Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమాధ్యంతం - 1

"యు బ్లేడీ!! నా ఊరికోచ్చి, నా సామ్రాజ్యంలోని రహస్యాలని అమ్మేయ్యాలని చూస్తావా?? "... గొంతు పట్టి ఒక్క ఉదుటున విసురుతాడు.

ఐదు అడుగుల దూరంలో గాల్లో ఎగురుతు వెళ్లి కింద పడి గొంతు మీద చెయ్యేసి దగ్గుతున్న అతన్ని విసురుగా చేరి కాలు లేపి తన్నేవాడు కాస్త మరుక్షణం దవడలు బిగించి అలానే ఉండిపోతాడు.

రక్తవర్ణాన్ని తలపించే అతని కళ్ళు, నరసింహాస్వామి ఉగ్రాన్ని చూపిస్తున్న అతని మోము, పిడికిలి బిగించి, ఆవేశంగా ఉన్న సింహం గాయం రుచి చూస్తే వచ్చే గర్జన శ్వాస..

అక్కడంత నిశ్శబ్దం.

ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్న ఆ కొండప్రాంతం ఒక్కసారిగా స్మశాన నిశ్శబ్దన్ని పలికిస్తుంది.
వందల మంది కొండజాతి జనుల సమక్షంలో ఆర్భాటంగా అవమానిస్తుంది అతన్ని ఓ అడవి తల్లి అందమైన కూన.

అతని చెంప మీద పడిన చేతి వేళ్ళ అచ్చులు బహుశా అతనిలో మగాడి అహంకారాన్ని నిద్రలేపాయేమో...??

ఒక్క ఉదుటున అతని పక్కనే భయంతో బిగుసుకుపోయిన ఆమె చేతిని పట్టుకొని లాక్కేలుతున్నాడు.

విశ్వప్రయత్నలు చేస్తున్న ఆమె చర్యలకి విసుగు పెరిగి కార్ కి అదిమి రౌద్రంగా చూస్తాడు ఆమెని.

దీనంగా చూస్తున్న ఆ తేనె కళ్ళు అతనిలో అలజడిని సృష్టిస్తుంటే పళ్ళు నూరుతూ ఆమె గొంతుని అతని పిడికిల్లో నలపడానికి సిద్ధపడుతాడు.

ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమెని చూస్తున్న అతని మనసు ప్రశాంతంగా మారుతుంటే మరుక్షణం అతని సన్నని పెదవుల్లో నిలుస్తుంది ఓ రాక్షస నవ్వు.

విసురుగా తనని లాగి ఆ తండాలో అందరి వైపు చూస్తూ గింజకుంటున్న ఆ అమ్మాయిని దగ్గరికి లాక్కొని ఒక్క చూపు చూస్తాడు అతను.

అదే సమయంలో అక్కడికి చేరిన ఇద్దరు దంపతులు అతని ముందు మోకాళ్ళ మీద కూర్చొని చేతులెత్తి మొక్కుతూ...

"దయచేసి నా కూతురిని వదిలేయండి దొర, తెలియక చేసిన తప్పు అని మన్నించు దొర"... అని ఏడుస్తూ ప్రాధేయపడుతుంటే సైడ్ స్మైల్ తో చూస్తూ అలానే నిలబడి చూస్తుంటాడు అతను.

"సర్!! వీ హావ్ టూ మూవ్"... అన్న సెక్యూరిటీ మాటకి హెడ్ నోడ్ చేసి ఆ అమ్మాయి చేతి మణికట్టు మీద మరింత పట్టు బిగించి...

"ఇట్స్ టూ లేట్, చేసిన తప్పుకి శిక్షని అనుభవించాకే ఇది ఈ మట్టిలో అడుగు పెడుతుంది"... అని వెనక్కి తిరిగి కార్ డోర్ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని అందులోకి తోసి డోర్ లాక్ చేస్తాడు అతను.

"దొర, దొర... మీ కాళ్లు పట్టుకుంటాను దొర, చిన్నపిల్ల దొర, వదిలేయండి"... అంటూ అతన్ని అడుగు కూడా వేయనివ్వకుండా కాళ్లు పట్టుకున్న వాళ్లిద్దరిని ఒక్కసారిగా విధిలించి వేలు చూపిస్తాడు.

"ఇక్కడ అందరూ చూస్తుండగానే అది నా మీద చేయి చేసుకుంది కదా? ఇందుకు మూల్యం చెల్లించాలి కదా?
అది చేసిన తప్పుకి శిక్ష అనుభవించి ఇక్కడికి వస్తుందో? లేదా నన్ను అవమానించిన దాని పొగరుతో ఈ మట్టిలోనే సమాధి అవుతుందో చూస్తూ ఉండండి"... అని తండాలో అందరి వైపు వాడిగా చూస్తూ కార్ లో కూర్చుంటాడు అతను.

కార్ లోపల అమ్మాయి ఆ డోర్ ఓపెన్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ ఏడుస్తుంటే కార్ స్టార్ట్ చేయమన్నట్టు సైగ చేస్తాడు డ్రైవర్ కి.

అతని రౌద్రమైన మోము చూసి ఏదో చెప్పాలి అనుకునేవాడు కాస్త గొంతులో మాట బయటికి రాకపోతుంటే గుండె వేగంగా కొట్టుకుంటున్న లెక్క చేయక వణుకుతున్న చేతులతో కార్ స్టార్ట్ చేస్తాడు అతను.

చిన్నగా ముందుకు కదులుతున్న కార్ లోంచి తన తల్లి, తండ్రిని చూసి ఆ కార్ అద్దం మీద తడుతూ ఏడుస్తుంటే, కార్ లోపల కనిపించని తన కూతురిని ఆఖరి చూపు కూడా చూసుకోలేక గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంటారు ఆ దంపతులు.

"రాథోడ్" తో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసిందిగా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన పని చేయండి"... అని బేస్ వాయిస్ లో చెప్పి అక్కడి నుండి తమ కార్స్ లో వెళ్ళిపోతాడు 'స్టీఫెన్'... రాథోడ్ సెక్యూరిటీ చీఫ్.

వారి బాధని చూసి ఆ ప్రకృతి కూడా రోధించిందేమో.. అప్పుడే చిన్నగా మొదలవుతుంటాయి వర్షపు చినుకులు.

ఏడుస్తున్న ఆ తండ్రి అరచేతుల్లో ఒక్కొక్కటిగా నిలుస్తున్న ఆ చినుకులని చూస్తుంటే...

"నాన్న... ఈ వర్షానికి నేనంటే చాలా ఇష్టం అనుకుంట కదా, ఇలా తలుచుకోగానే అలా నా దగ్గరికి వచ్చి నన్ను కౌగిలించుకుంటుంది"... అని ఎంతో సంతోషంగా నెమలిలా వర్షంలో నాట్యం చేస్తూ అంటున్న తన కూతురు గుర్తొచ్చి అరచేతిని మొఖానికి పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు ఆ తండ్రి.

* ఓ సంఘటన ఒకరిలో కొత్త పులకింతని పుట్టిస్తే..
* అదే సంఘటన మరొకరిలో ఎన్నో తట్టుకోలేని సవాళ్ళని సృష్టిస్తుంది.

తెలిసి తెలియని తనంలో తల్లి, తండ్రికి దూరమైన ఆ అమ్మాయి జీవిత గమ్యం.. తీసుకెళ్లిన అతనో?... తిరిగి తీసుకోచ్చే వెరెవరో?

ఇంకా ఉంది🥀...

మీ అభిప్రాయం చెప్పడం మరవకండి💖..