Read Anandi by SriNiharika in Telugu Women Focused | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆనంది





 ప్రేమ   కుటుంబం   భావోద్వేగాలు 


విశాఖపట్నం..

ఒక అందమైన పొదరిల్లు.. ఇంటిని పూలతో అలంకరించడం వల్ల చాలా అందంగా ఉంది..

చుట్టూ పరిసరాలు అన్ని చాలా ఆహ్లాదంగా ఉన్నాయి.. అంతలో ఇంటి ముందు ఆగింది ఒక కార్..

అందులో నుండి ఒక అబ్బాయి దిగాడు.. చూడ్డానికి మంచి కలర్.. చాల బాగున్నాడు అనుకునేల ఉన్నాడు..

ఆ అబ్బాయి అక్కడే నిలబడి ఆ ఇంటిని చూస్తూ ఉండగా బయటికి వచ్చింది ఒక అమ్మాయి ఆ ఇంటి నుండి..

" ఏంటి బావ.. ఎప్పుడు లేనిది ఇక్కడే ఆగిపోయావ్.. లోపలికి రా అత్తయ్య వాళ్ళు ఇప్పటికే ముహూర్తలకి లేట్ అయిపోతుంది అని అంటున్నారు !! " అని అంటూ సిగ్గు పడుతూ తల దించుకుంది.

ఒక్క క్షణం ఆ అబ్బాయికి ఎందుకో మనసులో గిల్ట్ ఫీలింగ్ కలిగి మళ్ళీ మాములు అయింది..

ఆ అమ్మాయి మాటలకి సమాధానం ఇవ్వకుండా వెనక కార్ డోర్ ఓపెన్ చేసి చేయి అందించాడు.

అందులో నుండి ఒక అమ్మాయి దిగింది అతని చెయ్యి పట్టుకుని.. ఆ దృశ్యాన్ని చూసిన మొదటి అమ్మాయి కళ్ళలో నీళ్లు తిరిగాయి..

కానీ వాటిని కనిపించకుండా చేసుకుని " బావ...... తను!! " అని అడిగింది.

" నేను ప్రేమించిన అమ్మాయి.. నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి.. పెళ్లి చేసుకుంటే పెళ్ళాం కాబోయే అమ్మాయి!! " అని చెప్పాడు.

ఒక్కసారిగా భూమి కంపించినట్టు అయింది మొదటి అమ్మాయికి.. కాళ్ళలో సత్తువ లేనట్టు అనిపించింది.. కళ్ళు తిరుగుతున్నాయి.. తన పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టుగా అనిపించింది..

మెల్లగా మాటలు కూడదీసుకుంటు " మరి నన్ను ప్రేమించాను అని చెప్పావు!! " అని అడిగింది బొంగురు గొంతుతో..

" అది.. అప్పుడు అమ్మ వాళ్ళు పెళ్లి పెళ్లి అని అంటూ దొబ్బుతుంటే.. ఇంకా తప్పక నీ పేరు చెప్పాను ఇష్టపడుతున్న అని.. నువ్వు ఇంకా చదువుకుంటున్నావ్ గా అప్పుడు.. అందుకే!!! " అని అన్నాడు తల దించుకుని..

ఎలాగో మాటలు కూడదీసుకుని బాధనంతా లోపలే దాచుకుని " సరే బావ..ఇక్కడ ఎండగా ఉంది.. లోపలికి వచ్చి అమ్మాయిని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేయి.. " అని అంది లోపలికి నడుస్తూ.

వెనకే అనుసరించారు అతను ఆమె..

ఇంటిలోపల మొత్తం పూలతో అలంకారం ఉంది.. నిశ్చితార్థం అని చాలా బాగా అలకంరించారు.. కానీ బంధువులు ఎవరు లేరు.. కేవలం ఇరుకుటుంబాలు మాత్రమే ఉన్నాయి..

లోపలికి ఒకరి చేయి పట్టుకుని వస్తున్న అబ్బాయిని అమ్మాయిని చూసి అందరూ ఆశ్ఛర్యంగా లేచి నుంచున్నారు.

వాళ్ళ ముందు మొఖన బలవంతంగా తగిలించుకుని వస్తున్న అమ్మాయిని చూడగానే పెద్ద వాళ్ళ అందరి మనసుకు బాధతో ముగబోయాయి..

ఇంతలో " వేదాంత్!! " అని బిగ్గరగా వినిపించింది ఒకరి కంఠం..

" అది నాన్న ఈ అమ్మాయి పేరు సుశ్మ.. నేను ఈ అమ్మాయి ఇద్దరం ప్రేమించుకున్నాం.. అందుకే !! " అని అంటూ ఆగిపోయాడు వేద్.

" మరి అమ్ము సంగతి ఏంటి!!! " అని గట్టుగా అన్నారు శ్రీధర్ గారు ( వేద్ నాన్న )

" నేను తనని ప్రేమించలేదు నాన్న!!! "అని అన్నాడు తల దించుకుని.

" మరి.. " అని అంటూ ఉన్న ఆయనని అపుతూ అప్పటిదాకా మూగబోయిన గొంతును మాట్లాడటానికి విప్పింది అమ్ము.

" మామా.. " అని బాధగా పిలిచింది అమ్ము.

" అది కాదురా అమ్ము!! " అని నిరంజన్ గారు అన్నారు( అమ్ము నాన్న )

" ప్లీస్ అప్ప..!! " అని అంది దీనంగా. సైలెంట్ అయ్యారు శ్రీధర్ నిరంజన్ గారు.

" ముందు మీరు ఇక్కడ కూర్చో రండి!! " అని శ్రీధర్ గారిని , నిరంజన్ గారిని పిలుచుకుని వచ్చి సోఫాలో కూర్చోపెట్టి..

పక్కకి తిరిగి " లక్కీ.. వీళ్ళకి కూల్ గా వాటర్ తీసుకురా!! " అని అంది వాళ్ళ అమ్మ లక్ష్మీ తో.

అవిడకి కూడా అప్పటికి కళ్ళ నిండా నీళ్లు నిండిపోయాయి.. ఆవిడ కదలకుండా అలానే నిలబడి ఉంటే " వెళ్లి తీసుకురా లక్కీ!! " అని అంది మళ్ళీ.

ఆవిడ వెళ్తూ ఉండగా " అగు లక్ష్మీ నేను వస్తాను!! " అని అంటూ వెనకే కదిలారు భాగ్య గారు అయిన వేద్ అమ్మ.

వాళ్ళు అలా వెళ్లాక ఒకసారి వేద్ వాళ్ళవైపు చూసి ఇటు నిరంజన్ వాళ్ళ ముందు మోకాళ్లపై కూర్చుంది.

వాళ్ళు బాధగా లక్కీ కళ్లలోకి చూస్తుంటే వాళ్ళ చూపులు తిప్పుకోవాలి అని ఏటో చూసింది.

" చెప్పరా.. ఎం చెప్పాలి!! " అన్నారు శ్రీధర్ గారు అమ్ముని చూస్తూ.

" అది మామా.. " అని ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకుంటూ వదిలి..

" బావ కి సుష్మకి ఇప్పుడే ఈ ముహూర్తానికే ఎంగేజ్మెంట్ చేయండి!! " అని అంది బాధ నిండిన స్వరంతో.

" నువ్వు ఎం అంటున్నావో అర్థం అవుతుందా అమ్ము!! " అని అన్నారు శ్రీధర్ గారు.

" తెలుసు మామా.. బావ ఆ అమ్మాయిని ప్రేమించాడు.. అలాంటిది నాతో ఎలా సంతోషంగా ఉంటాడు.. నన్ను పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీగా ఉండను.. బావ హ్యాపీగా ఉండడు.. వద్దు మామా వాళ్ళని కలిపేయండి!! " అంది కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉంటే వాటిని కనపడకుండా దాచేస్తు.

" నిజంగా నువ్వే అంటున్నావ ఈ మాట!! " అడిగారు భాగ్య గారు వస్తూ..

" ఎస్ అత్త.. నేనే అన్నాను.. " అని అంది లేచి నిలబడుతు.

" అదంతా కాదు.. నేను ఒప్పుకొను!! నా ఇంటికొడలు.. నా కొడుకు పక్కన భార్యగా అమూల్య నే ఉండాలి!! " అని కరాకండిగా అన్నారు శ్రీధర్ గారు.

" అయితే.. నా మాట కూడా వినండి!! " అని ఒకసారి నిరంజన్ లక్ష్మి ల వైపు చూసి..

" బావ కి సుష్మ కి పెళ్లి జరిపించలేదంటే నేను చస్థాను!! " అని అంది ఆవేశంగా..

అందరూ ఒక్క క్షణం నిష్చేస్తులు అయ్యారు.

" ఏంటి నమ్మరా.. " అని అంటూ టక్కున తన గదిలోకి పరుగు తీసింది అమ్ము.

అందరూ కంగారుగా తన వెనకే వెళ్లారు. లోపలికి వెళ్లి తన డోర్ వేసుకుంది.

అందరూ డోర్ ని ఎంత కొట్టిన తెరవలేదు.. వేద్ , నిరంజన్ గారు ఇద్దరు కలిసి విండో సైడ్ వెళ్లారు.

అక్కడ ఫ్రూట్స్ లో ఉన్న కత్తిని తీసుకుని వాళ్ళని చూసింది అమ్ము.

" అమ్ము.. ఎం చేస్తున్నవ్ రా!! " అని అడిగారు.

" అది కాదు.. అప్ప.. అందరిని ఇక్కడికి తీసుకు రండి!! " అని అంది.

వేద్ వెళ్లి అందరిని తీసుకుని కిటికీ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అమ్ముని చూసి అందరూ కంగారుగా ఉంటే..

" చూడండి.. ఇప్పుడే ఇక్కడే బావకి , సుష్మకి పెళ్లి జరగాలి.. లేదంటే నేను చచ్చిపోత.. " అని అంది కత్తిని మేడ దగ్గర పెట్టుకుంటు.

" ఎం అంటున్నావ్ అమ్ము.. నా పెళ్లి కోసం నువ్వు ఛావడం ఎన్టీరా!! " అని అడిగాడు వేద్.

" నువ్వేం మాట్లాడకు బావ!! " అని అంటూ వెళ్లి తన కబోర్డు లో వేద్ తో కట్టించుకోవాలి అని ఆశగా కొన్న తాళిని తీసుకుని వచ్చింది.

"ఇప్పుడే ఈ క్షణమే నువ్వు సుష్మ మెడలో తాళి కట్టాలి.. లేకపోతే నేను నిజంగా చచ్చిపోతాను.. నేను ఒకసారి ఏదైనా చెప్తే చేస్తాను.. అది నీకు తెలుసు కదా!! "అని అంది ఆవేశంగా.

వేద్ కి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. సుష్మ అప్పటికే ఏడుస్తుంది..

" అమ్ము.. వద్దురా.. " అని అంటూ ఉన్నారు మిగిలిన వాళ్ళు..

" బావ.. నువ్వు కట్టు!! " అని అంది ఇంకా ఆవేశంగా.

వేద్ ఇంకేం చేయలేక సుష్మ మెడలో మూడు ముళ్ళు వేసాడు.. అది చూసిన అమ్ము ఒకసారి చిన్నగా నవ్వి.. గట్టిగా కళ్లు మూసుకుని తన చేతి మణికట్టు పై సుకుంది..

అది చూసిన అందరూ ఇంకా షాక్ అయిపోయారు.. వేద్ ఒక్కసారిగా లోపలికి వెళ్ళి తలుపుని విరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు..

ఒక పది నిమిషాలకి అది ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళాడు. అప్పటికి కళ్ళు తిరిగి పడి ఉంది అమ్ము.

తనని లేపి ఎత్తుకుని వెంటనే కార్ దగ్గరికి వెళ్ళాడు. వెనకే సుష్మ కూడా ఉంది..

ఆ వెనకే కంగారుగా వెళ్లారు అమ్ము పేరెంట్స్ అండ్ వేద్ పేరెంట్స్ వెళ్లారు.

" అమ్ము.. కళ్ళు తెరవవే నువ్వు ఇలా ఉంటే చూడ్డానికి నాకు ఏడుపు వస్తుంది.. నీ బెస్ట్ ఫ్రండ్ ని వదిలేసి అలా వెళ్లిపోతవ.. నువ్వు లేకుండా నేను ఎలా ఉండనే.. నువ్వు ఇచ్చినదే ఈ జీవితం ఈ హ్యాపీనెస్ అంత.. ఇది నీ ప్రాణమే తీస్తుంది అని తెల్సి ఉంటే నేను అసలు కోరుకునే దానిని కాదు!!! " అని అంది సుష్మ ఏడుస్తూ.

పక్కన వేదాంత్ కి కూడా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.. స్పీడ్ గా వెళ్తున్నాడు..

వెనకే ఇంకో కార్లో వీళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు.. అందరికి చాలా కంగారుగా గాభరాగా ఉంది.

ఒక పదిహేను నిమిషాలకి హాస్పిటల్ ముందు కార్ ఆగింది. వెంటనే అమ్ము ని ఎత్తుకుని హోపైటల్ లోపలికి పరుగు అందుకున్నాడు.

వెనకే సుష్మ కూడా ఏడుస్తూ వెళ్ళింది.. లోపల డాక్టర్ కి చెప్పేలోపు వాళ్లే వచ్చి అమ్ముని icu కి తీసుకెళ్లారు.

ఫస్ట్ ఎయిడ్ చేసి తనకి బ్లడ్ ఎక్కించారు. అక్కడే ఒక నర్స్ ని పెట్టి చూసుకోమని చెప్పి బయటికి వచ్చాడు డాక్టర్..

" డాక్టర్.. అమ్ము.. అమ్ము.. కి ఎలా ఉంది!! " అని కంగారుగా అడిగాడు వేద్.

" షి ఇస్ ఆల్రైట్.. బ్లడ్ కాస్త ఎక్కువ పోయింది అందుకే బ్లడ్ ఎక్కించాం.. షి విల్ బి ఒకే ఇన్ టు డేస్.. " అని వేద్ భుజం తట్టి వెళ్ళిపోయాడు డాక్టర్.

అక్కడే.దిగులుగా కూర్చున్నదరు వేద్ అండ్ సుష్మ.

తన కేబిన్ కి వచ్చిన డాక్టర్.. ఫోన్ తీసి ఒక నెంబర్ కి కాల్ చేసి అమ్ము సూసైడ్ మేటర్ చెప్పాడు..

అవతలి వ్యక్తి ఎం చెప్పాడో కానీ..

" ఇప్పుడు వద్దు.. తన పేరెంట్స్ అందరూ ఉన్నారు.. నిగబెట్ ఒక 10 అలా రా.. " అని చెప్పి కాల్.కట్ చేసాడు డాక్టర్ రాహుల్.

icu దగ్గర కూర్చున్న వాళ్ళ.దగ్గరికి వచ్చారు పెద్దవాళ్ళు. ట్రాఫిక్ వల్ల కాస్త లేట్ అయింది..

డోర్ బయటే నిలబడి అమ్ముని చూస్తూ కన్నీరు పెట్టుకున్నారు లక్ష్మీ , భాగ్య గార్లు..

నిస్సహాయంగా కూర్చుండిపోయారూ నిరంజన్ అండ్ శ్రీధర్ గారు.. ఏడుస్తూ ఉన్న సుష్మ ని దగ్గరికి తీసుకుని ఇంకో మూలలో కూర్చున్నాడు వేద్.

అలా నైట్ అయింది.. బలవంతంగా ఇంటికి పంపారు వేద్ పెద్దవాళ్ళని.. వాళ్ళు అక్కడే ఉండి జాగ్రతగా చూసుకుంటాం అని మాట ఇచ్చాక..

ఎంతైనా వేద్ అండ్ అమూల్య చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రండ్స్ గా ఉండటం వల్ల ఒక నమ్మకంతో వెళ్లారు.

టైం రాత్రి 10 గంటలు..

సుష్మ కి కళ్ళు తిరుగుతున్నాయి అని తనని తీసుకుని హాస్పిటల్ కాంటీన్ కి వెళ్ళాడు వేద్.

వాళ్ళు అలా వెళ్లగానే.. హాస్పిటల్ బయట ఒక బెంజ్ కార్ ఆగింది.. అందులో నుండి ఒక అరడుగుల అబ్బాయి..

బ్లాక్ షర్ట్ అండ్ బ్లూ జీన్స్ వేసుకుని పైన బ్లాజర్ వేసుకుని.. గోగుల్స్ పెట్టుకుని.. తెల్లని శరీరం.. మంచి బాడీ.. డైలీ జిమ్ చేస్తాడు అన్నట్టు గుర్తుగా కండలు..

కార్ ని పార్క్ చేయమని ఇచ్చేసి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళాడు. స్పీడ్ గా రిసెప్షన్ దగ్గరికి వెళ్లి .

" ఆమ్ము.. అమూల్య.. అనే ఆమెని ఏ రూంలో ఉంచారు.. " అని కంగారుగా అడిగాడు.

" సర్.. 5th ఫ్లోర్ లో ఐసీయూలో ఉన్నారు!! " అని చెప్పింది.

చెప్పడమే ఆలస్యం అన్నట్టు పరుగు అందుకునాడు ఆ అబ్బాయి.. లిఫ్ట్ కోసం ఆగలేక.. స్టెప్స్ మీద ఐదు అంతస్తులు వెళ్ళాడు.

ఐదో అంతస్తులో ఒక రూమ్ బయట తన ఫ్రండ్ రాహుల్ ఉండటం చూసిన అతను.. ఇంకా కంగారుగా అక్కడికి పరిగెత్తాడు..

అక్కడికి వెళ్ళేసరికి రాహుల్ కాల్ మాట్లాడుతూ ఉండటంతో.. పక్కకి చూసాడు..

రూంలో పడుకుని ఒక పక్కన చేతికి సెలైన్ బాటిల్ పెట్టుకుని స్పృహలో లేకుండా ఉన్న అమ్ము కనపడగానే అతని ప్రాణం తనలో నుండి లాగేసినట్టుగా అక్కడే మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు..

