Read Aa Voori Pakkane Oka eru - 27 (Last Part) by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 27 (Last Part)

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"థాంక్ యూ చిట్టిరాణి." సుస్మిత అంది ఆనందం నిండిన మొహంతో.

"నాకు థాంక్స్ ఎందుకు చెప్తావు? నిన్ను నిజంగానే దెయ్యంలా పీడించుకు తిన్నాను కదా." సుస్మితని కౌగలించుకుని తన కుడిబుగ్గ మీద ముద్దు పెట్టుకుంది చిట్టిరాణి.

"ఒక్క విషయం నాకు అర్ధం కావడం లేదు. ఆ రోజు అలా ప్రవాహంలోకి పడిపోయాక నువ్వెలా ప్రాణాలతో బయటపడ్డావు?" అయోమయంగా అడిగాడు మదన్.

"చెప్తాను విను." చిట్టిరాణి చెప్పడం మొదలు పెట్టింది.

&&&

నీళ్లలో పడిపోగానే షాక్ తో నిండిపోయింది చిట్టిరాణి మనసు. ఇంక అలా నీళ్ళల్లో కొట్టుకుపోవడానికి ముందుగా చిట్టిరాణి చూసిందేమిటంటే మదన్ వేగంగా వంతెన మీద నుండి వెళ్లిపోవడం. తన మీద ప్రేమ లేకపోయినా, తనని ఏ భావం లేకుండా అంత నిర్దయగా మదన్ వదిలేయడం చాలా బాధాకరంగా అనిపించింది చిట్టిరాణి కి. అంత ఊపిరాడని స్థితిలోనూ తను చచ్చిపోవడమే మంచిది అనుకుంది. నీళ్లు మింగుకుంటూ ఆ బలమైన ఇంకా వేగమైన ప్రవాహంలో ఎంత దూరం కొట్టుకుపోయిందో గుర్తు లేదు. కానీ సడన్ గా ఎవరో ఆ నీళ్ళల్లోకి దూకి తనని బయటికి తీసి ప్రాణాలు కాపాడారు.

"ఈ రోజు మీ ఇద్దరి వెనకాతల నేనలా వచ్చి, నువ్వలా నీళ్లలో పడిపోవడం చూసి ఉండకపోతే, ఈపాటికి నువ్వు ప్రాణాలతో వుండే దానివి కాదు." నాగరాజు అన్నాడు.

నాగరాజు వాళ్ళిద్దరి వెనకాతలే ఫాలో అవుతూ వాళ్ళకి కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. చిట్టిరాణి నీళ్లలో పడిపోగానే మరోవైపునుండి నాగరాజు నదిలోకి దూకిన వైనం మదన్ గమనించలేదు, చిట్టిరాణీ గమనించలేదు..

"నన్నెదుకు కాపాడావు? నన్ను చచ్చిపోనివ్వాల్సింది." బాధ నిండిపోయిన మనస్సుతో అంది చిట్టిరాణి.

ఆ ఏటి ఒడ్డున కాస్త విశాలంగా వున్న మైదానం లాంటి ప్రాంతంలో చిట్టిరాణి ని పడుకోబెట్టాక, తను తాగేసిన నీటిని కక్కించేసాడు నాగరాజు. కొద్దిసేపట్లోనే ఈ లోకంలోకి వచ్చి పరిసరాలు తెలుస్తూవున్నా చాలా నిస్సత్తువగా వుంది చిట్టిరాణి కి.  

"నువ్వు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ గురించి నువ్వెందుకు చచ్చిపోవడం? నువ్వు కావాలనుకుంటున్న వాళ్ళ గురించి ఆలోచించొచ్చుకదా. నిన్ను ఎంత కస్టపడి నేను కాపాడనో తెలుసా?"

అప్పుడే చిట్టిరాణి మరో విషయం గమనించింది. నాగరాజు వంటిమీద బట్టలు విప్పేస్తున్నాడు. ఆ చోటికి ఎవరూ రారన్న ధైర్యం వల్ల కాబోలు చివరికి కట్-డ్రాయర్ కూడా తీసేసాడు. వాడి మనసులో ఉద్దేశం అర్ధమయ్యాక ఎంత సత్తువ లేకపోయినా అక్కడినుండి పెరిగెత్తి వెళ్లిపోవాలనిపించింది చిట్టిరాణికి. కానీ ఏం చెయ్యడం, చిటికిన వేలు కదిపే సత్తువ కూడా లేదు తనలో. ఆ నాగరాజు గాడి నగ్న స్వరూపం చూడలేక కళ్ళు మాత్రం మూసుకుంది.

