Read Unexpected introduction by SriNiharika in Telugu నాటకం | మాతృభారతి

Featured Books
  • అనుకోని పరిచయం

    ️అనుకోని పరిచయం ️మన జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగ...

  • మీరా (One Love, One Revenge) - 1

    భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case...

  • అడవిలోని మిత్రత్వం

    ఒక సుందరమైన, శాంతమైన అడవి. అక్కడ ఒక జింక మరియు ఒక కుందేలు ని...

  • అంతం కాదు - 33

    అదే టైంలో ఆ పడిన నక్కలు విజయ్ మరియు అజయ్ అనే ఇద్దరి అన్నదమ్మ...

  • సిద్ధు కథ.

      ఓ మౌన ప్రేమ గాధ సిద్ధు అనే అబ్బాయి చిన్నప్పటి నుంచే చాలా అ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అనుకోని పరిచయం

❣️అనుకోని పరిచయం ❣️

మన జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగుతాయి అలా జరిగిన పరిచయాలు కొన్ని ప్రేమగా కొన్ని స్నేహంగా కొన్ని బంధం గా ఉంటాయి మరికొన్ని ఎప్పటికీ మర్చిపోలేను తీపి జ్ఞాపకంగా మిగిలిపోతాయి. అలా తీపి జ్ఞాపకంగా మిగిలిపోయిన పరిచయం మాది ఈ జ్ఞాపకాన్ని ఎందుకో తెలియదు ఇలా పంచుకోవాలనిపించింది ఎందుకంటే ఈ జ్ఞాపకాన్ని మళ్లీ తనకి గుర్తు చేయాలని మళ్ళీ నా కథ మొదలు పెట్టాను నా కథ ఇప్పటికీ ఆగిపోలేదు ఎందుకంటే నాలో కథ నడుస్తూనే ఉంది నా ప్రేమకథ దీనికి నేను పట్టిన పేరు అనుకోని పరిచయం.
❣️ అనుకోని పరిచయం❣️

హాయ్ నా పేరు సత్య నాది హైదరాబాద్ నేను ఇంజనీరింగ్ చేస్తున్న మార్నింగ్ క్లాస్ వచ్చేసరికి ఒక డైరీ కనిపించింది. ఆ డైరీ ఎవరిదని అందరినీ అడిగానని అందరూ నాది కాదు అన్నారు అసలు డైరీ ఎవరితో తెలియదు ఆరోజు మొత్తం అందరిని అడిగి చూసా కానీ ఎవరు మాకు తెలియదు అన్నారు అది బ్యాగులో పెట్టుకుని అలాగే ఇంటికి తీసుకొచ్చా తెరిచి చూస్తే అందులో ఒక పేరు కనిపించింది❣️ అనుకొని పరిచయం ❣️కొత్తగా అనిపించింది డైరీ చదవడం స్టార్ట్ చేశా. హాయ్ నా పేరు సంధ్య ఈ అనుకోని పరిచయం నాదే నా జీవితంలో జరిగిన పరిచయం.
❣️అనుకోని పరిచయం ❣️
అనుకొని పరిచయం నాదేంటో వింతగా పేరు కనిపించింది ఇదేంటి అబ్బా ఇలా ఉంది కదా అనుకున్నా సరేలే అని చదవడం మొదలు పెట్టా నా పేరు సంధ్య నేను నా లైఫ్ లో అన్ని కోల్పోయి ఏమీ చేయలేని పరిస్థితిలో చాలా తెలియక ఎందుకు బతుకుతున్నాను అర్థం కాకుండా నన్ను క్షణం ఇది అప్పుడే నాకు పరిచయం అయ్యాడు అర్జున్ నా పేరు వింటే ధైర్యం నమ్మకం ఆ పేరు వినగానే నాలో కలిగే సంతోషం ఆ పేరు కొండంతండ నాకు నా లైఫ్ ఒక అర్థం ఉందని చెప్పింది తనే. అనుకోకుండా పరిచయం అయ్యాడు.
❣️ అర్జున్ తో నా మొదటి పరిచయం ❣️
అనుకోకుండా ఒక రోజు ఇన్స్టాల్ ఒక మెసేజ్ వచ్చింది ఏంటా అని తెలిసి చూస్తే హాయ్ అను అంతే ఎవరబ్బా అనుకున్నా ఎవర్ని ప్రశ్నించినప్పుడు నా పేరు అర్జున్ మాది హైదరాబాద్ అన్నాడు అయితే నాకెందుకు మెసేజ్ చేసావ్ అన్నాను ఓకే మాట్లాడాలనిపిచ్చి చేశాను అన్నారు అలా అనిపిస్తే ఎవరికైనా మెసేజ్ చేస్తావని ప్రశ్నించాను ఏదో మాట్లాడాలని మెసేజ్ చేశా ఇష్టం ఉంటే మాట్లాడొచ్చు లేదా బ్లాక్ చేసుకో అని చెప్పాడు. అలాగే మెసేజులు సాగుతున్నప్పుడు కాల్ చేయమన్నాడు. ఆలోచిస్తూ అలానే ఉండిపోయా..