తలపై చేతులు పెట్టుకుని దీనంగా అమ్ము ఉన్న రూంలోకి చూస్తుండిపోయాడు

అతను కూర్చున్న సౌండ్ కి వెనక్కి తిరిగిన రాహుల్ కి అక్కడ అతను కనిపించేసరికి కంగారుగా తన దగ్గరికి వెళ్ళాడు.

"రెయ్ ఏంట్రా.. ఇది!! "అని అన్నాడు బాధగా రాహుల్ భుజంపై చేయి వేస్తూ..

" నేను ముందే చెప్పానురా.. తనకి.. మీ బావ నిన్ను ప్రేమించట్లేదు అని!!! " అని అన్నాడు అతను ఇంకా బాధగా కళ్ళలో వస్తున్న నీళ్లను చేతితో తుడుచుకుంటూ..

ఏడవడం వల్ల తెల్లగా ఉన్న మొహం ఎర్రగా కందిపోయింది.. కళ్ళు కూడా ఎరుపు రంగుని పూసుకున్నాయి..

" రేయ్.. ఒక్కసారి తనని చూడ్డానికి వెళ్తానురా!!! " అని చాలా బాధగా దీనంగా అంటున్న అతన్ని చూస్తూ ఉంటే రాహుల్ కి కన్నీళ్లు ఆగలేదు..

" వేళ్ళు!! " అని తనని లోపలికి పంపాడు..

అతను మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ.. తడపడుతున్న అడుగులతో ఎక్కడ తన ప్రాణం తన నుండి దూరం అవుతుందో అన్న భయాన్ని గుండెల్లోనే దాచేస్తు వెళ్ళాడు.

చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము చేతులని పట్టుకున్నాడు.. అలానే చూస్తూ నిలుచున్నాడు..

అతని కనీళ్లు అమ్ము చేతిపై పడ్డాయి.. ఆ కన్నీళ్ల వేచ్చదనానికి ఏమో.. అమ్ములో చిన్నగా ఒక కదలిక వచ్చింది..

అది చూసిన అతని పెదాలపై ఆరునెలల తరువాత చిరునవ్వు పూసింది..

బయట నుండి ఇదంతా చూస్తున్న రాహుల్ " ఎలారా... ఇంత ప్రేమని ఇవ్వగలుగుతున్నావ్!! " అని అనుకోలేకపోయాడు..

చిన్నగా తన మొహాన్ని అమ్ము మొహానికి దగ్గరగా తెచ్చి రెండోసారి అమ్ము కి తెలీకుండా తన నుదిటిని అతని పెదవులతో స్పృశించాడు.

" ఇలాంటి పని చేస్తావ్.. అని తెల్సి ఉంటే.. నీకు దూరంగా వెళ్ళేవాడిని కాదు కదరా.. అమ్ము!! " అని ప్రేమగా ఆమె చెవుల దగ్గర చెప్పాడు.

ఇంతలో రాహుల్ లోపలికి వచ్చి "రెయ్.. వేద్ వస్తున్నాడురా!! " అని అనేసరికి మరోసారి అమ్ము వంక ప్రేమగా చూసి కన్నీళ్ళతో వేను తీరిగాడు అతను.

బయటికి వచ్చి ఎవరికి అనుమానం రాకుండా తన కన్నేళ్ళు ఎవరికి కనిపించకుండా గోగుల్స్ పెట్టుకుని బయటికి నడిచాడు.

ఇంతలో ఏల్ళడా కొంతమంది అతనిని గుర్తు పట్టి " సర్.. సర్.. " అని అంటూ వచ్చేసరికి " సోరి.. ఐ చణ్త్ నౌ.. "అని చెప్పేసి తన కార్ ఎక్కాడు.

పక్కనే ఉన్న ఇంకోరు " ఎవరి ఆయన.. " అని ఆడిగేసరికి..

" AG సొల్యూషన్స్ కి చైర్మన్.. వాళ్ళ ఫాథర్ కి ఉన్న కంపెనీస్ అన్నిటినీ వదిలేసి కొత్తగా ఒక కంపనీ పెట్టి దానిని కేవలం వన్ ఇయర్ లో నెంబర్ వన్ పోసిషన్ కి తెచ్చాడు.. ఒక ఆర్ఫోనేజ్ ని అడాప్ట్ చేసుకుని పిల్లలందరిని చదివిస్తున్నాడు.. " అని చెప్పారు ఇంకోరు..

" గ్రేట్!! " అనుకుని ఊరికే ఉండిపోయారు..

అక్కడ కార్లో వెళ్తున్న అతను.. తన పేరెంట్స్ కి కాల్ చేసి "ఇంటికి వస్తున్న.. మా.. నిన్ను డాడ్ ని చూడాలి అని ఉంది.. నీ వళ్ళో పడుకోవాలి అని ఉంది.. " అని బాధగా చెప్పి ఇంటి వైపు పయనం అయ్యాడు..

ఇంటికి వెళ్లిన నిరంజన్ బెంగళూరు లో ఉన్న తన కొడుక్కి కాల్ చేసాడు..

కాల్ లిఫ్ట్ చేసిన కొడుకుని బాధగా " ఆదిత్య.. " అని పిలిచారు.

తండ్రి పిలువులో బాధ గమనించిన ఆది కంగారుగా " ఏమైంది నాన్న.. అందరూ బాగానే ఉన్నారు కదా!! " అని అడిగాడు..

"లేదురా.. ఎవరు బాలేరు.. మన అమ్ము సూసైడ్ చేసుకుందిరా.. "అని జరిగిందంతా చెప్పారు!!

అంత విన్న ఆది " నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యి మార్నింగ్ కి వచేస్తాను.. " అని చెప్పి కార్ కీస్ తీసుకున్నాడు..

కార్లో కూర్చుని ఫోన్ తీసుకుని ఒక నెంబర్ కి కాల్ చేసాడు.. అటు వైపు రింగ్ అవుతున్న సౌండ్ వినపడింది.. కాల్ లిఫ్ట్ చేయగానే.

" నేనేం చెప్పాను.. నువ్వేం చేసావు.. అమ్ము సూసైడ్ చేసుకుంది.. నాకెందుకు చెప్పలేదు.. " అని అడిగాడు రాహుల్ ని..

" హ.. ఫస్ట్ వాడికి చెప్పాను!! "అన్నాడు రాహుల్.

" ఏంటి!!!!!!!!! " అని గట్టిగా అంటూ కార్ బ్రేక్ వేసాడు ఆది.

" కూల్ రా.. ఎవరు చూడలేదు వాడ్ని.. అందరూ వెళ్లాక వచ్చాడు. అమ్ముని చూసి కాసేపు ఉండి వెళ్ళిపోయాడు.. " అని చెప్పాడు.

" ఇప్పుడు అమ్ము సిట్యుయేషన్ ఏంటి!! " అని అడిగాడు.

"బాగుంది.. కాని లేచాక ఎం అవుతుందో ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు.. సడన్ గా తన ఎనిమిదేళ్ల ప్రేమ ఇకపై తనది కాదని.. తెలిస్తే తట్టుకోలేదేమో!! " అన్నాడు బాధగా..

" అయితే.. దానికి ఒకటే పరిష్కారం.. నేను అక్కడికి వచ్చాక మాట్లాడుదాం.. "అని మళ్ళీ కార్ స్టార్ట్ చేసి స్పీడ్ పెంచుతూ వైజాగ్ వైపు పరుగు పెట్టించాడు కార్ ని..

వేద్ వాళ్ళు అమ్ము ఉన్న రూమ్ బయటే కుర్చుని సుష్మ ని చూస్తూ పరిస్థితి ఇంతదాకా రావడానికి కారణం గురించి తలుచుకుంటూ ఉన్నాడు..

పక్కనే ఉన్న సుష్మ వేద్ భుజం పై తల పెట్టి అమ్ము తన జీవితంలోకి ఎలా వచ్చిందో ఆలోచూస్తూ తన లైఫ్ గురించి ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది..

మీకు నేను చెప్తా🙋🏻‍♀️.. వాళ్ళని ఎందుకు ఊరికే ఇబ్బంది పెట్టాలి💁🏻‍♀️

--//--

రామకృష్ణ , సీతాలక్ష్మి లకి ఒక కూతురు ఒక కొడుకు..

వాళ్లే భాగ్య , నిరంజన్.. ఇద్దరు అక్కతమ్ముళ్ళు..

నిరంజన్ లక్ష్మిలకి ఒక కొడుకు ఆదిత్య.. కూతురు అమూల్య..

శ్రీధర్ భాగ్యలకి ఒక కొడుకు వేదాంత్..

నిరంజన్ గారు రెవిన్యూ లో వర్క్ చేస్తారు.. శ్రీధర్ గారు ఇంగ్లీష్ లెక్చరర్..

చిన్నప్పటి నుండి అమ్ముది చాలా సెన్సిటివ్ మెంటలిటీ.. తనకి ఏమైనా నో ప్రాబ్లమ్.. కానీ.. తను ఇష్టపడేవాళ్ళకి.. తన అనుకున్న వాళ్ళకి ఎం అయిన తట్టుకోలేదు చాలా సున్నితత్వం.. దానికోసం ఏమైనా చేస్తుంది..

వేద్ కూడా చాలా.మంచివాడు.. కానీ తనకోసం ఆలోచించాకే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాడు..

ఆదిత్య చిన్నప్పటి నుండి ఎక్కువ హాస్టల్ లోనే ఉండేవాడు.. కారణం ఇంట్లో కుదురుగా ఉంటూ చదువేవాడు కాదు.. కానీ వేద్ అండ్ ఆది మంచి ఫ్రండ్సే ఇద్దరు..

అప్పుడు వేద్ కి 15 ఏళ్ళు.. అమ్ముకి పదేళ్లు.. అందరూ కలిసి గుడికి వెళ్లారు..

అక్కడ గుడి మెట్ల దగరా ఒక పదెళ్ల పాప బిక్షం అడుగుతూ కనిపించింది..

తనని చూడగానే అమ్ముకి పాపం అనిపించి.. వాళ్ళ నాన్నతో తనని ఇంటికి తీసుకెళ్దాం అని అడిగింది..

ఆయన కూతురు మాట కాదనలేక ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెల్లారూ.. తనని అడాప్ట్ చేసుకున్నారు..

తమ దగ్గరే పెట్టుకుని చదివించారు అమ్ముతో సమానంగా పెంచారు. సుష్మ కూడా అమ్ముని తన సొంత అక్కలానే చూసుకునేది..

వేద్ చదువు కోసం వేరే ఊరిలో ఉంటూ చదువుకునేవాడు.. దాదాపు ఒక ఐదేళ్లు ఎక్కువగా వచ్చేవాడు కాదు..

తను వచ్చినప్పుడు అమ్ము సుష్మ ఉండేవారు కాదు రామకృష్ణ గారి దగ్గరికి వెళ్లేవారు..

అలా వేద్ తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చేసరికి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ కనిపించారు సుష్మ , అమ్ములు..

తొలి చూపులోనే వేద్ కి నచ్చేసింది సుష్మ.. చాలా అందంగా కనిపించింది..

అమ్ము కూడా చాలా అందంగా ఉంటుంది.. కానీ ఎందుకో వేద్ మనసు సుష్మ నే కోరుకుంది.. ఆ విషయం ఎప్పుడు చెప్పలేదు..

వేద్ అక్కడే ఒక కంపెనీ లో జాబ్ చేసేవాడు.. అమ్ము కూడా వేద్ ని తన నడవడికని చూసి ఇష్టపడింది.. సుస్మా కూడా ఇష్టపడిన ఎప్పుడు చెప్పలేదు..

ఆదిత్య కూడా హాలిడేస్ కి మాత్రమే వచ్చేవాడు.. మెడిసిన్ కోసం బెంగళూరు లో ఉండేవాడు హాస్టల్ లో.. కానీ చెల్లెల్లు అంటే చాలా ఇష్టం..

ముగ్గురు ఎవరి ప్రేమని వాళ్ళలోనే దాచుకున్నారు.. సుష్మ కి జాబ్ వచ్చి వేరే ఊరికి వెళ్ళింది..

అమ్ముకి వచ్చిన పేరెంట్స్ ని వదిలి వెళ్లలేక వదులుకుంది.. సుష్మ వెళ్ళాక అక్కడే ఉండలేని వేద్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి చాలా తంటాలు పడి సుష్మ ఉన్న ప్లేస్ కి వెళ్ళాడు.

అక్కడే కొన్నిరోజులకి ఇద్దరు ఒకరి ప్రేమని ఒకరు తెలుపుకున్నారు.. అప్పుడే ఇంటినుండి ఫోన్ వచ్చింది వేద్ కి..

"నీకు అమ్ముకి రెండురోజుల్లో ఎంగేజ్మెంట్ అని.. " భాగ్య చెప్పిన మాటలకి కాళ్ళ కింద భూమి స్తంభించింది..

సుష్మకి కూడా చెప్పి ఇంట్లో ఒప్పించాలి అని అనుకున్నారు..

" అసలు నువ్వెలా ఒకే అన్నావు.. అమ్ముతో.. "అని అడిగిన సుష్మ క్వశ్చన్ కి..

" ఒకసారి అమ్మ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది.. కానీ అప్పుడు నువ్వు ఇంకా చదువుకునే దానివి.. అందుకే.. నేను ఒకరిని ప్రేమిస్తున్న అని చెప్పాను.. " అని చెప్పాడు వేద్.

" ఎవరా అమ్మాయి.. " అని అడిగారు భాగ్య గారు..

" నాకు చిన్నపాటి నుండి తెలిసిన అమ్మాయే.. " అని అన్నాడు..

" మన అమ్ము నా !! " అన్నారు ఆవిడ..

" హ్మ్మ్.. అమ్మునే!! " అన్నాడు వేద్ కూడా వేరే చెప్పలేక..

" ఓహ్.. అలాగే!! " అని ఆమె నవ్వుతు బయటికి వచ్చి "వేద్ మన అమ్ముని ఇష్టపడుతున్నాడు.. అందుకే అమ్ము చదువయ్యాక చేద్దాం.. "అని చెప్పారు..

అదంతా దూరం నుండి విన్న అమ్ము ఆనందానికి హవదులు లేవు.. చాలా సంతోషించి బాగా చదువుకుంది..

ఇది జరిగింది..

ఆ తరువాత నిశ్చితార్థం రోజు వేద్ ఇంటికి వెళ్లాక జరిగింది మోత్తం నీకు తెలుసు..

ఇదండీ జరిగింది..

ఇంకా ప్రేసేంట్లోకి వచ్చేదాం..

ఇంటికి వెళ్లిన అతను.. తన తల్లిని చూడగానే ఆమెను హత్తుకుని తనివితీరా ఏడ్చాడు..

ఎన్నోరోజుల దుఃఖం అది.. అలా ఏడుస్తున్న కొడుకుని చూసి ఆమె కూడా కన్నీరు పేట్టుకున్నారు..

వీళ్ళని చూసిన ఆమె భర్త కూడా కన్నీరు పెట్టుకున్నారు.. ఆ రాత్రి వాళ్ళ అమ్మ వడిలోనే నిద్ర పోయాడు అతను..

ఆ రాత్రి అందరికి కాళ రాత్రే అయింది...

--//--

మరుసటి రోజు..

భారంగా కళ్ళు తీరుస్తున్న అమ్ము కి కళ్ళ ముందు కనిపించింది అతని రూపం..

బాధగా ప్రేమనంత తన కళ్ళలోకి నింపుకుని తననే చూస్తున్నాడు.. ఎప్పుడు అల్లరిగా నవ్వే కళ్ళలో ఈసారి బాధ , ఆవేశం , కన్నీళ్లు కనిపించాయి..

తను చూస్తుంది నిజమా అబద్ధమా అని కళ్ళు నులుముకుంది.. చితంగా ఈ సారి అతను కనిపించలేదు..

" ఇదేంటి ఇలంటూ భ్రమ!! "అనుకుని లెవడానికి ట్ర్య్ చేస్తుంటే స్లిప్ అయింది..

వెంటనే వచ్చి పట్టుకున్నాయి రెండు చేతులు.. పట్టుకున్న వ్యక్తిని చూసి తల దించుకుంది..

బాధ ప్లస్ కోపంతో తననే చూస్తున్న ఆది ని చూస్తుంటే తల ఎట్టలేకపోయింది.

" ఎందుకే ఇలా చేసావు!! " అని అడిగాడు బాధగా..

" ఆ టైం లో ఎం చేయాలో అర్థం కాలేదు అన్నయ్య.. సుష్మ మెడలో బావ తాళి కడుతుంటే నా మనసు ఆగలేకపోయింది.. నాకు మళ్ళీ జీవితం ఇది కనిపించలేదు.. అందుకే అలా. చేసాను.." అని అంది తల దించుకుంటు మళ్ళీ..

"అలాంటిది ఎందుకురా వాళ్ళకి పెళ్లి జరగాలి అని అంత పట్టు పట్టావు!! "అని అడిగాడు

" నా ప్రేమ గెలవలేదని.. తన ప్రేమని ఓడించలేను గా అన్నయ్య.. అది కాకా ఆ బాద్ మరొకరికి ఇవ్వలేను.. భరించడానికి చాలా కష్టంగా ఉంది!! "అని అంది కన్నీళ్లు వస్తుంటే..

ఎందుకో ఆ క్షణం అమ్ము కళ్ళ ముందు అతని రూపమే వచ్చిపోయింది..

" ఎడవకురా.. అంత మన మంచికే అనుకో.. "అని కన్నీళ్లు తుడిచాడు ఆది.

" సరే.. నిన్ను డిశ్చార్జ్ చేస్తారట.. పదా!! "అని నెమ్మదిగా లేపాడు.

అమ్ము కూడా ఆది సపోర్ట్ తీసుకుని లేచింది.. మెల్లగా నడిపించుకుంటు కార్ దగ్గరికి తీసుకెళ్లాడు..

ఇంటికి వెళ్లారు.. వేద్ అండ్ సుష్మ తో సహా..

ఇంటికి వెళ్లాక భాగ్య గారు హారతి ఇవ్వబోతుంటే.. సుష్మ అండ్ వేద్ లని పిలిచి వాళ్లకి ఇప్పించింది..

