రాత్రి పది గంటల సమయంహఠాత్తుగా మొదలైన వర్షం ఉరుములు మెరుపులతో క్షణక్షణానికి త్రీవంగా కురవసాగింది.వీధిలో జనసంచారమే లేదు.చుట్టుకమ్ముకున్న చీకట్లో వర్షపు జల్లుల శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు. ఎక్కడో దూరంగా వర్షపు ఉద్వేగానికి భయపడ్డ కుక్కపిల్ల వణికిపోతూ కుంయ్ కుంయ్‌మని ఏడుస్తోంది.అతను ఆమెవైపు కాంక్షగా చూస్తూ అడుగులు వేస్తున్నాడు.
ఆమె జింక పిల్లలా వణికిపోసాగింది.అతను ఆమె మీదికి దూసుకుపోయి ఆమెను పట్టుకున్నాడు.ఆమె అతడి చేతులనుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ – ‘‘దుర్మార్గుడా, అంతగా కావాలంటే మధుబాల దగ్గరికి పో’’ అంది ఈసడింపుగా.ఆ మాటలు వినగానే అతను మండిపడ్డాడు. ఆమెను తోసి గదిలో అటుఇటు చూశాడు.ఓ మూలలో కాయగారలు కోసే కత్తి కంటపడింది.పరుగున వెళ్ళి కత్తి అందుకున్నాడు.భయంతో ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి.ఆమెను కత్తితో ఆమె మీది లంఘించాడు. ఎడాపెడా ఆమె పొట్టలో కత్తితో నాలుగైదు సార్లు పొడిచాడు.బాధతో ఆమె వేసిన కేకలు బయటి ఉరుముల వర్షపు శబ్దాలలో కలిసిపోయాయి. కొద్ది క్షణాల పాటు గిలగిలా తన్నుకున్న ఆమె చివరికి నిస్సహాయంగా నేలవాలింది.ఆమె చుట్టూ రక్తం మడుగు కట్టింది.
బ్రజ్‌భూషణ్ ఇంట్లో దొంగతనం జరిగిందని, దాదాపు లక్ష రూపాయలు విలువ చేసే నగలతో కొత్త కోడలు పుష్ప ఇల్లు విడిచి రాత్రికి రాత్రే పారిపోయిందని ఆ వీధిలో కరెంటులా పాకింది.వార్త తెలిసిన ఇరుగుపొరుగు వాళ్ళు ఆశ్చర్యపోయారు.కొత్తగా కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆ అమ్మాయి బయటికిరానేలేదు. ఆమెను చూసిన వాళ్ళు ఆ వీధిలో ఒకరిద్దరు తప్ప ఎవరూ లేరు.ఆమె కాపురానికి వచ్చిన రోజు నుంచి బయటికి రానేలేదు.
కనీసం భర్త వెంట సినిమాకు పోలేదు.కనీసం ఇరుగుపొరుగు వారితోపాటు దేవస్థానానికి పోలేదు. ఆసోహా పోలీస్‌స్టేషన్‌లో ఆ సమయంలో ఇన్‌స్పెక్టర్ సింగ్ డ్యూటీలో ఉన్నాడు.ఆయన తన ఎదుట ఉన్న ఫైలును దీక్షగా పరిశీలిస్తున్నాడు.సరిగ్గా అప్పుడే ఓ వ్యక్తివచ్చి ‘తన పేరు రమేశ్ అని, తన సోదరుడు మహేశ్ భార్య లక్ష రూపాయలు విలువచేసే నగలతో ఇంటి నుండి పారిపోయిందని రిపోర్ట్ రాయించాడు.ఇన్‌స్పెక్టర్ సింగ్ అతడిని ప్రశ్నించి రిపోర్ట్ రాసుకుని త్వరలో ఆమెను పట్టుకుంటామని చెప్పి అతడిని పంపేశాడు.
ఆ వార్త వినగానే ఐటీ సిటీ బెంగళూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది...ఐటీ కారిడార్‌లో ఉన్న సంస్థల్లో నిశ్శబ్దం నెలకొంది.కంప్యూటర్లు, లాప్‌టాప్‌లపై టకటకలాడిస్తున్న వేళ్లు ఒక్క నిమిషం ఆగిపోయాయి.‘డెల్’ ఉద్యోగిని పాయల్ సురేఖను గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లాట్‌లో హత్య చేశారన్న వార్త తీవ్ర సంచలనం సృష్టించింది.జేపీ నగర్‌లోని అపార్ట్‌మెంట్ ...బయట జనాల్ని పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. అప్పటికే వందల సంఖ్యలో ఐటీ ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు.
