Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

బాంబే బిలియనీర్ మిస్సింగ్

ముందు మాట

            ముంబైలో ఒక పెద్ద వ్యాపారవేత్త మరియు చాలా ధనవంతుడు పది సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. అసలు ఆయన ఏమయ్యారు. కిడ్నాప్ అయ్యారా లేక ఎవరైనా చంపేశారా, ఎవరికి తెలియదు. ఆయన భార్య, పిల్లలు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎవరైనా ఆచూకీ చెబితే వాళ్లకు తగిన బహుమతి అందజేస్తామని చెబుతున్నారు.

ఆయన ఎక్కడికి వెళ్లారు, తిరిగి తన కుటుంబాన్ని కలుసుకున్నారా లేదా? అని తెలియాలంటే ఈ కథ పూర్తిగా చదవాల్సిందే.

 

కథా క్రమం

 

1. బిలియనీర్ ఫోటో చూసిన తిలక్                           

2. అరకు టూర్                                                   

3. బిలియనీర్ ని కలిసిన తిలక్                                

4. బిలియనీర్ తో సంబాషణ                                    

5. కుటుంబాన్ని కలిసిన బిలియనీర్         

 

బిలియనీర్ ఫోటో చూసిన తిలక్

          నా పేరు తిలక్. నేను ఇటీవలే జర్నలిజం కోర్సు పూర్తి చేసి, ఒక పెద్ద న్యూస్ చానల్ లో ట్రైనీ గా జాయిన్ అయ్యాను. నాకు చిన్నప్పటినుండి ఏదైనా విషయాన్ని తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. అందుకే ఈ వృత్తిని ఎంచుకున్నా. నాకు బుక్స్, ఆర్టికల్స్, చదవడం అంటే చాలా ఇష్టం. నాకు మన ప్రాంతంలో జరిగే న్యూస్ ఒక్కటే కాకుండా, ఎక్కడైనా ట్రెండింగ్ లో ఉన్న న్యూస్ ని ఫాలో అయ్యి దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం అంటే ఇష్టం.

         ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆరు నెలలు అయ్యింది. ట్రైనింగ్ లో భాగంగా నేను వేరే చోటకు వెళ్ళవలసి వచ్చింది. ఏకంగా వేరే రాష్ట్రమే. మహారాష్ట్రలోని పూణే హెడ్ ఆఫీస్ లో ఒక నెల ట్రైనింగ్ కి వెళ్ళమన్నారు. అంత దూరం అయితే నావల్ల కాదు అని హెచ్ ఆర్ కి చెప్పేసాను. కానీ అక్కడ తినడానికి, ఉండటానికి అన్ని సదుపాయాలు కంపెనీయే చూసుకుంటుందని చెప్పారు. సరే ఒక నెలే కదా అని, అక్కడ చుట్టుపక్కల ఏవైనా టూరిజం ప్లేసెస్ ఉంటే చూసేయొచ్చు అని ఓకే చెప్పాను.

