Read Ups and Downs of Former by VRESH NETHA in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

రైతు కష్టం

రైతు కష్టం అంటే కష్టపడే రైతు జీవితం లో కోలుకోలేని కష్టం ఎదురవ్వడం అని అర్థం. మన చుట్టూ ఉన్న ప్రపంచం లో బీదవాడు, ధనికుడు అనే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ప్రతి రోజు ఆకలితో పోరాడుతూనే ఉంటారు. ఇందులో ధనికుడు ఆకలి తీర్చుకోవడానికి ఎక్కువ కష్టపడడు కానీ ఒక్క బీదవాడు ఆకలి తీర్చుకోవడానికి ప్రతి రోజు చెప్పలేనంత, చెయ్యలేంత , చూస్తూ ఉండలేనంత కాయ కష్టం చేస్తుంటాడు. కానీ ఈ రెండు వర్గాల కడుపునింపే ప్రతి ఒక్క చిన్నకారు రైతు కుడా బీద వర్గానికి చెందిన వాడే. కానీ ఈ రైతు చేతులు పంట పండించి అన్నం పెట్టె చేతులు. అలంటి అన్నం పెట్టె చేతులకు కష్టం ఎదురయ్యే యదార్ధ సంఘటనే ఈ కథ....!!!

ఒక్క గ్రామంలో సన్నకారు రైతు ఉండేవాడు. అతని పేరు లచ్చన్న. అతనికి 2 ఎకరాల పొలం భూమి ఉంది. అతనికి ఇద్దరు కొడుకులు మరియు అలాగే ఇద్దరు కూతుర్లు . అతని జీవనం అంతంత మాత్రమే... అంటే పని చేస్తేనే పూట గడుస్తుంది అని అర్థం. రెండు ఎకరాల పొలం భూమి ఉంది కదా పండిచ్చుకుంటూ వడ్లు అమ్ముకుంటూ బ్రాతుకొచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. అవును మీ సందేహానికి నాదగ్గర ఒక్క సమాధానం ఉంది... అదేంటంటే, సాధారణంగా వర్షాలు ఎక్కువగా జూన్ లో అంటే వర్ష కాలం లో పడుతాయి. ఆ ఒక్క వర్షకాలం లో మాత్రమే పంటలు పండించే అవకాశం ఉంటుంది ఈ ఊళ్ళో ఉన్న రైతులందరికీ. ఎందుకంటే, ఆ ఊరిలో ఎంత లోతు బోర్లు తవ్వించిన కూడా నీళ్లు పడే అవకాశాలు లేవు. గ్రౌండ్ వాటర్ చాల లోతులో ఉండేవి.బావులు మాత్రం చాల తొందరగ ఎండి పోయేవి. ఆ ఊరు పక్కనే వర్షాకాలం లో ఒక్క వాగు పారుతుంది. అది కూడా ప్రతి సంవత్సరం తొందరగానే ఎండిపోయేది. ఉందువల్ల గ్రౌండ్ వాటర్ బోర్ కి కుడా అందనంత లోపలి పోయేవి. మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది రైతుకు వచ్చే ఏంటో మరియు అది ఎలా ఉంటుందో.