‘నగరం నడిబొడ్డున పట్టపగలే హత్య జరిగింది. ఈ నగరంలో మహిళలకు రక్షణ లేదా?’ అంటూ వారంతా నినదిస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు నగర పోలీస్ కమిషనర్ శంకర్ బిదిరికి సమాచారం అందించారు.మరికాసేపటికి పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకున్నారు. జేపీనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రంజిత కమిషనర్‌ను ఫ్లాట్‌లోకి తీసుకెళ్లారు.బెడ్‌పైన రక్తపుమడుగులో నిర్జీవంగా కనిపించింది సురేఖ. ఆమె మెడను కత్తితో కోశారు.
శరీరం నిండా అనేక కత్తిపోట్లు. ఆమె ఒంటి మీదున్న లంగా, షర్ట్ రక్తంతో పూర్తిగా తడిచిపోయి ఉన్నాయి.‘‘సార్... ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఈ ఫ్లాట్‌లో గత నాలుగు నెలలుగా ఒంటరిగానే ఉంటోందట...’’ అప్పటిదాకా తెలుసుకున్న సమాచారాన్ని కమిషనర్‌కు చెప్పాడు ఇన్‌స్పెక్టర్ రంజిత.‘‘ఆమె తల్లిదండ్రులు, భర్త ఎక్కడుంటారు?’’‘‘పేరెంట్స్ అసోంలో, హస్బెండ్ కటక్‌లో ఉంటారట...’’‘‘వారికి మెసేజ్ వెళ్లిందా?...’’‘‘కొలీగ్స్ మెసేజ్ పంపారట. రేపు ఉదయానికి ఇక్కడికి చేరుకోవచ్చు...’’‘‘ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఎంక్వయిరీ మొదలెట్టండి... క్రైమ్‌సీన్ చూస్తుంటే ఎవరో బాగా తెలిసిన వ్యక్తే హత్యకు పాల్పడినట్లుగా అనిపిస్తోంది’’ అంటూ కొన్ని సూచనలిచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు కమిషనర్.సురేఖ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెంగళూరులోని కెంపగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు పోలీసులు.
బెంగళూరు నగర పోలీసు కార్యాలయంలో సురేఖ హత్య కేసు సమీక్ష ప్రారంభమైంది.‘‘సార్... సురేఖ భర్త అనంతనారాయణ మిశ్రా కటక్‌లో జిమ్ నిర్వహిస్తున్నాడని, ఆమె డెల్ కంపెనీలో నాలుగు నెలల కింద ఉద్యోగంలో చేరిందని ఎంక్వయిరీలో తేలింది’’ అని ఇన్‌స్పెక్టర్ రంజిత్ కమిషనర్‌కు వివరించాడు.‘‘హత్య జరిగింది బెడ్ రూంలో. అయితే కిచెన్‌లోని సింకులో రెండు కాఫీ కప్పులున్నాయి. హత్యకు ముందు ఆమె ఎవరితోనో కలిసి కాఫీ తాగింది. అంటే ఈ హత్య ఆమెకు బాగా తెలిసినవారే చేశారని తెలుస్తోంది’’
‘క్రికెట్ మైదానంలో మరణించిన క్రికెటర్ కనకయ్య’పేపర్లో వార్త పైకి చదివాడు అసిస్టెంట్ రాము.‘‘ఎలా మరణించాడు?’’ పుస్తకంలోంచి తలెత్తి అడిగాడు డిటెక్టివ్ శరత్.‘‘బ్యాట్స్‌మన్ వేగంగా కొట్టిన బంతి ఫీల్డర్ కనకయ్య కణతలకు తగిలి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు’’ చెప్పాడు రాము.
ఇంతలో సెక్రటరీ సుధ లోపలకు వచ్చి, ‘‘బాస్ రమణయ్యట, మిమ్మల్ని కలవాలంటున్నారు, అతని తమ్ముడు కనకయ్య హత్య గురించి మాట్లాడాలట’’.‘రమ్మను’ అన్నాడు శరత్.మూర్తీభవించిన విషాదంలా ఉన్నాడు రమణయ్య. శరత్ ఎదుట కూర్చున్నాడు.‘‘క్రికెటర్ కనకయ్య నా తమ్ముడు. రాబర్ట్ కొట్టిన బంతి తలకు తగిలి అక్కడికక్కడే మరణించాడు’’. చెప్పాడు.‘‘ఇప్పుడే పత్రికలో చదివాను’’‘‘అది యాదృచ్ఛికం కాదు, పథకం ప్రకారం జరిగింది!’’కనుబొమ్మ ఎగరేశాడు శరత్.‘‘నాలుగైదు నెలలుగా నా తమ్ముడిమీద హత్యాప్రయత్నాలు జరుగుతున్నాయి. దైవికంగా తప్పించుకుంటున్నాడు. ఈసారి తప్పించుకోలేకపోయాడు’’ రమణయ్య కన్నీళ్ళు పెట్టుకున్నాడు.‘‘హత్య అని ఎలా చెప్తారు?’’‘‘నాలుగునెలలక్రితం బరోడాలో మ్యాచ్‌కి వెళ్లినప్పుడు, మరో క్రికెటర్‌తో కలిసి కార్లో వెళ్తూంటే లారీ వెంటాడి ఢీకొట్టి కారును నుజ్జునుజ్జు చేసింది.