         ఒక వారంలో పూణే చేరుకున్నాను. అక్కడ అంతా కొత్తగా ఉంది. ట్రైనింగ్ లో ఒక సార్ పరిచయం అయ్యారు. ఆయన కూడా మన ఏరియా నుండి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. ఆయన పేరు సురేష్. వారం రోజులు గడిచాయి. సురేష్ గారు నాతో బాగా క్లోజ్ గా మాట్లాడుతారు. ఒకరోజు నా హాబీస్ ఏమిటని అడిగారు. బుక్స్ చదవడం, ఆర్టికల్స్ చదవడం అని చెప్పాను. తర్వాత రోజు ఒక పాత ఇంగ్లీష్ ఆర్టికల్ తెచ్చి నాకు ఇచ్చారు. అది 10 సంవత్సరాల క్రితం ఆర్టికల్ అని, నీకు బాగా నచ్చుతుందని చెప్పి ఇచ్చారు. ఆర్టికల్ పేరు " బాంబే బిలియనీర్ మిస్సింగ్" అని ఉంది. ముంబైలో ఒక పెద్ద వ్యాపారవేత్త మరియు చాలా ధనవంతుడు 10 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. అసలు ఆయన ఏమయ్యారు. కిడ్నాప్ అయ్యారా లేక ఎవరైనా చంపేశారా, ఎవరికి తెలియదు. ఆ రోజుల్లో ఇది ఒక ట్రెండింగ్ న్యూస్. ఆరు నెలల తర్వాత పోలీసులు, మీడియా అందరూ కూడా ఈ విషయాన్ని మర్చిపోయారు, ఒక్క ఆ కుటుంబ సభ్యులు తప్ప. ఇప్పటికీ ఆయన భార్య, పిల్లలు ఆయన కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎవరైనా ఆచూకీ చెబితే వాళ్లకు తగిన బహుమతి అందజేస్తామని చెబుతున్నారు. ఆర్టికల్ అంతా అయిపోయాక చివరిలో ఒక ఫోటో వేశారు. ఎవరి ఫోటో అని చూసా, ఒక్కసారిగా షాక్ అయ్యా. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను బయట చూశాను. అంతేకాకుండా ఆయనను కలిసి మాట్లాడాను కూడా. ఆయనతో దిగిన ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంతకీ ఆయన అందరినీ వదిలేసి అంత దూరంగా, ఒంటరిగా ఉంటున్నారనే సందేహం నన్ను వెంటాడుతూ ఉంది. నేను ఆయన్ని ఎక్కడ, ఎలా కలిశానంటే ....

అరకు టూర్

           నేను నా కాలేజ్ రోజుల్లో వెళ్లిన టూర్ గురించి మీకు చెప్పాలి. జర్నలిజం కోర్సు చేస్తున్న సమయంలో ఫ్రెండ్స్ అందరూ టూర్ కి వెళ్దాం అన్నారు. ఒక్కొక్కరూ ఒక్కో ప్లేస్ సజెస్ట్ చేశారు. ఎక్కువమంది అరకు లోయ వెళ్దాం అన్నారు. వారం రోజుల ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. మేము మొత్తం ఐదు మంది. వైజాగ్ వరకు ట్రైన్ లో వెళ్ళాం. అక్కడి నుండి ఫ్రెండ్ కార్ లో వెళ్ళాం. మాలో ఇద్దరూ అరకు ఇంతకుముందు వచ్చిన వాళ్లే. నాకైతే ఇదే మొదటిసారి. ఫస్ట్ టూ డేస్ చుట్టుపక్కల చాలా వరకు కవర్ చేసేసాం. అందరం కలిసి ఒక ప్లాన్ చేశాం. అదేంటంటే అరకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ను మిగిలిన ఐదు రోజుల్లో చూద్దాం అనుకున్నాం. చిన్న వలస అనే విలేజ్ కి వెళ్దాం అని అనుకున్నాం. అనుకున్నట్లుగానే తరువాత రోజు ఉదయాన్నే బయల్దేరాము. 

