ఆ ఊరి పక్కనే ఒక ఏరు
(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)
శివ రామ కృష్ణ కొట్ర
"ఎందుకలా నవ్వుతున్నావు?" బెడ్ మీద కూచుని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు మదన్. తనకింకా కిందకి దిగి డ్రెస్ చేసుకోవాలనిపించడం లేదు.
"ఏమిటీ, నాకేదో ఇంత సెక్స్ సుఖం ఇచ్చి ఆ తర్వాత నీ ప్రియురాలితో ఆనందంగా కులుకుదామనుకున్నావా? నేనంత అమాయకురాలిననుకున్నావా?" అని మళ్ళీ బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టింది సుస్మిత.
"అసలు నీ ఉద్దేశమేమిటి?" అప్పటికి విషయం అర్ధం అయి, బెడ్ మీద నుండి కిందకి దిగి సుస్మిత మొహంలోకి కోపంగా చూస్తూ అడిగాడు మదన్.
"జీవితాంతం నిన్ను కాల్చుకు తినడమే నా ఉద్దేశం." గట్టిగా అరిచింది సుస్మిత. "నిన్ను నీ ప్రియురాల్ని ఈ జన్మలో సుఖంగా ఉండనివ్వను." అలా అన్నాక తన వంటిమీద నూలుపోగు కూడా లేదన్న విషయం పట్టించుకోకుండా, తలుపుల దగ్గరికి వెళ్లి, గడియ తీసి కిందకి పరుగు పెట్టింది.
"మై గాడ్!" గుండెలు అదిరిపోతూ వుంటే హడావిడిగా డ్రెస్ చేసుకుని తనూ కిందకి పరిగెత్తాడు మదన్.
&&&
అప్పటికింకా నిద్రపోకుండా హాలులో కూచుని అందరూ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. వంటిమీద నూలుపోగు లేకుండా తమ మధ్యలోకి వచ్చిన సుస్మితని అందరూ నివ్వెరపోయి చూసారు.
"వీడు, వీడు ఏమనుకున్నాడో తెలుసా?" తన వెనకాతలే గాభరాగా కిందకి దిగి అక్కడికి వచ్చిన మదన్ ని చూపించి బిగ్గరగా నవ్వుతూ అంది సుస్మిత. "నాకేదో కాస్త పడక సుఖం ఇస్తే వదిలేస్తాననుకున్నాడు. నేను వంటి సుఖం కోసం ఆశ పడే మనిషిననుకున్నాడు. వీడికి తెలీదు. నేను వీడిని కానీ, వీడి ప్రియురాల్ని కానీ వదిలే ప్రశ్న లేనే లేదని."
"మై గాడ్!" షాక్ లోనుండి బయటికి రాగానే వనజ అక్కడనుండి పరిగెత్తుకు వెళ్లి, ఒక చీర తెచ్చి సుస్మిత వళ్ళంతా కప్పింది. ఇంకా అలాగే నవ్వుతూ పిచ్చిపిచ్చిగా వాగుతున్నసుస్మిత రెండు చెంపలు కుడిచేత్తో ఛెళ్ళు ఛెళ్ళు మని వాయించింది.
"ఏం జరిగింది? ఎందుకు నన్నిలా కొట్టారు?" సడన్ గా ఈ లోకంలోకి వచ్చి అయోమయం గా అడిగింది సుస్మిత.
"నిన్నెదుకిలా కొట్టాల్సి వస్తుందో నీకు తెలుసు, ప్రత్యేకంగా చెప్పాలా?" చిరాగ్గా అడిగింది వనజ.
"అంటే చిట్టిరాణి మళ్ళీ నాలోకి వచ్చి ఏవో పిచ్చిపనులు చేయించింది." అంటూ మొదటిసారి తన శరీరాన్ని గమనించుకుంది. "ఏమిటి నా వంటిమీద బట్టలేవు?" షాక్ తో అరిచింది.
