Featured Books
  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 3

    జరిగినది అంతా వారికీ చెప్పిన తరువాత: సుభాష్: హేమంత్ సార్ 2 ర...

  • Vaari

    Scene-1అర్జున్ &సంజయ్  conversation:అర్జున్ : రేయ్ సంజయ్…. ఏ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 22

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కొంచెం జాగ్రత్త - 1


ఒకటే ఫ్యామిలీ కి చెందిన 11 మంది మాస్ సూసైడ్ చేసుకున్న బురారీ స్టోరీ 

రాజధాని ఢిల్లీ లోని బురారీ ఏరియా లో లలిత్ చుండవత్ ఫ్యామిలీ ఉండేది. ఈ ఫ్యామిలీ లో 80 సంవత్సరాల మహిళ నుంచి 15 సంవత్సరాల బాబు వరకు మొత్తం 11 మంది ఉండేవారు. ఈ ఇంటి కిందే వీరి ఒక షాప్ కూడా ఉండేది. జులై 1 2018 రోజున దాదాపు 7 గంటల గుర్ చరణ్ సింగ్ అనే వ్యక్తి లలిత్ మార్నింగ్ వాక్ కి ఎందుకు రాలేదు మరియు షాప్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు అని తెలుసుకోవడానికి వెళతాడు. 

లోపలి వెళ్ళేటప్పుడు తలుపు తెరుచుకొని ఉండటాన్ని గమనించాడు. తలుపు తీసి లోపలి వెళ్లగా ౧౦ మంది శవాలు ఒక రూమ్ లో మరియు 1 ముసలావిడ శవం ఇంకో రూమ్ లో బెడ్ పై దొరుకుతుంది. మొత్తం 11 మంది మాస్ సూసైడ్ చేసుకున్నారనే విషయం అర్థం అయ్యింది.

గురుచరణ్ సింగ్ ఇరుగు పొరుగు వారికి ఈ విషయాన్ని తెలియజేస్తాడు. అందులో ఒకరు పోలీసులకు కూడా ఫోన్ చేయటం జరుగుతుంది. 7:30 AM కి పోలీసులు అక్కడికి చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు.

పోలీసులు అక్కడ అబ్సర్వ్ చేసిన విషయం ఏమిటంటే అన్ని శవాలకు మూతి పై మరియు కళ్ళ పై బట్టతో కట్టి ఉంచటం గమనించారు.

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే ఈ చుండవత్ ఫ్యామిలీ రాజస్థాన్ కి చెందింది. భోపాల్ సింగ్ మరియు నారాయణ దేవి అనే దంపుతులు తమ ఆస్తులను అమ్ముకొని 1990 సంవత్సరంలో ఢిల్లీ లోని బురారీ లో స్థలాన్ని కొనుకొన్ని ఇంటిని కట్టారు.

భోపాల్ సింగ్ కు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు. కొడుకుల పేర్లు భవ్ ణేష్, లలిత్ మరియు దినేష్. కూతురు పేరు ప్రతిభ 

కూతురి కి పెళ్లి చేసిన తరవాత తన ముగ్గురు కొడుకులను ఢిల్లీ లో తాను కట్టిన ఇంట్లో వచ్చి ఉండమని భోపాల్ సింగ్ కోరుతాడు.

1993 వ సంవత్సరంలో లలిత్ మరియు భవ్ ణేష్ ఢిల్లీ కి వచ్చి నివసించటం మొదలుపెట్టారు.మూడవ కొడుకు దినేష్ రాజస్థాన్ లో బిసినెస్ బాగా నడుస్తుందని ఢిల్లీ కి రాలేదు.

 భోపాల్ సింగ్ ను ఫ్యామిలీ మరియు కాలనీ వారు ప్రేమతో డాడీ అని మరియు నారాయణి దేవి ని మమ్మీ అని పిలిచేవారు. వీరు కాలనీ లో అందరికి సహాయం చేయటం లో ముందుండే వారు అందుకే ఆలా పిలిచేవారు. కొంత కాలంలోనే కొడుకులకు పెళ్లిళ్లు అయ్యాయి మరియు పిల్లలు కూడా పుట్టారు. 