           ఆ ఊరికి వెళ్లడానికి మూడు గంటలు పట్టింది. మధ్యాహ్నం వరకు కొన్ని చోట్ల తిరిగాం. అక్కడ తినడానికి సరైనా హోటల్స్ కూడా లేవు. స్టే చేయడానికి రూమ్స్ కోసం వెతికాము. ఎటువంటి హోటల్స్ కానీ లాడ్జెస్ కానీ ఏవి లేవు. ఇక్కడ ఉండడానికి ఏవైనా సదుపాయాలు ఉంటాయా అని చుట్టుపక్కల వారిని అడిగాం. ఏమి లేవన్నారు. ఇంతలో ఒక పెద్దాయన "మీకు ఒక ఇల్లు చూపిస్తా, అక్కడ రావు గారు అని ఉంటారు. ఆయనొక్కరే ఆ ఇంట్లో ఉంటారు. చాలా మంచి మనిషి. ఒక్కసారి ఆయన్ని అడిగి చూడండి" అని మాకు ఇల్లు చూపించారు. రావు గారు ఒప్పుకుంటారో లేదో అనే సందేహంతో ఇంటి దగ్గరకు వెళ్ళాము. చిన్న ఇల్లు, చుట్టుపక్కల అంతా పచ్చదనం. ఆ ఇంటి వాతావరణం చాలా బాగుంది. గేటు తీసి లోపలికి వెళ్ళాం, రావు గారు అంటూ పిలిచాం. ఇంతలో ఒక్క పెద్దాయన మా ముందుకు వచ్చారు. ఏం కావాలి బాబు అని అడిగారు. రావు గారి తో మాట్లాడాలి అని అన్నాను. నేనే రావుని చెప్పండి అన్నారు. మేము అరకు చూడ్డానికి వచ్చాము. ఇక్కడి పల్లెలు ఎలా ఉంటాయో చూద్దామని ఇంతదూరం వచ్చాం. ఇక్కడ ఎటువంటి రూమ్స్ కాని, హోటల్ కానీ లేవు. ఊరిలో అడిగితే కొంతమంది మీ పేరు చెప్పి, మీ ఇల్లు చూపించారు. అందుకే మిమ్మల్ని అడగటానికి వచ్చాం. ఏదైనా చిన్న రూమ్ ఉన్న మేము అడ్జస్ట్ అయిపోతాం. ఇంతలో ఆయన “మీరు ఎంతమంది, ఎన్ని రోజులు ఉంటారు అని అడిగారు". మేము ఐదుగురం, అందరం జర్నలిజం చదువుతున్నాం. వన్ వీక్ ప్లాన్ చేసుకున్నాం. రెండు రోజులు అయిపోయాయి, ఇంకా ఐదు రోజులు ఉన్నాయి. మీరు ఒప్పుకుంటే అయిదు రోజులు ఇక్కడ చూసి వెళ్తాం. రావు గారు వెంటనే సరే అన్నారు. భోజనానికి కూడా ఎక్కడికి వెళ్ళనవసరం లేదని, ఇక్కడే చెయ్యమని చెప్పారు. మేమైతే చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాం. నాలుగు రోజులు చూస్తూ చూస్తూ ఇట్టె గడిచిపోయాయి. ఐదవ రోజు రావు గారు మాతో కూర్చుని చాలాసేపు మాట్లాడారు. ఒక్కొక్కరిని ఫ్యూచర్ లో ఏమి చేయాలనుకుంటున్నారని, ఫ్యామిలీ కండిషన్స్ గురించి, కాలేజ్ విశేషాలు అన్ని అడిగి తెలుసుకున్నారు. ఆ క్లోజ్ నెస్ తో మేము కూడా ఆయన ఏమి చేసేవారని, ఆయన ఫ్యామిలీ గురించి అడిగాం. ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగం చేసేవారని, రిటైర్మెంట్ ఏజ్ కంటే ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఇక్కడ సెటిల్ అయిపోయారని చెప్పారు. ఇక ఆయన పెళ్లి చేసుకోలేదని, ఫ్యామిలీ ఎవరు లేరని చెప్పారు. చివరగా మేము బయలుదేరే ముందు ఆయనతో గ్రూప్ ఫోటో కోసం ఆయన్ని రిక్వెస్ట్ చేసాం. మొదట కాదన్నారు, కానీ చివరకు మా ఒత్తిడి వల్ల ఒప్పుకుని, మాతో ఫోటోలు దిగారు. చివరగా ఆయనకు ధన్యవాదాలు చెప్పి మేము బయల్దేరాము.

           ఆ విధంగా నేను ఆయన్ని కలిసాను. కానీ ఆర్టికల్ లో ఉన్నదానికి, అక్కడ నేను చూసిన వ్యక్తికి చాలా తేడా ఉంది. నేనే నమ్మలేకపోతున్నాను. నాలో కొత్త కొత్త సందేహాలు మొదలయ్యాయి, ఆయన అక్కడ ఎందుకు ఒంటరిగా ఉంటున్నారో తెలుసుకోవాలని ఉంది. 

 

బిలియనీర్ ని కలిసిన తిలక్

          ఆర్టికల్ లో ఆయన ఫోటో చూసినప్పటి నుండి ఎలా అయినా ఆయన్ని కలిసి, ఆయన గురించి మొత్తం తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరుగుతుంది. చూస్తూ చూస్తూనే నా ట్రైనింగ్ పూర్తయిపోయింది. ఈలోగా పూణే నుండే నా ఫ్రెండ్స్ ద్వారా రావు గారి ఫోన్ నెంబరు సంపాదించాను. ఫోన్ నెంబర్ దొరికిన వెంటనే ఆయనకు ఫోన్ చేసా...