తను కళ్ళు మూసుకోవడం వాడు చెయ్యబోయేదానిని ఏమాత్రం ఆపలేదని చిట్టిరాణికి తెలుసు. వాడి చేతులు తన శరీరం మీద ఆబగా కదులుతూ ఉంటే తన కళ్లలోనుండి వెచ్చగా కారుతున్న కన్నీళ్లు తెలుస్తున్నాయి తనకి. తన శరీరం మీద ఆఖరి బట్టని వాడు తొలగించేస్తున్నప్పుడు కూడా నిస్సత్తువగా అలాగే ఉండిపోయింది. తను మదన్ కి ప్రసాదం లా అర్పించుకుందామని దాచుకుంటూ వస్తూన్న తన కన్నెరికాన్ని దోచుకోవడానికి మొదటి ప్రయత్నంగా తన బొడ్డు కింద, ఆడతనం ప్రారంభం అయ్యేచోట వాడు చెయ్యి వేసినప్పుడు, తన కన్నెరికం పోతుందన్న బాధకన్నా కూడా మదన్ చేసిన అవమానం, అతని నిర్దయ గుర్తుకు వచ్చి పెట్రోలు పోసి నిప్పెట్టినట్టుగా భగ్గుమంది ఆమె మనసు.   

ఆ రోజు తను పెద్దమనిషి కాకుండానే మదన్ ఆలా చేసినప్పుడు తనకి నొప్పిగా అనిపించినా, వాడు తను ప్రేమిస్తూన్న మనిషి కాబట్టి ఆనందం గానే అనిపించింది. ఈ రోజు వీడు తన శరీరాన్ని పూర్తిగా ఆబగా ఆక్రమించుకుని, తన మగతనాన్ని తన ఆడతనంలో పూర్తిగా దింపి, తన కన్నెరికాన్ని దోచుకుంటూ ఉంటే ఎదో తెలియని బాధతో నిండిపోయింది చిట్టిరాణి మనసు. ఒక్కసారి కాదు, వాడు ఆలా ఎన్నిసార్లు కోరిక తీర్చుకున్నాడో చిట్టిరాణి కి గుర్తు లేదు. తన శరీరం కోసం ఎంతకాలంగా ఆబగా ఎదురుచూస్తున్నాడో, ప్రతీ భాగాన్ని పూర్తిగా నోటితో, చేతులతో ఆస్వాదిస్త్తూ వున్నాడు. వాడలా తనని అనుభవిస్తూ ఉన్నంత సేపూ కూడా చిట్టిరాణి మనసు మదన్ మీద పగతో భగ్గుమని మండిపోతూనే వుంది.                                          

"నువ్వు నన్నిలా ఎంగిలి చేసాక ఇంక మదన్ ని కోరుకోలేను. నువ్విప్పుడు నాకో సాయం చెయ్యాలి." వాడు తనని అనుభవించడం పూర్తయి, తన వంట్లోకి కాస్త శక్తి వచ్చాక, లేచి బట్టలు కట్టుకున్నాక అంది చిట్టిరాణి.

"ఏమిటో చెప్పు. అదే ఏమైనా చేస్తాను." చిట్టిరాణి ని అనుభవించిన తృప్తితో హుషారుగా అడిగాడు నాగరాజు.

"నా ప్రేమని తిరస్కరించడమే కాకుండా నా చావుకి నన్ను నిర్దయగా వదిలేసి పోయిన ఆ మదన్ గాడు ఏడవాలి. వాడు చేసినదానికి పశ్చాత్తాప పడాలి."

" తప్పకుండా అలాగే. ఏం చేద్దామంటావో చెప్పు?" ఇంక చిట్టిరాణి తన స్వంతమేనన్న ఉత్సాహంతో అడిగాడు నాగరాజు.

"నేను నీకు త్వరలోనే చెప్తాను."

తరువాత చాలా రహస్యంగా ఎవరూ చూడకుండా ఇంటికి చేరింది. అలాగే ఎవరూ చూడకుండా రోజూ మదన్ వెనకాతలే తోటలోకి వెళ్ళేది. ఆ రోజు అలాగే సుస్మిత, మదన్ తోటలోకి వెళ్తూండడం గమనించి వాళ్ళని అనుసరించి వెళ్ళింది. మామిడి చెట్టు వెనకాతల నిలబడి వాళ్ళు మాట్లాడుకున్నదంతా వింది. సుస్మిత గురించి, తన ప్రాబ్లెమ్ గురించి  తెలిసాక తన పగ తీర్చుకోవడానికి ఇన్స్టంట్ గా ఒక ప్లాన్ దొరికింది. అందరూ కో-ఆపరేట్ చేశారు తన పగ తీరడానికి.

