ఆ ఊరి పక్కనే ఒక ఏరు
(ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్)
శివ రామ కృష్ణ కొట్ర
"బహుశా అదే కారణం వల్ల కావచ్చు నేనేరోజు తనని ఆ దృష్టితో చూడలేక పోయాను. తను నన్ను ఎప్పుడైతే ప్రేమిస్తూందని తెలిసిందో నేనప్పుడే తనకి చాలా స్పష్టంగా చెప్పను. నాకు తన మీద అలాంటి ఉద్దేశం లేదని, అలాంటి భావాలూ ఆలోచనలు పెట్టుకోవద్దని. కానీ తను వినలేదు. నా మనసు మార్చడానికి తను చెయ్యని ప్రయత్నం లేదు. నా అన్నావదినాలకి కూడా తనంటే అంతో ఇంతో ఇష్టమే కావడం, తన పేరెంట్స్ కి కూడా తనని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని ఉండడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. తనని ప్రేమించమని, ఇంకా పెళ్లి చేసుకోమని నన్ను చాలా ఇరిటేట్ చేసేది. నేనెక్కడికి వెళ్లిన నా వెనకే వచ్చేది. ఆ రోజు కూడా నా వెనక వంతెన వరకూ వచ్చాక, నా కుడి చేతిని పట్టుకుని ఆపేసింది. 'నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటావా, లేదా' అని నిలదీసి అడిగింది. అది ఎప్పటికి జరగని పని స్పష్టంగా చెప్పేసాను. సిగ్గు ఎగ్గూ లేకుండా నన్ను అక్కడే గట్టిగ కౌగలించుకుని నా మొహం మీద ముద్దులు పెట్టుకోవడం మొదలు పెట్టింది. తననుండి విడిపించుకునే ప్రయత్నంలో మేమిద్దరం వంతెన రైలింగ్ వరకూ చేరుకున్నాం. బలంగా తననుండి విడిపించుకోవాలని నేను చేస్తూన్న ప్రయత్నంలో తను పట్టు తప్పి రైలింగ్ గోడమీద నుండి నదిలో పడిపోయింది. అతి వేగంగా ప్రవహిస్తూన్న నదిలో క్షణాల్లో నా కాళ్ళ ముందునుండి తను మాయం అయిపొయింది. ఇదంతా నేను నా డైరీ లో రాసాను. ఇంతకన్నా నేనికేమి చెప్పలేను." మరోసారి తను మునుపు కూచున్న చోట్లోనే కూర్చుని నిస్సహాయంగా కళ్ళు మూసుకున్నాడు మదన్.
"నేను నిన్ను మనసారా ప్రేమించాను. ఎంతగా ప్రేమించాను అంటే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియకపోయినా కూడా నీ ఇంటికి వచ్చాను. నిజానికి నీ గురించి ఏం చెయ్యడానికి అయినా కూడా నేను సిద్ధంగానే వున్నాను." సుస్మిత అంది.
" నేను కూడా నిన్ను అంతే ప్రేమించాను. నేనే అమ్మాయి దగ్గరికి వెళ్లి ఆలా మాట్లాడడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదు. నువ్వలా పొగరుగా మాట్లాడిన తరువాత కూడా నేను నీ దగ్గరికి వచ్చి మాట్లాడాలని చాలా సార్లు అనుకున్నాను. నువ్వే నా మనసంతా ఉండబట్టే మా అన్నా వదినలు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూన్నాకూడా ఇలా ఉండిపోయాను. ఎలాగో తెలియక పోయిన నాకు నీ మీద వున్నా ఘాడమైన ప్రేమ ఎదో రోజు మనిద్దరిని ఇలా కలుపుతుందన్న నమ్మకం నాకుంది. చివరికి అంతే జరిగింది."
"నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తూ వున్నా, చిట్టిరాణి ని నువ్వు లవ్ చేసివుంటే నువ్వు నాకు దూరం అయిపోయే మాటే అయినా అలాగే చేసి ఉండాల్సింది. చిట్టిరాణి విషయంలో నువ్వు చేసింది నాకు కరక్ట్ అనిపించడం లేదు. అసలు ఒక అమ్మాయిని ప్రేమించాలంటే నీకేం కావాలి? తను అప్సరసలా అద్భుతంగా ఉండాలా? చిట్టిరాణి అంత అందంగా లేదనే తన ప్రేమని అంత నిర్దయగా తిరస్కరించావా?"
