వైజాగ్
అదోక పెద్ద కాలేజ్ ..... క్యాంపస్ కి వెళ్ళే దారి మొత్తం చెట్లతో చాలా బావుంది ........
ర్యాగింగ్ లాంటివి జరుగుతూ ఉంటాయ్ కాని .......
అమ్మాయిలు బాధపడేలా ఉండవ్ ....... ఆ కాలెజ్ లో రూల్ అది ........
ఒక అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది .......
అందరూ ఆమె వైపు వినయంగా చూస్తూ గుడ్ మార్నింగ్ మామ్ అని విష్ చేస్తూ ఉంటారు .....
నుదుటిన చిన్న స్టికర్ ,,, కలువలాంటి కళ్లకి కాటుక ,,,,, చిన్న ముక్కు ,,,,,,, పింక్ కలర్ లో ఉండే చిన్న పెదవులు ,,,, కింద పెదవి చివర చిన్న పుట్టు మచ్చ ,,,,, పొడుగైన మెడ,,,,,, మెడలో హంస డాలర్ ఉన్న బ్లాక్ చైన్ ,,,,,,,, కుడి చేతికి సింగిల్ బేంగిల్ ,,,,,, ఎడమ చేతికి బ్లాక్ కలర్ వాచ్ ,,,,, నడుం వరకు ఉన్న జుట్టుని లూజ్ గా అల్లుకుని ,,,,,,, పింక్ కలర్ కి బ్లూ బోర్డర్ ఉన్న కాటన్ చీరతో చాలా హుందాగా నడుస్తూ విష్ చేస్తున్న వాళ్ళకి చిరునవ్వుతో సమాధానం చెప్తూ స్టాఫ్ రూమ్ కి వెళ్తుంది ఆమె .........
అ అమ్మాయి కి జస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ...... తన టాలెంట్ వల్ల తక్కువ ఏజ్ లోనే కాలెజ్ లెక్చరర్ గా జాబ్ సంపాదించింది .......
ఆమె ప్రిన్సి రూమ్ కి వెళ్ళి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తుంది ........
శ్రీనివాస్ గారు ఆమె వైపు ప్రేమగా చూస్తూ గుడ్ మార్నింగ్ ఆనంది అని విష్ చేస్తారు ........ ఆమె అంటే శ్రీనివాస్ గారికి ఎంతో గౌరవం ...... చిన్న వయసులో ఇంత టాలెంట్ ,,,,,, ఆమె క్లాస్ చెప్పే విధానం ఆయనకి చాలా నచ్చుతాయి ...... ఆమె వచ్చి వన్ ఇయర్ నే అయినా తన చెప్పే మాథ్స్ క్లాస్ కి మాత్రం స్టూడెంట్స్ అస్సలు మిస్ అవరు ....... అంత ఈజీ గా,,,,, నేర్పుగా తన సబ్జెక్ట్ ఎక్స్ప్లెన్ చేస్తుంది .......
ఆమె సైన్ చేసి తన క్లాస్ కి వెళ్తుంటే ఆనంది ఆగవే అని వెనక నుండి అరుస్తుంది ఒక అమ్మాయి ....... ఆనంది వెనక్కి తిరిగి ఎవరా అని చూసి స్వప్న నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అంటుంది .......
ఆమె అయాసంగా బాక్స్ మర్చిపోయావే ..... నేను ఆఫీస్ కి వెళ్తు ఇచ్చేద్దాం అని వచ్చా !!!!! నవ్వుతూ అంటుంది .......
ఎందుకే నేను క్యాంటీన్ లో తినేదాన్ని కదా !!!!!! ఆమె కోసం రావడంతో నోచ్చుకుంటూ అడుగుతుంది ........
స్వప్న విసుక్కుంటూ చాలు !!!!! నీ గురించి నాకు తెలుసు ...... క్యాంటీన్ లో తింటావో ,,, తినవో ...... బాయ్ లెట్ అయిపోయింది అని చెప్పి స్వప్న ఆఫీస్ కి వెళ్ళిపోతుంది .......
ఆమె క్లాస్ కి వెళ్ళి తన సబ్జెక్ట్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది ......
ఆమె మాథ్స్ లో సమ్స్ ని వివరించే తిరుకి స్టూడెంట్స్ అందరూ మెస్మరైజ్ అయిపోతూ ఉంటారు .......
తన క్లాస్ చెప్పడం అయిపోయాక స్టాఫ్ రూమ్ కి వెళ్ళి కూర్చుంటుంది ........ ఆమె ఎవ్వరితో ఎక్కువగా మాట్లాడదు ....... ఒకరు మాట్లాడానికి చూసిన చిరు నవ్వుతో చిన్న సమాధానం చెప్పి ఊరుకుంటుంది .......
కోంతమంది పోగరు అనుకున్న ,,,,, ఆమె తన లోకంలో తను ఉంటుంది .........