&&&

"ఎవరికీ తెలియకుండా తోటలోకి రావడానికి, ఇంక నేను బతికి వున్నట్టుగా నీకు తెలియకుండా ఉండడానికి నేను చాలా కష్ట పడాల్సి వచ్చింది. నేను బ్రతికి వున్నట్టుగా ఒకళ్ళిద్దరికి తెలిసినా, ఆ విషయం నీ వరకూ రానివ్వకుండా చేసాం." చిట్టిరాణి అంది.

"నా ఇంట్లో వాళ్ళే అంతా కో-ఆపరేట్ చేసినప్పుడు బయటవాళ్ళు కో-ఆపరేట్ చెయ్యడంలో ఆశ్చర్యం ఏముంది?" నవ్వాడు మదన్.

"నా కూతురి ఫోటోకి దండ వేసేప్పుడు నాకూ చాలా కష్టంగా అనిపించింది. కానీ తనంత పట్టుదలగా నీ మీద పగతీర్చుకోవాలన్నప్పుడు కాదనలేకపోయాను." చిట్టిరాణి తల్లి అంది. "ఇంక చిట్టిరాణి నాకు కలలో, ఇంకా పైని కనిపించి చెప్పడం కేవలం అబద్ధం అని ప్రత్యేకంగా చెప్పేదేముంది?"

అందరూ నవ్వారు ఆ మాట విని.

"ఎంతో కాలంగా ఆశపడుతూన్న నాగరాజు చిట్టిరాణిని పెళ్లి చేసుకోబోతూ వున్నాడు. తన పద్ధతిని మార్చుకుంటానని నాకు మాటిచ్చాడు కూడా. ఇంక ఇది అందరికి సంతోషించాల్సిన విషయమే." చిట్టిరాణి తండ్రి అన్నాడు.

"నిజంగానే నేను నా పద్ధతిని మార్చుకుంటాను. చిట్టిరాణి ని జాగ్రత్తగా చూసుకుంటాను." నాగరాజు దృఢస్వరంతో అన్నాడు.

మరికాస్సేపు మాట్లాడక అక్కడనుండి బయలు దేరారు సుస్మిత, మదన్.

"ఇక చిట్టిరాణి బాధ మీకు ఉండదు. హ్యాపీగా వుండండి." వాళ్ళు అక్కడినుండి వచ్చేసే ముందు మరోసారి చెప్పింది చిట్టిరాణి.

&&&

"నేను నిన్ను ఆ రోజు అలా డ్రగ్ అడిక్ట్ ని చేయబోయాను. ఐ యాం వెరీ సారీ." సుస్మిత రూమ్ లోకి వచ్చి బెడ్ మీద ఆమె పక్కన కూచుంటూ అంది మాధురి. ఆ సమయంలో సుస్మిత తో పాటుగా తనూజ కూడా వుంది.

"నేనెప్పుడో ఆ విషయం గురించి మర్చిపోయాను. నువ్వూ ఆ విషయం గురించి ఆలోచించకు." నవ్వుతూ అంది సుస్మిత.

"అవును మధూ. నువ్వు గతాన్నంతా మర్చిపోయి హ్యాపీగా వుండు. ఆ శేషేంద్ర ఎలాంటివాడో సుస్మిత నీకు చెప్పింది కదా. ఇంకా వాడి గురించి పొరపాటున కూడా ఆలోంచించకు." తనూజ అంది. తనూజకి తన ఫ్యామిలీ కి సంబంధించిన విషయాలన్నీ ఎప్పుడో చెప్పింది సుస్మిత.

"ఆ శేషేంద్ర మాటలు విని నీకు ఆలా చేయబోయినందుకు, అలాంటి దుర్మార్గుడితో అంతకాలం కలిసి వున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది." మాధురి అంది.

"ఏమంటున్నావు నువ్వు? నాకు అర్ధం కావడం లేదు." అయోమయంగా చూస్తూ అడిగింది సుస్మిత.

