ఎపిసోడ్ – 3
రెండు రోజులు గడిచాయి…
రాత్రి తొమ్మిదికి దగ్గరపడుతోంది. సువర్ణ కిచెన్‌లో భోజనం చేస్తున్నారు. అఖిరా నెమ్మదిగా ఆమె దగ్గరికి వెళ్లి,
“పిన్నీ… మీరు చేయొద్దు. నేను చేస్తాను. మీకు రెస్ట్ కావాలి,” అంది.
సువర్ణ ముఖంలో ఎప్పటిలానే కఠినత్వం ఉంది.
“నేనే చూస్తాను… నువ్వు వెళ్లు,” అంది.
అఖిరా పిన్నీ చేతిని పట్టుకుని మృదువుగా,
“పిన్నీ… మీరు ఎన్ని సార్లు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా… నేను మాత్రం మీరు, నిక్కీ ఇద్దరినీ వదిలి ఎక్కడికి వెళ్లను.
నాన్న చివరి మాట గుర్తొస్తోంది… మీ ఇద్దరి బాధ్యత నాది,” అంది.
ఈసారైనా సువర్ణ సమాధానం ఇచ్చింది. కానీ అది సాఫ్ట్ కాదు—కేవలం అలసట.
“అలాగే చూడు,” అని చిన్నగా అనడంతో, ఆవిడ కుంగిపోయిన మనసు కనపడింది.
ముగ్గురూ కలిసి భోజనం చేశారు.
తర్వాత పిన్నీ, నిక్కీ గదిలో పడుకోబెట్టేందుకు వెళ్లింది.
అఖిరా వాళ్లిద్దరినీ చూస్తూ తలుపు మెల్లగా మూసి తన గదికి వెళ్లింది.
అలమార లోపలున్న పాత పెట్టె తీసి నాన్న రాసిన లేఖను తెరిచింది.
“అఖిరా… నేను ఇంకొన్ని రోజులు మాత్రమే బతుకుతాను. సువర్ణకు పుట్టబోయే బిడ్డను నువ్వే చూసుకోవాలి. నువ్వు చదువుల్లో ఎదగాలి… నేను ఎక్కడ ఉన్నా నిన్నే చూస్తుంటాను.”
ఆ లేఖని గుండెలికి హత్తుకుని, లేఖని మళ్లీ మళ్లీ తిప్పి చూస్తూ, అఖిరాకు చిన్నప్పటి జ్ఞాపకాలు ఒక్కసారిగా దూసుకువచ్చాయి.
నాన్నతో కలిసి సాయంకాలం అడ్డంగా కూర్చుని స్కెచ్‌లు వేసిన రోజులు…
పిన్నీ నవ్వుతూ వాళ్లిద్దరినీ చూస్తూ చేసిన అల్లరి…
ఇంట్లో ఎంత డబ్బుల్లేకపోయినా, ఒక చిన్న పుట్టినరోజు కేక్ అయినా తెచ్చి అఖిరాని రాజకుమారిలా ఫీల్ చేయించేవారు.
తన చిన్నచిన్న కలలన్నీ నాన్ననే మొదట నమ్మాడు.
ఆయన లేని లోటు ఇప్పటికీ గుండెల్లో రంధ్రంలా ఉంది.
“నాన్న ఉన్నా… ఈరోజు నా పరిస్థితి ఇలా ఉండేదా?” అని ఒక్క క్షణం అనిపించింది.
కానీ వెంటనే ఆలోచనను ఆపేసింది.
“నేను బలంగా ఉండాలి… వీళ్లిద్దరి కోసం.”
అని తానికే తానుగా మాటిచ్చుకుంది.
ఆలోచనలు ఆగలేదు…
అఖిరా మంచంపై పడుకున్నప్పటికీ, మనసు మాత్రం గతంలోనే తిరుగుతూనే ఉంది.
నాన్న చివరి రోజుల్లో పిన్నీ ఎంతగా కంగారు పడిందో…
అప్పుడు ఇంట్లో ఉన్న నిశ్శబ్దం, ఆ భయం, ఆ బాధ—ఇప్పటికీ చెవుల్లో మార్మోగుతూనే ఉంటాయి.
సువర్ణ ఎంత కఠినంగా కనిపించినా, లోపల ఎంత విరిగిపోయిందో అఖిరాకు బాగా తెలుసు.
అందుకే ఆమె కోపం, మాటలు—అన్నింటినీ అఖిరా ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోదు.
“ఈ ఇంట్లో ఉన్న వాళ్లిద్దరికీ నేను ఆత్మబలం కావాలి…”
నేను మిమ్మల్ని గర్వపడేలా చేస్తాను, నాన్న… అని మరోసారి తనలోతానే చెప్పుకుని, కళ్లను మూసుకుంది.
