Read Life - is that all? by Sangeetha in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జీవితం - ఇంతేనా?

మనం ఎప్పుడు ఎదో ఒక గండరగోళంలో చిక్కుకుని ఉంటాం ఎటూ నడవాలో తెలీదు? ఎం చేయల్లో అర్ధమ్ కాదు? అసలు ఆ నిమిషంలో మనం ఆలోచించే సమాధానాలు కూడా సరైనదా కాదా? ఇలా రోజు మనకి కనిపించేవి కొన్నే అయితే కనపడావి ఎన్నెన్నో?

రోజు ప్రశ్నతోనే మొదలయ్యే జీవితం... అది చిన్నదైన అవ్వొచ్చు పెద్దదైనా అవ్వొచ్చు.

చిన్న పిల్లల నుండి పేదవాళ్ళ వరకు -
పోదున్నే లేవగానే "పిల్లలకి ఎం వంట చెయ్యాలి" అని అమ్మ ప్రశ్న?
ఈరోజు ఎలాగైనా "అనుకున్న పని జరిగితే చాలు" అని నాన్న ఆలోచన.
ఈరోజు "ఫుట్‌బాల్ మ్యాచ్ లో నేను ఖచ్చితంగ గెలవాలి" అని అన్నయ్య ఆలోచన.
"స్కూల్చెలో టీచర్ హోంవర్క్ అడిగితే ఎమ్ చెప్పాలి" అని చెల్లి చింత.
"ఇల్లు ఎప్పుడు ఇలాగే కలకలం సంతోషంగా ఉండాలనీ" ఇంటి  పెద్దవాళ్ళ ఆలోచన...


ఇలా జీవితం ఎప్పుడు ఎదో ఒక ఆలోచన తో ఎదో ఒక ప్రసంగం తో నిండి పోతుంది దాని దాటుకుని ఎలా ముందుకు వెళ్తాం అనేదే కదా బతుకంటే...

జీవితం అంటే ఒక అనుభవం అని చెప్పరు మేధావులు, మనం ఉన్నపుడు ఎలా ఉంటాం ఏం సాధించాం అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే మనం లేనప్పుడు ఇతరులకు మనల్ని చూపిస్తూ ఇలా బ్రతకాలి అన్నపుడే మనం సాధించాం రా అన్నట్టు అనిపిస్తుంది.

అలా అని ఎదైనా సాధిస్తేనే జీవితానికి అర్థం ఉందంటే - లేదు..

మనం ఎంచెసిన చేయక పోయినా బ్రతికే ప్రతి రోజుకి విలువ ఉంది.


ఉదాహరణ కి -

ఒక రోజు మొత్తంలో ఏమి చెయ్యకుండా ఊరికే తిని పడుకుని ఉండి మరసటి రోజు లేచి నెన్న 1 రోజు మొత్తం వేస్ట్ చేసాం అనుకుంటాం కానీ మనం ఆరోజు నెమ్మదిగ నిద్ర పోయుంటాం. ఆ ఒక్క సాధారణ రోజు అలా ఊరికే ఉందే రోజు ఎప్పుడొస్తుందో అని తపన పడిపోయే వాళ్ళు ఎందరో... మరి మన లైఫ్ లో అలాటి రోజులు ఉన్నాయి అని హ్యాపీ గా ఫీల్ అవ్వాలి కదా. 


చదువు లేనివాడికే చదువు విలువ తెలుస్తుంది..
ప్రేమ కోసం అరట పడే వాడికే ప్రేమ విలువ తెలుస్తుంది.. 
ఒక్క పూట భోజనం కోసం కష్ట పడే వాడికే 
అన్నం విలువ తెలుస్తుంది.. 
రోజు కన్నీళ్లలో తడిసే కళ్ళకే
నవ్వు విలువ తెలుస్తుంది..


ఆదిత్య కథ: కలలే కాదు, నిజాలు కావాలంటే...

ఆదిత్యకు చిన్ననాటి నుండి కళలంటే అమితమైన ప్రేమ. పెయింటింగ్స్, స్కెచింగ్, మట్టి విగ్రహాలు—ఏ రూపకళ అయినా అతని చేతిలో జీవించేది. కానీ వారి కుటుంబం ఆర్థికంగా బలహీనంగా ఉండటంతో పెద్దగా చదువులూ, అవకాశాలూ లేకుండా ఒక ప్రైవేట్ ఆఫీసులో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవితం గడిపేవాడు.

"టాలెంట్ షో" మార్గం లా కనిపించిన అవకాశం-

ఒక రోజు పనికి వెళ్తుండగా వీధి గోడపై అతని కళ్లకు ఓ పోస్టర్ పడింది—
"TALENT SHOW – మీ కళను ప్రపంచానికి చూపించండి! గెలుపు వారికి భారీ నజరానా!"
అది ఫ్రీ ఎంట్రీ కావడం వల్ల, "ఒకసారి ప్రయత్నిస్తే ఏమవుతుంది?" అనే ఆలోచనతో అప్లై చేశాడు.
ఆ కార్యక్రమం పెద్ద స్థాయిలో జరుగుతోంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన యువత కళలలో తమ ప్రతిభ చూపించేందుకు సిద్ధమయ్యారు.
ఆదిత్యకు ఇదొక కలలా అనిపించింది—తన కళను అంతమంది ముందు చూపించే అవకాశం.

