Read panipuri by Tejaswani Kirankumar in Telugu ఏదైనా | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

పాణిపూరి

పెళ్లికి ముందు పాణిపూరి తెగ తినేది

ఇంకా కాలేజ్ డేస్ లో కాలేజ్ అయి బయటకు రావడం పాణిపూరి తిని ఇంటికి వెళ్ళటం

ఫ్రెండ్స్ తో పోటీ పడి మరీ తినేది

ఆ పాణిపూరి బండి డ్రైనేజ్ పక్కనే ఉన్న కూడా ఏమాత్రం సంకోచించకుండా తినేవాళ్ళం

చదువు ఆయాక పెళ్ళికి మధ్యలో గ్యాప్ లో కూడా
ఇక అమ్మ నాన్న తో బయటకు వెళ్ళినప్పుడు పాణిపూరి తినాల్సిందే

నాన్న ఎప్పుడయినా ఇంటికి పార్సిల్ తెచ్చేవారు

అది అంత టెస్ట్ ఉండేది కాదు ఎంతయినా వేడివేడిగా బండి దగ్గర అతను స్టఫ్ చేసే పాణిపూరి టెస్ట్ మనం చేసుకుంటే రాదు కాబోలు

నా జీవితం లో అత్యధికంగా తిన్న స్నాక్స్ పాణిపూరి

మా పుట్టింట్లో ఏ బండి దగ్గర పాణిపూరి ఎలా ఉంటుందో టక్కున చెప్పగలను

ఇక పెళ్లి అయ్యి అత్తగారి ఇంటికి వచ్చాను

నన్ను నా పాణిపూరి నీ విడదీసింది మా పెళ్లి

పెళ్లి అయ్యాక మొదటి రాత్రి రోజు కబుర్ల మధ్యలో మా వారు నీకు ఎం ఎం ఇష్టం అంటే ....టక్కున చెప్పిన సమాధానం పాణిపూరి

మా వారు షాక్

ఎం చెయ్యటానికి ఎక్కువ ఇష్టపడతావు అంటే

పాణిపూరి బండి దగ్గర నిలుచుని తినటానికి ఇష్టపడతాను అన్నాను

అప్పుడు మా వారి మొహం చూడాలి

ఫుల్ కామెడీ

ఆ రోజు ఎం అనలేదు

తెల్లారి మాత్రం కచ్చితంగా చెప్పాడు మా ఇంట్లో స్ట్రీట్ ఫుడ్ తినే అలవాటు ఇంటికి తెచ్చే అలవాటు లేదు అని

నా నెత్తిన పిడుగు పడిన సౌండ్ నా చెవులకు వినిపించింది

మరి పాణిపూరి అన్నాను అమాయకంగా

మా వారు తల కొట్టుకొని అది అసలే తినకూడదు గరికపాటి వారు చెప్పింది వినలేదా అంత విన్నాక కూడా ఎలా తినాలి అనిపిస్తుంది అని అన్నారు

నాకు సౌండ్ లేదు ఇన్నర్ లో గరికపాటి వారిని నా తిట్లతో అభిషేకం చేస్తున్నాను (క్షమించాలి సర్ 🙏🙏🙏🙏🙏)

ఇక అప్పటినుంచి నో పాణిపూరి

బండి మీద మా వారితో వెళ్తుంటే పాణిపూరి బండి చూస్తుంటే లేని ఆకలి వచ్చి చేరి నన్ను ఉక్కిటిబిక్కిరి చేసేది

అసలు పాణిపూరి నీ తలుచుకుంటేనే నోట్లో నీళ్లు ఊరతాయి మరి

ఓ సంవత్సరం పాటు నరకం చూసాను అంటే నమ్మండి పాణిపూరి లేక

ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వారు నా వెనుకే వచ్చేవారు ఒకసారి నాన్న ఇలానే నాకు పాణిపూరి ఇష్టం అని తెలిసి తెస్తే అది తినటానికి అని నేను వంటగదిలోకి వెళ్లి ప్లేట్ తెస్తున్న ఆ పాణిపూరి పై పిల్లి పడింది