"అన్ని విషయాలు తరువాత మాట్లాడతాను. నువ్వు ప్రశాంతంగా వుండు." వనజ అని మదన్ మొహంలోకి చూసింది. "నువ్వెళ్ళి పడుకో. మార్నింగ్ అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ రాత్రికి సుస్మిత నాతోనే ఉంటుంది."
"ఇంక నాకు నిద్రపట్టేలాగే వుంది." హుస్సురని నిట్టూరుస్తూ అన్నాడు మదన్. "నన్ను సుస్మితని విసిగించి, విసిగించి చంపేసేవరకూ ఆ చిట్టిరాణి మమ్మల్ని వదిలిపెట్టదు."
"డిప్రెస్ అయి ప్రయోజనం లేదు మదన్. వెళ్లి పడుకో, ఉదయాన్నే అన్నివిషయాలు మరోసారి మాట్లాడుకుందాం."
వనజ మళ్ళీ అలా అన్నాక ఇంక చేసేది లేక అక్కడనుండి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు మదన్. మదన్ వెనకాతలే వెళ్లారు ముకుందం ఇంక వంశీ తనకి ధైర్యం చెప్పడానికి
"ఈ రోజుకి నువ్వు, నేను, అమ్మ ఇంక సుస్మిత ఒక రూమ్ లోనే పడుకుందాం." తనూజ మొహంలోకి చూస్తూ అంది వనజ.
తనూజ తలూపింది కానీ మంగవేణి మోహంలో ఎదో అనీజీనెస్ కనిపించింది.
"నీకేమన్నా భయంగా వుంటే నువ్వు వేరే రూమ్ లో పడుకోవచ్చు." వనజ అంది.
"పరవాలేదు. నా ఇద్దరు కూతుళ్లు నాతొ ఉండగా నేను దేనికి భయపడతాను?" చిరునవ్వుతో అంది మంగవేణి.
&&&
"మనమిద్దరం ఒకసారి చిట్టిరాణి ఇంటికి వెళ్లి వద్దాం." మర్నాడు ఉదయం కిచెన్లో అందరితో కాఫీ తాగుతూండగా సుస్మిత అంది మదన్ మొహంలోకి చూస్తూ. "తన పేరెంట్స్ చెప్తే చిట్టిరాణి వింటుందని నాకు అనిపిస్తూంది."
"వాళ్లేందుకు చెప్తారు చిట్టిరాణికి?" చిరాగ్గా అన్నాడు మదన్. "అసలే నేను తన ప్రేమని యాక్సెప్ట్ చెయ్యకపోవడంవల్ల సూసైడ్ చేసుకుందని నా మీద కోపం గా వుండి వుంటారు."
" వాళ్ళెందుకు అలా అనుకుంటారు?" వనజ ఆశ్చర్యంగా అడిగింది.
"ఆ నాగరాజు చెప్పాడు. చిట్టిరాణి వాళ్ళమ్మకి కలలో కనిపించి అలాగే చెప్పిందిట. ఇంకా ఈ సుస్మిత చిట్టిరాణిగా వాళ్ళింటికి వెళ్లి ఏం మాట్లాడిందో తనకీ తెలియదు, మనకీ తెలియదు."
"అన్నీ మనమే వూహించుకోవడమెందుకు? ఒకసారి మీరిద్దరూ వెళ్లి తన పేరెంట్స్ ని కలిసి తనకి సుస్మితని వేదిలేమని చెప్పమని రిక్వెస్ట్ చెయ్యడంలో నాకేమీ నష్టం కనిపించడంలేదు. ఆఖరికి భూతవైద్యుడి ప్రయత్నం కూడా విఫలం అయ్యాక ఇంతకన్నా నాకూ మార్గం ఏమీ కనిపించడం లేదు." వనజ అంది
"అలాగే చేస్తాం అయితే." కాస్త ఆలోచించాక అన్నాడు మదన్.
