Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

కొంచెం జాగ్రత్త - 2


మనుషులను చంపి వారి మెదడును తినే ఒక నరభక్షకుడి సీరియల్ కిల్లింగ్స్ స్టోరీ 



హాయ్ ఫ్రెండ్స్ క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. ఇంతకు ముందు 2 ఎపిసోడ్ లలో నేను నరభక్షకుల స్టోరీలు చెప్పాను.  

ఈ రోజు చెప్పబోయే స్టోరీ కూడా ఒక నరభక్షకుడిది. ఈ స్టోరీ మీకు కాస్త డిస్టర్బింగ్ గా కూడా అనిపించ వచ్చు.

17 డిసెంబర్ 2000 సంవత్సరంలో అలహాబాద్ కు చెందిన హిందీ డైలీ న్యూస్ పేపర్ అయిన దిన పత్రిక కు చెందిన ఒక జర్నలిస్ట్ ధీరేందర్ సింగ్ కనిపించకుండా పోతాడు. రోజు తన పని పూర్తి చేసుకుని నేరుగా ఇంటికి వచ్చే ధీరేందర్ సింగ్ ఆ రోజు ఇంటికి రాక పోయే సరికి ఫ్యామిలీ వాళ్ళు వెతకటం ప్రారంభిస్తారు. ఎంత వెతికిన ఆచూకీ మాత్రం తెలియదు. మొబైల్ ఫోన్ కు కాల్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు రావటం జరిగింది.

చివరికి చేసేది ఏమి లేక ధీరేందర్ సింగ్ ఫ్యామిలీ కిడ్గంజ్ పోలీస్ స్టేషన్ లో FIR నమోదు చేస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాక అదే సమయంలో ధీరేందర్ సింగ్ తో పాటు ఇంకొంత మంది కూడా మిస్ అయినట్లు తెలిసింది.

పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో కూడా ధీరేందర్ సింగ్ గురించి ఏమి తెలియలేదు. కాల్ డీటెయిల్స్ చేసి లాస్ట్ కాల్ ఎవరికీ చేసాడో కనుక్కుందామని చూసినప్పుడు పూలన్ దేవి అనే మహిళ యొక్క ల్యాండ్ లైన్ నెంబర్ కి ధీరేందర్ సింగ్ కాల్ చేసినట్లు తెలుస్తుంది. పూలన్ దేవి ఇంటి నుంచి కూడా ధీరేందర్ సింగ్ కు కాల్ వచ్చినట్లు తెలిసింది.  

పూలన్ దేవి అక్కడి గ్రామ సభ యొక్క సభ్యురాలు, పూలన్ దేవి ఇంటికి వెళ్లి జర్నలిస్ట్ గురించి అడిగినప్పుడు పూలన్ దేవి యొక్క భర్త రామ్ నిరంజన్ నాకు ధీరేందర్ సింగ్ తెలుసు అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉంటాము. నా భార్య ఎన్నికలలో పోటీ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ జర్నలిస్ట్ తో పరిచయం ఉంది అని చెప్పటం జరుగుతుంది. 

కానీ పోలీసులకు రామ్ నిరంజన్ చెప్పే మాటలు నమ్మ బుడ్డి అవ్వలేదు ఎందుకంటే అర్ద రాత్రి ధీరేందర్ సింగ్ కాల్ చేసి ఎందుకు మాట్లాడాడు. ఆ సమయంలో అంట ఇంపార్టెంట్ పని ఏమి ఉంది ఉంటుంది అనే కోణం లో విచారించారు. 

ఈ ఫ్యామిలీ గురించి విచారించినప్పుడు పెళ్లి అయిన తరవాత భర్త రామ్ నిరంజన్ భార్య పేరు పూలన్ దేవి మరియు ఇద్దరు కొడుకుల పేర్లు అదాలత్ అంటే కోర్ట్ మరియు జామానత్ అంటే బెయిల్ అని పెట్టినట్లు తెలిసింది. రామ్ నిరంజన్ Central Ordinance Depot (COD) లో ఒక మాములు ఉద్యోగి అని కూడా తెలిసింది.  

పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేతున్న సమయంలో ధీరేందర్ సింగ్ యొక్క బైక్, ఫోన్ మరియు ఛార్జ్ Central Ordinance Depot (COD) వద్ద కనిపించటం తో పోలీసుల అనుమానం ఇంకాస్త పెరిగింది. మరోసారి రామ్ నిరంజన్ ను విచారించగా నేను నిజం ఐతే చెప్తాను కానీ నన్ను ఏమి చేయొద్దు అని అంటాడు. పోలీసులు సరే అని అంటారు. 

ఇంటికి దూరం ఊరి బయట తన వ్యవసాయ భూమిలోనే ఒక చిన్న రూమ్ ఉండేది, ఆ రూమ్ వద్దకి తీసుకెళ్తాడు. ఈ రూమ్ కలన్దర్ యొక్క రాజుది, ఈ రాజు తన యొక్క తీర్పులను ఇక్కడే నిర్ణయిస్తాడు. అతని మెదడు చాలా చురుకైనది తనకు ఎవ్వరు పట్టుకోలేరు అని పోలీసులతో అంటాడు.

పోలీసులు ఈ కలం లో రాజు ఎక్కడినుంచి వచ్చాడు, ఈ కలన్దర్ రాజు ఎవరు అని ఆశ్చర్య పోతారు. అక్కడే పడి ఉన్న రెండు మనిషి యొక్క పుర్రెలను చేతిలో పట్టుకొని  వీరిద్దరిని కలన్దర్ రాజు చంపేశాడు అని అంటాడు. అక్కడే చెట్టుపై వేలాడుతున్న ఇంకొన్ని కలర్ చేసిన పుర్రెలను చూపించి వారందరిని కూడా కలన్దర్ రాజే చంపేశాడు అని అంటాడు. ఇవన్నీ రాజుకి చెందిన ట్రోఫీలు అని అంటాడు.

ఒక్క మిస్సింగ్ కోసం వచ్చిన పోలీసులకు 14 మంది పుర్రెలు దొరుకుతాయి. అప్పుడు ఈ హత్యల వెనక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడని పోలీసులకు అర్థము అయిపోతుంది.

పోలీసులు ధీరేందర్ సింగ్ ఎక్కడున్నాడని అడగగా, కలన్దర్ రాజు తనకు శిక్ష విధించాడని చెప్తాడు. అతని బాడీ ఎక్కడుందని అడగగా తీసుకెళ్లి బాడీ ని చూపిస్తాడు. ధీరేందర్ సింగ్ ను చంపి ముక్కలు  ముక్కలుగా చేసి వేరు వేరు ప్రదేశాల్లో పాటి పెట్టాడు. ఇంతకీ కలన్దర్ రాజు ఎవరు అని అడగగా నేనే కలన్దర్ రాజు అని అంటాడు..

ఈ మాట విని ఆశ్చర్య పోయిన పోలీసులు ధీరేందర్ సింగ్ ను ఎందుకు చంపావు అని అడగగా నేను చంపక పొతే నా గురించే న్యూస్ పేపర్ లో స్టోరీ రాసేవాడు అందుకే చంపాను అని చెప్పాడు.

నీకు ఇంకెవరు సహాయం చేశారు అని అడగగా బావ మరిది సహాయం చేసేవాడని చెప్పాడు. మిగతా వారిని ఎందుకు చంపావు అని పోలీసులు విచారించగా నేను చంపిన వారు అందరు చాలా తెలివైన వారు అని అందుకే వీళ్లందరినీ చంపేవాడినని, చంపిన తరవాత శవం నుంచి తల భాగాన్ని వేరు చేసి మిగతా శరీరాన్ని ఎక్కడైనా దూరంగా వెళ్లి పూడ్చి పెట్టేవాడినని చెప్పాడు. తన వద్ద ఉన్న తల లో నుంచి వీరి బ్రెయిన్ యొక్క సూప్ చేసి తాగేవాడిని అని పోలీసులతో వివరిస్తాడు.

అక్కడున్న పుర్రెలపై ఎందుకు కాలాలు వేశావు అని అడగగా తనకు గుర్తు ఉందని కలర్ వేసి పేరు రాసుకుంటానని చెప్పాడు. 