అంతే ఆ కవర్స్ చినిగిపోయి అంత వెస్ట్ అయిపోయింది

ఆ రోజు ఆ పిల్లి నీ చంపెయ్యాలి అనే అంత కోపం వచ్చింది

అలా నేను వెళ్లిన రెండు మూడు సార్లు కూడా కుదరలేదు

ఇక ఇలా కాదు అని మా వారితో యూద్దనికి దిగాను నాకు పాణిపూరి తెస్తారా తీసుకురారా అని

మా అమ్మ అస్సలు ఊరుకోరు కావాలంటే అందుకు కావాల్సిన వస్తువులు తెస్తాను యూట్యూబ్ లో చూసి చేసి నువు తిని దాని రుచి ఏంటో మాకు చూపించు అన్నాడు

ఆ మాట కె తెగ సంతోషపడ్డాను

వెంటనే యూట్యూబ్ లో పాణిపూరి తయారీ వీడియోలు చూసి కావలసిన సామగ్రి తెప్పించాను మా వారితో

ఆయాన అవి తెచ్చేవరకు యూట్యూబ్ లో వీడియోలు చూస్తూనే ఉన్నాను

ఒక్కో వీడియో లో ఒక్కోలా ఉన్నది

అన్ని మిక్స్ చేసి నా మైండ్ లో ఓ పిక్చర్ తీసాను

అలా పాణిపూరి చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను

మావారు కావలసిన సామగ్రి తెచ్చారు

ముందు పూరిల కోసం పిండి రెడీ చేసి పక్కన పెట్టాను

కర్రీ ప్రిపేర్ చేసి

పూరీలు వత్తి ఆయిల్ లో వేసాను

అవి చక్కగా పొంగినవి

పాణిపూరి పూరీలు వచ్చినట్లే వచ్చాయి

నాకు ఎగిరి గంతులు వెయ్యాలి అనిపించింది

నా ఆనందానికి అంతే లేదు

అదే ఉత్సాహం తో కర్రీ చేసి పాణిపూరి రెడీ అని అందరికి ప్లేట్ లో పూరీలు ఒక చిన్న బౌల్ లో కర్రీ మరో బౌల్ లో వాటర్ పోసి ఇచ్చాను స్పూన్ తో కలిపి

నేను తెచ్చుకొని వాళ్లముందు కూర్చొని ఎలా తినాలో చూపిస్తూ ఒక పూరి తీసి హొల్ చేసి అందులో స్పూన్ తో కర్రీ వేసి అదే స్పూన్ తో వాటర్ పోసి నోరు కప్పలా తెరిచి నోట్లో పెట్టుకున్న

అత్త మా ఆయన మా ఆడపడుచు అలానే చేసి నోట్లో పెట్టుకున్నారు

నోట్లో పెట్టుకున్న నాకు నో మాటలు

మిగిలిన వాళ్ళు మాత్రం బాగుంది బాగుంది అని తినేశారు

నేనే కక్కలేక మింగలేక రెండు తినేసి వదిలేసాను

ఎందుకంటే రకరకాల పాణిపూరి రుచులు చూసిన నాకు నేను చేసిన పాణిపూరి అసలు నచ్చలేదు

ఎప్పుడు పాణిపూరి మొహం చూడని వాళ్ళకి అదే అద్భుతంగా ఉంది

ఇక చూసుకోండి వారానికి ఒకసారి మా వారు మా అత్తగారు పాణిపూరి చెపిస్తున్నారు

ఆ దిక్కుమాలిన పాణిపూరి నేను తినలేకపోయేదాన్ని

బండి దగ్గర దొరికే పాణిపూరి తినాలి అని మనసు లాగుతూ ఉండేది

నేను ఒంటరిగా బయటకు వెళ్లే అవకాశం మా వారు నాకు అస్సలు ఇవ్వరు వెళ్లి తినాలి అనే కోరిక నీ అపుకుంటున్న నాకు ఓ అవకాశం వచ్చింది

