Featured Books
  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

  • కొంచెం జాగ్రత్త - 2

    మనుషులను చంపి వారి మెదడును తినే ఒక నరభక్షకుడి సీరియల్ కిల్లి...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

రామాపురం హై స్కూల్ రోడ్

నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వరకు మా ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామాపురం హై స్కూల్ లోనే చదువుకున్నాను.

మా ఊరిలో, నా జీవితంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన గురించి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను

ఆ సంవత్సరం 2018 నేను టెన్త్ క్లాస్ చదువుతున్నా రోజులు అవి నేను ప్రతి రోజు లాగానే నా ఫ్రెండ్స్ అయినా శ్రీను మరియు సతీష్ తో కలిసి ఉదయం 9 గంటలకు రామాపురం లో ఉన్న మా హైస్కూల్ కి వెళ్లిపోయాము

నేను మా ఇద్దరి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా స్కూల్లో లాస్ట్ బెంచ్ లో కూర్చునే వాళ్ళము కానీ మేము ప్రతి సబ్జెక్టులో కూడా మంచి మార్క్ తెచ్చుకొని బెస్ట్ స్టూడెంట్స్ గా ఉండేవాళ్ళము కానీ ఒక హిందీ సబ్జెక్టులో మాత్రమే నేను మరియు నా ఫ్రెండ్స్ కి ఎక్కువగా భయం ఉండేది ఆ సబ్జెక్టులో మాకు పాస్ మార్క్ కూడా దాటేవి కాదు

ఇక మా హిందీ టీచర్ పేరు సరళ ప్రతిరోజు లాగానే మేము హిందీ క్లాస్ కి అటెండ్ అయ్యాము ఆ రోజు హిందీ టీచర్ లెసన్ చెబుతున్నారు . కానీ ఆమె చెప్పిన లెసన్ ఒక్క ముక్క కూడా నాకు మరియు మా ఇద్దరి ఫ్రెండ్స్ కూడా ఏమీ అర్థం కావడం లేదు. ఇక మేము లాస్ట్ బెంచ్ లో ఉండటంవల్ల మా హిందీ టీచర్ ఎక్కువగా గమనించేది కాదు అందువలన మేము చేసేది ఏమీ లేక ఆమె లెసన్ చెపుతూ ఉన్నప్పుడు మేము మొబైల్ తో గేమ్ ఆడుకుంటూ ఉన్నాము ఆ సంఘటన చూసిన హిందీ టీచర్ మా దగ్గరికి వచ్చింది.

ఇక మా చేతిలో ఉన్న మొబైల్స్ లాక్కొని మా ముగ్గురిని ప్రిన్సిపాల్ రూమ్ కి తీసుకుని వెళ్ళింది జరిగిన విషయం అంతా హిందీ టీచర్ ప్రిన్సిపాల్ కి వివరించింది. దీంతో ప్రిన్సిపాల్ మా ముగ్గురుని ఆ రోజంతా స్కూల్ గ్రౌండ్ లో నిలబెట్టించాడు . మాకు అప్పటివరకు ఉన్న బెస్ట్ స్టూడెంట్స్ అనే గౌరవం కూడా పోయింది మా క్లాస్ లో ఉన్న ప్రతి స్టూడెంట్స్ కూడా మమ్మల్ని చూస్తూ ఆ రోజంతా నవ్వుకున్నారు అది చూసిన మేము ఆ రోజంతా చాలా బాధపడ్డాము మేము చేసిందే తప్పే కానీ ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష పడిందని మా మనసులకు అనిపించింది. అక్కడ నుంచి మేము స్కూల్ కి మొబైల్ తేవడం మానివేసాము

హిందీ టీచర్ సరళ మేడం చాలా అందంగా ఉంటుంది ఆమెకు పెళ్లి కూడా అయ్యింది కానీ ఆమె NCC మాస్టర్ అయినా సూర్యారావుతో లవ్ ఎఫైర్ ఉండేదని స్కూల్లో ఒక పుకారు ఉండేది

ఆరోజు ఆదివారం హిందీ టీచర్ అలాగే NCC మాస్టర్ అయిన సూర్యారావు స్కూల్ కి వచ్చారు మా స్కూలు వెనక ఉన్న బాత్రూంలో వారు సెక్స్ చేస్తున్నారు ఆరోజు ఆదివారం కావడంతో ఆ స్కూల్ కి చెందిన కొందరికి విద్యార్థులు ఆ స్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్నారు. ఆ సమయంలోనే వాళ్ళిద్దరూ సెక్స్ చేస్తున్నప్పుడు గమనించిన విద్యార్థులు మొబైల్ తో వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేశారు ఇక ఆ వీడియో బాగా వైరల్ గా మారింది

