Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

మానవుని అనంత శక్తి_నమ్మకాలు, ఆలోచనలు _జీవితము????

🌹మన జీవితాన్ని శక్తివంతమైనదిగా మార్చుకోవడం ఎలా?????

🌹ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రోజంతా నీవు ఏమి ఆలోచిస్తావు.....ఏమి తింటావు....ఏమి త్రాగుతావు........ఎటువంటి మనుషులతో సంచరిస్తావు.......ఎటువంటి పుస్తకాలు చదువుతావు.......అనేది,నీవు ఎలాంటి జీవితాన్ని గడపాలి అనుకుంటున్నావు అనే దాని నుండి మొదలు అవుతాయి.....చివరకు ఆ పనులు నీ జీవిత నాణ్యతను నిర్ణయిస్తాయి........


🌹మనిషి సహజ లక్షణము త్వరగా,తాత్కాలికంగా ఆనందాన్ని ఇచ్చేటటువంటి ,విషయాల వైపు,పనుల వైపు,, మనుషుల వైపు, పుస్తకాల ఆకర్షిoచబడటం......ఆ లక్షణాలు అన్నీ అధిగమించడం అనేది ఆలోచన ద్వారా సాధ్యం అవుతుంది.... చేసేటటువంటి పనుల ప్రయోజనాలను యోచన చేయడం ,దీర్ఘకాలంలో నష్టం చేసే పనులు చేయలేము.......

🌹జీవితంలో మీ అభివృద్ధికి ఆటంకంగా అవుతున్న అన్ని రకాల లక్షణాలను ఒక పుస్తకంలో రాయండి.....

🌹 ఉదాహణకు పొట్లాడుతావా, అనవసరమైన ఆవేదనలో ఉంటావా,జీవితంలో ఉన్న అవకాశాలను కాక,కష్టాలను చూస్తావా అనేది తెలుసుకుని రాయాలి.......
అప్పుడు వాటిని సరైన ప్రణాళిక ,విధానాల ద్వారా,నిర్ణయాల ద్వారా మార్చుకునే ప్రయత్నం చేయాలి.....

🌹మన జీవితానికి మంచి చేసే పనులను,వాటి ఫలితాల ద్వారా వచ్చే ఆనందాన్నిమనసులో ఉంచుకొని దానిని మన ప్రేరణగా మార్చుకొని నిరంతర శ్రమతో సాధించాలి దాని కోసం మనం కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకొని పాటించడం ప్రారంభించాలి అప్పుడు మనలో క్రమ క్రమముగా మార్పు సంభవించి మనము అనుకున్న విధంగా మారి గొప్ప శక్తివంతులుగా తయారు కాగలుగుతాము......

🌹నీలో నీవు మార్చుకోవాలనుకుంటున్న లక్షణాన్నీ గుర్తించి ,మొదట దాని ద్వారా నీకు కలుగుతున్న నష్టాలను ,ఒక పేపర్ పై రాసుకోవాలి ...దాని ద్వారా నీకు రాబోయే కష్టాలను ఊహించుకో ,వాటన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గుర్తుచేసుకో... ఈ విధముగా చేసినప్పుడు ,క్రమ క్రమముగా నీ మెదడులో ఆ లక్షణంపై వ్యతిరేకత పెరిగి, నీ మీద నీకు నియంత్రణ వచ్చి ,ఆ లక్షణాన్ని అధిగమించగలుగుతావు......

🌹ఒకసారి నీవు చేయకూడని పనులు, ఆలోచించకూడని ఆలోచనలను, గుర్తించిన తర్వాత, అటువంటి పనుల వైపు నీ దృష్టి మళ్లినప్పుడు, నిన్ను నీవు మందలించుకోవాలి.... తప్పు చేసినట్లుగా గుర్తు తెచ్చుకోవాలి ...మరియు స్వీయ శిక్ష విధించుకోవాలి... అలా చేసినప్పుడు క్రమ క్రమముగా నీకు అనవసరమైన పనుల వైపు ఆలోచనల వైపు నీ దృష్టి మరలదు ....అవి ఆ తర్వాత నీ జీవితము నుండి వెళ్లిపోతాయి....

