Read Aa Voori Pakkane Oka eru - 21 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 21

ఆ ఊరి పక్కనే ఒక ఏరు

(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)

శివ రామ కృష్ణ కొట్ర

"అయితే నీ ప్రయత్నం నువ్వు ప్రారంభించావన్న మాట." అంతవరకూ రెండో కూతురి మీద వున్న చిరాకు మాయం అయిపొయింది మంగవేణిలో. "ఎంతవరకూ వచ్చింది?"

"చాలా దూరం వచ్చింది." కుర్చీలో అడ్జస్ట్ అవుతూ అంది తనూజ. " ఇంక పెళ్లి ఒక్కటే తరువాయి."

"ఏది, సరిగ్గా చెప్పు? నువ్వు ఏమేం చేసావ్ వాడితో, ఎలా చేశావ్?" ఉత్సుకత ఇంకా పెరిగిపోయింది మంగవేణిలో.

" అంతా నువ్వు చెప్పినట్టుగానే చేశాను మామ్. ముందు ఒప్పుకోలేదు, నన్ను ప్రేమించలేనంటూ మొండికేసాడు. కానీ నువ్వు చెప్పింది నిజం మామ్, నా అందాల్ని ఎరవేసేసరికి కాదనలేక పోయాడు. ఇప్పుడు నా వెనకాల కుక్కపిల్లలా తిరుగుతున్నాడు."

"భేష్! నా కూతురివనిపించావు. కానీ ఇదే సరిపోదు. మీ ఇద్దరి మధ్య కాస్త ఆ ఇది కూడా అయిపోయి....."

"అది కూడా అయిపోయింది మామ్, ఆ ఫామ్ హౌస్ లో. ఒకసారి కాదు మూడుసార్లు." తల్లిని కట్ చేసి అంది.

"నిజంగానా! నేను నమ్మలేకపోతున్నాను. నీ సామర్ధ్యం పూర్తిగా తక్కువ అంచనా వేసాను." ఆనందం పట్టలేక తనూజ కుర్చీ వెనక్కి వచ్చి, వంగి తన భుజాల చుట్టూ రెండు చేతులూ వేసి నెత్తిమీద ముద్దు పెట్టుకుంది. "ఇంకా మనకి కావాల్సిందల్లా....."

"మామ్......" తల్లిని మళ్ళీ కట్ చేస్తూ, తల్లి చేతులు విడిపించుకుని కుర్చీలోనుంచి లేచి నిలబడి తల్లి వైపు తిరిగి మొహంలోకి చూసింది. "ఒకే ఒక చిన్న తేడా."

"అదేంటో చెప్పవే. ఆలోచిస్తావేంటి?" భృకుటి మూడేసి అడిగింది మంగవేణి.

"నేనదంతా చేసింది మదన్ తో కాదు. ఆ వంశీ తో."

"ఏమిటే, ఏమిటే వాగుతున్నావ్?" కరెంట్ షాక్ కొట్టినట్టుగా అయింది మంగవేణికి.

"అవును మామ్. నేను మొదట నువ్వు చెప్పినట్టుగా ఆ మదన్ తోనే అదంతా ట్రై చేసి చూసాను. కానీ మదన్ అప్పటికే తానింకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని, నన్ను ప్రేమించడం అయ్యే పని కాదని తెగేసి చెప్పేసాడు. ఇంక నా ప్రయత్నాలు వాడితో అయ్యే పని కాదని నాకర్ధం అయిపోయింది. కానీ పెద్దదానివి నువ్వలా చెప్పిన తరువాత నీ మాట పూర్తిగా తీసి పారేయడం నాకు నచ్చలేదు. అందుకనే నువ్వు చెప్పినదంతా ఆ వంశీతో వర్క్ అవుట్ చేసాను. హండ్రెడ్ పర్శంట్ సక్సెస్ అయ్యాను."