కాల్ చేయాలా వద్దా అర్థం కాలేదు సరే అని ధైర్యం చేసి కాల్ చేసా కానీ ఎందుకు కాల్ చేసానురా దేవుడా అనిపిస్తుంది ఎందుకంటే పరిచయం లేని అందరూ కొంచెం ఇబ్బందిగా కొంచెం మొహమాటంగా మాట్లాడుతారు తన కొంచెం కూడా మొహమాటం లేదు బాగా మాట్లాడుతున్నాడు చక చక చక మాట్లాడేస్తున్నాడు తను ఏం మాట్లాడుతున్నాడో నాకే అర్థం కాలేదు మాటల్లోనే నవ్వించేసాడు అంతలా నవ్వడం ఒక్క క్షణం ఇన్నేళ్ల నా బాధ నా ఒంటరితనం ఒక్కసారి తను మాట్లాడగానే వెళ్లిపోయాయి చాలా ఆశ్చర్యం వేసింది ఒక్క ఫోన్ కాదు అన్ని మాయమైపోతాయని.
అర్థం కాలేదు ఒక్క ఒక ఫోన్ కాల్ తో కొద్దిసేపు మాట్లాడటం మాట్లాడగానే నా బాధ మొత్తం మర్చిపోయాను అలాంటిది తన లైఫ్ లాంగ్ పక్కన ఉంటే ఇంత బాగుంటుంది అనుకున్నా కానీ ఇలా అనుకోవడం తప్పనిపించింది ఎందుకంటే తన మనసులో ఏముందో తెలియదు అసలు నాకు తన మీద అంత ఇష్టం కూడా లేదని ఒక ఫ్రెండ్ లా అనుకున్నా అలాగే మా ఫోన్స్ సాగుతూనే ఉన్నాయి రోజు గంటలకొద్ది మాట్లాడుకునేవాళ్ళం ఒకరోజు తను నాకు ప్రపోజ్ చేశాడు నేను ఇదేంటి తను ఇలా చేశాడు అనుకున్నా ఒక వైపు ఆనందంగానే ఉంది కానీ ఎందుకో తెలీదు వద్దనిపించింది నాకు ఇష్టం లేదు.
ఎవరైనా ఇష్టం లేదని చెప్తే సరేనా వదిలేస్తారు కానీ తను అలా కాదు ఇష్టం లేదని చెప్పగానే సరే నువ్వు నన్ను ఇష్టపడేలా నేను చేసుకుంటా అన్నాడు నువ్వు ఏమి చేస్తున్నావ్ నేను నీకు పడానని పొగరుగానే చెప్పా నువ్వే నాకు వచ్చి ఐ లవ్ యు చెప్తావ్ అన్నాడు సరే చూద్దాం అన్నా అన్నట్టుగానే త్రీ మంత్స్ లో నచ్చితే ఐ లవ్ యు చెప్పించుకున్నాడు నాకే అర్థం కాలేదు త్రీ మంత్స్ లో వీరికి నేను ఎలా పడిపోయానని ఎంత ఆలోచించి అసలు బుర్రకి ఎక్కలేదు. పడ నా లైఫ్ లోకి రావడమే నా లైఫ్ మొత్తం హ్యాపీగా మారిపోయింది.
అన్నిట్లోనూ సక్సెస్ అయ్యా లైఫ్ లో ఎగ్జామ్స్ లో అన్నిట్లోనూ ఫెయిల్యూర్ అనేది నా పక్కనే లేకుండా పోయింది అసలు వాడు ఎందుకు వచ్చాడో తెలియదు వచ్చాడు నచ్చాడు నా లైఫ్ లో కోల్పోయిన మొత్తం తిరిగి ఇచ్చాడు హ్యాపీగా అనిపించింది 6 మంత్స్ఏ గొడవ లేకుండా ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం ఎప్పుడు కట్టలు కొద్ది మాట్లాడుకునేవాళ్ళం టైం ఎలా గడిచే దో తెలిసేది కాదు కాదు మార్నింగ్ మొదలు పెడితే నైట్ అయినా సరే ఆ ఫోన్లో ముగిసేవి కావు గంటలు కొద్ది మాట్లాడుకోవడానికి టాపిక్స్ ఏమున్నాయి అని అనుకునేదాన్ని.
ఇలానే సాఫీగా సాగిపోతుంది మా ఇద్దరి లైఫ్ ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం ఏ గొడవలు లేకుండా బానే ఉంది. ఇలానే హ్యాపీగా ఉంటే అది లైఫ్ ఎందుకు అవుతుంది లవ్ అంటే గొడవలు ఉండాలి కదా అలా అనుకున్నానో లేదో అప్పుడే మా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి గొడవలకి కారణం కూడా నేనే మా గొడవ ఎలా స్టార్ట్ అయిం ది ఒక మూడో వ్యక్తి వల్ల వాడు ఎవడో కాదు అర్జున్ ఫ్రెండ్ అంట వాడి పేరు కేశవ పేరు తగ్గట్టు మనిషి కూడా ఉన్నాడు ఇద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి.