తిలక్: హాయ్ అంకుల్, నేను తిలక్ ను మాట్లాడుతున్నా, ఎలా ఉన్నారు

రావు గారు: నేను బాగున్నాను, ఎవరు మాట్లాడేది, నాకు గుర్తు రావడంలేదు

తిలక్: 2 సంవత్సరాల క్రితం మేము అరకు వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉన్నాము, ఐదుగురం వచ్చాము. 

రావు గారు: గుర్తొచ్చింది, ఎలా ఉన్నావు, నీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, స్టడీస్ అయిపోయాయా

తిలక్: అయిపోయాయి, ఇప్పుడు జాబ్ చేస్తున్నాను

రావు గారు: గుడ్, ఇంట్లో అందరూ బాగున్నారా

తిలక్: అందరూ బాగున్నారు, నేను మీకు ఎందుకు ఫోన్ చేసానంటే, మీ గురించి నాకు తెలిసిపోయింది.

మీ పేరు ఆనంద్ రావు. అవునా అంకుల్

రావు గారు: లేదు, నీకు ఎవరు చెప్పారు

తిలక్: నాకు మీ గురించి మొత్తం తెలిసిపోయింది అంకుల్, 10 సంవత్సరాల క్రితం మీ మీద టైంస్ న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ చదివా, మీ గురించి కానీ, మీరు ఆ విలేజ్ లో ఉంటున్నట్టు కానీ నేను ఎవరికీ చెప్పలేదు. నా ఒక్కడికే తెలుసు. ఎవరికీ చెప్పాలని కూడా లేదు కానీ మీ గురించి అసలు ఏమైందో అని తెలుసుకోవాలని ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే నేను మీ ఊరు వచ్చి మిమ్మల్ని కలుస్తాను.

రావు గారు: నా గురించి తెలుసుకోవడానికి ఏమీ లేదు, అయినా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి మనం కలుద్దాం. వచ్చేవారం వైజాగ్ లో కలుద్దాం. ఎప్పుడు, ఎక్కడ అని నీకు మెసేజ్ వస్తుంది.

తిలక్: థాంక్స్ అంకుల్. ఒప్పుకున్నందుకు. మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటా.

 

రావు గారు: కానీ ఈ విషయం ఎవరికి తెలియకూడదు

తిలక్: ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, చెప్ప ను కూడా.

రావు గారు: సరే ఉంటాను.

            పూణేలో నా ట్రైనింగ్ పూర్తయింది. పూణే నుండి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన సంతోషం కంటే రావు గారి దగ్గర నుండి మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూపు ఎక్కువైంది. ఒకరోజు ఉదయం ఒక కొత్త నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది. నా డీటెయిల్స్ రిప్లై చేయమని. నేను వెంటనే పంపాను.

            ఆరోజు సాయంత్రం వాట్సాప్ లో ట్రైన్ టికెట్స్ వచ్చాయి. ఎప్పుడు అని చూస్తే శనివారం సాయంత్రం వైజాగ్ వెళ్లడానికి, ఆదివారం సాయంత్రం తిరిగి రావడానికి చేసి ఉన్నాయి. శనివారం సాయంత్రం వైజాగ్ కి బయలుదేరాను. ట్రైన్ అయితే ఎక్కాను కానీ ఆయనతో, ఏమి మాట్లాడాలో, ఏమి అడగాలో తెలియదు. ఆలోచనలతోనే నిద్రపోయా. మార్నింగ్ 10 నిమిషాల్లో వైజాగ్ చేరుకుంటాను అనే టైం కి స్టేషన్ బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది అని ఒక్క వెహికల్ నెంబర్ మెసేజ్ వచ్చింది. నేను స్టేషన్ నుండి బయటకువచ్చి చూస్తే మెసేజ్ లో వచ్చిన నంబర్ తో ఒక క్యాబ్ ఉంది. వెళ్లి క్యాబ్ ఎక్కాను. క్యాబ్ నేరుగా ఒక హోటల్ కి తీసుకు వెళ్ళింది. అక్కడ నా పేరు మీద ఒక రూమ్ బుక్ చేసి ఉంది. నేను ఫ్రెష్ అయి, టిఫిన్ చేసి రూమ్ లో వెయిట్ చేస్తున్నాను. రూమ్ నెంబర్ 101 కి రమ్మని మొబైల్ కి మెసేజ్ వచ్చింది. రూమ్ కి వెళ్తే అక్కడ ఒక కుర్చీలో రావు గారు కూర్చుని ఉన్నారు. నన్ను పలకరించి , కూర్చోమన్నారు.

