Will this journey reach the coast.. - 22 books and stories free download online pdf in Telugu

ఈ పయనం తీరం చేరేనా...- 22

విసురుగా ఒకరోచ్చి తన చెయ్యి పట్టి లాగేయటం.. ఆ ఫోర్స్ కి అతన్ని అతుక్కుపోతుంది షివి..


ఆ టచ్.. తనని కవచంలా చుట్టేసి భద్రంగా తన గుండెల్లో దాచుకున్న బహువులు.. అతని ప్రెసెన్స్ ముఖ్యంగా అతని గుండె కొట్టుకునే వేగం..


తనకేమైనా అవుతుందేమో అని కంగారులో ఆతని గుండె చప్పుడు అతను గుర్తించలేదు కానీ ఆమె గుర్తించింది..

అసలే దిగులు చింత లేకుండా తనని తాను పూర్తిగా ఆ క్షణం అసద్ కి అప్పగించేసింది షివి..


షివి తన కంట్రోల్ పూర్తిగా తనకి ఇచ్చేయడం తెలుస్తుంటే ఆశ్చర్యంగా అనిపించింది అసద్ కి.. కానీ బయటపెట్టలేదు.. ఎందుకో తనని ఫస్ట్ టైమ్ చుసినప్పుడు ఏ ఫీల్ అయితే అసద్ ఫీల్ అయ్యాడో ఇప్పుడు షివి కూడా అదే ఫీల్ అవుతుందని అనిపిస్తుంటే అలానే షివి నీ చూస్తూ బాలన్స్ కొలప్తాడు అసద్..


తనని లాక్కొని ఫుట్పత్ వైపు మల్లించి ఆలోచనలు పక్కదారి పట్టేసరికి పట్టు కోల్పోయిన అసద్ కాలికి రాయి తగిలి ఫుట్పత్ అవతల గార్డెన్ వైపు దొర్లుకుంటూ వెళ్తారు..


ఒకరిమీద ఒకరు పడటం.. షివి తనని తాను అసద్ మీదకి వదిలేస్తే.. తన మీద ఏ నమ్మకంతో తనని తాను ఇచ్చేసిందో తెలియకపోయినా ఆ నమ్మకం నీ కాపాడుకుంటూ తన షివి కి చిన్న నొప్పి కలగకూడదు అని తనే ముందు కిందపడి తన మీద షివి పడేలా చేసుకుంటాడు..


షివి పడిన ఫోర్స్ కి ఆమె అందాలు ఏమో కానీ.. కింద వున్న రాళ్లు అసద్ సూట్ లోపలున్న వీపుకి కూడా గుచ్చుకుంటూ నొప్పిని కలిస్తాయి కానీ తన ప్రేమ తనకి చేరువగా తన గుండెమీద ఉండటం ఆ నొప్పిని గుర్తించేలా చెయ్యదు అసద్ కి..


పడిన ఫోర్స్ కి పక్కకి దొర్లిన అసద్ తనతో షివి కూడా దొర్లుతుంది అని అక్కడ స్లాంట్ గ వున్న గ్రాస్ నే చెప్తుంటే ఆమెకి కవచంలా చుట్టేస్తాడు అసద్..


మొదటి సారి ఒక మగాడి స్పర్శ తనకి అంత చేరువగా తెలుస్తున్న షివి దాన్ని ఫీల్ అవ్వడంలోనే షివి మునుగుతుంది.. తన మనసు అతని స్పర్శనీ తనలో దాచుకుంటే ఆమె నీ అతను బహువుల్లో దాచుకున్నాడు..


కొంచోమ్ కిందకి జారాక నార్మల్ గ వున్న చోటు ఆగి ముందు అసద్ నే లేచి తర్వాత షివి నీ పైకి లేపాడు అసద్..


తన చేతికన్నా రెండు రేట్లు పెద్దగా వున్న చెయ్యి.. సున్నితత్వం అతని స్కిన్ కలర్ లో తెలుస్తుంటే ఆమె చెయ్యి పట్టుకున్న పట్టులోనే అతని కఠినత్వం తెలుస్తుంది.. కానీ అది ఆమెకి భద్రత భావంనే ఇస్తుంది..


