Read Love poison by NARESH MAJJI in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

లవ్ పాయిజన్

 

నా పేరు సాయి నాకు చదువు పై అంతకు ఆసక్తి ఉండేది కాదు అందువలన నేను ఇంటర్ వరకు చదివి అక్కడినుంచి చదువుని ఆపేసాను ఇక ఖాళీగా ఉండటం ఎందుకు అని ఒక వైన్ షాపులో వెయిటర్ గా జాయిన్ అయ్యాను నెలకు నాకు భోజనంతో పాటు 8000 రూపాయలు జీతం వచ్చేది ప్రతిరోజు నేను ఉదయం 9 నుండి రాత్రి 10 వరకు ఆ వైన్ షాప్ లో పనిచేస్తూ ఉండేవాడిని అలా రోజు పని చేస్తూ ఉన్నప్పటికీ నా జీవితంలో ఏదో లోటు ఉన్నట్లుగా నాకు అనిపిస్తూ ఉండేది


 

ఒక రోజు నేను వైన్ షాప్ మూసే సమయానికి ఒక అమ్మాయి షాప్ వద్దకు వచ్చింది ఆ అమ్మాయి ముఖంలో ఏదో భయంతో ఉన్నట్లుగా  ఎవరినో వెతుకుతూ ఉన్నట్లుగా నాకు అనిపించింది నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి మీకు ఏం కావాలి అని ఆ అమ్మాయిని అడిగాను ఆ అమ్మాయి మా నాన్నగారు వైన్ తాగడానికి వైన్ షాప్ కు వెళ్తాను అని చెప్పారు ఇప్పటికీ వెళ్లి రెండు గంటలైనా మా నాన్న మా ఇంటికి ఇంకా రాలేదు అండి నేను భయంతో మా నాన్న వైన్ తాగి ఎక్కడ పడిపోయాడు అని ఇక్కడికి వచ్చాను అండి అని ఆ అమ్మాయి నాతో చెప్పింది

 

మీ నాన్నగారు ఏ రంగు చొక్కా వేసుకున్నారు అని ఆ అమ్మాయిని నేను అడిగాను అప్పుడు ఆ అమ్మాయి కొద్దిసేపు ఆలోచించి తెలుపు రంగు చొక్కా వేసుకున్నారు అని నాతో చెప్పింది అప్పుడు నేను అవును అవును మీ నాన్నగారు ఒక గంట క్రితమే వచ్చి వెళ్లిపోయారు ఈ పాటకి మీ ఇంటికి వెళ్లిపోయి ఉంటారు అని ఆ అమ్మాయితో నేను చెప్పాను

 

ఇంతలోనే ఆ అమ్మాయికి కాల్ వచ్చింది ఆ అమ్మాయి ఫోన్ ఎత్తి మాట్లాడింది మా నాన్నగారు ఇంటికి వచ్చేసారంట అని నవ్వుతూ ఆ అమ్మాయి నాతో చెప్పింది సరే మీరు ఇక ఇంటికి వెళ్ళండి నేను ఇక షాప్ ని క్లోజ్ చేసుకుంటాను అని ఆ అమ్మాయితో చెప్పాను ఆ అమ్మాయి తిరిగి ఇంటికి బయలుదేరింది ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకు వేసి ఒక నిమిషం ఆగిపోయి చుట్టుపక్కల చూస్తుంది అప్పుడు నేను ఏమైందండీ ఇంటికి వెళ్ళండి అని ఆ అమ్మాయితో చెప్పాను అప్పుడు ఆ అమ్మాయి మా నాన్నగారిని వెతకడం కోసం చీకటిగా ఉంది అని కూడా చూడకుండా ఇంత దూరం వచ్చేసాను ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్లాలంటే భయంగా ఉంది మీరు కొంచెం దూరం నాతో తోడుగా వస్తారా అని అమ్మాయి నాతో అడిగింది నేను సరే అని ఒప్పుకున్నాను

 

