Read andamina parichayam by Melam Sagar in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అందమైన పరిచయం

అర్ధరాత్రి సమయం పది గంటలు
చుట్టుపక్కల ఎవరూ కనబడటం లేదు
రోడ్డు మీద ఎవరూ లేరు
రాత్రిపూట రోడ్లను ఊడ్చే వాళ్ళని చూపిస్తాం


రోడ్డు మీద నుంచి కెమెరా అలా ముందుకు వెళుతూ ఉంటుంది
బ్యాక్ గ్రౌండ్ లో హీరో మాట్లాడుతూ ఉంటాడు
హీరో - మనం అనుకున్నట్టు మన జీవితం ఎప్పటికీ ఉండదు అలా ఉంటే నేను ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటాను
అని మాట్లాడుతూ ఉంటాడు
కెమెరా హీరో దగ్గరికి వెళ్తుంది
అక్కడ కూర్చొని హీరో కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు
హీరో - జీవితం అంటే నాలుగు అక్షరాలే కాదు వెళ్లి చూస్తే ఎంతో లోతు ఉంటుందంటే అప్పుడు నేను నమ్మలేదు ఇప్పుడు నా నమ్మకంతో ఎవడికి పని లేదు
హీరో కుక్కతో మాట్లాడుతూ ఉంటాడు హీరో కుక్క తో మాట్లాడటం హీరోయిన్ చూస్తుంది


అంజలి - ఏంటి ఏమైంది కుక్కతో మాట్లాడుతున్నారు
సాగర్ - ఏం లేదు నాలోని బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక దాంతో చెప్పుకుంటున్నాను
అంజలి - అయినా మిమ్మల్ని చూస్తే ఏ బాధ లేనివారిలా ఉన్నారు
సాగర్ - చేతిని చూసి జాతకాలే కాకుండా మనిషిని చూసి వాడిలో బాధ ఉందో లేదో కూడా చెప్తున్నారా
అంజలి - అదేం లేదండి నేను ఏదో మామూలుగా చెప్పాను
సాగర్ - ఇంతకీ మీ పేరు
అంజలి - నా పేరు అంజలి
సాగర్ - అంజలి గారు మిమ్మల్ని ఒకటి అడగొచ్చా
అంజలి - హా చెప్పండి
సాగర్ - మీకు నేను తోడుగా నడవచ్చా
అంజలి - ఏంటి
సాగర్ - నిజానికి మీరు నాకు తోడు అలా చెప్పలేక ఇలా చెప్పాను సరే మీరు నాకు తోడుగా వస్తారా
అంజలి - సరే ఎక్కడ వరకు వెళ్దాం
సాగర్ - మన గమ్యం చేరేంత వరకు వెళ్దాం

అంజలి సాగర్ అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు వాళ్ళిద్దరి పక్కన ఒక కుక్క ముగ్గురు వెళుతూ ఉంటారు

సాగర్ - అవునండి ఇంటి గడపే దాటని ఆడపిల్ల ఇక్కడ వరకు రావటానికి కారణం తెలుసుకోవచ్చా
అంజలి - నాకే తెలియని నా ప్రశ్నకి సమాధానాన్ని వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను

అంజలి - ఇంతకీ మీరు ఏం చేస్తూ ఉంటారు
సాగర్ - చదవడానికి ఎంతో చదువువున్నా చదివింత జ్ఞానం మనలో లేదని ఆ నిజాన్ని తెలుసుకుని ఏం చేయాలో అర్థం కాక ఇలా తిరుగుతున్న
అంజలి - సరే అయితే ఇలా ఎందుకు వచ్చినట్టు
సాగర్ - ఈ లోకంలో సమాధానం లేని ప్రశ్న అంటూ ఏదీ ఉండదు నాలోని ఒక ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కుంటూ ఇలా వచ్చాను
అలా వెళుతున్నా వాళ్లకి రోడ్డుమీద ఒక లెటర్ దొరుకుతుంది
ఆ లెటర్ ని హీరోయిన్ చదువుతుంది
అంజలి - గమ్యమే లేని నా జీవితంలోకి దారి వేసుకుంటూ నువ్వు వచ్చావు వెలుతురే లేని నా ప్రపంచంలో నువ్వు వెలుగుల్ని నింపావు
నా ప్రాణం అయిపోయావు నాలో సగం అయిపోయావు
నీతో ఇన్ని మాటలు చెబుతున్నా నాకు ఆ ఒక్క మాట చెప్పడానికి మాత్రం ధైర్యం సరిపోవటం లేదు