నెమ్మదిగా లేచిన ఆమెని తన గుండెల మీద వాల్చుకుంటాడు అసద్.. ముసుగులో వున్న అతని కళ్ళ నే చూస్తూ ఆమె అతని గుండె మీద నిలుస్తుంది..


ఆమె తన వైపు చూస్తున్న చూపులో.. ఎదో ఫీల్ తన మనసుని తాకూతుంటే తనని తను ఆపుకోవటం కష్టమే అయ్యింది అసద్..


నెమ్మదిగా ఆమె నుదిటి మీద పెదవులు అద్దాడు.. కళ్ళు మూసుకొని ఆ ముద్దులోని ప్రేమని ఫీల్ అవుతున్న షివిని ఆ మాయలోనే వదిలేసి వెళ్ళిపోయాడు అసద్..


తన భుజం మీద పడిన చేతి స్పర్శకి ఈ లోకంలోకి వచ్చిన షివి తననే కంగారుగా చూస్తున గీతని చూసి.. " అతనేడి..? " అడిగింది కళ్ళతోనే మొత్తం వెతికేస్తూ..


" ఎవరు.. " అర్ధం కాక అడిగింది గీత.. " అదే అతను నన్ను కాపాడిన అతను.. " అన్నది షివి ఎందుకో తెలియదు అతను తనకి ఒక్క క్షణం దూరంగా వున్న ఆమెకి మనసు మనసులో లేదు..


ఎదో కంగారు ఇంకేదో భయం.. తను మళ్ళీ ఒంటరి అయిపోయిందా.. అనుకున్న వెంటనే కళ్ళల్లో నీళ్లు.. షివి కళ్ళల్లో నీళ్లు చుసిన గీత.. " షివి ప్లీజ్ ఇంత చిన్న దానికి కూడా ఏడుస్తారా.. అతను నీకు హెల్ప్ చేసి వెళ్ళిపోయాడు అనుకుంట.. అతనికి మనసులోనే థాంక్స్ చెప్పుకో.. కొందరికి హెల్ప్ చెయ్యడమే తెలుసు.. దానికి తగ్గ ఫలితం వాళ్ళు ఆశించరు.. " అంటుంది గీత ఎదో లోకంలో ఉన్నట్టు..


కళ్ళల్లో నిలిచినా నీళ్ళని బలవంతంగా తొక్కేసి గీత వెంట అడుగులు వేస్తుంది షివి..


అసలు షివి మనసులో కలిగిన అలజడి అతని స్పర్శ అతని హృదయ సవ్వడి అతని కళ్ళు ఎందుకు ఇవన్నీ ఫీల్ అవుతుందో కూడా తెలియదు..


ఇప్పుడు ఎందుకు ఆమెకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయో.. ఎందుకు బాధ పడుతుందో కూడా తెలియదు..


అలానే ముభవంగా హాస్టల్ కి చేరుకుంటుంది షివి.. ఆమె ఆలోచనలు అన్ని ఆ నీలికళ్ళ అసద్ మీదే..


' ఎవరు నువ్వు..?? నన్నెదుకు సేవ్ చేసావ్..?? చేస్తే చేసావ్.. కానీ నిన్ను నువ్వు నా మనసుకి తాకెలా ఎందుకు తయారు చేసుకొని నా ముందుకు వచ్చావు..?? నీ కళ్ళు వేల మాటలు మాట్లాడుతున్నాయి.. లవ్ యూ రా.. 'అప్రయత్నంగా వచ్చిన మాటకి ఆశ్చర్యంగ ' లవ్.. లవ్ ఏంటి.. ' అని భయపడుతున్న తన శరీరం ఒక చిన్న జెర్క్ ఇస్తుంది.. ఆమె మెదడేమో వెనక్కి లాగినట్టు ఉంటే ఆమె మనసుకి ఎదో చల్లని శీతల పవనం తాకినట్టు అనిపిస్తుంది..


తన ఇన్ని ఏళ్ల నిరీక్షణ అతనే అని మనసు చెప్తుంటే మెదడు వేస్తున్న వెనకడుగు.. అంతే కాకుండా తను ఎం చేసిన తప్పుగా చూసే తన తండ్రి తను ఇప్పుడు ఒకరిని ప్రేమిస్తున్నాను అంటే కనీసం మనిషిగా అయినా చూస్తాడా..