మరుసటి రోజు సోమవారం ఆ వీడియో గురించి తెలియని హిందీ టీచర్ ప్రతిరోజు లాగానే స్కూల్ కి వచ్చి టెన్త్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెపుతుంది ఆ వీడియో గంట గంటకు వైరల్ గా మారుతుంది ఎంతగా వైరల్ గా మారింది అంటే హిందీ టీచర్ భర్త వరకు ఆ వీడియో చేరేలా వైరల్ అయింది.

ఆ వీడియో చూసిన హిందీ టీచర్ భర్త కోపంతో మా స్కూల్ కి వచ్చి టెన్త్ క్లాస్ రూమ్ లో క్లాస్ చెబుతున్నా హిందీ టీచర్ ని జుట్టు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ కొట్టాడు ఆమె ఇక కేకలు వేస్తుంది ఆ విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ టెన్త్ క్లాస్ రూమ్ కి వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నాడు

ఇక దానితో స్కూల్ మొత్తం హిందీ టీచర్ వైపు చాలా వెటకారంగా చూస్తున్నారు ఆ విషయం తెలిసిన NCC మాస్టర్ సూర్యారావు స్కూల్ వెనకవైపు ఉన్న గోడని దూకి పారిపోయాడు అంత విషయం జరగడంతో మీడియా మరియు పోలీస్ వారు స్కూల్ కి రావడం జరిగింది.

ఇక చేసేది ఏమీ లేక ప్రిన్సిపాల్ స్కూల్ కి హాఫ్ లీవ్ ఇవ్వడం జరిగింది . విద్యార్థులు అందరూ వెళ్లిపోవడంతో స్కూల్ మొత్తం ఖాళీ అయ్యింది స్కూల్ అటెండర్ వెంకటేష్ స్కూల్ డోర్లు మొత్తం వేసే అతను కూడా ఇంటికి వెళ్ళిపోయాడు కానీ స్కూల్లో మాత్రం ఒకరు ఉన్నారు ఆమె ఎవరు అంటే హిందీ టీచర్ అయినా సరళ మేడమ్

ఆమె టెన్త్ క్లాస్ రూమ్ లోనే ఉండి ఏడుస్తుంది . తన భర్త కూడా ఆమెను వదిలేసాడు స్కూల్ మొత్తానికి తన ముఖాన్ని రేపటి నుంచి ఎలా చూపించాలి జాబ్ కూడా పోయే పరిస్థితిలో ఆమె ఉంది ఇలాంటి గందరగోళంలో ఆమెకు ఏమి తోచలేక ఒక చావే ఆమెకి ఒక మార్గంగా కనిపించింది

ఆ టెన్త్ క్లాస్ రూమ్ లో ఉన్న ఒక ఫ్యాన్ కి ఆమె చీర కొంగును కట్టి ఉరి వేసుకుంది. మరుసటి రోజు స్కూల్ అటెండర్ అయినా వెంకటేష్ ప్రతిరోజు లాగానే స్కూల్ డోర్స్ ని తెరుస్తున్నాడు. కానీ స్కూల్ విపరీతంగా కంపు వస్తుంది అది గమనించిన స్కూల్ అటెండర్ వెంకటేష్ ప్రతి రూమ్ ని వెతుకుతూ వెళ్తున్నాడు. ఇక టెన్త్ క్లాస్ రూమ్ లో విపరీతంగా వాసన వస్తుంది ఇక ఆ రూమ్ యొక్క డోర్ తెరిచాడు వెంటనే అతనికి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయింది

అ హిందీ టీచర్ శవం ఎలా ఉంది అంటే ఆమె నాలుక మొత్తం బయటికి వచ్చింది. అలా భయంకర రూపంలో ఉన్న ఆమె సవాన్ని చూసిన స్కూల్ అటెండర్ వెంకటేష్ గట్టిగా కేకలు వేస్తూ స్కూల్ నుంచి బయటికి వచ్చేసాడు ఆ జరిగిన విషయం అంతా స్కూల్ ప్రిన్సిపల్ కి చెప్పాడు.