అప్పుడు మాధురి తను సరిగ్గా సుస్మిత దగ్గరకి బయలుదేరి రాబోతూ ఉండగా ఆ శేషేంద్ర ఇద్దరు వ్యక్తులతో వచ్చి తనని ఎలా గ్యాంగ్ రేప్ చేసిందీ చెప్పింది. ఆ మాటలు వింటూ మ్రాన్పడిపోయారు సుస్మిత, తనూజ కాస్సేపు.

"రాస్కేల్స్, స్కౌండ్రల్స్. ఒక నిస్సహాయురాలైన ఆడదానిమీద అంత అఘాయిత్యం చేస్తారా? వాళ్ళని ఊరికినే విడిచిపెట్టను. తగిన శాస్తి చేస్తాను." అంటూ గట్టి అరవడం మొదలుపెట్టింది సుస్మిత.

"ఏంటది, ఎందుకలా అరుస్తున్నావు? మళ్ళీ ఆ చిట్టిరాణి కానీ రాలేదు కదా నీ మీదకి." కంగారుగా పక్క రూమ్ లో వున్న మదన్ ఆ రూమ్ లోకి వచ్చి అడిగాడు. అదేరూమ్ లో మదన్ తో పాటుగా వున్నా ముకుందం కూడా ఆ రూమ్ లోకి వచ్చాడు.

అదే ఆవేశంతో సుస్మిత, శేషేంద్ర ఇద్దరు వ్యక్తులతో కలిసి మాధురి మీద చేసిన అఘాయిత్యం చెప్పింది. "స్కౌండ్రల్స్! వాళ్ళకి ఉరిశిక్ష పడేలా చేస్తాను." ఇంకా ఆవేశంగా అలాగే అరిచింది సుస్మిత.

"వాళ్ళకి ఉరిశిక్ష కూడా సరిపోదు. ఇంకా పెద్ద శిక్ష కావాలి." తనూజ కూడా కోపంగా అంది. "అలాంటి పనులు చేసేప్పుడు వాళ్ళకి తల్లి, తోబుట్టువులు గుర్తుకురారా?"

"పశువులకన్నా హీనమైన మనుషులకి అవన్నీ గుర్తు వుండవు." ముకుందం అన్నాడు. "ఆ రాక్షసులకు మాత్రం తగిన శిక్ష పడాల్సిందే."

"అది నేను చూసుకుంటాను. వాళ్ళకి ఎందుకు పుట్టామా అని విచారించేలా చేస్తాను." ఇంకా చాలా కోపంగానే వుంది సుస్మిత.

"ఎలా చూసుకుంటావు? ఆ గ్యాంగ్ రేప్ జరిగి నాలుగు రోజుల పైనే అయింది. ఇప్పుడది జరిగిందని మనం ప్రూవ్ చెయ్యలేం." మాధురి విచారంగా అంది.

"ఆ విషయం నేను చూసుకుంటాను. నువ్వు అది నాకు వదలిపెట్టు." మధురిని కౌగిలించుకుంటూ అంది సుస్మిత. "ఇక్కడనుండి నువ్వు నాతోనే వుండబోతున్నావు. నేను పెద్ద ధనవంతురాలిని అయ్యాను కదా. మీ అమ్మ కోరుకున్న జీవితం నీకొచ్చేలా చేసే పూచీ నాది." సుస్మిత అంది.

"అవును మధూ. నువ్విక్కడనుండి మాతోనే ఉంటావు, ఒక మంచి భర్త నీకు దొరికి అతనితో పాటుగా నువ్వు వెళ్లే అవసరం వచ్చేవరకూ." మదన్ అన్నాడు.

ముకుందం ఎదో అనబోతూ ఉండగా అతని చేతిలో వున్న సెల్ ఫోన్ మోగింది. సుదర్శనం ఫోన్ చేశాడు.

"నీకో గుడ్ న్యూస్. నేను చెప్తే అది నువ్వు నమ్మలేవు. కానీ నేను చెప్పకుండానే అది నువ్వు గెస్ చేయగలవు." ముకుందం ఫోన్ అటెండ్ అవ్వగానే సుదర్శనం అన్నాడు.

"మల్లిక ఇప్పుడు ప్రెగ్నన్ట్, అంతే కదా." ఆనందంతో గుండెలు నిండిపోతూ ఉంటే అన్నాడు ముకుందం.

"యు అర్ హండ్రెడ్ పర్శంట్ రైట్. తను నీ సంతానానికి తల్లి కాబోతూ వుంది." చెప్పాడు సుదర్శనం.

