Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

జీవితంలో ఉపయోగపడే ఒక చిన్న కథ.....

****అద్దం చెప్పిన సత్యాలు****

*ఒక ముసలాయన అద్దం తుడుస్తూ కనిపించాడు...అది గమనించిన ఒక యువకుడు తాతయ్య ఈ అద్దంలో
ఏం కనిపిస్తుంది... అని అడిగాడు
నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది...
నేను చూస్తే నన్ను చూపెడుతుంది ...
అన్నారు తాతయ్య.... అయితే
ప్రత్యేకమైన అద్దమైతే కాదుగా...
మరి ఎందుకు అంత జాగ్రత్త అన్నాడు ఆ యువకుడు.....అద్దం ఎన్నో పాఠాలు నేర్పుతుంది ...నీకు తెలుసా అన్నారు తాతయ్య ...అవి ఏమిటో చెప్పండి
అని ఆత్రుతగా అడిగాడు ఆ యువకుడు,

1.నువ్వు అద్దంలోకి చూడగానే
నీ ముఖం పైన ఉన్నమరకను,
ఎంత ఉంటే అంతే చూపెడుతుందిగా,
అన్నారు తాతయ్య...అవును అన్నాడు
ఆ యువకుడు, ఎక్కువగానో తక్కువగానో చూపదుగా అన్నాడు ....అవును
తాతయ్య అన్నాడు... ఆ యువకుడు
నువ్వు కూడా నీ స్నేహితులకు,
తోబుట్టువులకు ఉన్నది ఉన్నట్టుగా, చెప్పాలి....అని అర్థం తప్పైతే తప్పని, ఒప్పయితే ఒప్పని ,అంతేకానీ ఎక్కువగా ఇంకేదో ఊహించి చెప్పకూడదు...అన్నారు
ఆ తాతయ్య ఇదే మొదటి పాఠం.....

2.అద్దం ముందు నువ్వు నిల్చుంటే
నిన్ను చూపెడుతుంది....
నువ్వు లేకపోతే నిన్ను చూపెట్టదు...
అలాగే నువ్వు కూడా ఇంకెవరి
గురించైనా మాట్లాడాలి, అంటే
వారి వెనుక మాట్లాడకూడదు....అని
అర్థం ఇది రెండవ పాఠం అన్నారు తాతయ్య....

3.అద్దం మన ముఖం పై ఉన్న మరకని
చూపిందని కోపంతో పగలగొట్టము.. కదా!
అలా ఎవరైనా మన లోపాల్ని మనకు, చెప్పినప్పుడు కోపం తెచ్చుకోకుండా, అవి సరి చేసుకోవాలి....అని చెబుతుంది...
ఇది మూడవ పాఠం అన్నారు తాతయ్య....

ఇంత చిన్న అద్దంతో ఇన్ని పాఠాల
చాలా మంచి విషయాలు చెప్పారు తాతయ్య....మీకు కృతజ్ఞతలు
అంటూ ,ఆ యువకుడు ఎన్నో
కొత్త విషయాలు నేర్చుకున్నాను,
అని ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు,ఆ యువకుడు
మనసులో ఇలా అనుకున్నాడు,
ప్రయత్నిస్తే ఇంకెన్నో తెలుసుకోవచ్చు అని.......


