Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అఖిరా – ఒక ఉనికి కథ - 1

ఎపిసోడ్- 1

ఉదయం 8 గంటలకు ఫోన్ మోగింది. అఖిరా నిద్ర మత్తులో ఉండగా, ఫోన్ రిసీవ్ చేసి, “హలో” అని ఆవలిస్తూ అన్నది.

అటు వైపు నుండి సత్య ఉత్సాహంగా, “హలో అఖిరా! రెడీ అయ్యావా?” అని అడిగింది.

అఖిరా కళ్ళు మెత్తగా తుడుచుకుంటూ, మెల్లగా లేచి,
“రెడీనా… ఏంటీ, పొద్దున్నే కాల్ చేసావు?” అని అన్నది.

సత్య, “ఏంటీ, ఇంకా లేవలేదా?" 9కి ప్రాజెక్టు సబ్మిట్ చెయ్యాలి” అని కంగారుగా చెప్పింది.

అఖిరా టైమ్ చూసింది. 8:10.
“ఓ మై గాడ్, కలెజ్ కి టైమ్ అవుతోంది… కాస్త ముందు కాల్ చేయలేవా?” అని అనగానే,

సత్య, “హలో మేడం, లేట్ గా లేచింది, నువ్వు నన్నంటే ఎలా?” అని మరల ఉత్సాహంగా అడిగింది. “తొందరగా వెళ్లి రెడీ అవ్వు, బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తూ ఉంటాను” అని చెప్పగానే,

అఖిరా, “సరే, పెట్టు, బై” అని చెప్పి, తొందరగా రెడీ అయ్యింది. పటా-పటా పుస్తకాలు చేర్చి, తన ప్రాజెక్ట్ కోసం తయారుచేసిన మోడల్ తీసుకుని, “ఎవ్వరూ చూడక ముందే వెళ్లిపోవాలి” అని తనకు తానే చెప్పుకుని బయటకి వెళ్లింది.


---

అప్పుడు వెనకనుంచి తన పిన్నీ, “అఖిరా!” అని గట్టిగా పిలిచింది.
అఖిరా కొంచెం భయపడింది. చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ని ఇంకా గట్టిగా పట్టుకుని, గట్టిగా ఊపిరి పీల్చుకుని “కామ్ డౌన్” అనుకుంటూ వెనక్కి తిరిగి, చిన్నగా నవ్వుతూ ప్రాజెక్ట్ టేబుల్ మీద పెట్టింది.
“ఏంటి పిన్ని?” అని నెమ్మదిగా అడిగింది.

పిన్నీ తన ప్రాజెక్ట్ మోడల్ చూసింది.
ప్రాజెక్ట్ మోడల్ ఒక చిన్న, సుస్థిరమైన కమ్యూనిటీ సెంటర్ యొక్క రూపాన్ని చూపిస్తుంది. ఈ మోడల్ లో వేర్వేరు జోన్లు స్పష్టంగా కనిపిస్తాయి — ఒకవైపు సాయంత్రం సమావేశాల కోసం చిన్న వేదిక, మరోవైపు చదువుకునే, విశ్రాంతి తీసుకునే స్థలాలు, అలాగే చిన్న వనము లేదా తోటలు. మధ్యలో నడిచే మార్గాలు వాడినవారిని సౌకర్యంగా మోసేలా డిజైన్ చేయబడ్డాయి. ప్రతి చిన్న బెంచ్, టేబుల్, గ్రూప్ చర్చ కోసం ఏర్పాటు చేసిన చోట్లూ, గార్డెన్ ఏరియా వంటి ప్రదేశాలు చిన్న కాగితం, కార్డ్బోర్డ్, ఇతర హస్తకళా సామగ్రితో సవివరంగా రూపొందించబడ్డాయి.
“గ్రీన్ హబ్” అని పేరు కూడా పెట్టింది.

అఖిరా పిన్నీని గమనించింది. కాస్త నవ్వుతూ, “బాగుంది కదా పిన్ని, కాలేజీ ప్రాజెక్టు. టైమ్ అవుతోంది, నేను వెళ్తాను, బై” అని అనగానే,

“ఆగు!” అని గట్టిగా గొంతు లేపింది పిన్ని.
“నీకు చాకిరీ చేయడానికే ఉన్నానా నేను? నువ్వు ఇప్పుడు కాలేజీకీ వెళ్లిపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు?” అని చెప్పగానే,

అఖిరా, “నేను సాయంత్రం వచ్చాక చేస్తాను” అన్నది.