వాడు కూడా ఆన్లైన్లోనే పరిచయం అయ్యాడు అర్జున్ తెలుసు అన్నాడు కానీ నాకు కేశవ గురించి ఎప్పుడు చెప్పనేలేదు అర్జున్ నా దగ్గర ఏది దాచాడు అన్ని చెప్తాడు ఫ్రెండ్స్ అందర్నీ పరిచయం చేశాడు కానీ కేశవ గురించి మాత్రం ఎప్పుడు చెప్పలేదు నాకు అర్థం కాలేదు ఎప్పుడో తన గురించి చెప్పని వాడు నా దగ్గరకు వచ్చి వాడి ఫ్రెండ్ అని చెప్పడం ఏంటి అని కేశవ నీ అడిగా నీ గురించి నాకు ఎప్పుడూ అర్జున్ చెప్పలేదు. ఒకప్పుడు అర్జున్ ఫ్రెండ్ ని అన్నాడు.
అర్జున్ ఫ్రెండ్ అన్నాడు సరే అనేసి అయితే ఇప్పుడు నాకు ఎందుకు మెసేజ్ చేశారు అని అన్నాను అర్జున్ గురించి నీకు కొన్ని నిజాలు చెప్పాలి అన్నాడు తన గురించి మీరు చెప్పేది ఏంటి అని అన్నాను నేను. అర్జున్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అన్నాడు పిచ్చా నీకు తనకు అలాంటి వాళ్ళు ఎవరూ లేరు సిక్స్ మంత్స్ నుంచి నేను తనతో అన్నా నాకు ఆ మాత్రం తెలీదా నాకు తన మీద నమ్మకం ఉంది అలాంటివేమీ లేవు తనకి తన దగ్గర ఏది దాచాడు అని అన్నాను కావాలంటే నేను ప్రూవ్ చేస్తా అన్నాడు.
ఏమని ప్రూ చేస్తావుఅని అడిగా ఆ అమ్మాయితోనే మాట్లాడిస్తా అప్పుడైనా నమ్ముతావా వాడి చేతుల్లో నీ జీవితం నాశనం అవ్వకూడదని చెప్తున్నా అని అన్నాడు. నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని అన్నాను నీ జీవితం నాశనం అవ్వకూడదని నేను నీకు వచ్చి చెప్తున్నాను నమ్ము అర్జున్ మంచివాడు కాదు అన్నాడు సరే అమ్మాయితో చెప్పించు అన్నాను సరే అని అమ్మాయితో చెప్పించాడు అమ్మాయి కూడా అలానే చెప్పింది అర్జున్ మోసం చేశాడు నేను మోసపోయాను తన అమ్మాయిని అవసరం కోసమే వాడుకుంటాడు అని చెప్పింది.
ఒక్కసారిగా షాక్ అయిపోయాను ఆ అమ్మాయి కాదు ఇంకో ఇద్దరు అబ్బాయిలు కూడా చెప్పారు వాళ్ళతో పాటు మళ్ళీ ఒక అమ్మాయిని కూడా చెప్పింది ఇంతమంది చెబుతున్నారు ఏంటి వీడి గురించి అనుకున్న అలానే నేను సైలెంట్ గా ఉండకుండా అర్జున్ దగ్గరికి వెళ్లి ఏంటి నువ్వు అమ్మాయిని మోసం చేస్తావంట అని చెప్పాను ఎవరున్నారు నీతో నేనేం అలాంటి వాడిని కాదు ఇన్ని రోజులు నాతో ఆ ఆ మాత్రం తెలీదా నా గురించి నీకు అన్నాడు. అయితే వాళ్ళు నా వరకు వచ్చేందుకు చెప్తారని తనతో గొడవ పెట్టుకున్నాం గొడవ పెట్టుకొని ఒక 10 డేస్ నేను తనతో అసలు మాట్లాడలేదు.
టెన్ డేస్ కాస్త రెండు నెలలు అయిపోయాయి ఫోన్ కానీ మెసేజ్ కానీ ఏది లేదు నేను చేయలేదు అనవసరంగా వాడితో గొడవ పెట్టుకున్నాను అనిపించింది కానీ వాడి తో గొడవ పెట్టుకోవడం మంచిది అయింది ఎందుకంటే వాడిని ఎంత ప్రేమిస్తున్నానో ఆ రెండు నెలల నాకు అర్థమైంది వాడు ఫోన్ లేకుండా వాడి మాటలు వినకుండా ఆ రెండు నెలలు చాలా నరకంగా అనిపించాను. వాడికి ఫోన్ చేయకుండా ఉండలేకపోయాను నేను తిరిగి వాడికి కాల్ చేసా.
వీళ్ళిద్దరి పరిచయం 2024 నవంబర్ 29 జరిగింది ఆ అబ్బాయి అమ్మాయికి ప్రపోజ్ చేసింది డిసెంబర్ 4 అమ్మాయి ప్రపోజ్ చేసిందేమో 2025 మార్చ్ 23
తోవలో పుట్టేది తోవలో పెరిగేది తోవలో పోయేవారికి కొంగు పట్టేది ఏమిటది? 🤔
నాయిగో పక్కన పెట్టి మరి వాడికి కాల్ చేస్తే వాడు కాల్ లిఫ్ట్ చేయలేదు మళ్ళీ కోపం వచ్చింది వాడికి ఉందా ఇగో నాకు లేదా అనుకున్నా సరేనా సైలెంట్ అయిపోయా. మళ్ళీ ఫోన్ చేయలేదు. మళ్లీ ఆలోచించ మా ఇద్దరి మధ్య ఈకోలు గొడవలు అవసరమా అనిపించింది సరే అనేసి మళ్ళీ కాల్ చేస్తా ఈసారి కాల్ లిఫ్ట్ చేసాడు కోపం తగ్గిందా అన్నాడు అంటే కోపం తగ్గింది అని అడిగావు కానీ అరే ఫోన్ చేయలేదు టూ మంత్స్ అయింది చేయాలని తెలియదా అని అడిగా ఎందుకు నువ్వు నన్ను విడిచి ఉండలేవని నాకు తెలుసు నువ్వు చేస్తావని సైలెంట్ గా ఉన్న అన్నాడు.