"అయితే నువ్వు ఆ ఫామ్ హౌస్ లో పడుకున్నది కూడా ఆ వంశీ గాడితోనేనా?" కోపంతో వెర్రెక్కిపోతూ అరిచింది మంగవేణి.

"అవును మామ్. ఒకసారి కాదు మూడుసార్లు." అదే మాడ్యులేషన్ తో ఏ జంకూగొంకూ లేకుండా తల్లి మొహంలోకి అలాగే చూస్తూ చెప్పింది తనూజ.

"ఎంత పనిచేసావే దౌర్భాగ్యురాలా!" కుడిచేత్తో ఈడ్చి కొట్టబోతూన్న తల్లినుండి తప్పించుకుని దూరంగా వెళ్ళింది తనూజ. "నిన్ను కూడా ఈ ఇంట్లో పడేసి సుఖపెడదామని నేను ఆలోచిస్తే ఇలాంటి పనికిమాలిన పని చేస్తావా?" ఎవరైనా వింటారేమోనన్న ఆలోచన కూడా లేకుండా గట్టిగా అరుస్తోంది మంగవేణి.

" ఏంటా అరుపులు? బుద్ధి వుందా లేదా?" ఆ రూమ్ లోకి వచ్చి తల్లివైపు చూస్తూ కోపంగా అడిగింది వనజ.

"నిన్ను నమ్మి నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తే అది ఇలాంటి వెధవ పనులన్నీ చేస్తూన్నా కూడా వారించకుండా వూరుకుంటావా?" తను కూడా వనజ వైపు కోపంగా చూస్తూ అరిచింది మంగవేణి.

"నేను నిన్ను తనని ఇక్కడికి పంపించమని అనలేదు. నా వైపునుంచి తను ఎలాంటి పిచ్చిపనులు చెయ్యకుండా చూస్తానని మాట కూడా ఇవ్వలేదు. తనేం చేసినా ఆ విషయం తో నాకు బాధ్యత లేదు." వనజకి విషయం అర్ధం అయిపోయింది. తనూజ తను వంశీని ప్రేమిస్తూన్న విషయం చెప్పేసి ఉంటుంది. తల్లి కొంచెం కూల్ అవ్వగానే ఆ విషయంలో ఒప్పించే ప్రయత్నం చెయ్యాలి.

"అందుకనే ఆ పనికిమాలిన వెధవని అది ప్రేమిస్తూవున్నాకూడా నీకు పట్టనట్టుగా వూరుకున్నావా?" ఇంకా అదే కోపంతో అరిచింది మంగవేణి.

"అమ్మ. నేను తనని వంశీని ప్రేమించమని చెప్పలేదు. నువ్వు వంశీని ఇష్టం వచ్చినట్టుగా అన్నావంటే మాత్రం బాగోదు." కోపంగా అంది వనజ.

"నేను వాడినేం అంటాను? ఏం అనగలను? వాడు నా కూతుర్ని మూడుసార్లు లోబరుచుకున్నాడని తెలిసినా కూడా నేనేం అనగలను వాడిని? వాడిని ఏం అన్నా మీదపడి ప్రాణాలు తియ్యడానికి నువ్వు వున్నావు కదా."

"వాడు తనని లోబరుచుకోవడం ఏమిటి? నాకేం అర్ధంకావడం లేదు." అయోమయంగా అడిగింది వనజ. "వంశీ అలాంటి వాడుకాదు."

"అవును, వాడలాంటి వాడు కాదు. అందుకనే నా కూతుర్ని అమాయకురాలిని చేసి ఫామ్ హౌస్ లో మూడుసార్లు అనుభవించాడు." వెటకారంగా అంది మంగవేణి

"అందులో వంశీ తప్పేమీ లేదు. నేను బలవంతం చేస్తేనే ఆలా చేసాడు." తనూజ అంది.