ఢిల్లీ లో భోపాల్ సింగ్, తన పెద్ద కొడుకు భవ్ ణేష్ పెద్ద కోడలు సవిత, రెండవ కొడుకు లలిత్ రెండవ కోడలు టీనా ఉండేవారు.

పెద్దకొడుకు భవ్ ణేష్ కు మేనకా, నీతూ, ధృవ్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. లలిత్ కి శివమ్ అనే కొడుకు ఉన్నాడు.

ఇదే సమయంలో భోపాల్ సింగ్ యొక్క కూతురు ప్రతిభ కూడా తండ్రి వద్దే వచ్చి ఉండసాగింది. ప్రతిభ భర్త హింసను తట్టుకోలేక ఇక్కడికి వచ్చింది. కొన్ని రోజుల తరవాత ప్రతిభ భర్త చనిపోవటం వల్ల తన కూతురు ప్రియాంక తో పాటు తండ్రి వద్దే ఉండసాగింది.

ఆ సమయంలో లలిత్ ఒక్కడే కుటుంబంలో సంపాదించేవాడు. లలిత్ పెద్దగా ఎవ్వరితో మాట్లాడకపోయేవాడు. అవసరం ఉంటేనే తప్ప అనవసరంగా మాట్లాడేవాడు కాదు.

ఈ ఫ్యామిలీ మొత్తం ఎదుటివారికి సహాయం చేయటమే తప్ప ఎవ్వరిని కూడా కష్టపెట్టేవారు కాదు.  లలిత్ ప్లైవుడ్ బిజినెస్ చేసేవాడు. బురారీ వచ్చిన తరవాత ఒక ప్లైవుడ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. 

2004 వ సంవత్సరంలో తన ప్లైవుడ్ షాప్ లో జరిగిన ఫైర్ ఆక్సిడెంట్ లో లలిత్ గొంతు పోయి మూగవాడు అయ్యాడు. 2007   వ సంవత్సరంలో లలిత్ తండ్రి భోపాల్ సింగ్ చనిపోతాడు.

తండ్రి చనిపోయిన 100 రోజులకు గరుడ పురాణ పాఠం అనే పూజ చేస్తున్నాడు ఒక్కసారిగా లలిత్ గొంతు సరి అయ్యింది మరియు మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు.

తన తండ్రే కలలో వచ్చి ఈ పూజ చేయమని చెప్పాడని అందుకే నా మూగతనం పోయిందని లలిత్ పక్కింటి వాళ్ళతో చెప్పాడు. 

ఇక అప్పటి నుంచి రోజు రాత్రి ఈ ఫ్యామిలీ పూజలు చేసేది. చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరూ పూజలో పాల్గొనేవారు.

2007 సంవత్సరం నుంచి లలిత్ డైరీలు రాయటం మొదలుపెట్టాడు. తన తండ్రి తన తో మాట్లాడుతున్నాడని తాను చెప్పే మాటలన్నీ డైరీలో రాసేవాడు.

ఈ డైరీలో చాలా వరకు ఫ్యామిలీ మొత్తానికి  ఏ పని ని ఎలా చేయాలి అనే instructions ఉండేవి. ఈ instructons కూడా చాలా  స్ట్రిక్ట్ గా ఉండేవి.

క్రమంగా వీరి బిసినెస్ పెరగసాగింది డబ్బులు రావటం జరిగింది. పిల్లలు కూడా బాగా చదవటం మొదలుపెట్టారు. ప్రతిభ కూతురు ప్రియాంక ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది.