అంటే గొడవపడి ఫోన్ పెట్టేస్తే మళ్లీ కాల్ చేస్తా అని ఎలా అనుకున్నావ్ నాకు తెలుసు నీ గురించి నువ్వు రెండు నెలలుకాదు కదా టూ ఇయర్స్ అయినా నన్ను మర్చిపోనులేవు నాతో మాట్లాడకుండా ఉండనులేవు అన్నాడు ఆ మాటకి ఏడుపొచ్చింది నాకు. వాడిని విడిచి ఉండలేను అని తెలిసి కూడా ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఆ మాటకు మళ్ళీ కోపం వచ్చింది నాకు అంటే నేను నిన్ను విడిచి ఉండలేను అని తెలిసి కూడా నువ్వు నాకు తిరిగి ఫోన్ చేయలేదా అని మళ్ళీ గొడవపడ్డ ఇప్పుడేంటి ఇంకొక సంవత్సరం మాట్లాడవా అని అడిగాడు సరే బాయ్ అన్నాడు.
నాకు చాలా కోపం వచ్చింది బాయ్ అని పెట్టేస్తావ్ ఏంటి అన్నాను నువ్వే కదా ఇప్పుడు మళ్ళీ గొడవ పడుతున్న అన్నాడు ఇప్పుడు నువ్వు పెట్టేస్తే అస్సలు బాగోదు నీకు గొడవ పడితే మాత్రం మాట్లాడవా చూడు గొడవ పడిన తిట్టినా తిట్టించుకున్న సరే మాట్లాడకుండా అసలు ఉండలేను కాదు కూడదని మళ్ళీ నాతో మాట్లాడకుండా ఉన్నావనుకో ఈసారి ఇంటికి వచ్చి మరి కొడతా అన్న అంతే టక్కున నవ్వేశాడు నువ్వు నన్ను కొడతావా అన్నాడు కొట్టనా అన్న సరే సరేలే అన్నాడు దాంతో గొడవ పోయింది. రెండు నెలలు పట్టిందా నీకు నాతో గొడవ పడటానికి మాట్లాడటానికి అన్నాడు.
గొడవ జరిగి రెండు నెలలు అయిపోయిన గొడవని త్వరగానే మర్చిపోయాం మళ్ళీ మామూలుగానే మాట్లాడుకున్నాం అసలు గొడవ టాపిక్ లేదు మళ్ళీ ఒక 10 డేస్ బానే మాట్లాడాను. వాడికి పార్క్ ఉండడం వల్ల నాకు కాల్ సరిగ్గా లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేసినా అప్పుడప్పుడు బిజీ వచ్చేది నాకు మళ్ళీ అనుమానం స్టార్ట్ అయింది మళ్ళీ అడిగా ఏంటి ఎవరైనా అమ్మాయి దొరికిందా అని నాకు ఎవరున్నారు ఆఫీస్ వరకు కొంచెం ఎక్కువ అయింది మరి ఫోన్ బిజీ వస్తుంది అని అడిగా సార్ ఫోన్ చేశారా నన్ను నాడు మీసారా మీ సార్ కి ఇంకేం పని లేదా అన్నాను.
మధ్యలో మా సార్ ఏం చేశాడు అన్నాడు ఏం చేశాడా మీతో మాట్లాడకుండా చేస్తున్నాడు కదా అన్నాను వర్క్ అన్నాడు అంతేలే ఈమధ్య నీకు నాకంటే వర్క్ ఎక్కువ అయిపోతుంది నాకు అసలు టైం ఇవ్వట్లేదు అన్నాను అక్కడితో మళ్ళీ గొడవ స్టార్ట్ చేశా మళ్లీ అనుమానం మళ్ళీ గొడవ ఇలా ఒక టూ త్రీ టైమ్స్ గొడవపడ్డ మళ్లీ 3 డేస్ గొడవ పడుతూనే ఉన్నాం సరిగ్గా మళ్ళీ మాట్లాడుకోలేదు.
ఒకరోజు మార్నింగ్ 6:00 కి కాల్ చేశాడు ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేస్తున్నాడు అనుకున్నా కాల్ లిఫ్ట్ చేస్తే ఈరోజు మొత్తం నీతో మాట్లాడాలి కానీ నేను అడిగిన questions మాత్రం ఆన్సర్ చెప్పాలి అన్నాడు అంతకుమించి ఇంకేం మాట్లాడకూడదు అన్నాడు నేను కూడా సరే అన్న ఏం అడుగుతాడా అని అనుకుంటూ ఏమి అడుగుతాడు అని ఆలోచిస్తూ అలానే కన్ఫ్యూజన్లో ఉన్నా తర్వాత మొదలు పెట్టాడు చూడు ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా చెప్పాలి నిజంగా చెప్పాలి అన్నాడు అబద్దాలు అస్సలు చెప్పద్దు అన్నాడు.