ఆ తరువాత అందరిని హాల్లో కూర్చోపెట్టి " ప్లీస్ మీరు వీళ్ళ పెళ్లిని ఆక్సిఫ్ట్ చేయండి!! "అని ప్రాధేయ పడింది..

వాళ్ళు కూడా ఇంకా తప్పక ఒప్పుకున్నారు.. అమ్ము నవ్వుతూ తన రూంకి వెళ్ళిపోయింది..

అలా ఒక వారం రోజులు చాలా భారంగా గడిచింది.. అమ్ము కూడా ఎక్కువ అందరితో కలవలేక ఒంటరిగా రూంలోనే ఉండేది..

ఇంతకుముందు ఉన్న చలాకి తనం లేదు.. సరిగ్గా తినక.. నిద్రలేక చాల తగ్గిపోయింది..

తన పరిస్థితి గమనించిన ఆది అతనికి కాల్ చేసి అంత చెప్పాడు.. అతను కూడా ఒకే అన్నాడు హ్యాపీగా.

అలా రెండు రోజుల తరువాత బీచ్ కి వెళ్ళింది ఆది తో.. అక్కడే ఇసుక తిన్నెల్లో కూర్చుని సముద్రపు అలలని చూస్తూ ఉన్న అమ్ము పక్కన వచ్చి కూర్చున్నాడు అతను..

పక్కన ఎవరో కూర్చున్నారని పక్కకి తిరిగిన తనకి అతను కనిపించేసరికి..

అప్రయత్నంగా తన నోటి నుండి " గౌతమ్.. " అన్న పేరు పలికింది..

అమ్ము నోటినుండి తన పేరు చాలా కొత్తగా వినిపించింది గౌతమ్కి.. కళ్ళు మూసుకుని ఆ ఫీల్ ని ఫీల్ అవుతూ ఉన్నాడు.

"సోరి గౌతమ్!! " అని అంది బాధగా..

"ఎందుకు అమ్ము.. "అన్నాడు చాలా ప్రేమగా..

" నా వల్ల నువ్వు చాలా బాధ పడ్డావు.. చాలా అవమాన పడ్డావు!! " అని అంది తల దించుకుని..

"నువ్వేం తప్పు చేయలేదు అమ్ము.. తలా దించుకోవడానికి" అని అన్నాడు.

" అవును.. నువ్వు వెళ్లిపోయావ్ కదా!! మళ్ళీ !! " అని ఆగిపోయింది.

" వెళ్తూ వెళ్తూ.. ఒక మాట చెప్పాను గుర్తుందా.. ' నీ సంతోషం కోసం వెళ్తున్న.. అలాంటిది నువ్వు హ్యాపీగా లేవంటే ఎవరు అడ్డొచ్చినా ఆగను.. నువ్వు పిలిచిన పిలవక పోయిన వచేస్తా నీ లైఫ్లోకి!! ' అన్నాను.. అవునా.. మరి ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నవా!! " అని అడిగాడు తన కళ్ళలోకి చూస్తూ

" హ.. చాలా హ్యాపీగా ఉన్నను.. " అంది తడబడుతూ

" నీకు అబద్ధం ఆడటం రాదు అమ్ము!! " అన్నాడు నవ్వుతు.

మౌనంగా సముద్రం వైపు చూస్తూ ఉండిపోయింది..

" నన్ను పెళ్లి చేసుకుంటావా!!!! " అని అడిగాడు ప్రేమగా..

ఉలిక్కిపడి చూసింది అమ్ము గౌతమ్ వైపు..

" నేను నిన్ను కలిసిన రోజు ఇదే అడిగాను.. ఇంఫాక్ట్ చెప్పాలంటే నీతో ముందుగా మాట్లాడిన మొదటి మాట ఇదేకదా!! " అన్నాడు.

అవును అన్నతయిగా తలాడించింది..

" చెప్పు అమ్ము.. చేసుకుంటావా!! " అని అడిగాడు మళ్ళీ..

" నీకు ముందే చేప్పానుగా నేను మా బావని.. " అని ఆగిపోయింది..

" కానీ నేను కూడా నీకు చెప్పాను.. నిన్ను మీ బావ ప్రేమించట్లేదని.. అయిన ఎందుకు ఇలా చేసావు!! " అని అడిగాడు బాధగా

" ప్లీస్ గౌతమ్ ఇంకా వదిలేయి.. " అని అంది విసురుగా..

సైలెంట్ అయిపోయాడు గౌతమ్ కాసేపు..

" మరి లైఫ్ లాంగ్ ఇలానే ఉంటావా!! " అని అడిగాడు మళ్లి..

" మా అప్ప ఎం డెసిషన్ తీసుకుంటే అదే.. " అని అంది.

" మరి నేను !! " అని అడిగాడు చిన్నపిల్లాడిలా.

నవ్వు వచ్చింది అమ్ముకి.. గౌతమ్ అడిగిన విధానానికి..

కొద్దిసేపు అమ్ము దగ్గరే ఉండి ఇంటికి వెళ్ళాడు గౌతమ్.

--//--

ఇంటికి వెళ్లాక అమ్ము ఎం తినకుండా నిద్రపోయింది.. ఆది నిరంజన్ గారి దగ్గరికి వెళ్ళాడు.

" నాన్న.. అమ్ము కి పెళ్లి చేద్దాం నాన్న.. ఇలానే.ఉంటే ఎం అవుతుందో అని భయంగా ఉంది!! " అని అన్నాడు.

ఆయన కూతురు అలా ఉండటం చూడలేక " మంచి సంబంధం ఏదైనా దొరికితే చేద్దాం!! " అని అన్నారు.

" అయితే నా చిన్నప్పటి నుండి ఇంటర్ వరుకు నాతోనే చదువుకున్నాడు గౌతమ్ అని చాలా అంటే చాలా మంచివాడు.. నాకన్నా ఏవైనా బాడ్ హబిట్స్ ఉన్నాయేమో కానీ వాడికి ఒకటి కూడా లేవ్వు.. గౌతమ్ వాడి పెరు!! " అని చెప్పాడు.

" ఎం చేస్తుంటాడు!! "అడిగారు.

" కంపెనీ ఉంది నాన్న.. చాలా రీచ్ ఫామిలీ.. కానీ వన్ పేర్సెంట్ కూడా పొగరు కానీ గర్వం కానీ లేవు.. మీకు తెలిసే ఉంటుంది.. GN కన్స్ట్రక్షన్స్ గురుంచి " అని అన్నాడు..

"హ.. ఆ అబ్బాయికి ఇష్టం అయితే చూద్దాం!! " అని అన్నారు.

ఆది బయటికి వచ్చి చాలా హ్యాపీగా గౌతమ్ కి కాల్ చేసి విషయం చెప్పాడు.. గౌతమ్ అప్పటికే తన పేరెంట్స్ కి అంత చెప్పి ఉండటంతో వాళ్ళు కూడా ఒకే అన్నారు..

" అయితే రేపు మా నాన్న వచ్చి మాట్లాడతారు అని చేప్పు!! " అని చెప్పి కట్ చేసాడు.

గౌతమ్ హ్యాపీనెస్ అత వేతన వాయిస్ లోనే తెలిసింది ఆది కి..

ఎగిరి గంతేసినంత పని చేసాడు గౌతమ్.. చాలా రోజుల తరువాత తన తల్లి చేత గోరుముద్దలు కడుపు నిండా తిని ప్రశాంతంగా పడుకున్నాడు.

మరుసటి రోజు గౌతమ్ నాన్న చంద్రశేఖర్ గారు నిరంజన్ గారిని కలుస్తారు.

అంత మాట్లాడుకున్నాక పెళ్లి చూపులకి ఒకరోజు ఫిక్స్ చేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్తారు.

ఇంట్లో అందరికి విషయం చెప్తారు నిరంజన్ గారు.. అమ్ము కి కూడా చెప్తారు కానీ ఎవరూ అని చెప్పరు..

ఒక రెండు రోజుల తరువాత ఇంట్లో హడావిడిగా ఉంటుంది.. అందరూ చాలా సంతోషంగా ఇంట్లో పనులు చక చక చేస్తున్నారు.

అమ్ము ని లేపి ఒక చీర ఇచ్చి రెడి అవ్వమంటారు భాగ్య గారు. అమ్ముకి అప్పుడు గుర్తూ వస్తుంది తన పెళ్లి చూపులు అని..

ఒక్కక్షణం గౌతమ్ బాధగా ఉన్న ఫేస్ కనిపించి మాయం అవుతుంది.. తర్వాత తేరుకుని రెడి అవ్వడానికి వెళ్తుంది..

కింద గౌతమ్ అండ్ ఫామిలీ వస్తారు.. వాళ్ళని సాదరంగా ఆహ్వానిస్తారు పెద్దవాళ్ళు..

అందరిని కూర్చోపెట్టి మాట్లాడుతూ ఉంటారు. గౌతమ్ ఆది తో మాట్లాడుతూ ఇల్లు మొతం చూస్తుంటాడు..

" సర్.. కాస్త ఓపిక పట్టండి.. అమ్ముని తీసుకొస్తారు!! " అని అంటాడు ఆది.

చిన్నగా నవ్వి తల తిప్పుతాడు గౌతమ్

" ఓహో.. నిలో ఈ అంగీల్ కూడా ఉంది.. " అని దీర్గం తీస్తాడు ఆది.

" అరేయ్.. ప్లీస్ రా.. నాకు చాలా ఇబ్బంది అవుతుంది!! " అని అన్నాడు.

ఆది నవ్వి ఊరికే అయిపోయాడు. ఆ తరువాత కొద్దిసేపటికి అమ్ము ని తీసుకొస్తారు.

రెడ్ అండ్ గోల్డ్ మిక్స్ అయిన బోర్డర్ సారీలో దానికి సూట్ అయ్యే నెక్లెస్ పెట్టుకుని బుట్ట కమ్ములు పెట్టుకుని చేతి నిండా గాజులు వేసుకుని బుట్ట బొమ్మల వస్తుంది అమ్ము.

వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చుంటుంది.. కానీ తల ఎత్తదు.. అబ్బాయిని చూడదు.

వాళ్ళు ఆడిగేవాటికి సమాధానం ఇచ్చి ఊరికే ఉంటుంది.. కొద్దిసేపటికి అమ్మాయిని అబ్బాయిని మాట్లాడుకోవడానికి పంపిస్తారు.

అమ్ము తన రూంకి తీసుకెళ్లి వెనక్కి తిరిగి అప్పుడు చూస్తుంది గౌతమ్ ని ఆశ్చర్యంగా..

" నువ్వెంటి ఇక్కడ!!!!! " అని అడుగుతుంది అదే షాక్ లోనే..

" నువ్వేగా నన్ను చేసుకొని అన్నావు.. అందుకే నేనే వేరే అమ్మాయిని చేసుకుందాం అని వచ్చాను!! "అని అంటారు ఆటపట్టిస్తు.

" ఓహ్.. కానీ నాకు ఇష్టం లేదు నిన్ను.. "అని అంటున్న అమ్ము ముందు మోకాళ్లపై కూర్చుంటాడు గౌతమ్

" నువ్వు పడే బాధ మీ బావ పడకూడదు అని తనకి ఇష్టమేనా అమ్మాయితో పెళ్లి చేసావు. మరి నువ్వు దూరం అయితే నేను బాధ పడనా.. " అని దీనంగా అడుగుతున్న గౌతమ్ ని చూస్తూ ఎం మాట్లాడలేకపోయింది.

" నువ్వు ఎం చేయాల్సిన పని లేదు.. జస్ట్ నాతో ఉంటే చాలు.. నిన్ను యువరాణిలా చూసుకుంటా అని చెప్పను కానీ.. నువ్వు మీ నాన్న దగ్గర ఎంత హ్యాపీగా ఉంటావో నా దగ్గర అంత హ్యాపీయగా ఉండేలా.. అంత ఫ్రీ గా ఉండేలా చూసుకుంటా..

నీ ప్రేమ నాకు జీవితాంతం దక్కకపోయిన బతకగలను..

కానీ నువ్వు దూరం అయితే తట్టుకోలేను అమ్ము..

ప్రాణం ఉన్న శవాన్ని అవుతాను..

జతగా జీవితాంతం నీతో నడవడానికి నాకు అర్హత లేకపోవచ్చు..

కానీ జీవితాంతం నిన్ను ప్రేమించేంత ప్రేమ నాలో ఉంది..

నీ కంట కన్నీరు రానికుండా చుసుకునేంత ప్రేమ నాలో ఉంది..

నీ మొఖంపై నవ్వుని తెప్పించడానికి బతుకంత ప్రయతించే ఓపిక నాలో ఉంది..

నువ్వు నీ ప్రేమని నాకు అందించకపోయిన నీ చేతిని అందించి నాతో అడుగు కలుపు చాలు.. " అని అంటూ అలానే కూర్చుండిపోయాడు కన్నీరుతో..

అమ్ముకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి..

" నా ప్రేమలో గెలవలేకపోయాను.. కనీసం తన ప్రేమని అయిన గెలవనిద్దాం.. " అనుకుని..

"గౌతమ్ .. "అని అంది.

తలెత్తడానికి కూడా ప్రయత్నం చేయలేకపోయాడు.. కన్నీళ్లు జల జల రాలిపోతున్నాయి..

ఇది చెపుదాం అని ముందుకు అడుగు వేయబోయిన అమ్ము ని ఆపేస్తు డోర్ నోక్ అయింది..

కంగారుగా కళ్ళు తుడుచుకుని వెళ్లి డోర్ ఓపెన్ చేసింది.. ఆది కనిపించాడు.

" కిందకి రమ్మంటున్నారు.. "అన్నాడు మోకాళ్లపై కూర్చున్న గౌతమ్ ని చూస్తూ.

" వస్తున్నాం!! " అని డోర్ వేసి "కిందకి వెళ్దాం రా గౌతమ్ .. " అని కిందకి వెళ్ళింది.

వెనకే మెల్లగా వచ్చాడు గౌతమ్ ఎపోయేటికి మొహం పీక్కుపోయింది..

అందరూ కూర్చుని ఉన్నారు. వాళ్ళతో కూర్చుని సైలెంట్ గా ఉన్నాడు.

"మాకు ఇష్టమే ఈ సంబంధం.. మీకు కూడా ఇష్టమైతే.. ఇపౌడే తాంబూలాలు తీసుకుందాం!! " అని అన్నారు నిరంజన్ గారు.

" నాకు ఇష్టమే.. " అని ఊహించని విధంగా సమాధానం వచ్చింది అమ్ము నుండి..

అందరికన్న ముందుగా షాక్ అయ్యాడు గౌతమ్. మొఖం మతబుల వెలిగిపోయింది..

"నాకు ఇష్టమే మా!! " అన్నాడు హ్యాపీగా.

అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు వెంటనే తాంబూలాలు మార్చుకున్నాయి..

పంతులు గారితో మాట్లాడి మరో పది రోజుల్లో పెళ్లికి ముహూర్తం పెట్టించారు.

" పెళ్లి గురించి ఎం ఆలోచనలు పెట్టుకోకండి అన్నయ్యగారు.. మేము అంత చూసుకుంటాం.. అలాగే ఎల్లుండి షాపింగ్ కి వెలాడం.. " అని అన్నారు సుమ గారు.

" అలాగేనమ్మ!! " అన్నారు నిరంజన్ గారు.

ఆ తరువాత వీడుకొలు తీసుకుని బయల్దేరడానికి లేచారు. సుమ గారు వెళ్తూ వెళ్తూ అమ్ము బుగ్గపై ముద్దు ఇచ్చి..

" చాలా ముద్దుగా ఉన్నవమ్మా బుతా బొమ్మల!! " అన్నారు.

అందరూ నవ్వారు. గౌతమ్ అయితే తెగ సిగ్గు పడిపోయాడు☺️

--//--

రెండు రోజుల తరువాత షాపింగ్ మాక్ దగ్గర అందరూ కలుసుకుని షాపింగ్ చేస్తున్నారు.

వేద్ అండ్ సుష్మ ఇద్దరు నవ్వుతు ఒక చోట వాళ్ళ షాపింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్న అమ్ము కళ్ళలో నీళ్ళు తిరిగి వెంటనే వెనక్కి తిరిగింది.

ఎదురుగా గౌతమ్ కనిపించాడు. అమ్ము కళ్ళలో నీళ్ళు చూసి కంగారుగా " ఏమైంది అమ్ము!! " అని అంటూ కనీళ్లు తుడవబోయాడు.

కానీ ఆగిపోయి "ప్లీస్ అమ్ము.. నీ కళ్ళలో నీళ్ళు చూడలేను ప్లీస్!! " అన్నాడు తన కళ్ళలో నీళ్ళు తిరిగుతుండగా.

అమ్ము తన కన్నీళ్ళు తుడుచుకుని పక్కకి వెళ్ళింది. గౌతమ్ కూడా వెంటే వెళుతూ..

" నన్ను ఒక భర్తలా చూడకపోయిన కనీసం ఒక ఫ్రండ్ లా అనుకో.. నాతో మాట్లాడు అమ్ము!! " అన్నాడు.

" నాకు సారీ సెలక్షన్ రాదు!! " అంది చిన్నగా.

" ఏంటి.. " అన్నాడు అయోమయంగా.

" నాకు సారీ సెలక్షన్ రాదు.. అందుకే ఇక్కడ కూర్చున్న !! " అంది.

గౌతమ్ కి అమ్ము చెప్పిన ఆన్సర్ కి నవ్వు వచ్చింది కానీ కంట్రోల్ చేసుకుని " నేను హెలో చేస్తాను రా! " అన్నాడు.

అమ్ము కూడా ఆలోచించి వెళ్ళింది. ఇద్దరు అన్ని చుస్టుబిహు నచ్చిన చీరలు సెలెక్ట్ చేశారు..

ఆ తరువాత అక్కడే ఫుడ్ కోర్ట్ లో ఫుడ్ తినేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు.

