Read Path (of demons) by SriNiharika in Telugu Horror Stories | మాతృభారతి

Featured Books
  • మరుగున పడ్డ కథ

    మరుగున పడ్డ కథ" ఏవండీ వినాయక చవితి ఉత్సవాలు వస్తున్నాయి. ఈసా...

  • దారి (దయ్యాల)

                               దారి (దయ్యాల) – కథ“అరేయ్… మా ఏరియ...

  • ఒంటరితనం 2.0

    ". ఒంటరితనం 2.0 "" అమ్మ నువ్వేమీ బెంగ పడకు. నేను ప్రతిరోజు వ...

  • శ్రీరామనవమి

    శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వస...

  • సత్తిబాబు

    సత్తిబాబు " పొద్దుటి నుంచి మన ఇంట్లో కరెంట్ లేదండి. ఇవాళ అసల...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

దారి (దయ్యాల)

                           దారి (దయ్యాల) – కథ

“అరేయ్… మా ఏరియామొత్తం ఎ.టి.ఎంలు తిరిగారా ఒక్కదాంట్లో డబ్బుల్లేవు… అక్కడ ఏమైనా వస్తున్నాయారా?”అడిగాను నా ఫ్రెండ్ ని.

 

వాడు ఓ ఎ.టి.ఎంఅడ్రస్ చెప్పాడు. అక్కడ ఎప్పుడూ డబ్బులు ఉంటాయన్నాడు. ఆటోలో ఆ అడ్రెస్స్ కివెళ్లాను. ఎ.టి.ఎంలో డబ్బులు డ్రా చేసుకుని అలా రోడ్డు మీద వెళుతున్నాను. రోడ్డుకిఇరువైపులా పెద్ద పెద్ద గేట్లు, ప్రహరీ గోడలతో విశాలమైన స్థలాల్లో కోటల్లా ఉన్నాయిబంగళాలు.

 

ఉన్నట్టుండి ఓబంగాళాలో నుండి పెద్ద అరుపు వినపడింది. ఆ బంగాళా దగ్గరికి వెళ్లాను. గేటు తెరిచిఉంది. గేటు బయటే నిలబడి లోపలికి చూశా. ఆ ఇంటి గుమ్మం కూడా తెరిచే ఉంది. గుమ్మంలోనుండి ధోతి కట్టుకున్న ఓ ముసలాయన బయటికి వచ్చాడు గాభరాగా. బహుహా ఆయనే అరిచిఉంటాడు. నన్ను చూసి-

 

“బాబు…” అంటూపరుగెత్తుకొచ్చాడు. నేను ‘ఏంట’న్నట్టు చూసాను.

 

దగ్గరికి వచ్చి “మాఅయ్యగారికి గుండెపోటు వచ్చింది బాబు” దాదాపు ఏడుస్తున్నట్టు అన్నాడు. వణుకుతున్నగొంతుతో.

 

నాకు చేపగానేసందేహం వచ్చి “ఇంట్లో ఎవరూ లేరా” అని అడిగా.

 

“అయ్యగారు, ఆయన్నుచూసుకోడానికి నేను. ఇద్దరమే ఉంటాం, సాయం సెయ్ బాబూ, నీకు పుణ్యముండుద్ది…అయ్యగారిని తొందర్గా ఆసుపత్రికి తీస్కెళ్ళాలి”

 

నాకు ఏమి చేయాలోతోచలేదు. సహాయం చెద్దామనిపించింది.

 

“ఎక్కడ మీఅయ్యగారు?”

 

లోపలితీసుకెళ్ళాడు. విశాలమైన పడకగదిలో పెద్ద మంచం పైన ఓ పెద్దాయన గుండెను రెండుచేతుల్తో అదుముకుంటూ బాధపడుతూ ఉన్నాడు.

 

“ఆలస్యం అయితేప్రాణాలు మిగలవు బాబు”

 

“సరే, సరే టాక్సీతీసుకొస్తాను” అంటూ కాల్ చేయడానికి బయటికి వచ్చాను. సిగ్నల్ లేకపోవడంతో గేటు దాటిరోడ్డు మీదకు వచ్చేసాను. చాలా సేపటికి కాల్ రింగ్ అయింది. టాక్సీవాడికి అడ్రెస్స్చెప్పి ఇంట్లోకి వెళ్దామని వెనక్కి తిరిగి చూసాను. అంతే… ఒక్క సారిగా షాక్ కి గురయ్యాను.బంగాళా ఉన్న స్థలం అంతా ఇపుడు పూర్తిగా నేలమట్టమైన భావన శితిలాలు, పిచ్చి మొక్కలు,ముళ్ళ కంపలతో నిండి ఉంది. ఇదంతా కలా నిజమా అని తేల్చుకోలేక ఎంత సేపు అలా అక్కడేనిలబడిపోయానో నాకు తెలీదు…

 

“హలో సార్” అనేపిలుపుతో ఈ లోకంలోకి వచ్చాను. నా మొబైల్ మోగుతూ ఉంది. టాక్సీ డ్రైవర్ నుండి కాల్.పక్కనే టాక్సీ ఆగి ఉంది.

