ఒక పల్లెటూరి వ్యక్తి మొదటిసారిగా బస్సు ఎక్కుతాడు. ఆ వ్యక్తి డ్రైవర్కు వెనుక ఉన్న సీట్లో కూర్చుంటాడు. మొదటిసారి బస్సు ఎక్కడం వలన అతనికి అంతా కొంత విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది .ఇలా డ్రైవర్ వెనుక సీట్లో కూర్చొని డ్రైవర్ చేసే పనులన్నింటినీ ఆసక్తిగా గమనిస్తూ ఉంటాడు. డ్రైవర్ స్టీరింగ్ ఎలా తిప్పుతున్నాడు, గేర్ ఎలా వేస్తున్నాడు అని చూస్తూ అంతా విచిత్రంగా ఉందే అని అనుకుంటూ ఉంటాడు మనసులో. ఒక చోట టీ తాగడానికి బస్సు ఆపుతారు.
అందరూ బస్సు దిగి టీ తాగడానికి వెళ్తారు. తిరిగి వచ్చిన ఆ బస్సు డ్రైవర్ బస్సు గేర్రాడ్డు అక్కడ లేకపోవడాన్ని గమనిస్తాడు. అప్పుడు ఆ డ్రైవర్ గేర్రాడ్డు కోసం చుట్టూ చూస్తాడు… మన పల్లెటూరి పెద్దాయన తన చేతిలో గేర్రాడ్డు పట్టుకుని, ఆ డ్రైవర్ పక్కనే నవ్వుతూ నిలబడతాడు.
అప్పుడు ఆ డ్రైవర్ ఆ పెద్దాయన తో ఇలా అంటాడు” ఏంటయ్యా నీకేమైనా బుద్ధుందా? ఎందుకు ఇలా చేశావు అని అడుగుతాడు.
Ezoic
అప్పుడు డ్రైవర్ తో ఆ పెద్దాయన ఇలా అంటాడు . “చాల్చాల్లే వయ్యా నువ్వు ఆ గేర్రాడ్డుని వించడానికి ఎంత కష్ట పడుతున్నావో బస్సు ఎక్కినప్పటినుంచి నేను గమనిస్తూనే ఉన్నాను”. అందుకే నీకు అడ్డంగా ఉందేమో అని నేను నా బలాన్నంతా ఉపయోగించి….. బలవంతంగా ఒక దెబ్బతో ఆ గేర్రాడ్ని విరిచేసాను ఎలా ఉంది నా బలం.????:) అంటూ నవ్వుతాడు
ఒక ఊర్లో బుడంకాయంత బుడ్డోడు ఉన్నాడంట. వాడికి ఒక వడ్లగింజంత వజ్రం దొరికిందట, ఆ వడ్లగింజంత వజ్రాన్ని బీరకాయంత బీరువాలో పెట్టి తాటికాయంత తాళం వేశాడంట. ఆ వడ్లగింజత వజ్రానికి మునక్కాయంత ముసలమ్మని కాపలా పెట్టాడంట.
అప్పుడు దొండకాయంత దొంగలు వచ్చి మునక్కాయంత ముసలమ్మని విరిచేసి తాటికాయంత తాళం పగులగొట్టి బీరకాయంత బీరువా తెరిచి వడ్ల గింజంత వజ్రాన్ని ఎత్తుకొని పారిపోయారంట.
అప్పుడు జీడిపప్పు అంత జీప్ లో పొట్లకాయంత పోలీసు వచ్చి, దొండకాయంత దొంగని పట్టుకుని జామకాయంత జైల్లో వేసారంట. కాని దొండకాయంత దొంగలు జామకాయంత జైలుకి గుమ్మడకాయంత సొరంగం పెట్టుకుని పారిపోయారంట .
ఒకానొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. పెద్దగా చదువు కోకపోయినా మంచి సమయస్ఫూర్తి తెలివితేటలు కలవాడు. ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కొరకు గ్రామ ప్రజలందరూ ఈ రైతు దగ్గరికి వచ్చేవారు. ఒకసారి ఈ రైతు కి 50 రూపాయలు అవసరం అవుతుంది. ఆ 50 రూపాయలు సంపాదించడానికి ఆ రైతు ఒక ఉపాయం ఆలోచిస్తాడు.
ఆ గ్రామానికి పక్కనే ఉన్నా పట్టణంలో ఆ రైతుకు తెలిసిన ఒక తెలివిగల లాయర్ ఉంటాడు. ఆ రైతు ఆయన వద్దకు వెళ్లి, “లాయర్ గారు మీరు బాగా చదువుకున్న వారు మరియు తెలివితేటలు కలవారు. నేను చదువే రాని ఒక నిరక్షరాస్యుడిని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పలేకపోతే మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి, అలాగే మీరు నన్ను ఒక ప్రశ్న అడగండి, నేను గనుక సమాధానం చెప్పలేకపోతే 50 రూపాయలు ఇచ్చుకుంటాను ఎందుకంటే నేను పేద వాడిని నా దగ్గర అంత డబ్బులేదు!” అని అంటాడు.
అందుకు ఆ లాయర్ వీడు అమాయకుడు కదా.. అని ధైర్యంగా ఒప్పుకుంటాడు.
“రెండు తలలు, ఆరు కాళ్లు ఉన్న జంతువు ఏది ?” అని ఆ రైతు అడగగా. లాయర్ చాలాసేపు ఆలోచించి, చివరికి నేను పందెం ఓడిపోయాను అని ఒప్పుకొని 100 రూపాయలు ఇచ్చి” ఇప్పుడు నువ్వు వేసిన ప్రశ్ననే నేను నిన్ను అడుగుతున్నాను నువ్వు నాకు సమాధానం చెప్పు”, అంటాడు.
Ezoic
దానికి ఆ రైతు ” ఈ ప్రశ్నకు సమాధానం నాకు కూడా తెలియదు లాయర్ గారు నేను కూడా పందెం ఓడిపోయాను!” ఇదిగో నేను పందెం ఓడిపోతే మీకు ఇస్తానన్న 50 రూపాయలు అని లాయర్ చేతిలో 50 రూపాయలు పెట్టి మిగిలిన 50 తన జేబులో వేసుకుని తిరిగి ఇంటికి సంతోషంగా వెళ్ళిపోతాడు. దీనిని లాయర్ తలుచుకుని అయ్యో.. రైతుని తక్కువ అంచనా వేసానే అని కుమిలి పోతూ, ఇకపై ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదని నిర్ణయించుకుంటాడు.
ఒక భార్య భర్త బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు …..
బస్ కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న ఒక పెద్ద చెరువులో పడి పోతుంది. …
ఆ బస్సులో ప్రయాణికులు అందరూ తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు…..
ఆ భార్య భర్తలు కూడా ఈదుకుంటూ వెళ్తుండగా… ఆ వ్యక్తి భార్య ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆగిపోయి ఎవరికోసమో వెతుక్కుంటూ ఉంటుంది ….అప్పుడు ఆ భర్త కి డౌటు వచ్చి అడిగెలోపు , భార్య కలగజేసుకుని ఇలా అంటుంది..
“ఓయ్ ఇదిగో కండక్టర్ ….,నాకు ఇంకానువ్వు రెండు రూపాయలు చిల్లర ఇవ్వాలి గుర్తుందా….?”
దానికి కండక్టర్ మరియు ఆమె భర్త, ఆమె యొక్క అత్యాశను చూసి తెల్ల ముఖం పెట్టుకుంటారు .
ఒక గ్రామంలో సుబ్బిశెట్టి అనే ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ గ్రామంలో ప్రజలందరికి అతని వద్దనుండి సొమ్ము ను వడ్డీకి తీసుకునేవారు.
