Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వినాయక చవితి కథ

భారతదేశంలో అత్యంత ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకునే ప్రధాన పండుగలలో గణేష్  చతుర్థి ఒకటి. ఈ పండుగ వినాయకుని పుట్టినరోజును సూచిస్తుంది. వినాయకుడుని విఘ్న నాయకుడిగా, శుభములను కలిగించేవాడిగా పరిగణిస్తారు. ఈ పండుగను వినాయక చతుర్థి లేదా వినాయక చవితి అని కూడా అంటారు. ఈ రోజుని , హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది, ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ పండగని విస్తృతంగా జరుపుకుంటారు.

గణేష్ చతుర్థి పండుగ మరాఠా పాలనలో మొదలైంది. చత్రపతి శివాజీ మహారాజ్ ఈ పండుగను ప్రారంభించారు. శివుడు మరియు పార్వతి దేవి యొక్క కుమారుడైన గణేశుడు పుట్టిన కథలో నిజం ఉందని అందరి నమ్మకం. అతని పుట్టుకకు సంబంధించిన అనేక కథలు ఉన్నప్పటికీ, చాలాఎక్కువుగా వినబడే కథ – పార్వతీ దేవి గణపతిని సృష్టించింది. ఆమె, శివుడు లేకపోవడంతో, తన గంధపు ముద్దను ఉపయోగించి గణేషుడిని సృష్టించి, తాను స్నానానికి వెళ్ళినప్పుడు కాపలాగా ఉంచింది. ఆమె వెళ్లిన సమయంలో, తన తల్లి ఆజ్ఞ మేరకు గణేశుడు శివుడిని లోపలికి అనుమతించకపోవడంతో, శివుడు అతనితో గొడవ పడ్డాడు. కోపోద్రిక్తుడైన శివుడు గణేశుడి తలను నరికేశాడు.

ఈ దృశ్యాన్ని చూసిన పార్వతీదేవి కోపంతో కాళీ మాత రూపాన్ని ధరించి ప్రపంచాన్ని నాశనం చేస్తానని బెదిరించింది. ఇది అందరి దేవుళ్ళను ఆందోళనకు గురిచేసింది మరియు వారు కాళీమాత యొక్క ఉగ్రతను శాంతింపజేసి పరిష్కారం కనుగొనమని శివుడిని అభ్యర్థించారు.

శివుడు తన అనుచరులందరినీ వెంటనే వెళ్లి, ఉత్తరం వైపుగా తల పెట్టి పడుకున్న ఏ జీవి తలని అయినా తీసుకు రమ్మని ఆదేశించాడు.. అనుచరులకు కనిపించిన మొదటి జీవి ఏనుగు. వారు శివుడి ఆజ్ఞ ప్రకారం ఏనుగు తలను శివుని వద్దకు తీసుకువచ్చారు. శివుడు వెంటనే గణేశుడి శరీరంపై తలను ఉంచి మళ్లీ జీవం పోశాడు. శివుడు వినాయకుడికి ఏనుగు తలని ప్రసాదించి ఇక నుండి ఎక్కడ ఎవరు ఏ పూజ, శుభకార్యాలు నిర్వహించిన ముందుగా శ్రీ గణేశాయ్ నమః అనుకుంటూ ప్రథమంగా వినాయకుడిని పూజించి ఆ తర్వాతే మిగతా పూజలు చేయాలి అని అంతటి ప్రాముఖ్యత వినాయకుడికి శివుడిచ్చిన గొప్ప వరం. 

మాతా పార్వతి కోపం చల్లారింది మరియుదేవతలందరు వినాయకుడిని ఆశీర్వదించారు. ఆ కారణంతో ఈ రోజు వినాయక చతుర్థిని జరుపుకుంటారు.

