్ కోసం వెయిట్ chesthanu" అని చెప్పి బార్ నుండి బయటకు వెళ్ళిపోతుంది.
గంట సమయం తరువాత సరయు స్నానం చేసి టవల్ తో ఆమె హెయిర్ ని తుడుచుకుంటూ అద్ధం లో ఆమె ముఖాన్ని చూసుకోగానే అనుకోకుండా ఆమె కళ్ల నుండి నీరు బయటకు వచ్చేస్తాయి. ఆమెకు గట్టిగ ఏడవాలనిపిస్తుంది కానీ తమాయించుకుని, కళ్లు తుడ్చుకుని నైట్ డ్రెస్ వేసుకుని బెడ్ రూమ్ లోకి వస్తుంది. ఇంతలో ఆమె ఫోన్ రింగ్ అవుతుంది.. అర్జున్ కాలింగ్ అని చూడగానే ఆలస్యం చెయ్యకుండా కాల్ లిఫ్ట్ చేసి "చెప్పండి అర్జున్" అని అనగానే
అర్జున్ "ఒక బ్యాగ్ లో మనీ ప్యాక్ చేసి అందులో నువ్వు చావాలనుకున్న వాడి ఫోటో ఒక కవర్ లో ఉంచి ఆ బ్యాగ్ ని మీ కాంపౌండ్ బయట డష్టబిన్ లో పడేసి వెనక్కి తిరక్కుండా వెళ్ళిపో" అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.
అర్జున్ చెప్పినట్టుగానే ఆమె డస్ట్ బిన్ లో బ్యాగ్ ఉంచి గది లోకి వచ్చేస్తుంది.
ఆమె ఫోన్ కి అర్జున్ నుండి ఒక మెస్సేజ్ వస్తుంది " నువ్వు చావాలి అనుకున్న వాడి ఆయుష్షు మరొక 24 గంటలు మాత్రమే" అని. 
ఆ మెస్సేజ్ చూసిన సరయు బెడ్ పైన వాలి విండో నుండి వెన్నెలని చూస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది.
ఒక చెయ్యి డస్ట్ బిన్ నుండి ఆ బ్యాగ్ ని బయటకు తీస్తుంది. ఆ బ్యాగ్ ఓపెన్ చెయ్యగానే మనీ తో పాటు ఒక కవర్ కనిపిస్తుంది. నల్లటి ముసగు వేసుకున్న ఆ వ్యక్తి బ్యాగ్ ని పక్కన పెట్టి కవర్ ఓపెన్ చేసి చూస్తాడు.. ఆ ఫోటో లో ఉన్నది మరెవరో కాదు 'sarayu'...   
                                             To be continued....