సరేలే అన్న ఇంకేముంది అడిగాడు ఎందుకే నీకు నామీద అంత అనుమానం అన్నాడు అనుమానం అవును నువ్వు పెద్ద సైకో శాడిస్ట్వే అన్నాడు అదేంటి నేను సైకో సడిష్న నాకు అనుమానం ఉందా అన్న మరి అనుమానం కాకపోతే ఫోన్ మా సార్ చేసిన వర్క్ లో బిజీగా ఉంటే వేరే అమ్మాయితో ఉన్నానని అనుమానిస్తున్నావు కదా అప్పుడేమో ఎవరో చెప్పారని రెండు నెలలు నాతో మాట్లాడకుండా అలానే ఉండిపోయావు కదా దీన్ని మరి అనుమానం కాక ఇంకేమంటారు అన్నాడు.
సరే చెబుదామనుకునేసరికి అప్పుడే వాడికి ఫోన్ వచ్చింది సరే నాకు ఆఫీస్ కాల్ వస్తుంది మళ్ళీ చేస్తా అని పెట్టేశాడు. నిజం చెప్పాలంటే వాడి మీద నాకున్నది అనుమానం కాదు చెప్పలేనంత ప్రేమ వాడు నాకు ఎక్కడ దూరం అయిపోతాడు అన్న భయం. మనిషి ఉన్నప్పుడే వాళ్ళ విలువ తెలుసుకోవాలి లేనప్పుడు విలువ తెలుసుకున్న ఏం ప్రయోజనం లేదు అంటారు. అలాగే మనిషి ఎదురుగా ఉన్నప్పుడు ప్రేమ తెలియదు వాళ్ళ దూరంగా ఉన్నప్పుడు తెలుస్తుంది మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ పెంచుకున్నామనేది నాకు ఈ రెండు నెలల్లోనే అర్థమైంది..
వాడు మళ్ళీ కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసా అడిగినదానికి ఆన్సర్ చెప్పలేదు అన్నాడు నా ఇష్టం నిన్ను అనుమానించాలన్న కొట్టాలన్న తిట్టాలన్న ఆ రైట్స్ అన్ని నావి నా ఇష్టం వచ్చినట్టు అనుమానిస్తా ఇష్టం ఉంటే పాడు లేదంటే సైలెంట్ గా ఉండు అన్న అంటే అనుమానించడం కూడా నీ ఇష్టమేనా అన్నాడు మరి నువ్వే నా లైఫ్అనుకున్నప్పుడు అని నా ఇష్టంలే ఉంటాయి కదా అన్న అంటే నా ఇష్టాలు ఉండవా అన్నాడు ఉంటాయి లేవని చెప్పట్లేదు నేను అనుమానిస్తే అంతే.
నీలాంటి సైకోని జీవితాంతం ఎలా భరించాలిరా దేవుడా అన్నాడు అంటే నన్ను భరించవా అన్నాను ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా అన్నాడు అంటే నన్ను భారంగా భావిస్తున్నావా అన్న అమ్మ నేను నిన్ను ఏమీ అనలేదు కదా భరిస్తా తప్పదు ఇంకా నాకు అన్నాడు భరించడం ఎందుకు? వేరే అమ్మాయిని చేసుకోవచ్చు కదా అన్న అయితే చేసుకుంటా ఒక మంచి అమ్మాయిని చూడు అన్నాడు అంటే నన్ను వదిలేస్తావా అంటే వదిలించుకోవాలని ఇంక అమ్మాయిని చూడమంటున్నావ్ కదా అని అడిగా. అయ్యయ్యో నేను మాటవరసకన్నా అన్నాడు మాటవరసకైనా నన్ను వదిలించుకోవాలని కదా అన్నావ్ అన్నాను.
వామ్మో ఈ డైరీ చదువుతుంటే నాకు ఎక్కేలా ఉంది పిచ్చి. ఈ డైరీ చదువుతుంటే నాకే ఇలా ఉంది అంటే పాపం అర్జున్ ఈ డైరీ రాసిన అమ్మాయి నాకు దొరకాలి అప్పుడు చెప్తా.
సరేనే మళ్ళీ డైరీ చదవడం స్టార్ట్ చేశా. నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నావు కదా. బంగారం నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు నేను ఏదో మాట వరస కంటే అదే పట్టుకుంటావేంటి అన్నాడు అయినా సరే నేను నీతో మాట్లాడాలి అనుకోవట్లేదు నువ్వు నన్ను అంత మాట అన్న తర్వాత నేను ఎలా మాట్లాడుతా నీతో నేను మాట్లాడను అన్నాను ఫోన్ కట్ చేసేసా ఒక్క రోజంతా మాట్లాడాలని చెప్పి మార్నింగ్ ఫోన్ చేసి నాతో గొడవ పెట్టుకున్నాడు.