పండుగకు దాదాపు నెల రోజుల ముందు నుంచే గణేష్ చతుర్థి సన్నాహాలు ప్రారంభమవుతాయి. వేడుకలు దాదాపు పది రోజుల పాటు (భాద్రపద శుద్ధ చతుర్థి నుండి అనంత చతుర్దశి వరకు) జరుగుతాయి. మొదటి రోజు ఇంటిలో మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఇళ్లను పూలతో అలంకరిస్తారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. పూజలు నిర్వహించి భజనలు చేస్తారు. . స్థానికులు పండుగను స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకోవడానికి మండపాలను ఏర్పాటు చేస్తారు మరియు పెద్ద వినాయక విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. ఉత్సవాల చివరి రోజున వినాయకుడి విగ్రహాన్ని వీధుల్లోకి తీసుకొస్తారు. ప్రజలు విగ్రహంతో పాటు వీధుల్లో నృత్యాలు మరియు పాటల రూపంలో తమ ఉత్సాహాన్ని మరియు ఆనందాన్ని ప్రదర్శిస్తారు. విగ్రహాన్ని చివరకు నదిలో లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజు పెద్ద సంఖ్యలో భక్తులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తమ ప్రార్థనలు చేస్తారు.

గణేశ పూజ మన ఇంటిలో మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించడం నుండి ప్రారంభమవుతుంది. నైవేద్యం కోసం వివిధ వంటకాలు వండుతారు. విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయించి , ఆపై పూలతో అలంకరిస్తారు. జ్యోతి వెలిగించి , ఆపై హారతి ప్రారంభమవుతుంది. ఈ సమయంలో వివిధ భజనలు, మంత్రాలు జపిస్తారు. పూర్తి భక్తితో మంత్రాలను పఠించడం వల్ల విగ్రహానికి జీవం వస్తుందని నమ్ముతారు. 

ఈ కాలంలో గణేశుడు తన భక్తుల ఇంటిని సందర్శిస్తాడని మరియు అతనితో శ్రేయస్సు మరియు అదృష్టాన్ని తీసుకువస్తాడని కూడా నమ్ముతారు. అదే కారణంతో ఆ రోజును చాలా పవిత్రమైన రోజుగా పాటిస్తారు. గణపతి యంత్రాన్ని పూజించడం వల్ల జీవితంలో గొప్ప విజయాలు లభిస్తాయి. 

పూజ సమయంలో గణేశుడికి పెద్ద సంఖ్యలో స్వీట్లు సమర్పించినప్పటికీ, మోదక్ , ఉండ్రాళ్ళ పాయసం స్వామికి ఇష్టమైన తీపిగా ప్రసిద్ధి చెందింది మరియు ఈ రోజున చేసే ప్రధాన వంటలలో ఇవి చాలా ముఖ్యమైనవి.

"నీతి | Moral : వినాయకుని గురించి నేర్చుకోవాల్సిన నీతి వాఖ్యాలు :

పెద్ద తల  పెద్దగా ఆలోచించి సరైన నిర్ణయాలను తీసుకోవడానికి సూచన.

చిన్న కళ్లు అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి సూచన.

చిన్న నోరు అవసరానికి తగినంత మాట్లాడడానికి సూచన.

పెద్ద చెవులు – అన్ని మాటలను వినండి, అనవసరమైన వాటిని విస్మరించండి.

విరిగిన దంతం – వ్యతిరేకతలను అధిగమించండి.

పెద్ద పొట్ట – మంచి మరియు చెడు అన్ని విషయాలను జీర్ణించుకోవడానికి.

లడ్డూలు – విజయానికి బహుమతి.

చిన్న మూషికం – మనకున్న కోరికలకు చిహ్నం. కోరికలను మనం నడిపించాలి కానీ కోరికలు మనల్ని నడిపించకూడదు.

ఒక కాలు ముడుచుకొని మరియు నేలపై ఒక కాలు – ప్రపంచాన్ని మరియు దాని ఆనందాలను అనుభవిస్తున్నప్పుడు, నిర్లిప్తంగా ఉండాలి మరియు నిరంతరం తన అంతరంగాన్ని వెతకాలి.

అభయ ముద్ర – అందరిని బుద్ధి, ఆశ్రయం మరియు రక్షణ ఉండేలా అనుగ్రహించడం."