నెక్ డే బంగారం కోనడానికి వెళ్లారు.. అలా ఒక వారంలో పెళ్లికి కావాల్సిన పనులన్ని ముగించుకుని అందరూ కస్టగా ఫ్రీ అయ్యారు.

గౌతమ్ తమకి ఎక్కువ పని లేకుండా చేస్తూ నిరంజన్ వాళ్ళ చాలా నచేసాడు..

అలా పెళ్లికి ముందు రోజుల ముందు అందరూ పెళ్లి జరిగే ప్లేస్ కి వెళ్లారు.

అది ఒక రిసార్ట్.. అక్కడే పెళ్లి.. అందరికి రూమ్స్ ఇచ్చారు.

అమ్ము తన రూంలో కూర్చుని ఆలోచిస్తూ ఉంది.. ఇంతలో లక్ష్మీ గారు వచ్చి ఒక కవర్ ఇచ్చి " సాయంత్రం సంగీత్ ఉంది.. రెడి అవ్వు.. " అని వెళ్లిపోయారు.

అమ్ము ఆ కవర్ ఓపెన్ చేసి చూసింది. అందులో ఒక ఆరేంజ్ అండ్ పింక్ మిక్స్డ్ లెహంగా ఉంది..

దాని చూడగానే అమ్ము మొహంపై చిరునవ్వు చిందింది.. తీసుకుని లేచి ఫ్రెష్ అయ్యి రెడి అయ్యి కూర్చింది.

ఆ తరువత ఒక గంటకి భాగ్య వచ్చి పిలవడంతో కిందకి వెళ్ళింది.

కింద ఓపెన్ ఏరియా లో చాలా బాగా పూలతో డెకరేట్ చేసి ఉంది.. అందరూ బంధువులు ఉన్నారు..

అందరిని చూసి చిన్నగా నవ్వి ఒక చోట కూర్చుంది. కొద్దిసేపటికి వచ్చాడు గౌతమ్ అక్కడికి..

లైట్ బేబీ పింక్ షర్ట్ కి బ్లాక్ పాంట్ అండ్ బ్లాక్ బ్లాజర్ తో చాలా అందంగా ఉన్నాడు.

వచ్చి తన ఫ్రండ్స్ ఉన్న చోట నిల్చుని అమ్ము కోసం వెతుకుతూ ఉన్నాడు.

ఒక చోట ఒంటరోగ కూర్చున్న అమ్ము కనిపించింది. అక్కడికి వెళ్లి " ఎందుకు ఒంటరిగా ఉన్నావు.. ఆది ఎక్కడ!! " అని అడిగాడు.

"తెలీదు " అంది తల దించుకుని.

" ఉండు పిలుస్తా!! " అని ఫోన్ తీసుకుని కాల్ చేసేలోగా స్టేజ్ పై వినిపించింది ఆది వాయిస్.

అందరి దృష్టి అటు మళ్లింది..

" అందరూ సంగీత్ ని ఇంత బోరింగ్ గా ఎంజాయ్ చేస్తార.. నాకేం నచ్చలేదు.. సో మనం మన్ పేళ్లి కొడుకుని ఒక పాట పడమని కోరుదాం.. " అన్నాడు నవ్వుతు.

గౌతమ్ సీరియస్ గా చూసి ఇంకా తప్పక పైకి లేచాడు. అక్కడికి వెళ్లి అమ్ము వైపు చూసాడు..

అమ్ము చాలా అందంగా కనిపిస్తుండగా గుర్తొచ్చింది ఒక పాట.. చిన్నగా నవ్వుతు పాట స్టార్ట్ చేసాడు..

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..

ఈ లవ్వనేది బబులు గమ్ము.. అంటుకున్నాదంటే పోదు నమ్ము.. అని అంటూ ఆది వైపు చూసాడు..

అది అర్థం చేసుకున్న ఆది వెళ్లి అమ్మఉని స్టేజ్ పైకి తీసుకొచ్చాడు.ఇష్టం లేకపోయినా అందరి కోసం నవ్వుతు ఉంది అమ్ము.

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..

ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము..

ప్రేమనాపలేవు నన్ను నమ్ము..   అని అంటూ అమ్ము ముందుకు వచ్చాడు.

ఎట్టాగా అనే ఎదురు చూపుకి..

తగినట్టుగా నువ్వు బదులు చెబితివే..

అరే దేవుడా ఇదేందనేంత లోపటే పిల్లడా అంట దగ్గరై నన్ను చేరదీస్తివే..    అని అంటూ అమ్ము కి చేయి అందించాడు.. అందుకుంది అమ్ము..

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే.. జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే "2" అని అంటూ తన చుట్టూ తిరుగుతూ పాడుతున్నాడు.

మల్టీప్లెక్సులోని ఆడియన్సులాగా మౌనంగున్నాగానీ అమ్ము..

లోన డంటనక జరిగిందే నమ్ము..

దిమ్మ తిరిగినాదే మైండు సిమ్ము..    అని అంటూ నవ్వాడు. అమ్ముకి ఒకసారి గౌతమ్ అలా డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో అని అనుకుంది.. వెంటనే నవ్వేసింది..

అందరూ అమ్ము మొహంలో నవ్వు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు..

రాజుల కాలం కాదు..

రథము గుర్రం లేవు..

అద్దం ముందర నాతో నేనే యుద్ధం చేస్తాంటే..    అని అంటూ ఆది వైపు చూసాడు.. ఆది పక్కకి వెళ్ళాడు.

గాజుల చేతులు జాపి దగ్గరకొచ్చిన నువ్వు..

చెంపల్లో చిటికేసి చక్కరవర్తిని చేసావే..    అని అంటూ అమ్ము చేతిని అందుకుని ఒక రౌండ్ తిప్పాడు.

చిన్నగా చినుకు తుంపరడిగితే..

కుండపోతగా తుఫాను తెస్తివే...    అని అంటూ హ్యాపీగా నవ్వుతు వాటర్ డ్రాప్స్ పడేలా ఆరెంజ్ చేసిన ప్లేస్ లో నిలబెట్టాడు.

మాటగా ఓ మల్లెపూవునడిగితే..

మూటగా పూలతోటగా పైనొచ్చి పడితివే...    అని అంటూ పక్కనే.పువ్వులు పడే చోట నిలబెట్టాడు.

బుట్టబొమ్మా బుట్టబొమ్మా నన్ను సుట్టుకుంటివే..

జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే..     అని అంటూ ఉండగా లైట్ ఆఫ్ అయింది. గౌతమ్ నీ పైన కూర్చుని..

వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టూకుంటివే..   అని అంటూ పట్టుకున్న చేతిని చిన్నగా పెదాలకి అనించుకుని ముద్దుపెట్టుకున్నాడు.

కాలికింది పువ్వు నేను నెత్తినెట్టూకుంటివే..    అని అంటూ అమ్ము కాళ్ళపై చెయ్యి పెట్టాడు..

వెనక్కి అడుగు వేసింది అమ్ము ఆశ్ఛర్యంగా.. వెంటనే లైట్స్ వెలిగాయి..

ఇంతకన్న మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము..

ఈ లవ్వనేది బబులు గమ్ము..

అంటుకున్నాదంటే పోదు నమ్ము..

ముందు నుంచి అందరన్నమాటే గానీ మళ్లీ అంటున్నానే అమ్ము..

ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము..

ప్రేమనాపలేవు నన్ను నమ్ము..     అని అంటూ పాట ఆపేసాడు..

అమ్ము చేతిని పట్టుకుని కిందకి వచ్చాడు. అమ్ము కూడా గౌతమ్ చేతిని వదలలేక పోయింది..

తరువాత తన ఫ్రండ్స్ కి పరిచయం చేశాడు.. అమ్ము మైండ్ కాసేపు అయిన డైవేర్ట్ అవ్వాలని..

అందులో ఒకడు " మీరు చాలా లక్కీ సిస్.. వీడు చాలా మారాడు మీ వల్ల.. " అని అన్నాడు.

కానీ అమ్ము అది విన్న పట్టించుకోలేకపోయింది.. గౌతమ్ అమ్ము ఎక్కడ వింటుందో అని వాడి కాలు తొక్కాడు.

అమ్ము మాత్రం ఒకచోట కూర్చుని ఎదో మాట్లాడుతూ నవ్వుతున్న వేద్ , సుష్మ లనే చూస్తుంది..

అది గమనించైనా గౌతమ్ అమ్ముని తీసుకెళ్లి అలా చోట కూర్చోపెట్టి జ్యూస్ ఇచ్చాడు.

అమ్ము అది తీసుకుని తాగుతూ ఉంది..

" ఏమైంది అమ్ము.. " అని లాలనాగ అడిగాడు..

" నాకు చాలా ఏడుపోస్తుంది గౌతమ్.. " అని అంది కళ్ళ నిండా నీళ్లతో..

" ఎందుకురా!! " అని కంగారుగా అడుగుతూ చైర్ పక్కకి వేసుకున్నాడు..

" తెలీదు.. ఎదో దిగులు వస్తుంది.. నేను.రూమ్కి వెళ్లిపోతా గౌతమ్!! " అంది.

" సరే.. వేళ్ళు.. కానీ ఒలరు గుర్తు పెట్టుకో అమ్ము..

గతాన్ని తలుచుకుంటూ.. మనం కూడా అక్కడే నిలిచిపోకూడదు!! " అన్నాడు.

అలాగే అన్నట్టు తల ఊపి పైకి లేచింది.

"నిన్ను అక్కడ వదిలేసి వస్తాను!! " అని తను లేచాడు..

ఇద్దరు మౌనంగా నడుస్తూ ఉన్నారు..

" ఎలా పాడాను చెప్పనేలేదు!! " అన్నాడు నవ్వుతు.

"బాగా పాడావు.. నువ్వు ముసిచ్ నేర్చుకున్నావ్!! " అని అడిగింది..

"హ.. చాలా రోజుల కిందట.. " అని అన్నాడు.

అంతలో రూమ్ వచ్చేసరికి తను లోపలికి వెళ్ళింది అమ్ము.. గౌతమ్ కూడా సంగీత్ కి వెళ్లి అక్కడ ఫ్రండ్స్ తో మాట్లాడుతూ ఉన్నాడు.

మరుసటి రోజు..

ఉదయం కొన్ని పూజలు ఉంటే అవి చూసుకుని.. సాయంత్రం మెహంది ఫంక్షన్ పెట్టుకున్నారు.

అమ్ము కూడా కొద్దిగా నవ్వుతు ఉంది..

ఆ నెక్స్ట్ డే పెళ్లి..

ఆరోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేసారు..

ఆ తరువాత రోజు పేళ్లి..

పెళ్లి పీటల మీద కూర్చుని ఉన్నాడు గౌతమ్.. తన కళ్ళలో ప్రపంచాన్నే జయించినంత ఆనందం ఉంది..

ఆ కొద్దిసేపటికి అమ్ముని తీసుకొచ్చారు. తెర చాటున తొంగి చూడ్డానికి ప్రయత్నిస్తున్న గౌతమ్ ని చూస్తే నవ్వు వస్తుంది అందరికి..

అది గమనించి సిలేంట్ గా కూర్చున్నాడు. జీలకర్ర బెల్లం పెట్టుకున్నారు.

" ఎప్పటికి నీ కళ్ళలో నీళ్ళు రాకుండా చూసుకుంటా అమ్ము.. " అని మనసులోనే అనుకున్నాడు..

అడ్డు తెర తీసాక చూసాడు అమ్ముని. గండం కలర్ చీర విత్ మెరూన్ బోర్డ్ర్ చాలా అందంగా ఉంది..

ఇద్దరిని పక్కఒక్కనే కూర్చోపెట్టాడు. నెక్స్ట్ ఒకో తంతే కనిస్తూ మాంగళ్య ధారణ చేయించారు.

తాళి తన మెడలో పడుతుంటే నీళ్లు తిరిగాయి అమ్ము కళ్ళలో.. ఆ తడి గౌతమ్ కళ్లనుండి అమ్ము వీపుపై పడ్డాయి.

మెల్లగా ఒకోతంతే కానిచ్చి.. చివరిగా అప్పగింతలు జరిగాయి.. అమ్ము ఏడుస్తూ నిరంజన్ గారి వైపు చూసింది..

ఆయన కూడా కట తడితో ఉన్నారు. ఆయన్ని హత్తుకుని ఏడుస్తున్న అమ్ము భుజంపై చేయి పడింది.. చూస్తే గౌతమ్..

" ఏంటి అమ్ము.. చిన్న పిల్లల ఎడుస్తున్నావ్.. నువ్వేమైన వేరే గ్రహానికి పోతున్నవా.. లేదు కదా.. ఇదే ఊరిలోనే ఉంటావు.. నీకు ఎప్పుడు కావాలో.. ఏ వేళలో చూడాలి అనుకుంటే ఆ వేళలో నిన్ను తీసుకెళ్తా..

కానీ ఇలా ఏడిచి మావయ్య ని బాధ పెడతావ్.. చెప్పు!! " అన్నాడు లాలనగా గడ్డం పై చేయి వేసి చెపుతూ..

నిరంజన్ గారు చాలా సంతోష్ణగా ఫీల్ అయ్యారు.. అందరూ సంతోషంగా అమ్ముని అత్తారింటికి సాగణంపారు.

అత్తారింట్లో గృహప్రవేశం చేయడానికి నిలుచుంది అమ్ము.. తనకి వదిన వరసయ్యే వారు ఒకరు అడ్డు వచ్చి పేర్లు చెప్పమంటున్నారు..

అమ్ము తలా దించుకుని నిలబడింది.. గౌతమ్ అమ్ము పరిస్థితి అర్థం చేసుకుని " నేను నా భార్య అమూల్య వచ్చాము.. "అన్నాడు.

" నేను మా ఆయన గౌతమ్ వచ్చాము!! " అంది అమ్ము చిన్నగా. అమ్ము కి తోడుగా ఆది వచ్చాడు.

ఆ తరువాత హారతి ఇచ్చి లోపలికి గృహాప్రవేశం చేయించారు.. ఇద్దరికి చేత పూజ చేయించి అందరికి నమస్కారం చేశారు..

ఆ తరువాత అమ్ముని ఒక రూంలోకి వెల్లమన్నారూ.

అమ్ము ఇబ్బందిగా చూస్తూ వెళ్ళింది. గౌతమ్ తన తల్లి దగ్గరికి వెళ్లి..

" అమ్మ.. నేను అమ్ము దగ్గరే ఉంటాను.. " అని అన్నాడు.

" అలాగే వేళ్ళు!! " అన్నారు ఆవిడ.

గౌతమ్ అమ్ము వెంట లోపలికి వెళ్ళాడు.. అమ్ము అక్కడే బెడ్ మీద దిగులుగా కూర్చుంది..

అది గమనించిన గౌతమ్.. అమ్ము ముందు మోకాళ్లపై కూర్చుని " ఏమైంది అమ్ము!! " అని అడిగాడు.

" ఒక్కసారి కూడా బావ నాకు సోరి చెప్పలేదు గౌతమ్.. " అంది చిన్నగా

"ఎం అంటున్నావ్ అమ్ము!! " అని అడిగాడు.

" నేను సోరి చెప్పడానికి కూడా సరిపోనా.. నేను ఎం చేశానని నన్ను ఇలా బాధపెట్టాడు.. ఇష్టంలేక పోతే అప్పుడే చెప్పేయోచ్చుగా !! " అని అంది ఏడుస్తూ.

"అమ్ము.. అమ్ము. " అని అంటూ ఓదార్చడానికి ట్ర్య్ చేస్తున్నాడు..

అమ్ము మాట వినట్లేదు.. ఒక్కసారిగా అమ్ము మొహాన్ని చేతిలో పట్టుకుని మొహం దగ్గరికి తెచ్చి " కామ్ డౌన్ అమ్ము.. కూల్ అవ్వు.. " అన్నాడు.

సైలెంట్ అయింది అమ్ము.

" ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడివేస్తాడు.. ఎదలోనే ప్రేమకి వేరే మజిలికి చేరుస్తాడు.. " అన్నాడు..

ఆ పధంలో చాలా అర్థం ఉంది అనిపించింది..

" నువ్వు రెస్ట్ తీసుకో అమ్ము.. " అని అన్నాడు నవ్వుతు.

అమ్ము అలాగే అని వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకుంది.. అమ్ము పడుకునే దాక అక్కడే ఉండి బయటికి వచ్చాడు గౌతమ్

తన రూంకి వెళ్లి ఫ్రెష య్యి తను పడుకున్నాడు టైర్డ్ అవ్వడంతో..

--//--

సాయంత్రం మెలుకువ వచ్చింది అమ్ముకి.. లేచి మొహం కడుక్కుని బయటికి వచింది..

హాల్లో సుమ గారు కొందరు బంధువులు ఉన్నారు.. అమ్ము రావడం చూసి సుమగారు అమ్ము దగ్గరికి వెళ్లారు.

" కాఫీ తగుతావా అమ్ము!! " అని అడిగారు.

" వద్దు అత్తయ్య.. " అంది మొదటి సారి..

ఆవిడ ఆనందంగా ఉండు తల్లి.. అని వెళ్లి కాఫీ తీసుకొచ్చారు..

అమ్ము ఇబ్బందిగా చూస్తుంటే.. "తీసుకొమ్మ.. నేను నీకు అమ్మలాంటి దాన్నే.. " అన్నారు.

అమ్ము నవ్వుతు ఆవిడని హత్తుకుని "థాంక్యూ అత్తమ్మ.. " అంది నవ్వుతూ.

ఆవిడ అక్కడే వాళ్ళతో కూర్చొపెట్టుకుని మాటల్లో పడ్డారు. అమ్ము కూడా చిన్నగా వాళ్ళతో మాటల్లో పడింది..

ఆ తరువాత కొద్దిసేపటికి " మా.. కాఫీ!! " అని అరిచాడు గౌతమ్.

" అమ్ము.. నువ్వు వెళ్లి ఇస్తావా తల్లి!! " అన్నారు అమ్ము వైపు చూస్తూ.

అమ్ము ఇబ్బందిగానే తలా ఊపి కిచెన్ లోకి వెళ్లి కాఫీ చేసి తీసుకుని గౌతమ్ రూమ్ ఎదో వెతుక్కుంటు వెళ్లింది.