🌹నీ జీవితంలో ఉన్న అనవసరమైన అలవాట్లను, తగ్గించుకుంటూ వాటిని నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన, ఆలోచనలతో నింపాలి ...మన మెదడు ఖాళీగా ఉంటే ,మరలా చెడు అలవాట్లు, ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది... అందువలన ఇష్టపూర్తిగా, మనుషులను గొప్పవారిగా మార్చే అలవాట్లను, అలవాటు చేసుకుని, గత ఆలోచనల స్థానంలో నింపుతూ పోవాలి....

🌹ఈ పరివర్తనా క్రమములో మన ఆలోచనలను ,పనులను, మాటలను మనం నియంతించవచ్చని గుర్తించడం జరుగుతుంది.... మనము మనస్పూర్తిగా మంచి పనులు చేయడం, మంచి అలవాట్లు చేసుకోవటం, మొదలు పెడతాము.... అలా మొదలుపెట్టిన పనులు ,నిరంతరం సాధన చేయటం ద్వారా ,మన వ్యక్తిత్వంలో పరిపూర్ణమైన మార్పు వస్తుంది......

🌹జీవితాన్ని గెలిచే వారికి ,ఓడిపోయే వారికి, తేడా ఏమిటంటే, గెలిచేవారు కొత్తకొత్త నిర్మాణాత్మక ఆలోచనలను, ఆహ్వానించి వాటిని మనస్ఫూర్తిగా, ప్రయోగాత్మకంగా పాటించటానికి ప్రయత్నిస్తారు......


🌹ప్రతిరోజు కొత్త విజ్ఞానాన్ని సంపాదించే వారే, నిజమైన నాయకులు... నాయకత్వంతో జీవించేవారు భోజనాన్ని అయినా మానేస్తారు కానీ, స్వీయాభివృద్ధిని మాత్రం మరచిపోరు..... ఈ విధంగా ప్రతిరోజు మనం నిర్మాణాత్మకంగా ప్రయత్నిస్తే ,మన జీవితం శక్తివంతంగా మారుతుంది.....


🌹ప్రయోజనాత్మకమైన మెదడును నిర్మించుకోవడం ఎలా???

🌹మన విజయ రహస్యము, మనము ఆలోచించే ఆలోచనలలో ఉంటుంది ....ప్రతి క్షణం మనము ఏమి ఆలోచిస్తున్నాము ,మన ఆలోచనలు ఏ దిశ వైపు ప్రయాణిస్తున్నాయి, అనేది ముఖ్యము ....మనం మెదడును ఆ విధంగా నడిపించగలగటం అనేది ప్రయోజనాత్మకమైన ,మెదడుగా తయారు చేయటానికి మొదటి మెట్టు........


🌹మనం మన జీవితము ఎలా ఉంది అనేది, బయట మనకు ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది ,మన అంతర్గత జీవితముపై ఆధారపడి ఉంటుంది..... లోపల మనము ఏమి భావిస్తున్నాము, మన గురించి మనము ఏమి అంచనా వేసుకుంటున్నాము, అని అంతర్గత విషయాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి.......

🌹మనకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, అనేది ఎలాంటి నమ్మకాలు మనలను నడిపిస్తున్నాయి అనేదానికి, మనమే బాధ్యులము ....మన ఆలోచనలు గుర్తించి, వాటిలోని ప్రతికూల ఆలోచనలను, నిరంతర సాధన ద్వారా శక్తివంతమైన మెదడును తయారు చేసుకోవచ్చును..... మన ఆలోచన సరళియే మన అలవాట్లుగా మారుతాయి.... అనుకున్న బలమైన లక్ష్యం వైపు ఆలోచించే విధంగా, మన మెదడును శిక్షణ ద్వారా మార్చుకోవాలి......

🌹మన మెదడు ఒక్కరోజులో ప్రయోజనాత్మకంగా మారదు..... ప్రతిరోజు మనం కొంత ప్రయత్నం చేసి, మనస్ఫూర్తిగా ఇష్టప్రకారముగా, మంచి ఆలోచనలను అలవాటు చేసుకున్నప్పుడు, అది మన ఆధీనంలోకి వస్తుంది .....కానీ ప్రయత్నము తప్పనిసరిగా ఫలితాన్ని ఇస్తుంది..... ఈ ముఖ్యమైన కారణం వలనే సామాన్యులు గొప్పవారవుతున్నారు......