అంజలి - ఎంత బాగా రాసాడో కదా
సాగర్ - ఎంత బాగా రాస్తే ఏంటి చెప్పాల్సిన మాట చెప్పలేదు కదా
అంజలి - ఏంటది
సాగర్ - ఐ లవ్ యు
అంజలి - హా
సాగర్ - వాడు ఆ అమ్మాయికి చెప్పాల్సిన మాట
అంజలి - అది మీకు ఎలా తెలిసింది
సాగర్ - తెలిసేది ఏముంది
దారి చూపించి వాడి జీవితంలో వెలుగులు నింపిన ఆ అమ్మాయిని వాడు వాడిలో సగంగా భావిస్తున్నాడు ఇంతకంటే ఎలా చెప్తాడు వాడు అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని
అంజలి - చదివిన నాకు అర్థం కాలేదు విన్న మీకు ఇంత అర్థమైందా
సాగర్- చదివింది అర్థం చేసుకోవడం కాదు దానిలోని అర్ధాన్ని అర్థం చేసుకోవాలి
అంజలి - ఇంతకీ మీరు ఎవరైనా ప్రేమించారా
సాగర్ - ప్రేమంటే ప్రేమించడం మాత్రమే కాదు ప్రేమించిన వారితో జీవించడం
అలా నిజంగా జీవించగలం అనుకుంటేనే ప్రేమించాలి
అయినా నేను ఎప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు
అంజలి - అప్పుడంటే నిజమైన ప్రేమ కనిపించలేదు కాబట్టి ప్రేమించలేదు నిజమైన ప్రేమ కనిపిస్తే ప్రేమిస్తారా
సాగర్ - నిజమైన ప్రేమ కనిపించదు మనసు కు అనిపిస్తుంది
అలా అనిపించిన రోజు ఆలోచిస్తాను
అంజలి - మీ దృష్టిలో నిజమైన ప్రేమ అంటే ఏంటి
సాగర్ - నాకు తెలిసి నిజమైన ప్రేమంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం అర్థం చేసుకొని జీవించడం
ఇప్పుడు ఎక్కువ శాతం గొడవలు ఒకరికి ఒకరు అర్థం కాక గొడవలు వస్తున్నాయి
అదే ఒకరి గురించి ఒకరు తెలుసుకోనే
ప్రయత్నం చేస్తే వారి జీవితంలో ఎప్పటికీ గొడవలు రావు
ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉంటారు
అంజలి సాగర్ చెయ్యి పట్టుకుంటుంది

సాగర్- ఏంటిది
అంజలి - నీకు ధైర్యం కోసం నన్ను తోడుగా నడవమన్నావు
ఇప్పుడు నా ధైర్యం కోసం నీ చేయి పట్టుకున్నాను
అంటుంది

అలా అంజలి సాగర్ చెయ్యి పట్టుకుని వెళుతూ ఉంటుంది

సాగర్ - ప్రతి అమ్మాయి తనకు ఇష్టమైన పనులను చెయ్యాలి అనుకుని చెయ్యలేకపోతున్నారంట
అలా నీకేమైనా కోరికలు ఉన్నా య