 

 బిలియనీర్ తో సంబాషణ

రావు గారు: ఏదో మాట్లాడాలని అన్నావు

తిలక్: ఒకే ఒక్క ప్రశ్న నన్ను వెంటాడుతూ ఇంత దూరం మీ దగ్గరికి వచ్చేలా చేసింది. మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో బాగా చదువుకుని, మంచి శాలరీతో జాబ్ తెచ్చుకుని, లైఫ్ రన్ చేయడమే ఒక అచీవ్మెంట్. దాని కోసం ఎన్ని యుద్దాలు చేస్తామో.. అలాంటిది మీరు అన్నీ వదిలేసి ఇలా ఎలా ఉంటున్నారో నాకేం అర్దం కావడంలేదు.

రావు గారు: నీకు వచ్చిన్న సందేహం కరెక్టే, అందరి మిడిల్ క్లాస్ ఫామిలీస్ ఆలోచన అలానే ఉంటుంది. నేను కూడా అలాంటి ఫామిలీ లో పుట్టిన వాడినే. నేను అలా రావడానికి కారణం నేను పెరిగిన వాతావరణం, నా జీవితం లో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు. 

కొన్ని నిర్ణయాలు తీసుకున్నపుడు తెలియదు వాటి వల్ల భవిష్యత్తులో ఎంత భాద పడాల్సి వస్తుందో.

తిలక్: మీ బాల్యం గురించి చెప్పండి.

రావు గారు: నేను చిన్నతనం నుండి ఏదో తెలియని ఆలోచనలతో, నాలోనే నేను కుమిలిపోతూ ఉండేవాడిని. నా పేరెంట్స్ కూడా అందరిలానే నన్ను మంచిగా చదివించి, మంచి జాబ్ లో చూడాలని అనుకున్నారు. టెన్త్ వరకు నా చదువు బాగానే సాగింది. ఆ తర్వాత నా ఆలోచన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. అందరిలాగా జాబ్ చేస్తూ బ్రతకడం నా వల్ల కాదని అప్పుడే అనుకున్న. నేను 10th చదువుతున్న రోజుల్లో మా స్కూల్ కి వచ్చిన ఒక గెస్ట్ మాకు లైఫ్ గురించి ఒక క్లాస్ చెప్పారు. భవిష్యత్తులో మనం ఏమి అవ్వాలనుకున్న, ఎలా లైఫ్ రన్ చేయాలనుకున్నా, ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయలే చాలా ముఖ్యం అని ఆయన చెప్పారు.

        క్లాస్ అయిపోయాక నేను ఒక్కడినే ఆయన దగ్గరికి వెళ్ళి, నాకు లైఫ్ లాంగ్ జాబ్ చేసి బ్రతకడం ఇష్టంలేదని, ఏం చేయాలో చెప్పమని అడిగాను. ఆయన ఒక్కటే చెప్పారు "ఏ ఉద్యోగం అయిన నీకు ఇష్టమైన రంగంలో చేస్తే అది నీకు ఉద్యోగం లా అనిపించదు. నువ్వు ఏక్కడైన సక్సెస్ అవ్వాలంటే నువ్వు చేసే పని నీకు నచ్చి చేయాలి, అది ఉద్యోగం అయిన వ్యాపారం అయిన. అప్పటినుండి నా ఇంటరెస్ట్స్, నాలో ఉన్న స్కిల్స్ వెతకడం మొదలుపెట్టాను. అలా వెతుకుతూ ఉండగా నాకు ఒక కాలేజీ గురించి తెలిసింది. అక్కడ ఉన్న కోర్సు లు అన్నీ ఫ్రీ, ఉండటానికి హాస్టల్ అన్నీ ఫ్రీ కానీ అక్కడ ఉండాలంటే అనాధ అయిఉండాలి.