అలాంటి సంఘటన ఆ స్కూల్లో జరగటం వల్ల ఆ రోజు నుంచి స్కూల్ నీ మూసేశారు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ స్కూల్ మూసి వేసిన కొన్ని రోజులకే స్కూల్ అటెండర్ వెంకటేష్ కూడా దారుణమైన స్థితిలో చనిపోయాడు . అలాగే NCC మాస్టర్ అయినా సూర్యరావు కూడా తన ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. దీని అంతటికి అ హిందీ టీచర్ కారణమని మా ఊరంతా నమ్మేవారు.

ఆ ఊర్లో ఉన్న ప్రజలు నమ్మే విధంగానే చాలా సంఘటనలు హై స్కూల్ రోడ్లో జరుగుతూ ఉండేవి హై స్కూల్ రోడ్డులో 12 నుంచి 1 మధ్యలో చాలా యాక్సిడెంట్ జరిగి చాలామంది మరణించారు అలా మరణించిన వారిలో నా స్నేహితులైన శ్రీను మరియు సతీష్ కూడా ఉన్నారు వారి మరణం ఎలా ఉంది అంటే వారి కడుపులో ఉన్న ప్రేగులు బయటికి వచ్చేసాయి వారి తలలు నాలుగు ముక్కలు అయ్యాయి అంతా భయంకరమైన చావు నా ఫ్రెండ్స్ కి ఆ హై స్కూల్ రోడ్డులో జరిగింది. ప్రతిరోజు కూడా రాత్రి అయితే ఆ స్కూల్ నుంచి అరుపులు వినిపిస్తూనే ఉండేవి అలాంటి సంఘటనలు చూసిన ప్రజల ఆ రోడ్డు నుంచి రాత్రిపూట రావడం కూడా మానివేశారు మా ఊరు ప్రజలు ఏ పని అయినా ఉదయం పూటనే తమ పనిని ముగించుకొని వచ్చేవారు

ఇక స్కూల్ మూసివేసి దాదాపుగా 5 సంవత్సరాలు దాటింది నేను కూడా నా డిగ్రీ ని పూర్తి చేశాను ఆ సంవత్సరం 2023 నాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది మీ డిగ్రీ సర్టిఫికెట్లను తీసుకువెళ్లండి అని చెప్పారు ఆ విషయం తెలుసుకున్న నేను నా బైక్ తో మా ఊరు రామాపురం నుండి సిటీకి దగ్గరలో ఉన్న మా కాలేజ్ దగ్గరికి వెళ్లాను అప్పుడే నాతో పాటు డిగ్రీలో చదువుకున్న నా ఫ్రెండ్స్ నీ కలిసాను చాలా రోజుల తర్వాత కలవడంతో వారితో కలిసి పార్టీ కూడా చేసుకున్నాను కానీ ఆ సమయంలో నేను టైం చూసుకోవడం మర్చిపోయాను ఇక రాత్రి 8 అవుతుంది. ఇక మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మా నాన్న ఇంకా ఎక్కడ ఉన్నావు రా అని గట్టిగా ఫోన్లో అరుస్తూ ఉన్నాడు అప్పటి వరకు నాకు రామాపురం హై స్కూల్ రోడ్డు గురించి జ్ఞాపకమే లేదు సిటీ నుంచి మా ఊరికి వెళ్లాలి అంటే రామాపురం హై స్కూల్ రోడ్డు నే దాటాల్సి ఉంటుంది ఇక మా నాన్న ఫోన్ కాల్ తో జ్ఞాపకం తెచ్చుకున్న నేను సిటీ నుంచి బయలుదేరాను.

