Read Will this journey reach the coast...- 1 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 16

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 2

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 15

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 1

రేడియో జాకీ గా ఒక అందమైన మృదువైన మంత్ర మనోహరమైన గొంతు వినిపిస్తుంది... తనతో పాటు కొంత మంది పిల్లల మాటలు కూడా...


వర్షం పడుతూ ఆఫీస్ కి వెళ్ళే దారిలో ఏదో ఏక్సిడెంట్ జరిగి అటు ఆఫీస్ కి వెళ్ళే మూడ్ లేక ఇటు ఇంట్లో తనని పెళ్లి చేసుకోమని తన తల్లి ఫోర్స్ చేస్తుంటే ఇంట్లో అమ్మ మీద అరిచేసి కోపం లో కార్ లో బయలు దేరిన వ్యక్తి కి తోచు బాటు కాక రేడియో ఆన్ చేసాడు...


అందులో వినసొంపుగా వున్న ఒక అమ్మాయి గొంతు తో పాటు కొంత మంది పిల్లల గొంతులు కూడా వినిపిస్తున్నాయి...


అమ్మాయి " ఇవాళ నేను మీకు చెప్పబోయేది నా చివరి కథ..." అంటే..


ఒక బాబు " అంటే మీరు రేపటి నుండి మాకు కథ లు చెప్పరా..."


అమ్మాయి " ఉ... హూ... నాకు రేపు పెళ్లి... పెళ్లి తర్వాత జాబ్ చెయ్యడం వాళ్ళకి ఇష్టం లేదు..."


ఒక పాప " సరే అక్క... లాస్ట్ స్టొరీ కదా... మంచి కథ చెప్పు..."


అమ్మాయి అందంగా నవ్వుతూ " సరే... చెప్తాను.... కథ పేరు ఎగర లేని ఒక పక్షి కథ..."


పాప " ఎగరలేని వాటిని పక్షి అని అంటారా..."


అమ్మాయి " నవ్వుతూ... ముందు చెప్పేది వినండి...


అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు మీద చిన్ని గూడు కట్టుకొని ఒక పెద్ద పక్షి ఆ పక్షి... కి భార్య గా ఇంకో పక్షి... వాళ్ల కొడుకు గా బుల్లి పక్షి వుంటున్నాయి...


అనుకోకుండా ఆ అడవికి ఒక వేట గాడు వచ్చాడు... ఆ వేట గాడి కన్ను ఆ పెద్ద పక్షి మీద పడి దానిని చంపి దాని ఈకలు వాటితో మంచి మంచి ఆకర్షణీయమైన వస్తువులు చేసి అమ్మలి అనుకున్నాడు...


అనుకున్నదే తడువుగా ఆ పెద్ద పక్షి వెంట వెళ్ళాడు... ఆ పక్షి తన గూటి కి వెళ్తూ తనతో తన భార్య పక్షి నీ కూడా తీసుకు వెళ్ళింది... ఆ గూటి లో పిల్ల పక్షి నీ కూడా చుసి అన్నిటినీ చంపేసి భార్య పక్షి గోర్లు... ఈకలు... అలాగే పెద్ద పక్షి గోర్లు ఈకలు తో మంచి గా లాభం పొందాలి ఆ చిన్ని పక్షి నీ చంపి పొట్ట నింపుకోవాలి అనుకున్నాడు... అనుకున్నట్టే అతని దగ్గర వున్న భానం తో ఆ పక్షి గూటి కి గురి పెట్టీ కొట్టాడు... ఆ బాణం పిల్ల పక్షి కి తగిలేది క్షణాల్లో గమనించిన పెద్ద పక్షి అడ్డుగా నిలబడే సరికి పాపం ఆ పెద్ద పక్షి కి ఒక రెక్క తెగిపోయింది.


అది చూసి భార్య పక్షి... పిల్ల పక్షి... భోరున ఏడుస్తుంటే... " మీరు ఎగిరిపొండి నేను ఆ వేట గాడికి బలి అవుతాను " అని చెప్పింది. కానీ బుల్లి పక్షి కి ఇంక రెక్కలు రాలేదు.."


