Read Our town (village) by madhava krishna e in Telugu Classic Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మా ఊరు (పల్లెటూరు)

మా ఊరు V. బొంతిరాళ్ల అని పిలవబడే అందమైన పల్లెటూరు. గూగుల్ మ్యాప్ లో కూడా చోటు లేని అటువంటి చిన్న ఊరు.అది సెప్టెంబరు మాసం. ఉదయం నుంచి ఎన్నో దేశాలు తిరిగి అందరి కాలక్షేమాలు చూసి, మ వూరి కల్లేకొండ వెనకాల విశ్రాంతి తిస్కోటానికి పచ్చటి పైర్ల మధ్యలో ఎర్రటి బంతి వోలో మెల్లి మెళ్ళి గా గూటిలో కి జారుతున్నట్టు కల్లేకోండ వెనకాలకు జారుతున్నాడు .
అప్పుడే బడి నుంచి వచ్చిన చిన్న పిల్లలు బడి సంచులు గోడ మీద వేసి పరుగెత్తుకుంటూ వచ్చి ఊరి లోనికి వచ్చిన సర్కస్ దగ్గర గుము గుడతున్నారు. కొందరు పిల్లలు ఆకలితో, ఇంట్లో ఉన్న తినుబండారాలు గబ గబ నోటిలో వేసుకొని పరుగెత్తుకు వస్తున్నారు. సైకిల్ వేసుకొని నువ్వు ఫస్ట్ హా నేను ఫస్ట్ హా అన్నట్టు పరుగెడ్తున్నరు .
దొడ్ల లో పాక లలో కట్టేసిన లేగ దూడలు.. వారి అమ్మ ఎప్పుడు వస్తాధో అని దారి వైపు కళ్ళు పెద్దవి గా చేసుకొని మా అనియా అరుస్తూ ఎదురు చూడ సాగాయి. ఇంటి కి నేరుగా రాకుండా వారి పశువులు అల్లరి పోతాయి అని మధ్య మధ్య లో కర్ర పట్టుకొని నిలబడి, ఆ ఇరుగు పొరుగు వారి బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు కొందరు. సర్స్కస్ చూడ్డానికి వెళ్తున్న చిన్న పిల్లని, ఎదో పని మీద బయటకు వచ్చిన మూడు కాళ్ళ పెద్దాయన నీ ఇదిగో అవులు వస్తాయి తగులుతాయి పక్కకి ఉండు అంటున్నారు...
శివుని గుడి లో నుంచి వస్తున్న పాటలు, సర్కస్ దగ్గర నుంచి వినిపిస్తున్న (రవాలమ్మ రావాలి.. పిల్లల పెద్దలు.. మి వురి లో సుంకులమ్మ కట్ట దగ్గర మీ కోసం వచ్చింది జపాన్ సర్కస్ అని ) వస్తోన్న శబ్దాలు మిక్స్ అయి వస్తున్నాయి. వీటిని వింటు కుంట లోని నీటిని చూస్తూ, గూటి కి వెళ్తున్న పక్షుల కిచ కిచా శబ్దాలు, పిల్లల కేరింతలు, గంప లోకి చేరుతున్న పిల్లల్లా కోడి కిచ్చ కిచ్చ లు, కాలేజ్ నుంచి వస్తోన్న పోరాలు, ఎవ్వరో ఇంటికి వస్తోన్న కొత్త చుట్టాలు, వీటిని అన్నింటినీ లైవ్ లో చూస్తూ పులి నక్క ల గేమ్ ఆడుతూ కుంట కట్ట మీద కూర్చున్న జనాలు, ఆరోజు ఎవ్వరూ ఎవ్వరూ ఎం చేశారో, ఊరిలో ఏమింజరిగింది, ఎవ్వరి ఇంట్లో కష్టం ఉంది, అంటూ అందరి మంచి చెడులు గురించి తెలుసుకొని సాటి వారికి సాయం చేసుకుంటూ , చిన్న ఊరు అయిన బలే కలిసి ఉంటారు అబ్బా అనెట్టు అందరి దిష్టి తగిలేట్టు ఎంతో హాయి గా నవ్వుతూ కల్మషం లేని సూర్య కిరణాల వోలె పొలం లో రెక్క కష్టం చేసి ఇంటికి వచ్చి ఎవ్వరూ ఇంట్లో వారు ఉండకుండా, సాటి వ్యక్తి బాగోగులు తెలుసుకుంటూ రాబోయే యువత కి ఎంతో స్ఫూర్తి నీ నింపుతున్న మా గ్రామ రైతన్న లకి జోహార్లు...
ఎవ్వరు ఏ పార్టీ లకు ఓటు వేసిన ఊరిలో ఎవ్వరూ కూడా రాజకీయం చేయకుండా కలిసి మెలిసి తిరిగే యువత , వానర సైన్యం లాగా సికారు (వాకింగ్) కి బయలు దేరారు. వెళ్తూ వెళ్తూ ఊరిలో జరిగే అన్ని విశేషాలు చర్చిస్తున్నారు, మామ ఈసారి వినాయక చవితి, పీర్ల పండగ గ్రాండ్ గా చేద్దాం అనుకుంటూ, దానికి ఇంకా టైం ఉంది రేపు జపాన్ గానీ ముహూర్తం కదా, పందిరి వేయటానికి అందరం పోదాం లే ఎక్కడికి పోకండి అంటూ వెళ్తున్నారు... దాయాదులు. కుటుంబ తో సంబంధం లేకుండా ఊరిలో ఎవ్వరి పెళ్లి జరిగిన కలిసి కట్టు పని చేసే యువత, రేయ్ మొన్న కబడ్డీ కి పోయారు కథ రా ఏమయ్యింది అంటూ గేమ్ తో సంబంధం లేక పోయిన ప్రోత్సాహిస్తు ముందుకు వెళ్తున్నారు..
అప్పుడే నిద్ర లేచిన ఉయ్యాల లోని పాప కి నీళ్ళు పోసి తెల్లగా పౌడర్ రాసి, నల్లటి కాటుక పెట్టీ, కొత్త డ్రెస్ వేసి, ఆ పాప తల్లి డస్ట్ తగిలేలా స్సామ్రాన్ పొగ వేసి, నేతిలో కనకాంబరాలు పెట్టీ ముద్దు ముద్దు గా తయారు చేసింది, అటువైపు పశువులకు వచ్చిన పెద్దాయన ఏమ్మా, నీ బిడ్డ నీ నకొసమెన రెడీ చేశావు అంటూ ఆశం ఆడ్తున్నడు, కింద దించితే ఎక్కడ మట్టి అంటుకుంటాధి అన్నట్టు కింద దించట్లేదు ఆ తల్లి, .....
✒️మాధవ్
(ఇది కేవలం మా ఊరు గురించి చెప్పడం జరిగింది.మీకు నా పద అమరిక ఎలా అనిపించింది అనేది దయచేసి తెలియ జేయంది.. మును మును ముందు నేను రాయబోయే రచనలకు స్ఫూర్తి ని ఇవ్వండి.. నేను ఒక పాతిక సంవత్సరాలు కూడా లేని దేశానికి కాపలా కాస్తున్న ఒక సాధారణ సైనికుడిని నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం...)