Part___1(b)
🌹 ఇప్పుడు మనం పట్టించుకోవాల్సినది మనం ఏర్పరచుకున్న మన ఆలోచనలే...ఈ ఆలోచనలను మనము మార్చుకోవచ్చును🌹
*బహిర్ ప్రపంచంలో మన సమస్య ఏదైనా ,మన పరిస్థితి ఏదైనా అది మన అంతర్ ప్రపంచపు ఆలోచనలోంచి జనించినదే....మన అంతరంగాన్ని మనం మార్చుకోగలిగితే బహిర్ ప్రపంచంలో మనకు కావాల్సిన మార్పుకు తీసుకురావచ్చు....
*మన పట్ల మనకున్న" ద్వేషం,"కూడా నువ్విలా ఉన్నావు,నువ్వలా చేశావు, నువ్వంటే నాకు అసహ్యం, లాంటి ఆలోచనలే!!! నేను చాలా చెడ్డవాడిని,అన్న ఆలోచనే మీలో లేకుంటే మీరు చెడ్డవాడివని అసలు మీరు భావించరు.... ఇలా ఆలోచనలే మనలో భావాన్ని సృష్టిస్తాయి... ఏదేమైనా మీకు ఆలోచనే లేకుంటే మీకు ఆ భావనే ఉండదు కదా!!! మనకు ఇష్టం వచ్చిన విధంగా మన ఆలోచనలను మార్చుకొనవచ్చును... మొదట నీలోని ఆలోచనను మార్చుకుంటే, ఆలోచనల వల్ల జనించే భావన కచ్చితంగా మిమ్మల్ని వదిలి పెడుతుంది....
*ఈ వివరణ అంతా మనలో నమ్మకాలు ఎలా ఏర్పడ్డాయో తెలియజేయడానికి... అంతే తప్ప ,"మనకు ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి.. మన గతి ఇంతే! ఈ బాధల్లోనే మనం ఊరుకో పోవాలి ..."అని మాత్రం కాదు ...గతం గతః భూతకాలం మనపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు... ఎప్పుడు కూడాను మన శక్తి అంతా ప్రస్తుతక్షణంలోనే కేంద్రీకరింపబడి ఉంటుంది... ఈ విషయాన్ని మనం ఇప్పుడు ఎరుకలోకి తీసుకోవడము ఎంత అద్భుతమో కదా!!! ఇక నిశ్చితంగా మనమీ ప్రస్తుత క్షణంలో పూర్తిగా స్వతంత్రులై పోవచ్చు....
🌹....మీరు నమ్మినా నమ్మకపోయినా, మన ఆలోచనలన్నీ మనమే ఎంపిక చేసుకొన్నాము... అన్నది సత్యము.....🌹
* ఒకే ఆలోచనని పదే పదే, ఆలోచించి ఆలోచించి, అలా ఆలోచించడము మనకు ఒక అలవాటుగా మారిపోయి ఉంటుంది... అందువలన అది మనము ఎంపిక చేసుకున్న ఆలోచనగా మనకు అనిపించదు.... కానీ ఆ ఆలోచనను మొట్టమొదట ఎంపిక చేసుకుని మొదలుపెట్టింది మనమే....!!!
కొన్ని విధాలుగా ఆలోచించడానికి మనకు మనమే ఒప్పుకోము మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించడానికి ఎన్నిసార్లు మీరే ఒప్పుకోలేదు గమనించండి అలాగే ఇప్పుడు మీ గురించి మీరు నీటుగా ఆలోచించడానికి కూడా నిరాకరించవచ్చును ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనను తాను ద్వేషించుకోవడం తోను తనలో ఏదో తప్పు ఉన్నదన్న భావంతోనూ బాధపడుతుంటారు ఈ విషయాన్ని నా కంప్లైంట్స్ లోను మరి నాకు తెలిసిన వాళ్ళందరిలోనూ గమనించాను ఈ భావనల తీవ్రతల్లో తేడా ఉండవచ్చును అది వేరే విషయం ఈ భావాలు ఎంత ఎక్కువగా ఉంటే జీవితం అంతా ప్రతికూలంగా ఉంటుంది మరి భావనలు ఎంత తక్కువగా ఉంటే వారి జీవితము అనుకూలంగా ఉంటుంది
🌹 నన్ను సంప్రదించిన వారి అందరిలోనూ వారి అంతరంగంలో నేను బాగాలేను అన్న అసలు తృప్తి ఉంది 🌹
*నేను అనుకున్నవి చేస్తానో, లేదో?