వనజ వేంగంగా వచ్చింది తనూజ దగ్గరికి. తను, తన కుడిచేత్తో తనూజ రెండు చెంపలు ఎడాపెడా వాయిస్తూ వుంటే ఆరోజు వంశీని ఇన్సల్ట్ చేసినప్పుడు తనలా కొట్టిన విషయమే గుర్తుకు వచ్చింది ఇద్దరికీ.

"మామ్ ఆలా చెప్తే తప్పులేదు, నేనలా చేస్తే తప్పా? నేనంతా తను చెప్పినట్టే చేసాను." వనజ కొట్టడం ఆపి రొప్పుతూ ఉంటే తనూజ అంది.

" నేను వాడితోనా ఆలా చెయ్యమని చెప్పాను?" కోపంగా అరిచింది మంగవేణి.

వనజ వెనక్కి తిరిగి సూటిగా మంగవేణి మొహంలోకి చూసింది. "మరి నువ్వు తనకి ఎవరితో ఆలా చెయ్యమని చెప్పావ్?" అడిగింది

"అదీ...అదీ...." తడబడి పోయింది మంగవేణి.

"నీ చెంపలు కూడా నేను తన చెంపలూలాగే వాయించకముందే చెప్పమ్మా, నువ్వు తనకి ఎవరితో ఆలా చెయ్యమని చెప్పావ్?" కోపంగా అరిచింది వనజ.

"ఆ మదన్....ఆ మదన్ గాడితో." గొంతు చిన్నగా వణికింది మంగవేణికి. "తను మదన్ పెళ్ళాం అయితే మీ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఒకే ఇంట్లో హాయిగా ఉంటారని ఆలా చెప్పాను."

"అందుకని పెళ్లికాకుండానే నీ కూతుర్ని వాడితో పడుకోమని చెప్తావా?" అసహ్యం నిండిన మొహంతో అంది వనజ.         "కంపరంపుడుతోందమ్మా నిన్ను చూస్తూవుంటే."   

మంగవేణి ఏం మాట్లాడలేక తలదించుకుంది. తనూజ పరిస్థితి కూడా అలాగే వుంది.

"సరే విషయాలన్నీ తరువాత మాట్లాడుకుందాం. ముందు భోజనాలకి రండి." అక్కడనుండి బయటికి నడుస్తూ అంది వనజ. 

&&&

భోజనాలవీ అయ్యాక, తనూజకి ఇచ్చిన గదిలో విశ్రాంతి తీసుకుంటూన్నమంగవేణి దగ్గరికి వచ్చింది వనజ.

"అమ్మా, ఆ మదన్ ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మయిని భోజనాల దగ్గర నువ్వు కూడా చూసావు. తనూజకి మదన్ పెళ్ళాం అయ్యేఅవకాశం ఏ పరిస్థితుల్లోనూ కూడా లేదు......"

"అందుకని ఇంతదూరం ఎలాగు వచ్చేసారు కాబట్టి దీన్ని వంశీకి ఇచ్చి పెళ్ళిచేసేమంటావు. ఒకవేళ మదన్ కాకపోతే వాడిని మించిన వాడిని వెదుకుతాను కానీ ఆ అలాగా వెధవకి మాత్రం నా కూతుర్ని ఇవ్వను. నా కూతురు ఎంత అందగత్తో నీక్కూడా తెలుసు." వనజని ఆపి కోపంగా అంది మంగవేణి.

"ఆ బాగా తెలుసు. కానీ నీకూ తన మొండితనం గురించి బాగా తెలుసు. ఒకటి కావాలనుకుందంటే ఇంక అంతే. అది దక్కేవరకు ఊరుకోదు. తనని ఎవరూ మార్చలేరు."

"నేను దానికి తల్లినే, దానికన్నా మొండిదాన్ని. ఎలా నా మాట వినదో నేనూ చూస్తాను." మంగవేణి కోపంగా అంది కానీ తనూజ మొండితనం గురించి తనకీ బాగా తెలుసు. తను ఒకటి కావాలనుకుందంటే పొందే తీరుతుంది.