"నేను నీకు ముందే చెప్పాను. చిన్నప్పటినుండి కలిసిపెరిగాం. అందువల్ల తనమీద నాకు అలాంటి అభిప్రాయం ఎప్పుడూ రాలేదు. మనసు చంపుకుని పెళ్లి చేసుకోమంటావా?" కోపంగా అడిగాడు మదన్.
"నువ్వలా మాట్లాడొద్దు మదన్. చిన్నపటినుండి కలిసిపెరిగితే ఏమైంది? భార్యాభర్తలు కాకూడదా? తను నిన్ను అంతగా ప్రేమిస్తూన్నప్పుడు నువ్వు ప్రయత్నిస్తే తనని ప్రేమించ లేవా?" తను కూచున్న రాయి మీదనుండి కిందకి దిగి మదన్ దగ్గరగా వచ్చింది సుస్మిత. " చిట్టిరాణి లో స్వచ్ఛమైన ప్రేమ తప్ప నాకింకేం కనిపించడం లేదు. అలాంటి ప్రేమని నువ్వు అవమానించావు. ఒక అమ్మాయి అంతగా నిన్నే ప్రేమించానని నీ వెంటపడితే నీకూ ప్రేమించడానికి ఏమైంది?"
"నిన్న మనం తోటలోకి వస్తూవుంటే ఒకడు మనకి ఎదురుగా వచ్చి చిట్టిరాణి గురించి అడిగాడు, నీకు గుర్తుందా?" సుస్మిత అన్నది విననట్టుగానే అడిగాడు మదన్.
"ఎస్, ఓ బవిరి గెడ్డం మనిషి మనకి ఎదురువచ్చి చిట్టిరాణి గురించి అడిగాడు. నాకు గుర్తుంది." ఆ రూపం మనసులో మెదులుతూ ఉంటే సుస్మిత అంది.
"వాడిపేరు నాగరాజు. చిట్టిరాణికి బావ వరస అవుతాడు. తను నన్నెంతగా ప్రేమించిందో, వాడు చిట్టిరాణి ని అంతకు పదిరెట్లు ఎక్కువ ప్రేమించాడు. కేవలం చిట్టిరాణి కోసమే వాడు చిన్నతనం నుండి ఆ కుటుంబానికి కుక్కలా సేవ చేస్తున్నాడు. కానీ ఆ చిట్టిరాణి వాడి ప్రేమని ఎప్పుడూ అంగీకరించలేదు. ఎందుకని?"
"నాకీ విషయం తెలియదు." అయోమయంగా అంది సుస్మిత.
"నీకు చాలా విషయాలు తెలియవు. కానీ ప్రేమ గురించి నీకు ఒక్కదానికే తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు." చిరాగ్గా అన్నాడు మదన్. "నీ అభిప్రాయంతో నేను ఏకీభవించట్లేదు. ప్రేమ అన్నది ఇద్దరివైపు నుండి ఉండాలి. ఎదో తను నన్ను ప్రేమించింది కాబట్టి నేనూ తనని ప్రేమించాలనడం సరైంది కాదు. ఒకవేళ తను ఇప్పుడు బ్రతికి వచ్చినా, నేను తనని ప్రేమించడం కానీ, పెళ్లి చేసుకోవడం కానీ జరగదు."
సుస్మిత ఏం మాట్లాడకుండా మళ్ళీ వెళ్లి ఆ రాతిమీద కూచుంది.
"కానీ ఇప్పుడు ఆ విషయం గురించి అంత రాద్ధాంతం దేనికి? తను నదిలో పడి చనిపోయింది ఇంకా అందులో నా పొరపాటు ఏమీ లేదు. నేను తన విషయంలో చేసింది అన్యాయం అని నీకు అనిపిస్తే తను నాగరాజు విషయంలో చేసింది కూడా అన్యాయమే. నేను చెప్పింది నిజం అవునో కాదో తెలుసుకోవాలనిపిస్తే ఒకసారి నాగరాజుని అడిగి చూడు."
"అంత అవసరం లేదు. నాకు నీ మాటలమీద నమ్మకం వుంది." నవ్వింది సుస్మిత. "అన్ని విషయాలు డైరీ లో రాసేనన్నావు. కానీ ఈ విషయం మాత్రం రాయలేదు."