&&&
సుస్మిత తో పాటుగా చిట్టిరాణి ఇంట్లోకి అడుగుపెడుతూవుంటే చాలా సిగ్గుగా, భయంగా అనిపించింది మదన్ కి. తన వల్ల చిట్టిరాణి చనిపోయింది. తాను తన ప్రేమని యాక్సెప్ట్ చేసుంటే, ఆ రోజు ఆ పెనుగులాట జరిగేది కాదు, తాను నదిలో పడిపోయేది కాదు. తనతో పెనుగులాటలో నదిలో పడిపోయిందని తెలియక పోయినా, తను తన ప్రేమని యాక్సెప్ట్ చెయ్యకపోవడంవల్లే సూసైడ్ చేసుకుందనుకుంటూ చిట్టిరాణి పేరెంట్స్ తనమీద ఖచ్చితంగా చాలా కోపంగా వుండి వుంటారు.
ఆ ఇంట్లో నడవలో అడుగుపెట్టాక పువ్వుల దండతో వున్న చిట్టిరాణి ఫోటోచూసి అలాగే నిలబడిపోయాడు మదన్. ఇంతకుముందూ చిట్టిరాణి ఫోటో ఆలా అక్కడ ఉండేది కానీ పువ్వుల దండతో కాదు. ఆలా పువ్వుల దండతో ఆ ఫోటోని చూస్తూ ఉంటే గుండెలని పిండేస్తున్నట్టుగా వుంది మదన్ కి. తెలియకుండానే మదన్ కళ్ళవెంట నీళ్లు కారడం ప్రారంభించాయి.
"ఎందుకు విచారిస్తున్నావు బాబూ? పుట్టినవాళ్ళు ఎప్పటికన్నా పోవాల్సిందే కదా. తను కాస్త ముందుగా వెళ్ళిపోయింది అంతే."
ఆ మాటలు విని కరంట్ షాక్ కొట్టినట్టుగా వెనక్కి తిరిగి చూసాడు మదన్. వెనకాతల చిట్టిరాణి పేరెంట్స్ ఇద్దరూ నిలబడి వున్నారు. ఆ మాటలు చిట్టిరాణి తండ్రి ఆనందరావు అన్నాడు.
"చిట్టిరాణి నా వల్ల చనిపోయింది. తన నిస్వార్ధమైన ప్రేమని నేను యాక్సెప్ట్ చెయ్యకపోవడం వల్ల చనిపోయింది." తన కళ్ళవెంట కారుతూన్న నీళ్ళని తుడుచుకునే ప్రయత్నం చెయ్యడం లేదు మదన్.
"తన ప్రేమ ఎంత నిస్వార్ధమైనదైనా నువ్వు ప్రేమించలేకపోతే ప్రేమించమని బలవంత పెట్టడం న్యాయం కాదు. ఏ మనిషి ఇష్టాయిష్టాలు ఆ మనిషికి ఉంటాయి. ఎవరినీ ప్రేమించమని బలవంతపెట్టే అధికారం ఎవరికీ లేదు." చిట్టిరాణి తల్లి మాలతి అంది.
"నేనలా అనుకోవడం లేదు. నా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది. నా వల్లే తను చనిపోయింది." మదన్ కళ్ళవెంట నీళ్లు అలాగే వున్నాయి. గొంతులో పశ్చాత్తాపం, బాధ వున్నాయి.
"తను ఆత్మహత్య చేసుకుంది. అది నీ పొరపాటు కాదు." మాలతి అంది.
"లేదు. తను ఆత్మహత్య చేసుకోలేదు. నాకు తనకీ జరిగిన పెనుగులాటలో తను పొరపాటున నదిలో పడిపోయింది." అని ఆ రోజు వంతెన మీద జరిగినదంతా చిట్టిరాణి తల్లితండ్రులకి వివరంగా చెప్పాడు మదన్. "నేను తనని కావాలని తోయలేదు. తను పొరపాటున నదిలో పడిపోయింది. కానీ నేను తనని కాపాడాలని ప్రయత్నించలేదు. ఒక సమస్య తీరిందనుకుని ఆనందంతో అక్కడనుండి వెళ్ళిపోయాను."
