Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ప్రేమ ప్రయాణం - 2

నరేష్ వాళ్ళ అమ్మ నాన్నలకి ముద్దుల కొడుకు నరేషకి ఇద్దరు చెల్లెళ్లు. ఇద్దరు చాలా తెలివైన వారు. చదువులో కూడా. నరేష్ కి చిన్నపటినుంచి కూడా ఫోటో గ్రాఫీ అంటే చాలా ఇష్టం. కానీ అది నరేష్ వాళ్ల తల్లిదండ్రులకు నచ్చేది కాదు. ఎప్పుడు కూడా చదువు కోమని చెప్పేవారు.

నరేష్ 10థ్ క్లాస్ అయ్యాకా ఇంటర్లో జాయిన్ అయ్యాడు. ఇష్టంలేకున్న కూడా ఇంటర్ కంప్లీట్ చేసాడు. ఇంటర్ తరువాత నరేష్ కుటుంబ పరిస్థితి రీత్యా ప్రైవేట్ గా డిగ్రీ చదువుకొంటూ ఒక కంపెనీలో కలెక్షన్ ఏజెంట్ గా పనిచేసేవాడు.నరేష్ వాళ్ల అమ్మమ్మా వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు వెళ్తుండేవాడు. అక్కడ కొన్ని రోజులుండీ వచ్చేవాడు.

అక్కడ దగ్గర లో నరేషకి దగ్గర బంధువులు ఉన్నారని వాళ్ళ అమ్మమ్మా వాళ్ళు చెప్పగా నరేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళని పలకరించి నరేష్ ఇంటికి వెళ్తుండగా నరేష్ కి మువ్వల శబ్దం వినిపించింది.

నరేష్ వెనుకకు తిరిగి చూడగా అక్కడ ఒక అమ్మాయి లంగావాణిలో కనిపించింది. చూడటానికి తాను చాలా అందంగా ఉంది. అప్పుడు నరేష్ వాళ్ళ బంధువులు తాను నీకు మరదలు అవుతుందని చెప్పారు. అప్పుడే నరేష్ కు పరిమళ పరిచయమయ్యింది. తనని చూసిన మొదట్లోనే తాను నాకోసమే పుట్టిందని అనుకునేవాడు. కానీ ఇంటిలో వాళ్లు తనని ఎక్కడికి పంపేవారు కాదు. తనతో మాట్లాడాలన్నా కలవాలన్న కుదురేది కాదు ఒకరోజు అనుకోకుండా తాను ఒక రోజు నరేషని కలిసింది. అప్పుడు తనతో నరేష్ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. అయితే తను నరేష్ ని చూసినప్పటినుండి ఇష్టపడ్డానని అది చెప్పే వీలు లేక తన మనస్సులోనే తాను భాధపడుతున్నానని చెప్పింది.

అందుకు నరేష్ ఆనందించినా ఏదోతెలియని భయం. ఇంట్లో తెలిస్తే తన పరిస్థి ఏమిటి అని. అప్పటివరకు నరేష్ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మమ్మావాళ్ళ ఇంటింటికి వెళ్ళేవాడు కానీ తన పరిచయమైన తరువాత నెలకోసారి వెళ్లి వచ్చేవాడు. కాని తనతో మాట్లాడటం కుదిరేది కాదు తనను చూసి వెళ్ళేవాడు. కొన్నిరోజుల తరువాత నరేష్ పనిచేసున్న అఫీసుకి పరిమళ ఫోన్ చేసింది.నరేష్ ఫోన్ తీసి తనతో మాట్లాడుతున్నంత సేపు తనలో కంగారు కనిపించింది. ఒక్కసారిగా నరేష్ మొహంలో భాద ,భయం రెండూ కనిపించాయి. విషయమేమని అడుగగా జరిగిందంతా చెప్పాడు. ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి.
అప్పటి పరిస్థితికి నరేష్ కి ఏమి నిర్ణయం తీసుకోవలో తెలియలేదు. ఎందుకంటే నరేష్ ఇంటర్ కంప్లీట్ చేసి ఇంకా స్థిరపడలేని వయస్సు నరేష్ ది.
కొన్ని రోజుల తరువాత మేము ( నా ఫ్రెండ్ సూర్య) కలిసి తనతో మాట్లాడాలని వెళ్ళాము. కానీ అదే చివరి సారిగా వాళ్ళ ఇంటికి వెళ్ళతామని అనుకోలేదు. ఎందుకంటే తనకి వాళ్ళు పెళ్లి చేసేసారు. తన పెళ్లి గురించి నరేష్ కి తెలియనివ్వలేదు. ఎందుకంటే వాళ్ళ ప్రేమ విషయం పరిమళ వాళ్ళ ఇంటిలో తెలిసిపోయింది.