🌹మనము మన గురించి ఏమీ అనుకుంటున్నాము, ఎలాంటి వారమని మనం భావిస్తాము, మన ఆత్మతో మనం ఎలా సంభాషిస్తాము, అనేది మన మెదడు యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది.... మనం మెదడులో నడిచే చిత్రాలను గుర్తించి, వాటిని మంచి చిత్రాలతో నింపాలి ......మన మెదడు బొమ్మల రూపంలో విషయాలను గుర్తు పెట్టుకుంటుంది.... మంచి బొమ్మలను మనం మెదడులో నింపినప్పుడు, మన లక్ష్యానికి సంబంధించిన చిత్రాలను నింపినప్పుడు, మన లక్ష్యాలను సాధించటం, సులభం అవుతుంది......

🌹మనము నిజాయితీగా నమ్మకముగా, బలముగా, నమ్మిన ఎటువంటి విషయాన్నయినా మనము సాధించగలుగుతాము.... అది ఎంత కష్టమైనా దైనను ,నిరంతరము మన లక్ష్యాన్ని మనం మెదడులో నింపుకోవటం ద్వారా, దాని గురించిన కళలతో మనం మెదడులోని ఆలోచనలను ప్రభావితం చేయటం ద్వారా, ప్రతిక్షణం ఆ రోజంతా ఆ లక్ష్యం వైపు, మనం మానసిక శక్తిని ,శారీరక శక్తిని ,నడపటం ద్వారా మన మెదడు శక్తివంతమైన, ప్రయోజనాత్మకమైన, పనులు చేయగలగటానికి మనలను ప్రేరేపపించి, మనము ఊహించినటువంటి మానసిక శక్తులు మనకు సహకరించి, గొప్ప కార్యాలను సాధించటానికి నడిపిస్తాయి......

🌹మనము మెదడులో దేనినైతే నమ్ముతాము, దేని గురించి అయితే ఆలోచిస్తాము, అదే మన జీవితంలోనికి ఆహ్వానించబడుతుంది.... మనసులో సంతోషము, పవిత్రత ,మంచి ఆలోచనలు ,ఉన్నవారు అటువంటి మనుషులనే వారి జీవితంలో పొందుతారు.... తమకు మంచి జరుగుతుందని, నిరంతరము నమ్మే వ్యక్తులకు మంచి అనుభవాలు, సంఘటనలు, ఫలితాలు లభిస్తాయి... అందువలన మనము మన మెదడులో మంచి ఆలోచనలు వచ్చేటట్లుగా ,ప్రయత్నం చేయాలి.... అప్పుడు అది క్రమక్రమంగా శక్తివంతముగా మారుతుంది.....

🌹మన మనసులో మనకు తెలియకుండా, దాగి ఉన్న నమ్మకాలు ,మన ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి.... మన జీవితంలో ఉన్నవి, జరిగినవి, ఆలోచించినవి ,మన అనుభవాలుగా మారి ,వాటి గురించి మనము ఒక విధమైన దృక్పథాన్ని అలవాటు చేసుకుంటాము..... మన నమ్మకాలను, వెలికి తీసి, వాటిని విశ్లేషించి, మంచి నమ్మకాలను మాత్రం నిలువ ఉంచుకోవడం ద్వారా మన మెదడు పనితీరును, శక్తివంతముగా ప్రయోజనాత్మకంగా మార్చవచ్చు......

🌹మన మెదడు ఒకేసారి అనేక ఆలోచనలను చేయలేదు..... కేవలం ఒక్క ఆలోచనపై దృష్టిని ఉంచగలదు.... మనము ఏ ఆలోచనను చేస్తున్నాము.. గమనించటం ద్వారా ,దాని స్థానంలో మంచి నిర్మాణాత్మకమైన ,ఆలోచనను ఉంచటం ద్వారా, మన మెదడును ఏకాగ్రతతో పని చేయించగలము.......

🌹నీ మెదడులోని, నియంత్రణ విభాగము నీ ఆజ్ఞలను పాటించడానికి సిద్ధంగా ఉంటుంది..... మెదడుని నీ స్వాధీనములోకి తెచ్చుకున్నప్పుడు, అది నీ శరీరాన్ని, బుద్ధిని, ఆలోచనలను, శాసిస్తుంది ....ఇది నీవు అర్థం చేసుకొని, గొప్ప కార్య సాధన పై నీ దృష్టిని పెట్టినప్పుడు, మీ మెదడు నీ ఎదురుగా ఉన్న అన్ని అవకాశాలను, సాధించటానికి నిన్ను ముందుకు నడిపిస్తుంది......