అప్పుడు నేను నా జీవితం లో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నా, ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయా. ఎందుకో తెలియదు ఆ రోజుల్లో అదే కరెక్ట్ అనిపించింది.

తిలక్: మీరు మీ పేరెంట్స్ కి, ఏమి అవ్వాలి అనుకుంటున్నారో చెప్పి ఉండాల్సిందిగా. అలా కాకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం తప్పు కాదా....

రావు గారు: చెప్పానుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని, వాళ్ళు నేను జాబ్ చేయాలనే కోరుకుంటారు. అది నాకు తెలుసు అందుకే ఆ నిర్ణయం తీసుకున్న.

తిలక్: ఇంటినుండి ఏక్కడికి వెళ్లారు, ఎలా బిలియనీర్ అయ్యారు?

రావు గారు: అనుకున్నట్లుగానే ఆ కాలేజీ కి వెళ్ళాను, కాలేజీ లో వాళ్ళను ఎలాగోలా ఒప్పించి ఒక అనాధ లా జాయిన్ అయ్యాను. చదువుకుంటూనే నాకు ఉన్న స్కిల్స్ మీద ఫోకస్ పెడుతూ, డిగ్రీ పూర్తి చేశాను. డిగ్రీ పూర్తి అయ్యాక కాలేజీ నుండి బయటికి వచ్చాక అస్సలు కథ మొదలైంది.

ఏదో ఒక పని చేస్తే కానీ తినడానికి, ఉండటానికి గడవదని తెలిసింది. నాకు వచ్చిన చిన్నా చితకా పనులు చేసుకుంటూ కొన్ని రోజులు గడిపాను. ఇలా కాదని ఫ్రెండ్స్ సహాయంతో చిన్న బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశా, మొదటి అడుగులోనే నష్టాలు చూసా. ఏక్కడ తప్పు చేస్తున్నానో తెలుసుకుని, రెండవసారి పెద్ద మొత్తంలో మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశా, ఈ సారి సక్సెస్ అయ్యాను. అలా కొంచెం కొంచెం పెంచుకుంటూ 10 ఏళ్లలో ఒక పెద్ద బిజినెస్ తయారుచేశాను. నాతో పాటు కాలేజీ లో చదువుకున్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. తాను కూడా ఒక అనాధ నే. కొన్నాలకి బిజినెస్ పెద్ధది అవ్వడం, పిల్లలు పుట్టడం అన్నీ జరిగిపోయాయి.

తిలక్: అంతా బాగున్నపుడు మీరు అన్నీ వదిలేసి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు ?

రావు గారు: పిల్లలు పెరుగుతూ ఉంటే నాకు నా చిన్నతనం గుర్తొచ్చింది.

ఒక రోజు అమ్మానాన్నలు గుర్తొచ్చారు. ఇంతకు ముందు కూడా గుర్తొచ్చేవాళ్ళు కానీ నేను అంత పట్టించుకోలేదు. ఇప్పుడు నా పిల్లల్ని చూసినప్పుడల్లా వాళ్ళే గుర్తొస్తున్నారు.