* నేను కోరుకున్నది పొందుతానో లేదో ?*నాకు అర్హత లేదు....
ఇలాంటి నమ్మకాలు మీలోనూ ఉన్నాయేమో కాస్త వేతకండి ...మీరు బాగా లేరని ఎన్నిసార్లు మీతో మీరు అనుకుని ఉంటారు? ఏ పరిణామాలతో పోల్చుకొని మీరు అలా అనుకున్నారు ...లేదా ఎవరి ఆదర్శాల కొరకు, ఆశయాల కొరకు మీరు ఎలా అనుకున్నారు....
* ఇలాంటి నమ్మకాలు బలంగా మీలో పేరుకుపోయి ఉంటే మీరు ఎలా ఒక ప్రేమపూరితమైన , ఆనందమయమైన సిరిసంపదలతో కూడిన, ఆరోగ్య దాయకమైన, జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు... ఒకవేళ సృష్టించుకోవాలి అనుకున్న, మీ సబ్కాన్షియస్ మైండ్ లో ఇదివరకే పాతుకుపోయిన మీ సొంత ఆలోచనలు, అమ్మకాలే మిమ్మల్ని వ్యతిరేకిస్తాయి.... అందువలన నీ జీవితంలోకి పైవన్నీ రాకుండా ఏదో ఒక తప్పిదము ప్రతిసారి జరుగుతూ ఉంటుంది....
🌹 క్రోధము, మనల్ని మనం ఒప్పుకొనక పోవడం, తప్పు చేశాము అన్న భావన మరియు భయం లాంటి ఆలోచనా విధానం మన జీవితాల్లో సర్వ సమస్యలకు కారణభూతాలు...🌹
*పై భావాలే మన శరీరాల్లో, మన జీవితాల్లో ప్రధాన సమస్యల్ని సృష్టిస్తున్నాయి... మన జీవన పరిస్థితులకు, అనుభవాలకు మన బాధ్యతను గుర్తించకుండా ,ఇతరులను నిందిస్తూ పోవడం వల్ల కూడా ఈ భావాలు తలెత్తుతున్నాయి ... మన జీవితానికి మనమే బాధ్యులమని తెలుసుకుంటే! ఇంకెవరిని నిందించాలి??? ఏమని నిందించాలి??? బయట జరిగే సంఘటనలు, లోపలి ఆలోచనలకు ప్రతిరూపాలు... అలాగని ఇక్కడ నేను మీ పట్ల ఇతరుల యొక్క బాధ్యతారహితమైన ప్రవర్తనను సమర్పించడం లేదు... అటువంటి వ్యక్తుల్ని, అటువంటి ప్రవర్తనలను మనము ఆకర్షిస్తున్నామంటే, మనలో అటువంటి లక్షణాలు, నమ్మకాలు ఉన్నాయని గుర్తించాలి....
* అందరూ నా పట్ల ఇలాగే ప్రవర్తిస్తారు... ఆలోచించుతారు...
* నన్ను అవసరాలకు వాడుకుని వదిలేస్తారు...
* ప్రతిదానికి నన్నే నిందిస్తారు...
* నాకే ఎందుకిలా జరుగుతోంది....