నిజం చెప్పాలంటే గొడవ వాడు పెట్టుకోలేదు వాడు మార్నింగ్ ఫోన్ చేసిquestions అనగానే నాకు కాసేపు వాడితో ఆడుకోవాలనిపించింది కాసేపు ఆడుకుందాం అనేసి నేను కావాలని గొడవ పెట్టుకున్నా నేను చాలా హ్యాపీగా ఉన్న ఫుల్ సాటిస్ఫాక్షన్ దొరికింది నాకు హమ్మయ్య వాడితో గొడవ పెట్టుకొని వాడు బ్రతిమిలాడుతుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఇదిగో తనే కాల్ చేస్తున్నాడు కాల్ లిఫ్ట్ చేస్తా ఏంటో చెప్పు అన్నాను బంగారం సారీ రా ఏదో మాట వరస కన్నా అన్నాడు తెలీదా అదే మాట వెంటనే ఎంత ఫీల్ అవుతాను అని అన్నాను సారీ రా ఇంకెప్పుడు అనను అన్నాడు.
ఇప్పటికే సారీ 100 సార్లు చెప్పాడు సరేలే ఇంకా ఎక్కువ ఏడిపించడం ఇష్టం లేక సరే అన్న. హమ్మయ్య కోపం తగ్గిందా అన్నాడు తర్వాత నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు అయినా ఎవడో చెప్పడని నాతో మాట్లాడకుండా ఉండవు కదా ఇంతకీ చెప్పిన ఎదవ ఎవడు అని అడిగాడు నేను అన్నా అయిపోయింది కదా దానిగురించి ఆలోచన ఎందుకు అన్న సరే అన్నాడు. పక్కనుంచి ఏదో మాటలు వినిపిస్తున్నాయి అది ఒక అమ్మాయి గొంతు పక్కన ఎవర్రా అమ్మాయి అన్న.
అమ్మ వాళ్ళు ఇప్పుడే వచ్చారు అన్నాడు అయితే తీసుకెళ్ళి మా అత్తకి ఇవ్వు మాట్లాడదాం అన్నా మాట పూర్తకముందే తీసుకెళ్లి ఫోను అమ్మ నీ కోడలు మాట్లాడాలంట అని ఫోన్ మా అత్తకి ఇచ్చాడు నాకెందుకు కంగారుపడుతుంది భయమేస్తోంది అసలే మాట్లాడటం ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు మాటలు తడబడుతున్నాయి అలానే కుశల ప్రశ్నలు అడిగాను నా అదృష్టం మా అత్త పనిలో ఉంది సరేనా నేను తర్వాత మాట్లాడతా వాడితో మాట్లాడి ఫోన్ ఇచ్చేసింది..
ఏంట్రా ఫోన్ ఇవ్వమని చెప్పగానే అలా ఇచ్చేసావ్? అరేయ్ నేను ఏం మాట్లాడాలో ఇవతల ఎంత కంగారు పడనో తెలుసా అన్నాను ఏముంది మీ అత్త కదా అలా ఏమీ అనుకోదులే అన్నాడు అంటే మన విషయం ఇంట్లో తెలుసా అన్న మా ఇంట్లో అందరికీ నువ్వు ఓకే అన్నాడు అసలు ఒక్క సారిగా షాక్ అయిపోయా ఇంట్లో గొడవ ఏం జరగలేదా అని అడిగా జరిగింది అన్నారు. ఏమన్నా అన్నారా అని అడిగా.
అయిన ఆన్లైన్లో లవ్ ఏంట్రా? అసలు ఈ మధ్య అమ్మాయిలు ఎవరు బాగోట్లేదు అవసరాల కోసం లవ్ చేస్తూ మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎవరిని నమ్మకూడదు రా అని అన్నారు నేను అన్న అందరూ ఒకేలా ఉండరు కదా అమ్మ ఈ అమ్మాయి అలాంటిది కాదు అని నేను చెప్పాను అన్నాడు మరి మీ నాన్నగారు ఏమి అనలేద అందరూ ఒకటి అన్నారు లవ్ అవి వద్దు ఒక మంచి అమ్మాయి చూసి నీకు పెళ్లి చేస్తాము హ్యాపీగా ఉండొచ్చు అన్నారు లేదమ్మా నేను అమ్మాయిని చేసుకుంటా అన్నా చేసేదేమీ లేక ఒప్పుకున్నారు.
అదేంట్రా రెండు మాటలు ఒప్పేసుకున్నారా అన్నాను అంటే ఇప్పుడేంటి ఇక్కడ గొడవ పడింది జరిగిన మాటలన్నీ పూసకొచ్చినట్టు చెప్పాలంటే నాకు అంత ఓపిక లేదమ్మా ఓపిక ఉన్నప్పుడు తీరిక కూర్చొని నేనేమన్నా అమ్మ ఏమైనది నాన్న ఏమన్నాడు చెల్లి ఏమన్నదిఅని మాట మాటకి అర్థం చెప్తా ఇప్పుడు మాత్రం నన్ను అడక్కే చెప్పే ఓపిక నాకు లేదు అన్నాడు సరేలే అని ఊరుకున్న.