వంచన వెనుక ఉన్న వ్యూహం

ఆదిత్య తన పెయింటింగ్‌తో ప్రేక్షకుల్ని, కొంతమంది జడ్జెస్‌ నూ మెప్పించగలిగాడు. అతని చిత్రంలో రంగుల సమతుల్యత, భావవ్యక్తీకరణ అద్భుతంగా ఉంది.
కానీ చివర్లో తన పేరు ఫైనల్ రౌండ్‌కు ఎంపిక కాలేదు.

ఆదిత్య ఆశ్చర్యపోయాడు—"నేను తప్పేంటి చేశాను?"

ఆ సమయంలో అతనికి తెలిసింది—ఈ పోటీలో ప్రశాంత్ అనే ఒక కుర్రాడు తన మిత్రుల ద్వారా జడ్జెస్‌తో పరిచయాలు ఏర్పరచుకుని, ఫలితాలపై ప్రభావం చూపాడని.
ప్రశాంత్ కు తన విజయానికి పోటీగా ఉండే వారెవ్వరూ వద్దు. అధిత్య టాలెంట్ చూసి భయపడి, అతన్ని జాగ్రత్తగా తొలగించే ప్రయత్నం చేశాడు.
ఇది ఆదిత్యకు చాలా కష్టం—తన ప్రతిభ కాదు, రాజకీయాలే తనను ఓడించాయని తెలిసినప్పటికీ... అతను కూలిపోలేదు. కానీ ధైర్యంగా ముందుకు నడుస్తాడు అక్కడే ఆగి పోలేదు. ఎప్పటికైనా గెలుపు నా వైపు ఖచ్చితంగా వస్తుంది అని నమ్మి ముందుకు సాగుతాడు. అలా కొన్నేళ్లుగా తాను పని చేసుకుంటూ నే అవకాశం వచ్చినప్పుడంతా ఆర్ట్ గ్యాలరీ లో పాల్గోని కొంత డబ్బులు సంపా దిస్తు ఉంటాడు. పూర్తిగా తాను కల గన్నట్టు జీవితం లేక పోయినా తనకి నచ్చింది చేస్తున్నాను అనే సంతోషం సంతృప్తి ఉంటుంది.

ప్రశాంత్—మారిన క్షణం

కొన్నాళ్ల తర్వాత... ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్‌లో ప్రశాంత్ తానేనే తక్కువ స్ధాయిలో నిలబడటం చూసి మానసికంగా కుదుళ్ళు పడిపోతాడు. అప్పటికి మాత్రమే అతనికి నిజమైన ప్రతిభకు విలువ ఏంటో తెలుస్తుంది.
అతను తన తప్పును గ్రహించి, ఆదిత్యను కలవడానికి వెళ్తాడు.

ప్రశాంత్ మాటల్లో నిజస్వభావం:

"ఆదిత్య... నేను నీ ముందే ఒడిగడిపోవాలి. అప్పట్లో నన్ను గెలుపు ఎలాగైనా సాధించాలన్న గర్వం అంధుడిని చేసింది. నువ్వు నిజమైన ఆర్టిస్టివి. నీవే గెలవాలి."

ఆదిత్య మొదట అసహనం చూపించినా, ప్రశాంత్ మారిన హృదయాన్ని చూసి క్షమిస్తాడు.

విజయ పయనం

ప్రశాంత్ సహాయంతో ఆదిత్యకి ఒక పెద్ద గ్యాలరీలో తన పెయింటింగ్స్ ప్రదర్శించుకునే అవకాశం లభిస్తుంది.
అక్కడ అతని కళను చూసిన ప్రముఖ ఆర్ట్ క్రిటిక్, అతనికి ఒక ఇంటర్నేషనల్ ఆర్ట్ ప్రాజెక్ట్ ఆఫర్ చేస్తాడు.
చాలా కాలంగా స్వప్నంగా చూసిన దానిని ఆదిత్య ఇప్పుడు నిజంగా సాధించాడని మనస్ఫూర్తిగా ఆనందపడతాడు.

అతని విజయగాధలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే—

అతను ఓడినా ప్రయత్నం ఆపలేదు, మోసపోయినా మనోబలాన్ని కోల్పోలేదు, చివరకు గెలిచాడు... తన నైతిక విలువలను నిలబెట్టుకుంటూ!


నిజమైన టాలెంట్ ను ఎవరూ ఆపలేరు. ఓడిపోయిన వారు ఆగిపోతే ఓడినవారు, ప్రయత్నిస్తూ ముందుకు సాగితే గెలిచినవారే...




-----------