*ఇలాంటివి మీరు నమ్ముతున్నట్లయితే, అవి మీ సొంత ఆలోచన విధానాలు... అలాంటి వ్యక్తులను ,ప్రవర్తనలను మీరు ఆకర్షిస్తున్నారంటే మీలో అలాంటి ఆలోచనలు ఏవో ఉండి తీరాలి... మీరు అలా ఆలోచించి, ఆ పరిస్థితుల్ని, ఆ ప్రవర్తనలను మీ వైపుకు ఆకర్షించకపోతే అవి వేరొకరికి ,వేరే ఎక్కడో ఆకర్షితమవుతాయి.... మీలో అటువంటి ఆలోచనలే ఉండకపోతే అటువంటి పరిస్థితులు మీ వైపు రానే రావు....
🌹శారీరక రోగాలు_మానసిక కారణాలు🌹
*ఎలా మన ఆలోచనా విధానాలు మన శరీరంలో అనారోగ్యాలతో సృష్టిస్తాయో కొన్ని ఉదాహరణలతో పరిశీలిద్దాం.... చాలా కాలం నుండి క్రోతభావాలను, అణిచివేసుకుని మన మనసులో పర్చుకొని ఉంటే అది క్రమ క్రమంగా మన శరీరాన్ని దహించి వేసి" కాన్సర్" అని పిలవబడే రోగంగా పరిణమిస్తుంది... మనల్ని మనము ఒప్పుకొనకపోవడం వలన మనం మనలోనూ ఇతరులలోను తప్పులు వెతుకుతూ పోతాము... అది భవిష్యత్తులో "కీళ్ల నొప్పులుగా" తయారవుతుంది ...తప్పు చేశాము అన్న భావన, శిక్షనీ కోరుకుంటుంది... తీరమైన బాధని కలగజేస్తుంది... ఎవరైనా నా వద్దకు తీవ్రమైన బాధతో వస్తే, తప్పు చేశాము అన్న భావన వారిలో ఎంతగా పేరుకుపోయిందో గమనిస్తాను.... భయము మరి ఆందోళనలు మన శరీరాల్లో బట్టతల, కడుపులో పుండ్లు మరియు పాదాల్లో నొప్పులు మొదలైన వాటిని కలగజేస్తాయి....
*చాలా కాలంగా మనలో అణిచి పెట్టుకున్న క్రోధాన్ని వదిలి పెట్టేసి, మొదట మనల్ని క్షమించుకుని, తర్వాత తక్కిన వారందరిని క్షమించి వేస్తే, ఎంత సైతం" క్యాన్సరు" సైతం నయం అవుతుంది... ఇది నా స్వంత అనుభవంతో చెబుతున్నాను...
🌹..గతం పట్ల మన దృక్పథాన్ని మర్చుకొనవచ్చును...🌹
గతం అనేది అయిపోయింది,, జరిగిపోయింది....మనం ఇప్పుడు దాన్ని మార్చలేము ..కానీ గతం పట్ల మన ఆలోచనలను మాత్రం మార్చుకోవచ్చు...చాలా కాలం కిందట ఎవరో మనల్ని బాధపెట్టారని, ఈ క్షణంలో వాటిని తలచుకుని మనల్ని మనం శిక్షించుకోవడం, ఎంత మూర్ఖత్వం!!! ఒకసారి ఆలోచించి చూడండి ...
*ఎవరైనా ఎక్కువగా క్రోధ భావనతో బాధపడుతుంటే ,తక్షణమే ఆ భావాన్ని వదిలిపెట్టేయమని చెప్తాను... ఎందుకంటే మొదట్లోనే అది చాలా సులభం ...లేకపోతే అది ముదిరి ముదిరి వారిని మరణశయ్యపై అది పడుకోబెడుతుంది... అప్పుడు తీవ్ర భయాందోళనలకు గురి కావాల్సి వస్తుంది....
