Read Andamaina Prapancham by mounika in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

Andamaina Prapancham

సముద్రం  పొంగుతూ సునామి ల అయిపోయి ఒక పెద్ద అల పెద్ద ఎత్తున్న  మా వైపే వచ్చేస్తుంది

శ్రీ: ఉన్నటుండి ఈ సముద్రం ఎక్కడనుంచి వచ్చిందే  డ్రైవర్ అన్న ,డ్రైవర్ అన్న  వెనక్కి  తిప్పు బండిని అని అందరం వణికిపోతూ అన్నాం .

అక్ష: ఓరినాయనో  దేవుడిని చూడడానికి వస్తే  ఆ దేవుడి దగ్గరకేవెళ్ళిపోయినట్టున్నాం

డ్రైవర్ ని బండి తిప్పమంటుంటె అతను మాటలు వినిపించుకోకుండా అల వస్తున్నవైపుగా దూసుకుపోయాడు ఇంక అయిపోయాం అని అనుకున్నాం  ఆ క్షణం ఏం జరుగుతుందో అర్ధం కాలేదు  వింతగా ఆ సముద్రం ఆ పెద్ద అల తో సహా ఈ బండి కి దారి ఇచ్చింది ఇటు సముద్రం అటు సముద్రం ఆకాశానికి ఏతేసినంత అల దాని మధ్యలో ఈ బండి దానిలో మేము .  మాకు   ఏం జరుగుతుందో అర్ధం కాలేదు అలా కొన్ని నిముషాలు ఆ సముద్రం మధ్యనుంచి  ఆ బండి పోయింది ఆ తర్వాత  మరల ఎదస్థితి కి వచ్చింది ఆ సంద్రం నుంచి బయటకి వచ్చేసాం .

 ఏమవుతుందో అని అంధోలోనలో , అక్కడ ఏం జరుగుతుందో తెలియని నా ఫ్రండ్స్

అందరం ఒకుదిటిన నార్మల్ స్థితికి వచ్చాము అలా కొంతదూరం పోయిన తర్వాత  చక్కని పచ్చదనం అది వసంత కాలం కావడంతో పక్షుల కిల కిల రాగాలు ఎంతో మధురంగా ఉంది ఇటు చెట్లు అటు చెట్లు మధ్యలో సన్నని దారి  బండి వెళ్ళేటట్టుగా అంతా దట్టమైన అడవి ఎక్కడ జనసంచారం ఉన్నట్టుగాలేదు ఆ సన్నని దారివెంట డ్రైవర్ బండి ని పొనిస్తున్నాడు ఎదురుగా మబ్బులు మబ్బుల మధ్యలో

సూర్యుడు అస్తమిస్తున్న ఎర్రటి కాంతుల మధ్య  డేదివ్యమానంగా వెలుగుతున్న గుడి ఆకాశం లో నే ఉన్నదీ అనేట్టుగా  మనసుకు మైమరిపించేంతగా ఉన్నదీ . బండి ఒకదగ్గర గా ఆగింది . 

డ్రైవర్: మీరు రావలిసిన ప్లేస్ కి వచ్చేసారు దిగండి అని అన్నారు

నేను, శ్రీ , ఫ్రండ్స్ అందరం బస్సు నుండి దిగాం కాళ్ళు బయటపెట్టామో లేదో ఇక్కడకి ఎప్పుడో వచ్చిన్నట్టు అనిపించింది. అక్కడకి ఎలా వచ్చారో తెలీదు మా ఎదురుగా 5  గురు  మనుషులు  కనిపించారు. వాళ్ళు సుమారు మధ్య వయసుకుళ్ల ఉన్నారు  కాసాయి వస్త్రాలు ధరించి ఉన్నారు.   వాళ్ళని చూస్తూనే దణ్ణం పెట్టాం. వారు మాతో ఇలా అన్నారు

సూర్యుడి అస్తమించేసామ్యానికి చేరారు ఇక్కడే ఉండడం అంత మంచిది కాదు వాళ్ళు డ్రైవర్ ని పిలిచి శేషయ్య వీళ్ళకి నివాస స్థలము చూపించు అని మా బండి డ్రైవర్ తో చెప్పారు. అప్పటికి కానీ మా డ్రైవర్ పేరు శేషయ్య అని తెలియలేదు.

డ్రైవర్ శేషయ్య: రండి అమ్మ

అక్ష: అవును ఆ సాధువులు ఎవరు ?

శేషయ్య: వారు ఈ గుడిలో పూజలు చేస్తారు .

శ్రీ: అవును మీరు ఇందాక వస్తున్నప్పుడు  సముద్రం మధ్యనుంచి తీసుకువచ్చారు అది ఎలా సాధ్యం అయింది పైగా సముద్రం సునామి ల వచ్చింది మన వైపుగా?

