Read Mystic Godavari - 2 by rajeshwari shivarathri in Telugu Horror Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

రహస్య గోదావరి - 2

మహీ కి దెయ్యం పట్టింది అని శ్రీరామ్ కి అర్థం అయింది.

ఏం చేయాలో తెలియక శ్రీరామ్ తన స్నేహితునికి ఫోన్ చేశాడు. అతని పేరు శ్రీను. 
తన స్నేహితునికి ఫోన్ చెప్పి ఇక్కడ జరిగిందంతా శీనుతో చెప్పాడు. 

అలాగే మహి వాళ్ళ  తల్లిదండ్రులకు కూడా ఫోన్ చేశాడు.
దానితో వాళ్ళు భయపడుకుంటూ  అస్గుల్ కి వచ్చారు.
మహిని ఎవరికైనా మాంత్రికునికి చూపించాలి అని ఒక మంచి మాంత్రికుడిని ఇంటికి తీసుకొని వస్తారు. 
ఆ మాంత్రికుడు కొన్ని పూజలు చేసి మహిలోని  ఆత్మతో మాట్లాడుతాడు.
నీకు ఏం కావాలి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. 
నాకు  పండ్లు ఫలాలు  ఇంక  ఒక కోడి కావాలి   అని అడుగుతుంది.
నీకు కావాల్సినవన్నీ తెచ్చి ఇస్తాం కానీ నువ్వు మహిని వదిలి వెళ్లాలి అని చెబుతారు. 
దానికి మహిలోని దేయ్యం సరే అని అంటుంది.

దానికి కావాల్సినవన్నీ తెచ్చి ముందు పెడతారు అన్ని తిని  మహి నుంచి ఒక గాలి రూపంలో బయటికి వెళ్ళిపోతుంది.
మాంత్రికుడు శ్రీరామ్ కి "కొన్ని వస్తువులు వాటితో పాటు కొబ్బరికాయ , కోడి గుడ్డు ఇచ్చి" ఇవి మహి నుంచి  తిప్పి  దూరంగా పడేయండి అలాగే  మహిని కొన్ని రోజుల వరకు జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతాడు. 
మీరు చిన్న తప్పు చేసిన మళ్లీ ఆత్మ మహిలోకి ప్రవేశిస్తుంది అని చెబుతాడు. దానికి సరే అంటారు.

పడుకొని ఉన్న మహిని నిల్చోపెట్టి మాంత్రికుడు ఇచ్చిన వస్తువులు  ఆన్నీ మహి చుట్టూ తిప్పి.. మహి వాళ్ళ నాన్న బయట పడేయటానికి  వెళ్తాడు.

చీకట్లో ఊర్లో ఎవరూ లేని చోటు దగ్గరికి మహి వాళ్ళ నాన్న వెళ్తాడు. అక్కడ వాటిని పడవేసి తిరిగి ఇంటికి వస్తుండగా..
ఒక చెట్టు మీద గుడ్లగూబ ఉంటుంది. దానిని మహి వాళ్ళ నాన్న చూస్తాడు. అది కూడా అతనిని చూస్తూ ఉంటుంది. 
ఒక్కసారిగా గుడ్లగూబ "గుబ్బ్ గుభ్ "అని అంటుంది.
ఆ శబ్దానికి  మహి వాళ్ల నాన్న ఉలిక్కి పడతాడు. 
దానితో ఆత్మ మహి వాళ్ళ నాన్నని ఆవహిస్తుంది.

నెమ్మదిగా ఇంటి లోపలికి వస్తాడు వచ్చి కుర్చిలో కూర్చొని ఉంటాడు.
తన ప్రవర్తన చూసి శ్రీరామ్ కు అనుమానంగా అనిపిస్తుంది. 
"ఏమైంది మామ "అని తన దగ్గరికి వెళ్తాడు దానితో ఒకసారిగా తన మాట తీరు అంతా మారిపోతుంది. "నన్ను అంత ఈజీగా పంపి చేద్దామని అనుకున్నారా" అంటూ శ్రీరామ్ మీదికి వస్తాడు.