పరిమళ నరేష్ ని కలిసింది. తన పరిస్థితి ఈ విధంగా అవటానికి కారణం నరేష్ వాళ్ళ అమ్మమ్మా వాళ్ళేనని వాళ్ళ ప్రేమ విషయం ని వాళ్ళు పరిమళ వాళ్ళ ఇంటిలో చెప్పారని
పరిమళ చెప్పి బాధపడింది. తన ఇంటిలో తనకు వేరే సంబంధం చూశారని ఈ సంగతి నరేష్ కి ఫోన్ చేశానని చెప్పింది. తల్లితండ్రుల మాటనుకాదనలేక తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేని పెళ్లి చేసుకోవలసి వచ్చిందని చెప్పి అక్కడ నుండి భాధతో వెళ్ళిపోయింది.

నరేష్ చేసేదేమీ లేక తాను చేసిన తప్పుకు భాధపడుతు తిరిగి వాళ్ళ ఉరు వెళ్ళిపోయాడు . నరేష్ తన చదువును మధ్యలో ఆపేసాడు. ఉద్యోగం కూడా మానేశాడు. ఇంటిలో ఉంటూ తన జ్ఞాపకాలతో చాలా బాధపడేవాడు. ఇది తన ఫ్రెండ్ సూర్య గమనించి తనతో మళ్ళీ డిగ్రీ కి ప్రిపేర్ చేసేలా తనని ఒప్పించాడు. అప్పుడు నరేష్ వాళ్ల తల్లి తండ్రులకి నేను ఫోటోగ్రఫీ చేస్తానని చెప్పాడు నరేష్. కాదు నువ్వు డిగ్రీ చదవాలని చెప్పారు నరేష్ వాళ్ల తల్లి తండ్రుల మాటకాదనలేక
చేసేదేమియులేక ప్రైవేట్ గా డిగ్రీ ట్యూషన్స్ లో జాయిన్ అయ్యాడు అక్కడ నాతో పాటు నా స్నేహితుడు సూర్య కూడా జాయిన్ అయ్యాడు . మాకు అక్కడ కొంతమంది స్నేహితులు పరిచాయమయ్యారు.

వాళ్ళ పరిచయం ఎంత మార్పు వచ్చిందంటే నరేష్ పూర్తిగా తన మనస్సులోని భాదని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించేలా . నరేష్ కి మొత్తం 5 గురు స్నేహితులు ఆ స్నేహితులలో 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు . పరిచయమైన కొన్ని రోజులకే వాళ్ళు చాలా దగ్గర వాళ్ళలాగా కలిసిపోయారు. ఎంతలాగంటే ఒకరు సెలవు పెడితే మొత్తం అందరూ సెలవు పెట్టేవారు. ఎక్కడికి వెళ్లాలన్న 6 గురు కలిపే వెళ్లేవారు.ఒక ఫ్యామిలీ లా కలిసిపోయారు.

నరేష్ స్నేహితుల పేర్లు

అబ్బాయిలలో మొదటగా పరిచయం అయినది సూర్య తాను నాకు ఇంటర్ నుంచి మంచి స్నేహితుడు మేము ఇద్దరం ఒకే గ్రూపు లో ఇంటర్ జాయిన్ అయ్యాం ఇద్దరం పక్కపక్కనే కూర్చొని చదువు కొనేవాళ్ళం పరిక్షలు వస్తే ఇద్దరం కూర్చొని చదువుకొనేవాళ్ళం.ఎక్కడికి వెళ్లాలన్న ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. సూర్య మా ఇంటిలో ఒక వ్యక్తిలా ఉండేవాడు

రెండవవాడు ప్రణయ్. వాళ్ల నాన్నగారు ఒక కంపెనీలో మేనేజర్ గా చేసేవారు అయితే ప్రణయ్ జాబ్ గురించే డిగ్రీ కట్టాడు.

అమ్మయిలలో మొదట పరిచయం వర్ష

వర్ష తన చిన్నతనం లొనే తన తల్లిని పోగొట్టుకుంది . వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే అప్పటివరకు వర్ష లైఫ్ బాగుండేది .10థ్ క్లాస్ అయ్యాక వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగులేకపోతే తాను చదువు మానిపించేసి వాళ్ల ఇంటిలో వాళ్ల పిన్నికి (సవతి తల్లికి) పనులలో చేదోడు వాదోడుగా ఉంటూ ప్రైవేట్ గా డిగ్రీ కట్టయింది.

రెండవ పరిచయం సంధ్య

సంధ్య కి ఇల్లు ట్యూషన్ తప్పించి ఇంకేమి తెలీదు ఎందుకంటే తాను ఇంటర్ వరకు తమిళనాడు లో చదువుకుంది. వ్యాపార రీత్యా వాళ్ల నాన్నగారు ఇక్కడకు వచ్చారు అందుకే తాను ప్రైవేట్ గా డిగ్రీ కట్టింది

3వ పరిచయం వర్షిత

వర్షిత చాలా అందమైన అమ్మాయి మరియు తెలివైన అమ్మాయి. తాను కూడా ఇంట్లో పరిస్థితుల వల్ల ప్రైవేట్ గా డిగ్రీ కడుతూ చదువుకొంటుంది.

మేము అందరం ఒకే చోట కలిసేవాళ్ళం అక్కడ నుండి ట్యూషన్ కి వచ్చేవాళ్ళం.