"ఓహ్, మర్చిపోయాను." మదన్ కూడా నవ్వాడు. "నిజానికి నేనా నాగరాజు విషయం కూడా రాసి ఉంటే నువ్వు ఇప్పుడు నన్నింతలా నిలదీసే దానివి కాదు."
"కానీ నాకు ఒక్క భయం వుంది. ఒకవేళ చిట్టిరాణి బతికి వుండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చి అల్లరి పెడితే?" అప్పటివరకు చిట్టిరాణి మీద వున్న సాఫ్ట్ ఫీలింగ్ మాయమయ్యి మళ్ళీ భయం పట్టుకుంది సుస్మితకి.
"ఇప్పటికి వారంరోజులవుతూంది తను ఆ ప్రవాహంలో పడిపోయి. అలాంటి ప్రవాహంలో పడ్డాక బ్రతికే అవకాశం ఎవరికీ ఉండదు. ఒకవేళ తను బ్రతికే ఉంటే ఇప్పటికే ఇంటికి వచ్చేసి ఉండేది." అన్నాడే కానీ ఎదో భయం మదన్ లో కూడా ప్రవేశించింది.
"తనలా నదిలో పడిపోగానే నీకు నదిలో దూకి తనని రక్షించాలనిపించలేదా?" ఎంత వద్దనుకున్నా అడగకుండా వుండలేకపోయింది సుస్మిత.
"నాకు అస్సలు ఈత రాదు. అందులోనూ నువ్వే చూసావుగా ఆ నది ఎంత భయంకరంగా ప్రవహిస్తూ వుందో. అందులో అప్పుడు దూకివుంటే నేనూ ప్రాణాలు కోల్పోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదు." ఒక అనీజీ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు మదన్.
"నువ్వు స్యూరా ఆ సమయంలో ఎవరూ మిమ్మల్నిద్దరిని చూడలేదని?" సుస్మిత భృకుటి ముడిపడింది.
"అది సాయంత్రం సమయం. ఆ సమయంలో ఎవరూ చుట్టుపక్కల లేరు. అందుకనే తను కూడా నన్ను సడన్ గా కౌగలించుకుని ముద్దులు పెట్టే సాహసం చేసింది."
"ఎందుకు తనకి నిన్ను అక్కడే కౌగలించుకుని ముద్దులు పెట్టుకోవాలనిపించింది?" సుస్మిత అడిగింది. ఆ సంఘటన ఎలా జరిగి ఉంటుందో మదిలో మెదులుతూ ఉంటే బుగ్గలు రెండూ సిగ్గుతో ఎర్రబడిపోయాయి సుస్మితకి.
"నేను తనని నా వెనకే రావద్దని బలంగా వెనక్కి నెట్టాను. అప్పుడు ఇంపల్సివ్ గా తనలా చేసింది." మదన్ అన్నాడు. "ఇంకా ఆ విషయం గురించి మాట్లాడుకోవడం ఆపుదామా? మనకింక మాట్లాడుకోవడానికి విషయాలే లేవా?" చిరాకు పడిపోయాడు మదన్.
"ఆల్రైట్" తలూపింది సుస్మిత. "ఎనీహౌ నా విషయం అంతా విన్నాక మీ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇవ్వడానికి మీ వాళ్ళకి ఏమీ అభ్యంతరం లేదు కదా?"
"అభ్యంతరమా? మనిద్దరం ఒకళ్ళనొకళ్ళం ఇష్టపడుతున్నామని కూడా తెలిసాక మనిద్దరికీ ఎంత వేగిరం పెళ్లి చేసేద్దాం అని చూస్తూ వున్నారు." చిరునవ్వుతో అన్నాడు మదన్. "వాళ్ళు నిన్నెంత ఇష్టపడుతున్నారు అంటే ఈ కొద్దిరోజులు కాదు, నువ్వెప్పుడూ మాతోనే ఉండాలని కోరుకుంటున్నారు."
"నిజంగానా? నువ్వు చెప్పింది నిజమేనా?" మనసంతా ఆశ్చర్యం ఇంకా ఆనందంతో నిండిపోతూ ఉంటే అడిగింది సుస్మిత.