"సరే జరిగినదేదో జరిగింది. ఇప్పుడు దాని గురించి విచారించి లాభం ఏమిటి?" హుస్సురని నిట్టూరుస్త్తూ అంది మాలతి. "ఏది ఏమైనా నువ్వది కావాలని చెయ్యలేదు కదా."
అంత తను డిప్రెస్డ్ గా ఉన్నప్పుడూ మదన్ ని ఆశ్చర్య పరిచినదేమిటంటే మదన్ చెప్పినది విన్న తరువాత కూడా చిట్టిరాణి తల్లితండ్రుల మొహాల్లో ఆశ్చర్యం కానీ, కోపం కానీ లేవు.
"ఎంత మంచి వాళ్ళు మీరు? మీ ఒక్కగానొక్క కూతురు నా వల్ల చనిపోయిన నా మీద ఏ కోపం లేకుండా వున్నారు." ఆశ్చర్యంగా అన్నాడు మదన్.
"నువ్వు అన్ని రకాలుగా మంచివాడివి మదన్. నువ్వే కాదు మీ కుటుంబం అంతా కూడా. మా కుటుంబం తో కూడా కలిపి ఈ గ్రామస్తులు ఎంతో మందికి మీరు సాయం చేశారు. చిట్టిరాణిని ప్రేమించలేకపోవడం నీ తప్పు కాదు. నిన్ను అర్ధం చేసుకోకుండా ఆత్మహత్య చేసుకోవడం చిట్టిరాణి తప్పు. నీ మీద మాకు ఏ కోపం లేదు." ఆనందరావు అన్నాడు.
"అయితే నాకు ఒక్క సాయం చేస్తారా?" ఆతృతగా వాళ్ళిద్దరి మొహాల్లోకి చూస్తూ అడిగాడు మదన్.
"చెప్పు నాయనా, నీకెలాంటి సాయం చెయ్యాలి మేము?" మాలతి అడిగింది.
"మీ కూతుర్ని నా సుస్మితని వదిలేయమని చెప్తారా? తనకి కావాల్సినప్పుడల్లా తన శరీరంలోకి వచ్చి మమ్మల్ని నానా బాధలు పెడుతూంది. ఇకనైనా నన్ను క్షమించి నన్ను నా సుస్మితని వదిలేయమని చెప్తారా?" వేడుకోలుగా, దీనంగా అడిగాడు మదన్.
"నాకు తను మొదటి సారి కలలో కనిపించినప్పుడే నువ్వు మంచిమనిషివని, నిన్నలా పీడించడం మంచిది కాదని చెప్పాను. కానీ తను మాత్రం ఎంతమాత్రం అర్ధం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. నీ మీద పగబట్టి వుంది. మళ్ళీ నాకు కనిపించినప్పుడు నేను ఖచ్చితంగా తను చేస్తున్నది పొరపాటని, మిమ్మల్ని వదిలేయమని గట్టిగా చెప్తాను. కానీ తను వింటుందన్న నమ్మకం నాకు లేదు."