🌹గొప్ప వ్యక్తిగా ఎదగటానికి పాటించవలసిన నియమాలు???

🌹మనము సాధించాలనుకున్న లక్ష్యానికి కట్టుబడి ఉండాలి.... దాని గురించే దాన్ని సాధించాలనే కోరికతో మన మనసు నిండిపోవాలి.... ఆ విధమైన లక్ష్యాన్ని ఎందుకు సాధించాలి, అనుకుంటున్నది, దాని వలన మనము పొందబోయే ఫలితాలను, తెలుసుకొని వాటిని మనం మనసు నిండా నింపుకున్నప్పుడు, మనకు మన లక్ష్యాల వైపు నడవాలని కోరిక నిరంతరము కొనసాగుతుంది.... దానికే కట్టుబడి ఉంటాము...

🌹మనము ప్రయాణించాలనుకున్న మార్గము గురించిన నిర్ణయము తీసుకున్న తర్వాత ఆ విషయము గురించి పరిపూర్ణమైన అవగాహన, విజ్ఞానము సంపాదించాలి..... ఆ దారిలో ప్రయాణించిన, విజయవంతమైన వ్యక్తుల జీవిత చరిత్రలను, వారు పాటించిన నియమాలను తెలుసుకోవాలి..... మన లక్ష్యం గురించిన పరిపూర్ణతను సాధించాలి....

🌹మన సమాజంలో గొప్ప విషయాలను, సాధించిన వ్యక్తులను, పరిచయము చేసుకొని వారిని గురువుగా స్వీకరించాలి.... వారితో నిరంతరము అనుబంధము పెంచుకోవాలి.... వారు ఏ విధమైన మార్గాల ద్వారా తమ జీవితంలోని విజయము సాధించారో, తెలుసుకోవాలి... ఈ విధముగా నీకు నేర్పబడుతున్న విషయాలను, చక్కని నిబద్దతతో, ఏకాగ్రతతో స్వీకరించగలిగినప్పుడు, నేర్చుకోవటంలో ఆనందాన్ని పొందుతావు.....

🌹మనిషి జీవితంలో అన్ని విజయాలే ఉండవు.... మనకు అనేక అడ్డంకులు, సమస్యలు ,ఎదురు వస్తాయి ....మనకు వచ్చే అడ్డంకులు మన సామర్థ్యాన్ని పరీక్షించి పెంచుతాయి.... అనే విషయాన్ని తెలుసుకుంటే, మనము వాటిని ఆనందముతో, ఎదుర్కొంటాము.... నిరంతర కృషి, చెదిరిపోని బలమైన కోరిక ,ద్వారా మనము మన జీవితంలో ఉండే సమస్యలను, జయించగలుగుతాము....

🌹నీవు ఏ పని అయితే చేయడానికి ఇష్టపడవో, అది మంచిది అని తెలిసినప్పుడు, దానిని చేయటానికి , నిన్ను ప్రతిరోజు సన్నద్ధం చేసుకోవాలి... దీని గురించి అయితే మనము భయపడి సమస్యను వదిలి వేస్తాము, లేక దూరంగా వెళుతుంటాము... వాటినే మనము చేయటానికి ప్రయత్నించినప్పుడు ,మన శక్తి, సామర్థ్యాలు పెరిగి మన లక్ష్యం వైపు దూసుకు వెళ్లే ధైర్య సాహసాలను ,పొందుతాము... దీని కోసము మన సామర్థ్యాన్ని, ప్రమాణాలను, విలువలను ,ప్రతిరోజు పెంచుకుంటూ, ముందుకు సాగాలి.... ఎప్పుడూ ,ఏ విషయాన్ని మనం బలహీనతగా అంగీకరించరాదు... మన బలహీనతలను మనము నిరంతరం పోరాడి బలాలుగా మార్చుకోవాలి......

🌹నీవు ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవలసినది, చాలా ఉంటుంది, అని గుర్తించాలి ...మనము నేర్చుకోవటం ఆపి వేస్తే, మరణానికి దగ్గరవుతున్నామని అర్థం... మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తి వద్ద నుండి మనం ఎంతో కొంత విజ్ఞానాన్ని నేర్చుకోవచ్చును... మనం కొత్త ఆలోచనలకు, కొత్త మార్గాలకు, కొత్త పద్ధతులకు, అనుకూలంగా స్పందించగలిగినప్పుడు ,మనకు కొత్త అవకాశాలు ఎదురవుతాయి.....