స్టాఫ్ రూమ్ లో ఉన్నప్పుడు నెక్స్ట్ క్లాస్ కి ఎలా ఈజీ వే లో సమ్స్ చెప్పాలో ఆలోచించుకుంటూ గడిపేస్తుంది ......... లేదా లైబ్రెరీలో తనకి నచ్చిన బుక్స్ చదువుతూ గడిపేస్తుంది .......
************
ఫెమస్ ఫైవ్ స్టార్ హోటల్ అది ...... రూమ్ నెంబర్ ఫీఫ్టీ ఫైవ్ లో ఇద్దరి మూల్గులు వినిపిస్తూ ఉంటాయి .........
అవి రోమాన్స్ అనుకుంటే మీరు సంబార్ లో లెగ్ వేసినట్టే ......... ఆ రూమ్ లో డ్రగ్స్ దందా చేయ్యడానికి వచ్చిన ఇద్దరు వెధవలని ఊతికి పడేస్తే వాళ్ళు నోప్పులకు తాళలేక ,,,, అరవకుండా నోట్లో క్లాత్ పెట్టడం వల్ల వస్తున్న సౌండ్స్ అవి .......
వాళ్ళ ఎదురుగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి మీరు కోట్టినా చెప్పట్లేదు ..... సో ఒకటే దారి !!!! గన్ ఎయిమ్ చేసి పాయింట్ బ్లాక్ లో పెడతాడు .......
ఒరేయ్ నాకు ఓపిక చాలా తక్కువ ....... త్వరగా చేప్తే జైల్ కి వెళ్తారు ....... లేకపోతే హెల్ కి పోతారు ....... నీకు త్రి సెకెండ్స్ టైమ్ ఇస్తున్నా ....... ఆ తరువాత నీ ఇష్టం అని కౌంట్ చేస్తూ ఉంటాడు .........
అయినా వాళ్ళు నోరు తెరవకపోవడంతో ఒకడిని షుట్ చేసి చంపేస్తాడు ...... ఇంకొకడు వాడు చచ్చిపోయినందుకు భయపడుతూ నోట్లో క్లాత్ తియ్యండి అన్నట్లు చూస్తాడు ......
అయ్యాయ్యో తీయ్యడం మర్చిపోయానా ...... గుర్తు చేయ్యాలి కదా రా అని నోట్లో ఉన్న క్లాత్ తీసి ఇప్పుడు చెప్పరా ....... నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నాడు మీ బాస్ అని రౌద్రంగా అడుగుతాడు .........
అతను ఒక కాలేజ్ నెమ్ చెప్పడంతో ఆశ్చర్యపోయి తరువాత కోపంగా వాడిని ఒక్కటి పీకుతాడు .......
అతను కోట్టిన దెబ్బకి వాడి రెండు పళ్ళు ఊడి కింద పడితే వాడి కాలర్ పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్తాడు ........
జైహింద్ సార్ అని తన పై ఆఫీసర్ కి సెల్యూట్ చేసి సార్ ఒకడిని పట్టుకుని నెక్స్ట్ ప్లాన్ ఎంటో తెలుసుకున్నా ...... అని గంభీరంగా చెప్తాడు .......
పై ఆఫీసర్ ఆశ్చర్యంగా అదేంటయ్యా ఇద్దరు క్రిమినల్స్ కదా ....... ఒక్కరిని పట్టుకోవడం ఎంటి అని కోపంగా అడుగుతారు ........
వాళ్ళలో వాళ్ళకి గోడవ వచ్చి ఒకరు చనిపోయారు సార్ అని ఇన్నోసెంట్ గా చెప్తాడు అతను ........
మిస్టర్ శివరాజ్ ఇది జోక్ కాదు....... మీరిలా చేస్తుంటే నేను పై ఆఫీసర్స్ కి ఎమని ఆన్సర్ చేయ్యాలి .... కోపంగా అంటారు పై ఆఫీసర్ ........
నేను చెప్పిందే చెప్పండి సార్ అని చిన్నగా నవ్వుతూ మరోసారి సెల్యూట్ చేసి కెసెస్ ఎమ్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళిపోతాడు ........
" ఏ. సి. పి శివరాజ్ " చాలా ఆటిట్యూడ్ ఉన్నోడు ...... అతను ఏదైనా కేస్ మీద ఒక్కసారి ఫోకస్ చేస్తే దాని అంతు చూడకుండా వదిలిపెట్టడు ....... విశాలమైన నుదురు ,,,,, చిరుతలాంటి పదునైన తెనె రంగు కళ్ళు ,,,,,, రఫ్ బియర్డ్ ,,,,,, విశాలమైన చాతి ,,,,,, బలమైన కండలు ,,,,,,, తెల్లని మెనిఛాయ ,, చూడటానికి హట్ మిర్చి లా ఉంటాడు ........
అతను నేరుగా ఇంటికి వెళ్ళి బెల్ కోడతాడు ...... ఒకామె తలుపు తీసి ఆనందంగా చూస్తూ కన్నా వచ్చావా అని లోపలికి తీసుకెళ్తారు .......