ఈ రోగ ఒక పాప " అయ్యో ఇప్పుడు ఎలాగ..." అంటే...


ఆ అమ్మాయి " చెప్తాను... దానికి భార్య పక్షి " మీరు లేకుండా మేము వెల్లము" అని గొడవ చేస్తే... ఆ పెద్ద పక్షి " ఎలాగ నేను ఎగర లేను కదా..." అని అనింది.


అది చూసి ఆ భార్య పక్షి చుట్టూ చుసి ఒక దగ్గర విరిగి పోయిన ఒక చెట్టు కొమ్మ నీ తను మోయగలిగే అంతా చిన్న కర్రగ విరిచి తీసుకువెళ్ళే లోగా ఆ వేటగాడు తన దగ్గర ఉన్న కత్తితో ఆ భార్య పక్షి రెక్క కూడా తెగ కోసాడు...


నొప్పికి విలవిల ఆడిన కూడా తన తో పాటు తన భర్త పక్షి... పిల్ల పక్షి నీ కాపాడుకోవాలి అని ఆ కొమ్మ నీ తీసుకొని ఒక్క రెక్కతోనే చాలా కష్టం గా వున్న గూటి వరకు వెళ్ళి పెద్ద పక్షి ఒక మూల చిన్న పక్షి మద్యలొ ఇంక భార్య పక్షి రెండో మూల పట్టుకొని ఎగురుతూ వెళ్లిపోయాయి...


ఆ వేట గాడి నుండి తమ ప్రాణాలు అయితే గెలుచు కున్నాయి... కానీ రెక్క నీ కోల్పోయాయి... ఇప్పుడు ఆ మూడు పక్షుల్లో ఏ ఒక్క పక్షి కూడా ఒంటరిగా ఎగరలేదు... ఎక్కడికి వెళ్ళాలి అన్న కలిసే వెళ్ళాలి... కలిసే రావాలి..."


ఒక పాప " ఈ కథ లో నీతి ఎంటి అక్క..."


ఆ అమ్మాయి " ఈ కథ లో నీతి ఎంటి అనేది నాకు కూడా తెలియదు ఒక వేళ తెలిస్తే నేనే నా జీవితాన్ని బాగు చేసుకునే దాన్ని...


సర్లే ఇప్పుడు అది అంత ఎందుకు... మీకు కథ నచ్చిందా..." అంటే...


పిల్లలు అందరూ చప్పట్లు కొడుతూ " ఓ బాగా నచ్చింది..." అన్నారు...


ఆ అమ్మాయి " tq ఫ్రెండ్స్... సో థిస్ ఇస్ ధరణి... సైనింగ్ ఆఫ్ పర్మినెంట్ లి.." అని చెప్పేసి రేడియో స్టూడియో నుండి బయటకి వచ్చి పరుగున స్కూటీ మీద రెండు వీధుల అవతల వున్న చిన్న స్కూల్ కి వెళ్లి అక్కడ టీచర్స్ తో " ఇవాళ వీరూ ఎం గొడవ చెయ్యలేదు కదా మేడం..." అంటే


ఆవిడ " అది ఎందుకు లెండి... మీ కథ విన్న తర్వాత ఒక పిల్లాడు మీ విరాట్ దగ్గరకి వెళ్లి అదేంటి విరాట్ మి అమ్మకి పెళ్లి అంటుంది. నీకు డాడీ లేడా...?? అని అడిగాడు.


దానికి విరాట్ ఆ అబ్బాయి నీ కొట్టి అతని గురించి నా దగ్గర మాట్లాడవద్దు.. నీకు అతను అంటే ఇష్టం లేదు... అంటూ వాడికి వార్నింగ్ ఇచ్చాడు..." అని చెప్పింది టీచర్...


ధరణి " అయ్యో అవునా సోరి మేడం వీరూ కి నేను చెప్తాను... ఇంతకీ ఎక్కడ వీరూ..." అంటుండగానే ఒక అయిదేళ్ల పిల్లాడు పరుగున వచ్చి ధరణి కాళ్ళని చుట్టుకున్నాడు...