 

నా మొబైల్ మోగడంతోకాల్ కట్ చేసి కన్ఫర్మ్ చేసుకుని “ఈ అడ్రెస్స్ కి టాక్సీ బుక్ చేసారు. అది మీరే కదసార్?” అన్నాడు టాక్సీ డ్రైవర్.

 

“అవును”

“రండి సార్… త్వరగాఎక్కండి. ముందే ఈ చోటు అంత మంచిది కాదు”

 

అతని మాటలు నాకుబుర్రకు ఎక్కడం లేదు. మస్తిష్కం నిండా ఆ బంగళా, ధోతి ముసలాయన, పెద్దాయన ఆలోచనలే.“ఇక్కడ… బంగ్లా కనపడుతోందా నీకు?” నేను చూస్తున్న నేలమట్టమైన బంగాళా నిజమా కాదాఅన్న అనుమానంతో అడిగాను టాక్సీలో కూర్చుంటూ.

 

“బంగ్లానా? ఎక్కడసార్?”

 

అతనికి చేత్తోచూపించాను.

 

అతను ఈ ఏరియామంచిది కాదు అని ఎందుకు అన్నాడో దానికి వత్తాసుగా నేను అడగటమే తడవుగా అన్నట్టు“మొత్తం కూలిపోయిన బంగళా ఉంది కదా సార్. దాన్నే అడుగుతున్నారా? ఇప్పుడు కాదు గానీఒకప్పుడు ఉండేది అక్కడ బంగళా. అప్పట్లో… ఆ ఇంటి యజమాని గుండెపోటుతో చనిపోయాడు. ఒకపనివాడుండేవాడు ఆయనకి. యజమాని పోగానే పనివాడు కూడా ఆయన మీద బెంగతో చనిపోయాడు వారంరోజుల్లోనే. యజమాని పిల్లలు ఫారిన్ లో ఉంటారు. ఎవరు ఆ బంగళాని పట్టించుకోకపోవడంతోఅది కూలిపోయింది” చెప్పి “ఎందుకు సార్ ఆ బంగళా గురించి అడుగుతున్నారు?” అన్నాడుటాక్సీ డ్రైవర్.

 

“ఏంలేదు”పరధ్యానంగా అన్నాను.

 

“మీక్కూడా ఆ బంగళా…ముసలాళ్ళు… కాన్పించలేదు కదా?” అన్నాడు. బహుశా నా వాలకం చూసేమో.

 

“నీకెలా తెల్సు”

 

“నాకే కాదు సార్ ఈఏరియాలో ఉండే వాళ్ళందరికీ తెలుసు. ఆ బంగళా, ఆ పనివాడు, అతని అయ్యగారి గురించి”

 

అయోమయంగా డ్రైవర్వాపు చూశాను.

 

“అవును సార్… మిట్టమధ్యాహ్నం ఈ దారిన ఒంటరిగా వెళ్ళే వాళ్లకి ఆ బంగళా కనపడటం… అందులో నుండి పనివాడుపరుగేట్టుకురావడం… వాళ్ళ అయ్యగారి గురించి చెప్పడం… లోపల ఇంకో దెయ్యం గుండెపోటుతోబాధపడుతూండటం… వెళ్ళిన వాళ్ళు బయటికి రాగానే బంగ్లా మాయమైపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకేఎవరూ కాలినడకన ఈ రోడ్డులో వెళ్ళరు ఈ టైంలో. మీరు ఈ అడ్రెస్ చెప్తే నేను కూడాఅనుమానంతోనే వచ్చాను మీరు కరెక్ట్ అడ్రస్ చెప్పరా లేదా అని”

 

ఒక్కసారిగా మైండ్బ్లాక్ అయ్యింది నాకు. ‘ఇప్పటి దాకా నేను ఉన్నది దెయ్యాల్తోనా … దెయ్యాలబంగ్లాలోకి వెళ్ళానా..!!’ కళ్ళు బైర్లు కమ్మాయి. స్పృహ తప్పిపోయాను.

 

“సార్… సార్…” అంటూమొహం మీద చల్లని నీళ్ళు చల్లి లేపాడు డ్రైవర్.