పిన్ని — కోపంగా నా మాటలు కాదనే అంత ధైర్యం వచ్చింద నీకు అని అనగా.

పిన్ని మీ అమ్మ నిన్ను కనకుండా నే చనిపోయి ఉండి ఉంటే బాగుండేది.” అనగానే 

అఖిరాకు కోపం వచ్చిన నెమ్మదిగా "మీరు మాట్లాడుతూంది నా అమ్మ గురించి మాటలు జాగ్రత"
అని చెప్పింది.

పిన్ని కోపంతో, “చదువుతున్నావని పొగరు!” అని చెప్పగానే,

అఖిరా,
“అవును, నేను కష్టపడి పార్ట్‌టైమ్ లో ఆన్లైన్ జాబ్ వీకెండ్ లో, ఈవెంట్స్ చేస్తూ,పని చేస్తూ నా డబ్బులతో చదువుతున్నా.
అయినా ఇవన్నీ చెప్పి మీకు ప్రయోజనం లేదు.
నాకు ఇప్పటికే లేట్ అయ్యింది, ప్లీజ్ వెళ్లనివండి” అనగానే,

పిన్ని కోపంతో మోడల్‌ని కింద గట్టిగా విసిరి, కాళ్లతో తొక్కి చెల్లాచెదురు చేసేసింది.

అఖిరా కళ్ళలో నీరు తిరిగింది.
“రెండు రోజులుగా చాలా కష్టపడి ఈ మోడల్ రెడీ చేశాను. సబ్మిట్ చేయకపోతే మార్కులు పోతాయి!” అని అరిచింది.
పిన్ని లోపలికి వెళ్లిపోయింది.

అఖిరా వేదనతో, ముక్కలు తన చేతిలో తీసుకుని, మోడల్ చూసి, అదే బాధతో బయటకి వెళ్లింది.


---

బస్‌స్టాప్ కి వచ్చి కూర్చుంది.
సత్య ఇప్పుడా వచ్చేది.
“టైమ్ చూడు, ఎంత అయ్యిందో?” అని చూసింది. (అప్పుడే 9 అయ్యింది.)
“లేట్ అయ్యాము. ఇప్పుడు ఆ సర్ నీ ప్రాజెక్ట్ తీసుకుంటారో లేదో తెలీదు. అవును, ఖాళీ చేతో వచ్చావేంటి? మోడల్ ఎక్కడ?” అని అడిగింది.

అఖిరా విరిగిపోయింది.
“పిన్ని నా మీద కోపంతో కింద పడేసింది… she messed up” అని చెప్తోంది.
సత్య, “రెండు రోజులు నుంచీ అంత కష్టపడ్డావు కదా! అయినా నీ పిన్నికి సువర్ణ అని కాకుండా సుర్పణక అని పేరు పెట్టాల్సింది!” అని కోపంతో అంటోంది.

అఖిరా తనను చూసి, “సత్య!” అని కొంచెం గట్టిగా అన్నది.
“నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా — ఆ ఇల్లు వదిలి వచ్చి నాతో పాటు పీజీ కి షిఫ్ట్ అవ్వు అని. కనీసం piece of mind అయినా ఉంటుంది కదా? రోజూ ఈ టార్చర్ ఉండదు” అని అంటుంది.

అఖిరా కళ్ళు తుడుచుకుంటూ,
“ఇప్పుడు ఈ మాటలన్ని ఎందుకు? బస్ కూడా వచ్చేసింది. పదా,” అని చెప్పి ఇద్దరూ బయల్దేరారు.


---

సత్య క్లాస్ కి వెళ్లిపోయింది.
అఖిరా స్టాఫ్ రూమ్ కి వెళ్లి, “సర్…” అని మెల్లగా పిలిచింది.

టేబుల్ మీద ‘HOD Professor Ashok Kumar’ అని రాసి ఉంది.
సర్, “యస్, అఖిరా, చెప్పు” అన్నారు.

అఖిరా, “సర్, మీరు ఇచ్చిన ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఒక రెండు రోజులు టైమ్ ఇస్తే సబ్మిట్ చేస్తాను” అని చెప్పింది.