శేషయ్య: ఏదైనా సరే మనం ప్రకృతికి గౌరవం  ఇచ్చినప్పుడు తిరిగి ప్రకృతి కూడా మనకి గౌరవం ఇస్తుంది మన కోసం అన్ని చేసే ప్రకృతికి మనం దాసోహం   ప్రకృతి  సిద్ధం గా మనకు అన్ని ఇస్తుంది మనం కూడా ఎటువంటి హాని   కలగకుండా ప్రకృతి ని చూసుకుంటె మనం ఏం చెప్పిన  ప్రకృతి కూడా వింటుంది . నీరు ,నింగి , వాయువు , అగ్ని,భూమి మన ప్రకృతి ఇవి లేనిదే మనిషి మనుగడ సాగదు. వాటిని ఎంత నీతిగా ఉంచుకుంటె అవి మనకి అంత మేలును చేకూరుస్తాయి. 

శేషయ్య మమల్ని తీసుకు వెళ్తున్న దారి అంత చాలా చీకటిగా ఉంది ఇంతలో యేవో గుస గుస లాడుకుంటున్న శబ్దాలు వినిపిస్తున్నాయి ఏంటి ఆ శబ్దాలు అని అడుగగా

శేషయ్య: శుహ్! మాట్లాడుకుండా రండి

అలా కొంత దూరం పోయిన తర్వాత ఆ శబ్దాలు దూరం అయ్యాయి

అక్ష:ఎందుకు మాట్లాడొద్దు అని అన్నారు ?

శేషయ్య: మన మానవ జాతి ఎలాగైతె మనకంటూ ఒక ప్రైవసీ ని కోరుకుంటామో ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి ఆ హక్కు ఉంది అది జంతువులు ఉండే నివాసం మీకు ఇక్కడ విచిత్రం ఏమిటో తెలుసా జంతువులు ఏం మాట్లాడిన మీకు వినిపిస్తాయి అవి మాట్లాడే మాటలు మీకు అర్థమవుతాయి కూడా కానీ మనసు పెట్టి వినాలి అప్పుడే అర్థమవుతాయి?

శ్రీ:అవునా ! ఇదేదో విచిత్రం గా ఉందే?

ఇంతలోమేము రావలిసిన ప్లేస్ కి వచ్చేసాం బయట అంతా పెద్ద గుహల ఉన్న లోపలమాకు ఇచ్చిన రూమ్ మొత్తం అంతా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో ఉంది రూమ్ లోకి వెళ్ళగానే ఆటోమేటిక్ లైట్స్ ఫాన్స్ వాటి అంతటా ఆవే వెలగ సాగాయి శేషయ్య మాకు కావలిసిన తిండి సదుపాయాలు అన్ని చూసుకొని అమ్మ విశ్రాంతి తీసుకోండి మళ్ళీ తెల్లవారగానే  వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా అలసటగా అనిపించింది అందరికి తిన్న వెంటనే

అక్ష: శ్రీ నాకు డ్రెస్  ఇవ్వవే  మంచి డ్రెస్సెస్ ఏమి తెచ్చుకోలేదు నువ్వు

తెస్తానన్నావు కదా !

శ్రీ: రేపు ఇస్తానులేవే !ఇప్పుడు  నిద్ర వస్తుంది పడుకో ?

అక్ష: సరే. బాగా అలసిపోవడం వల్ల ఎప్పుడు నిద్రపోయామో   తెలీదు పక్షులు కీచు కీచు మంటున్న  ఆ చప్పులకి తెలివి వచ్చేసింది నీళ్లు కేరళుతున్న సౌండ్

 వినిపిస్తుంది . ఏంటి ఆ శబ్దాలు  అని   బయటకి వెళ్లి చూసాం ఇంకా ఎక్కువుగా ఆ సౌండ్స్ వినిపిస్తున్నాయి ఇకెడెక్కడో జలపాతాం ఉన్నట్టు ఉంది అని అందరం వెళ్దాం అనుకున్నాం . శ్రీ ని లేపితె లేవలేదు  అని అందరం కలిసి వెళ్ళాం శ్రీ ని వదిలేసి. కొంచెం దూరం లోనే పెద్ద కోన వాగులోంచి జలపాతం కనిపిస్తుంది ఎంత అందంగా ఉన్నదో దూరం నుంచిచూస్తుంటె ఆ జలపాతం ఒక అమ్మాయిల కనిపిస్తుంది.

దగ్గరకి వెళ్ళాం అందరు నీళ్లలోకి దిగారు నన్ను రమ్మని  పిలుస్తున్నారు ఇంతలో శ్రీ నాకు డ్రెస్ ఇస్తాన్నది కదా అని గుర్తుకు వచ్చింది నేను ఇప్పుడే వస్తాను డ్రెస్ తెచ్చుకుంటాను అని  చెప్పి మళ్ళీ రూమ్ కి రావడానికి బయలు దేరా