"ఇందులో నువ్వింతగా ఆశ్చర్యపడడానికి ఏముంది? నీలాంటి అందమైన అమ్మాయి మా ఇంట్లోకి వస్తూందంటే వాళ్ళు మాత్రం ఎందుకు కాదంటారు?"
"మాది మీది కాస్ట్ వేరు. మీరు నాన్-వెజ్ తింటారు నేను తినను. నేను వచ్చిన రోజే వంటిట్లో ఉండగా మీ వదినకి ఈ విషయం చెప్పాను. అందువల్ల వాళ్ళేమైనా అభ్యంతరపెడతారేమో అనుకున్నాను." చిరునవ్వుతో అంది సుస్మిత.
"నేను ఇష్టపడ్డాను అంటే మతాంతర వివాహానికి కూడా మా అన్నా, వదిన అడ్డుపెట్టరు. నేనంటే అంతిష్టం వాళ్ళకి. వాళ్ళకి పిల్లలు లేరేమో నన్ను ఇంకా వంశీని అచ్చం వాళ్ల పిల్లల్లాగే పెంచారు. మేమిద్దరం అంటే మా అన్నా వదినకి చాలా అభిమానం, ఇంకా ఇష్టం."
"వంశీ అంటే పొడుగ్గా, దిట్టంగా సిక్స్ ప్యాక్ బాడీ తో వున్నాడు అతనే కదా? అతనికీ మీకు వున్న చుట్టరికం ఏమిటి?"
"మాది ఒకటే కాస్ట్ అయినా చుట్టరికం ఏమీ లేదు. వాళ్ళమ్మ మా ఇంట్లోనే వుండి పనిచేసేది. ఆమె భర్త వంశీ చిన్నతనంలోనే పోయాడు. ఆమెకి వీడు తప్ప వేరే ఎవరు లేకపోవడంతో వీడితోపాటుగా మా ఇంట్లోనే ఉండేది. వంశీకి ఆరేళ్ళ వయసులో తను కాన్సర్ తో చనిపోయింది. అప్పటినుండి నాతో పాటుగా వాడు కూడా మా అన్నావదినాలకి ఇంకో కొడుకు అయిపోయాడు. నాకన్నా కొంచెం మాత్రమే చిన్నవాడు. నాకు వాడు స్వంత తమ్ముడు కన్నా ఎక్కువ."
సుస్మిత మళ్ళీ ఎదో మాట్లాడబోతూ ఉంటే మళ్ళీ మదనే అన్నాడు. "వాడినీ నాలాగే చదివించాలని నా అన్నవదినా చాలా అనుకున్నారు. కానీ వాడికి చదువుకోవడం ఇష్టంలేదు. పొలంపనుల్లో సాయంచేస్తూ ఇక్కడే వుండిపోయాడు."
"నిజంగా మీరు చాలా గ్రేట్! ఒక పనావిడ కొడుకుని అంతగా అభిమానిస్తున్నారంటే నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం!" మెచ్చుకోలుగా అంది సుస్మిత.
"ఆలా ఆలోచించాల్సిన అవసరం లేదు. వంశీ మాకు చేసే సహాయం ఇంతా అంతా కాదు. వాడి హెల్ప్ లేకపోతే మేము ఇంతవాళ్ళం అయ్యేవాళ్ళం కాదు." దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు మదన్.
"ఎనీహౌ ఒక విషయం చెప్పు. నీకు మీ అన్నయ్యకి మధ్య అంత ఏజ్ గ్యాప్ ఎలా వచ్చింది?" కళ్ళు చిట్లించి అడిగింది సుస్మిత.
"నాకు మా అన్నయ్యకి మధ్యలో ఒక ఇద్దరు పిల్లలు పుట్టి పురిట్లోనే చనిపోయారు. రెండో ప్రెగ్నన్సీ వచ్చిన చాలా కాలానికి మా అమ్మకి మళ్ళీ ప్రెగ్నన్సీ వచ్చి నేను పుట్టాను. అందుకనే అంత ఏజ్ గ్యాప్ వచ్చింది." అంటూ నవ్వాడు మదన్. "మా వదినకి కూడా బాగా ఏజ్ గ్యాప్ తో ఒక చెల్లెలు వుంది. నా పేరెంట్స్ కి జరిగినట్టే తన పేరెంట్స్ కి జరిగింది. తన చెల్లెలు నా కన్నా ఒక రెండు మూడు సంవత్సరాలు చిన్నది. తన పేరు తనూజ. తనకీ చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు. అయన గవర్నమెంట్ హై స్కూల్ లో తెలుగు టీచర్ గా చేసేవారు. మొన్ననే ఎమ్మె సైకాలజీ తో పూర్తి చేసింది. చాల చలాకీగానూ ఇంకా అందంగానూ కూడా ఉంటుంది. తనని నీకు పరిచయం చేస్తాను."