అఖిరాకు సర్ ఇలా అన్నారు —
“అందరికీ ఒకటే రూల్స్, గ్రూప్ వైజ్ కదా, అసైన్‌మెంట్ ఇచ్చాం. నువ్వు ఒకదానివే వచ్చావేంటి?” అన్నారు.

అఖిరా ఏమీ మాట్లాడలేదు.

సర్ మళ్ళీ, “ఇప్పటికే ప్రతి గ్రూప్ సబ్మిట్ చేశారు. నువ్వు నీ టీమ్ మాత్రమే మిగిలారు. ఈ రోజు EOD — ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, ఎక్స్టెన్షన్ లేదు” అని చెప్పి వెళ్లిపోయారు.

అఖిరాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాంటీన్ కి వచ్చి కూర్చుంది.

“ఇప్పడు సాయంత్రం లోపు అంటే ఎలా చేయాలి? కాన్సెప్ట్ మళ్లీ చేయాలంటే నావల్ల కాదు,” అని తల మీద చెయ్యి పెట్టుకుని తనకు తానే చెప్పుకుంటుంది.
ఇంతలోనే తనుజ, లీనా, కిరణ్ వచ్చి,
“నిన్ను నమ్మినందుకు బాగా అయ్యింది! ఇప్పుడు మా ఇంటర్నల్ మార్కులు కూడా కట్ అవుతాయి” అని కంగారుగా చెప్పారు.

అఖిరా ఏం మాట్లాడలేదు.
ఇంతలో కిరణ్, “నువ్వు ఏం చేస్తావో తెలీదు, ప్రాజెక్ట్ నీ వల్లే పోయింది. కాబట్టి నువ్వు చూసుకో, మా మార్క్స్ పోకూడదు, అంతే” అని చెప్పి ముగ్గురు వెళ్లిపోయారు.

అఖిరా బెంచ్ మీద తల వంచి ఆలోచిస్తోంది.

సత్య వచ్చి, “ఇంకా అదే టెన్షన్ లో ఉన్నావా?” అని అడిగింది.
అఖిరా లేచి, “మరి ఏం చెయ్యమంటావు? సర్ సాయంత్రం వరకే టైమ్ ఇచ్చారు. దానికి తోడు వీళ్లు ముగ్గురు వచ్చి చంపుతున్నారు” అని చెప్పింది.

సత్య, “నువ్వు మళ్ళీ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు కదా!” అనగానే,
అఖిరా తనని చూసింది.
సత్య "చూసింది చాలు, నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు” అని చెప్పింది.
అఖిరా కళ్లు మూసుకుని మళ్ళీ ఆలోచనలో పడిపోయింది.

ఇంతలోనే ఆమె ఫోన్ మోగింది. “నిక్కీ” అని పేరు చూసి,
“ఇంకా పన్నెడే కదా, ఇంత తొందరగా ఫోన్ చేసింది?” అని అనుకుంటూ ఫోన్ తీసుకుంది.

“హలో…” అనగానే —
నిక్కీ, “తక్షణమే హాస్పిటల్ కు రా, అడ్రెస్ పంపించాను” అని చెప్పగానే కాల్ కట్ అయింది.

అఖిరా మళ్ళీ కాల్ చేస్తే, “స్విచ్ ఆఫ్ వస్తోంది.”

సత్య, “ఏవైంది?” అని అడిగింది.
అఖిరా కంగారుగా, “తెలీదు. నిక్కీ ఏదో హాస్పిటల్ అడ్రస్ పంపింది, రమ్మని చెప్పి మాట్లాడే లోపే కాల్ కట్ అయ్యింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తోంది.”
సత్య వెంటనే, “సరే, నువ్వు వెళ్లి ఏంటో చూడు. ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్యి” అని చెప్పింది.
అఖిరా కంగారుగా బ్యాగ్ తీసుకుని, “సరే బై!” అని చెప్పి వెళ్తోంది.
సత్య గట్టిగా, “సరే, జాగ్రత్త! కాల్ చేయి!” అని చెప్పింది.
అఖిరా, “సరే, సరే!” అని చెప్తూ పరుగెత్తుతోంది...


---

ముందుకు కొనసాగుతుంది…


---