* మనం భయాందోళనలతో ఉన్నప్పుడు స్వస్థతపై దృష్టి పెట్టలేము.... మొదట మనలోనీ భయాలు అన్నింటిని వదిలించుకోవాలి.....
*ఆ భవిష్యత్తు బూడిదైపోయింది... నేను ఇక ఇలాగే నిస్సహాయంగా బలైపోవాల్సిందే!!! ఈ పరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడల్సిందే ...అని నమ్మడానికి ఎంపిక చేసుకుంటే ,ఆ నమ్మకాన్ని ఈ విశ్వం సమర్థిస్తుంది ..... అటువంటి అప్పుడు మనం ఇంకా దిగజారిపోయి , అగాదలోకి కూరుకుంటున్నావాల్సిందే !!ఇటువంటి మూర్ఖపు చాదస్తపు నమ్మకాల్ని ,నెగిటివ్ భావాలను, తక్షణమే వదిలిపెట్టేయాలి.... అప్పుడే మన జీవితానికి స్వస్థత చేకూరుతుంది .....
*దైవత్వం అనబడేది కూడా మనకు అనుకూలంగానే ఉంటుందే తప్ప వ్యతిరేకంగా ఎప్పటికీ ఉండజాలదు....
🌹 మనము గతాన్ని వదిలిపెట్టేయాలంటే క్షమించడానికి సిద్ధంగా ఉండాలి...🌹
*మొదట మనల్ని మనం క్షమించుకుని తర్వాత అందరినీ క్షమించి వేసి గతాన్ని వదిల పెట్టేసేందుకు మనం నిర్ణయించుకోవాలి... ఎలా క్షమించాలో తెలియకపోయినా, క్షమించడానికి మీ మనసు అంగీకరించకపోయినా పర్వాలేదు... నేను క్షమించేయాలి !!!అని ఒక నిర్ణయం తీసుకుంటే చాలు... మనకు స్వస్థత చేకూరి ప్రక్రియ మొదలైపోతుంది ...మనకు స్వస్థత చేకూరడానికి గతాన్ని పూర్తిగా విసర్జించడం, మరి మనతో సహా అందరిని క్షమించేయడం, తప్పనిసరి ....
*నువ్వ నాకు అణగుణంగా ప్రవర్తించకపోయినా పరవాలేదు... నిన్ను నేను ప్రేమిస్తున్నాను.. మరి నిన్ను క్షమించడం వల్ల నేను స్వేచ్ఛ జీవినైపోతాను... అని గాఢంగా అనుకున్నా చాలు... మనము ఆ గతపు పరిస్థితులను నుండి విముక్తులైపోతాము....
🌹అన్ని అనారోగ్యాలు క్షమాగుణం లేకపోవడం వలన ఉత్పన్నం అవుతాయి...🌹
*మనము ఎప్పుడైనా, ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, మనం ఎవరినైనా క్షమించాలేమో నని మన హృదయాల్లో వెతకాలి... మనము ఎవరినైతే క్షమించడానికి చాలా కష్టపడుతున్నామో వారిని మొదట క్షమించేయాలి... మనలోంచి వారిని గురించి ఆలోచనలను పూర్తిగా వదిలి పెట్టేయాలి... క్షమించడం అంటే వారిని వదిలి పెట్టేయడం... పూర్తిగా వారి గురించి పట్టించుకోకపోవడం ...ఇక్కడ మీరు వారితో అంగీకరిస్తున్నారా ?లేదా నిరాకరిస్తున్నారా ?అన్నది కాదు ప్రశ్న ...ఇది కేవలం విషయాన్ని అంతటితో వదిలిపెట్టేసేయడం ...మనం చేయవలసిందల్లా క్షమించడానికి నిర్ణయించుకోవడమే... ఎలా క్షమించాలి అన్నది ఈ విశ్వమే చూసుకుంటుంది...
