Read Journey - without boundaries - Episode 1 by Mohan Bandreddi in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

Journey - without boundaries - Episode 1

చుట్టూ మంచు కొండలు తెల్ల రంగు తెచ్చి ఈ కొండల మీద పెయింట్ చేసారా  అనేంత తెలుపు మధ్య లో నదిల ఒంపులు తిరుగుతూ వెళ్తున్నా రోడ్డు, అలాంటి రోడ్డు మీద బులెట్ వెళ్తుంది , అది చూడడానికి ఒక ట్రవెల్లెర్ బండి లా ఉంది.

వెనుక రెండు బ్యాగులు , పెట్రోల్ నింపి ఉన్న క్యాన్ , బైక్ ముందు భాగం లో "don't put boundaries for your life" అనే కొటేషన్

ఇంతకీ ఈ బైక్ మీద ఉన్నది ఎవరు అనేది చూస్తే ప్రియా తను ఒక ట్రవెల్లెర్

ఈ ప్రపంచం మొత్తం  క్యాంపర్ వ్యాన్ లో తిరుగుతూ ప్రక్రుతి లో ఉన్న ప్రతి అనుభవాన్ని ఆస్వాదించాలి అనేది తన కోరిక

తనకి వాళ్ళ నాన్నే స్కూల్ కాలేజ్ అన్ని తను ఇప్పటివరకు స్కూల్ కాలేజ్ ఎలా ఉంటాయో కూడా చూడలేదు

నేచర్ ని ఇంత ప్రేమించే అమ్మాయి మనుషులతో మాత్రం అంటి  ముట్టనట్టు ఉంటుంది

దానికి కారణం తన లైఫ్ లో ఎంతో ఇంపార్టెంట్ అయినా వాళ్ళ నాన్న ఆక్సిడెంట్ అయి రోడ్ పక్కన చావు బతుకులా మధ్యన

పడి కొట్టు మెట్టు ఆడుతుంటే ఒక్కరు కూడా హెల్ప్ చెయ్యడానికి దగ్గరికి రాలేదు

ప్రియా హెల్ప్ చెయ్యమని ఎవర్ని అడిగిన మనకెందుకు అనుకుని వెళ్ళిపోయిన వాళ్లే అందరు

తను అప్పుడే డిసైడ్ అయ్యింది ... ఈ నేచర్ లో ఏ విష్యం లో అయినా ముందు ఉండేది మనతో వచ్చేది ,మన పేరెంట్స్ మాత్రమే

మిగితా ప్రేమంతా ఒట్టి ట్రాష్ అని

నాన్న ని అమితం గా ప్రేమించే ప్రియ లైఫ్ లోకి నాన్నే  నా లైఫ్ లో విలన్ అనుకునే రాహుల్ ఎంటర్ అయితే

అది 1998 రాహుల్ చిన్నతనం లో

స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్ లో భాగం గా  రన్నింగ్ రేస్ పోటీలు జరుగుతున్నాయి

రాహుల్ అందరికంటే ముందు పరిగెడుతున్నాడు ... ఇంకా 2 నిముషాలులో తను విన్నర్ గా గెలుస్తాడు

అలాంటిది రాహుల్ ఓడిపోయాడు

ఎందుకో తెలుసా అప్పటి వరకు ముందు ఉన్న రాహుల్ సడన్ గా వాళ్ళ నాన్న కనిపించేసరికి ఆగిపోయాడు

దానికి కారణం  రాహుల్ చిన్నప్పటి నుండి స్కెచ్చ్ లు బాగా వేసేవాడు

కానీ వాళ్ళ  నాన్న ఎప్పుడు చదువు చదువు అని తిడుతుండేవాడు

రాహుల్ కి డ్రాయింగ్ పోటీల్లో మొదటి బహుమతి వచ్చిన కూడా లెక్కల్లో  10 మార్కులు తక్కువ ఎందుకొచ్చాయ్

అని తిట్టేవాడు

చిన్నప్పుడే అమ్మ చనిపోయింది తన ఫీలింగ్స్ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలీదు 

ఆలా షేర్ చేసుకోలేని ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్ని తండ్రి మీద కోపం గా మారాయి

చూస్తుండగానే కాలం వేగం గా ముందుకు వెళ్ళిపోయింది

రాహుల్ తన డిగ్రీ పూర్తి చేసాడు .... క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో జాబ్ వచ్చింది

కానీ రాహుల్ ఆ జాబ్ లో జాయిన్ అవ్వలేదు ... ఆ విష్యం లో తండ్రితో జరిగిన గొడవ లో ఎప్పుడు తండ్రికి  ఎదురుచెప్పని రాహుల్