పోలీసులు ఇతని గురించి ఇంకాస్త విచారించగా చిన్న చిన్న విషయాలలో ఇతనికి కోపం వచ్చేదని ఆలా కోపం వచ్చినప్పుడు లేదా ఏ కారణం లేకుండా కూడా తన వ్యవసాయ భూమి వద్దకు పిలిచి మనుషులను చంపేసేవాడు అని తెలిసింది.   

రామ్ నిరంజన్ లో చిన్నప్పటినుంచే  అంతగా తెలివితేటలు లేకపోవటం వల్ల తనను తానే బుద్ది మంతుడిగా మరియు రాజు గా ఊహించుకోవటం మొదలుపెట్టాడు.

 ఇతని ఇంటికి వెళ్లి కూడా సెర్చ్ చేయగా the court diary  అనే పేరు తో ఒక డైరీ దొరికింది. ఈ డైరీలో తానూ చంపిన 14 మంది పేర్లు ఉన్నాయి.

2001 లో కోర్టులో ఈ కేసు ను పెట్టగా 12  సంవత్సరాల తరవాత 2012 సంవత్సరంలో జీవిత ఖైదు విధించటం జరిగింది.


26 సంవత్సరాలు తన సొంత కూతురుని బేస్ మెంట్ లో నిర్బంధించిన ఒక తల్లి స్టోరీ 



హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్ కి స్వాగతం, ఈ రోజు నేను ఒక కొత్త స్టోరీ తో మీ ముందుకు వచ్చాను. ప్రపంచంలో అమ్మ ప్రేమను మించింది లేదు. ఒక బిడ్డ ను అమ్మ కన్నా ఎక్కువగా ఏవారు ప్రేమించలేరు. కానీ కొంత మంది చేసే నీచమైన పనులు అమ్మ ప్రేమకే మచ్చలా తయారవుతారు.

1901 వ సంవత్సరంలో  పొయిటియర్స్ లోని అటర్నీ జెనరల్ కు ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఒక్క ఉత్తరం వస్తుంది. ఆ ఉత్తరంలో ” మేడం మోనియార్ ఇంట్లో ఒక పెళ్లి కానీ అమ్మాయి గత 25 సంవత్సరాల నుంచి  నిర్బంధం లో ఉంది. ఆమె చాలా దీనావస్థ లో మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి ” అని రాసి ఉంది. 

ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే  మేడం మోనియార్ సొసయిటీ లో మంచి రెస్పెక్ట్ కలిగిన ఒక ధనిక మహిళ. మేడం మోనియార్ కు ఇద్దరు బిడ్డల తల్లి ఒక కూతురు మరియు ఒక కొడుకు. కూతురు పేరు బ్లాంచె మోనియార్ మరియు కొడుకు పేరు మార్సే మోనియార్. 

కూతురు బ్లాంచే మోనియార్ చాలా అందంగా ఉండేది. చాలా మంది బ్లాంచే మోనియార్ ను పెళ్లి చేసుకోవాలని ఇష్టపడేవారు. తల్లి మేడం మోనియార్ తన కూతురి కోసం ఒక్క గొప్పింటి సంభందం తీసుకొచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది.  మరోవైపు 25 సంవత్సరాల బ్లాంచే మోనియార్ ఒక లాయర్ ప్రేమలో పడుతుంది. ఈ లాయర్ ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాడు. 

తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు తాను అస్సలు ఈ పెళ్ళికి ఒప్పుకోనని చెప్పింది. లాయర్ డబ్బున్న వాడు కాక పోవటం మరియు బ్లాంచే మోనియర్ కన్నా వయసు ఎక్కువగా ఉండటం వల్ల పెళ్లి కి నో అని చెప్పింది.   

కూతురు మాత్రం పెళ్లంటూ చేసుకుంటే కేవలం తన ప్రేమికుడి తోనే చేసుకుంటా అని చెప్పింది. బ్లాంచే మోనియార్ మార్చి 1 వ తారీఖున పుట్టింది. 1875 సంవత్సరం 1 మర్చి రోజునే 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బ్లాకే మోనియార్ ను ఆఖరి సారి లాయర్ ను మరిచిపోవాలని అంటుంది.