ఇక రామాపురం హై స్కూల్ రోడ్డు వద్దకు వచ్చేసరికి విపరీతమైన గాలి వేస్తుంది హై స్కూల్ గేట్ వద్దనే నా కంటిలో ధూళి పడటంతో నా బైకు స్లిప్ అయ్యి పడిపోయాను నా చేతికి కూడా గాయం అయ్యి రక్తం వస్తుంది నేను మెల్లగా బైక్ తీసి స్టార్ట్ చేశాను కానీ బైక్ స్టార్ట్ అవడం లేదు చాలా ప్రయత్నించాను కానీ బైక్ స్టార్ట్ అవలేదు. ఇక విపరీతమైన గాలితో పాటు వర్షం కూడా స్టార్ట్ అయింది నా దగ్గర ఉన్న సర్టిఫికెట్లు తడిచిపోతాయేమో అని భయంతో నా బండి లో నుంచి బయటికి తీసి కవర్లో పెట్టే లోపల నా చేతిలో ఉన్న సర్టిఫికెట్లు జారిపోయి గాలికి ఎగురుకుంటూ స్కూల్ కాంపౌండ్ లోకి వెళ్లిపోయాయి ఇక నాకు భయం మొదలైంది నేను మూడు సంవత్సరాల కష్టపడి నా ఫలితం ఆ సర్టిఫికెట్లు వాటిని ఎలాగైనా పొందాలని నిర్ణయించుకున్నాను. మెల్లగా నేను భయంతో నా మొబైల్ టార్చ్ లో స్కూల్ లోపలికి నా సర్టిఫికెట్ ని వెతుక్కుంటూ వెళ్లాను ఇక నా సర్టిఫికెట్లు గాలికి ఎగురుతూ స్కూల్ రూమ్ లోపలికి పడిపోయి ఉన్నాయి వాటిని చూసిన నేను వెంటనే నా సర్టిఫికెట్లు తీసుకొని బయటికి వచ్చేసరికి ఒక్కసారిగా స్కూల్ రూమ్ డోర్స్ మూత పడిపోయాయి. ఆ మూత పడిన శబ్దం నాకు ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది ఆ మూతపడిన డోర్స్ ని తీయడానికి ఎంత ప్రయత్నించినా మళ్ళి తెచ్చుకోలేదు ఆ స్కూల్లో ఉన్న సామలతో అ డోర్ ని పగలగొట్టడానికి ప్రయత్నించాను కానీ హా డోర్ అసలు ఓపెన్ కాలేదు.

ఇక ఆ సమయంలోనే నా వెనక వైపు ఎవరో నిల్చుని నా వైపు చూస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది నేను భయంతో వెనక్కి తిరిగి చూసాను కానీ అక్కడ ఎవరూ లేరు నా మొబైల్లో సిగ్నల్ కూడా రావడం లేదు నేను ఇక భయంతో గట్టిగా కాపాడండి అని అరుస్తూ ఉన్నాను. అదే సమయంలోనే మరో ఆడ గొంతుతో నన్ను కాపాడండి అని స్కూల్ లోపల అరుస్తూ ఉన్నారు ఆ అరుపు వినగానే నాకు చాలా భయం అనిపించింది అరుపు ఎలా ఉంది అంటే మా హిందీ టీచర్ సరళ మేడం అరుపు లాగానే అనిపించింది ఇక నాకు ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి గుండె దడ పెరిగిపోతుంది నా చుట్టుపక్కల అంతా కటిక చీకటిగా ఉంది కానీ పైనుంచి మాత్రం అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి మరోవైపు ఏడుపులు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఇక నేను భయముతో ఆ అరుపులు మరియు ఏడుపులను వినడానికి చాలా భయంకరంగా ఉంది

