Read Evaru Nuvvu by phani kathi in Telugu Horror Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఎవరు నువ్వు

క్రిష్ & అర్జున్. వీరి పేర్లు లాగానే. విల్లు కూడా ఎప్పుడు కృష్ణార్జునులే.
అయితే వీళ్ళ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నారు. కలిసే చదువుకున్నారు. కలిసే ఇంటర్మీడియట్ పూర్తి చేసారు. తరువాత ఏం చేద్దాం అని అర్జున్ క్రిష్ ని అడుగుతాడు. ఇంకేం ఉంది బి.టెక్ చేద్దాం అని అంటాడు. ఇద్దరు ఎంసెట్ రాస్తారు. ఇద్దరికి మంచి ర్యాంక్ వచ్చింది. వాళ్ళు అనుకున్నటే వాళ్ళకి వైజాగ్ gitam కాలేజీ లో సీట్ వస్తది.. అయితే హాస్టల్ లో అందరి స్టూడెంట్స్ తో కలిసి ఉండటం ఇష్టం లేక బయట ఎక్కడైనా రెంట్ కి ఇల్లు తీసుకొని ఉందాం అనుకుంటారు. సరే అనుకోని ఇల్లు వెతకటం మొదలు పెట్టేరు. ఇల్లు దొరకటం చాలా కష్టం అయిపోతాది.. బాచిలర్స్ అంటే రూమ్ ఇవ్వము అంటారు. రూమ్ ఇస్తాం అంటే రూమ్ రెంట్ కుదరదు. అయితే రూమ్ కోసం తిరిగి,తిరిగి అలిసిపోయి ఇంకా వెళ్ళిపోదాం అనుకున్న సమయం లో to-let ఉన్న ఒక ఇల్లు కనిపిస్తది. చివరిసారిగా అని ఆ ఇల్లు కోసం అని ఓనర్ ని అడిగారు. బాచిలర్స్ అయినా పర్లేదు. మేము ఇల్లు రెంట్ కి ఇస్తాం అని అంటదు ఓనర్. ఒక సారి ఇంటి లోపల చూడొచ్చా అని కృష్ణ అడుగుతాడు. అయ్యో దానికి ఎం ఉంది. తప్పకుండ చూడండి అని అంటాడు ఓనర్.

కృష్ణ,అర్జున్ ఇల్లు చూడటానికి లోపాలకి వెళ్తారు. ఇల్లు చాల నచ్చుతాది ఇద్దరికి. అది డబల్ బెదురూమ్ ఇల్లు. బయటకి వచ్చి ఓనర్ తో మాట్లాడుతాడు కృష్ణ. రెంట్ కూడా కృష్ణ,అర్జున్లకు నచ్చే మాటే చెప్తాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా అడ్వాన్స్ ఇచ్చి ఓనర్ తో మాట్లాడి వచ్చే నెల మొదటి తారీకు ఇంట్లోకి దిగుతాం అని చెప్తారు. సరే బాబు . మీ ఇష్టం అని ఓనర్ అంటాడు. ఇంకా కృష్ణార్జునులు వాళ్ళ ఇంటికి వెళ్తారు.
నెల స్టార్ట్ ఐతది. రెంట్ హౌస్ కి వెళ్లాల్సిన సమయం వచ్చేసింది. లుగ్గగే ప్యాక్ చేసుకొని వైజాగ్ వెళ్తారు. లగేజ్ అంత రూమ్ లో సద్దుకొని. తరువాతి రోజు నుంచి కాలేజీ కి వెళ్తారు.
ఇంట్లోకి వెళ్లిన మొదటి రొండు వారాలు బాగానే గడిచింది.

ఒక అమావాస్య రోజు, అర్ధరాత్రి, సమయం ఒకటి అవుతుంది. ఆ సమయం లో కృష్ణ కి ఏదో ఒక ఏడుపు వినిపిస్తది కిచెన్ లో నుంచి. పిల్లి అయ్యి ఉంటది అని పెద్దగా పట్టించుకోకుండా నిద్ర పోతాడు. కానీ మల్లి వినిపిస్తది. ఈ సరి ఏంటో చూదాం అని వెళ్తాడు. కిచెన్ దగ్గరకి వెళ్ళగానే ఆ ఏడుపు సెబ్దం ఆగిపోతాది.తిరిగి రూమ్లోకి వెళ్తుండగా గజ్జెల సెబ్దం వినిపిస్తది. ఎవరో ఒక అమ్మాయి పరిగెత్తిన సెబ్దం లాగా వెనక్కి తిరిగి చుస్తాడు. అంత చీకటి. అర్జున్ రూమ్ లో లైట్ వేసి ఉంటది. ఎందుకంటే అర్జున్ కి భయం ఎక్కువ. అందుకని లైట్ వేసుకొని పనుకుంటాడు. కృష్ణ అర్జున్ రూమ్ దగ్గరకి వెళ్లి చూస్తాడు. అర్జున్ నిద్ర పోతుఉంటాడు. అర్జున్ ని కదిలియటం ఎందుకు అని కృష్ణ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ రోజు అంత నిద్ర ఉండదు కృష్ణకి. పొద్దున్నే అర్జున్ కి చెపుదాం అనుకుంటాడు. కానీ అర్జున్ కి భయం ఎక్కువ. ఆ విషియం అలోచించి చెప్పాడు. కానీ కృష్ణ కి మాత్రం ఆ సంఘటన మాటిమాటికి గుర్తువస్తు ఉంటది.