"చిట్టిరాణి" సడన్గా చిట్టిరాణి ఫోటోవైపు తిరిగి అన్నాడు మదన్. "చాలా పెద్ద అన్యాయం నావల్ల జరిగింది నీకు. నిస్వార్థమైన నీ ప్రేమని నిరాకరించి, నీ చావుకు కూడా కారణమయ్యాను. నన్ను క్షమించు. ప్రేమ ఎప్పుడూ ప్రేమించినవాడు తిరస్కరించినా అతని మంచినే కోరుకుంటుంది కదా. అందుకని నా సుస్మితని విడిచిపెట్టు." ఒక్కసారిగా భోరుమని ఏడుస్తూ మోకాళ్ళ మీద పడిపోయాడు మదన్. "నిన్నెలా వేడుకోవాలో నాకు బోధపడడం లేదు. నీకు నా మీద పగలో తప్పులేదు. కానీ అందుకు నా సుస్మితని శిక్షించకు. ఇంక తనలోకి రాకు. నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇంతకన్నా భరించే ఓపిక నాకు లేదు." ఇంకా ఏడుస్తూనే అన్నాడు మదన్.
"మదన్ ఏమిటిది? ఇలా ఏడుస్తున్నావు ఏమిటి?" మదన్ పక్కనే అలాగే మోకాళ్ళ మీద కూచుని అతని భుజాల మీద చేతులువేసి దగ్గరకి తీసుకుని తనూ ఏడుస్తూ అంది సుస్మిత. "చిట్టిరాణి మనసు కరుగుతుంది. ఇంక మనల్ని వేధిచడం మానేస్తుంది. నువ్విలా ఏడవకు."
" అవున్నాయనా, చిట్టిరాణి ఇక్కడే ఎక్కడో వుంది. నాకు తెలుస్తూంది. నువ్వింతలా ఏడవడం గమనించాక ఖచ్చితంగా తన మనసు మారుతుంది. ఇంక మిమ్మల్ని బాధపెట్టదు. నువ్వు బాధపడకు." వెనకాతల నుండి ఆనందరావు అన్నాడు.
"మీరు ఒక పనిచేస్తే మంచిది. అప్పుడు సుస్మితకి ఎలాంటి భయం చిట్టిరాణివల్ల ఉండదని నాకు అనిపిస్తూంది." మాలతి అంది.
"ఏమిటది?" మదన్ లేచినిలబడి మాలతి వైపు తిరిగి ఆమె మొహంలోకి చూసాడు ఆశగా.
"నువ్వు సాధ్యమైనంత త్వరగా ఈ అమ్మాయి మెళ్ళో తాళి కట్టేయి. మంత్రాల మధ్య కట్టే ఆ తాళి తనకి తావీజులా పనిచేస్తుంది. ఏ భూతాల్ని పిశాచాలని తన దగ్గరికి చేరనివ్వదు."
మదన్ ఎదో అనబోతూ ఉంటే అంతలోనే సుస్మిత అంది. "మేమిద్దరం త్వరలోనే పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే వున్నామండీ. రెండురోజుల్లోనే నాకు ఇరవైరెండేళ్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత సాధ్యమైనంత త్వరలో మా పెళ్లి అయిపోతుంది." సుస్మిత అంది.
సుస్మితకి ఇరవై రెండేళ్లు రావడానికి ఆమె పెళ్ళికి ముడి ఏమిటో చిట్టిరాణి పేరెంట్స్ కి అర్ధం కాలేదు, కానీ దాని గురించి వాళ్ళేమీ అడగలేదు.
"చాలా మంచిది. ఇంక మీరు నిర్భయంగా వెళ్లి రండి. మీకు అంతా మంచే జరుగుతుంది." ఆనందరావు అన్నాడు. ఆ తర్వాత అక్కడనుండి వచ్చేసారు మదన్, ఇంకా సుస్మిత.
&&&
ఎంత వద్దన్నా వినకుండా సుస్మిత పుట్టినరోజు ఎంతో ఘనంగా జరిపించారు మదన్ కుటుంబ సభ్యులు. పరిస్థితులనన్నిటినీ గమనించి సింపుల్ గా సాధ్యమైనంత త్వరలో సుస్మిత ఇంక తనూజల పెళ్లి జరిపించేయడం మంచిదన్న నిర్ణయానికి వచ్చేసారు ముకుందం, వనజ. ఆ గ్రామంలోనే వున్న రామాలయం ఆవరణ చాలా పెద్దదిగా ఉండడంవల్ల అందులో పెళ్ళికి నిర్ణయించేశారు. అందులో చాలా మంది పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి.