కానీ బ్లాంచే మోనియార్ మాత్రం ఒప్పుకోలేదు ఒక చేసేదేం లేక ముందు నుంచే తల్లి కొడుకులు చేసిన ప్లాన్ ప్రకారం బ్లాంచే మోనియార్ ఒక చిన్న చీకటి గాడి లో బంధిస్తారు. నువ్వు ఆ లాయర్ ను మరిచిపోతే తప్ప ఈ రూమ్ లో నుంచి బయటికి రాలేవు అని తల్లి చెప్పి ఆ రూమ్ ని మూసేసింది.

ఈ చిన్న ఆ ఇంతో ఒక రకంగా స్టోర్ రూమ్ లా యూజ్ చేసేవారు. ఈ రూమ్ కి చిన్న కిటికీ ఉండేది కానీ బ్లాంచే మోనియార్ అరుపులు బయటికి రావద్దని ఆ చిన్న కిటికీ ను మూసివేయటం జరిగింది.

అందగత్తె బ్లాంచే ఇప్పుడు ఎలుకలు, బొద్దింకలు, పురుగులు తిరుగుతున్న చీకటి రూంలో తన సొంత తల్లి ద్వారా బందీ గా మారిపోయింది. ఈ రూమ్ లో బ్లాంచే మోనియార్ ను కట్టేసి ఉంచారు. 

కూతురు రోజుల తరబడి తన రూమ్ ఓపెన్ చేయమని అరుస్తూ ఉండేది. తల్లి మాత్రం నువ్వు ఆ లాయర్ ప్రేమను మరిచిపోవాలని పదే పదే చెప్పేది. బ్లాంచే మోనియార్ మాత్రం తన ప్రేమను మరిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసేంది.

రోజుల తరబడి ఆ రూమ్ నుంచి అరుపులు వచ్చాయి. ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి అడిగారు. ఎదో ఒకటి సర్ది చెప్పి తల్లి పంపించేసేది. కేవలం తినడానికి ప్లేట్ ఇచ్చేటప్పుడు మాత్రమే ఆ రూమ్ తెరుచుకునేది. 

ఆ తల్లి మనసులో మాత్రం కొంచెం కూడా జాలి అనిపించలేదు తన కూతురు పై కొంచెం కూడా కనికరం చూపలేదు. తల్లి కొడుకులు బ్లాంచే ను ఆ చీకటి గదిలో బంధించి తమ జీవితాలను సాధారణంగా గడపటం మొదలు పెట్టారు. కొన్ని రోజుల తర్వాత బ్లాంచే మోనియార్ కట్లను  విప్పేస్తారు.  

రోజులు నెలలు గా నెలలు సంవత్సరాలుగా గడిచిపోయాయి. ఆ రూమ్ లో నుంచి బ్లాంచే మోనియార్ అరుపులు రావటం ఆగిపోయాయి. చీకటి గది లో సంవత్సరాల తరబడి ఉండటం వల్ల ఆరోగ్యం బాగా క్షీణించింది. 

దాదాపు తొమ్మిది సంవత్సరాల తరవాత తాను ఎంతగానో ప్రేమించిన లాయర్ కూడా చనిపోవటం జరుగుతుంది. లాయర్ చనిపోయిన విషయం కూడా తల్లి కూతురితో చెప్పదు. 

లాయర్ బ్లాంచే మోనియర్ ను వెతకలేదా అని మీకు డౌట్ రావొచ్చు. ఇంటికి ఎవరూ వచ్చి బ్లాంచే మోనియర్ గురించి అడిగిన తాను పై చదువుల కోసం ఇక్కడినుంచి వెళ్ళిపోయింది అని చెప్పేది. కొన్ని రోజుల తరవాత  మళ్ళీ ఎవరైనా అడిగితే తాను అక్కడే పెళ్లి చేసుకుందని అందరికి అబద్దాలు చెప్పేది. 

ఇప్పుడు ప్రజంట్ లో 26 సంవత్సరాలు గడిచిన తరవాత 23 May 1901 సంవత్సరంలో అటర్నీ జనరల్ కి ఒక అజ్ఞాత వ్యక్తి లెటర్ లో బ్లాంచే మోనియార్ ఒక రూమ్ లో బందీ గా ఉంది కాపాడమని చ్ప్పటం జరుగుతుంది.

