Read The first drop... by madhava krishna e in Telugu Classic Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

తొలి చినుకు...

తొలి చినుకు .....
పచ్చ పచ్చ చెట్లు కోక వోలె చేసి అలా నవయ్యరాలతో పడుకొని ఉన్న ధరణి ని వయసులో ఉన్న వరనుడి చూపు తన మీద పడి ఆ మోహకళ్ళలో నుంచి వచ్చే సెగలు భూ ఉపరి తలాన్ని తాకినప్పుడు, ఒంటరిగా ఇంట్లో నిదురిస్తున్న కన్నె పిల్ల కి చలి లో కూడా చెమటలు పట్టి, తన ఒక కాలి బొటన వేలు మీద రెండో కాలి బొటన వ్రేలు ముగ్గు వేస్తుంది...

అప్పుడు వినిపించే పట్టీల శబ్ధం లో ఉన్న తాపం, భూమికి తగిలినప్పుడు ఆవిరిలా ఆకాశానికి లేస్తుంది. అప్పటి వరకు నీలంగా ఉన్న ఆకాశానికి ఆవిరి భుతాపన్ని అంత మూసుకొని మోహస్వర మేఘాలను తాకుతుంది.

ఆ క్షణం లో ఆకాశం గుండె వేగంగా కొట్టుకుని ఉరుములా భూమిని చేరుతుంది. శోభన గదిలో ద్వీపాలు అర్పేసినట్టు మేఘాలు సూర్యుణ్ణి ఆర్పేసి, నగ్నం గా ఉన్న దేహం మీద కప్పిన పువ్వుల దుప్పటి వోలె కప్పెస్తాయి.

అంత అందంగా ఉన్న భూమి లో కల్గిన కామసెగలను చూసిన ఆకాశానికి మొహం కలిగినట్లు మెరుపులతో తన కోరికలను చెప్పాడు...

అది వినగానే సిగ్గుపడి భూమి మెల్లిగా తన చేరకొంగు ను జార విరుచుకునీ దేహాన్ని విచ్చుకుంది,

చీర కొంగు సువాసన తగిలిన ఆకాశం తన మొదటి ముద్దు కి తయారు అవ్తుంది..(నేలను తాకే తొలి చినుకు)... ఆ తొలి ముద్దు తాకగానే భూమి ఒళ్లు జివ్వు అని జలజరిస్తోంది ... ఆప్పుడు వారి ఇద్దరి మధ్య శృంగారమే ఈ వర్షం... ఇలా వారిద్దరూ ప్రకృతి అనే పాన్పు లో శృంగారం చేస్కుంటున్నా వేల నెమళ్ళు కురివిప్పి నాట్యం చేస్తాయి... కోయిలలు పాటలు పడతాయి.. ఆ కోయిల ల పాటలు విన్నప్పుడు పాక లో కట్టివేయబడ్డ ఎద్దుల గుండెల్లో గుబేలు అంటుకుంది(వితానికి సమయం అయ్యింది వ్యవసాయం చెయ్యాలి కదా).. ఒక్కసారి గా లేసి కాలు దువ్వి అంబా అని అరిచింది... ఎడ తెరిపి కురుస్తున్న వర్షాల చినుకులు తలంబ్రాలు చేసుకున్నాయి కప్పలు.. పొలాలు కొండలు కలువలు గుట్టలు నుంచి కొత్త నీరు కుంకుమ నీరు లాగా పారుతూ వచ్చి కుంట లో చేరుతుంది.. కప్ప లు బెక్ బెక్ బెక్ అంటూ మేళా వాయిద్యాలు వాయిస్తున్నాయి.. మెరుపులతో ఫోటో లు తీస్తుంది ఆకాశం.. ఆ కప్పల శబ్ధం విన్న ఇంట్లో జీడి పప్పు తింటూ పెరిగిన పందెం పుంజు కొక్కురో క్కోకొక్కో అంటూ కుత వేసింది.. ఆ కూత విన్న ఇంట్లో వెచ్చగా నిద్ర పోతున్న మన రైతన్న అప్పుడే తెల్లగా అయ్యిందా ఎంటి.. అంటూ కళ్ళు నుసులుతు బయటకి వచ్చాడు... బయటకి వచ్చి చూసి ఏమొయ్ రాత్రి ఇంట్లో పడుకొని ఏమి వినిపిలేదు వాన దండిగా పడినట్టు ఉంది.. సేను పోయి చూసి వస్తా విత్తనం వేయొచ్చు లేదా అంటూ చేతిలో కర్ర పట్టుకుని ఎద్దులకు దాన పెట్టి బయలు దేరాడు.. వెళ్తున్న రైతన్న కి వర్షానికి లోపలికి పోలేక దారి పక్క లో చెంబు పట్టుకుని కూర్చున్న గంగన్న కనిపించాడు.. రేయ్ గంగి గా ఎం సామి ఇక్కడే పెట్టేసావు అలా లోపలికి పోవచ్చు కథ నీ యాలి అంటూ ముందు కి పోయాడు.. అక్కడ పై చెరువు నుచి నీరు మోకాళ్ళ లోతు పారుతున్నాయి.. బాగా పదును అయినట్టు ఉంది అనుకొని పోయాడు... సేనుకు పోయాడు.. చేనులో ఉన్న తాటి మాను మీద ఉరుము పడి కాలిపోయింది.. ఇంటికి వస్తున్నాడు దారిలో తెగిపోయిన ఉల్లి మల్ల ను చూసి వాన నీ తిడ్తున్న రాజం కనిపించాడు.. ఎం రాయ్ రాజీ గ ఎం చాలా అరుస్తున్నవు అనుకుంటూ దగ్గరకి పోయాడు... దీని యలి దీని అక్క చూడండి అమ్మ అనుకుంటూ ఇప్పుడు వచ్చింది సింగరమైన వాన అని అంటున్నాడు.. నవ్వుకుంటూ ముందుకు సాగాడు.. వస్తుంటే వంక లో చిక్కు పోయిన బుల్లెట్ బండి నీ తియ్యలేక రెడ్డి గారు నాన తిప్పలు పడ్తున్నాడు మనోడు ఒక చెయ్యి వేసి తోపు పట్టాడు బండి బయటకి వచ్చింది.. ఇంటికి చేరాడు మన రామయ్య..

ఇంటి కి పోగానే అబ్బా... అనుకుంటూ పరుగెత్తుకు వచ్చాడు చంటోడు.. ఒరోరి ఓరోరి కాటిగాడు అనుకుంటూ ఎత్తుకొని ముద్దులు పెట్టాడు మనవునికి.. మనవు డీ ముచ్చట తీరక ముందే సీతక్క కాఫీ తెచ్చింది... అక్కడ అక్కడ ఉన్న మామిడి కాయలు గాలికి కింద పద్దేవి తీస్కో పప్పు లో వెయ్యి అని భార్య కి ఇచ్చాడు... ఇంట్లో నుంచి పెద్దావిడ బయటకి వచ్చింది.. ఏం అప్ప ఎలా ఉంది పదును అయ్యిందా అని అడిగింది... ఇక్కడా వాన తక్కువ కానీ అక్కడ పై నుచి తూర్పు పొలాల పక్కకి చాలా పెద్ద వాన పడింది.. అని చెప్పాడు..ఇయ్యాల బుడద ఉంటాది ఇతనానికి రేపు పోదాం అన్నాడు