అంజలి ఆ తాళం చూసి అసలు ఇది తాతయ్య ఎందుకు నాకు ఇచ్చారు నాకు ఈ తాళం తో ఏంటి ఉపోయోగం? పైగా ఇంట్లో వారు ఎవరికీ కనపడకుండా ఉంచామన్నారు అంతగా ఇందులో ఎం రహస్యం ఉంది? ఎందుకు పనికి వస్తుంది ఇది? ఇంతలో బయట గద్ద అరుస్తున్న శబ్దం వినిపిస్తుంది. అంజలి బయటికి వెళ్లి చూడగా వాళ్ళ నానమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటుంది." గుడి ఏమో మోసేసి ఉంది, గరుడుడు ఏమో అరుస్తున్నాడు, ఏదో జరగబోతుంది.కానీ, అర్థం కాదు".
అంజలి: ఏంటి? గుడి మూయడానికి గద్ద అరవడానికి సంబంధం ఎం జరగబోతుంది?
నానమ్మ: పోయిన సరి 25 ఏళ్ళ ముందు కూడా ఇలానే జరిగింది అప్పడు ఏ మీ తాతయ్య చనిపోయాడు. అప్పటి నుంచి మళ్ళీ అరవడం ఇదే మొదటి సారి.
ఆలా అరుస్తున్న గద్ద అనుకోకుండా అంజలి వైపు వస్తుంది. భయం తో అంజలి తన చేతిలో ఉన్న తాళం కింద పడేస్తుంది. కానీ, ఎవరు వద్దు, వెళ్ళిపో అని చెప్పినట్టు గద్ద అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది.వెంటనే ఆ తాళం తీస్కొని దాచిపెడుతుంది.
నానమ్మ: ఎదో కింద పడింది ఏంటి అది ఎదో దాచిపెట్టావ్?
అంజలి: ఎం లేదు నానమ్మ. జస్ట్ కీచైన్ అంతే. అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది.
అంజలి వాళ్ళ నానమ్మ సంధ్య తో రాఘవ ( అంజలి వాళ్ళ నాన్న)ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది.
సంధ్య:సురేఖ వాళ్లు ఇక్కడకి వస్తున్నారు అంట ఒక రెండు లేదా మూడు నెలలు ఉందాం అని వస్తున్నారు అంట ఇల్లు క్లీన్ చేపించడానికి వెళ్లారు.
..............................
అర్జున్ రెడీ అవ్వు మనం ఊరు వెళ్ళాలి అని అర్జున్ వాళ్ళ అమ్మ సురేఖ చేప్తుంది.
అర్జున్: ఇప్పుడు ఎందుకు అమ్మ ఊరికి? ఎం పని ఉంది అక్కడ?
సురేఖ: చెప్పింది చెయ్!
ఏంటో అమ్మ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు ఎప్పుడు ఊరికి వెళదాం అంటుందో తెలీదు. ఎం అయినా మాట్లాడితే జాబ్ లేదు కాళీగానే ఉన్నావ్ కదా! అంటుంది. సరే, వెళ్దాం ఎం చేస్తాం.
అర్జున్: అమ్మ, ఊరికే నాన్న రావడం లేదా!
సురేఖ: లేదు, నువ్వు నేను మాత్రం ఏ వెళ్తున్నాం.
అర్హున్ సందేహం గా ఇప్పుడు ఇది నేను తీస్కొని వెళ్లాలా? వద్ద? అని ఆలోచిస్తూ ఉండగా అతనికి ఒక సమాధానం దొరికింది. ఇది అయితే నాది కాదు కదా! ఏ ఊరిలో అయితే అది దొరికిందో అక్కడ ఏ గుడిలో ఇచ్చేసి వద్దాం అని అనుకోని తీస్కొనివెళ్తాడు.
అర్జున్: అమ్మ, ఊరు చాల మారిపోయి ఉంటుంది కదా? మనం వెళ్లి 25 ఇయర్స్ ఐతుంది నాకు పేరు కూడా సరిగా గుర్తు లేదు.
సురేఖ: "అనంతగిరి".
అర్జున్: అంటే, అర్థం ఏంటి అమ్మ?
సురేఖ: "అనంతుడు" అనే ఆదిశేషునికి నివాసంగా ఉండే ప్రాచీన గిరి.
అర్జున్: ఊరిలో మనకి ఎవరు అయినా తెలిసిన వాళ్ళు ఉన్నారు?
సురేఖ: ఎవరు లేరు. కానీ, మీ తాతయ్య స్నేహితులు ఉన్నారు. వాళ్ళకి చెప్పా మనం వస్తున్నాము అని. మనకి ఊరిలో ఇల్లు ఉంది. దాన్ని కొంచం ఉండడానికి తయారు చేపిస్తా అన్నారు.
అమ్మ ఊరు వచ్చింది.
సురేఖ: ఎం అయ్యింది రా? కార్ ని ఆలా డ్రైవ్ చేస్తున్నావ్?
అర్జున్: బ్రేక్ ఫెయిల్ అయ్యింది. అమ్మ.
కార్ ని ఎలాగో ఒకలా ఆపాడు అర్జున్.
సురేఖ: మీరు, ఏంటి ఇక్కడ ఉన్నారు? అర్జున్, నేను చెప్పను కదా! ఇతనే మీ తాతయ్య ఫ్రెండ్ కొడుకు రాఘవ.