"మీ వదినగారినే పోలివుంటే తను అందంగానే ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. తనని కలుసుకుని మాట్లాడాలని నాకూ చాలా కోరికగా వుంది." ఉత్సాహంగా అంది సుస్మిత.
"తప్పకుండా. పక్కనే వున్నా టౌన్ లోనే వాళ్ళు వుంటున్నది. నిన్నైనా అక్కడికి తీసుకు వెళ్తాను లేదా తననైనా ఇక్కడకి రమ్మంటాను. త్వరలోనే మీ ఇద్దరికీ పరిచయం అయ్యేలా కచ్చితంగా చూస్తాను." అన్నాడు మదన్.
ఆ తరువాత కాసేపు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు ఏం మాట్లాడాలో తెలియక. అంతలోనే సడన్గా గుర్తుకొచ్చినట్టుగా అన్నాడు మదన్. "ఇంతకీ మాధురి విషయం ఏమిటీ? తను ఇప్పటికి నీకు మంచి ఫ్రెండేనా?"
మాధురి ప్రస్తావన రాగానే అసహ్యంతో నిండిపోయింది సుస్మిత మొహం. "ఫ్రెండ్ షిప్ కే మాయని మచ్చ ఆ మాధురి. నా కజిన్ ఆ శేషేంద్ర గాడితో చేతులు కలిపి నన్ను నాశనం చెయ్యాలని చూసింది. నన్నో డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి ప్రయత్నించింది."
"నిజంగానా?" షాక్ తో నిండిపోయింది మదన్ మొహం.
"నేను నీకెప్పుడూ ఏవీ అబద్హాలు చెప్పను. ఇంకెప్పుడూ ఇలా అడక్కు." చిరాగ్గా అన్నాక మళ్ళీ అంది సుస్మిత.
"ఇప్పటికీ మీ ఇద్దరి మధ్య స్నేహం వుందా? తను నీతో మాట్లాడుతూ ఉంటుందా?"
"అప్పుడప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది. కానీ స్నేహం మాత్రంలేదు." ఇంకా చిరాగ్గానే వుంది సుస్మిత. "తను నా కజిన్ శేషేంద్ర గురించి పనిచేస్తోందని తెలిసాక, నన్నలా డ్రగ్ అడిక్ట్ ని చెయ్యడానికి ప్రయత్నించాక నాకు కోపంవచ్చి మాట్లాడడం బాగా తగ్గించేసాను."
"నేను ఆ శేషేంద్రతో స్నేహం మానేయమని ఎంతో చెప్పి చూసాను. నువ్వు చెప్పేవరకు ఆ ఆస్తిపాస్తులేవీ వాడివి కావని నాకు తెలియకపోయినా, వాడో పెద్ద పోకిరీ అని వాడి వ్యవహారం బట్టి నాకు అర్ధం అయింది. కానీ......." కాస్త ఆగి అన్నాడు మదన్. ".........ఎదో కాస్త డబ్బున్న వాడిని కట్టుకుని జీవితంలో సెటిల్ అయ్యి తల్లి కోరిక తీర్చాలన్న మాధురి కోరిక తీరే అవకాశమే లేదన్న మాట."
"తన క్యారెక్టర్ గురించి తెలిసాక కూడా నీకు తనమీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుంది." సుస్మిత చిరాకు కోపంగా మారింది.
"మాధురి నీ పట్ల చేసినదానికి నేను సారీ చెప్తున్నాను. దయచేసి తనమీద కోపం వుంచుకోకు." ప్రాధేయ పూర్వకంగా చూస్తూ అన్నాడు మదన్. "ఏ ఆడపిల్ల జీవితంలో పడకూడని కష్టాలు తను పడింది. ఎందుకలా నీ విషయంలో చేసిందో నాకు తెలియదు కానీ, తను చాలా అమాయకురాలు, మంచిది."