ఆ ఫామిలీ సొసైటీ లో రెస్పెక్ట్ కలిగింది మరియు ధనిక కుటుంభం కావటం తో అక్కడ వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయటానికి పోలీసులు ఆలోచిస్తారు.

అక్కడే ఉన్నఒక పోలీస్ ఆఫీసర్ తాను యవ్వనంలో ఉన్నప్పుడు బ్లాంచే మోనియర్ ను చూసినట్లు చెప్పాడు. కొన్ని సంవత్సరాల నుంచి పోలీస్ ఆఫీసర్ తనని చూడలేదు అని చెప్తాడు. 

సెర్చ్ వారెంట్ తీసుకొని పోలీసులు మేడం మోనియార్ ఇంటికి చేరుకుంటారు. ఇంట్లో మొత్తం వెతుకుతారు కానీ ఎక్కడా కూడా బ్లాంచే మోనియార్ కనిపించదు.  బేస్మెంట్ లో ఉన్న ఒక చిన్న రూమ్ ను పోలీసులు గమనిస్తారు. తలుపులు తెరిచి లోపలికి వెళ్లి ఒక్కసారిగా బయటికి వచ్చేస్తారు.

ఆ రూమ్ లో నుంచి భరించరాని దుర్వాసన వస్తుంది. పోలీసులు ఇంకో సారి వెళ్లి చూడగా బ్లాంచే మోనియార్ శరీర బరువు మొత్తం పోయి అస్థిపంజరం లా బెడ్ పై నగ్నంగా పడుకొని ఉంది. బ్లాంచే మోనియార్ చుట్టూ కుళ్ళిన మాంసం ముక్కలు, కూరగాయలు, చేప మాంసం, కుళ్ళిన బ్రెడ్ మరియు ఓయస్టర్ షెల్స్ కనిపించాయి.

ఆమె చుట్టూ పురుగులు తిరుగుతున్నాయి. శరీరానికి చుట్టూ కుళ్ళి పోయిన ఫుడ్ మరియు మల మూత్రాలు ఉండటం వల్ల భరించరాని దుర్వాసన. గాలి ఆ రూమ్ లోకి వచ్చే అవకాశమే లేదు. ఆక్కడే ఉన్న కిటికీ ను తెరవగా సూర్య కిరణాలు బ్లాంచే  మోనియార్ ముఖం పై పడతాయి. 26 సంవత్సరాల తరవాత బ్లాంచే మోనియార్ వెలుతురును చూసింది. ఆక్కడినుంచి తీసుకెళ్లి బ్లాంచే మోనియార్ వెయిట్ చెక్ చేయగా తన బరువు కేవలం 25 కేజీలు మాత్రమే ఉంది. 

తల్లి ను వెంటనే అరెస్ట్ చేస్తారు. ఒక తల్లి ఇంత క్రూరంగా ఎలా ప్రవర్తిస్తుందని అక్కడి ప్రజలు మేడం మోనియార్ ముందు ప్రొటెస్ట్ చేయసాగారు.

కొడుకు మార్సెల్ మోనియార్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా చుసిన తల్లి తాను నిజంగానే పెద్ద తప్పు చేసింది అని అనుకుందేమో అరెస్ట్ అయిన 15 రోజులకే అనారోగ్యం తో చనిపోయింది. 

కొడుకు ఇప్పుడు ఒక లాయర్, కొడుకును కోర్ట్ లో ప్రవేశ పెట్టినప్పుడు తనకు కేవలం నామ మాత్రపు శిక్ష విదిస్తుంది. మరోవైపు బ్లాంచే మోనియార్ పలు మానసిక రోగాల బారిన పడింది. తన మిగితా జీవితం బ్లాంచే మోనియార్ హాస్పిటల్ లోనే గడిపింది.

1913 వ సంవత్సరంలో 64 సంవత్సరాల బ్లాంచే మోనియార్ హాస్పిటల్ లోనే చనిపోతుంది.

        The end