రాఘవ: ఎం అయ్యింది అర్జున్?
అర్జున్: బ్రేక్ ఫెయిల్ అయ్యింది.
రాఘవ: సరే, ఇల్లు ఇంకా కొంచం క్లీన్ చేయాలి ఒక 2 డేస్ పడుతుంది. సడన్ గా వస్తున్నాం అన్నారు కదా! కొంచం టైం పడుతుంది క్లీన్ అవ్వాలి అంటే ఈలోపు మా ఇంట్లో వుండండి వెళదాం రండి.
అర్జున్: కార్ రిపేర్ చేయాలి అది కంప్లీట్ అయ్యాక వస్తా. మీరు వెళ్ళండి.
సంధ్య: అంజలి, నాన్న ఇంకా రాలేదు.ఒకసారి వెళ్లి చూసి రా!
సరే, అని అంజలి చూడడనికి వెళ్తుంది. దారిలో అర్జున్ కూడా కార్ ఇచ్చేసి నడుచుకుంటూవస్తూ ఉంటాడు.
అర్జున్: ఎగ్జిక్యూజ్ మీ, ఇక్కడ రాఘవ గారి ఇల్లు ఎక్కడో చెప్తారా?
అంజలి: మా నాన్న తో తనికి ఏంటి పని? మా నాన్న నాకు పెళ్లి చూపులు ఎం అయినా ఆరెంజ్ చేశాడా ఏంటి? అని మనసులో అనుకుంటుంది.
అర్జున్: హలో, ఏంటి ఆలోచిస్తున్నారు?
అర్జున్ సడన్ గా అంజలి వెనుక ఎం ఉందో చూసి షాక్ అయ్యి, పద ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి మనం అని అంటడు.
అంజలి: ఏంటి, పోయేది ఎం మాట్లాడుతున్నావ్?
అని అడిగే లోపు అర్జున్ అంజలి ని తీస్కొని వెళ్ళిపోతాడు.
అంజలి: ఎం అయ్యింది? ఈ దారిలో వెళ్ళకూడదు 25 ఇయర్స్ నుండి ఇటు నుంచి ఎవరు వెళ్లడం లేదు మనం వెళ్ళకూడదు అని మాట్లాడ్తూ ఉంది.
అంజలి కి ఇప్పుడు తాను వెళ్తున్న దారి ఎక్కడో చూసినట్టు ఉంది. అని చుట్టూ చూస్తూ ఉంది. కలలో జరిగినట్టు నిజంగా తన వెనకాల పాము వస్తుంది ఏమో అని చూడగా నిజంగా అక్కడ పాము ఉంటుంది. ఇంకా ముందుకి వెళ్తుండగా అక్కడ కలలో చూసినట్టు స్టెప్స్ ఇంకా ఒక గుడి ఉంటుంది. స్టెప్స్ ఎక్కుతూ కిందపడిపోతుంది.
అర్జున్: తొందరగా లే, పాము వస్తుంది.
లేచి, మళ్ళీ వెళ్తూవుండగా. ఈసారి ఇద్దరు కిందపడిపోతారు. అంతలోపు ఒక గద్ద వచ్చి పాము తీస్కొని వెళ్తుంది.
అంత కలలో ఉన్నట్టే జరుగుతుంది.
అంజలి తన మనసులో ఒకసారి గుడి లోకి వెళ్లి చూద్దాం. నిజంగానే, ఆ కాంతి వస్తుంది ఏమో? ఒకసారి గుడిలోకి వెళదామా? అని అర్జున్ ని అడుగుతుంది.వాళ్ళు వెళ్లి చుస్తే గుడి తలుపులు మోసేసి ఉంటాయి. సరే, అని అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటారు.
అర్జున్ దెగ్గర ఉన్న వస్తువు ఏది అయితే ఆ ఊరిలో దొరికిందో అదే "తాళం".
అంజలి తన మనసులో: నా దెగ్గర ఉన్న తాళం లా ఉంది ఏంటి? అని తన దెగ్గర ఉన్న తాళం తీసి చూసుకుంటుంది. అచ్చం దాని లగే ఉంటుంది. రెండు ఒకలా వున్నాయి ఏంటి? ఇతను ఎవరో తెలుసుకోవాలి?
అంజలి: నా నేమ్ అంజలి. మీ నేమ్ ఏంటి? మీరు ఎవరు?
అర్జున్: నా నేమ్ అర్జున్.
అంజలి: రాఘవ తో మీ పని ఏంటి?
అర్జున్: అదా, మేము కూడా ఒకప్పుడు ఈ ఊరిలో ఉండే వాళ్ళం. 25 ఇయర్స్ బ్యాక్ వెళ్లిపోయాం. మళ్ళీ ఇప్పుడు కొన్ని రోజులు ఉందాం అని వచ్చాము. మేము, ఉండాలిసిన ఇల్లు ఇంకా రెడీ అవ్వలేదు. సో, ప్రెసెంట్ కి రాఘవ్ గారి ఇంట్లో ఉండాలి. అయన ఎవరో మీకు తెలుసా?
అంజలి: బాగా తెలుసు. మా నాన్న.
TO BE CONTINUED..............