"మై గాడ్! మదన్" కంగారుగా అంది సుస్మిత. "నన్నలా డ్రగ్ అడిక్ట్ గా చెయ్యబోయిందని, ఇంకా నా ఆస్థి అంతా కాజేయాలని చూస్తూన్న నా కజిన్ కి సహాయం చేస్తూందని నాకు తన మీద కొంచెం కోపం వుంది కానీ, నాకు తనమీద పట్టలేని ద్వేషం ఏమీ లేదు. ఇంతకీ తను అంత భయంకరమైన కష్టాలేమి పడింది?"
"ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. నిజంగా ఏ ఆడపిల్లకి అలాంటి కష్టాలైతే రాకూడదు, అలంటి కష్టాలు పడింది." దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నాడు మదన్.
"తన విషయంలో నేను తప్పుచేస్తున్నానని నా సబ్కాంషస్ ఘోషిస్తూనే వుంది కానీ నేను పట్టించుకోలేదు. అయితే అదే నిజమన్న మాట. ప్లీజ్ తనగురించి నాకు చెప్పు. నేనేమైన తనకి సహాయం చెయ్యగలనేమో చూస్తాను." ఎమోషనల్ గా అంది సుస్మిత.
"మాధురి వాళ్ళ నాన్న ఒక పెద్ద తాగుబోతు, తిరుగుబోతు. వున్న ఆస్తులన్నీ తన తాగుడికి, తిరుగుళ్ళకి తగలేసేసాక భారీగా అప్పులు కూడా చేసాడు. ఇంటితో సహా ఆస్తులన్నీ అమ్మేశాక కూడా బోలెడు అప్పులు మిగిలిపోయాయి. ఆ అప్పులు తీర్చలేక, అప్పులవాళ్ల గోల పడలేక వాళ్ళని తన భార్య దగ్గరికి పంపడం మొదలు పెట్టాడు. వాళ్ళు తనని నానా రకాలుగా హింసించి అనుభవించడం మొదలు పెట్టారు. ఆ హింస ఎంత ఎక్కువై పోయిందంటే ఆమె తన ఒక్కగానొక్క కూతురు ఏమౌతుందోనని కూడా ఆలోచించకుండా ఒకరోజు ఆత్మహత్య చేసుకుంది."
"మై గాడ్! నిజమా?" షాక్ తో నిండిపోయింది సుస్మిత మొహం.
"ఇలాంటి విషయం ఎవరూ కల్పించి చెప్పలేరు. తల్లి చనిపోయాక, ఒక నెల రోజుల తరువాతో ఎప్పుడో అనుకుంటా, ఆ దుర్మార్గుడు ఒక అప్పులవాడిని తన కూతురిదగ్గరికి కూడా పంపాడు. అప్పటికి తను పెద్దమనిషి కూడా కాలేదు. వాడు తనని నిర్దాక్షిణ్యంగా రేప్ చేసాడు. మాధురి భయంకరంగా అరుస్తూ ఉంటే ఆ అరుపులు చుట్టుపక్కల అంతా వినిపించాయి. అప్పటివరకూ తన తండ్రి వెధవ వ్యవహారాలన్నీ తెలిసి సహిస్తూ వచ్చినా, గ్రామస్థులు అప్పుడు మాత్రం ఊరుకోలేదు. వాడింట్లోకి వెళ్లి మధురిని రేప్ చేసిన వాడిని ఇంకా ఆమె తండ్రిని ఎంతగా కొట్టారంటే ఆ దెబ్బలకి ఆమె తండ్రి ఏకంగా చచ్చిపోయాడు. ఆ ఇంకొకడికి మాత్రం మైనర్ గర్ల్ ని రేప్ చేసినందుకు పడాల్సిన శిక్ష పడింది."
"కానీ మాధురి మనసుకి అయినా గాయం ఎక్కడికి పోతుంది? తన తల్లిని అలాంటి పరిస్థితుల్లో చూసి సహించడమే కాదు, అలాంటి చిన్న వయసులోనే తనూ రేప్ కి గురైంది. నువ్వు చెప్పింది నిజం. ఏ ఆడపిల్లకి అటువంటి కష్టం అయితే రాకూడదు." సుస్మిత మనసంతా బాధతో నిండిపోయి ఆ బాధంతా మోహంలో ఎక్ష్ప్రెస్స్ అవుతూ వుంది.
(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలోనే పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)