*మన బాధను అయితే మనం చక్కగా అర్థం చేసుకుంటాము... ఇతరులు కూడా మీ వలన బాధపడ్డారని అర్థం చేసుకోరేం....ఆ సమయం లో వారు వారికున్న జ్ఞానము, అవగాహన ఎరుకను బట్టి మనతో వారాల ప్రవర్తించారన్న విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి... ఎవరైనా సమస్యతో
*ఎప్పుడైనా నన్ను సంప్రదిస్తే అనారోగ్యానికి సంబంధించినదైనా, సృజనాత్మకతా రాహిత్యమునకు సంబంధించినదైనా, నేను అసలు పట్టించుకోను... నేను పరిశీలించేది, మరి ప్రయోగించేది ఒకే ఒక్క మౌలిక.. ఆధ్యాత్మిక సత్యాన్ని అది "మనల్ని మనం ప్రేమించుకోవడo"
🌹మనల్ని మనం ప్రేమించుకుని, అంగీకరించుకొని మన పట్ల మనం మంచి భావనతో ఉంటే ,జీవితం మనకు అనుకూలిస్తుంది... జీవితపు అన్నీ క్షణాల్లోనూ అద్భుతాలు సంభవించడం ప్రారంభం అవుతాయి ...మన ఆరోగ్యము చక్కబడుతుంది ...మన ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది... సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లభిస్తుంది ...మనల్ని మనం మరింత సృజనాత్మకతతో వ్యక్తపరచుకోగలుగుతాము... ఇవన్నీ మన ప్రయత్నం కూడా అవసరం లేకుండానే అవంతటావే జరిగిపోవడం కూడా గమనించగలుగుతాము....🌹
*మనల్ని మనం ప్రేమించుకోవడం, మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగానే అంగీకరించడం, మన పట్ల మనం మంచి భావనతో ఉండడము ,మనల్ని మనం సంరక్షించుకోవడం ,సృష్టి పట్ల పరిపూర్ణ విశ్వాసంతో ఉండడము, అన్నిటికి మనము అర్హులమని భావించడం, మొదలైనవి మన మనసుని నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దుతాయి ...ఈ భావనలు మన జీవితాల్లో ప్రేమ మయమైన సంబంధాల్ని, కొత్త ఉద్యోగాన్ని ,చూపించడానికి ఉన్నతమైన ,నూతనమైన, ప్రదేశాన్ని .... ఇంకా మన శరీరపు బరువుని సహజం చేయడం లాంటి వాటిని కూడా సమకూర్చుతాయి... ఎవరైతే వారిని ప్రేమించుకుంటారో, వారు ఇతరులని దూషించారు ...
*మన పట్ల మనం మంచి భావంతో ఉండడము, మరి మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడం, అనే భావాలే ప్రస్తత క్షణములో మన జీవితాల్లో అన్నీ కోణాలలో శుభ ప్రదమైన మార్పులు సంభవించడానికి అవసరమైన, కీలక అంశాలు....
"నా దృష్టిలో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేది ,దేనికి గాని, ఎప్పుడు గాని మనలో మనం తప్పులు పెంచకపోవడంతో మొదలవుతుంది... ఈ తప్పులు ఎంచడం అనేది మనల్ని మార్పు చెందుటకు ప్రయత్నించడం వద్దే కట్టిపడేస్తుంది... మనల్ని మనం అర్థం చేసుకొని ,మనతో మనం సున్నితంగా వ్యవహరిస్తే చాలు... ఈ ఆత్మ నిందలోంచి బయటపడవచ్చు... మిత్రులారా !!ఇన్ని సంవత్సరాలుగా మిమ్మల్ని మీరు ఎత్తి పొడుచుకుంటూ , గ డుపుతున్నారు ...అది మీకు ఎటువంటి ప్రయోజనాన్ని చేకూర్చలేదు... ఇప్పుడు మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకోవడానికి ప్రయత్నించి చూడండి ఏమవుతుందో.....
🌹ధన్యవాదములు 🌹