ఒకరోజు రామయ్య అనే రైతు అప్పు కోసం సుబ్బిశెట్టి దగ్గరకు వస్తాడు. ఆ సంవత్సరం కరువు రావడం వల్ల పంటలు సరిగా పండక నష్టం రావడం వల్ల కుటుంబ పోషణ కష్టంగా మారింది, తప్పనిసరి పరిస్థితుల్లో సుబ్బి శెట్టి దగ్గర అప్పు చేయాల్సి వచ్చింది రామయ్యకు.
అప్పుడు తన ఇంటికి అప్పు అడగడానికి వచ్చిన రామయ్యతో సుబ్బి శెట్టి ఇలా అంటాడు” నీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చాను అన్నమాట.!..
ఊర్లో ఎందరికో అప్పు ఇచ్చాను , అందరూ వచ్చి నన్ను పలకరించి పోతుంటారు, కానీ నీవు ఎప్పుడూ నాతో మాట్లాడిన పాపాన పోలేదు నాతో ఏం అవసరం అని అనుకున్నావు కదా….. కానీ ఈ రోజు అప్పు కోసం నా దగ్గరకొచ్చావు అని మాట్లాడుతాడు.
అవసరం ఉంది కాబట్టి సుబ్బిశెట్టి ఎన్ని మాటలు అడిగి అవమానించినా…….., తనచుట్టూ త్రిప్పుకున్నా…..మౌనం వహించాడు రామయ్య. అలా నాలుగైదు రోజులుగా తన చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత రామయ్యకు కొంత డబ్బు అప్పుగా ఇస్తాడు సుబ్బిశెట్టి.
ఇదంతా గమనిస్తున్న కృష్ణయ్య రామయ్య ను “ఏం రామయ్య అప్ప కోసం ఎన్నిసార్లు ప్రదక్షినాలు చేయిడం సిగ్గుగా అనిపించడం లేదా అని అదుగుతాడు.
నేను నాలుగైదు రోజులు తిరిగాను కానీ నాలుగైదు సంవత్సరాలు కాదు కదా!….ఇకపై చూడు నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉంటాడు సుబ్బి శెట్టి అప్పు చెల్లించమని అని సంతోషంగా అన్నాడు రామయ్య కృష్ణయ్య తో .
సంక్రాంతి పండక్కి చీర కొనటానికి వెళ్లింది గీతమ్మ. తనకి ఇష్టమైన రంగు ఎరుపు కనుక ఎరుపు రంగు పచ్చ అంచు ఉన్న చీరను బెరమాడింది. అటు తిప్పి ఇటు తిప్పి ఈ మాట ఆ మాట చెప్పి చివరకు ఆ చీరను 50 రూపాయలకు బేరం కుదిర్చి అమ్మడానికి ప్రయత్నించి ఎండకు నల్ల బడ్డాడు చీరల వ్యాపారి చెన్నయ్య.
ఆమె చీరతో ఇంటికి చేరుకునే సరికి పక్క ఇంటి జానకమ్మ అలాంటి చీరనే తీసుకువచ్చి తను 35 రూపాయలు మాత్రమే పెట్టీ కొన్నట్టు చెప్పింది. ఆ మాట చెవిన పడగానే మనసు లో ఒకటే కలవరింత మొదలయ్యింది గీతమ్మ కి.
చీర పోలికలలో ఎటువంటి మార్పు లేదు పొడవు వెడల్పులలో తేడాలు లేవు అంతా ఒకటే, రెండు ఎరుపు చీరలే డిజైన్ కూడా అంతా ఒకటే 15 రూపాయలు నష్టపోయానని అనుక్షణం మదనపడసాగింది. అది కాస్త ఆమెలో ఒకే బాధగా మారిపోయింది అనవసరంగా 15 రూపాయలు ఎక్కువ పెట్టి కొన్నానని బాధపడసాగింది గీతమ్మ. కొంత కాలానికి గీతమ్మకు మనసు తేలిక పడింది కారణమేమిటంటే జానకమ్మ కట్టిన చీర రంగు వెలిసి పోయింది .