🌹మన లక్ష్య సాధనను ,దాని కోసము మనము చేసే కృషిని ,అనుభవించే ఇబ్బందులను ,ఆనందముతో అనుభవించాలి.... వాటిని భారముగా భావించరాదు....నీవు మెట్టు మెట్టుగా నీ లక్ష్యం వైపు ప్రయాణం చేయటంలోని ఆనందాన్ని, విజయాలను సాధించే మార్గంలో అనునిత్యం అనుభవించాలి .....మన జీవితంలోని ప్రతి సంఘటన ఒక కారణంతో సంభవిస్తుంది ....మన గత జీవిత సంఘటనలను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకోవాలి... మనకు ఆనందము, లక్ష్యమును చేరుకున్నప్పుడు మాత్రమే కాక ,సాధించే దారిలో కూడా లభిస్తుంది.....మనకు దానిని తెలుసుకొని మన జీవిత సంఘటనలను దైవ నిర్ణయాలుగా భావించి కదలాలి......


🌹నీవు జీవితంలో ఎన్ని ఆస్తులు సంపాదించినా ,ఎంత ఎత్తుకు ఎదిగినా ,నీవు నీ ద్వారా ఈ ప్రపంచానికి ఏమిస్తున్నావు అనేది, చాలా ముఖ్యము ....ఎప్పుడైతే నీవు నీ జ్ఞానాన్ని ,సంపదను ,సేవను ,ఇతరులకు, పంచటం మొదలుపెడతావో, నీ జీవితం యొక్క నాణ్యత పెరిగి ,నిజమైన అనుభూతి కలుగుతుంది......

🌹ప్రతి రోజు కొంత సమయాన్ని మన కొరకు కేటాయించుకోవాలి.... ధన సంపాదన కొరకు, కాకుండా మన ఆనందం కొరకు ,వినోదం కొరకు, ప్రకృతి అందాలను చూడటం కొరకు ,కొన్ని అలవాట్లను చేసుకోవాలి ....ఆ విధముగా మనకు మన దగ్గరే మనం మానసిక శక్తిని పెంచుకోగలము.....

🌹🌹🌹నిజాయితీ నిబద్ధత నమ్మకాన్ని నిలబెట్టుకోవటం🌹🌹🌹


🌹మనిషి సంఘ జీవి, ఇతరులతో కలవకుండా, మాట్లాడకుండా ,సహాయం పొందకుండా ,ఎవరూ జీవించలేరు.... మనకు మన నిజాయితీ, నిబద్ధత ,ఆధారంగానే విలువ పెరుగుతుంది..... నిజాయితీ లేని వ్యక్తి ఎంత తెలివితేటలున్నా ,ఇతరులు అతనిని గౌరవించరు... కాబట్టి మనము మన జీవితంలో నిజాయితీ ,నిబద్ధతలను పాటించాలి....


🌹నీతివంతమైన జీవితానికి పాటించవలసిన నియమాలు5:---
1.నమ్మదగిన వ్యక్తిత్వం...
2.సత్యం పలికే గుణం...
3.చేసే పనులలో పారదర్శకత...
4.స్వచ్ఛమైన మనస్తత్వం...
5.ధర్మబద్ధమైన ఆలోచనలు...

🌹కొంతమంది వ్యక్తులు, ఈ లక్షణాలను కలిగి లేకుండా ,ఇతరులు, మనుషులతో ఇవన్నీ తమకు ఉన్నాయని, నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఒక ముసుగులో జీవిస్తారు... కానీ ఆ ముసుగులో , ఆత్మ క్షభ అనుభవిస్తూ, తమ జీవిత శక్తిని నశింప చేసుకుంటారు... నీతి, నిజాయితీతో, నడిచే వ్యక్తికి జీవితం ఆనందంగా సాగుతుంది....

🌹మనము ఏ వృత్తిలో ఉన్న, ఎటువంటి వ్యాపకములో ఉన్న, మనకు తప్పనిసరిగా ఉండవలసినది, నిజాయితీతో కూడిన వ్యక్తిత్వము.... సంఘములో అత్యున్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు ,ఈ నిజాయితీ ఎక్కువ శాతం లో ఉండాలి.... అప్పుడు వారు చేస్తున్న పనిలో నిరంతరము అభివృద్ధి లభిస్తుంది.. మరియు నాయకత్వం బలపడుతుంది.....