ఈ ఎంగేజ్మెంట్ తరవాత ఈ ఫ్యామిలీ మొత్తం ఒక పూజ చేసేవారు ఈ పూజలో మరణించ బోతున్నామని సూసైడ్ ప్రాక్టీస్ చేసేవారు. ఈ సూసైడ్ ప్రాక్టీస్ లో అందరూ ఉరితాడు తమ మేడలో వేసుకొని రెండు నిమిషాల తరవాత కిందికి దిగి వచ్చేసేవారు. ఇలా చేస్తే భావంతుడి దర్శనం అవుతుందని తమ పూర్వికులు వచ్చి ఈ సూసైడ్ నుంచి కాపాడుతారని లలిత్  ఫ్యామిలీ మొత్తాన్ని convince చేసాడు.

నాలుగు ఐదు రోజులు ప్రాక్టీస్ చేసిన తరవాత 30 జూన్ 2018 రోజున ఈ రోజు పూజ యొక్క ఆఖరి రోజు అని చెప్పి అందరు శ్రద్దగా పూజ చేయాలి అని చెప్పి పూజను స్టార్ట్ చేసారు.

30 జూన్ రోజు ముందు రోజుల లాగా కాకుండా ప్రతి ఒక్కరి చేతులు కట్టేసారు. నోరు మరియు కళ్ళు బట్టతో కట్టేసారు. వీళ్ళందరికీ లలిత్ మరియు టీనా లు కలిసి కట్టారు.

చివరికి లలిత్ టీనా లు కూడా కలిసి ఒకరికొకరు సహాయం చేసుకొని కట్టుకున్నారు. ఫ్యామిలీ లో అందరూ ఎప్పటిలాగే 2  నిమిషాలలో దిగి పోవాలి అనుకున్నారు కానీ ఆ తరవాత ఎం జరగబోతుందో వారికి అస్సలు తెలియదు.

ఈ పూజ లో భాగంగా అందరూ ఉరివేసుకుంటారు. అందరి కన్నా లాస్ట్ లో లలిత్ ఉరి వేసుకుంటాడు. ఈ విధంగా అందరూ చనిపోతారు. తల్లి నారాయణి దేవి వేరే రూమ్ లో చనిపోయి ఉంటుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళను కాపాడటానికి దేవుడు రాలేదు వాళ్ళ పూర్వికులు రాలేదు.

లలిత్ అన్న భవ్ ణేష్ నోటిఫై ఉన్న కట్లు విప్పే ప్రయత్నం చేసాడు కానీ అదే సమయంలో తన ప్రాణం పోయింది అని అక్కడ క్రైమ్ సీన్ చుసిన వాళ్ళు చెప్పారు.  

లలిత్ భవ్ ణేష్ యొక్క పిల్లలు తాము ఆడుకునే సమయంలో తమ ఫ్రండ్స్ తో మేము దేవుడి దర్శనం చేయబోతున్నాము అని కూడా చెప్పరాని తరవాత తెలిసింది.

పోలీసులు సీసీటీవీ footage చూడగా ఆ ఇంట్లోకి ఎవ్వరు కూడా వచ్చినట్లు పోయినట్లు కనిపించలేదు. పైగా ఈ ఫ్యామిలీ లోనే కొందరు సూసైడ్ కోసం ఉపయోగించిన స్టూల్ లను కొనుక్కురావటం కనిపించింది.

లలిత్ షాప్ లో పనిచేసే వ్యక్తి చెప్పిన ప్రకారం లలిత్ చనిపోవడానికి ఒక వారం ముందు నుంచి షాప్ కి సరిగ్గా రాకపోవటం, ఎక్కువగా పడుకుని ఉండేవాడని చెప్పాడు.

డైరీల లో లలిత్ రాసిన మాటలను బట్టి కూడా కేవలం లలిత్ మాత్రమే మొత్తం ఫ్యామిలీ ను convince చేసాడని మిగతా వారి కోసం ఇది ఒక unexpected situation అని పోలీసులు నిర్దరానికి వచ్చారు.

ఈ శవాలకు psychological autopsy చేయగా ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక ఘటన అని చెప్పడం జరిగింది.