Read One day by Dasari Dasari in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

రోజూ

ఒక మధ్యతరగతి వ్యక్తి రోజులో చేసే ఆలోచనలు ఆచరణలు త్యాగాలు సంతోషాలకు నిదర్శనం ఈ రోజు కథ.
భారత్ ఊరు వదిలి బెంగళూర్ లో బ్రతుకు తెరువు కోసం డెలివరీ బాయ్ గా పనిచేస్తూ ఉంటాడు.భారత్ తన భార్య, కొడుకుతో ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటారు.
భారత్ ఉదయం 4:30 నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని 5:00 గంటలకి తన స్ప్లెండర్ ప్లస్ బైక్ లో తన డెలివరీ హబ్(నిత్యవసర సరుకులు డెలివరీ చేయుస్తలం)కి చేరుకుంటాడు.వెళ్ళగానే అక్కడ టీ లేదా కాఫీ ఇస్తారు భారత్ కి కాఫీ ఇష్టం అది తాగుతూ డెలివరీ ఏ ఏరియాకి ఇస్తారో ఎన్ని ఆర్డర్స్ ఇస్తారో అని ఆలోచిస్తూ వెళ్లి పేరు నమోదు చేయిస్తాడు.5:30 కి ఆర్డర్స్ అసైన్ చేస్తారు. ఆర్డర్స్ కాఫీ తీసుకొని ఎది మొదట ఇవ్వాలి ఎది సెకండ్ ఇవ్వాలి అని ప్లాన్ చేసుకొని తన ఆర్డర్స్ లిస్ట్ మొత్తం ఒకసారి తన బ్యాగ్స్ లో ఉన్నాయా లేదా సరి చేసుకొని తన బ్యాగ్స్ తన బైక్ కి తగిలించి బయలుదేరుతాడు.దారిలో వెళ్తూ ఉన్నపుడే భారత్ వాళ్ళ భార్య ఫోన్ చేస్తుంది కాల్ ని బ్లూటూత్ లో అటెండ్ చెయ్యగానే పాలకి డబ్బులు ఎక్కడ పెట్టవు అడుగుతుంది.భారత్ ఫ్రిడ్జ్ కవర్ లో 200 పెట్ట అంటాడు.అలాగే బాబుకి డైపర్స్ హార్లిక్స్ అయిపోయాయి సాయత్రం తీసుకు రా.భారత్ ఓకే తెస్తలే అని చిరాకుగా కట్ చేసి ఫస్ట్ డెలివరీ కి వెళ్లి కస్టమర్ కి కాల్ చేస్తాడు కస్టమర్ కాల్ రిసీవ్ చెయ్యదు సెక్యూరిటీ లోపలకి పంపాడు చిరాకుగా 5 నిమిషాలు తరువాత చేస్తాడు కస్టమర్ రిసీవ్ చేస్తుంది.కస్టమర్ ఫ్లాట్ కి వెళ్లి డోర్ బెల్ కొట్టగానే వచ్చి ఆర్డర్ లో ఉన్నవి చెక్ చేసి ఏదో ఒకటి బాగాలేదు అని రిటర్న్ చేస్తుంది.ఆ ప్రొడక్ కి రేటన్ చేసి నెక్స్ట్ డెలివరీ చేస్తాడు అది తొందరగా అయిపోతుంది.అల మెజ్ మిగిలినవి కూడా కాస్త అటు ఇటు 8 అల్ల కంప్లీట్ చేస్తాడు.తిరిగి తొందరగా హబ్ కి తిరిగి వచ్చి టిఫిన్ చెయ్యడానికి క్యాంటీన్ కి వెళ్తాడు.అక్కడ 15 రూపాయలకు టిఫిన్ తిని తోంగరగ వెళ్లి లాగ్ బుక్ లో పేరు నమోదు చేస్తాడు.తిరిగి యధావిధిగా ఆర్డర్స్ అసైన్ చేశారు అవి తీసుకొని చెక్కు చేసుకొని బ్యాగ్స్ తీసుకొని బయలుదేరుతాడు.అప్పుడే తిరిగి భార్య ఫోన్ బ్లూటూత్ రిసీవ్ చెయ్యగానే తిన్నావా అని అడిగింది.తిన్న అని భార్యని కూడా తిన్నావా అని అడగకుండానే బయలుదేరుతాడు.ఆ టైమ్ లో ట్రాఫిక్ హెవీ గా ఉంటుంది.ఆ ట్రాఫిక్ లో చిరాకు పడుతూ ఆ స్లాట్ లోని ఆర్డర్స్ నీ 11 గంటలకు అంత కంప్లీట్ చేసి రిటర్న్ అవుతాడు.తిరిగి వచ్చి లాగ్ బుక్ లో పేరు నమోదు చేసి క్యాషియర్ దగ్గరకు వెళ్ళి క్యాష్ నీ డిపాజిట్ చేసి స్లాట్ కి వెయిట్ చేస్తాడు.వెళ్లి క్యాంటీన్ లో 15 రూపాయల లంచ్ చేస్తాడు .ఆ టైమ్ లో ఆర్డర్స్ తక్కువ గా ఉంటాయి.2 గంటల స్లాట్ దొరుకుతుంది.అవి తీసుకొని ఆ ఆర్డర్స్ ముగుంచి రిటర్న్ వచ్చేసరికిn.mj 4:30 అవుతుంది.తిరిగి వచ్చి లాగ్ బుక్ లో తిరిగి పేరు నమోదు చేసి స్లాట్ కి వెయిట్ చేస్తాడు.6గంటల స్లాట్ తీసుకొని హెవీ ట్రాఫిక్ లో చిరాకుగా వెళ్లి డెలివరీ చేసి హబ్ కి రిటర్న్ వచ్చేటప్పుడు భార్యా ఫోన్ డైపర్స్ హోర్లిక్స్ గుర్తు చెయ్యడానికి చిరాకుగా హబ్ కి వస్తాడు.హబ్ లో లాగ్ బుక్ లో పేర్లు చెక్ చేస్తాడు తక్కువ ఉంటే తిరిగి 10 గంటల స్లాట్ కి పేరు నమోదు చేస్తాడు.లేదంటే ఇంటికి రిటర్న్ వెల్లేసమయంలో భార్య చెప్పినవి తక్కువగా(హార్లక్స్ చిన్న డబ్బా డైపర్స్ చిన్న పాకెట్)ఉన్నవి తీసుకొని పర్స్ లో మరియు ఫోన్ పే లో డబ్బులు చెక్ చేసుకొని దానికి తగ్గాయి మనస్సులోనే ప్లాన్స్ వేసుకొంటూ ఇంటికి వెళ్లగానే కొడుకు నాన్న అంటూ వచ్చి మీద ఎక్కుతాడు దానితో పొద్దున నుంచి పడిని శ్రమ మొత్తం మరిచి కొడుకుతో కలిసి భోజనం చేసి భార్య భారత్ కొడుకు కబుర్లు చెప్పుకొంటూ కొడుకు భవిష్యత్తు గురించి కలలు కంటి ముగ్గురు హాయిగా నిద్ర పోతారు.