శ్రీ: అందరు వెళ్ళిపోయినా ఏదో సౌండ్స్ ఇంకా వినిపిస్తున్నాయి  అక్ష నువ్వు ఇంకా వెళ్ళలేదా ఇంకా సౌండ్స్ చేస్తున్నారేంటి అని లేగిచింది అది వాటర్ సౌండ్ కాదు చాలా పెద్దగా వస్తుంది విచిత్రంగా ఉంది ఆ సౌండ్ అది అక్కడ ఉన్న ఒక అల్మారా నుంచి వస్తుంది అని గ్రహించి ఆ శబ్దం వస్తున్నా వైపుగా వెళ్ళింది ఆ సౌండ్  చిన్నపటినుంచి  అప్పుడడప్పుడు తనకు వినిపిస్తూ ఉండేది భయం వేసింది ఆ అల్మారా ని తీసింది  అక్కడ ఏమి లేదు ఒక గాజు బాటిల్ మూత పెట్టి ఉంది అబ్బా ఇదేనా ఇంత లా సౌండ్ వచ్చింది అని అనుకోని ఆ బాటిల్ ని పట్టుకుంది అంతే ఆ బాటిల్ ఎంతో కాంతి వంతంగా మారిపోయింది ఆ బొట్లే అంతా నీలి రంగు అలుముకొని ఎంతో మెరుస్తుంది దాన్ని చూస్తున్న శ్రీ  ట్రాన్స్ లోకి వెళ్లిపోయింది ఆ బాటిల్ ని పట్టుకొని శ్రీ అలా బయటకి నడుచుకొని వెళ్తుంది ఇంతలో  ఒక అమ్మాయి వచ్చి ఎలా ఉన్నావు శ్రీనిధి అని అడిగింది

శ్రీ: బానే ఉన్నాను . నువ్వు ఎలా ఉన్నావు  హర్ష ఎలా ఉన్నాడు?అని అడిగింది

అప్పుడే అక్ష నడుచుకుంటూ వస్తుంది శ్రీ  వేరే అమ్మాయితో మాట్లాడటం చూసింది అక్ష: ఆ అమ్మాయి ఎవరబ్బా ! అయినా శ్రీ చేతిలో ఆ బాటిల్  ఏంటి మెరుస్తుంది

ఇంతలో ఎవరో శ్వేతా వస్తున్నావా !అని ఆ అమ్మాయిని పిలవడం తో వెళ్లి వస్తాను శ్రీనిధి అని పెద్ద 5 పడగల నాగు పాము లా మారి ఆ అమ్మాయి వెళ్లిపోయింది

అక్ష:  ఆ అమ్మాయి నాగుపాముల మారడం చూసి ఓరినాయనో నాకే అన్ని కనిపిస్తున్నాయి అని గబా గబా శ్రీ దగ్గరికి వెళ్ళింది.  శ్రీ అలా నడుచుకుంటూ వచ్చేస్తుంది

 శ్రీ ! శ్రీ!  అని పిలుస్తుంది అక్ష వినిపించుకోవట్లేదు గట్టిగ శ్రీ అని పిలిచేసరికి

శ్రీ: ఏంటి నేను ఇక్కడ ఉన్నాను? అని అంటుంది

అక్ష: అది నేను అడగాలి నువ్వు అడుగుతున్నావు అది సరే కానీ  ఈ బాటిల్ ఏంటి?

శ్రీ : హ ఇదేంటి అని పక్కకు బండరాయి దగ్గర పడేసింది

అక్ష: ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడవు కదా అమ్మాయి ఎవరు?

శ్రీ: నేనా !నేను ఎవరితో మాట్లాడాను నీతోనే కదా ఇప్పుడు మాట్లాడుతుంది

అక్ష: అయినా నువ్వు రూమ్ లో కదా ఉండాలి ఇక్కడకి ఎందుకు వచ్చావు  జలపాతం దగ్గరకే

వస్తున్నావా? అయినా అది నీ రైట్ సైడ్  వైపు కదా నువ్వు లెఫ్ట్ సైడ్ వెళ్తున్నావు

శ్రీ: ఏమోనే నేను సౌండ్ వస్తుంది అని ఈ బాటిల్ ని పట్టుకున్న ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు

అక్ష: సరే పద  రూమ్ కి నాకు డ్రెస్ ఇస్తాన్నవ్ కదా ఇవ్వుడ్రెస్ పట్టుకొని ఆ జలపాతం దగ్గరికి పోదాం రా అక్కడ ఫ్రండ్స్ వెయిట్ చేస్తున్నారు

శ్రీ: సరే పద అంటుంది

ఆ బాటిల్ మెరుపు అంతా శ్రీ పాడేయ్గానే ఎద విధిగా మాములే గాజు బాటిల్లాగా

మారిపోయింది

 

అక్ష :  శ్రీ ఇద్దరు డ్రెస్సెస్ పట్టుకొని ఆ జలపాతం దగ్గరికి వెళ్లారు ఫ్రండ్స్ అందరు చూసి ఎక్కడకి వెళ్లిపోయారు అని అన్నారు

శ్రీ: ఆ జలపాతం ని చూసి అబ్బా ఎంత బావుందోఈప్లేస్ ని నెను ఎక్కడో చూసానే అని అంటుంధి

అక్ష: కదా ! నాకు కూడా అలానే అనిపించింది సరే పద  అని ఇద్దరు ఒకేసారి   ఆ వాటర్ లో కాళ్ళు పెట్టారుఅంతే ఏదో పెద్ద శబ్దం  ఒకేసారిగా వస్తుంది భయం అనిపించింది