మొట్టమొదటి సారి  ఎదురు తిరిగాడు

నాకు జాబ్ చెయ్యడం ఇష్టం లేదు .. నేను వెళ్ళాను అని ఆ మాటలకి కోపం వచ్చిన తండ్రి

అలా అయితే నిన్ను కూర్చోపెట్టి పోషించడం నాకు ఇష్టం లేదు

నా కష్టం తో నువ్వు ఎంజాయ్ చేస్తా అంటే నేను ఒప్పుకోను

ఇన్ని రోజులు నీ మీద పెట్టిన పెట్టుబడి అంత దండగా .. వెన్తనె ఇంట్లో నుండి పో అన్నాడు

ఆ మాటలకి చాల హర్ట్ అయినా రాహుల్  ఇంట్లో నుండి వచ్చేసాడు.

ఇంట్లో నుండి బయటకి అయితే వచ్చాడు కానీ తనకి ఎవరు ఫ్రెండ్స్ లేరు ఎక్కడికి వెళ్లలో తెలీదు

అలా రైల్వే స్టేషన్ లో లైట్ కింద బెంచ్ మీద కూర్చుని తన డ్రాయింగ్ బుక్ లో  స్కెచ్ వేస్తున్నాడు

తన ఫాదర్ తో జరిగిన ఇన్సిడెంట్ ని స్కెచ్ లా వేసి "నువ్వు నాకు నచ్చలేదు నాన్న అని నాన్న అనే వర్డ్ కొట్టేసి నిన్ను ఆలా పిలవడం కూడా నాకు ఇష్టం లేదు" అని రాసుకున్నాడు.

తను ఆలా స్కెచ్ వేస్తూ ఉండగా తాను కూడా తెచ్చుకున్నా ఒక నొవల్ లో ని పేజీలు గాలికి ఎగురుతూ ఉన్నాయ్

అప్పుడే అక్కడికి వచ్చింది ప్రియా ... వచ్చి రాహుల్ కూర్చున్నా బెంచ్  మీద కూర్చుంది

రాహుల్ ఆమె ని చూడలేదు

రాహుల్ ప్రియా ని పిలిచి ... హలో మిస్టర్ ఈ స్టేషన్ లో ఏ ట్రైన్ ముందు వెళ్తుంది అని అడిగింది ..అది విని రాహుల్ కి కొంచం సేపు ఏం అర్ధం కాలేదు

ఏ ట్రైన్ ముందు వెళ్లడం ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు

అక్కడికి ఇక్కడికి అని ఏం లేదు ... ఏదో ట్రైన్ ఎక్కేస్తా దారి లో దిగుతానా ఆ ట్రైన్ వెళ్లే చివరి స్టేషన్ లో దిగుతానా అనేది చెప్పలేను

అని అంటూ ఉండగానే స్టేషన్ లో ట్రైన్ మూవ్  అయ్యింది

ప్రియా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ ట్రైన్ ఎక్కేసింది ... ప్రియా పరిగెత్తుకుంటూ వెళ్తుంటే రాహుల్ కి తను చిన్నప్పటి నుండి ఏ స్వేచ్ఛ అయితే కావాలి అనుకున్నాడో ఆ స్వేచ్ఛ ఆ అమ్మాయి రూపం లో తన ముందు ఉన్నట్టు అనిపించింది

ఇంకా ఏం ఆలోచించలేదు ... వెళ్లి తాను కూడా ఆ ట్రైన్ ఎక్కేసాడు.

ట్రైన్ అయితే ఎక్కేసాడు ..కానీ ప్రియా తో ఎలా మాట కలపాలి అనేది రాహుల్ కి తెలీదు ఎందుకంటె అతను అప్పటివరకు అమ్మాయి తో మాట్లాడింది లేదు అలంటి రాహుల్ దైర్యం చేసి వెళ్లి సీట్ లో ప్రియా పక్కన కూర్చున్నాడు

అప్పుడు ప్రియా మీరు కూడా ఇదే ట్రైన్ ఆ అంటే లేదు నాకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు  మీరు వచ్చారు నేను వచ్చి ఎక్కేసాను అన్నాడు

ఓహ్ నన్ను చూసి నా ఫిగర్ చూసి ఇంప్రెస్స్ అయ్యావ్ అన్నమాట అంటే అదేం లేదండీ ఎందుకు వచ్చానో నాకు తెలీదు వచ్చేసాను అంతే అంటే సరే నాకు దూరం గా ఉండు నాకు మనుషులతో ఎక్కువ సేపు మాట్లాడడం ఇష్టం ఉండదు అంటే

మనుషులతో మాట్లాడడం ఇష్ష్టం ఉండదా మరిఇంకెవరితో మాట్లాడతావ్ అంటే మూసుకుని పోరా అంది ప్రియా.