రెండు రూమ్స్ వెతికాక దొరికింది. అక్కడ బెడ్ మీద పడుకుని అటు ఇటు దొర్లుతు "మా.. కాఫీ.. " అని అంటూ ఉన్నాడు గౌతమ్.

అమ్ముకి నవ్వు వచ్చింది.. చిన్నగా గాజుల సౌండ్ చేసింది.

తలా ఎత్తాడు గౌతమ్. అమ్ము కనిపించేసరికి తడబడుతూ లేచి కూర్చున్నాడు.

" అది అత్తమ్మ.. ఇవ్వమన్నాడు!! " అంది చిన్నగా..

కాఫీ తీసుకున్నాడు గౌతమ్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. అమ్ము దించిన తల ఎత్తలేదు..

" ఎలా ఉంది!! " అని అడిగింది కొద్దిసేపటికి.

" బాగుంది!! " అన్నాడు చిన్నగా.

" మీరు ఇంకా తాగనేలేదు!! " అంది అమ్ము నవ్వుతూ తలెత్తి..

తడబడ్డాడు గౌతమ్. నవ్వుతు కిందకి వెళ్ళింది అమ్ము.

ఆరోజు నైట్ అందరూ డిన్నర్ చేసి పడుకున్నారు..

తన ఆఫీసులోనే పని చేసే వేద్ ని అన్సిట్ అని చెప్పి వేరే కంట్రీ పంపించాడు. తనతో పాటు సుష్మ , శ్రీధర్ , భాగ్య కూడా వెళ్లిపోయారు.

ఆ విషయం కూడా అమ్ముకు తెలియనివ్వలేదు..


నెక్స్ట్ డే ఈవెనింగ్ రిసెప్షన్ పెట్టుకున్నారు.. అమ్ముకి ఒక ఫుల్ హెవీ డిసైన్ సారీ ఇచ్చి రెడి అవ్వమన్నారు..

అది చూడగానే అమ్ము ఫ్యూజులు పేలిపోయాయి.. దాని వంకే దీనంగా చూస్తూ కూర్చుంది.

అమ్ము రెడి అయింది లేదా చూద్దామని వచ్చిన గౌతమ్ కి డల్ గా కూర్చన్న అమ్ము కనిపించింది.

తను అలా డల్ గా ఉండేసరికి ఏమైందో అని కంగారుగా వెళ్ళాడు..

" ఎందుకు అమ్ము.. ఇంకా రెడి అవలేదు.. "అని అడిగాడు.

" అది సారీ చాలా హెవి గా ఉంది.. కారి చేయలేను.. " అంది చిన్నగా.

ఊపిరి పీల్చుకుని " సరే.. ఉండు వేరేది వేసుకుందువు!! " అని వెళ్లి వేరే లెహంగా తెచ్చి ఇచ్చాడు.

అమ్ము అది తీసుకుంది. గౌతమ్ బయటికి వెళ్ళాడు. అమ్ము త్వరగా రెడి అయ్యి బయటకి వచ్చయింది.

తరువాత రిసెప్షన్ జరిగే ప్లేస్ కి వెళ్లారు. అక్కడ అంత చాలా బాగా డెకరేట్ చేసి ఉంచారు. చుట్టూ ఉన్న పూలు , పచ్చదనం చూస్తు ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది.

మెల్లగా గౌతమ్ అమ్ము ఇద్దరు కలిసి స్టేజ్ మీద కూర్చున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు వచ్చి విష్ చేసి వెళ్తున్నారు.

అందరిని చిరునవ్వుతో పలకరిస్తున్నారు గౌతమ్ అమూల్య లు.. ఆ తరువాత అందరూ డిన్నర్ చేసి ఇంటికి స్టార్ట అయారు.

ఇంటికి వెళ్లగానే అమ్ముని మళ్ళీ త్వరగా రెడి అవ్వమని ఒక తెల్ల చీర ఇచ్చి వెళ్లారు.

అది ఎందుకో అమ్ముకు అర్థం అవ్వడానికి టైం పట్టింది. మరో పక్క గౌతమ్ కి చాలా టెన్షన్ గా ఉంది.

అమ్ము ఎక్కడ ఎం అనుకుంటుందో అని.. కానీ తప్పక రెడి అయ్యి వాళ్ళ అమ్మ వెల్లమన్న రూంకి వెళ్ళాడు.

అక్కడ బాల్కనీలోకి వెళ్లి నిలుచుని ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు.

ఇక్కడ అమ్ము చీర కట్టుకుని కూర్చుంది. సుమ గారు వచ్చి పాల గ్లాస్ ఇచ్చి గది వరుకు తీసుకెళ్లి వదిలేసి వచ్చారు.

అమ్ము గుండెలో ఎదో అలజడి రేగుతుంటే దానిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ లోపలికి వెళ్ళింది.

అక్కడెక్కడ గౌతమ్ కనిపించలేదు.. ఎక్కడికి వెళ్ళాడు అని వెతికే ప్రయత్నం చేయలేదు.. సైలెంట్ గా బెడ్ మీద కూర్చుంది.

కొద్దిసేపటికి రూంకి వచ్జింది గౌతమ్ అమ్ముని చూసి దగ్గరికి వెళ్లాడు.

" అది గౌతమ్!! " అని చెప్పబోతుంటే..

" పర్లేదు అమ్ము.. నువ్వు ఇక్కడ బెడ్ మీద ఒడ్డుకు నేను బాల్కనీలో పడుకుంటా.. నీకు కావాల్సినంత టైం తీసుకో!! " అని షెల్ఫ్ నుండి బెడ్ షీట్ తీసుకుని బాల్కనీ లోకి నడిచాడు

అమ్ము వెళ్తున్న గౌతమ్ నే చూసి బెడ్ మీద పడుకుంది. బయట బాల్కనీలో తారలని చూస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు గౌతమ్.

తెల్లారి త్వరహముగా మెలుకువ వచ్చింది గౌతమ్ కి.. లేచి రూంలోకి వెళ్ళాడు. తన మొహంపై కనిపిస్తున్న కన్నీటి చారలు చూస్తేనే తెలుస్తుంది రాత్రి ఏడ్చిందని..

చిన్నగా తల నిమిరి నుదుట ముద్దు పెట్టుకుని " గుడ్ మార్నింగ్ అమ్ము బంగారం!! " అని..

" రోజు నీ ఫోటోకి పెట్టి చెప్పేవాడిని ఇప్పుడు నీకే డైరెక్ట్ గా చెప్తున్న.. ఎంత మార్పు కదా.. అసలు అనుకోలేదురా.. నువ్వు నా భార్యగా ఇలా ఉంటావు అని..

నిజంగా ఇప్పుడు ఇదంతా కలగా ఉంది తెలుసా.. అసలు నమ్మడానికి కూడా కష్టంగా ఉంది.. నాకు తెలుసు అమ్ము.. నువ్వు మీ బావచేంజ్ ఎంత ఇష్టపడ్డావో..

నేను అప్పుడు నిన్ను కలివడానికి వచ్చేవాడిని కదా.. అప్పుడు నీ కళ్ళలో నాకు మీ బావ గురించి చెప్పిన ప్రతిసారి మెరుపు కనిపించేది.. అందుకే నీ కళ్ళలో ఆ మెరుపు ఎప్పటికి ఉండాలని మీ బావ గురించి ఎంక్విరీ చేసాను..

అప్పుడే తెలిసింది మీ బావ నిన్ను కాదు సుష్మ ని ఇష్టపడుతున్నట్టు.. ఈ విషయం నీకు చెప్తే నువ్వు నమ్మలేదురా.. అందుకే నీ నుండి దూరం వెళ్లలేక వెళ్ళాను నువ్వు వెళ్లిపో అనగానే..

నిజంగా అమ్ము.. నువ్వు నన్ను ఆక్సిప్టు చేసినా చేయకపోయినా నన్ను మాత్రం వదిలి వెళ్లకు.. నువ్వు లేకఊతే నా ఊపిరి ఆగిపోయినట్టు ఆవుతుంది..

నాకు ఉన్న ఒకే ఒక్క ఫాంటసి ఏంటో తెలుసరా.. నువ్వు నేను నీకు ఇష్టాంగ ఇచ్జి చీరలో నాకోసం ప్రేమగా రావాలంట.. నేను నిన్ను ఆ చీరలో చూసి నాకు చాలా నచ్చి.. నీకు ముద్దు ఇవ్వాలంట.. "ఐ చెప్తూ చిన్నగా సిగ్గు పడ్డాడు..

మళ్ళీ మాట్లాడుతూ..

" నువ్వు నేను.. అమ్మ నాన్న.. మన పిల్లలు.. ఇంకేం వద్దు చాలు.. లైఫ్ లాంగ్ నేను నీ కాళ్ళ దగ్గ ఉండిపోతా.. అదంతా కాదురా.. నాకు ఒక మాట ఇవ్వు..

నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉంటావు కదా.. నన్ను వదిలిపోవు కదా!!! " అని అంటూ అమ్ము కి చెయ్యి చూపాడు.

అమ్ము నిద్రలో ఆ చెయ్యి పై తన చెయ్యి వేసింది. గౌతమ్ ముందు షాక్ అయిన మళ్లి చున్నగా నవ్వుకుని..

"చాలు ఈ మాత్రం భరోసా!! " అని లేచి వాష్రూమ్ కి వెళ్ళాడు ఫ్రెష అవ్వడానికి.

గౌతమ్ వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకున్న అమ్ము కళ్ళు తెరిచింది. అప్పటిదాకా చాలా కష్టంగా కళ్ళతోనే దాచుకున్న కన్నీళ్ళని కోసల నుండి బయటికి పంపించింది.

అలానే ఇంతసేపు గౌతమ్ చెప్పిన మాటలు తలుచుకుని ఆలోచిస్తీ ఉండిపోయింది..

మెల్లగా లేచి కూర్చుని ఉండగా వచ్చాడు గౌతమ్. అమ్ము లేచి ఉండటం చూసి "ఇంకాసేపు పడుకుని ఉండొచ్చుగా అమ్ము.. " అన్నాడు.

" లేదు నిద్ర రావట్లేదు!! " అని అంది లేస్తూ.

" సరే నువ్వేళ్ళు ఫ్రెష్ అవ్వు.. నేను వెళ్లి నీకు కాఫీ తెస్స్తా!! " అని వెళ్ళాడు.

అమ్ము గౌతమ్ నే చుస్తూ ఆలోచిస్తూ ఫ్రెష్ అయ్యి వచ్చింది.

ఎప్పటికో గౌతమ్ అమ్ము కోసం ఒక డ్రెస్ తెచ్చి పెట్టాడు. అలాగే కాఫీ కూడా పెట్టి " త్వరగా రెడి అయ్యి కాఫీ తాగేసి రా.. గుడికి వెళ్లాలంటే!! " అని ఉంది ఒక స్లిప్ లో

దాన్ని చూసి నవ్వుకుని రెడి అయ్యి బయటికి వచ్చింది. కిందకి దిగుతూ.

" గుడ్ మార్నింగ్ అత్తమ్మ.. మావయ్య ఎక్కడ!! " అని అంటూ వెళ్ళింది ఆవిడని హత్తుకుంది.

అక్కడే సోఫాలో కూర్చుని ఉన్న ఆయన "గుడ్ మార్నింగ్ రా తల్లి.. " అని అన్నారు.

ఆయన పక్కనే ఉన్న గౌతమ్ ని చూస్తూ " గుడ్ మార్నింగ్ అండి.. " అంది.

కాఫీ తాగుతున్న గౌతమ్ కి పొలమారింది. అప్పుడే ఇంకా నిద్రలేచి వస్తున్న ఆదిత్య " నహి.. " అని గట్టిగా అరిచాడు.

వాళ్ళు అలా రియాక్ట్ అయ్యేసరికి అందరూ నవ్వేశారు. అమ్ము కూడా నవ్వుతు " ఇది మరీ టు మచ్.. "అని అంది బుంగమూతి పెట్టుకుని కూర్చుంటూ.

" అచ్చో.. మా బుజ్జి అమ్ము అలిగిందే!! " అని అంటూ వచ్చాడు ఆది.

"హే.. పో బ్రష్ చెయ్ ఫస్ట్!! " అని తోసింది ఆది ని.

"చేసే వచ్చానే!! "అని అంటూ పక్కనే షాక్ గా చూస్తున్న గౌతమ్ ని చూసి..

" ఏమైంది రా !! " అని అడిగాడు ఆది.

" నీ చెల్లి నన్ను ఏవండి అందిరా బావ!! "అని అన్నాడు గౌతమ్ షాక్ గా..

" మరి మొగుడ్ని పెళ్ళాం ఏవండి అనకుండా ఎరా అనాలా!! " అని అడిగాడు మొహం చిట్లించి.

" ఇదిగో ఈ వేటకారమే వద్దు అనేది.. " అని అన్నాడు.

" అబ్బా.. మీరు మల్కి గొడవ పడండి కానీ!! ముందు నువ్వు అమ్మాయి గుడికి వెళ్ళండి రా!! " అన్నారు సుమ గారు.

" అలాగే మా.. " అని అంటూ లేచాడు గౌతమ్.

అమ్ము శేఖర్ గారికి , సుమ గారికి నమస్కారం చేసి బయటికి నడిచింది గౌతమ్ వెంట..

వెళ్తున్న వాళ్ళని చూస్తూ.. "వీడి మొహంలో ఈ ఆనందం చూసి ఎన్ని రోజులు అయిందిరా!! " అన్నారు శేఖర్ గారు ఆనందంగా.

" రోజులు కాదు మామా.. నెలలు అను.. అక్కడైతే వీడు మనిషి మనిషిలా లేడు అసలు.. గది మొత్తం అమ్ము ఫొటోలు పెట్టుకుని ఎటు చూసినా అమ్ము కనిపించేలా పేట్టుకున్నాడు.. " అని అన్నాడు ఆది ఎమోషనల్ అవుతూ..

" సరేలెండి ఇప్పటికైనా వీడి జీవితంలో ఆనందం వచ్చింది!! " అని అంటూ ఆది కి కాఫీ ఇచ్చారు సుమ గారు.

" అబ్బా.. అత్త నువ్వు కేక.. నాకు ఎప్పుడు ఏం కావాలో అమ్ము అండ్ నువ్వు మాత్రమే బాగా తెల్సుకోగలరు.. " అని అన్నాడు నవ్వుతు

ఆవిడ నవ్వుతు అక్కడే కబుర్లు చెప్పుకుంటు కూర్చున్నారు..

కార్లో గుడికి వెళ్తున్న గౌతమ్ మొహంలో ఆనంద స్పష్టంగా కనిపిస్తుంది.. తనని గమనించి " గౌతమ్!! " అని పిలిచింది.

" అబ్బా.. అమ్ము.. నువ్వు కూడా గౌతమ్ ఏంటి.. నందు.. అని పిలవచ్చుగా.. గౌతమ్ నందా అని అంత పెద్ద పేరు ఉంది.. " అని అన్నాడు గారంగా.

చిన్నగా నవ్వుతు " నందు.. " అని అంది చాలా చిన్నగా.

అది వినిపించిన వినపడనట్టే " ఏమన్నావ్!!!" అని అడిగాడు పెదాల చాటున నవ్వు దాచేసి..

గౌతమ్ పెదాల చాటున అల్లరిగా ఉన్న నవ్వు కనిపించగానే గుండె ఝల్లుమంది అమ్ముకి..

సైలెంట్ గా కిటికీలో నుండి బయటికి చూస్తూ కూర్చుంది.. ఒక పది నిమిషాలకి గుడి ముందు కార్ ఆపాడు.

కార్ దిగిన అమ్ము గుడి చూసి ఆశ్చర్యపోయింది..

" నేను ఈ గుడికి రెగులర్ గా వస్థానే!! " అని అనుకుంటూ ఉండగా కార్ పార్క్ చేసి వచ్చాడు గౌతమ్.

ఈద్దరు కలిసి గుడిలోకి వెళ్లారు. అమ్ము కి మనసంతా చాలా ప్రశాంతంగా అనిపించింది.

దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. పూజారి గోత్రనామాలు అడిగితే..

"భరద్వాజ గోత్రం..

అమూల్య గౌతమ్ నందన్..

సుమ శ్రీ చంద్రశేఖర్.. " అని చెప్పింది.

పూజారి అర్చన చేయడానికి వెళ్లారు. గౌతమ్ ఆశ్ఛర్యంగా చూస్తూ ఉండటంతో.. అతనిని కదిలించి

" ఏమైంది నందు! " అని అడిగింది చిన్నగా.

" ఈ విషయాలు.. నీకెలా!! " అని అంటున్న గౌతమ్ తో..

" అత్తమ్మ చెప్పింది.. " అంది నవ్వుతూ.

గౌతమ్ కూడా చిన్నగా నవ్వి నమస్కారం చేసుకున్నాడు. హారతి తీర్థం తీసుకున్నాక.. పక్కనే నుదిటిన కుంకుమ లేకుండా ఉన్న అమ్ముని చూసి పూజారి గారు..

" అమ్మ.. నుదిటిన కుంకుమ లేకుండా ఉండకూడదు తల్లి!! "అని గౌతమ్ వైపు తిరిగి..

" బాబు.. నువ్వు ఈ కుంకుమ పెట్టు స్వామి వారికి కుంకుమార్చన చేసిన కుంకుమ ఇది!! " అన్నారు.

గౌతమ్ కాస్త భయంగా అమ్ము వైపు చూసి కుంకుమ తీసుకున్నాడు. చిన్నగా వణుకుతున్న చేతులతో అమ్ము నుదిట వరుకు తెచ్చి ఒక నిమిషం ఊపిరి బలంగా తీసుకుని..

అమ్ము నుదిటిన పెట్టాడు. అమ్ము కళ్ళు మూసుకుంది.. తన కళ్ళలో నుండి నీళ్ళు చెంపలపై రాలాయి.