ఒక రోజు ఏమైందో తెలీదు, అమ్మానాన్నలను చాలా మిస్ అయినట్టు అనిపించింది. తర్వాతి రోజు ఊరు బయలుదేరి వెళ్ళాను. ఊరంతా నమ్మలేనంతగా మారిపోయింది. నా చిన్న నాటి ఇంటికి, మా ఇంటికి వెళ్ళాను. ఎవరో తెలియని వాళ్ళు ఉన్నారు. మాధవరావ్ గారు ఉన్నారా అని అడిగాను. వాళ్ళకు తెలియదని, వాళ్ళు 20 ఏళ్లుగా ఆ ఇంటిలోనే ఉంటున్నట్లు చెప్పారు. ఊరిలో అందర్నీ అడుగుతూ వచ్చా ఇంతలో ఒక పెద్దాయన చెప్పారు, వాళ్ళు ఊరు విడిచిపోయి చాలా కాలం అయ్యిందని. వాళ్ళకి ఒక కొడుకు ఉండేవాడని, చిన్నతనం లోనే ఇంటి నుండి పారిపోయాడని. వాడి కోసం చాలా ఉర్లూ వెతికి చివరికి వల్ల ఆస్తులన్నీ అనాథ శారణాలయానికిచ్చి కాశీ వెళ్లిపోయారని. ఆ మాటలు విన్నప్పటినుండి, నాలో ఏదో తెలియని బాధ, అప్పుడు నేను ఎందుకు అలా చేశానా అని చాలా బాధ పడ్డాను. కాశీ వెళ్ళి అక్కడ చాలా వెతికాను, ఎటువంటి ఆచూకీ లేదు. చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయా, ఈ ఆస్తి పాస్తులు నాకు వద్దు అనిపించింది. అన్నీ వదిలేసి ఇక్కడ మామూలు మనిషిలా బ్రతుకుతున్నా.     

 

కుటుంబాన్ని కలిసిన బిలియనీర్

             రావు గారి మాటలు విన్న తర్వాత, ఆయన తన తల్లితండ్రులను బాగా మిస్ అవుతున్నట్లు అనిపించింది. మధ్యాహ్నం 1 కావస్తుంది, రావు గారు భోజనం చేసి మాట్లాడుకుందామా అని అడిగారు. నేను సరే అన్నాను. భోజనం అయ్యాక మళ్ళీ అదే రూమ్ కి వచ్చేశాం ఇద్దరం. నా దగ్గర నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది. సాయంత్రం ఏడు గంటలకు నా రిటర్న్ ట్రైన్, ఎలాగోలా ఆయన్ని ఒప్పించి వాళ్ళ కుటుంబ సభ్యులను కలిసేలా చెయ్యాలి అని మనసులో అనుకున్నాను.

తిలక్... నా గురించి అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను, ఇంకేమైనా అడగాల్సినవీ వున్నాయా అని అడిగారు రావు గారు. 

తిలక్: అడగాల్సినవీ చాలానే ఉన్నాయండి, నా దగ్గర సమయం కూడా తక్కువగా ఉంది. మీరు మీ తల్లిదండ్రులను తలచుకుంటూ, వాళ్ళ కోసం వెతికి వెతికి చివరికి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఇప్పుడు మీ కోసం కూడా మీ పిల్లలు అలానే వెతుకుతున్నారు. మీరు చేసింది రైట్ అంటారా..

రావు గారు: ఒక నిమిషం మౌనంగా ఆలోచిస్తూ.. నేను చేసింది కరెక్ట్ అని ఎప్పుడు అనుకోలేదు. నీకు ముందే చెప్పానుగా నా లైఫ్ లో నేను తీసుకున్న కొన్ని నిర్ణయాలు నన్ను ఇప్పటికీ భాదిస్తున్నాయి అని, అందులో ఇది కూడా ఒకటి. తల్లితండ్రులను కలవాలి అనే ఆలోచనాలలో నేను నా ఫ్యామిలీ కి దూరం అయ్యాను. చిన్నపుడు నేను ఇంటినుండి బయటకు వచ్చాక నా తల్లి ఎంత బాధ పడిందో ఆలోచిస్తుంటే, ఇప్పటికీ

నా మీద నాకే ద్వేషం వస్తుంది. నేను ఎంత పెద్ద తప్పు చేశాన అని అనుకోని రోజు లేదు. అలా సంపాదించిన డబ్బు నాకు వద్దు అనిపించింది. అందుకే కొంత చారిటీ ట్రస్ట్ లకు, మిగిలినవి పిల్లలకు రాసేశాను. నా పిల్లలు నా గురించి వెతుకుతున్నారని నాకు తెలుసు. కానీ, నేను వాళ్ళకు చెప్పకుండా, ఇంటి నుండి వచ్చేశాక, నా వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, ఒకవేళ వాళ్ళు నా ఎదురుగా ఉంటే నేను వాళ్ళను ఎలా ఫేస్ చేయాలో నాకు తెలీదు. ఆ భయంతోనే ఇప్పటివరకు వాళ్ళను కలవలేదు.