****విలువలతో కూడిన కథ****

వెంకట్ ఒక గవర్నమెంట్ బ్యాంకులో పనిచేస్తాడు .రోజు బైక్ మీద ఆఫీసుకి వెళ్లడం, సాయంత్రం తిరిగి ఆఫీసు నుంచి నేరుగా ఇంటికి రావడం...సిటీకి కొత్తగా కావడం వలన, ఆప్యాయంగా పలకరించే వారు ఎవరూ లేరు తనకు......డ్యూటీ తర్వాత తన భార్యతో
కలిసి కాసేపు అలా అలా తిరిగి రావడం అంతే..... హడావిడిగా పరుగులు తీసే జనాలు,ఎవరి అవసరం వారిది, ఎవరు పనులు వారివి,ఒక్కరికి ఆగి ఆప్యాయంగా పలకరించే సమయం లేదు.....సిటీ కదా ఇంతేనేమో అనుకుంటూ,తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు..రోజులను బిజీగా గడిపేస్తున్నాడే కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి, బహుశా ఆ వెలితి అందరిలోనూ ఉందనుకుంటా, కానీ పైకి కనబడకుండా లేని పనిని కల్పించుకొని బిజీగా ఉన్నట్టు
నటిస్తూ వాస్తవానికి దూరంగా పారిపోతున్నట్లున్నారు ....డ్యూటీ ముగించుకుని ఇంటికి వస్తూ యధాలాపంగా రోడ్డు పక్కన కూర్చున్న ఒక ముసలావిడని చూశాడు....ముందు చిన్న బుట్ట పెట్టుకుని ఏదో అమ్ముతోంది...దగ్గరికి వెళ్లి చూసాడు బుట్టలో సపోటా పండ్లు పెట్టి అమ్ముతోంది...బాగా వయసు మళ్ళిన వృద్ధురాలు... ఈ వయసులోఎంత కష్టపడుతోంది అనిపించింది వెంకట్ కి.... కానీ ఒక్కరు కూడా ఆమె దగ్గర ఆగిపండ్లను కొనడం లేదు...అసలు అక్కడ ఒక మనిషి కూర్చుని ఉందన్న విషయం కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు.... వెంకట్ కి చాలా బాధ అనిపించింది.....బండి ఒక పక్కకు ఆపి తన దగ్గరకు వెళ్ళాడు వెంకట్....ఎలా అమ్మ సపోటాలు కిలో ఎలా ఇస్తున్నావు... అని అడిగాడు...ఆమె రేటు చెప్పింది..... సరే ఒక కిలో ఇవ్వు అమ్మ అని అన్నాడు....
ఆమె ఒక కిలో తూచి సంచిలో వేసి ఇచ్చింది....సంచి నుండి ఒక పండు తీసి తిని ఏంటమ్మా......అసలు తీయగా లేవు పండ్లు అని, ఇంకో పండు సంచిలో నుంచి తీసి ఆమెకు ఇచ్చాడు.....ఆమె ఆ పండు తిని ఇదేంటి నాయనా పండు తీయగానే ఉంది కదా! అంది....సరేలే అంటూ డబ్బులు ఇచ్చి ఇంటికి బయలుదేరాడు... ఆరోజు మొదలు ప్రతి రోజుఆమె దగ్గర ఆగడం ,కిలో సపోటాలు కొనడం,సంచిలో నుండి ఒక పండు తీసుకుని, తీయగా లేదు అని చెప్పడం...కావాలంటే నువ్వు చూడు అని ఆమెకు ఒక పండు ఇవ్వడం, ఆమె తిని బాగుంది కదా, అంటే,డబ్బులు ఇచ్చి ఇంటికి వెళ్లడం...దినచర్య అయిపోయింది వెంకట్ కి..... ఒకరోజు తన భార్యతో కలిసి వెళుతూ ఆగాడు...ఆమె దగ్గర ఎప్పటిలాగే కిలో పండ్లు తీసుకున్నాడు.....సంచి నుండి ఒక పండు తీసుకొని, తినిపండ్లు తీయగా లేవని చెప్పి , తన సంచిలో నుంచి ఒక పండు తీసి ఆమెకి ఇచ్చాడు... ఆమె పండు తిని తీయగానే ఉన్నాయి కదా నాయనా...అనిచెప్పగానే డబ్బులు ఇచ్చి బయలుదేరాడు ....ఇదంతా చూసిన వెంకట్ భార్యకి కోపం వచ్చింది.... ఇంటికి వెళ్ళాక రోజు నువ్వు తీసుకుని వచ్చే పండ్లు ,చాలా తీయగా ఉంటాయి... ఎందుకని ఆవిడకు అబద్ధం చెప్పి బాధ పెట్టావు.....పాపం కదా, అసలే పెద్ద ఆవిడ అని అడిగింది.....వెంకట్ చిరునవ్వు నవ్వి, ఆమె దగ్గర పండ్లు తీయగానే ఉంటాయి... అనినాకు తెలుసు ....ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆమె ఆ పండ్లన్నింటినీ అమ్మడానికి కూర్చుంటుందే, కానీఒక్క పండు కూడా ఆమె తినదు...ఎలా అని నేను కొన్న పండ్లు ఆమెకు తినడానికి ఇస్తే, ఆమె తీసుకోకపోవచ్చు ...అందుకే అలా అబద్దం చెప్పి రోజు ఆమె తినడానికి ఒక
పండు ఇస్తున్నా అని అసలు
విషయం చెప్పాడు వెంకట్.......వెంకట్
తన భార్యతో కలిసి వెళ్ళిపోగానే,వృద్ధురాలికి కొంచెం దూరంలో,అమ్మే ఒక ఆమె వృద్ధురాలు
దగ్గరకు వచ్చి,"రోజూ చూస్తున్నాను,ఆ అబ్బాయి వస్తాడు,పండ్లు కొంటాడు,బాగాలేదని మొహం మీదే చెబుతాడు...అయినా కూడా నువ్వు రోజూ ఒక పండు ఎక్కువ తూయడం,నేను చూస్తూనే ఉన్నా,
అటువంటి వాడికి రోజూ ఎందుకు ఒక పండు ఎక్కువ ఇస్టున్నావు....అని అడిగింది....

ఆ వృద్ధురాలు చిన్నగా నవ్వి చెప్పింది..."పిచ్చిదానా నేను తీసుకుని వచ్చే పండ్లన్నీ తియ్యగానే ఉంటాయని నాకు తెలుసు... అయినా తియ్యగా లేవని అబద్దం చెప్పి,కావాలనే రోజూ ఒక పండు నా చేత,
తినిపిస్తున్నాడు...ఆ అబ్బాయి చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు,తెలియకుండానే ఒక పండు దానంతట ఎక్కువ తుగుతోంది అని అన్నది.....నిజంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలలో ఎంతో ఆనందం దాగి ఉంటుంది కదా.......అన్ని ఆనందాలను డబ్బుతో కొనలేము....ఎదుటివారి పట్ల ప్రేమ,ఆప్యాయతలే,జీవితంలో నిజమైన తియ్యదనాన్ని నింపగలవు........మనిషికి ఉండవలసిన ఉదార స్వభావం కనుమరుగైపోతోంది...ఇవ్వడంలో ఉన్న ఆనందం, తీసుకోవడంలో దొరకదు....ఆనందం పెంచితే పెరుగుతుందే కానీ తగ్గదు....
అన్నీ ఉన్నా కూడా ఈ రోజుల్లో ,ఆప్యాయంగా పలకరించే వారు లేకుండా పోతున్నారు.....ఆప్యాయంగా పలకరించడానికి ఎదుటి వారితో మనకు , బంధుత్వమే ఉండవలసిన అవసరం లేదు.....అందరూ ఆప్తులే అని చెప్పడం కోసమే ఈ చిన్న కథ.......