నేను భయంతో మెల్లగా ఆ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చూడటానికి స్కూల్ పైకి ఎక్కుతూ వెళ్లాను. ఆ అరుపులు అన్ని నేను చదివిన 10 క్లాస్ రూమ్ నుంచి వస్తూ ఉన్నాయి. నేను మెల్లగా టెన్త్ క్లాస్ రూమ్ కి వచ్చేసరికి ఒక్కసారిగా ఎవరు బట్టలు లేకుండా ఒక అమ్మాయి రూపంలో నా ముందుకు వస్తుంది . అది చూసినా నేను గట్టిగా కళ్ళు మూసుకున్నాను. మరలా తెరిచేసరికి అక్కడ ఎవరూ లేరు . ఇక నేను భయంతో ఆ టెన్త్ క్లాస్ రూమ్ దగ్గరికి వెళ్లాను. రూమ్ తెరిచాను కానీ అక్కడ ఎవరూ లేరు కానీ రూమ్ బోర్డు మీద అ హిందీ టీచర్ రాసిన డేట్ అప్పటికి చెరిగిపోకుండా అలాగే ఉంది ఆ రూమ్ లో ఎవరూ లేరని నాకనిపించింది దీంతో రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి ఒక్కసారిగా నా పైన ఉన్న ఫ్యాన్ తిరగడం ప్రారంభమైంది ఏమిటి అని నా తలపై కి ఎత్తి చూసేసరికే ఆ ఫ్యాన్ మీద హిందీ టీచర్ కూర్చుని నా వైపు చూస్తూ ఉంది ఇక నాకు గుండెలో భయం మొదలైంది ఆమె చూసిన వెంటనే నేను గట్టిగా అరుస్తూ ఉన్నాను అ హిందీ టీచర్ కూడా నన్ను చూస్తూ అరుస్తూ నా పైకి దూకింది ఆమెను అదుపు చేయలేకపోతున్నాను నా పీకను నొక్కుతుంది నా గుండెల మీద కొడుతుంది నేను మాత్రము కదలలేని పరిస్థితిలో ఉండి పోతున్నాను ఆ భయంతో నేను మూత్ర విసర్జన కూడా చేసుకుంటున్నాను ఇక మా నాన్న భూత వైద్యుడు కావడంతో నేను కూడా మా నాన్నతో కొన్ని మంత్రాలు నేర్చుకున్నాను ఆమె నా గుండెలపై కూర్చున్న సమయంలో నాకు ఆ మంత్రాలు గుర్తుకు వచ్చి చదివాను వెంటనే అ హిందీ టీచర్ నన్ను వదిలేసింది కానీ నేను మాత్రం అ భయంతో గట్టిగా మంత్రులు చదువుతూనే ఉన్నాను ఆ మంత్రాలు విన్న అ హిందీ టీచర్ వెంటనే గట్టిగా చెవులు మూసుకుంటూ ఏడుస్తూ నా వైపుకు రావాలని అనుకుంటుంది కానీ నేనే ఇంకా గట్టిగా మంత్రాలు చదవడంతో అ హిందీ టీచర్ అక్కడ నుంచి వెళ్ళిపోయింది ఇక నా చేయి నుంచి విపరీతంగా రక్తం కారుతుంది నేను సృహ కోల్పోయే పరిస్థితికి వచ్చేస్తున్నాను నేను మెల్లగా మంత్రాలు ఆపకుండా స్కూల్ నుంచి బయటికి వచ్చాను ఆమె మాత్రం నా వెనకనే వస్తూ ఉన్నట్లు నాకనిపిస్తూ ఉండేది ఇక రూమ్ డోర్ బద్దలు కొట్టి బయటికి వచ్చేసాను కానీ నాకు రక్తం ఎక్కువగా పోవడంతో సృహ కోల్పోయాను ఇక మరుసటి రోజు ఉదయం హా దారిన వెళ్లిన మా ఊరు ప్రజలు నన్ను చూసి ఆసుపత్రిలో జాయిన్ చేశారు . ఇక మా అమ్మ ,నాన్న ఏడ్చుకుంటూ ఆసుపత్రికి వచ్చారు. ఇక నా ఆరోగ్యం మెల్లగా బాగుపడింది

నేను టెన్త్ క్లాస్ లో చదివిన నా క్లాస్మేట్స్ తో కలిసి మా క్లాసులో మొత్తం 60 మంది ఉండేవాళ్ళము కానీ అ హిందీ టీచర్ ప్రభావం మాత్రం నేను మరియు నా ఫ్రెండ్స్ అయినా శ్రీను మరియు సతీష్ పైనే ఎక్కువగా ఎదుర్కొన్నాము. శ్రీను మరియు సతీష్ కూడా చనిపోయారు నేను మాత్రమే బ్రతికాను ఆ హిందీ టీచర్ మాపైన పగ పెంచుకొని మమ్మల్ని చంపాలని అనుకోవడానికి గల ప్రధానమైన కారణం మేమే ఆరోజు తీసిన ఆ వీడియోనే హా NCC మాస్టర్ మరియు హిందీ టీచర్ చేసిన సెక్స్ వీడియో నేను మరియు మా ఇద్దరు ఫ్రెండ్స్ వీడియో తీసి నెట్ లో అప్లోడ్ చేసాము. దాని కారణంగానే హిందీ మేడం చనిపోయింది. ఈ విషయం నాకు మరియు మా ఇద్దరి ఫ్రెండ్స్ కి మాత్రమే తెలుసు మా ఇద్దరి ఫ్రెండ్స్ వాళ్లు చనిపోయారు. ఇక నాకు మాత్రమే ఆ విషయం రహస్యంగా ఉండిపోయింది. ఆ వీడియో తీసి నెట్లో అప్లోడ్ చేయడానికి గల ప్రధానమైన కారణం మేము ఆ రోజు పడిన బాధను ఆమె కూడా అనుభవించాలి అనే తీశాము. కానీ ఆ తెలిసి తెలియని వయసులో మేము చేసిన తప్పుకి చాలామంది బాధపడ్డారు.

నేను బతకడానికి గల ప్రధాన కారణం మా నాన్నగారు నుంచి నేను నేర్చుకున్న మంత్రాలే నన్ను కాపాడాయి