"నా పెళ్లవగానే నేను చేయబోయే ఒక పనికి నువ్వు అంగీకరించి తీరాలి. అప్పుడే ఈ పెళ్ళికి నేను ఒప్పుకుంటాను." సుస్మిత అంది.
అప్పుడు తనూజ, వంశీ తప్ప తక్కిన వాళ్ళందరూ హాల్లో కుర్చీల్లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.
"ఆ చెయ్యబోయే పనేమిటో ముందు చెప్పు. ఆ తరువాత ఆలోచిస్తాను." చిరునవ్వుతో అన్నాడు మదన్.
"నాకు నీతో పెళ్లి కాగానే నా డాడ్ ఆస్తులన్నిటిమీద పూర్తి హక్కు వచ్చేస్తుంది. అప్పుడవి నీ పేరుమీద రాసేస్తాను. నువ్వు కాదనడానికి వీల్లేదు."
"నేను నిన్ను నీ ఆస్తి కోసం పెళ్లిచేసుకోవడం లేదు. అంతే కాకుండా నాకే బోలెడంత ఆస్తి వుంది. కాబట్టి దీనికి నేను ఒప్పుకోను." మదన్ అన్నాడు.
"అబ్బా మదన్. ఆలా అయితేనే నా ప్రాణాలకి పూర్తి సేఫ్టీ ఉంటుంది. అర్ధం చేసుకో." సుస్మిత చిరాగ్గా అంది.
"నీకే ఒక విషయం అర్ధం కావడం లేదు." మదన్ చిరునవ్వుతో అన్నాడు. "ఒకవేళ మన పెళ్లి అయ్యాక వాళ్ళు నిన్ను ఎమన్నా చేసినా, నీ భర్తగా నీకు లీగల్ హైర్ ని నేనే. కాబట్టి అప్పుడు నీ ఆస్తి నాకే వస్తుంది. కాబట్టి నువ్వు ప్రత్యేకంగా నీ ఆస్తి నా పేరుమీద రాయాల్సిన అవసరంలేదు."
"శుభమా అని పెళ్లిళ్లు జరగబోతూ ఉంటే ఏమిటా పిచ్చిమాటలు?" కోపంగా అంది మంగవేణి.
"నువ్వు నేను చెప్పినట్టుగా వింటావా లేదా? ఆలా అయితేనే కానీ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను." సుస్మిత మొండిగా అంది.
"సరే అయితే అలాగే చేద్దాంలే." చిరునవ్వుతో అన్నాడు మదన్.
"మదన్, నువ్వొక్క విషయం గమనించావా?" మంగవేణి అంది సడన్గా. "ఆరోజు మీరిద్దరూ ఆలా చిట్టిరాణి ఇంటికి వెళ్లి ఆమె పేరెంట్స్ ని అడిగిన తరువాత సుస్మితలోకి మళ్ళీ చిట్టిరాణి రాలేదు."
"మీరు చెప్పింది నిజమే ఆంటీ" సుస్మిత అంది. "మదన్ చిట్టిరాణి ఫోటోముందు భోరుమన్నాడు. దానితో చిట్టిరాణి మనసు కరిగి ఉంటుంది."
దానితో ఆరోజు చిట్టిరాణి ఫోటోదగ్గర తను ఎలా ఏడిచిందీ గుర్తుకొచ్చి మదన్ మొహం ఎర్రబడింది. ఎనీహౌ అది పనిచేసినందుకు ఆనందంగానూ వుంది. నిజానికి తను చిట్టిరాణిని ఆలా కాదన్నందుకు ఇప్పుడు భాద పడుతూనూ వున్నాడు.