ఎపిలాగ్

తను మాట ఇచ్చినట్టుగా మాధురి మీద జరిగిన గ్యాంగ్ రేప్ కి శేషేంద్రకి, ఆ ఇద్దరికీ శిక్ష పడేలా చెయ్యలేకపోయింది సుస్మిత. చాలా రోజులు అయిపోవడం వాళ్ళ ఆ రేప్ ప్రూవ్ కాలేదు. కానీ తన మామయ్యని, అత్తయ్యని, ఇంకా బావ శేషేంద్రని ఇంట్లోనుంచి గెంటేయడమే కాకుండా వాళ్ళు తన ఆస్తులని దుర్వినియోగం చేశారని కేసులు ఫైల్ చేసి శిక్షలు పడేలా చేసింది.

తన తండ్రి ఆస్తులన్నీ తన పేరుమీద ఉండడం వల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదని నచ్చ చెప్పి ఆ ఆస్తులన్నిటినీ తన పేరుమీదకి మార్చే ప్రోగ్రాం సుస్మిత చేత మానిపించాడు మదన్.

వంశీ, ముకుందం తన ఆస్తిని కూడా చూసుకుంటామని మాట ఇచ్చాక, మదన్ సుస్మితతో కలిసి టౌన్ కి మకాం మార్చాడు ఆమె బిజినెస్ లన్నీ అక్కడ చూసుకోవడానికి. మాధురికి తన కంపెనీ లో మంచి ఉద్యోగం ఇచ్చింది సుస్మిత. ఆలా ఆ ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే మాధురి కి అదే కంపెనీలో పై స్థాయిలో వున్నా వ్యక్తితో పరిచయం పెరిగి, ప్రేమగా మారి తరువాత అతనితో పెళ్లి జరిగింది. ఇప్పుడు తను ప్రెగ్నన్ట్ కూడా.

ఆ రోజు ఆలా కలిసినదానికే సుస్మిత కి కడుపు వచ్చింది. తనూజ ఒక అబ్బాయికి జన్మనిచ్చిన కొన్నిరోజులకి సుస్మితకి ఒక అమ్మాయి పుట్టింది. తనూజ తన కొడుక్కి మదన్ అని పేరు పెడితే సుస్మిత తన కూతురికి ప్రమీల అని పేరు పెట్టింది. చిట్టిరాణి అసలు పేరు ప్రమీల.

వంశీతో కలిసి హ్యాపీగా అదే వూళ్ళో సెటిల్ అవ్వడమే కాకుండా, ఆ గ్రామంలో ప్రజల మానసిక సమస్యలు ట్రీట్ చెయ్యడానికి క్లినిక్ కూడా పెట్టింది తనూజ. వచ్చిన చిక్కల్లా ఏమిటంటే తానే పేషెంట్స్ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు రారు. అంతే కాదు, వాళ్ళకి ఈ శరీరంతో పాటు మనసు లాంటిది కూడా ఉంటుందని, దానికి జబ్బులు వస్తూ వుంటాయని అర్ధం అయ్యేలా చెప్పాలి.

తనకున్నట్టుగానే చెవులు ఇంకా నడుము మీద నల్లటి పుట్టుమచ్చ మల్లికకి పుట్టిన కొడుక్కి ఉండడంతో, ఆ కొడుకు తనకి పుట్టిన వాడేనని ముకుందం కి పూర్తిగా స్పష్టం అయిపోయింది. సుదర్శనం బట్టల బిజినెస్ లో బాగా రాణించి సంపాదిస్తూ వున్నా, ఆ కొడుక్కి సంభందించిన పూర్తి ఖర్చంతా తానే చూసుకోవాలన్న నిర్ణయానికి వచ్చేసాడు ముకుందం.

నాగరాజు కేవలం తన శరీరం కోసం మాత్రమే చిట్టిరాణి ని పెళ్లి చేసుకోలేదని, తన మీద ప్రేమ కూడా వుండే చేసుకున్నాడని అతనిలో వచ్చిన మార్పు అందరికీ అర్ధం అయ్యేలా చేసింది. ఒక పాప కూడా పుట్టాక చిట్టిరాణి మదన్ ని పూర్తిగా మర్చిపోయి నాగరాజుని ప్రేమించగలుగుతోంది.

శుభం

(ఇక్కడితో ఈ నవల అయిపోయింది. ఓపికగా చదివినందుకు కృతజ్ఞతలు. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)