"నువ్వలా అంటే నేనేం చెప్పలేనమ్మా." వనజ నిరాశగా అంది. "నాకన్నా అంత చిన్నది. అది నాకు చెల్లెలు గా కన్నా కూడా కూతుర్లాగే అనిపిస్తుంది. తను బావుండాలని కదా నేను కోరుకుంటాను."

"కానీ డబ్బు లేని ఆ వంశీని నా అల్లుడిగా వూహించుకోలేను." మంగవేణి అంది కానీ ముందున్న కోపం, ఫోర్స్ లేవు. కొన్ని సెకన్లు ఆగి అంది "కానీ ఒక విషయం చెప్పు? ఇప్పటివరకూ మనకుటుంబాల్లో కులాంతర వివాహాలు లేవు. వాడేదో ఆ అందానికి పడిపోయాడనుకో, కానీ నువ్వు మీ అయన మాత్రం ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు? అందులోను తను బ్రాహ్మిన్ అని చెప్పావు." భోజనాలు చేస్తూన్న సమయంలో సుస్మితని పరిచయం చేసింది వనజ మంగవేణికి.

"వాళ్లిద్దరూ ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. మా ఇద్దరికీ వాళ్లిద్దరూ ఆనందంగా ఉండడమే కావాలి." వనజ అంది.

"అది సరేలే." కాస్త ఆగి మళ్ళీ అంది మంగవేణి. "ఆ చిట్టిరాణికి ఈ విషయం తెలిసిందా? మదన్ ఇంకొకళ్ళని పెళ్లిచేసుకుంటున్నాడంటే తను ఊరుకుంటుందా?" మదన్ తో తనూజ పెళ్ళికి మంగవేణి పెద్దగా అసలు పెట్టుకోక పోవడానికి చిట్టిరాణి ఒక కారణం. చిన్నతనం నుంచి వాడి వెనక పిచ్చిదానిలా పడుతూంది. ఎదో తనూజకి చెప్పింది కానీ, ఆ చిట్టిరాణి మదన్ ని ఎవరికన్నా దక్కనిస్తుందని మంగవేణికి అనిపించడం లేదు.

"ఇంచుమించులో ఒక ఇరవై రోజులుగా ఆ చిట్టిరాణి కనిపించడం లేదు. తను ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలీదు." వనజ అంది.

"అదేమిటే, నాకేమి అర్ధంకావడం లేదు." అయోమయం గా చూస్తూ అంది మంగవేణి.

"ఆ విషయమే ఎవరికీ అర్ధం కావడం లేదు." బెడ్ మీద నుండి కిందకి దిగి అంది వనజ. "నువ్వు కాసేపు పడుకో అమ్మా. నేను చెప్పిన విషయం కూడా ఆలోచించు. వంశీ అలగావాడు కాదు. ఈ ఇంటి మనిషి. తనూజ తనకి భార్య అయితే సుఖపడుతుంది." అనిచెప్పి ఆ రూంలోనుండి బయటికి వచ్చేసింది వనజ.

&&&

"నేనొక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం ఇప్పుడు చెప్పబోతూ వున్నాను." డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనాలకి కూచున్నపుడు మదన్ అన్నాడు. "ఈ విషయంలో మీ ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరం వుండదనుకుంటున్నాను. ముఖ్యంగా సుస్మితకి. ఎందుకంటే తను నాకు కాబోయే భార్య కదా."

"నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా నాకు ఎలాంటి అభ్యంతరం ఉండదు." సుస్మిత అంది భోజనం చెయ్యడం ప్రారంభిస్తూ. "అట్టే సస్పెన్స్ లో ఉంచకుండా అదేమిటో వెంటనే చెప్పేసేయ్."

