Featured Books
  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ ప్రయాణం - 4

సంధ్య - ప్రణయ్ ల విషాద ప్రేమ గాథ

సంధ్య ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి వాళ్ళ సొంత ఉరు కేరళ వాళ్ళ నాన్నగారు అక్కడ వ్యాపారం చేసుకునేవారు. తాను అక్కడ వాళ్ళా అమ్మమ్మగారి ఇంటిలో ఉండి చదువుకొంది అయితే చిన్నతనం లొనే సంధ్యకి వాళ్ళ అత్తకొడుకుని ఇచ్చి పెళ్లి చేయటానికి పెద్దలు మాట్లాడుకున్నారు అయితే సంధ్యకి తెలియని వయస్సులో పెద్దలు చెప్పిన దాని ప్రకారం తనకు కాబోయే భర్త వాళ్ళ బావే అని అనుకునేది కానీ తన మనస్సులో వాళ్ళ బావ మీద ప్రేమ ఉందా లేదా అని తెలుసుకోలేక పోయింది. తనకు వాళ్ళు చెప్పారుకనుక అదే ప్రేమ అని అనుకునేది.

కేరళ నుండి తమిళనాడు కొన్ని రోజులు వాళ్ల నాన్నగారు వ్యాపార నిమిత్తం కుటుంభంతో వాళ్లు వెళ్ళవలిసి వచ్చింది
తనని కూడా వాళ్ళు తీసుకుని వెళ్లిపోయారు. అక్కడ అల్లికలు, కుట్లు, అలాంటివి నేర్చుకుంది. కానీ వాళ్ళ పరిస్థితి వల్ల సంధ్య ని.పై చదువులకు చదివించలేదు. అక్కడ కొన్నాళ్ళు ఉన్న తరువాత సంధ్య వాళ్ల నాన్నగారు స్నేహితుడు ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం కన్నా పట్నం వెళ్లి ఏదైనా చూద్దామని వాళ్లు బయలుదేరారు.పట్నం లో కొన్ని రోజులు అన్ని వ్యాపారాలు ఎలా ఉన్నాయో అని చూసుకొని వాళ్ళు పట్నం లో ఒక మంచి కిరాణా దుకాణం పెద్దది పెట్టారు. కొన్నిరోజులవరకు అంతంత మాత్రంగా అవుతుండేది. చుట్టుపక్కల వాళ్ళ పరిచాయలవల్ల వ్యాపారం కొంచెం కొంచెం గా అభివృద్ధి చెందుతూ వచ్చింది.

ఆ తరువాత వాళ్ళ ఫ్యామిలీ ని పట్నం కి మకాం మార్చారు. ఇక్కడ సంధ్య కి అన్ని కొత్త కొత్త పరిచయాలు స్నేహితులు పరిచయమయ్యారు. అయితే సంధ్య చదువుకుంటానని చెప్పగా వాళ్ళ నాన్నగారు తనని ప్రైవేట్ గా డిగ్రీ కట్టించారు.

ఇక ప్రణయ్ వాళ్ళ కుటుంబం కొంచెం బాగా డబ్బు ఉన్నవారు
వాళ్ల నాన్నగారు ఒక కంపెనీలో మేనేజర్ గా పని చేసేవారు
ప్రణయ్ కి చిన్నప్పటినుండి వాళ్ళ అమ్మ నాన్నగారు గారాబంగా పెంచారు. అందువల్లేనేమో ప్రణయ్ కి చదువు కన్నా తిరగడం జల్సాగా ఖర్చుపెట్టడం అలవాటుపడింది దాని వల్ల వాళ్ళ నాన్నగారికి తనకి ఎప్పుడు గొడవ అయ్యేది. దాంతో వాళ్ళ నాన్నగారు తనని ప్రైవేట్ గా డిగ్రీ కట్టించారు

సంధ్య, ప్రణయ్ , సూర్య , వర్ష , నరేష్, వర్షిత లు ఒకే కాలేజ్ లో డిగ్రీ ప్రైవేట్ గా కట్టారు

సూర్య , నరేష్ , ప్రణయ్ లు బికామ్ జాయిన్ అయ్యారు
వర్ష , వర్షిత , సంధ్య లు బి ఏ జాయిన్ అయ్యారు. వాళ్ళు ఒకరికి ఒకరు పరిచయం చేసుకుని కలిసి వెళ్ళేవాళ్ళు అయితే వర్ష వల్ల వర్షిత, సంధ్య సూర్య వల్ల నరేష్ ప్రణయ్ ఒకరికొకరు పరిచయమయ్యారు.

