Read My philosophy is... - 3 by Madhu in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా ఫిలాసఫీ... - 3

నా ఫిలాసఫీ పార్ట్__3(b)

🌻మనల్ని మనము ప్రేమించుకోవడం

🌹 సమస్య ఏదైనా, నేనెప్పుడైనా, ఎవరితోనైనా ,ప్రయోగించేది ఏకైక మౌలిక ఆధ్యాత్మిక విషయాన్ని... అది "మనల్ని మనం ప్రేమించుకోవడం"... ప్రేమ అనేది అద్భుతమైన ఔషధము ....మనల్ని మనం ప్రేమించుకోవడం మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తుంది.... మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే.... మనం సాధించిన అభివృద్ధికి లేదా, విజయాలకు గర్వపడడమో,లేక అహంభావంతో ఉండడమో, లేక మీరు ఉన్న స్థితితో పోల్చుకొని ఇతరులను తక్కువ చూడడమో, కాదు ....ఇవన్నీ మీ అంతరంగంలోని భయం వలన ఉత్పన్నమైన భావనలు....


🌹 ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది, మనపై మనకు ఉండాల్సిన ఒక గొప్ప గౌరవ భావాన్ని, మరి మన శరీరాల్లో నిరంతరము సంభవం అవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల ,మన మనసు యొక్క మహత్తరమైన శక్తి పట్ల, మనకు ఉండాల్సిన కృతజ్ఞతా భావం గురించి.....


🌹ఇక్కడ" ప్రేమ "అంటే మనల్ని మనం మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకోవడం ....ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు.....

🌹 నేను ప్రేమను కిందివిధాలుగా ప్రకటిస్తాను.....


🌹జీవితం సాగే తీరు తెన్నుల పట్ల...
🌹అసలు నేను జీవించి ఉన్నందుకు....
🌹నేను చూసే సౌందర్యము పట్ల ...
🌹ఇతర వ్యక్తుల పట్ల
🌹జ్ఞానం పట్ల,
🌹మనసు యొక్క పనితీరు పట్ల,
🌹మన శరీరాల పట్ల మరి వాటి పనితీరు పట్ల
🌹జంతుజాలం పట్ల,పక్షుల పట్ల,చేపల పట్ల....
🌹చుట్టూ ఉండే పచ్చదనం పట్ల,
🌹ఈ సృష్టి పట్ల
🌹మన సృష్టి యొక్క అద్భుత వ్యక్తి కరణ పట్ల,
నేను ప్రేమను ప్రకటిస్తాను.....


🌹 పై వాటికి మీరు ఇంకా ఎన్ని చేర్చగలరో చూడండి.....

🌹ఇప్పుడు మనము ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోము చూద్దాం....


🌹 మనల్ని మనం విడవకుండా నిరంతరం తిట్టుకుంటూ పోతాము....

🌹 మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా ,ఆల్కహాల్ లాంటి వాటిని సేవించడం వల్ల ,మరి డ్రగ్స్ తీసుకోవడం ద్వారా, మన శరీరాన్ని పాడు చేసుకుంటాము.....
🌹మనం ప్రేమించబడము అని నమ్మడానికే ఎంపిక చేసుకుంటాము....
🌹మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతాము....
🌹మనల్ని అభివృద్ధి పథంలో నడిపించే విషయాల్ని వాయిదా వేస్తాము....
🌹మనం పూర్తిగా విస్మయంతో అస్తవ్యస్తంగా జీవిస్తాము....
🌹అప్పుల్ని ,ఒత్తిడి లని నెత్తినేసుకుంటాము....
🌹మనకే మాత్రము విలువనివ్వకుండా, కొట్టి పారేసే వారిని ,మనం ప్రేమికులుగా, భాగస్వాములుగా ఆకర్షిస్తాము.....

....ఇలాగే మీరెన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరు ఆలోచించండి



🌻మనము ఏవిధంగానైనా మనం మంచినీ నిరాకరిస్తే ,అది కూడా మనల్ని మనం ప్రేమించుకొనకపోవడమే అవుతుంది....


🌹 నా క్లైంట్ ఒకామేకు కళ్ళజోడుండేవి... ఒక రోజు కౌన్సిలింగ్లో ఆమె తన చిన్నతనంలో ఏర్పరుచుకున్న పాత భయాన్ని తొలగించేశాను... మురుసటి రోజు పొద్దున్న ఆమె నిద్ర లేవగానే ఆమెకు కళ్ళజోడు ఇబ్బందిగా అనిపించి, వాటిని తీసివేసింది.... ఆమె చుట్టూ పరికించి చూసింది ...ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయని గుర్తించింది... కానీ ఆమె ఆ రోజంతా నేను ఇది నమ్మలేను ...అని అంటూనే ఉంది ....తర్వాత రోజుకే ఆమెకు మళ్ళీ కళ్ళజోడు అవసరం వచ్చి పడింది.... మన సబ్కాన్షియస్ మైండ్ మనతో ఎటువంటి విధంగాను పరిహాసాలాడదు... మనము ఏది నమ్మితే దాన్ని అలాగే సంభవింప చేస్తుంది... ఆమెకు ఇక కళ్ళజోడు అవసరం లేదని, ఆమెకు అన్ని స్పష్టంగా కనిపిస్తాయి ...అన్న విషయాన్ని ఆమె నమ్మలేకపోయింది....


