Featured Books
  • పాణిగ్రహణం - 5

    విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడ...

  • మన్నించు - 8

    ప్రేమలో నిజాలు, అబద్ధాలు ఉండవు.. నిన్ను బాధపెట్టకూడదు అనే అబ...

  • తనువున ప్రాణమై.... - 19

    ఆ గమనం.....కానీ పొట్టిది గట్టిది కదా!! పొట్టి దాని కంట్లో పడ...

  • ప్రేమలేఖ..? - 7

    తిరిగి కొట్టడం వాళ్ళ నోర్లు ముయించడం క్షణం పని ఆనంద్ కి. ప్ర...

  • అంతం కాదు - 11

    కొద్దిసేపటికే విశ్వ అక్కడున్నాడు. జాన్ తన చేతిలో ఉన్న ఆయుధాల...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

పాణిగ్రహణం - 5

విక్రమ్ డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి కిందికి వస్తాడు. ఫ్యామిలీ మొత్తం కూడా హాల్లోనే ఉంటారు.

   కానీ... అందరూ సైలెంట్ గా ఉంటారు. విక్రమ్ వచ్చి ఏమైంది ఇప్పుడు??  ఏం చేయాలో నాకు తెలుసు.

   ఇదే ఆలోచిస్తూ అందరూ టైం వేస్ట్ చేసుకోకండి అని చెబుతాడు. 
అప్పుడే గుమ్మం ముందు కారు ఆగుతుంది. ఎవరి వచ్చి ఉంటారో అర్థమయ్యే లేని నవ్వుని తెచ్చుకుని లలిత, మాధవి ఎదురు వెళ్లి స్వాగతం చెబుతారు.

  ధనుంజయ్ ఫ్యామిలీ గుమ్మం దగ్గర నిలబడి ఉంటారు. శిల్ప ముసుగులోనే ఉంటుంది.

ఇందిరా గారు లలితని పిలిచి కోడలకి హారతి ఇచ్చి లోపలికి తీసుకురామనీ చెబుతారు.

లలిత హారతి ఇచ్చి. లోపలికి తీసుకువస్తుంది. అందరికీ మర్యాదలు చేస్తారు.  శిల్ప కి చాలా టెన్షన్ గా ఉంటుంది.

   విక్రమ్ ఫేసులో ఎటువంటి ఫీలింగ్స్ కనపడవు. అసలు ఏం జరుగుతుందా అని...

హాల్లో అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు.  ఎవరికి ఏం మాట్లాడాలో అర్థం కాక!

   శిల్ప తాతగారైన శేషగిరి గారు మాట్లాడుతూ మా వల్ల ఏమైనా తప్పు జరిగిందమ్మా అని ఇందిరా గార్ని ఉద్దేశించి మాట్లాడుతారు.
దానికి ఇందిరాగారు మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు అని అడుగుతారు.
రాత్రి అబ్బాయి గదిలో నుంచి చాలా కోపంగా బయటికి వచ్చాడు. మేము ఎవ్వరం పిలుస్తున్న పలకకుండా వచ్చేసాడు.
మాకు చాలా కంగారు వచ్చింది.  ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకుంటామని చెబుతారు.
విక్రమ్ మాత్రం భార్గవి నే  చూస్తున్నాడు. భార్గవి ఫేసులో మారుతున్న రంగులను చూస్తున్నాడు.
 ఇందిరా గారు శేషగిరి గారికి చెబుతారు.  మీ వలన ఏ తప్పు జరగలేదు అని...

వారు అబ్బాయి ఎందుకు అలా వచ్చేసాడు అని అడుగుతారు.

దానికి ఇందిరా గారు చిన్న పొరపాటు జరిగింది అని గంభీరంగా చెబుతారు. ఆ మాటలకి భార్గవికి చెమటలు పడతాయి.

విక్రమ్ భార్గవి ని చూస్తూ ఉంటాడు. మిగిలిన వాళ్ళని కూడా చూస్తూ ఉంటాడు.  మిగిలిన వాళ్ళలో పొరపాటు ఏమిటా అని కంగారు ఉంటే,  భార్గవి కి మాత్రం దొరికిపోయామా అని టెన్షన్ పడుతూ ఉంటుంది.

   విక్రమ్ కి అర్థమవుతుంది భార్గవి నే ఏదో చేసింది అని. ఇందిరా  గారు ఏం చెబుతారా అని శిల్ప ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు.

ఇందిరాగారు అందరిని  చూస్తూ చెబుతారు. నిన్న రాత్రి మీ ఇంటి దగ్గర పూజ అయిన తర్వాత నాకు ఒక ఫోను వచ్చింది అని..  ఒక నిమిషం ఆగుతారు.

  అంతే భార్గవికి టెన్షన్ పెరిగిపోతుంది. అది చూసిన విక్రమ్..  అత్త అప్పుడే అంత టెన్షన్ పడితే ఎలా??  నీకు ముందుంది ముసళ్ళ పండగ అనుకుని భార్గవి టెన్షన్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.

   ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి అండి అన్ని టెన్షన్ పడుతూ అడుగుతుంది భార్గవి.  దానికి ఇందిరా గారు మా సిద్ధాంతి గారి నుంచి అని చెబుతారు.

అప్పుడు భార్గవి కొంచెం రిలాక్స్ అవుతుంది. ఏం చెప్పారు అమ్మ అని శేషగిరి గారు అడిగితే...

    అమ్మాయి జాతకంలో చిన్న లోపం కనిపిస్తుంది. కార్యం జరిపించవద్దు.  అలాగే ఆరు నెలల వరకు అమ్మాయిని ఎవరికీ చూపించవద్దు.

   మీ కుటుంబ సభ్యులు తప్ప.  ఎవరూ అమ్మాయిని మొఖం చూడకూడదు.  ఇంట్లో ఉన్న సర్వెంట్స్ తో సహా అని చెప్పారు. 

   అది అప్పటికప్పుడు గదిలో ఉన్న అల్లుడు గారికి ఎలా తెలిసింది అని భార్గవి అనుమానంగా అడుగుతుంది.

    దానికి ఇందిరా గారు నవ్వుతూ ప్రస్తుతం ప్రజల్లో పక్కనున్న వాళ్ళని అయినా మర్చిపోతున్నారు కానీ ఫోన్ ని వదలడం లేదు కదా!   అదేంటి చెవిలో పెట్టుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటే....ఎయిర్ బర్డ్స్ నానమ్మ అనే వినయ్ అందిస్తాడు.

   అవి ఉండగా ఇన్ఫర్మేషన్ ఎంత సేపు వెళుతుంది అనగానే భార్గవి సైలెంట్ అయిపోతుంది.  వెంటనే నేను, విక్రమ్ కి చెప్పాను అని..

   భార్గవి దానికి ఈ రోజుల్లో కూడా ఇవి నమ్ముతారా పెద్దమ్మ గారు అంటే... సత్యవతి కోడల్ని మందలిస్తుంది.

   ప్రతీది తీసిపాడేయకూడదు  అని... ఇందిరా గారు వెంటనే  మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే,  మాకు లేదు అంటారు.

   దానికి భార్గవి ముఖం వెలిగిపోతుంది.  లలిత గారి అదేంటి అత్తయ్య గారు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది.

   మళ్ళీ ఇందిరా గారు చెప్పడం మొదలుపెడతారు. మేమైతే మా సిద్ధాంతి గారు చెప్పింది పూర్తిగా నమ్ముతాం. తరతరాల నుంచి మా కుటుంబానికి సిద్ధాంతి కుటుంబానికి చక్కటి అనుబంధం ఉంది. 

  సిద్ధాంతి గారు మాకు ఇంకో విషయం కూడా చెప్పారు. పెళ్లిలో ఏదో లోపం జరిగింది మీకు తెలియకుండా అని.. భార్గవి నెత్తి మీద ఒక థౌసండ్ వాళ్ళ బాంబు వేస్తారు.

   తొందరపడి కార్యం జరిపించిన,  అమ్మాయిని ఇంటికోడలుగా ఇప్పుడే పరిచయం చేసిన,  అమ్మాయికి అని గ్యాప్ ఇస్తారు.

  అందరూ ఏం చెబుతారా అని ఇందిరాగారి వంక చూస్తారు.  ఇందిరా గారు బాధగా ముఖం పెట్టి అమ్మాయికి ప్రాణగండం అని చెప్పారు అంటారు..

  శిల్పా ఫ్యామిలీ ఏంటి అని అరుస్తారు.  జై సింహ ఫ్యామిలీ ఇందిరా గారి మైండ్ గేమ్ కి షాక్ తో అలా చూస్తూ ఉంటారు.

  భార్గవి గట్టిగా నో అని అరుస్తుంది.   అందుకే విక్రమ్ కి మీకు ఎలా చెప్పాలో తెలియక అలా వచ్చేసాడు అని చాలా బాధగా చెబుతారు.

   ఇప్పుడు ఏం చేయాలి  అత్తయ్య గారు అనే ధనుంజయ్ అడుగుతాడు. సొల్యూషన్ కూడా చెప్పాను.  మీకు నమ్మకం ఉంటే పాటించండి. నమ్మకం లేకపోతే మీ ఇష్టం అనే బాల్ వాళ్ల కోర్టు లో  వేస్తారు..

   అందరూ ఆలోచనలో పడతారు సింహ ఫ్యామిలీ మాత్రం ఇందిరాగారి తెలివికి ఆశ్చర్యపోతారు. 

  కర్ర విరగకుండా,  పాము చావకుండా అంటే ఇదేనేమో అని...

   భార్గవిని చూసే విక్రమ్ కిల్లింగ్ స్మైల్ ఇస్తాడు.

   ఇప్పుడు ఏం చేస్తావు అత్త అని??
ఇప్పుడు శిల్ప ఫ్యామిలీ నిర్ణయం ఏమిటి??
కథ కొనసాగుతుంది...