సరేలే అయితే పెళ్లెప్పుడు చేసుకుందాం అని అడిగాడు. పెళ్లా దానికి తొందరేముంది ఒక 10 సంవత్సరాల తర్వాత చేసుకుందాం లే అన్న ఇదిగో పది సంవత్సరాల వెయిట్ చేసి ఓపిక నీకుందేమో కానీ . ఇంకొక క్షణం కూడా వెయిట్ చేసే ఓపిక నాకు లేదమ్మా నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు చేసేసుకుంటా అన్నాడు. సరే రా ఇప్పుడు నువ్వు రాకపోతే మళ్ళీ నాతో మాట్లాడకూడదు అన్న. అలా చెప్పి కాల్ కట్ చేసేసా.
తిరిగి వెంటనే మళ్ళీ కాల్ చేశాడు ఏంటి రావట్లేదా అన్నాను అది కాదు ఇప్పుడు నేను వచ్చి మాట్లాడటం అంటే అన్నాడు నువ్వే కదా ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అని అయితే వచ్చి మాట్లాడు ఒక మంచి రోజు చూసి వస్తా అన్నాడు ఇప్పుడు వస్తున్నావా రావట్లేదా అన్నాను ఒసేయ్ ప్లీజ్ అక్కడికి వస్తానంటే చంపేస్తారు అన్నాడు అంత భయం ఉన్నోడివి ఇప్పుడే చేసుకుంటాను ఎలా అంటావ్ అన్నాను మాటవరసకన్నాను అన్నాడు ఈమధ్య ఒక మాట వరసలు బాగా ఎక్కువ అవుతున్నాయి కాస్త తగ్గించు.
సరేలే ఇక ఎప్పుడు మాటవరసకే అనానను సరేనా అన్నాడు సరే సరే ఇంతకీ పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అన్నా. ఒక మంచి రోజు చూసుకొని ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చేసుకుంటా అన్నాడు మంచి రోజు ఎప్పుడు వస్తుందంట అని అడిగా. పెళ్ళికి నాకంటే తొందరగా నీకు ఎక్కువ ఉంది కదా అన్నాడు మరి ఉండదా నీకు మాత్రం తొందరగా ఉంటదా అన్నాను అదేంటి ఇప్పుడు అన్నావు కదా పదేళ్ల తర్వాత చేసుకుందామని. 10 సంవత్సరాల అంటే పది రోజుల లెక్క పది రోజుల్లో వచ్చి మా ఇంట్లో మాట్లాడు లేకపోతే అస్సలు బాగోదు నీకు అన్న.
ఇదేంటే మరి టెన్ డేస్ ఆ మరీ ఎక్కువ ఏమో 10 నిమిషాలకే సరిపోతుందేమో నీకు ఈ మధ్య ఎటకారం బాగా ఎక్కువ అవుతున్నాయి రా మరి టెన్ డేస్ లో వచ్చి మాట్లాడమంటే.ఏం మాట్లాడాలి అక్కడికి వచ్చి అసలే మీ నాన్నకు కోపం ఎక్కువ మీ అమ్మ ఒప్పుకున్న మీ నాన్న ఒప్పుకుంటాడా లేదా అని భయం. మీ నాన్నకు ముక్కు మీద కోపం నేను చెప్పగానే ఎక్కడ నన్ను పట్టుకొని కొడతాడు అన్న భయంగా ఉందే.
ఇదిగో ఇప్పుడు నువ్వు వచ్చి మాట్లాడలేదు అనుకో మళ్లీ మా నాన్న నాకు ఏదో ఒక సంబంధం తెస్తాడు అప్పుడు నువ్వు తాగి దేవదాసు అవుతావు నేను మా నాన్న మాట కాదనలేక తలకమాసినోడిని చేసుకుని నేను నరకంలోకి వెళ్తా. అప్పుడు సెట్ అవుతుంది ఇద్దరికీ ఏంటే ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మరి చూడు టెన్ డేస్ లో వచ్చి మాట్లాడు టెన్ డేస్ దాటాయా తర్వాత కష్టం. సరేలే అమ్మ వాళ్ళతో చెప్పి వస్తాను అని కాల్ కట్ చేసేసాడు.
నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా త్వరలోనే మా పెళ్లి జరగబోతుంది ఇంకా ఇక్కడ మా నాన్న ఒప్పుకోవాలి నాన్న ఎలా ఒప్పిస్తాడో తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు చూద్దాం అనుకుంటున్నా కానీ అసలు ఆలోచించకుండా ఉండలేకపోతున్నా మా నాన్న ఒప్పుకోలేదు అనుకో ఫ్యామిలీని వదిలి వాడిని చేసుకోలేను అలానే వాడి కోసం ఫ్యామిలీని వదులుకోలేను ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒప్పించి చేసుకోవాలి.
టుడేస్ తర్వాత వాడు కాల్ చేసాడు. ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్లావు నేను ఇంట్లో లేనన్న విషయం నీకు ఎలా తెలుసు అని అడిగా. పెళ్లి గురించి మాట్లాడడానికి ఇంటికి వచ్చాం అన్నాడు నా గుండె ఆగినంత పని అయిపోయింది నేను ఇంట్లో లేనప్పుడు మన పెళ్లి గురించి ఏం మాట్లాడతావ్ రా అని అడిగా. నాకేం తెలుసు నువ్వు ఇంట్లో లేవన్న విషయం నాతో చెప్పావా అని అడిగాడు మరి నువ్వు వచ్చేటప్పుడు నువ్వు నాతో చెప్పు వస్తున్నావా ఏంటి అని అడిగా. ఇప్పుడు ఎక్కడున్నావ్ అన్నాడు ఫ్రెండు పెళ్లిలో అన్న.