"అదేమిటో తెలియకుండా ఎందుకలా అంటావు? ముందు అదేదో తెలుసుకో." తినడం మధ్యలో అంది తనూజ.

"తనే నిర్ణయం తీసుకున్నా నేను అభ్యంతరం పెట్టను. నేను ఏ నిర్ణయం తీసుకున్న తనూ అభ్యంతరం పెట్టడు. అదేకదా మరి ప్రేమంటే." సుస్మిత అంది చిరునవ్వుతో.

"తనూజె కాదు, నువ్వూ ప్రేమలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసావు." ముకుందం నవ్వి సుస్మితతో అన్నాక మదన్ వైపు చూసాడు.. "ఎనీహౌ, అదేమిటో వేగంగా చెప్పు. నేనూ వినాలనుకుంటున్నాను."

"వంశీ చిన్నప్పటినుండి నాకు తమ్ముడిలా ఎంతో సన్నిహితంగా వున్నాడు. తను మనకి ఎంతో సాయం చేస్తూ ఉండబట్టే మనం ఇంత డెవలప్ అవ్వగలిగాము. అందుకనే నా వాటాగా వచ్చే ఆస్తిలో సగం వంశీ కి ఇచ్చేద్దామనుకుంటున్నాను. అందుకు రేపే అవసరమైన పత్రాలన్నీసిద్ధం చేయించబోతూవున్నాను." చెప్పాక తినడం మొదలుపెట్టాడు మదన్.

"నువ్వు ఇచ్చేస్తావు సరే, కానీ నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉండొద్దా?" వంశీ భోజనం ఆపి కోపంగా అన్నాడు. "నేను ఆస్తిపాస్తుల కోసం ఇక్కడ వుండలేదు. అవేవి నేను తీసుకునే ప్రశ్న లేదు."

"ఆలా అయితే నువ్వీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రేపు మానింగే బయలు దేరు." మదన్ కూడా కోపంగా అన్నాడు.

"నువ్వెవరు నన్ను వెళ్లిపొమ్మనడానికి? అన్నావదినా ఆ మాట చెప్తే వెళ్ళిపోతాను."

"చూడుబాబూ." ఆనందంతో హృదయం ఉప్పొంగి పోతూవుంటే మధ్యలో కల్పించుకుని అంది మంగవేణి. "మదన్ అంత అభిమానంతో అంటూవున్నప్పడు నువ్వు కాదనకూడదు. అతనేం పూర్తి ఆస్తి ఇచ్చేస్తాననడం లేదుకదా, సగమే కదా ఇస్తానంటున్నాడు."

"కాబోయే అత్తగారు చెప్పేమాట వినాలి." వంశీ ముఖంలోకి మీనింగ్ఫుల్ గా చూస్తూ అంది వనజ.

వంశీకి విషయం అంతా అర్ధం అయిపోయింది. అంటే మంగవేణికి విషయం అంతా తెలిసిపోయివుండాలి. తనని ఎంతో అసహ్యించుకునే ఆవిడ అలా అభిమానంగా మాట్లాడ్డానికి కారణం కూడా బోధపడిపోయింది. తనగురించి మదన్ ఏదైనా చేస్తాడని వంశీకి తెలుసు. తలెత్తిచూస్తే తనకళ్ళల్లో ఉబుకుతూన్న నీళ్లు కనిపిస్తాయని తలొంచుకుని భోజనం చేస్తున్నాడు వంశీ.

"నాకు మదన్ చెప్పింది పూర్తిగా అంగీకారమే." సుస్మిత అంది "ఈ కాస్త కాలంలోనే తనూజ నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. తను ఎంతగానో ఇష్టపడే వంశీకి భార్యకావడానికి తనకి ఎంతోకాలం పట్టదనే అనుకుంటున్నాను." "నేనూ అలాగే కోరుకుంటున్నాను." కాబోయే మొగుడు ఆస్తిలో సగం ఇచ్చేస్తానంటున్నా ఎలాంటి మార్పూలేని సుస్మితని ఆశ్చర్యంగా చూస్తూ అంది మంగవేణి.