ధరణి వాడిని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుని " ఒకే మేడం మేము వెళ్తాము..." అనడం ఆలస్యం విరాట్ పరుగున వెళ్ళి ధరణి స్కూటీ దగ్గర నించున్నాడు... ధరణి వెళ్లి స్కూటీ స్టార్ట్ చేయటం ఆలస్యం వెళ్లి ధరణి వెనుక కూర్చొని ధరణి నడుము చుట్టూ చేతులు వేసుకుని కూర్చొని... " అమ్మి రేపటి నుండి నువ్వు వేరే ఇంటికి వెళ్లిపోతున్నా వూ అంట కదా మళ్లీ మన ఇంటికి రావా... " అని అడిగితే ధరణి కంట్లో నీళ్ళు తిరిగాయి... వెంటనే అది వీరూ కి కనిపించకుండా తుడుచుకొని " అల ఎం లేదు నాన్న నేను కొత్త ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులకు నిన్ను కూడా అక్కడికి తీసుకు వెళతాను..." అని అంటుంది.


దానికి వీరూ నవ్వుతూ అంతలోనే ఏడుపు మొహం పెట్టి " వద్దు అమ్మి మళ్లీ వాళ్లు నిన్ను ఎన్ని అంటారో... అమ్మమ్మ తాతయ్య కూడా అలానే కదా... ప్లీజ్ అమ్మి వద్దు..." అంటుంటే... ధరణి ' నాకు కూడా వద్దు అనే చెప్పాలి అని వుంది వీరూ కానీ ఎం చేస్తాం అమ్మ నా దగ్గర మాట తీసుకుంది.' అని మనసులో అనుకొని చిన్న జీవం లేని చిరు నవ్వు నవ్వి ఊరుకుంది. వీరూ కి కూడా ఇది అంతా మామూలే కాబట్టి ఇంకేం మాట్లాడలేదు.


తెల్లటి పాలలో పసుపు కలిపితే వచ్చే రంగు... కాటుక అద్దక పోయినా అందంగా వుండే కళ్ళు... కానీ వాటిలో జీవం లేదు... కోటేరు లాంటి ముక్కు... అందమైన పెదవులు చెర్రిల వున్నాయి... కానీ నవ్వు లేదు... చూసిన ఎవరినైనా ఆకట్టుకునే మోము కానీ మొహం కళ లేదు... వయసు 27 ఏళ్ళు అయినా కూడా ఇంక 23 ఏళ్ల అమ్మాయి లా వుంది... పేరు ధరణి...


తనకి 22 ఏళ్ల అప్పుడే ఒక బాబు పుట్టాడు... పేరు విరాట్ శివమ్ కానీ వాడికి శివమ్ అని పిలిస్తే అస్సలు నచ్చదు... తెల్లటి తెలుపు తో నీలి కళ్ళతో పాలు గారే బుగ్గలతో మాటలు తూటాల లా పెల్చేస్తాడు... విరాట్... విరాట్ నీ వీరూ అని కేవలం వాళ్ల అమ్మ మాత్రమే పిలవాలి. మిగిలిన అందరూ విరాట్ అనే పిలవాలి.


పెళ్లి కాకుండా నే ఒక బిడ్డ కి జన్మ నీ ఇచ్చిన అమ్మాయి నీ ఎవరు పెళ్లి చేసుకుంటారు... అలా అని సొంత కూతురుని ఎన్ని రోజులు అని ఇంట్లో పెట్టీ పోషిస్తారు... అందుకే ధరణి తల్లితండ్రులు ధరణి నీ పెళ్లి చేసుకో మని అడిగితే కొడుకు తో కలిసి విడిగా ఒక ఇల్లు అద్దెకి తీసుకుని చిన్న చిన్న పనులు చేసుకుంటూ బాబు నీ స్కూల్ కి పంపిస్తూ ఇంటిని నడిపించుకుంటూ వస్తుంది ధరణి.


కొనసాగుతుంది...


మీ ఆధారణ బట్టే నా కధ.. 🤗🤗