పక్క రూమ్లో ఉన్న మహికి బయట ఏదో జరుగుతుంది అనుకొని బయటకు పరిగెత్తుకుంటూ వస్తుంది.
తను రాగానే మళ్ళీ మహినాన్న లో ఉన్న ఆత్మ మహి మీదకు వస్తుంది. మహి స్పృహ కోల్పోతుంది.
అప్పుడు  శ్రీరామ్ కి ఏం చేయాలో తెలియక పోవడంతో మాంత్రికునికి ఫోన్ చేయగానే .."సిటీలో ఒక పెద్ద మాంత్రికుడు ఉన్నాడు ..అక్కడికి తనని తీసుకొని వెళ్ళండి.
  తనని కంట్రోల్ చేయడం నావల్ల కాదు అని చెబుతాడు."

తనని ఆ రాత్రే కారులో తీసుకొని ఊరు నుంచి బయలుదేరుతున్నారు.
ఊరు దాటే టైంకి మాహి లోకి ఆత్మ ప్రవేశించి వారు వెళుతున్న కారు ఆగిపోతుంది. "ఏక్కడికి రా నన్ను తీసుకెళ్తున్నారు నేను ఎక్కడికి రాను" అని వారితో  అంటుంది.
తన కండ్లు పెద్దవిగా చేసి "మీరు ఎంత ప్రయత్నించిన  నన్ను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లలేరు" అని వారికి  చెబుతుంది.
ఇంతలో కారులో ఉన్న తన పెద్ద బాబు మహిని  చూసి భయపడి ఒక్కసారిగా తనకి పిడుస  వస్తుంది.

శ్రీరామ్ తన బాబుని చూసి "రాహుల్ రాహుల్" అంటూ అరుస్తూ ఉంటాడు. 
ఇంతలో మహిలోని దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది. 
"రాహుల్ ఏమైంది అంటూ" మాహి తన దగ్గరకు రాహుల్ నీ తీసుకుంటుంది.
శ్రీరామ్ త్వరగా హాస్పిటల్ కి పోనీవ్వు అంటూ శ్రీరామ్ కి  చెబుతుంది.
కారులో ఉన్న వారంతా మహిని భయంతో చూస్తూ ఉంటారు. 
కారు స్టార్ట్ అవుతుందో లేదో అని అనుమానంతో కార్ స్టార్ట్ చేస్తాడు కానీ కార్ స్టార్ట్ అవుతుంది.

వెంటనే దగ్గరలో ఉన్న సిటీకి తీసుకుని వెళ్లి రాహుల్ ని హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తారు.

మహివాల్ల అమ్మని రాహుల్ దగ్గర వుంచి  మహిని మాంత్రికుని దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అని చూస్తారు.

మహికి అబద్ధం చెప్పి బయటికి వెళ్లాలి అని మహిని తీసుకొని హాస్పిటల్ నుంచి మల్లి కారులో బయలుదేరుతారు. మహి తో పాటు శ్రీరామ్ ..మహి వాళ్ళ నాన్న ఇంక శ్రీను ముగ్గురు వెళ్తారు.
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మళ్లీ కారు దారిలో నడి రోడ్డు మీద ఆగిపోతుంది. 

కారు దిగి ఏమైంది అని శ్రీరామ్ వాళ్ళు చూస్తుంటే...
మహి కారు దిగి తను వచ్చిన దారినే మళ్లీ వెనుకకు వస్తూ ఉంటుంది. 
శ్రీరామ్ "మహి ఆగు ఎక్కడికి వెళ్తున్నావ్" అంటూ తన వెనుకే వచ్చి తను చెయ్యి పట్టుకుంటాడు తను ఎంత పిలిచినా అస్సలు రాదు.

పక్కనే వెళ్తున్న ఒక ఆటోను ఆపి అందులో అందరు కలిసి ఎక్కుతారు. 
వీళ్ళు ఎక్కగానే ఆ ఆటో కూడా అసలు స్టార్ట్ కాదు. 
అప్పుడు మహి ఇలా అంటుంది " మీరు ఎంత ప్రయత్నించినా నేను రాను అని" అంటుంది.

ఆటో అతనికి వాళ్ల పరిస్థితి అర్థమయ్యి"నేను మాత్రం రాను సర్" అని చెబుతాడు.