రొండు రోజులు తరువాత మల్లి ఏడుపు సెబ్దం వినిపిస్తది. ఈ సారి మాత్రం సెబ్దం చేయకుండా కృష్ణ చీకటిలో కిచెన్ వైపు వెళ్తాడు. కిచెన్ లో అడుగు పెట్టగానే కిటికీ దగ్గర మనిషి రూపం లో ఒక నీడ నిల్చొని ఉంటది. అది చూసాక కృష్ణ కి వెన్నులో వనుకు పుడుతది. వెంటనే లైట్ వేస్తాడు. ఆ నీడా మాయం ఐపోతాది. కృష్ణ రూమ్ లోకి వెళ్లి లైట్ వేసి పనుకొని ఆ సంఘటన గురించి ఆలోచిస్తూ ఉంటాడు.

తెల్లారింది.. ఎప్పటిలాగానే కృష్ణ అర్జున్ లు కాలేజీ కి వెళ్తారు.. కాలేజీ లో రోజు మొత్తం రాత్రి జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అర్జున్ తో చెప్పాలి అనుకుంటాడు కానీ భయపడుతాడు అని వెనక్కి తగ్గుతాడు. ఆ రోజు రాత్రి అర్జున్ నిద్ర పోతు ఉంటాడు కానీ కృష్ణ కి మాత్రం నిద్ర రాదు.అర్జున్ ఒక్కసారిగా కృష్ణ అని పెద్దగా పిలుస్తాడు.కృష్ణ లేచి త్వరగా వెళ్తాడు, ఎం అయ్యిందా అని..

కృష్ణ:- ఎం అయింది. ఎందుకు ఆలా అరిచావ్.
అర్జున్:- కుక్క ఏడుస్తుంది రా..
కృష్ణ :- అది ఏడుస్తే నీకేం అయింది రా.
అర్జున్:- కుక్క ఎందుకు ఏడుస్తుంది.
కృష్ణ :- అంటే ఏంది రా. నన్ను వెళ్లి ఓదార్చమంటావా కుక్క ని.
అర్జున్:- కుక్కలు రాత్రి పూట ఏడుస్తే. దాని అర్ధం వాటికి దెయ్యాలు కానిస్తున్నాయి అని.
కృష్ణ :- ఆ ముక్క నీకు ఎవరు చెప్పేరు.
అర్జున్:- మా జేజి చెప్పింది.
కృష్ణ :- మీ జేజి ఇంకా బ్రతికే ఉందా.
అర్జున్:- లేదు ర. చనిపోయింది
కృష్ణ :- చనిపోయి బ్రతికి పోయింది లేకపోతే నేనే చంపేసేవాడిని.
అర్జున్ :- ఎందుకు రా. అలా మాట్లాడుతావ్.
కృష్ణ :- అన్ని మూసుకొని పనుకో. లేకపోతే కుక్క కాదు. నువ్ ఏడుస్తావ్..
అర్జున్:- అరే.. నువ్ కూడా ఈ రూమ్ లోనే పనుకో రా.. ప్లీజ్ రా..
కృష్ణ :- సర్లే ఉండు. పోయి దుప్పటి బొంత తెచ్చుకుంటే.
అర్జున్:- సరే రా. త్వరగా వచ్చేయ్
కృష్ణ :- నువ్ గోల చేయకు. వస్తా త్వరగా.

కృష్ణ దిండు,దుప్పటి కోసం అని రూం లోకి వస్తాడు. పరుపు తీసుకోని దిండ్లు తీసుకున్న టైం లో కృష్ణ బుజం మీద ఎవరో చేయి వేసినట్టు అనిపిస్తది. అర్జున్ ఏమో అనుకోని ఏంది రా అంటూ వెనక్కి తిరిగాడు. కానీ వెనక ఎవరు లేరు. కృష్ణ కి ఎం అర్ధం కాదు. కృష్ణ రూమ్ లోకి అర్జున్ వచ్చి. ఎం అయింది. రావేంటి అని అడుగుతాడు.. నువ్ పద నేను అన్ని తీసుకొని వస్తా అని అంటాడు. అన్ని తీసుకొని అర్జున్ రూమ్ లోకి వెళ్తాడు. కృష్ణ కి మాత్రం ఒకటే ఆలోచన...