అఖిరా గుండెల్లో భారంగా పేరుకుపోయిన ఆ అనుభూతి ఒక్కసారిగా ఊపిరి బిగపర్చినట్టయింది.
---
ఉదయం…
అఖిరా ఇంటి పనులు, టిఫిన్ అన్ని యిప్పటి లాగే పూర్తి చేసి పిన్నీకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టి,
“ఈరోజు ఓ ఎక్స్ట్రా షిఫ్ట్ ఉంది పిన్నీ… కొంచెం లేట్ అవుతాను,” అని చెప్పి వెళ్ళింది.
కాలేజీలో సత్యను చూసిన వెంటనే, సత్య గమనించింది—
“నీ ముఖంలో ఈ వెలుగు ఏం రా? ఉదయాన్నే లాటరీ కొట్టావా?” అని వెటకారం.
అఖిరా నవ్వింది.
“కిషోర్ ఫోన్ చేశాడు,” అంది.
సత్య ఒక్కసారిగా ఫ్రీజ్ అయింది.
“మన ఈవెంట్ మేనేజర్ కిషోర్? ఏమన్నాడు?”
“గత నెల మనం చేసిన చిన్న కార్పొరేట్ ఈవెంట్ గుర్తుందా?” అని అఖిరా అడిగింది.
సత్య తల ఊపింది—
అఖిరా కొనసాగించింది—
గత నెల డెకరేటర్ రాకపోవడంతో, ఆ ఈవెంట్‌ని చివరి నిమిషంలో నేనే హ్యాండిల్ చేశాను కదా.
“అప్పుడు నేను క్రైసిస్ హ్యాండిల్ చేసిన విధానం చూసి, డైరెక్టర్స్ impress అయ్యారట.
కిషోర్ చెప్పాడు—ఈసారి వాళ్ల ఫ్యామిలీ లో 25th యానివర్సరీ ఉంది.
చిన్న టీం కావాలి… and he trusts me to lead it.”
సత్య చాలా హ్యాపీగా, ‘దాట్ సో గ్రేట్!’ అని చెప్పింది. రిమ్యునరేషన్ ఎంత అని అడిగింది?
అఖిరా ఒక శ్వాస తీసుకుని,
“మెయిన్ ఈవెంట్ రిమ్యునరేషన్ 7 లక్షలు.
ఇంకా వెండర్ మార్జిన్స్, స్టార్టర్ కాంట్రాక్ట్ నుంచి ఇంకో 1½ నుంచి 2 లక్షలు వస్తాయి.
మొత్తం 8–9 లక్షలు.
టీమ్ సాలరీస్, మెటీరియల్… డిడక్ట్ చేస్తే కూడా
పిన్నీ ఆపరేషన్‌కి కావాల్సిన పెద్ద భాగం కవర్ అవుతుంది,” అంది.
సత్య, అమేజింగ్ గా చాలా హ్యాపీగా ఉంది. ఈసారి కూడా ఈవెంట్ బాగానే చేస్తావు లే అని చెప్పగా అఖిరా నవ్వింది. ఇప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ కీ పిన్ని ఆపరేషన్ అయిపోతే చాలు... అని చెప్పింది.
సత్య ఆమె చేతిని పట్టుకుని,
“అఖిరా… ఇది నీ డిజర్వ్ చేయదగ్గ మొదటి big break.
But careful. ఇది పెద్ద బాధ్యత,” అంది.
అఖిరా తల ఊపింది.
“I know. కానీ నేను ఫెయిల్ అవ్వను. నాకు ఆప్షన్ లేదు.”
ఇద్దరూ క్లాస్ వైపు నడుస్తూ ఉండగా—
ఎవరో వెనకనుంచి అఖిరా చేతికి తగిలారు.
అఖిరా అనుకోకుండా ఆగిపోయింది. ఎవరో పిలిచినట్టు… గుండె ఒక్కసారిగా ఆగినట్టైంది.
వెనక్కి తిరిగేసరికి—అతను చెవులకు హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వెళ్లుతున్నాడు.
అఖిరా కళ్లలో ఏదో తెలియని మెరుపు… ఆ ఉన్నికీ తనకు బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపించింది.
అతన్ని ఆపి చూడాలా? అని అనుకుంటూ అడుగు ముందుకు వేస్తుండగా—
సత్య, ‘అఖిరా, పడా! లేట్ అవుతోంది,’ అని చెయ్యి పట్టుకుని తీసుకెళ్లిపోయింది.
కానీ ఆ క్షణం… అఖిరాకు ఎప్పటికీ మరచిపోలేని క్షణంలా మిలిగిపోయింది.
ఈ రోజు జరిగినది అఖిరా మనసులో ఇంకా మారుమోగుతూనే ఉంది.
---
ముందుకు కొనసాగుతుంది…
---