ఇలా రోజు కష్టపడుతూ జీవితాన్ని కష్టం లోనే సుఖం గా జీవితం సాగిస్తాడు ఒక మధ్య తరగతి బాధ్యత కలిగిన కుర్రాడు.

రోజూ అనేది వర్షాకాలం లో అయితే చాలా దుర్భరంగా ఉంటుంది వర్షం లో తడుస్తూ ఆర్డర్స్ డెలివరీ చేస్తాడు.చలికాలంలో అయితే ఉదయం చలిలో వణుకుతూ.అలాగే నెల మొదట్లో ఐతే అద్దె కట్టలనే, ఇంటికి నెలకు సరిపడా కావలసిన సరుకులు తేవాలనే ఆలోచనలతో ,నెల మద్యలో చిట్టిలు కట్టాలనే ఆలోచనలతో, నెలాఖరున అయితే కర్చలకు డబ్బులు లేఖ అప్పుల కోసం ఆలోచిస్తూ,మనది కాని ఒక నగరం జీవితం సాగిస్తారు మధ్యతరగతి ఆత్మాభిమానం తో జీవించాలి అనుకునే యువత.

ఇలా కష్టపడే చాలా మంది యువత జీవితాలలో మార్పులు వచ్చి సుఖంగా ఉండాలి అంటూ కోరుకుంటూ మీ DASARI



ఓం సాయి రామ్