ఈ ఇల్లు ఏదో తేడాగా ఉంది. ఇంట్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే భయంగా ఉంది. లేకపోతే నేనే ఇలా ఆలోచిస్తున్న. ఇదంతా నా భ్రమా అయ్యి ఉంటదా. లేదు.. ఇది నా భ్రమా కాదు.. నిజం గానే ఏదో ఉంది..

ఇంతలో కృష్ణ కి మంచి నీళ్లు అవుతాయి. కానీ బాటిల్ కృష్ణ రూమ్ లో ఉంటది. తెచ్చుకోవటానికి వెళ్తాడు..
బాటిల్ తీసుకొని నీళ్లు పట్టుకొని పక్కకి తిరుగుతాడు.
నల్లటి ఆకారం. కచ్చితంగా మనిషి రూపం. మొకం మీద వంటి మీద గాట్లు. చూస్తేనే వెన్నులో వణుకు పుట్టే అవతారం.. ఆ ఆకారాన్ని చూస్తూ అలానే ఉండి పోయాడు కృష్ణ. ఇంతలో ఆ ఆకారం. చేయి ముందుకు పెట్టి కాపాడు అని అంటూ పిలుస్తుంది. అది చూసి షాక్ తో అలానే నిల్చుండి పోయాడు. ఇంతలో కృష్ణ అని పిలుస్తాడు అర్జున్. పలకక పోయే సరికి అర్జున్ వస్తాడు కిచెన్ లోకి. షాక్ ఐన కృష్ణ ని చూసి.. ఎం అయింది రా. ఏంటి ఇక్కడ ఉన్నావ్. ఎం చేస్తున్నావ్ ఇక్కడ అని అడుగుతాడు.

జరిగిన విషియం చెప్తాడు అర్జున్ కి. పెద్దగా ఏడుస్తాడు అర్జున్..

కృష్ణ :- రేయ్. ఎందుకు ఏడుస్తున్నావ్.. ఆపు
అర్జున్:- ఏడవకుండా ఎం చేయాలి రా. నీ ఎబ్బ..
కృష్ణ :- రేయ్. ముసుక్కో
అర్జున్:- ఏంది రా మూసుకున్నేది.
కృష్ణ :- నోరు
అర్జున్:- నువ్ ముస్కో రా దరిద్రుడా. జోక్ లు వేస్తున్నావ్ ఏంది రా ఈ టైం లో.
కృష్ణ :- అరె. ఎం అయింది అని ఇప్పుడు అలా ఐపోతున్నావ్ నువ్.
అర్జున్:- ఇంకేం అవ్వాలి రా. దెయ్యాలు ఉన్న కొంప లోకి తీసుకొచ్చి పడేసావే.. ఇంకేం అవ్వాలి
కృష్ణ :- నేనేదో కావాలి అని తీసుకొచ్చి పడేసాను అన్నట్టు మాట్లాడుతున్నావ్.
అర్జున్:- అర్జెంట్ గా రూమ్ చేంజ్ అయిపోదం రా..
కృష్ణ :- రూమ్ చేంజ్ అవ్వటం అంత ఈజీ కాదు. మనకు ముందు రూమ్ దొరకాలి చేంజ్ అవ్వాలి అంటే
అర్జున్ :- ఇప్పుడు ఎం అంటావ్ అయితే
కృష్ణ :- రేపు ఇంటి ఓనర్ తో మాట్లాడుదాం ఉండు..
అర్జున్ :- ఎం మాట్లాడుతావో ఏందో. నాకు చాలా భయం గా ఉంది.
కృష్ణ :- సరే. ఒకా 10 రోజులు. నువ్ ఇంటికి వెల్లేసి రా. ఇక్కడ సమస్యలు అన్ని తీరిక పిలుస్త
అర్జున్:- సమస్యలా.! సమస్యలు ఏంటి. ఎన్ని సమస్యలు ఉన్నాయ్ ఏంటి..
కృష్ణ:- అబ్బా.............. నువ్ గమ్మున రేపు ఊరు వేళ్ళు.
అర్జున్ :- సరే రా.. నువ్ జాగ్రత్త..
కృష్ణ:- అలాగేలే. ఊర్లో ఈ విషియం ఎవరికీ చెప్పకు
అర్జున్ :- సరే..