🌻మనల్ని మనం అనర్హులుగా భావించడము, కూడా మనల్ని మనం ప్రేమించుకోకపోవడం అనే దానికి ఇంకొక రూపము .....


🌹టామ్ అనే ఒక మంచి చిత్రకారుడు ఉండేవాడు... అతడికి చాలా ధనవంతులైన కస్టమర్స్ ఉండేవారు... అతను వారి ఇళ్లల్లో గోడలపై చిత్రాలు గీస్తుండేవాడు.. కానీ, అతనికి తన ఖర్చులకు కూడా చాలినంత డబ్బులు ఉండేవి కాదు... ఇచ్చిన సమయంలో అతడు చిత్రాన్ని వేయలేకపోయేవాడు... ఇదంతా 'సంపాదించడానికి నేను అనర్హుడను' అని అతడు భావించడం లోంచే సంభవించింది..... ఎవరైనా ఏదైనా వస్తువుని తయారుచేసిన, లేదా ఎటువంటి సేవలు చేసిన దానికి ఎంతైనా రేటును నిర్ణయించవచ్చు ...ధనవంతులైన వారు వారికి ఇష్టమైన వస్తువులను వారి స్వంతం చేసుకోవడానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టడానికి వెనకాడరు ....పైగా ఇది ఆ వస్తువు యొక్క విలువను పెంచుతుంది ... విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు...


🌹ఇంకొన్ని ఉదాహరణలు

🌹మన భాగస్వామి త్వరగా అలసిపోయి, మనతో చాలా అసహ్యంగా ప్రవర్తిస్తాడు...
దీనికి మనం ఏం పాపము చేసామని విస్తు పోతాము....

🌹 మన భాగస్వామి ఒకటో, రెండో సార్లు మనల్ని బయటకు తీసుకెళ్తాడు...ఆ తర్వాత మనల్ని అస్సలు పట్టించుకోడు.... మనలో ఏదో లోపం ఉందని మనం ఆలోచిస్తాము.....

🌹మనకు మన భాగస్వామితో సంబంధం తెగిపోతుంది ...మనం జీవితంలో ఓడిపోయామని కృంగిపోతాము ....

🌹మనం జీతం పెంచమని యాజమాన్యాన్ని అడగడానికి వెనకాడతాము....

🌹పత్రికలలో, టీవీలలో సినిమాలలో ,వచ్చే తారల శరీరాలతో మనల్ని పోల్చి చూసుకొని ,మనల్ని మనం తక్కువగా భావించుకుంటాము....

🌹మీ వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, మీకు రావాల్సిన వాట మీకు రాకపోయినా, మీరందుకు తగిన వారు కారని మీకు ఆ పని అచ్చి రాదని భావిస్తారు....

🌹 మీరు ఎవరితోనైనా దగ్గర అయ్యేందుకు భయపడతారు....ఎందుకంటే అదెక్కడ సెక్స్ సంబంధానికి దారితీస్తుందో అని లోపల భయపడుతుంటారు....


🌹మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వెనకాడుతారు.... ఎందుకంటే మీరు తీసుకునే నిర్ణయాలు తప్పకుండా తప్పవుతాయని మీరు ముందే నిర్ణయించుకుంటారు కాబట్టి....

🌹పై విధాలుగానే కాక మరెన్ని విధాలుగా మీరు అనర్హులనే భావాన్ని మీరు వ్యక్తపరుస్తారో గమనించండి....

🌻పసిపిల్లలు చాలా పరిపూర్ణలో పసిపిల్లలు గా ఉన్నప్పుడు మీరు ఎంత పరిపూర్ణలో తెలుసా!!!


🌹 పసిపిల్లలు పరిపూర్ణులు అయ్యేందుకు ఏమీ చేయనవసరం లేదు ...ఎందుకంటే వారు పరిపూర్ణంగానే ఉంటారు ..వారికి విషయం తెలిసినట్లుగానే వారు ప్రవర్తిస్తారు... వారు ఈ విశ్వానికి కేంద్రాలని వారికి తెలుసు ..వారికి ఏది కావాలో అడగడానికి వారే మాత్రం సంకోచించరు... వారు వారి భావాన్ని నిర్మొహమాటంగా వ్యక్త పరుస్తారు ...ఒక పసి పాపకు కోపం వస్తే ఏమవుతుందో మీకు తెలుసు ...నిజానికి ఆ వీధి మొత్తానికి తెలుస్తుంది... అదే వారు సంతోషంగా ఉంటే ఆ ఇంటిని వారి నవ్వులతో వెలిగిస్తారు... ఈ విషయము మీకు తెలుసు... వారు ఎప్పుడూ పూర్తిగా ప్రేమతో నిండి ఉంటారు...