అదే మా ఆడపడుచు భర్త గారు ఒకసారి ఇంటికి వచ్చారు

ఆయన ఎప్పుడూ కార్ లో వచ్చే వారు ఈ సారి స్క్యూటీ తీసుకొని వచ్చారు

ఏవండి స్క్యూటీ నడిపి చాలా రోజులు అయింది ఒకసారి ట్ర్య్ చేస్తాను ప్లీజ్ అన్నాను

మొదట వద్దు అన్నారు మా ఆయన గారు

చివరికి అత్తగారు పర్మిషన్ ఇవ్వటం తో గదిలోకి వెళ్లి పర్స్ లో నుంచి డబ్బులు తీసుకొని ఆయన కి కనిపించకుండా చేతిలో పట్టుకొని స్క్యూటీ తీసుకొని అక్కడ నుంచి జంప్

ఎక్కడ పాణిపూరి బండి ఉందా అని అన్వేషిస్తున్న నాకు మా ఇంటి నుంచి ఓ అరకిలోమిటర్ దూరం లో పాణిపూరి బండి కనిపించింది

ఆ కళ్ళు ఆనందం తో ఊపిరి పోసుకున్నాయి

బండి అటుగా పోనించాను

బండి పార్క్ చేసేసి పాణిపూరి తింటున్న

అతను ఇవ్వటం నేను తినటం అతను ఇవ్వటం నేను తినటం

కరువు ప్రాంతం నుంచి వచ్చినట్లు నేను తింటుంటే పాణిపూరి ఇచ్చేవాడు షాక్ అవుతున్నాడు

సంవత్సరం పాటు అతికష్టం మీద పాణిపూరి ధీక్షలో ఉన్న నేను దీక్ష నీ విరమించి కడుపరా పాణిపూరి తినేసి చేతులు కడుగుతూనే ఎదురుగా ఒక కటౌట్ కనిపించింది

ఎవరా అని చూసాన షాక్

ఎదురుగా మా వారు కోపం తో మింగేసేలా చూస్తున్నారు

ఎం అంటారో అని భయం తో కళ్ళు తెలిసిన నన్ను డిస్టప్ చేస్తూ ఒక తేన్పు వచ్చింది

బండి వాడు డబ్బులు అడిగాడు

ఎంత అని అన్నాను

డెబ్బయ్ రూపాయలు మేడం అన్నాడు

నేను మళ్ళీ షాక్ అయ్యాను ఇంతలా తినేసనా అని

నేను తెచ్చినది యాబై రూపాయలు అవి చూసుకొని నవ్వుతూ మా వారి వైపు చూసాను

ఆయన పర్స్ తీసి పాణిపూరి అతనికి డబ్బులు ఇచ్చారు

సారీ అన్నాను ఆయన వైపు అపాలజీగా చూస్తూ

అప్పటివరకు కోపంగా ఉన్న ఆయన హాయిగా నవ్వేసారూ

నేను ఆయన నవ్వుతో జత కలిపాను

ఇంటికి వెళ్ళాక చెప్పారు నేను బయటకు వెళ్ళినప్పుడు ఇప్పిస్తాను ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా వెళ్లి తినకు అని

నేను స్క్యూటి తీసుకొని వెళ్లి ఎక్కడైనా పడ్డాను ఏమో అని భయపడి వచ్చారు అంట ఆయన
అందులో భాగంగా అనవసరంగా పర్మిషన్ ఇచ్చావు అని అత్తయ్య నీ కూడా అన్నారు అంట

ఆ తరువాత నేను ఎప్పుడు పాణిపూరి దీక్ష చెయ్యలేదు సుబ్బరంగా మా వారు వారానికి ఒకసారి ప్రత్యేకంగా పాణిపూరి కోసం అయిన బయటకు తీసుకువెళ్ళేవారు

మెల్లిగా ఆయనకి కూడా అలవాటు చేసాను

అప్పుడు అన్నారు ఆయన నీ పాణిపూరి ఒక పాణిపూరి ఏనా అని నవ్వుకున్నా నేను

ఇదండీ మన పాణిపూరి కథ సారీ నా పాణిపూరి కథ

అందరికి ధన్యవాదాలు

మీ

కిరణ్ తేజ