గౌతమ్ తల దించుకుని మనసులోనే బాధ పడ్డాడు తనకి ఇష్టం లేకుండా పెట్టినందుకు.. ఆ తరువాత బయటికి వచ్చి అక్కడే కూర్చున్నారు.

అమ్ము చుట్టూ చూస్తూ ఉంది.. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది.. తనని అంత ప్రశాంతంగా చూసిన గౌతమ్ చిన్నగా

" అమ్ము ! "అని పిలిచాడు.

" హ.. " అని గౌతమ్ ని చూసింది..

" అది.. అది.. సో.. "అని చెప్తూ ఉండగా..

" నాకు ఆకలేస్తుంది గౌతమ్.. వెళ్దామా!! "అని అడిగింది క్యూట్ గా ఫేస్ పెట్టి.

" అయ్యో.. పదా!! " అని లేచాడు.. " నెను అప్పుడే అనుకున్నాను ఇంకో గ్లాస్ నికి మిల్క్ ఇచుంటే బాగుండేది అని!! "అని అంటూ ముందు ముందు వెళ్తున్నాడు.

అమ్ము నవ్వుతు తన వెనకే వెళ్ళింది. తొందరగా అమ్ముని తీసుకుని కార్ ఎక్కేసి స్టార్ట్ చేసాడు.. ఒక హోటల్ ముందు కార్ ఆపి తనని లోప్లైకి తీసుకెళ్లాడు.

అమ్ము కూడా నార్మల్ గా వెళ్ళింది. తనకి ఇష్టమైన అన్ని ఆర్డర్ చేసి తెచ్చి ముందు పెట్టాడు.

"తిను అమ్ము.. ఆకలి అన్నావ్ కదా!! " అని అమ్మడు తినకుండా ఊరికే ఉన్న అమ్ముని చూస్తూ.

" అది.. నా చెయ్యి కాస్త నోప్పి అయింది.. నువ్వు తినిపంచవ!! " అని అడిగింది తల దించుకుని..

గౌతమ్ ముందు షాక్ అయిన.. అమ్ము కి నొప్పి అని తెల్సి కంగారుగా " అయ్యో ఏమైంది.. ఎక్కడ నొప్పిగా ఉంది!! "అని అంటూ చెయ్యి తీసుకున్నాడు చూడటానికి.

" అబ్బా.. మళ్ళీ చూద్దువు లే నందు.. నాకు ఆకలి వేస్తుంది ఫుడ్ పెట్టు!!! " అని అంది కాస్త విసురుగా..

అంతే టక్కున చెయ్యి వదిలేసి.. ఫుడ్ తీసుకుని తనకి తినిపించడం స్టార్ట్ చేసాడు.

అమ్ము కి చాలా హ్యాపీగా అనిపించింది.. గౌతమ్ నే చూస్తూ తింటుంది..

" నువ్వు తిను.. నీకు కాళీ వేస్తుంది కదా!! " అని అంది తనకి తినిపించాడనికి తెచ్చిన చేయిని గౌతమ్ వైపు పెడుతూ..

" మళ్ళీ తింటాలే రా!! నీకు ఆకలిగా ఉందిగా" అని మళ్ళీ పెట్టడానికి వచ్చాడు.

" ఓహ్.. నా ఎంగిలి అని తినవా!!! " అని అంది ఒరకంట గమనిస్తూ..

" నువ్వు నిజంగా అలా అనుకుంటున్నవా అమ్ము!!! " అని బాధగా అని తన నోటిలో పెట్టుకున్నాడు ఫుడ్ ని.

అమ్ము చిన్నగా నవ్వింది..

తరువాత అమ్ముకి ఫుడ్ తినిపించి మూతి తుడిచి వాటర్ తాగించాడు. అమ్ము కి చాలా హ్యాపీగా ఉంది లోపల..

ఆ తరువాత ఇద్దరు ఇంటికి స్టార్ట్ అయ్యారు. ఇంటికి రాగానే అమ్ముని అక్కడే సోఫాలో కూర్చోపెట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చి..

" ఎక్కడ రా నొప్పి!!! " అని అంటూ చేయి తీసుకున్నాడు.

గౌతమ్ చేసిన హడావిడికి అందరూ హాల్లోకి వచ్చారు.. వాళ్ళని చూడగానే అమ్ముకి ఎం చెప్పాలో తేలిక..

"నేను వాష్రూమ్ వెళ్ళాలి!! " అని ఇంకో మాట మాట్లాడకుండా రూమ్ కి పరుగు తీసింది..

" అమ్ము మెల్లగరా!! "అని అంటూ వెనకే వెళ్ళాడు గౌతమ్.

అమ్ము మొహంలో కనిపిస్తున్న హ్యాపీనెస్ చూసి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు..

అమ్ము రూమ్ కి వెళ్లి అక్కడ బేడ్ మీద కూర్చుంది.. గౌతమ్ కూడా వచ్చి కింద కూర్చుని..

"హ్మ్మ్.. చెప్పు ఎక్కడ నొప్పి!! " అని అంటూ చెయ్యి తీసుకున్నాడు.

" అది.. అది.. ఎక్కడ నొప్పి లేదు.. ఊరికే అబద్ధం చెప్పాను!! " అని అంది చిన్నగా.

" హమ్మయ్య.. నొప్పి ఎం లేదా.. నేను ఇంకా కంగారు పడిపోయా!! థాంక్ గాడ్!! "అనుకుని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎత్తి పెట్టాడు.

" నేను ఎందుకు అబద్ధం చెప్పాను అని ఆలోచించావ్ ఏంట్రా ముద్ద పప్పు!! " అని అనుకుంది అమ్ము మనసులో..

కొద్దిసేపటికీ అందరూ లంచ్ చేసి మళ్ళీ మాటల్లో పడ్డారు..

అలా ఒక వన్ వీక్ గడిచింది..

ఈ వారంలో అమ్ము కి గౌతమ్ కి కాస్త క్లోస్నెస్ పెరిగింది.. గౌతమ్ అమ్ముకి ఎనీ టైం ఎం కావాలో అది ఇస్తూ.. తనే ఫుడ్ తినిపిస్తూ ఎనీ టైం అమ్ముతోనే ఉన్నాడు..

మునుపటి అమ్ముల అయింది అమ్ము కూడా.. ఇంకా చెప్పాలంటే అమ్ములో అల్లరి స్టార్ట్ అయింది కొత్తగా..

అలా వన్ వీక్ తర్వాత అమ్ముకు అన్నం తినిపిఆతు ఉండగా డైనింగ్ హాల్ కి వచ్చారు శెకర్ గారు , సుమ గారు..

వాళ్ళని చూసిన గౌతమ్..

" ఏంటి నాన్న.. అలా ఉన్నారు!! " అని అడిగాడు.

"అది నువ్వు ఒక వన్ వీక్ యూ ఎస్ కి వెళ్ళాలి!!!!!! " అని అన్నారు.

అది విన్న వెంటనే అన్నం తింటున్న అమ్ముకి పోలమారింది.. వెంటనే కంగారుగా వాటర్ ఇచ్చి వెన్ను నిమిరి తనని తీసుకెళ్లి హాల్లో కూర్చోపెట్టాడు.

అమ్ము కాస్త కుదుటపడి నవ్వాక ఊపిరి పీల్చుకున్నారు గౌతమ్.

" ఇప్పుడు సడన్ గా ఎందుకు నాన్న!! " అని అడిగాడు కాస్త డల్ గా..

" అది.. అక్కడ ఒక డీల్ ఒకే చేయడానికి రా.. నేనే వెళ్లెవాడిని కానీ నేను బెంగళూరు లో ఎదో మీటింగ్ కి అట్టెండ్ అవ్వాలి..!!! " అని అన్నారు ఆయన.

" ఎప్పుడు వెళ్ళాలి!! " అని అడిగాడు.

" టుడే ఈవెనింగ్ ఫ్లైట్!!! "అని అన్నారు.

గౌతమ్ ఎం మాట్లాడకుండా సైలెంట్ గా రూంకి వెళ్ళిపోయాడు. అమ్ము కంగారుగా..

" మావయ్య.. నేను వెళ్లి ఆయనని ఒప్పిస్తా.. మీరు టికెట్స్ బుక్ చేయండి!!! " అని అంది.

" అలాగే తల్లి!! "అని అన్నారు ఆయన.

అమ్ము రూంకి వెళ్ళింది. అక్కడ ఎక్కడ గౌతమ్ కనిపించలేదు.. అంత వెతుకుతూ వెళ్ళింది..

బాల్కనీలో ఉన్నాడు.. వెనకే వెళ్లి " నందు!!! "అని అంది చిన్నగా..

వెంటనే తనని గట్టిగా హగ్ చేసుకున్నాడు గౌతమ్.. అమ్ము ఫస్ట్ ఆశ్చర్యపోయిన గౌతమ్ చాలా బాధ పడుతూన్నాడు అని అర్థం అయింది..

అందుకే వెన్ను నిమురుతూ ఉండిపోయింది.. గౌతమ్ ఇంకా గట్టిగా అమ్ముని గుండెలకి పొదువుకుంటు..

" నాకు నిన్ను వదిలి వెళ్లాలని లేదు అమ్ము.. అప్పుడు ఒకసారి అలా వెళ్లినందుకు చాలా దూరం అయ్యావ్.. ఇప్పుడు వెళ్తే... " అని మాటలు రాక ఆపేసాడు.

అమ్ము గౌతమ్ వెన్ను నిమురుతూ..

" నందు.. అప్పుడు మన మధ్య ఎలాంటి బంధం లేదు.. కానీ ఇప్పుడు మన మధ్య ఒక బంధం ఉంది.. అలాంటప్పుడు నీకు ఎలా దూరం అవుతాను!!! "అని అంది.

"నిజంగా నాకు దూరం అవ్వవు కదూ.. "అని అడిగాడు చాలా ఆశగా.

" మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళను.. నువ్వు రాగానే నీ కంటికి కనిపిస్తాను.. నేనే ఎదురు వస్థాని!! " అని అంది నవ్వుతూ..

" థాంక్యూ సో మచ్ అమ్ము!!! "అని గట్టిగా అంటూ అమ్ముని ఇంకా గట్టుగా పట్టుకున్నాడు..

అప్పుడు కానీ అర్థం కాలేదు ఇద్దరికి వాళ్ళు ఉన్న పోసిషన్.. కాస్త ఇబ్బందిగా కదిలారు..

అమ్ముని వదిలేసి గౌతమ్ కిందకి వెళ్ళాడు చెప్పడానికి.. అమ్ము గౌతమ్ టచ్ ని ఫీల్ అవ్వుతూ నవ్వుకుంది..

తరువాత వెళ్లి గౌతమ్ బట్టలు సర్దితు ఉంది.. అన్ని సర్దాక వచ్చాడు గౌతమ్..

" అమ్ము.. ఇంకో వన్హౌర్ లోనే ఫ్లైట్.. " అని అంటూ..

" హ్మ్మ్.. అన్ని సర్దేస.. " అని అంది.

గౌతమ్ అంత ఒకసారి చూసి అమ్ము ని చూస్తూ " సోరి.. " అని అన్నాడు.

"ఎందుకు!!! " అని అంది అర్థం కాకా..

టక్కున అమ్ముని మల్కి హగ్ చేసుకుని గట్టిగా కళ్ళు మూసుకుని నుదిటి యోగా ముద్దు పెడుతూ..

"ప్లీస్ నువ్వు ఎయిర్పోర్ట్ కి రాకు.. నిన్ను చూస్తూ దూరంగా వెళ్ళలేను!! ఇప్పుడు కూడా నిన్ను దగ్గరికి తీసుకొకపోతే ఊపిరి ఆగిపోతుంది ఏమో అనిపించింది!!! " అని అమ్ముని చూడకుండా..

అలానే సూట్ కేస్ తీసుకుని కిందకి వెళ్ళిపోయాడు ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు..

అమ్ము అలానే అక్కడే కూర్చుండిపోయింది.. గౌతమ్ ని వదలాడినికి వెళ్ళాడు ఆది.

అమ్ము కొద్దిసేపటికి తేరుకుని ఆ రూమ్ ని చూసింది.. ఎందుకో చాలా వెలిథిగా అనిపించింది..

అలానే చూస్తూ ఉంది రూమ్ అంత.. సడన్ గా తన కాళ్ళు ఒకచోట ఆగిపోయాయి..

అక్కడ షెల్ఫ్ దగ్గర ఎదో ఉన్నట్టు అనిపించింది. చిన్నగా దాన్ని తోసింది..

ఒక డోర్ ఓపెన్ అయింది.. షాక్ అయింది అమ్ము..

" ఇక్కడొక రూమ్ ఉందా!! " అని అనుకుంటూ లోపలికి వెళ్ళింది..

ఎదురుగా పెద్ద ఫ్రేమ్ లో అమ్ము ది ఒక ఫోటో ఉంది.. అది లంగావోనిలోది..

చాలా ముద్దుగా ఉంది.. తరువాత కొన్ని ఫోటోలు ఉన్నాయి అక్కడే పక్కన.. అలానే చూస్తూ వెళ్ళింది..

అక్కడొక బెడ్.. సోఫా ఉన్నాయి..

అమ్ము అల్బే చూస్తూ వెళ్ళింది.. అక్కడ సోఫా దగ్గర టేబుల్లో ఎదో బుక్ ఉంది..

దానిమీద " నా అమూల్యమైన అమ్ములయా.. " అని ఉంది..

దానిలో ఏముందో తెలుసుకోవాలని ఓపెన్ చేసింది.. అందంగా ఉన్న హ్యాండ్రైటింగ్ తో.. గుండ్రంగా ఉన్న అక్షరాలతో..

❤️ నా ఆనందంలో నవ్వు నువ్వు..

నా ఊహల్లో చిత్రం నువ్వు..

నా గుండెలో చప్పుడు నువ్వు..

నా నిద్రలో కలవు నువ్వు..

నన్ను తట్టి చూసుకుంటే నాలో కలిగే పులకరింతకి చిరునామా నువ్వు..

నేను అనే పదానికి అర్థమే నువ్వు ❤️ అని రాసి ఉంది..

అది చదివిన అమ్ముకి గౌతమ్ కళ్ళ ముందు మెదిలాడు.. అలానే పేపర్ తిప్పింది.. తన ఫోటో స్కెచ్ ఉంది.. దాని పక్కన..

వర్షాకాలంలో ఇంద్రధనుస్సు ఎంత అందంగా కనిపిస్తుందో!!

నిన్ను ప్రేమించేవారికి నువ్వు కూడా అంత అందంగా కనిపిస్తావు బంగారం!!   అని ఉంది.

దాని చూడగానే అమ్ము పెదాల మీద నవ్వు పూసింది.. బుగ్గలు ఎరుపురంగు సంతరించుకున్నాయి..

అలా మెల్లగా డైరీని చదువుతూ గతంలోకి జారుకుంది..

అక్కడ ఫ్లైట్ లో గౌతమ్ కూడా అమ్ము గురించి ఆలోచిస్తూ.. తను మొదట అమ్ముని చూసిన రోజుకి వెళ్లాడు కళ్ళు మూసుకుని..

మనం వాళ్ళతో పాటు వెళ్లిపోదాం రండి..💃💃💃💃

--//--

వన్ ఇయర్ బ్యాక్..

" గౌతు.. లేరా.. గుడికి వెళ్దాం.. ఈరోజు మర్చిపోయావ.. " అని అంటూ బెడ్ షీట్ లాగుతున్నారు సుమ గారు.

టక్కున లేచి బాత్రూం లోకి దూరడు గౌతమ్. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు.

కిందకి వచ్చి వాళ్ళ అమ్మానాన్నల బ్లెస్సింగ్స్ తీసుకుని గుడికి బయల్దేరాడు..

ఇద్దరు గుడికి చేరుకున్నాక గౌతమ్ కార్ పార్క్ చేసి లోప్లైకి వెళ్ళాడు. ప్రదక్షిణలు చెయ్యడానికి వెళ్తుంటే వాళ్ళ అమ్మ పిలిచింది.

వెనక్కి తిరిగి మాట్లాడేసి ముందుకు తిరిగిన అతనికి మాటలు రావట్లేదు. చూపులు తిరగట్లేదు..

అడుగులు పడట్లేదు.. అలాగే ఉండిపోయాడు.. కానీ వెనక rr గా..

" గుడి గంటలు మోగిన వేళా..

 మది సంబర పడుతోంది..

 తొలి సంధ్యల వెలుగుల వేళా

 తెగ తొందర పెడుతుంది.. " అని వినిపించింది.

అలానే చూస్తుండి పోయాడు అక్కడున్న దృశ్యాన్ని. అక్కడొక అమ్మాయి చిన్నపిలల్లతో ఆడుకుంటూ కనిపించింది.

తనని చూస్తుంటే వేరే ప్రపంచమే వద్దనేంత అందంగా.. ముద్దుగా ఉంది. ఈసారి నిజంగా గుడిలో గంటలు మోగిన శబ్దానికి తెరుకున్నాడు.

కంగారుగా మొత్తం గుడి అంత చూసాడు. లాస్ట్ లో ప్రదక్షిణలు చేస్తు కనిపించింది.

ఇంకేం ఉంది బాబు ఊపిరి పీల్చుకుని తన దగ్గరికి వెళ్లాడు. ఆ అమాంయి వెనకే కాస్త దూరంలో ఉంటూ తననే చూస్తూ తన కళ్ళలో నిలిపేసుకున్నాడు

మళ్లి సుమ గగారు పిలిచారు. ఆవిడతో మాట్లాడి వచ్చేసరికి ఆ అమ్మాయి కనపడలేదు. ఎదో బాధ చుట్టేసింది మనసుకి.

అంత వెతుకుతూ ఉన్నాడు. అలా గుడి బయటికి వచ్చాడు.. అలా అబ్బాయి బండెక్కుతూ ఉంది.

వదిలేస్తే తను వెళ్ళిపోతుంది ఏమో అని భయపడి కంగారుగా తన దగ్గరికి వెళ్తుండగా ఆ అమ్మాయి బైక్ పై కూర్చుని వెళ్ళింది.