            తన ఫ్యామిలీ గురించి చెప్తూ ఆయన చాలా భావోద్వేగానికి లోనైయ్యారు. ఆయన కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. నాకు ఆయన్ని ఎలా ఓదార్చాలో నాకు తెలియడం లేదు. ఒక్కసారిగా రూమ్ లోకి రావు గారి భార్య, పిల్లలు, మనవళ్లు అందరూ వచ్చేశారు. వాళ్ళని చూసిన రావు గారు ఇంకా భావోద్వేగానికి లోనైయ్యారు. ఆయన్ని వాళ్ళందరూ ఓదార్చు తున్నారు. ఒక అర్ధ గంట అందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. సహజంగా నా కళ్ల నుండి నీళ్ళు రావు అట్లాంటిది నేనే వాళ్ళను చూసిఏడుపు ఆపుకోలేకపోయాను.

ఒక గంట తరువాత....

"తిలక్.. నువ్వు ముందే ఎందుకు నాకు చెప్పలేదు" అని అడిగారు రావు గారు.

తిలక్: నేను మీ గురించి చదివిన కొన్ని రోజుల తర్వాత, మీ ఫ్యామిలీ ని కలిశాను, వాళ్ళు మీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నాకు అప్పుడు అర్దమయింది. కానీ ధైర్యం చేసి వాళ్ళను ఇక్కడికి పిలిపించాను. ఎందుకంటే మీరు కూడా వాళ్ళను చాలా మిస్ అవుతున్నారని అనిపించింది. కానీ వాళ్ళను మీ ముందుకు ఎలా తీసుకురావలో ఆలోచిస్తూనే ఉన్నా. ఇంతలో మీరు బాధపడడం చూసి వాళ్ళే తట్టుకోలేక మీ ముందుకు వచ్చేశారు. ఏదైతేనేం నేను అనుకున్నది అయ్యింది. నేను మిమ్మల్ని కలవడానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్..

రావు గారు: థాంక్స్ నువ్వు కాదు చెప్పాల్సింది.. మేమందరం నీకు థాంక్స్ చెప్పాలి. నీ వల్లే నేను నా ఫ్యామిలీ ని కలిశాను. నాకు చాలా ఆనందం గా ఉంది.

ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిలక్ కి థాంక్స్ చెప్తున్నారు. ఇంతలో "నీకేమైన కావాలంటే అడుగు బాబు" అంది రావు గారి భార్య.

తిలక్: నాకు ఏమి వద్దండీ. ఎప్పుడైనా ఏమైనా అవసరం ఉంటే అడుగుతాను.

రావు గారు : లేదు, నువ్వు మాకోసం ఇంత చేశావ్, నిన్ను ఇలా పంపిస్తే నాకు మంచిగా అనిపించదు.

తిలక్: చాలా ఆలోచించిన తర్వాత, నాకు మీ స్టోరీ ని బుక్ గా రాయాలని ఉంది, ఎందుకంటే ఎవరికైనా తల్లిదండ్రులను వదిలి వెళ్లిపోవాలి అనిపిస్తే, మీ స్టోరీ ద్వారా వాళ్ళను ఆపాలి అనేదే నా కోరిక.

రావు గారు : అంతేగా.. సరే, బుక్ రాసిన తర్వాత నాకు ఒక కాపీ పంపించు. నీకు ఎప్పుడైనా, ఏ అవసరం వచ్చినా మేము ఉన్నాం అని మర్చిపోవకు.

అలా వాళ్ళకు ఒక్కటి చేసి, సాయంత్రం ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చేశాను.

మీరు మీ లైఫ్ లో ఏ నిర్ణయాలు తీసుకున్న ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి

మన చిన్నతనం లో,

మన అమ్మ నాన్న మనకు ఎంత అవసరమో,

వాళ్ళకు ఒక వయస్సు వచ్చాక

మనము వాళ్ళకు అంతే అవసరం.

Take care to Parents

 

ఇట్లు…

నాగ శ్రీనివాసు