స్వల్పగాయాలతో ఇద్దరూ బయటపడ్డారు. కలకత్తాలో మ్యాచ్ ఆడే రోజు పుడ్ పాయిజనింగ్ జరిగింది. అదే ఐటమ్ తిన్న మిగతావారంతా బాగానే ఉన్నారు. సకాలంలో ట్రీట్‌మెంట్‌తో బయటపడ్డాడు. ఢిల్లీలో మ్యాచ్‌కి ముందురోజు ప్రాక్టీసులో బంతి తలకు తగిలింది. అంతకుముందు ఫ్రెండ్లీమ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కొట్టిన బంతి కంటిపైన తగిలి కుట్లుపడ్డాయి. ఇవన్నీ యాధృచ్చికం అనిపించటంలేదు. నిజానిజాలు మీరే తేల్చాలి’’ కన్నీళ్ళతో ప్రాధేయపడ్డాడు రమణయ్య. రాము వైపు చూశాడు శరత్. రాము తల ఊపాడు.‘సరే. మీరు వివరాలన్నీ రాముకి ఇవ్వండి, పరిశోధిస్తాం’’ అన్నాడు శరత్.
.
వీడియో సాక్ష్యం
‘‘నన్ను చంపొద్దు... నీకు విడాకులిస్తా... ప్లీజ్ నాకు మంచినీళ్లు ఇవ్వు... నన్ను బతికించు... అబ్బా కొట్టొద్దు... నీ కాల్మొక్కుతా... నన్ను వదిలేయవే...’’ పదేపదే అవే మాటలను ఓ వ్యక్తి మంచం మీద నుంచి కిందపడి దొర్లుతూ ఎవరినో ప్రాధేయపడుతున్న దృశ్యాన్ని తెలుగులో అన్ని టీవీ ఛానళ్లు వందలసార్లు చూపించాయి.సాధారణంగా ఛానళ్లకు ఇలాంటి దృశ్యాలు దొరికాయంటే పండగే.ప్రేక్షకులు వాటిని అదే పనిగా చూస్తారనే విషయం వారికి బాగా తెలుసు. అందుకే ఆ ఫుటేజీని రోజంతా చూపించారు.ఆ రోజు మీడియాలో ఇదే హాట్ టాపిక్...
ఈ వీడియో వైరల్ అయి సోషల్ మీడియాలోనూ చక్కర్లు కొట్టింది.ఈ సంఘటన ఎక్కడ జరిగింది? వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరిని ప్రాధేయపడుతున్నాడు? ఇంతకీ వారిద్దరూ భార్యాభర్తలేనా? అన్నీ ప్రశ్నలే...పోలీసు అధికారులైతే వీడియో చూసి పాత ఫైళ్లు తిరగేయడం ప్రారంభించారు.మీడియా ప్రతినిధులు సమాంతర ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.కొన్ని గంటల పాటు హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఈ వీడియో దృశ్యాలు హల్‌చల్ సృష్టించాయి.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పోలీసుస్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ లింగయ్య ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు.‘‘ఇలా కూడా హింసిస్తారా? అతనెవరో... ఏమిటో...’’ అనుకున్నారాయన.వీడియో చూసిన రెండు గంటల తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆయన వద్దకు వచ్చారు.
‘‘సార్... పొద్దున్నుంచి టీవీల్లో వస్తున్నది చూశారా?’’‘‘చూశాను. వాడెవడో నన్ను చంపొద్దంటూ వేడుకుంటున్నాడు. ఏ ఛానల్ చూసినా అవే దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా...’’‘‘వాడు మావోడే సార్... మా యాదగిరి బొమ్మే సార్ అదీ...’’‘‘అతడి పేరు యాదగిరా... అతను మీకు తెలుసా?’’ ఆశ్చర్యంగా అడిగాడు ఇన్‌స్పెక్టర్.‘‘ఆ రోజు మాకు అనుమానం రాలేదు సార్... ఏదో జబ్బు చేసి చనిపోయాడనుకున్నాం. కానీ వాడ్ని ఇంతలా కొట్టి చంపేశారని తెలియదు... ’’‘‘అతడు మీకేమవుతాడు? అసలు మీరెక్కడి నుంచి వచ్చారు’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఇన్‌స్పెక్టర్ లింగయ్య.‘‘సార్ నా పేరు వంశీ. ఈమె నా భార్య అనిత. ఈ వీడియోలో ఉన్నవాడు నా బావమరిది యాదగిరి...’’‘‘మీరెక్కడి నుంచి వచ్చారు? యాదగిరిని కొట్టి చంపారంటున్నావ్... కాస్త అర్థమయ్యేలా చెప్పు...’’
.