ఆ బైక్ నెంబర్ చూసిన గౌతమ్ మొహం వెయ్యి వోల్టులు దాటి లక్ష వోల్టులు బల్బు వెలిగినంతగా వెలిగింది..

అలానే అక్కడే నిలుచుని ఉండిపోయాడు. సుమ గారు వచ్చి మాట్లాడించెదాకా అసలు కదలకుండా బైల్ వెళ్లిన వైపే చూస్తున్నాడు.

ఆవిడ వచ్చాక తేరుకుని కార్ దగ్గరికి నడిచాడు.. ఇంటికి వెళ్లేంత దాకా తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటూ సిగ్గు పడుతూ ఉన్నాడు.

అన్ని గమనించిన సుమ గారు కూడా నవ్వుకున్నారు.

ఆ తరువాత ఒక రెండు రోజులకి ఆ బండి నెంబర్ ఉన్న వ్యక్తికి కాల్ చేసి మాట్లాడి వెళ్ళాడు.

మాల్లో ఐస్ క్రీమ్ తింటూ ఉంది ఆ అమ్మయి. ఇంతలో తన పక్కన ఎవరో వచ్చి కూర్చున్నారు.

ఆ అమ్మాయి షాక్ అయింది అలా కూర్చునేసరికి.. కాస్త భయపడి కూడా ఉంది.

" హాయ్ అమ్ము.. " అన్నాడు అతను.

" ఎవరు మీరు!! నా పేరు మీకేలా తెలుసు !! " అని సీరియస్ గా చూస్తూ అడిగింది.

" నా పేరు గౌతమ్ నందన్.. మా నాన్న పేరు శేఖర్.. అమ్మ సుమ.. ఒక బెస్ట్ ఫ్రండ్ ఉన్నాడు.. వాడి పేరు.. "అని చెప్పబోతుంటే..

" ఈ డీటెయిల్స్ నాకెందుకు.. ప్లీస్ ఇక్కడి నుండి వెళ్తారా.. "అని అంది చేయి చూపిస్తూ.

" ❤️ ఐ లవ్ యూ ❤️ " అని అన్నాడు కళ్ళలోకి చూస్తూ.

ఒక్క క్షణం షాక్ అయింది అమ్ము.. 

" హే.. నీకేమైన పిచ్చ.. నా గురించి ఎం తెలుసని.. " అని అంటుంటే..

"నీ గురించి తెలుసుకుని నిన్ను ప్రేమించలేదు అమ్ము.. నిన్ను ప్రేమించక నీ గురించి తెలుసుకున్న.. కావాలంటే చెప్తా విను..

" నీ పేరు అమూల్య.. నాన్న నిరంజన్.. అమ్మ లక్ష్మీ.. అన్నయ్య ఆదిత్య.. అత్త భాగ్య.. మామా శ్రీధర్.. వాళ్ళ కొడుకు వేదాంత్.. మీ ఇంట్లో ఇంకో అమ్మాయి ఉంటుంది తన పేరు సుష్మ.. " అని టక టక చెప్పేసాడు.

"హ్మ్మ్.. ఇంత తెలుసుకున్న నువ్వు నేను మా బావని ఇష్టపడుతున్న అని తెలుసుకోలేద.. " అంది సీరియస్ గా చేతులు కట్టుకుని.

ఒక్క క్షణం మాటలు రాలేదు.. గుండె ఆగినంతగా అయిపోయింది.. గొంతు తదరిపోయి ఎదో ఫీల్ వచ్చేసింది.. కాళ్ళలో సత్తువ లేదు..

మళ్ళీ అమ్ము మాట్లాడించేదాక ఎం మాట్లాడలేదు..

" అవునా.. నువ్వు నిజంగా ప్రేమిస్తున్నవా!! " అని అడిగాడు మాటలను కూడదీసుకుని.

" అవును.. చాలా ఇష్టం.. నాలుగేళ్ళ నుండి ఇష్టపడుతున్న!!! "అంది. ఎందుకో అమ్ముకి కూడా అతనితో మాట్లాడాలి అని ఉంది..

" సరే.. నువ్వు తనని చేయకుంటే హ్యాపీగా ఉంటావా.. " అని అడిగాడు.

" హ.. " అని అంది..

" ఒకే!!! " అని వచ్చేసాడు తను పిలుస్తున్న.. అంతకుమించి మాట్లాడాలి అంటే ఇంకా ఏడ్చేస్తాడు ఏమో తన ముందు అని..

భారంగా కింద కార్ దగ్గరికి వచ్చాడు. గౌతమ్ రావడం చూసిన ఆదిత్య వచ్చాడు.

" ఏమైంది రా!! ఎందుకు అలా ఉన్నావు!! " అని అడిగాడు వస్తూనే.

" రేయ్.. తను మీ బావని ఇష్టపడుతుంది అంట.. తనకే ఇచ్చి చేయండి!! " అని అన్నాడు.

"కానీ నువ్వు.. " అని ఆగిపోయాడు ఆది.

" నాది ఎంతరా.. మహా అయితే మూడు రోజుల ప్రేమ.. కానీ తనది నాలుగేళ్ళ ప్రేమ.. తన ప్రేమ ముందు నా ప్రేమ ఎంతరా!!!తను హ్యాపీగా ఉంటే చాలు " అన్నాడు.

" నీకు బాధగా లేదరా!! " అడిగాడు ఆది.

గౌతమ్ వెంటనే ఆదిని గట్టిగా హగ్ చేసుకుని " చాలా బాధగా ఉందిరా బావ.. తనే నా జీవితం అనుకున్న.. కానీ తన మనసులో.ఇంకోరు ఉన్నారు అని తెలిసాక ఇంకేం చేస్తాం..

తను నిజంగా మీ బావతో ఉంటే హ్యాపీగా ఉంటుంది రా.. అది తన కళ్ళలో చూసాను.. తన హ్యాపీనెస్ నే నేను ఎప్పుడు కోరుకునేది.. " అని అన్నాడు.

ఆ తరువాత చాలా కష్టంగా ఇంటికి వెళ్లి సుమ గారి వడిలో పడుకున్నాడు.

మళ్ళీ ఒక వారం రోజులు కనిపించలేదు అమ్ముకి..

కానీ ఈ వారం రోజుల్లో వేద్ పైన నిఘా పెట్టి తను ఎలాంటి వాడో తెల్సుకున్నాడు.. అదే టైం కి వేద్ కి సుష్మ అంటే ఇస్తామని తెలిసింది..

ఇంకా అదే న్తరేర్ అమ్ముకి చెప్పాలని వెళ్లాడు.. అమ్ము ఎవరితోనో మాట్లాడుతుంది..

" తండ్రి సంపాదనతో బతికే వాడు అసలు మనిషే కాదు..

తను సంపాదించి తండ్రికి ఆసరా అవ్వాలి.. " అని ఎదో మాట్లాడుతూ ఉంది..

అలానే రోడ్ క్రోస్ చేస్తూ వెళుతుండగా సడన్ గా గౌతమ్ గుండె ఆగినంత పని అయింది.

ఎదో వెహికల్ వచ్చి అమ్ముకి డాష్ ఇచ్చింది.. అంతే ఇంకొక్క క్షణం అక్కడ లేడు..

అమ్ము దగ్గర ఉన్నాడు తనని పిలుస్తూ ఎత్తుకుని హాస్పిటల్ వైపు పరుగు తీసాడు.

హాస్పిటల్ దాకా పరిగెడుతూనే వెళ్తూ తనని మాట్లాడిస్తున్నాడు. తనని అలా చూడలేకపోతున్నాడు.

హాస్పటల్ లో అడ్మిట్ చేసి ఆది కి కాల్ చేసాడు. ఆది కూడా రాగానే తనకి అంత చెప్పాడు.

ఇద్దరు అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా దాదాపు చాలసేపటికి అమ్ముని చూడొచ్చు అన్నారు.

కంగారూగ వెళ్ళాడు గౌతమ్.. అమ్ముని చూస్తుంటే కన్నీలకు ఆగనంటున్నాయి..

అలానే నిలుచుండిపోయాడు. చిన్నగా తన చేయి పట్టుకుని ప్రేమనంత మూటగట్టి నుదిటి మీద ముద్దిచ్చాడు.

ఆది అక్కడే అమ్ము దగ్గర కూర్చున్నాడు.. కాస్త కాస్త స్పృహ వస్తున్నది అమ్ముకు..

దానితో అక్కడినుండి వెళ్ళిపోయాడు.

మళ్ళీ ఒక వారం రోజులు కనిపించలేదు.. అలా ఒకరోజు మల్కి గుడి దగ్గర కనిపించాడు.

"అమ్ము.. నీతో మాట్లాడాలి " అంటూ వచ్చాడు.

" అబ్బా.. నువ్వు ఇంకా వదలవా నన్ను!! " అని అంది.

నవ్వుతు " ఎప్పటికి!!! " అని అన్నాడు.

మొహం తిప్పుకుని కూర్చుంది.

" చూడు అమ్ము.. నీ బావ నిన్ను ప్రేమించట్లేదు.. నువ్వు అర్థం చేసుకో.. మళ్ళీ బాధ పడతావు!! " అని అంటూ ఉండగా..

తను తింటున్న ఎంగిలి ప్రసాదం గిన్నెని గౌతమ్ పై వేసింది.. అందులో ఉన్న ప్రసాదం గౌతమ్ పై పడింది..

సైలెంట్ గా నిలుచున్నాడు గౌతమ్..

" అసలు ఎవరు నువ్వు.. నీ గురించి ఎం అనుకుంటున్నావ్.. ఇంకోసారి నా కళ్ళ ముందు కనపడ్డావు అంటే ఎం చేస్తానో నాకే తెలీదు జాగ్రత్త..

నువ్వు నా లైఫ్ లో నా కళ్లెదుటే లేకపోతే నేను చాలా హ్యాపీగా ఉంటా.. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తూ నా హ్యాపీనెస్ కోరుకుంటే "అని అంటూ చేతులు జోడించి..

"ప్లీస్ వెళ్లిపో.. "అని అంది. చాలా కష్టంగా మాట కూడా దీసుకుని.

" నిజంగా నేను వెలిద హ్యాపీగా ఉంటావా!! " అని అడిగాడు.

"చాలా " అంది.

" సరే వెళ్తాలే.. నువ్వు చెప్పింది ఈడౌన్ చేస్తాను.. అలాంటిది నీకు దూరంగా వెళ్లలేనా.. కానీ ఒకటి ఎదో ఒక రోజు మీ బావకి నువ్వంటే ఇష్టం లేదు అని తెలిస్తుంది.. అప్పుడు మాత్రం జాగ్రత.. " అని అంటూ అలానే వెళ్ళిపోయాడు.

అమ్ము కోపంగా ఇంటికి వెళ్ళిపోయింది.

ప్రెసెంట్..

ఆరోజు జరిగింది గుర్తు రాగానే అమ్ము కళ్ళు నీలల్తో నిండిపోయాయి..

" చాలా బాధ పెట్టా కదా నందు!! " అనుకుని మళ్ళీ చదవడం ఆటర్ట్ చేసింది..

పాస్ట్..

అలా నీ నుండి వెళ్ళిపోయాక నిన్ను మర్చిపోలేక నువ్వు నే ఫ్రండ్ తో చెప్పిన మాటలను గుర్తు వచ్చాయి..

డాడ్ తో మాట్లాడి ఒక స్టార్ట్ అప్ కంపబయ్ పెట్టి నేము దూరంగా వచ్చేసా.. బెంగళూరు కి..

అక్కడ నేను ఆది ఇద్దరు కలిసి ఉంటూ ఉండేవాళ్ళం..

అని లాస్ట్ పేపర్లో..

అమ్ముని చివరి సారిగా చుఅయిన ఫోటో స్కెచ్ పక్కన..

" నువ్వు నా పక్కన ఉన్న లేకున్నా..

నా మనసు నిన్ను.మాత్రమే కోరుకుంటుంది..

ఎందుకంటే!!!!!

నా మనసు నిన్ను ఇష్టపడినంతగా ఇంకెవరిని ఇష్టపడదు..

నిన్ను ప్రేమించినంతగా ఇంకెవరిని ప్రేమించదు.. " అని ఉంది..

మళ్ళీ చాలా పేపర్స్ కాళిగా ఉన్నాయి.. ఇంకా లాస్ట్ల..

" నీతో ఉన్న క్షణాలని గుర్తు చేసుకుంటూ..

మళ్ళీ నీతో ఉండే క్షణాల కోసం ఎదురుచూస్తూ..

నీ దరి చేరే సమయంలో నిన్ను చూస్తానన్న సంతోషం..

నిన్ను చూసి ఎన్ని రోజులు అవుతుందనే బాధతో..

నా కళ్ళు వర్షించాడం మొదలు పెడతాయి..

నిన్ను చూడగానే నా మనసుకి సంతోషం..

నా మోములో నవ్వు..

నా జీవంకి ప్రాణం ఒకేసారి వస్తాయి.. " అని..

లాస్ట్లో..

" అమూల్య లేనిదే గౌతమ్ లేడు.. " అని కంప్లీట్ చేసి ఉంది..

అంత కంప్లీట్ అయ్యేసరికి చుట్టూ చీకట్లు ముసురుకున్నాయి.. కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి ఇంతసేపు..

కానీ ఇప్పుడు ఆనందంతో నిండిపోయాయి..

మెల్లగా లేచి ఫ్రెష్ అయ్యి కిందుకై వెళ్ళింది.. సుమ వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోయింది..

నైట్ ఎదో కొద్దిగా తినేసి వెళ్లి పడుకుంది.. కానీ రూమ్ అంత గౌతమ్ లేడు అన్న వెలితే ఉంది..

అలానే ఎప్పటికో నిద్రలోకి జారుకుంది..

వారం రోజుకు గడవడానికి చాలా కష్టపడింది అమ్ము.. అక్కడ గౌతమ్ కూడా..

ఇద్దరిని ఈ దూరం ఇంకా దగ్గర చేసింది.. కానీ ఒక్కరోజు మాట్లాదుకోలేదు..

గౌతమ్ ఇండిల్ వచ్చాడు. ఇంటికి ఆత్రంగా వచ్చాడు అమ్ముని చూడ్డానికి..

కానీ ఇల్లంతా కాళిగా ఉంది.. ఎక్కడ అమ్ము , అమ్మ ఇద్దరు కనిపించలేదు..

ఇద్దరిని వెతుకుంటు వెళ్ళాడు..

అంతలో ఫోన్ రింగ్ అయింది.. కాల్ చేసింది సుమ గారు..

" మేము అర్జెంట్ పని మీద బెంగళూరు వెళ్తున్నాం.. ఆది కూడా వస్తున్నాడు.. అమ్ము ఒకటే ఉంది.. జాగ్రత్త!! "అని కాల్..

అమ్ము ఒకటే ఉంది కంగారుగా వెళ్ళాడు రూమ్ కి.

అక్కడ అమ్ము లేదు.. ఒక డ్రెస్ అండ్ ఒక లెటర్ ఉంది..

" నన్ను చూడాలంటే ఫ్రెష్ అయ్యి.. ఈ డ్రెస్ వేసుకుని టెరోస్ పైకి రా!!! " అని ఉంది.

ఏమైంది అమ్ముకి.. ఎదో తేడా కొడుతుంది.. అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు.

రెడి అయ్యి టెరోస్ పైకి వెళ్ళాడు. కింద అంత గులాబీ రేకులు ఉన్నాయి..

లైట్స్ ఉన్నాయి.. మెల్లాగా ఇంకాస్త ముందుకు వెళ్ళాడు.

అంతే టక్కున ఆగిపోయాయి గౌతమ్ అడుగులు.. వెనక నుండి తనని రెండు చేతులు చుట్టేయడంతో..

" అమ్ము!!! " అని ప్రేమగా పలికింది గౌతమ్ స్వరం..

" ఐ లవ్ యూ గౌతమ్❤️! " అని ప్రేమగా చెప్పింది.

ఆ మాట విన్న వెంటనే గౌతమ్ గుండె వెగం పెరిగింది.. మాట రావట్లేదు...

చాలా కష్టంగా మాట్లాడుతూ " ఏమన్నావ్!!! " అని అని అడిగాడు.

" ఓరి నా అముల్ బేబీ.. ఇంత ఫీల్ తో చెప్పిన అర్థం కాలేదు!! " అని అడిగింది ముందుకు వచ్చి..

" ఉహు!!! " అని అన్నాడు అమయకంగా తలా ఊపుతూ..

అమ్ము తలా కొట్టుకుని.. మళ్ళీ గౌతమ్ కళ్లలోకి చూస్తూ..

" ❤️ఐ లవ్ యూ గౌతమ్❤️ " అంది తనని అలానే హత్తుకుంటూ..

" ఐ లవ్ యూ టూ!!!!!❤️❤️❤️ " అని గట్టిగా అంటూ హగ్ చేసుకున్నాడు గౌతమ్..

ఇద్దరూ ఆ ఫీల్ లోనే ఉండిపోయారూ.. ఆమె మెల్లగా తల పైకెత్తి గౌతమ్ కళ్ళలోకి చూస్తూ తన నుదిటి మీద ముద్దు పెట్టింది.

" పెట్టాల్సింది ఇక్కడ కాదు.. ఇక్కడ!!! " అంటూ అమ్ము పెదాలు అందుకున్నాడు.

ఊహించని దానికి షాక్ అయిన.. మెల్లగా గౌతమ్ కి సహకంరించింది.. ఇద్దరు తమ తొలి ముద్దుని ఇచ్చుకుంటు అలానే ఉండిపోయారు..

అమ్ముకి ఊపిరి అందట్లేదు.. అయిన గౌతమ్ వదలకుండా అలానే పట్టుకుని ఉన్నాడు.. గౌతమ్ కి కూడా ఊపిరి కష్టంగా ఉంది..

లాస్ట్ కి ఎలానో అమ్మునే గౌతమ్ ని తోసి అలానే తన గుండెల ఓయ్ వాలిపోయింది..

"అసలు.. నీకు బుద్ధి ఉందా!! " అని అంటూ ఉంటే..

మళ్ళీ చిన్నగా పెదాల మీద ముద్దు పెట్టి..