నేను ఇక షాప్ ని క్లోజ్ చేసి ఆ అమ్మాయితో తోడుగా నడిచి వెళ్లాను మీరు ఏం చదువుకున్నారు అని అమ్మాయి నన్ను అడిగింది నేను  నా  స్టోరీ మొత్తం ఆ అమ్మాయికి చెప్పాను ఆ అమ్మాయి కూడా తనని పరిచయం చేసుకుని తన విషయాలు మొత్తం చెప్పింది ఆ అమ్మాయి పేరు అను" అని తాను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను అని నాతో చెప్పింది ఇంతలోనే ఆ అమ్మాయి ఇల్లు దగ్గరికి రావడంతో సరే సాయి గారు థాంక్స్ అండి ఇక మీరు వెళ్ళండి అని ఆ అమ్మాయి నాతో అన్నాది ఇక నేను తిరిగి వెనక్కి వెళ్లిపోయాను

 

ఆ అమ్మాయి నాతో నడిచిన కొద్ది దూరం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది ఆ అమ్మాయి మాటలు వింటుంటే ఏదో మంచి పాట పాడినట్లుగా ఆ అమ్మాయి ముఖం చూస్తూ ఉంటే పౌర్ణమి రోజున చందమామ చూసినంత హాయిగా నా మనసుకు కలిగింది ఆ రోజుని నేను ఆనందించిన క్షణాన్ని చనిపోయేంతవరకు గుర్తుండిపోయేలా మర్చిపోకుండా నా యదలో నాటుకు పోయింది ఆ రోజు రాత్రి అంతా ఆ అమ్మాయి రూపమే నాకు గుర్తుకు వచ్చింది

 

మరునాడు నేను షాప్ నీ ఓపెన్ చేశాను ఆ అమ్మాయి రోజు ఈ దారినే కాలేజీకి వెళ్తుందని చెప్పడంతో నేను అమ్మాయి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూస్తాను అని ఎదురుచూస్తూ ఉన్నాను నేను మనసులో అనుకుంటున్నా కొద్ది క్షణానికే ఆ అమ్మాయి వచ్చింది ఆ  అమ్మాయి రోడ్డు మీద నడుచుకుంటూ నా వైపు చూసి నవ్వింది ఇక ఆ అమ్మాయి నవ్వు చూసిన నేను గుండెల్లో అంతులేని అంతా ఆనందం ఉరకలు వేసింది నా జీవితంలో ఏదో లోటుగా ఉన్న ఆనందం ఇదేనేమో అని నాకు అనిపించింది ఇలా ప్రతిరోజు ఆ అమ్మాయి ఉదయం కాలేజీకి వెళ్తున్నప్పుడు తిరిగి వస్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూస్తూ ఉండేవాడిని మెల్ల మెల్లగా నేను ఆ అమ్మాయి కాలేజీకి వెళ్తున్నప్పుడు ప్రతిసారీ మాట్లాడటం ప్రారంభించాను ఆ అమ్మాయి కూడా నాతో నవ్వుతూ మాట్లాడుతూ ఉండేది

 

ఇక నేను ఆ అమ్మాయితో మూడు నెలలుగా పరిచయం పెంచుకొని ఒక మంచి స్నేహితుడిగా మారాను ఇక నా ప్రేమ విషయం హా అమ్మాయికి చెప్పాలని అనుకున్నాను ఫిబ్రవరి  14 ప్రేమికుల రోజు కావడంతో ఆ రోజు నేను నా ప్రేమ విషయం అమ్మాయితో చెప్పాలని నిర్ణయించుకున్నాను నేను అమ్మాయి చదువుతున్న కాలేజీకి వెళ్ళాను అను నీతో కొంచెం సేపు మాట్లాడాలి అని నేను ఆ అమ్మాయిని అడిగాను అప్పుడు ఆ అమ్మాయి ఇదేంటి ఎప్పుడూ లేనిది కొత్తగా కొంచెం సేపు మాట్లాడాలి అంటున్నావు సాయి అని ఆ అమ్మాయి నవ్వుకుంటూ నన్ను అడిగింది

 

అప్పుడు నేను నా జీవితంలో ఏదో ఆనందం లేనట్లుగా నాకు అనిపిస్తూ ఉండేది నిన్ను చూసిన ఆ రాత్రి నేను జీవితంలో కోల్పోయిన ఆనందమంతా తిరిగి వచ్చినట్లు అనిపించింది నాకు ఎన్ని కష్టాలు వచ్చి నా నువ్వు నా పక్కన ఉంటే నాకు ఆ కష్టాలన్నీ ఆనందంగానే ఉంటాయి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అను నాతో కలిసి జీవితాన్ని పంచుకుంటావా అని ఆ అమ్మాయిని అడిగాను ఆ అమ్మాయి నవ్వుతూ నా చేతిలో ఉన్న చాక్లెట్ ని తీసుకుంది ఇక నా సంతోషానికి అదుపు లేదు ఆ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను

 

ఆ రోజు నుంచి ఇక నేను సరిగ్గా షాప్ కూడా వెళ్లడం మానేశాను ఆ అమ్మాయి తోనే రోజు మొత్తం గడుపుతూ ఉండేవాడిని ఒక రోజు ఆ అమ్మాయి నాకు మొబైల్ ఫోన్ కొని పెట్టవా అని నన్ను అడిగింది నేను ఎక్కువగా షాపులో పనిచేయలేకపోవడం వల్ల నాకు శాలరీ సరిగ్గా రాలేదు అప్పుడు నేను ఎలాగైనా మొబైల్ కొనాలని అనుకున్నాను . ఆ అమ్మా ఎంతో ఇష్టపడి కొనుక్కున్నా బంగారం చైన్ ని అమ్మేసి 25000 పెట్టి ఒక మొబైల్ ఫోన్ కొన్నాను ఆ మొబైల్ ఫోన్ నేను ప్రేమించిన అమ్మాయికి బహుమతిగా ఇచ్చాను ఇలా సంతోషంగా నా జీవితం ఆ అమ్మాయి తో గడుస్తూ ఉంది

 

ఇక బంగారం అమ్మిన విషయం మా అమ్మగారికి తెలిసిపోవడంతో మా అమ్మానాన్నలతో నాకు పెద్ద గొడవ ఆ రోజు జరిగింది అప్పటినుంచి మా అమ్మ నాతో మాట్లాడటం మానేసింది నేను కూడా సరే అని వారిని పట్టించుకోవడం మానేశాను నా స్నేహితులతో కూడా నేను ఎక్కువగా మాట్లాడకపోవడం వలన వారు కూడా నన్ను విడిచి పెట్టేసారు నేను మాత్రం నాకు ఎవరూ లేకపోయినా నాకు ప్రేమించిన అమ్మాయి ఉందని సంతోషంగా ఆ అమ్మాయిని  గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని

 

నేను ఒక రోజు నేను ప్రేమించిన అమ్మాయిని కలవడానికి ఆమె కాలేజీకి వెళ్లాను అప్పటికే కాలేజీ వదిలి చాలాసేపు అయింది అందరూ స్టూడెంట్లు బయటకు వచ్చేసారు కానీ నేను ప్రేమించిన అమ్మాయి మాత్రం బయటికి రాలేదు  నేను ఆ అమ్మాయికి ఫోన్ చేశాను ఫోన్ రింగ్ అవుతుంది కానీ ఎవరూ తీయడం లేదు నేను సరే అనుకుని ఆ అమ్మాయి క్లాస్ రూమ్ కి వెళ్లి చూశాను నేను ఆరోజు చూసిన దృశ్యం నాకు గుండె ఆగినంత పని అయింది అను తన క్లాస్మేట్ తో సెక్స్ చేస్తుంది కానీ వారు నన్ను చూడలేదు నేను మాత్రం తలుపు చాటు నుండి వారిని చూశాను నేను అప్పుడు అక్కడి నుంచి బరువెక్కిన గుండెలతో ఏడ్చుకుంటూ వచ్చేసాను

 

మరుసటి రోజు అను నీ కలిశాను నిన్ను ఏమి ఫోన్ తీయలేదు అని నేను అమ్మాయిని అడిగాను నిన్ను నాకు స్పెషల్ క్లాస్ వండటం వల్ల ఫోన్ తీయడం అవ్వలేదు అని నాతో చెప్పింది అప్పుడు నేను కోపంతో సెక్స్ గురించి నిన్న స్పెషల్ క్లాస్ లో చెప్పారు కదా అని ఆ అమ్మాయితో అన్నాను అప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు మైండ్ పనిచేయడం లేదా ఏంటి అని నాతో అన్నాది అప్పుడు నేను వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటోని చూపించాను ఇక అమ్మాయి నోటి నుంచి మాట రాలేదు