ట్రైన్ లో అందరు పడుకున్నారు .... రాహుల్ కూడా ఫుల్ డీప్ లో  పడుకుని ఉన్నాడు ... అప్పుడు సడన్ గా ప్రియా లేచింది ట్రైన్ చైన్ లాగింది అప్పుడే మెలుకువ వచ్చిన రాహుల్ ఆమె ని చూసి అదేంటి చైన్ ఎందుకు లాగుతున్నావ్ అంటే నాకు జర్నీ చేసి చేసి బోర్ కొట్టింది అబ్బా నాకు చేంజ్ కావాలి అని ట్రైన్ దిగిపోతుంటే రాహుల్ కూడా కంగారు  కంగారు గా లగేజ్ సర్దుకుని ప్రియా తో పాటు ట్రైన్ దిగిపోయాడు అది చూసి ప్రియా నువ్వెందుకు దిగువ అంటే ఆడ పిల్ల కదా నైట్ టైం అసలే మిడ్ నైట్ ప్రాబ్లెమ్ అని అంటే సోది కబుర్లు చెప్పకు మాస్టారు నీకు నాతో రావాలని ఉంది చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ అంతే కదా

సరే రా అంది.

ఇద్దరు స్టేషన్ బయటకి వచ్చారు ... అంత నిర్మానుషం గా ఉంది, దూరం గా ఒక ఆటో ఉంది ,ప్రియా ఆటో దగ్గరికి వెళ్లి బావ అంది ... బావ అంటావ్ ఏంటి ఏంటి ఆటో వాడిని పట్ట్టుకుని అని రాహుల్ అంటే ఇప్పుడు అన్న  అనుకో వాడు నన్ను చూసి ఏదో ఊహిచుకుని ఉంటాడు కదా అన్న అనుకో ఫీల్ అవుతాడు సో ఆలా   అవ్వకూడదుగా అంటే ప్రతీ అబ్బాయి ఒక అమ్మాయి నోటి నుండి కోరుకునే రిలేషన్ sister   అయితే కాదు కదా అందుకే బావ అని పిలిస్తే వాడు హ్యాపీ అని ఆటో వాడితో బావ మందు కావాలి తీసుకెళ్తావా అంటే రండి మేడం అని ఆటో వాడు అన్నాడు ...

ఆటో వైన్ షాప్ దగ్గర ఆగింది ...

వైన్ షాప్ లో ప్రియా మందు తీసుకుంది ... మందు ఓపెన్ చేసి ఎందులో కలపాలో తేలిక వాటర్ బాటిల్ ఉందా అని అడిగింది , హా ఉంది అని వాటర్ బాటిల్ తీసి ఇస్తుంటే  సగం తాగేసి ఇవ్వు అంది ప్రియా .. రాహుల్ సగం తాగేసి ఇస్తే అందులో మందు కలిపేసి ప్రియా తాగి రాహుల్ కి ఫుల్ గా పట్టించేసింది

రాహుల్ ఫుల్ అవుట్ అయిపోయాడు .....

సెషన్ లో రాహుల్ ఫుల్ గా అవుట్ అయిపోయి పడుకుని ఉన్నాడు

si ప్రియా తో అంటున్నాడు ... నీకు జర్నీ నచ్చలేదు మధ్యలో ట్రైన్ దిగిపోయావ్ కానీ దిగిన దానివి అంత రచ్చ చెయ్యకూడదు కదమ్మా

అంటే నేనేం రచ్చ చేశాను అంటే నువ్వు వాడు  రోడ్ మీద చేసింది మాములు విషయమా అమ్మ రోడ్ మీద వెళ్లే వాళ్ళని కొట్టారు

రోడ్ బ్లాక్ చేసారు

నీకు జర్నీ నచ్చకపోతే ఏంటమ్మా  ఇదా చేసేది అంటే

నాకు ఏం తెలీదు సర్ అదిగో అక్కడ పడుకుని ఉన్నాడు కదా వాడే ఇదంతా చేసాడు అంటే వాడా చేసింది నీరును ముందే అనుకున్న ఇంత అందమైన అమ్మాయి ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది అని si వెళ్లి రాహుల్ ని లేపాడు.