" వదిలితే ఎక్కడ దరం అవుతావేమో అని వదల్లేదు " అన్నాడు..

గౌతమ్ మీ హగ్ చేసుకుంటూ " ఇంకా ఎక్కడికి వెళ్ళను.. " అంది.

ఇద్దరు అలానే ఉండిపోయి.. కిందకి వచ్చారు కొద్దిసేపటికి..

అమ్ముని గౌతమ్ కి డిన్నర్ తినిపించింది.. గౌతమ్ అమ్ముకి తినిపించాడు.

ఇద్దరు తిన్నాక రూంలోకి వెళ్లారు. అక్కడ ఇంకో రూమ్ అంత పూలతో ఉంది..

అది చూసిమ గౌతమ్ అమ్ముని చూసాడు..

అమ్ము తల దించుకుంది.. అమ్ము తలని పైకి లేపుతూ..

" నువ్వు నిజంగా దీనికి రెడి గా ఉన్నావా!! " అని అడిగాడు.

చిన్నగా సిగ్గు పెడుతు తల ఊపింది అమ్ము.. ఇంకేముంది బాబు ఫుల్ జోష్ అయ్యి.. డీల్ కుష్ అయ్యి.. అమ్ము ని ఎత్తుకుని బెడ్ మీదకి చేర్చాడు..

చిన్నగా అమ్ము నడుము మీద చేయి వేసి నొక్కాడు.. అమ్ము కి గుండె వేగం పెరుగుతూ ఉండగా ఆ స్పర్శకి ఒళ్ళు జల్లుమని గౌతమ్ గుండెల్లో మొహం దాచుకుంది..

గౌతమ్ అలానే చేతిని పైకి జరుపుతూ అమ్ముని తనకి దగ్గరగా లాక్కుంటూ అమ్ము పెదాలు అందుకున్నాడు..

అమ్ము కూడా గౌతమ్ కి సహకరిస్తూ మెల్లగా గౌతమ్ కి అనుకూలిస్తూ తనలో ఓదిగిపోయింది..

ఇద్దరు ఆ రాత్రి వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని ప్రేమతో ఒకటి చేసి వాళ్ళు ఒకటి అయ్యి కలిసిపోయారు..

--//--

మరుసటి రోజు గౌతమ్ కి మెలుకువ వచ్చేసరికి టైం చాలా అయింది.. పక్కన ఉన్న అమ్ముని చూసాడు..

తన గుండెల్లో గువ్వ పిట్టల ఒదిగిపోయింది.. చాలా ముద్దుగా కనిపించింది..

చిన్నగా అమ్ము బుగ్గ ఓయ్ ముద్దు పెట్టి అమ్ముని పక్కకి జరిపి పైకి లేచాడు.

ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్లి కాఫీ రెడి చేసాడు. అమ్ము అప్పటికి లెవకపోవడంతో..

" అమ్ము!! లేరా.. కాఫీ తాగేసి బజ్జో౦దువు " అని అన్నాడు తనని లేపుతూ..

చిన్నగా లేచింది.. తను ఉన్న స్టేజ్ చూసి చటుకున్న అలాగే పడుకుంది..

గౌతమ్ అది గమనించి నవ్వుకుని " లేరా.. అలాగే పడుకున్నావ్!! "అన్నాడు నవ్వుతు..

" నువ్వు పో.. నేను లేస్తా " అంది

" ఏ.. ఇప్పుడే లేయి.. "అన్నాడు..

" అది.. అది.. " అని అంటూ ఉంటే..

"నువ్వు నా ముందు కూడా ఇబ్బంది పడకూడదు.. " అని కాఫీ అక్కడే పెట్టెసి బాల్కనీ లోకి వెళ్ళాడు.

అమ్ము లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ తాగుతూ గౌతమ్ దగ్గరికి వెళ్లి తన ఒడిలో కూర్చుంది.

గౌతమ్ అమ్ము చుట్టూ చేతుకు చుట్టి " నిజంగా నిన్న రాత్రి జరిగింది నిజమే కదా!! " అన్నాడు కొంటెగా చూస్తూ.

" నిజమే!!! " అని అంటూ నవ్వుతు గౌతమ్ గుండెల మీద బజ్జుని అక్కడ ముద్దు పెట్టింది..

గౌతమ్ అమ్ము చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుని అలానే కూర్చుండిపోయాడు.

--//--

అలా రోజులు గడుస్తూ ఉన్నాయి.. అమ్ము గౌతమ్ ఇద్దరు వాళ్ళ ప్రేమలో మునిగి తేలుతున్నారు..

గౌతమ్ డైలీ ఆఫీస్ కి వెళ్లి రావడం.. ఇంటికి వచ్చాక అమ్ము వెనకాలే తిరగడం..

అలా.ఒకరోకు గౌతమ్ ఇంటికి వచ్చేసరికి అమ్ము వంట చేస్తు ఉంది.. మెల్లగా బాగ్ ని సోఫాలో పడేసి సైలెంట్ గా వెళ్ళాడు కిచెన్ లోకి..

అక్కడ అమ్ము అటు తిరిగి వంట చేస్తు ఎదో బాక్స్ తీసుకుంటూ ఉంది..

చిన్నగా నడుము ఎక్సపోస్ అయింది ఆ ప్రాసెస్ లో.. గౌతమ్ వెనకే వెళ్లి నడుము మీద చేతులు పోనిస్తూ తనని హత్తుకున్నాడు.

అమ్ము సడన్ గా అలా జరిగేసరికి కాస్త తడబడిన.. మళ్లి తేరుకుని " గుడ్ ఈవెనింగ్ నందు!! " అని అంది వెనక్కి తిరిగి బుగ్గపై ముద్దిచ్చి..

" ఇక్కడ కాదు అని చాలా సార్లు చెప్పాను!! " అని అన్నాడు బుజ్ పై తలా పెట్టి..

" నాకు అక్కడే ఇష్టం.. చాలా క్యూట్ ఉంటాయి నీ బుగ్గలు.. " అని అంది వెనక్కి తిరిగి వాటిని లాగుతూ..

" అవునా.. అయితే నాకు నువ్వు క్యూట్ ఉంటావు మరి.. " అని అంటూ దగ్గరికి వచ్చాడు..

" ఓఓ స్టాప్.. ఇక్కడ వంట చేయాలి!! " అని అంది అటు తిరిగి నవ్వుతూ.

"పర్లేదు లే.. మనమే కదా.. ఇప్పుడు మాత్రం.. ప్లీస్!!! "అని అంటూ మెడపై లిప్స్ తో టచ్ చేస్తూ అన్నాడు..

"ఉహు.. " అంది..

కానీ గౌతమ్ అలానే అమ్ముని డిస్తూర్బ్ చేస్తు ఉన్నాడు.. ఎలానో వంట పూర్తి చేసింది..

అన్ని సర్దేసి గౌతమ్ కి పెట్టింది.. గౌతమ్ అమ్ముకి తినిపిస్తా తను తిన్నాడు..

అన్ని సర్దేసి కిచెన్ నుండి బయటికి వస్తున్న అమ్ముని అమాంతంగా ఎత్తుకుని రూంకి తీసుకెళ్లాడు..

బెడ్ మీద పడుకోపెట్టి.. తనని హత్తుకుంటూ ముద్దులతో మొదలుపెట్టాడు..

అమ్ము కూడా గౌతమ్ కి సహకరిస్తూ ఉండిపోయింది..

--//--

అలా రోజులు గడిస్తూ ఉన్నాయి..

ఒకరోజు ఆఫీస్ లో ఉన్న గౌతమ్ కి కాల్ చేసింది అమ్ము.. మాట్లాడుతూ మాట్లాడుతూ సైలెంట్ అయిపోయింది..

ఎదో పగిలిన శబ్దం కూడా వచింది.. దాంతో వెంటనే కంగారుగా ఇంటికి స్టార్ట్ అయ్యాడు గౌతమ్..

ఇంటికి వచ్చేసరికి హాల్లో పడింది అమ్ము.. కంగారుగా తనని ఎత్తుకుని రూంలో పడుకోపెట్టి డాక్టర్ కి కాల్ చేసాడు.

డాక్టర్ వచ్చి చెక్ చేసి విషయం చెప్పేసి వెళ్ళింది.. గౌతమ్ కి తను విన్నది నిజమా కాదా!! అనిపించింది..

హ్యాపీగా అమ్ము దగ్గరికి వెళ్ళాడు. తాను ఇంకా పడుకునే ఉంది.. తన దగ్గరికి వెళ్లి నుదిటి మీద ముద్దు పెట్టుకుని అల్బే తాను కూడా పడుకున్నాడు.

మళ్ళీ అమ్ము కలకు తెరిచేసరికి సుమ గారు , శేఖర్ గారు , నిరంజన్ గారు , లక్ష్మీ గారు.. ఉన్నారు.

" లక్కీ.. అప్ప.. అత్తమ్మ.. మావయ్య.. " అని అంటూ పైకో లెవబోయింది..

గౌతమ్ వచ్చి తనని ఆపేస్తూ." జాగ్రత.. అలా లెవకుడదు.. " అని అన్నాడు.

" నాకెమైంది!! " అని అడిగింది.

నిరంజన్ గారు దగ్గరికి వచ్చి " నా బంగారు తల్లి.. హ్యాపీగా ఉండు!! " అని నుదుట ముద్దు పెట్టుకున్నారు.

అలానే లక్ష్మీ గారు , శేఖర్ గారు , సుమగారు కూడా అనేసి బయటికి వెళ్లారు.

వాళ్ళు అలా ఎందుకు అన్నారు అర్థం కాక గౌతమ్ వైపు చూసింది కన్ఫ్యూషన్ గా..

గౌతమ్ నవ్వుతు అమ్ము దగ్గరికి వచ్చి మోకాళ్లపై కూర్చున్నాడు. అమ్ము కడుపు దగ్గర చెవి పెట్టి..

" చూడు నా లిటిల్ ప్రిన్సెస్.. మీ అమ్మకి ఇంకా అర్థం కాలేదు.. " అని అన్నాడు ముద్దు పెడుతూ..

అప్పుడు అర్థం అయింది అమ్ముకు.. కళ్ళలో నీళ్లు తిరిగాయి.. చాలా హ్యాపీగా గౌతమ్ ని చూసింది..

గౌతమ్ అమ్ముని హగ్ చేసుకుని " వి ఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్!! " అన్నాడు అమ్ము నుదుట ముద్దు పెడుతూ..

--//--

అమ్ము ని చూసుకోవడానికి తన దగ్గరే ఉండిపోయారు ఇద్దరి పేరెంట్స్..

ఆది కూడా విషయం తెలుసుకుని వచ్చాడు.. తనని చూస్తూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు..

పగలంతా సుమగారు , లక్ష్మీ గారి ప్రేమతో.. రాత్రి పూట గౌతమ్ అప్పుడప్పుడు చేసే చిలిపి అల్లరితో.. ప్రేమతో..

నెలలు గడిచాయి..

అప్పుడు అమ్ముకు ఆరు నెలలు.. శ్రీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారు..

అన్ని ఎరపట్లు చేసి ఘనంగా చేశారు.. అమ్ము ఒట్టు చీరలో బేబీ బమ్ప్ తో చాలా అందంగా ఉంది..

ఎదో కొత్త కాంతి ఉంది తన మొహంలో..

ఆరోజు రాత్రి ఎప్పటిలానే తన బేబీ కి కథలు చెపుతున్నాడు అక్షయ్..

" ప్రిన్సి.. మీ మామ్ చాలా అందంగా ఉందిరా.. చాలా క్యూట్ ఉంది.. " అన్నాడు..

నవ్వింది అమ్ము..

" మనకి అమ్మాయి పుడుతుందా.. అబ్బాయి పుడతాడ!! " అడిగింది అమ్ము.

" హ్మ్మ్.. నాకైతే నా ప్రిన్సి అనుకుంటున్నా.. " అన్నాడు.

" నాకు అలానే అనిపిస్తుంది.. కానీ అబ్బాయి కూడా పుడితే బాగుంటుంది కదా!! " అంది.

" హ్మ్.. " అన్నాడు.

" నేను లావు అయ్యాను కదా!! " అంది ముద్దుగా ఫేస్ పెట్టి.

" లేదురా.. ఎందుకు అలా అనుకుంటున్నావ్!! " అన్నాడు.

" ఏమో.. నాకే అలా అనిపించింది.. " అని అంది.

ఒకరోజు పడుకున్నా గౌతమ్ పై కూర్చుని " నందు.. నందు!! "అని పిలుస్తూ ఉంది..

గౌతమ్ కళ్ళు తెరిచేసరికి తనపై కూర్చున్న అమ్ము కనిపించింది.. తనని హత్తుకుని " ఏమైందిరా!! " అడిగాడు.

" నాకు .. ఆకలి వేస్తుంది " అంది..

" అవునా.. " అని అంటూ లేస్తూ అమ్ముని పక్కన పడుకోపెడుతూ..

" ఉండు ఫుడ్ ఏమైనా చేసి తీసుకొస్తా!! " అన్నాడు.

" నాకు ఐస్ క్రీమ్ ఆకలి!! " అని అంది పప్పి ఫేస్ పెట్టి..

గౌతమ్ నవ్వేసి తనని ఎత్తుకుని బయటికి వచ్చాడు. కార్లో కూర్చోపెట్టి స్టార్ట్ చేసాడు..

అలా డ్రైవ్ చేస్తు ఒక పర్లోర్ దగ్గర స్టాప్ చేసాడు.. తనకి కావాల్సిన ఫ్లేవర్స్ అన్ని తెచ్చి తినిపించాడు.

అమ్ము కూడా హ్యాపీగా తినింది..

అమ్ము కి నెలలు నిండే కొద్దీ లెగ్స్ స్వేల్ వచ్చేవి.. వాటికి ఆయిల్ మసాజ్ చేస్తూ తనని ఇంకా కేర్ గా చూసుకునే వాడు గౌతమ్.

--//--

నైన్ మంత్స్ కంప్లీట్ అయ్యేసరికి పైన్స్ వచ్చాయి అమ్ముకి..

అప్పుడు గౌతమ్ ఆఫీసులో ఉన్నాడు శేఖర్ గారు కూడా.. అందరూ మీటింగ్ లో ఉన్నారు.

నిరంజన్ గారూ , లక్ష్మీ గారు , సుమ గారు కలిసి హాస్పిటల్ కి వెళ్లారు..

అమ్ముకి అలా అయింది అని చేపలమని ఆఫీస్ కి కాల్ చేశారు కానీ వాళ్లు మీటింగ్ లో ఉండటం వల్ల కుదరలేదు..

అమ్ము గౌతమ్ వస్తేనే ఆపరేషన్ థియేటర్ కి వెళ్తాను అని పట్టు బట్టి మరి పైన్స్ తో అలానే ఉంది.

ఇంకా లాస్ట్ మినిట్ కి వచ్చాడు గౌతమ్ కంగారుగా.

రాగానే అమ్ముని పట్టుకుని కంగారుగా ఉన్నాడు.

" ఎం కాదు గౌతమ్.. " అని అంటూ " నువ్వు కూడా నాతో రావా!! "అని అడిగింది.

గౌతమ్ కూడా డాక్టర్స్ తో మాట్లాడి లోపలికి వెళ్ళాడు. అక్కడ అమ్ముకి పైన్స్ వస్తుంటే ఇక్కడ గౌతమ్ కి కంట్లో నీళ్లు వస్తున్నాయి.

అమ్ము ని ఎక్కువ సేపు బాధ పెట్టకుండా బయటికి వచ్చేసింది ఒక బేబీ..

బేబీ ఏడుపు విని హ్యాపీగా కళ్ళు మూసింది అమ్ము అలసటతో..

గౌతమ్ కళ్ళ నీళ్లతో బేబీ ని ఎత్తుకుని ముద్దు పెట్టుకుని వాళ్ళకి ఇచ్చాడు వాష్ చేయడానికి..

ఆ తరువాత అమ్ముని ముద్దు పెట్టుకుని బేబీ ని వాష్ చేసాక తీసుకుని బయటికి వచ్చాడు.

అందరికి బేబీ ని ఇస్తూ అమ్ము కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాడు.

అమ్ముని ఒక వన్ హౌర్ తరువాత రూమ్ కి షిఫ్ట్ చేశారు.. బేబీ ని తీసుకుని అమ్ము దగ్గరికి వెళ్లాడు గౌతమ్.

అమ్ము కళ్ళు తెరిచింది.. నవ్వుతు తననే చూస్తున్న బేబీ ని చూసి హ్యాపీ టియర్స్ తో గౌతమ్ ని చూసింది..

"మన ప్రిన్సెస్.. " ఆనందు హ్యాపీగా అమ్ము నుదుట ముద్దు పెడుతూ..

అమ్ము హ్యాపీగా బేబీని తీసుకుని ముద్దు చేసింది. అందరూ వచ్చి ఇద్దరుగా ఉన్న వాళ్ళని ముగ్గురుగా చూసి నవ్వుతు వెళ్లిపోయారు.

ఒక మడ్ రోజుల తరువాత అమ్ముని ఇంటికి తీసుకెళ్లారు.

బేబీ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ అని ప్రూవ్ చేసింది.. గౌతమ్ దగ్గర ఉంటే అసలు ఎడవదు..

గౌతమ్ నుండి కాస్త దూరం అయితే కూడా ఏడుపు స్టార్ట్ చేస్తుంది..

గౌతమ్ అమ్ము ఇద్దరు బేబీ ని బాగా చూసుకున్నారు.. ఆది అయితే తన మెనకొడలి కోసం బెంగళూరు నుండి విజగ్ కి షిఫ్ట్ అయ్యాడు.

వాళ్ళతోనే ఉంటూ హ్యాపీగా గడిపేశాడు..

ఆరు నెలల తరువాత పాపకి నామకరణం చేశారు..

ఇద్దరి ప్రేమకి గుర్తుగా..

అమూల్య నుండి అ..

గౌతమ్ నందన్ నుండి నంది..

కలిపి ఆనంది గా పెట్టారు.

అండ్ దే లివ్ హ్యాపిలి..


శుభం..