 

అప్పుడు ఆ  అమ్మాయి నాతో ఇలా అన్నాది అంటే ఏంటి సాయి నువ్వు నన్ను ఫాలో అవుతున్నావు కదా నన్ను నువ్వు అవమానిస్తున్నావు అని తిరిగి నాపై కోపం పడింది నీలాంటి వాళ్లతో మాట్లాడాలంటేనే నాకు చిరాకు వేస్తుంది నిన్ను నేను ప్రేమించడం లేదు అని చెప్పి అక్కడినుంచి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది

 

ఆ మాట చెప్పడంతో నేను ఒక్కసారిగా మనిషిని కాలేకపోయాను నాకు ఇష్టం లేకపోయినా ఆ బాధను మర్చిపోవడానికి రోజు మందు తాగుతూ ఉండేవాడిని నేను ఎప్పుడూ తాగుతూ ఉండటం వలన మా అమ్మానాన్నలు నన్ను చూసి బాధపడుతూ ఉండేవారు నా చుట్టుపక్కల ఉండేవారు నేనేదో తప్పు చేసినట్టుగా నా వైపు చూస్తూ ఉండేవారు

 

ఇక నేను ఉండలేక తిరిగి ఆ అమ్మాయి దగ్గరికి ఒక రోజు వెళ్లాను అను" నువ్వు ఎవరితో ఉన్న నాకు పరవాలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నాతో కలిసి రా అని ఆ అమ్మాయితో చెప్పాను అప్పుడు ఆ అమ్మాయి నువ్వు ఇలా  నా వెంట పడితే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని నాతో చెప్పింది

 

ఆ మాట విన్న వెంటనే నేను ఇక చనిపోవాలని అనుకున్నాను నన్ను ఎంతో ఇష్టపడిన మా అమ్మని ఒక్కసారి చూసి చనిపోవాలని ఇంటికి వెళ్లాను మా అమ్మతో ఒక్కసారి నాతో మాట్లాడమ్మా అని నేను అడిగాను నా మీద కోపంతో ఉన్న మా అమ్మ నాతో మాట్లాడలేదు సరే అనుకుని మా అమ్మని చూశా కదా ఇక చాలు వెళ్లి చనిపోదాం అని అనుకున్నాను వెళ్లే సమయానికి మా అమ్మ నా చేతిని పట్టుకుంది నా చేతిని పట్టుకోగానే ఒక్కసారిగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నాకు ఆకలిగా ఉంది అమ్మ నీ చేతితో అన్నం తినాలని ఉంది అను నేను మా అమ్మని అడిగాను

 

అప్పటివరకు కోపంతో ఉన్న మా అమ్మ నాకు చిన్న పిల్లవాడిలా అన్నం తినిపించింది నేను మా అమ్మ చేతి అన్నం తినగానే అప్పటివరకు నేను పడిన బాధ అంతా ఒక్కసారిగా మర్చిపోయాను సాయి ఇక్కడి నుంచి నా మాట విను రా అని మా అమ్మ ఒక్క మాట చెప్పింది నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారమ్మా నేను చాలా తప్పు చేశాను నిన్ను చాలా బాధ పెట్టాను నీ మాట వింటానమ్మా నన్ను క్షమించు అని మా అమ్మతో నేను అన్నాను

 

ఇక మా అమ్మ చెప్పినట్లుగా ఒక బ్యాంకులో ఆఫీస్ బాయ్ గా జాయిన్ అయ్యాను అలా మూడు నెలలు గడిచిపోయింది నేను సంపాదించిన శాలరీతో మా అమ్మకి ఒక బంగారం గొలుసు కొని గిఫ్ట్ గా ఇచ్చాను అప్పుడు మా అమ్మ కళ్ళల్లో చూసిన ఆనందం నాకు ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకదని నాకు అనిపించింది

 

ఆ రోజు నుంచి నాకు ప్రేమలో ఓడిపోయిన జీవితంలో గెలుస్తాను అని నాకు నమ్మకం వచ్చింది. అమ్మాయి ప్రేమ విషమైతే  అమ్మ ప్రేమ అమృతం లాంటిదని  నాకు అనిపించింది. 

 

 

Story

నరేష్ మజ్జి

Ph no  : 8179523037