అంజలి - నాకు ఎన్నో కోరికలు ఉన్నాయి
1 ఎక్కడికి వెళ్తున్నామో తెలియకూడదు అది ఎలా ఉంటుందో తెలియకూడదు అలాంటి ఒక ప్లేస్ కి వెళ్ళాలి
సాగర్ - ఇంకా
అంజలి - హా చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను
అలా ఇద్దరు కొద్దిగా ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ ఒక బస్సు ఉంటుంది ఆ బస్సు నిండా జనం ఎక్కి ఉంటారు
సాగర్ - పద ఈ బస్సు ఎక్కుదాం
అంజలి - సరేలే కానీ ఎక్కడికి వెళ్తున్నామ్
సాగర్ - ఈ బస్సు ఎక్కడికి తీసుకు వెళుతుందో తెలియదు అక్కడ ఎలా ఉంటుందో తెలియదు కానీ వెళ్తే బాగుంటుంది అని మాత్రం తెలుసు
ఇద్దరు బస్ ఎక్కుతారు బస్సు వెళుతూ ఉంటుంది
హీరో బస్సు ని మధ్యలో ఆపమంటాడు
అంజలి - ఎందుకు
సాగర్ - చెప్తాను దిగు
అంజలి - వెళ్తున్నావ్ కదా ఎందుకు మధ్యలో ఆపేసావ్
సాగర్ - అలా ఆ బస్సులో వెళ్తే ఎక్కడికి వెళ్తున్నాము నీకు తెలుస్తుంది అదే ఇలా మధ్యలో దిగితే ఎక్కడికి వెళ్తున్నాము నీకు కాదు కదా ఎక్కడికి వెళ్తున్నాము నాకు కూడా తెలియదు
నువ్వే చెప్పావు కదా ఎక్కడికి వెళ్తున్నామో తెలియకూడదు ఎలా ఉంటుందో తెలియకూడదు అని అందుకే ఇలా తీసుకెళ్తున్నారు

అని ఒక అడవికి తీసుకువెళ్తాడు

అంజలి - ఏంటి అడవికి తీసుకువచ్చావ్
సాగర్ - ఇంత రాత్రివేళ ఎప్పుడైనా అడవికి వస్తావని అనుకున్నావా
అంజలి - లేదు
సాగర్ - నువ్వు ఇక్కడికి వస్తావని తెలియకుండా ఇక్కడికి వచ్చావు
సాగర్ - ఎప్పుడైనా ఇంత దగ్గరగా అడవిని చూసావా
అంజలి - హా లేదు
సాగర్ - నీ మొదటి కోరిక నీకే తెలియకుండా తీరిపోయింది తెలుసా
అంజలి -హా అవును కధ
హీరో చెయ్ పట్టుకొని దొంగతనం చేయాలి అంటుంది
సాగర్ - ఏంటి
అంజలి - చెప్పాలి అనిపించినప్పుడు చెప్తాను అన్నాడు కదా
నా ఇంకొక కోరిక దొంగతనం చేయాలి

ఇద్దరు కలిసి ఒక ఇంట్లోకి వెళ్తారు

ఇద్దరు చిన్నగా నడుస్తూ ఉంటారు

సాగర్ - దొంగతనం అంటే చాలా పెద్దదిగా కాకుండా ఏదైనా చిన్నది దొంగతనం చెయ్

హీరోయిన్ వెళ్లి ఆ ఇంట్లో ఫ్రిజ్ తెరిచి చాక్లెట్లు తీసుకుంటుంది

ఇద్దరు కలిసి బయటకు వస్తారు

సాగర్ - ఏం దొంగతనం చేసావ్
హీరోయిన్ చాక్లెట్ ను చూపిస్తుంది
అంజలి - ఈ సమయంలో నాకు అంతగా డబ్బుతో అవసరం లేదు నాకు కావాల్సింది ఇవే
అని మళ్లీ హీరో చేయి పట్టుకుంటుంది
అంజలి - నేను ప్రేమించిన వాటికి నా ప్రేమ విషయం చెప్పాలి

సాగర్ - ఆ రెండు కోరికలు అంటే ఎలాగోలా అయిపోయా
ఈ మూడో కోరికను ఎలా తీర్చాలి అని కొద్దిసేపు ఆగి
ఏమన్నావ్? మళ్లీ చెప్పు
అంజలి - I love you
నా మూడవ కోరిక నేను ప్రేమించిన వాడికి ఐ లవ్ యు చెప్పటం
చెప్పేసాను నేను ప్రేమించింది నిన్నే
I love you

హీరో హీరోయిన్ ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఇద్దరు నడుచుకుంటూ వెళుతూ ఉంటారు


ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు కానీ అదే ప్రేమని అర్థం చేసుకోవాలంటే జీవితం కూడా సరిపోదు
ప్రేమ అందరికీ పుడుతుంది కానీ ఆ పుట్టిన ప్రేమ ని అర్థం చేసుకోవాలి

💙 ఒక నిజమైన ప్రేమ కథ చెప్పాలి అనుకున్నను నేను అనుకున్నట్టే ఒక కథను చెప్పాను ❤️