Love Affair - 3 books and stories free download online pdf in Telugu

ప్రేమాధ్యంతం - 3

తన కన్నీళ్లు సున్నితంగా తుడుస్తున్న ఆ చేతిని అలానే పట్టుకొని నుదురుకి ఆణించుకుంటుంది కోమలి.

ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న తనని దగ్గరికి తీసుకొని వెన్ను నిమురుతుంటే తన అత్తయ్య గుండెల్లో ఒదిగిపోయి మరింతగా రోదిస్తుంది కోమలి మనసు.

"మళ్ళీ చెప్తున్నాను బంగారం, ఇక్కడి నుండి ఎలాగైనా తప్పిస్తాను, వెళ్ళిపోరా?"... అని బాధగా అడుగుతున్న మాళవిక గారి మాటకి అడ్డంగా తల ఊపుతుంది.

మరు నిమిషం కోమలి చెంప మీద చిన్నగా కొట్టి కోపంగా కన్నీళ్లు పెట్టుకుంటుంటే తన అత్తయ్య కన్నీళ్లు తుడుస్తూ బలవంతంగా నవ్వుతుంది.

"ఎందుకే.. ఎందుకే ఇలా ప్రతిసారి మొండిగా ప్రవర్తిస్తావు? ఇంటిల్లిపాది నీకు సహాయం చేస్తాం అంటుంటే నువ్వెందుకే ఇక్కడే ఉంటే వాడి రాక్షసత్వానికి బలి అవ్వాలి అని అనుకుంటున్నావు?....

మరింత స్వచ్ఛంగా నవ్వుతు తన మెడలో ఉన్న ఎర్ర దారాన్ని చూపిస్తుంది కోమలి.

అసహనంగా మారిపోతారు మాళవిక గారు.

"అది తాళి అని నువ్వు అనుకున్నా, నిన్ను వాడికి బానిసగా మార్చుకున్న బలి తాడే అది, దానికి విలువ ఇస్తూ నీ విలువ తగ్గించుకోవడం ఎంతవరకు సమంజసం?"...

"ఏయ్"...

రాథోడ్ గదిలో నుండి వచ్చిన అరుపులాంటి పిలుపుకి క్షణాల్లో లేచి మెరుపు తీగల మాయం అవుతుంది కోమలి.

"భగవంతుడా!! నీ సన్నిధిలో నీ రక్షదారన్నే వాడి చేతులతో నా కోడలి మెడలో చేర్చి సంతోషాలు అందించాల్సింది పోయి ఇలాంటి నరకాన్ని ఇచ్చావు ఏంటి స్వామి".. అని దీనంగా అనుకుంటూ అక్కడి నుండి కిందకి వెళ్ళిపోతారు మాళవిక గారు.

రాథోడ్ పిలుపుకి భయంగానే గదిలోకి వెళ్తుంది కోమలి.

అప్పటికే అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతే మౌనంగా అతనికి కావాల్సిన థింగ్స్ అన్నీ బెడ్ మీద అరెంజ్ చేసి మొబైల్, లాప్టాప్ ఛార్జింగ్ నుండి తీసి బ్యాగ్ లో పెడుతూ తన తల్లి తండ్రి గురించి ఆలోచిస్తూ ఉండిపోతుంది.

పావుగంట తరువాత ఫ్రెష్ అయ్యి వచ్చిన రాథోడ్ కి చేతిలో లాప్టాప్ బ్యాగ్ పట్టుకొని ఏటో చూస్తూ ఆలోచిస్తున్న కోమలి కనిపించి కళ్ళు చిన్నవి చేసి చూస్తూ తనని చేరుతాడు.

ప్రతిసారి అతను అరకిలోమీటర్ దూరంలో ఉన్నా కూడా బెదిరి అలెర్ట్ గా ఉండే తను ఇప్పుడు అర అంగుళం దూరంలో ఉన్నా కనీసం అతని ప్రెసెన్స్ గుర్తించకపోతుంటే పళ్ళు బిగించి కోపంగా చూస్తుంటాడు రాథోడ్.

సెకండ్స్ నిముషాలుగా మారి అతనిలో సహనాన్ని పూర్తిగా చంపేసే ఆఖరి క్షణంలో కోమలిలో కదలిక.