మదన్ ఆస్తిలో సగం ఇస్తాననగానే తల్లిలో వచ్చిన మార్పు చూడగానే ఆశ్చర్యంగానూ, ఇంకా ఆనందంగానూ కూడావుంది వనజకి. సడన్ గా తనొక చిన్నపిల్లలా కనిపిస్తూ వుంది. ఒకటిమాత్రం నిజం. తను ఏం కోరుకున్నాతన ఇద్దరు కూతుళ్ళ సంతోషం కోసం మాత్రమే కోరుకుంది.

అందరూ ఆనందంతో సంతోషంతో భోజనం చేస్తూ ఉంటే వంశీ, తనూజ మాత్రం మౌనంగా ఉండిపోయారు. మదన్ తనకి ఇచ్చిన మాట గుర్తుకువచ్చింది తనూజకి. తమ పెళ్లి జరపడానికి ఏదోఒకటి చేస్తాడు అనుకుంది కానీ తన ఆస్తిలో సగం ఇవ్వడానికే ముందుకు వస్తాడని మాత్రం అనుకోలేదు. ఇది మదన్ మీద అభిమానమో, తన మీద అభిమానమో, లేకపోతె తామిద్దరిమీద అభిమానమో తనూజకి అర్ధం కావడం లేదు.

&&&

ఒక గంటపాటు తనని ఇష్టం వచ్చినట్టుగా అనుభవించి, తన కామ వాంఛనంతా తీర్చుకున్నాక తాగడం మొదలు పెట్టాడు శేషేంద్ర. సెక్స్ చెయ్యడానికి ముందు మాత్రం ఎప్పుడూ మందు తీసుకోడు. తను ఏ మైకంలోనూ లేకుండా శృంగారసుఖం అనుభవించాలని వాడి కోరిక. అయితే అది అయిపోయాక తాగడం మొదలు పెట్టాడంటే ఒక పట్టాన ముగించడు.

"అయితే నీ అభిప్రాయంలో దానికి లవర్ ఎవ్వరూ లేరు." మత్తులో తొట్రుపడుతూ అడిగాడు మాధురిని  శేషేంద్ర. తను కుర్చీలో కూచుని మాధురి పోసి ఇస్తూ వుంటే తాగుతూ వున్నాడు.

"ఐ యాం స్యూర్. దానికి లవర్ ఎవ్వరూ లేరు. దానికి చాలా పొగరు. తన అందానికి భూలోకంలో ఎవరూ సరిపోరని దాని అభిప్రాయం. ఎంతోమంది కుర్రాళ్ళు దాని దగ్గరికి వచ్చి పరిచయం చేసుకోవాలని ప్రయత్నించారు. అందర్నీ ఛీకొట్టింది. అసలు బాయ్ ఫ్రెండ్సే లేరు తనకి." ఇంకెప్పుడు ఆపుతాడా అని ఆలోచిస్తూ పోస్తూంది మాధురి.

"అది అంత అందంగా వుండేమాట అయితే మాత్రం నిజం. దాన్ని కసిగా అనుభవించాలని ఎన్నిసార్లు అనుకున్నానో." అలా అంటున్న శేషేంద్ర వైపు అసహ్యంగా చూసింది మాధురి. వీడినా తను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నది? "అయినా తనకి లవర్ ఎవరూ లేకపోవడం అనేది మనకి చాలా పెద్ద అడ్వాంటేజ్."

"అదెలా. నాకు అర్ధంకావడం లేదు." ఆశ్చర్యంగా అడిగింది మాధురి.