ఇప్పుడే ఏ ఫ్రెండ్ పెళ్లి ఉంది నీ ఫ్రెండ్ పెళ్లి నాకు చావుకి వచ్చేలా ఉంది ఫస్ట్ నువ్వు ఇంటికి రా ఇక్కడ మన పెళ్లి గురించి మాట్లాడాలి సరే అక్కడికి వచ్చేస్తాను అన్న త్వరగా రా అన్నాడు సరే అని ఇక్కడ నుంచి బయలుదేరుదాం అనుకున్న సరికి చుట్టూ చుట్టలు వచ్చేసారు ఎక్కడికి వెళ్ళనివ్వలేదు వన్ అవర్ అయిపోయింది ఫోన్ లేదు ఇక్కడ నేను ఫోన్ చేద్దామంటే వీళ్ళు కుదరట్లేదు అక్కడ ఏం జరిగిందో టెన్షన్ టెన్షన్ గా ఉంది. వన్ అవర్ తర్వాత మా డాడీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నాకు. టెన్షన్ పడుతూనే కాల్ లిఫ్ట్ చేసా.
త్వరగా ఇంటికి రా అన్నారు డాడీ కోపంగా మాట్లాడుతున్నారు టెన్షన్ పరిగిపోతుంది ఇక్కడ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళగానే అక్కడ నుంచి బయలుదేరి ఇంటి దగ్గర రావడానికి అరగంట పట్టింది వాడికి కాల్ చేస్తుంటే వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు నేను ఇంటికి వెళ్లేసరికి వాడు అక్కడ నుంచి బయలుదేరుతున్నాడు ఇంట్లో ఏం జరిగిందో తెలియట్లేదు డాడీ కోపంగా మాట్లాడాడు వీడేమో ఇప్పుడే వెళ్ళిపోతున్నాడు. టెన్షన్ ఇంకా పెరిగిపోయింది లోపలికి వెళ్ళా డాడీ కూర్చో అన్నారు వెళ్లి డాడీ పక్కన కూర్చున్నా.
నెక్స్ట్ మంత్ లో పెళ్లి అనుకుంటున్నా. నీకు ఓకే కదా అన్నారు నాన్న అది అర్జున్ అన్న తనతోనే నెక్స్ట్ మంత్ లో పెళ్లి నీకు ఓకేనా అని అడిగారు ఒక్కసారిగా షాక్ అయిపోయా టూ మినిట్స్ తర్వాత షాప్ నుంచి బయటకు వచ్చి ఓకే నాన్న అన్న వెంటనే వాడికి కాల్ చేద్దామని సరేనా నేను మళ్ళీ మాట్లాడతాను అక్కడి నుంచి వచ్చేసా వాడికి కాల్ చేసా. అరేయ్ ఏం చెప్పావో ఏం మాట్లాడావ్ ఒక గంటలో ఎలా ఒప్పించావు అన్న.
నిజం చెప్పనా అన్నాడు రే ఇప్పుడు నేను అసలు నేను టెన్షన్ లో షాప్ లో ఉన్న అసలు ఏం చెప్పవో చెప్పు అన్న మళ్లీ నన్ను తిట్టకూడదన్నాడు స్వామి నిన్ను నేను ఏమీ అసలు ఏం చెప్పను చెప్పు అన్న అది మరేమో మన విషయం మొత్తం చెప్పి మీ నాన్న కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడ అన్నాడు. కాళ్లు పట్టేసుకోగానే ఒప్పేసుకున్నారా. మరి కాళ్లు పట్టుకున్న కూడా ఒప్పుకొని ఉంటారా అన్నాడు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయా.
నిజం చెప్పాలంటే నేను అదృష్టవంతురాలని అసలు మా నాన్న ఒప్పుకుంటారని అసలు అనుకోలేదు ఎప్పుడూ ప్రేమ పనులు చేసుకోకూడదు అవి ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పే మా నాన్న నేను కపిని ప్రేమిస్తున్నాను చెప్పగానే వెంటనే పెళ్లికి ఒప్పేసుకున్నారు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను నేను అనుకున్నట్టే నా ప్రేమలో ఎటువంటి గొడవలు లేకుండా మరి రెండు కుటుంబాలు కలుస్తున్నాయి నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వాలంటే. అర్జున్ నీ ఏడిపించాలిగా మళ్లీ గొడవ పడాలి జీవితాంతం ఇదే టార్చర్ అర్జున్ గాడికి.
ఇద్దరు వ్యక్తులు కలవాలని రాసిపెట్టి ఉన్నప్పుడు. వాళ్ళిద్దరి మధ్య ఎన్ని గొడవలు వచ్చినా ఎన్ని అపార్ధాలు వచ్చినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా వాళ్లని కలవకుండా ఎవ్వరూ ఆపలేరు

❣️అనుకోని పరిచయం ❣️ end