అతను ఆమె ఒడిలో తల పెట్టుకుంటూ మామ్ ఆకలి వేస్తోంది అని ఇన్నోసెంట్ గా అడుగుతాడు ......
ఆవిడ కంగారుగా ఫ్రెష్ అయ్యి రా కన్నా ....... నేను టీఫిన్ నీ రూమ్ కి తెస్తా అని అంటారు ........ నాన్న కాలేజ్ కి వెళ్ళారా అని అడుగుతాడు పైకీ వెళ్తూ .......
హ..కన్నా !!! అని సమాధానం ఇస్తే అతను ఫ్రెష్ అవ్వడానికి రూమ్ కి వెళ్ళిపోతాడు .......
వాష్రూమ్ లో షవర్ నుండి వెచ్చగా వేడి నీళ్ళు వస్తుంటే అతనికి హయిగా ఉంటుంది ....... అరగంట షవర్ కింద గడిపి ట్రాక్ ,,,, టీ షర్ట్ వేసుకుని బెడ్ మీద కూర్చుని ఫోన్ చెక్ చేస్తుంటే తులసి గారు టీఫీన్ అతని రూమ్ కి తెస్తారు .......
తినిపించు మామ్ ..!!!
తులసి గారు కడుపునిండా తినిపించి కాసేపు రెస్ట్ తీసుకో అని డోర్ దగ్గరగా వేసి వెళ్ళిపోతారు ........
అతను నైట్ నుండి కేస్ పనిమీద ఉండటంతో ఏ. సి చల్లదనానికి నెమ్మదిగా కళ్ళు మూసుకుంటే వేంటనే డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతాడు .........
*******×**********
కాలేజ్ లో తన క్లాసెస్ అయిపోవడంతో ఈవినింగ్ త్వరగా వచ్చేస్తుంది ఆనంది ......
అప్పటికి స్వప్న తన ఆఫీస్ నుండి ఇంకా రాకపోవడంతో ఫ్రెష్ అయ్యి కాఫీ కలుపుకుని బాల్కనీ లో కూర్చుంటుంది ......
చిన్న ఫ్లాట్ రెంట్ కి తీసుకుని స్వప్న,, ఆనంది కలిసి ఉంటున్నారు ........
ఫస్ట్ ఇద్దరూ హస్టలో ఉండేవారు...... కాని వాళ్ళకి అక్కడ వాతావరణం నచ్చక చిన్న ఫ్లాట్ రెంట కి తీసుకుని ఉంటున్నారు ....... డబల్ బెడ్ రూమ్ ,,, చిన్న కిచెన్ ,,, బాల్కనీ ,,, చిన్న హల్ ,,, ఇద్దరూ ప్రశాంతంగా ఎటువంటి గోడవలు లేకుండా ఉంటున్నారు ........
స్వప్న వచ్చే టైమ్ కి ఆనంది కూకింగ్ చేసేసి బాల్కనీ లో కూర్చుని బుక్ చదువుకుంటూ ఉంటుంది .......
సెవెన్ అవుతుంటే స్వప్న వచ్చి నీరసంగా సోఫాలో కూర్చుంటుంది ........
ఆమె వాలకాన్ని చూసి నవ్వుతూ ఇంకో చోట జాబ్ లో జాయిన్ అవ్వచ్చు గా స్వప్న ..... అంత స్ట్రెస్ ఫీల్ అవుతుంటే అని లాలనగా అంటుంది .......
ఇంకో జాబ్ కి అప్లికేషన్ పెట్టానే ...... అక్కడ జాబ్ గురించి ఫీఫ్టీన్ డేస్ లో చెప్తా అన్నారు ....... అప్పటి వరకు ఇక్కడ తప్పదు అని విసుపుగా అంటుంది .......
స్వప్న తన కడుపుని పట్టుకుని ఎలుకలు తిరుగుతున్నాయే ..... ఫుడ్ పెట్టి పుణ్యం కట్టుకో అని బేలగా అంటుంది .......
ఆమె పెట్టిన ఎక్స్ప్రేషన్ కి ఆనంది గట్టిగా నవ్వుతూ పదా !!! కూకింగ్ చేసా ..... ఫ్రెష్ అవ్వు !!!! తినేద్దాం అంటుంది ........
ఆమె ఫ్రెష్ అయ్యి రావడంతో కడుపునిండా బోజనం తిని స్వప్న నవ్వుతూ మీ ఆయన నీ చేతి వంట కి పడిపోతాడే అని ఆమె బుగ్గకి ముద్దు పెట్టి తన రూమ్ లోకి వెళ్ళిపోతాడు .......
ఆమె ఆ మాట విని చిన్నగా నవ్వుకుంటూ బుక్ పట్టుకుని కూర్చుంటుంది .........
ఎప్పటికో బుక్ పక్కని పెట్టి వదలని ఆలోచనలతో నిద్రలోకి జారుకుంటుంది ......
ఇంకా ఉంది .......