🌹నిజాయితీకి మనము విలువ కట్టలేము.... నిజాయితీ, నిబద్ధతను పాటించే వ్యక్తులు, తాము ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న ,తమ సిద్ధాంతానికి కట్టుబడతారు ...నిజాయితీకి కార్యక్రమంలో అనంతమైన గుర్తింపు లభిస్తుంది.. ఏ వ్యక్తి అయితే తన చేసే ప్రతి పనిని పరిశీలించి తనను తాను విమర్శించుకుంటూ ,నిజాయితీతో నడుస్తాడ ,అతని పేరు ప్రతిష్టలు నలుదిశలా వ్యాపిస్తాయి.... తను చేయవలసిన పనులకు, తోటి మనుషుల నుండి సమాజానికి సహాయ సహకారాలు లభిస్తాయి...

🌹సమాజానికి ,మన తోటి వారికి ధైర్యముగా చెప్పలేని పనులను మనము చేయరాదు మనం చేసే పనులు, వాటి వెనుక కారణము, మన తోటి వారికి అర్థం కావాలి... మనము అప్పుడే సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే కార్యక్రమాలను, చేయగలుగుతాము... పది మంది మనలను ఆదర్శంగా తీసుకోవటానికి చూస్తాము.....

🌹నిజాయితీ మనము చేసే ప్రతి పనిలోనూ, మాటలోనూ ,వృత్తిలోనూ, ప్రదర్శించాలి ...మనది కానీ ,న్యాయబద్ధంగా, అర్హత లేని, సంపదను ,ఆస్తులను మనము తీసుకోవటానికి ప్రయత్నించరాదు.... చిన్న చిన్న పనులలో కూడా మనము ఈ నియమాలను, పాటించవలసి ఉంటుంది... నిజాయితీ తప్పిన వ్యక్తి తాత్కాలికంగా లబ్ధి పొందిననూ, దీర కాలంలో తన తప్పిదాలకు తగిన మూల్యం చెల్లిస్తాడు....

🌹నిజాయితీ అనేది మనకై మనము అంగీకరించి, పాటించే విలువ ...అది పాటించటము మొదలుపెట్టినప్పుడు, మానసిక ఒత్తిడి ,అభద్రత ,వేదన తగ్గి మనశాంతి, ఆనందము లభిస్తాయి.... తను ఎవరికి భయపడవలసిన అవసరం లేనప్పుడు, నాయకత్వ లక్షణాలు సహజంగానే వస్తాయి.... అంటే మనసా, వాచా, కర్మణా ధర్మాన్ని పాటించాలి.....

🌹మన జీవితమంతా కష్టపడి సంపాదించుకున్న, మంచి పేరు ,ఒక్క అవినీతి అలవాటు ద్వారా మంటలో కలిసిపోతుంది.... అందువలన మనము చేసే ప్రతి పనిని ముందు జాగ్రత్తతో పరిశీలించి నియమబద్దంగా చేయాలి.. మనిషికి కలిగే సాధారణ లాభాలకు లొంగరాదు...

🌹ఎవరైనా మనలను గమనించేటప్పుడు, నిజాయితీగా ఉండటము అనేది మనం చేస్తాము... కానీ ఎవరూ చూడనప్పుడు ఒక్కసారి మనము గీత దాటే ప్రమాదం ఉంది ...అది నిజమైన నిజాయితీ కాదు... నిజాయితీ అనేది ఉపన్యాసాల ద్వారా ,మనము అందించలేము... మనిషికి దీనివలన అర్థమయ్యేలా అనుభవము కలిగినప్పుడు, తాను నియమబద్ధంగా జీవించగలుగుతాడు... గొప్ప వ్యక్తిగా సమాజంలో ఉన్నత స్థానానికి ఎదగాలి. అనుకునే ఏ వ్యక్తికైనా తప్పక ఉండవలసిన లక్షణము నిజాయితీ.... అందువలన దానిని అందరూ నియమబద్ధంగా పాటించాలి.......


**************************************
🌹🌹🌹🌹 ధన్యవాదములు 🌹🌹🌹🌹