"దానికి ఇరవై రెండేళ్లు నిండి పెళ్లి కూడా చేసుకుంటే తప్ప ఆస్తిమీద హక్కు రాదు. దానికి లవర్స్ ఎవరూ లేరుకాబట్టి ఇరవైరెండేళ్లు నిండగానే పెళ్ళిచేసేసుకుంటుందని భయపడనవసరం లేదు. సాధ్యమైనంత త్వరలో ఎక్కడుందో కనిపెట్టి పనిపట్టేస్తే సరిపోతుంది." వాడు తొట్రుపాటుగా మాట్లాడుతూ వున్నా మాట్లాడేది ఏమిటో బాగానే బోధపడుతూంది.

"ఇది ఇంకా బోధపడడం లేదు నాకు." గుండెవేగం పెరిగిపోతూ ఉంటే అంది మాధురి. అప్పటివరకూ కేవలం ఇరవై రెండేళ్లు నిండితే చాలు సుస్మిత కి ఆస్తిమీద సర్వ హక్కులు వచ్చేస్తాయి అని చెప్పాడు. ఇప్పుడేమో తనకి ఇరవై రెండేళ్లు నిండి పెళ్లికూడా అయితే కానీ రావని చెప్తున్నాడు. అంటే వీడు తన దగ్గర చెప్తున్నట్టుగా సుస్మిత ఎక్కడ వుందో కనిపెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు తనకి ఇరవై రెండేళ్లు నిండాక కూడా. ఎందుకంటే తనకి పెళ్లి కాకుండా ఆస్తిమీద హక్కురాదు. పెళ్లి కాకుండా తను ఎదో కొంత ఆస్తి వీళ్ళ పేరుమీద రాసినా అదిచెల్లదు. కానీ తను చనిపోతే మాత్రం తనకున్న చట్టబద్ధ వారసులు వీళ్ళే కాబట్టి మొత్తం ఆస్తి అంత వీళ్ళకే వచ్చేస్తుంది.

"సెక్స్ సుఖం ఇవ్వడంలో వున్న నీ బుర్ర తక్కిన విషయాల్లో లేదు." వాడలా అంటూవుంటే జుగుప్సగా చూసింది మాధురి. వాడు తనని పశువులా అనుభవిస్తూవుంటే తన శరీరాన్ని అప్పజెప్పేసి ఎప్పుడైపోతుందా అని చూస్తూ ఉంటుంది. "సాధ్యమైనంత త్వరగా దాన్ని ఈ లోకంలోనుంచి పంపించేయడమే వున్న ఏకైక మార్గం. అది ఎవర్నో ఒకర్ని ప్రేమించొ, మరోరకంగానో మొగుడిగా చేసుకుని ఆస్తిమీద హక్కు సాధించి మమ్మల్ని బయటికి వెళ్లగొట్టేముందే అది జరిగిపోవాలి. ఎందుకంటే అది చాలా తెలివైనది. ఆస్తి మీద హక్కుకోసమైనా తనకి ఇరవై రెండేళ్లు రాగానే ఎవర్నో పెళ్ళిచేసేసుకుంటుంది."

 భయంతో నిండిపోయింది మాధురి హృదయం. కనీసం వీడు తనని డ్రగ్ అడిక్ట్ ని చెయ్యమని అడిగినప్పుడైనా, ఎంత కర్కోటకుడో తనకి అర్ధం అయివుండాల్సింది. సుస్మిత ఎక్కడవుందో తెలిసిన మరుక్షణం తనని వీడు అంతం చేసేస్తాడని తెలిసి చివురుటాకులా వణికింది. తనని డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి ప్రయత్నించినందుకే చాలా రోజులు తనని తను క్షమించుకోలేక పోయింది. తన చావుని కలలో కూడా ఊహించుకోలేదు.

మత్తుఎక్కువై కుర్చీలో అలాగే ఒరిగిపోయిన శేషేంద్రని అసహ్యంగా చూస్తూ అక్కడినుండి తన గదిలోకి వెళ్ళిపోయింది మాధురి. 

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)