రాహుల్ నిద్ర లో నుండి లేచి సడెన్ గా పోలీస్లని చూసి సర్ నాకేం తెలీదు నేనేం చెయ్యలేదు అంటే నువ్వేం చెయ్యలేదా అర్ధరాత్రి రోడ్ మీద హంగామా చేసి ఏం చెయ్యలేదు అంటావా అంటే .. ప్రియా సర్ ఎందుకు ఇంత హడావిడి మీకు వర్క్ అవుట్ అవ్వలి  అంతే కదా వాడి మెడ లో చైన్ ఉంది తీసుకోండి అంది ప్రియా

si అది వినగానే ఒక విచిత్రమైన నవ్వుతో  ఇవ్వరా  అని రాహుల్ మెడ లో ఉన్న చైన్ తీసుకుని వెళ్ళండి అన్నాడు.

స్టేషన్ బయట ప్రియా వెళ్ళిపోతూ ఉంది రాహుల్ వెనకాలే వచ్చి హలో మేడం ఏంటి వెళ్ళిపోతున్నావ్ వాడికి చైన్ అని చెప్పావ్ వాడి చైన్ తో పాటు ఉన్న డబ్బులు కూడా తీసుకున్నాడు

అంటే ... వాడు తీసుకుంటే నన్నేం  చేయమంటావ్ అంటే ... ఏం చేయమంటావా నా దగ్గర ఉన్నది మొత్తం వాడికిఇచ్చేసా

నన్ను నువ్వే మైంటైన్ చెయ్యాలి అంటే

మైంటైన్ చెయ్యడం ఉంచుకోవడం మన వల్ల కాదు కానీ సరే నాతో నువ్వు రావాలి అంటే ఒక కండిషన్ అంది ప్రియా అది విని ఏంటి ఆ కండిషన్ అన్నాడు రాహుల్

నువ్వు నాతో ట్రావెల్ చెయ్యాలి అంటే  నాకు పర్ డే 1000 రూపీస్ చెయ్యాలి

అంటే రాహుల్ వెంటనే ఓకే చేస్తాను అన్నాడు.

ఆలా ప్రియా తో రోజుకి 1000 రూపీస్ ట్రావెల్ చెయ్యడానికి ఒప్పుకున్నా రాహుల్ ఆమెతో ట్రావెల్ చెయ్యడం స్టార్ట్ చేసాడు.

ప్రియా , రాహుల్ ఇద్దరు ట్రావెల్ చెయ్యడం స్టార్ట్ చేసారు

గోవా  లో బైక్ రేసింగ్ జరుగుతుంది ... ఆ రేసింగ్ చూడడానికి ఇద్దరు వచ్చారు

అ రేసింగ్ లో ఒకడు ప్రియా తో మిస్ బిహేవ్ చేసాడు అది చూసి రాహుల్ రియాక్ట్ అయ్యాడు

ఆ బైక్ రేసింగ్ వాళ్ళకి రాహుల్ కి గొడవ జరిగింది వచ్చి రాని ఫైట్ తో రాహుల్ వాళ్ళని కొట్టేసాడు

అదంతా చూసి ప్రియా రాహుల్ తో  ఎందుకు కొట్టావ్ అంటే ఒక ఆడపిల్ల ని అంత నీచం గా ఎలా మాట్లాడతారు

అంటే ఓహ్ ఆడ పిల్ల  ...... జెండర్ .... 

వాడు నువ్వు ఈ  రోజు కొట్టొచ్చు కానీ వాడు ఎప్పుడు అలాగే మాట్లాడతాడు

ఒక దెబ్బ కి మారిపోయే వాళ్లే అయితే కామెంట్ చేస్తారా

దెబ్బ టెంపోరోరారి ... క్యారెక్టర్ పర్మనెంట్ రాహుల్

అంది ప్రియా.

సముద్రపు ఒడ్డునా ప్రియా రాహుల్ ఇద్దరు కూర్చుని ఉన్నారు

ప్రియా బీర్ తాగుతూ  నాకు మనుషులు నచ్చరు ... అంటే ... నువ్వు మనిషివే కదా  అన్నాడు రాహుల్

అదే నాకు అర్ధం కావడం లేదు ఎందుకు నిన్ను నాతో రానిస్తునాన్నో

అని ప్రియా సైలెంట్ అయిపొయింది ఇద్దరి మధ్య చిన్న సైలెన్స్

ప్రియా ,రాహుల్ ఇద్దరు కిస్ చేసుకునే పరిస్థితి లో ఉన్నారు

సడన్ గా ప్రియా మనం రేపు వారణాసి వెళ్ళాలి రెడీ గా ఉండు అంటే అదేంటి

నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వవు కదా అంటే మూసుకుని చెప్పింది చెయ్ అని వెళ్తూ ఆగి  ఈ రోజు 1000 రూపీస్ అని తీసుకుని ప్రియా వెళ్ళిపోయింది .  