హ్మ్.. ఆయన నన్ను మనిషిగానే చూడడు.. ఇంక మళ్ళీ మనిషిగా చూస్తాడా అని అనుకోవటం నిజంగా అత్యాసే నా జీవితానికి.. మనసులో విరక్తిగా అనుకోని..


అసలు ప్రేమ అనేదే ఒక బుటకం.. మనుషుల అవసరాల కోసం వాడుకోవటానికి పెట్టుకునే పేరు ప్రేమ.. మెదడు చెప్తుంటే..


మరి అతని టచ్ నీ ఫీల్ అయినా నాకేం సమాధానం చెప్తావ్ అంటూ ఎదుట నిలుస్తుంది మనసు..


ఇప్పటి వరకు కనీసం ఆడపిల్ల కుడా తాకని చోట్ల ఒక అబ్బాయి తాకితే వయసులో వున్న ఏ మనిషికైనా కలిగే ఫీలింగ్స్ నే నీకు కలిగింది అంటూ మెదడు చెప్తుంది..


అతనేం నన్ను తాకకూడని చోట్ల తాకలేదే.. కేవలం చెయ్యి పట్టి లాగాడు.. తర్వాత నుదిటిన ముద్దు పెట్టుకున్నాడు.. నుదిటిన ముద్దంటే కేర్ కి చిహ్నం అని తెలియదా నీకు..?? మనసు ప్రశ్న..


తాకకూడని చోట తాకలేదా..?? అతను మొత్తంగా నా మీదే పడ్డాడు.. అంతేనా నన్ను కుడా తన మీద పడిసుకున్నాడు.. అది తాకటం కాదా.. నిజమే ఫోర్ హెడ్ కిస్ మీంట్ కేర్ కానీ అలా ఫోర్ హెడ్ కిస్ చేస్తేనే అతన్ని మనం కన్సిడర్ చేస్తాం అని ప్లాన్ ప్రకారం చేసాడు ఏమో.. మైండ్ అనాల్సిస్..


ఓహో.. అలా అయితే తమరెందుకు అతను లాగగానే పోయి అతన్ని అత్తుకొని మరి అతని గుండెల్లో దక్కున్నారో.. అతనే నీకు రక్ష అన్నట్టు ఎందుకు అతన్ని అంటిపెట్టుకొని వున్నావు..?? మళ్ళీ మనసు ప్రశ్న..


నేనెక్కడ పట్టుకున్నాను.. అది నువ్వే చేసావ్..ఎంతైనా నువ్వు కూడా మాములు ఆడపిల్లవే కదా.. ఒక అబ్బాయి టచ్ చేసేసరికి వాడి వడిలో వాలిపోయావ్.. అంటూ హేళనగా మాట్లాడుతుంది మెదడు..


నిజానికి షివి మెదడుగా తన తండ్రి మాట్లాడుతుంటే మనసుగా తనే మాట్లాడుతున్నట్టు అనిపిస్తు కళ్ళకి అలుపు లేకుండా నీళ్లతో నిండిపోతాయి..


" ఆపండి.. " మనసులో తనతో తనే చేస్తున్న యుద్ధం తన మీద ప్రభావం చూపించి పెద్దగా అరుస్తుంది షివి..


చుట్టూ నిద్రలో వున్న వాళ్ళు షివి అరుపుకి లేచి కూర్చుంటారు.. ఎప్పుడు చీమకి కూడా నొప్పి కలుగుతుంది ఏమో అన్నట్టు నెమ్మదిగా మాట్లాడే షివి ఈ రోజు అంత పెద్దగా అరిచేసరికి వాళ్లకి ఆశ్చర్యమగా ఉంటే..


మద్యహ్నం జరిగిన ఇన్సిడెంట్ కి షివి బాగా డిస్ట్రబ్ అయ్యిందని ఆమెని సముదాయించి నిద్ర పోయేలా చేస్తుంది గీత..


కొనసాగుతుంది...
షేర్ చేయబడినవి

NEW REALESED