 

నేను కళ్ళుతెరవగానే “భయపడకండి సార్… ఆ ఆత్మలు ఇంతవరకు ఎవరికీ ఎలాంటి హాని చేయలేదు… భయపడకండి”అన్నాడు. మళ్ళీ తనే-

 

“ఆత్మలు కోరికతీరకపోతే అలా తిరుగుతూ మనుషులకు కనపడుతుంటాయి” అన్నాడు.

 

మౌనంగా ఉండిపోయాను.

 

“ఎవరైనా ఉండి ఉంటేవాళ్ళ అయ్యగారు బ్రతికేవారని పనివాడి ఆత్మ, నా వాళ్ళు ఉంటే బ్రతికి ఉండేవాడిననిఅయ్యగారి ఆత్మ కోరికతో ఉన్నాయట. ఆ కోరికతోనే అలా అందరికీ కన్పించి సహాయాన్నిఅడుగుతుందట ఆ పనివాడి ఆత్మ, అలా గుండెపోటుతో బాధపడుతుందట ఆ అయ్యగారి ఆత్మ”అన్నాడు.

 

ఆ సంఘటన జరిగినరోజు నుండి నెల రోజుల వరకు నేను జ్వరంతో ఇంటి నుండి బయటికి వెళ్ళలేదు.

 Note:

కేకలు వేయడం, ఏడవడం సాధ్యం కాదు

కన్నీళ్లను ఆపుకోలేకపోయింది

అతను భయంతో వీధిలో నడిచాడు

భారమైన రేపు

దాటకుండా ఉండలేరు




నన్ను అర్థం చేసుకోలేని వారికి

అర్థం చేసుకోవడానికి నిరాకరించే వారిలో

నేను జీవిస్తున్నాను




నా కోసం ఎవరూ లేరు కంటే

నిజం చెప్పాలంటే నేను ఎవరికీ భారం కాదు.




ప్రేమను వెతుక్కుంటూ, చూపిస్తోంది

ఇది చెత్త కంటే అధ్వాన్నంగా మారుతుంది.




ఎందుకంటే నాకు ఏకాంతం అంటే చాలా ఇష్టం

ఎందుకంటే నన్ను బాధపెట్టడానికి అక్కడ ఎవరూ లేరు.




ఎవరినీ అతిగా ప్రేమించవద్దు

విడిపోతున్నప్పుడు ఏడ్చేది మీ కళ్ళు కాదు

అది మీ హృదయం అవుతుంది.




భావాలు లేని చోట

ఎమోషనల్‌గా ప్రదర్శించారు

మీ ప్రేమకు

గాయం ఖచ్చితంగా ఉంది.




జీవితంలో అతి పెద్ద క్రూరత్వం

మనల్ని మనం ఊహించుకోండి

మరొకదానిపై

అది అపరిమితమైన ప్రేమ.




నా మౌనం అహంకారం కాదు బాధ.




నీ హృదయం నన్ను ప్రేమిస్తుంది

కలిసి లెక్కించడం

కళ్లు నీళ్లతో నిండిపోయాయి.



నేను ప్రేమించినప్పుడు ప్రేమించిన దానికంటే ఎక్కువగా ద్వేషించిన తర్వాత ప్రేమించాను అన్నది నిజం…




ఎడబాటు ఎవరూ కాదనలేని బాధ, జ్ఞాపకం ఎవరూ దొంగిలించలేని నిధి…




మాట్లాడుతూనే ఉంటాం అని చెప్పిన వారే ఈరోజు మాట్లాడేందుకు సమయం లేదు…




నేను మర్చిపోయాను మరియు నా పేరుతో మీ పేరును తిరిగి వ్రాస్తాను …




కారణం చెప్పి ఎవరినీ ప్రేమించకండి..! కారణం లేకుండా ఎవరినీ ద్వేషించకు…! రెండు నిన్ను బాధిస్తాయి..!




ప్రేమను ప్రేమించే వారెవరూ… నిలబెట్టుకోవడానికి ప్రయత్నించరు…!!!




మంచి జీవితాన్ని పొందేవాడికి ఎలా జీవించాలో తెలియదు, ఎలా జీవించాలో తెలిసినవాడికి మంచి జీవితం లభించదు…




నిరాశ నాకు కొత్త కాదు ఈ రోజు నువ్వు… రేపు ఎవరైనా… ఇదే నా జీవితం….




ఎంత ఏడ్చినా కొన్ని బాధలు తగ్గవు…




మనం ఎంత ఆప్యాయత కురిపించినా…కొంతమంది మనల్ని అర్థం చేసుకోలేరు..!