విరక్తిగా నవ్వుతు చేతిలో బ్యాగ్ అక్కడే టిపాయ్ మీద పెట్టి వెనక్కి తిరిగిన కోమలికి తన రాక్షసుడు తనని చంపేసేలా చూస్తుంటే ఉలిక్కిపడి రెండడుగులు వెనక్కి వేస్తుంది.

"ఎక్కడ ఆలోచిస్తున్నావు?"... రాథోడ్ అడుగులు ముందుకు పడతాయి అడిగే సమయంలో.

"క్ష.. క్షమించండి, దయచేసి క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను!!"... భయంతో రెండు చేతులు జోడించి వణుకుతున్న గొంతుతో అంటుంటే రాథోడ్ లో రాక్షసుడు శాంతంగా మారిపోతుంటాడు.

స్వచ్ఛంగా ముత్యాంలా మెరిసే కళ్ళు, సన్నని ముక్కు, బెదురుగా వణుకుతూ ముడుచుకుపోయే లేత గులాబీ రంగు పెదాలు, ఆ పెదాల కింద వాలుగా ఉన్న గడ్డానికి త్రిభుజాకారంలో ఉండే మూడు నల్లని చుక్కలు.

శంఖం లాంటి మెడని ఒక నల్లని దారంతో ఉన్న తాయోత్తు అలంకరిస్తే, దాని కిందే రాథోడ్ కట్టిన ఎర్రటి రాక్షధారం రంగు వెరిసి కనిపిస్తుంది.

బుగ్గల మీదకి ఆగకుండా జారుతున్న కన్నీటిని చూపుడు వేలితో తుడుస్తూ మరో అడుగు ముందుకేస్తాడు రాథోడ్.

ఆరున్నర అడుగుల అతని ఎత్తుకి కోమలి అతని గుండె వరకు కూడా రాదూ.


సిక్స్ ప్యాక్ బాడీ తో, ఫిట్ అండ్ ఫైన్ అబ్స్ తో సింహం నడుములా కనిపించే అతని బలిష్టమైన శరీర సౌష్టవానికే భయం పుట్టేలా ఉంటుంది చూసేవారికి.

అతని నల్లని కళ్ళల్లో ఎల్లప్పుడూ నిలిచే కోపాన్ని ఆపే ఒకే ఒక మంత్రం... కోమలి కన్నీళ్లు.

క్లీన్ షేవ్ తో, కోరమీసాన్ని మెలితిప్పినట్టుగా ఉండే అతని ఆహర్యం అమ్మాయిల హృదయాల్లో వలపు బాణాలు గుచ్చుతుంది.

రాథోడ్ తన కన్నీళ్లు తుడుస్తుంటే చప్పున కళ్ళు మూసుకొని కన్నీళ్లు ఆపుకుంటుంది కోమలి.

వణుకుతూ గోడకి అతుక్కుపోయిన కోమలికి దగ్గరగా చేరి ఓ చేతిని ఆమె మెడ పక్కనే గోడకి ఆనించి సూటిగా చూస్తుంటే కోమలి గుండె వేగం రాథోడ్ చెవులకి స్పష్టంగా వినిపించేలా కొట్టుకుంటుంది.

"ఇది చాలా రితమిక్ గా కొట్టుక్కోవాలి కదా కోమలి, మరేంటి మ్యూజిక్ మిస్ అవుతుంది"... చిన్నగా అడుగుతూ కాస్త తల వంచి కోమలి గుండె మీద చెవిని ఆనిస్తాడు రాథోడ్.

అప్పుడే స్నానం చేసినందున అతని బాడీ నుండి మత్తు ఎక్కించే పరిమళం కోమలి ముక్కు పూటలని తాకూతుంటే ఆమె శరీరంలో జరిగే మార్పులు తెలియక కాళ్లు దగ్గరికి చేసుకొని, చేతులు బిగించి కళ్ళు మూసుకుంటుంది.

ఆమె హృదయం మీదున్న తన నెమ్మదిగా కదులుతు కోమలి మెడ వంపుల్లోకి చేరగానే అప్రయత్నంగా వదులు అవుతాయి కోమలి చేతులు.

"హోల్డ్ మీ!!"...

కమాండింగ్ గా వచ్చిన అతని గొంతుకి క్షణం ఆలస్యం చేయకుండా రాథోడ్ నడుము చుట్టూ చేతులు వేసి గజగజ వణుకుతూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది.

... ఇంకా ఉంది 💖..

వాట్ నెక్స్ట్ గయ్స్ 😉..