మళ్లీ ఆటో దిగగానే మహి వెనుకకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అందరూ కలిసి తనని చుట్టుముట్టి "రా మహి రా మహి" అని తన చేయి పట్టుకుని లాగుతూ ఉంటారు.
పక్కన ఒక పోలీస్ వ్యక్తి వీళ్లను చూస్తూ ఉంటాడు.

తనను బలవంతంగా లాక్కెళ్ళాలి అనుకుంటున్నారు అనుకోని వాళ్ల దగ్గరకి వస్తాడు. 

"ఏమైంది ఎవరు మీరు అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు" అని వాళ్ళని గట్టిగా అడుగుతాడు.
శ్రీరామ్ పోలీస్ అతనకు జరిగిందంతా చెబుతాడు. 
అయితే మీరు వచ్చిన ఆటో ఏది అని అడుగుతాడు. 

వీలు దిగగానే
ఆటో స్టార్ట్ అవుతుంది అతను వెళ్ళిపోతాడు.
ఏటు చూసిన ఆటో అతను శ్రీరామ్ కి కనిపించడు. 

నిజంగానే సార్ "మహికి దెయ్యం పట్టింది" అని చెబుతాడు.
అయితే ఇక్కడే మా పోలీస్ వెహికల్ ఉంది అందులో తనని తీసుకొని వెళ్ళండి అని పోలీస్ అతను చెబుతాడు.
"థాంక్యూ సార్ "అని చెప్పి అందరూ పోలీస్ జీబూ ఎక్కుతారు.
వీళ్ళు ఎక్కగానే ఆ జీబు కూడా స్టార్ట్ కాదు. 
అప్పుడు ఆ పోలీస్ అతను వీళ్ళు చెప్పిందంతా నిజమే అని నమ్ముతారు. 

కొంచెం దూరంలో బస్టాండ్ ఉంది తనని ఎలాగో అలా బస్ మీద అయిన  మంత్రికుని దగ్గరకు తీసుకొని  వెళ్ళండి".అని చెబుతాడు.

కష్టపడి బస్టాండ్ దగ్గరకి తీసుకొని వెళ్లి బస్సు ఎక్కుతుండగా ఆ బస్సులో ఒక ముస్లిం కండక్టర్ ఉంటాడు. 
మహి ముందు ఇద్దరు ఎక్కుతారు తర్వాత మహి ఎక్కుతుంది. 
మహి ఎక్కగానే ఆ ముస్లిం కండక్టర్ కు ఒళ్ళు ముళ్ళు పెరిగినట్టు అవుతుంది. 

శ్రీరామ్ బస్సులో కూర్చున్న తర్వాత ముస్లిం కండక్టర్ శ్రీరామ్ దగ్గరికి వెళ్లి ఆ అమ్మాయికి ఏం జరిగింది అని అడుగుతాడు.
శ్రీరామ్ ఆశ్చర్యపోయి జరిగిందంతా ముస్లిం కండక్టర్ కు చెబుతాడు. 
" ఇది చాలా పెద్దశక్తి లా వుంది .. ..అంత ఈజీగా పోదు "...నేను ఒకరి అడ్రస్ ఇస్తాను అక్కడికి వెళ్ళండి అని చెబుతాడు. 

మహిని ఆ ఊరిలో ఉన్న ఒక పెద్ద దర్గా దగ్గరికి తీసుకుని వెళ్తారు.

దర్గాలో ఉన్న మాంత్రికుడు మహిని చూసి పూజ ఏర్పాటు చేస్తాడు. 
మహిని కట్టేసి కొన్ని పూజలు చేసి మహిలోని ఆత్మ ను బయటికి పిలుస్తాడు.

"ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు ?ఎందుకు మహినీ ఇబ్బంది పెడుతున్నావు ?అని అడుగుతారు.

"ఎవరు ఎవరి దగ్గరికి వచ్చారు మహినే నా దగ్గరికి వచ్చింది.. మా ఇంటికి వచ్చింది.. అని ఆత్మ సమాధానం ఇస్తుంది.

"నీ పేరేంటి? అని మాంత్రికుడు  అడుగుతాడు.
నా పేరు మహేశ్వరి అని ఆత్మ చెబుతుంది.