అందరూ కలిసి వచ్చేవారు, కలిసి వెళ్లేవారు, సంధ్య ప్రణయ్ లు ఒకేఏరియా నుండి వచ్చేవారు ప్రణయ్ సంధ్యని రోజు ఇంటికి దిగబెట్టి వెళ్తుండేవాడు ఆవిధంగా సంధ్య ప్రణయ్ మీద ఇష్టాన్ని పెంచుకొంది. అయితే ఈ విషయాన్ని ప్రణయ్ కి ఎలా చెప్పాలో తెలియక తన భాదని వర్షతో చెప్పింది అదీకాక తన బావతో చిన్నప్పుడే తనకి ఎంగేజ్మెంట్ ఐయింది అని ఈ సంగతి తనకి ఎలా చెప్పాలో తెలియదని చెప్పింది

అప్పుడు వర్ష ఈ విషయాన్ని సూర్యకి చెప్పింది అయితే ప్రణయ్ తో మాట్లాడుదామనేలోపే ప్రణయ్ సంధ్యమీద ఉన్న ఇష్టాన్ని సంధ్య తో చెప్పాడు సంధ్య కూడా తన అభిప్రాయాన్ని చెప్పి తన గతం గురించి కూడా చెప్పింది

అయితే ప్రణయ్ అవన్నీ పట్టించుకోలేదు నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా తనతో ఉండేవాడు. వాళ్ళ క్లోజ్ నెస్ ని చూసివాళ్లిద్దరూ మొగుడు పెళ్లాలా అని అనుకునేవారు.
వర్ష సంధ్య తో చాలా సార్లు చెప్పింది. డిగ్రీ కంప్లీట్ అవ్వని మేమె మీకు దగ్గరుండి పెళ్లిచేస్తాం అని కానీ సంధ్య వినలేదు
ఎందుకంటే ప్రణయ్ అంటే సంధ్యకి చాలా ఇష్టం. డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు అయ్యాయి.
వర్షిత వాళ్ల బావ వాళ్లు పట్నం వచ్చి సంధ్య కి.పెళ్లి చేయమని అడిగారు సంధ్య వల్ల నాన్నగారు తాను చదువుకోంటోమ్ది కొన్నిరోజుల ఆగమని అడిగారు. అప్పుడు సంధ్యాకి భయం మొదలైంది ప్రణయ్ కి ఈ సంగతంతా చెప్పింది ప్రణయ్ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ రోజురోజు సంధ్య ఈ విషయాన్ని ప్రణయ్ కి అడిగేది. తాను మాత్రం తనకి సంబంధం లేనట్టు ఉండేవాడు.
వర్ష ,, సూర్య ప్రణయ్ ని అడుగగా ప్రణయ్ వాళ్ల ఇంటిలో తన ప్రేమని ఒప్పుకోరని తనని మర్చిపోవడం తప్ప మరేమీ దారిలేదని అని తేల్చి చేప్పాడు. సంధ్య తనని ఎక్కడికైనా తీసుకెళ్లి పెళ్లి చేసుకోమని అడుగగా ప్రణయ్ అందుకు ఒప్పుకోలేదు ఏవో సాకులు చెప్తూ తననుంచి తప్పించుకు తిరిగేవాడు. కొన్నిరోజులకి సంధ్య వాళ్ళ ఇంటిలో తన ప్రేమ విషయం తెలిసిపోయింది తనని కాలేజ్ మానిపించి తనని ఇంటిలో ఉంచేశారు. ప్రణయ్ తనని పూర్తిగా దూరం ఉంచాడు. వర్ష సూర్య ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్లి సంధ్య గురించి చెప్పగా తనని వాళ్ళ బావనే చేసుకోమని నన్ను మర్చిపోమని ఇంకెప్పుడు ఈ విషయం గురించి ప్రస్తావన తేవద్దని చెప్పాడు.( కానీ అసలు సంగతి అది కాదు సంధ్య వాళ్ళ తల్లితండ్రులు ప్రణయ్ ని భయపెట్టారు తనని మర్చిపొమ్మని లేకపోతో తరువాత జరిగే పరిస్థితులకు ప్రణయ్ భాద్యత అని చెప్పి వెళ్లి పోయారు)

.మేము సంధ్య కి జరిగినదంతా చెప్పుము సంధ్య తాను చేసిన మోసానికి తనని కాదనుకొని వాళ్ళ బావని పెళ్లి చేసుకొంది

తరువాత ప్రణయ్ కూడా కొన్ని రోజులకు అర్పిత అనే అమ్మాయిని పెళ్లిచేసుకొన్నాడు.

ఇది సంధ్య ప్రణయ్ ల విషాద ప్రేమ గాధ

వర్ష సూర్య ల ప్రేమ పెళ్లి వరకు వెళ్లి జీవితాంతం తోడు ఉంటానని తనను వదిలి శాశ్వతంగా దూరమయి సూర్య కి తీరని బాదని మిగిల్చింది

నరేష్ వర్షిత ల ప్రేమ మధ్య లొనే ఆగి పోయి వారికి కూడా తీరని బాదని మిగిల్చింది

సంధ్య ప్రణయ్ ల ప్రేమ పెద్దల కారణం గా మధ్య లొనే ఆగి పోయి వారికి కూడా తీరని బాదని మిగిల్చింది.