🌹 పసి పిల్లలు ప్రేమను పొందకపోతే చచ్చిపోతారు... కానీ పెరిగి పెద్దయ్యాక మనం ప్రేమ లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము ....పసిపిల్లలు అలా బ్రతకలేరు పసిపిల్లలు వారి శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమించుకుంటారు ...వారి శరీరాల నుండి విసర్జింపబడే మలమూత్రాలను సైతం వారు ప్రేమిస్తారు ....వారికి అనూషమైన ధైర్యం ఉంది....


🌹"మీరు అలాగే ఉండేవారు "మనమంతా అలాగే ఉండేవాళ్ళం... తర్వాత మన చుట్టూ ఉన్న పెద్దల మాటలు విని ఎలా భయపడాలో, ఎలా ప్రేమ రహితంగా జీవించాలో, ఎలా మన దివ్యత్వాన్ని దిగజార్చుకోవాలో, నేర్చుకున్నాము...

🌹 నా క్లైంట్స్ లో ఎవరైనా ఎంతగా తీవ్ర భయభ్రాంతులతో దయనీయంగా ఉన్నా... ఎంతగా ప్రేమ లేక మకుటచిన హృదయాలతో ఉన్నా నేను నమ్మను... నా పని అంతా వారిని కాలంలో వెనక్కి తీసుకువెళ్లి ,నిజంగా వారిని వారు ప్రేమించుకునేది, వారికి తెలుసు అనే విషయాన్ని వారికి తిరిగి గుర్తుకు చేయడమే....

🌻 మిర్రర్ వర్క్ ......


🌹తర్వాత వారి చేతికి ఒక చిన్న అద్దాన్ని ఇచ్చి, అందులో వారి కళ్ళల్లోకి వారిని చూసుకోమని చెబుతాను.... తర్వాత వారి పేర్లు చెప్పుకొని ,"నేను నిన్ను ప్రేమిస్తున్నాను". నేను నిన్నుగా అంగీకరిస్తున్నాను ...అని చెప్పుకున్నమంటాను...

🌹 ఇది చాలా మందికి కష్టం అనిపించేది... చాలా తక్కువ మంది దీనికి చక్కగా స్పందించి ,ఈ పనిని ఆనందించేవారు... కొంతమంది "నో" అని అరిచేవారు... కొంతమంది ఏడ్చేవారు... కొంతమంది కోప్పడేవారు... కొంతమంది వారి రూపాన్ని, గుణగణాల్ని తక్కువ చేసుకునేవారు... కొంతమంది ఈ పని చేయలేమని అనేవారు... ఒక వ్యక్తి అయితే అద్దాన్ని విసిరేసి ,పారిపోవాలని చూసాడు ... అతడికి అద్దం ముందు నిల్చుని తన కళ్ళలోకి తాను చూసుకోవడం కొన్ని నెలలు పట్టింది....


🌹కొన్ని సంవత్సరాలుగా అద్దంలో కనిపించే నా మొహాన్ని నిందించుకోవడానికి నేను అద్దంలో చూసేదాన్ని.... గంటలకొద్దీ అద్దం ముందు నిలబడి ఊరికే నా కనుబొమ్మలపై వెంట్రుకల్ని పీక్కుంటూ ఇన్నాళ్లు ఎలా గడిపానా అని తలుచుకుంటూ ఉంటే ఇప్పుడు నాకే ఆశ్చర్యం వేస్తుంది.... అప్పుడు అద్దములో, నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసుకోవడానికి నేను భయపడే దాన్ని....


🌹ఈ విధంగా అద్దంలో నన్ను నేను చూసుకుంటూ ,"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" "నిన్ను నీవుగా అంగీకరిస్తున్నాను "అని చెప్పుకోవడం నాకు చాలా బాగా పనిచేసింది ...అరగంట కాలంలోనే నా బహిర్ సమస్యలకి కారణమైన నాలో అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నా నమ్మకాలు ,ఆలోచన విధానాలు, నా మాటలు ,ఇతరుల మాటలు పైకి తేలాయి ....ఇలా మన అంతరంగంలోనికి చూసుకొనకుండా, సమస్యలకు కారణాలనీ కేవలం బహిర్గతంగా వెతుక్కుంటూ పోతే ,ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ ఎంతసేపైనా గడపవచ్చు.... అలా చేసినప్పుడు సమస్యకు సమాధానం దొరికిందని మనం తెల్చేలోపే అది ఇంకో దగ్గర మొలకెత్తి ఉంటుంది.........



🌹 ధన్యవాదములు 🌹