ఇద్దరు ట్రావెల్ చేస్తున్నారు ... బస్సు లో , లారీ లో ,నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు

ఆలా ట్రావెల్ చేస్తూ చేస్తూ వారణాసి కి చేరుకున్నారు

వారణాసి విధుల్లో నాలుగు రోడ్ లు జంక్షన్ కి వచ్చారు , రాహుల్ అడుగుతూ ఉన్నాడు ఇక్కెడికి ఎందుకు వచ్చాం అని కానీ ప్రియా ఏం చెప్పడం లేదు

అలా నడుచుకుంటూ వస్తుంటే వీళ్ళకి ఎదురుగుండా శవాన్ని తీసుకెళ్తున్నారు ... అది క్రాస్ అవ్వగానే పక్క వీధిలో నుండి దేవుడి ఊరేగింపు వెళ్తుంది

పక్కనే ఆడుకుంటున్న చిన్న పాప నవ్వు

"ఈ ప్రపంచం లో ఎక్కడ చూడలేనిది ఇక్కడ ఈ కాసి లో మాత్రమే చూడగలం అదేంటంటే నీ కళ్ళ ముందే చావు ఉంటుంది నీ కళ్ళ ముందే ఆనందం ఉంటుంది

నీ కళ్ళ ముందే భక్తి ఉంటుంది

కోపం వస్తే కోపాన్ని భాద వస్తే భాద ని మాత్రమే మనం చూపించగలం కానీ అన్ని రకాల ఎమోషన్స్ ఫీలింగ్స్ ఒకే ఫ్రేమ్ లో పెడితే అదే కాసి"

ప్రియా , రాహుల్ ఇద్దరు బోట్ లో ఘాట్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నారు

కొంచం దూరం వెళ్ళాక ప్రియా బోట్ ని  అన్ని ఘాట్స్ కనిపించే చోట ఆపమని చెప్పింది

బోట్ లో ఇద్దరు  ఉన్నారు అంత సైలెన్స్

ఒక్కసారి గా  అన్ని ఘాట్స్ నుండి చంద్ర శేఖర్ అనే పేరు వినిపించింది ... రాహుల్ అది విని భయ్యా చంద్ర శేఖర్ ఎవరు అంటే నాకు తెలీదు అన్నట్టు పేస్ పెట్టాడు బోట్ వాడు

అప్పుడు ప్రియా మా నాన్న ఈ రోజు అయన చనిపోయిన రోజు ఆయనకి ఈ ప్లేస్ అన్నా ఈ దేవుడు అన్న చాల ఇష్టం

ఆడ పిల్ల అయితే తద్దినం చెయ్యకూడదు అని రాసుకున్నారు కదా అందుకే డబ్బు ఇచ్చి ఎవరీ ఇయర్ వేరే వాళ్ళతో చూపిస్తూ ఉంటాను అని చెప్పి భయ్యా ఒడ్డు కి తీసుకెళ్ళు అని చెప్పింది.  

గంగ నది ఒడ్డునా శివుని కి హారతి భక్తి తో  హర హర మహాదేవ  శంభో శంకర అని ప్రతిధ్వనిస్తున్నా జనం

అదంతా చూస్తూ రాహుల్ తన స్కెచ్ బుక్ లో ప్రియా రాహుల్ ఇద్దరు గంగ నది మధ్య లో బోట్ లో ఉండి ఘాట్స్ చూస్తున్నా ఇమేజ్  వేసుకుని

దాని కింద ఇలా రాసుకుంటున్నాడు

"అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో నాకు తెలీదు ఎందుకంటె నేను పుట్టడం ఆమె పోవడం ఒకేసారి జరిగిపోయాయి నాన్న ఉన్న అయన నన్ను భాద్యత అనుకున్నాడు కానీ కొడుకు  గా ఎప్పుడు చూడలేదు కానీ ఎందుకో నీతో జర్నీ చేస్తూ ఉంటె నేను  మిస్ అయినా లైఫ్ నాకు ఆ దేవుడు మళ్ళి ఇస్తున్నాడా అనిపిస్తుంది

నోటి తో చెప్పే దైర్యం లేదు అందుకే పెన్ తో "i love you"