"ఇక్కడికి ఎవరూ వచ్చి నన్నేమీ చెయ్యలేరు కదా, స్యూరా?" మదన్ మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది సుస్మిత.
"నువ్వు మీ మామయ్య వాళ్ల గురించి భయపడి అంటున్నట్టుగా వున్నావు." మదన్ బదులుగా ముకుందం అన్నాడు. "ఇక్కడ నువ్వుండగా నీ మీద ఈగ కూడా వాలలేదు. నీకు ఇక్కడ ఎవరూ ఎటువంటి అపకారం చెయ్యలేరు. నిశ్చింతగా వుండు."
"అయితే ఇప్పుడే అర్జెంటు గా నేను ఇద్దరికీ ఫోన్ చేసి ఈ పెళ్లి విషయం చెప్పాలి. నీ ఫోన్ ఒకసారి ఇస్తావా?." అంటూ కుర్చీలోనుంచి లేచింది సుస్మిత.
"నా గదిలో టేబుల్ మీద ఉంటుంది తీసుకో." అన్నాడు మదన్. “పాస్ వర్డ్ 9 2 3 1 .”
"మాధురి నెంబర్ నీ దగ్గర వుంది కదా?"
"వుంది. ఆ పేరు తోటే సేవ్ చేశాను."
సుస్మిత మొదట తన గదిలోకి వెళ్లి, అక్కడ హ్యాండ్ బాగ్ తీసుకుని, అందులోనుండి చిన్న పేపర్ బయటకి తీసింది. తనని ఫోన్ ద్వారా ట్రాక్ చెయ్యకుండా ఉండేందుకు, తను ఇంటినుండి వచ్చేసే ముందు తనకి అవసరం అనిపించిన నంబర్లన్నీ ఒక పేపర్ మీద రాసుకుని, ఆ ఫోన్ ఇంక సిమ్ కూడా చితక్కొట్టి చిన్న ముక్కలు చేసి ఆ ఇంటికి దగ్గరలో వున్న పాడుబడ్డ నూతిలో పడేసింది.
ఇప్పుడు మొదట ఆ పేపర్ లో వున్న శేషేంద్ర నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడడం మొదలు పెట్టింది. రెండు నిమిషాల్లో శేషేంద్రతో మాట్లాడడం ముగించి మాధురి నెంబర్ గురించి సెర్చ్ చేసింది. ఈజీ గానే దొరికింది ఆ నెంబర్. మాధురితో అరగంటకు తక్కువ కాకుండా మాట్లాడింది.
&&&
"దేవిగారు ఎక్కడికో బయలుదేరినట్టు వున్నారు."
ఒక గంటన్నర క్రితమే సుస్మిత నుండి ఫోన్ వచ్చింది మాధురి కి. రెండు రోజుల్లోనే తన పెళ్లి జరగబోతూందని, తనకి తన ఆస్తి మీద సర్వాధికారాలు వచ్చేస్తాయని, అందువల్ల శేషేంద్ర లాంటి వెధవని నమ్ముకోకుండా వెంటనే తనదగ్గరికి బయలుదేరి వచ్చేయమని చెప్పింది ఫోన్లో సుస్మిత మాధురి కి. దగ్గర దగ్గర అరగంటసేపు శేషేంద్ర ఎంత వెధవో చెప్పి మాధురి ని తన దగ్గరికి వచ్చేయడానికి ఒప్పించింది సుస్మిత. ఇంక బయలుదేరి తను బయటపడిపోతాను అనుకుంటూ ఉండగా శేషేంద్ర ఒక ఇద్దరితో అక్కడికి వచ్చాడు.
"ఏం లేదు. ఒకసారి మా వూరు వెళ్లి వద్దామనుకుంటున్నాను." తడబాటుగా అంది మాధురి.
"ఏమిటి నాకసలు ఏమీ చెప్పకుండానే?" ఆశ్చర్యం వ్యక్తం చేసాడు శేషేంద్ర.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)