అది 2014 వ సంవత్సరం, ప్రతి సంవత్సరం లగే ఈ సంవత్సరం కుడా జూన్ లో కురిసే వర్షాలకు రెండు ఎకరాలల్లో బ్యాంకు లో loan తీసుకొని వరి పంట వేసాడు. ఎంతో కాస్త పడుతూ రాత్రి-పగలు అని తేడా లేకుండా టైం కి నీళ్లు అందిస్తూ, వన్య మృగాలా బారి నుండి కంటికి రెప్పలాగా పంటను కాపాడుకుంటున్నాడు. పంటను ఒక్క చంటి పాపలాగా కాపాడుతూ వచ్చాడు. అనుకున్నట్టు గానే మంచి దిగుబడితో పంట చేతికొచ్చింది. గుర్తు పెట్టుకోండి.... నేను నాలుగు నెల్ల పంటను ఒక్క లైన్ లో చెప్పేసాను. కానీ ఒక్క పంట రావడానికి ఒక్క రైతు ఎంత కాస్త పడతాడో వర్ణించడం కష్టం. అంతటి కష్టాన్ని కూడా ఎంతో సంతోషంగా అనుభవిస్థడు రైతు. అదే అతడి గొప్పతనం. మంచి దిగుబడి వచ్చిన పంటను కొన్ని తినడానికి దాచుకొని మిగిలినవి అమ్ముకోవడానికి మార్కెట్ కి వెళ్తే అక్కడ పంది కొక్కుల లాగా కాచుకొని కూర్చున్న దళారులు ముత్యాల్లాంటి వడ్లను చూసి అదేదో పాత ఇనుప సామాను... దేనికి పనికి రాదు అన్నట్టు గిట్టుబాటు ధరకి సంబంధం లేని ధర చెప్తాడు. ఏం చెయ్యాలో తెలియక కొన్ని రోజులు వేచి ఉంటూ ధర పెరుగుతుందేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయం లో ఆకాల వర్షం "ఒక్క రైతు కష్టం" రోడ్డు పైన వుందని కూడా కనికరం లేకుండా కురుస్తుంది.ఎంత జాగ్రత్తగా చూసుకున్న ఆ వర్షానికి వడ్లు తడుస్తాయి. తడిసిన వడ్లు మొలకెత్తడం మొదలయితుంది మరియు అవి నల్ల రంగుకి మారిపోతాయి. ఏం చెయ్యాలో అర్థం కానీ పరిస్థితుల్లో దళారులు నిర్ణయించిన వడ్ల ధర నెలకు తాకుతుంది. ఎంతో కొంత లే... అని అమ్మేసి ఇంటికి వెళ్ళిపోతాడు లచ్చన్న. చేతికొచ్చిన డబ్బులు లెక్కిస్తే బ్యాంకు లో loan తీసుకున్న పైసలకంటే 10,000 రూపాయిలు ఎక్కువ ఉంటాయి అంతే.... దీని బట్టి చూస్తే చిన్నకారు రైతు ఒక్క సంవత్సరం సంపాదన పది వేల రూపాయిలు మాత్రమే. అది ధనవంతుని కుటుంబం ఒక్కరోజు ఖర్చు పెట్టె ఖర్చు.

అకాల వర్షాలు పాడడం తో భూమి పచ్చగా ఉందని ఊళ్ళో వాళ్ళు అందరూ ఎదో ఒక్క పంట వెయ్యడం మొదలు పెట్టారు. లచ్చన్న అనే రైతు కష్టపడే తత్వం కలవాడు కాబట్టి ఆ పది వేలతో నువ్వుల (Sesame seeds) పంట వేసాడు. పాపం విధి లచ్చన్నని పగా పట్టిందేమో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఎందుకంటె, అయన పంట వేసిన తరువాత ఒక్కసారి కూడా వర్షం పడలేదు. నువ్వుల పంట పొడి పంట కాబట్టి పొలం లో ఉన్న తడితో మొలకెత్తింది. ప్రతి రోజు పొలం దగ్గరికి వెళ్ళి ఆకాశం దిక్కు చూస్తూ మొక్కుతున్నాడు. కానీ విధీ అతన్ని కనికరించలేదు. రోజు రోజుకు మొక్కలు ఎండి పోతున్నాయి. ఏం చెయ్యాలో తెలియదు. మొక్కలు చూస్తూ ఏడుస్తూ ఉన్నాడు. తన తల్లి చనిపోయిన కూడా అంతలా ఏడవంతా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. అల ప్రతి రోజు వెళ్ళటం ఆకాశాన్ని ప్రార్థించటం, బాధపడటం మల్లి ఇంటికి రావటం. ఎందుకంటె లచ్చన్న కు పంట మీద ఉన్న ప్రేమ అలాంటిది. ఎండ కాలం రానే వచ్చింది. భానుడి తాపానికి పాపం పసి మొక్కలు నిలువలేక పోయాయి. పంట చచ్చిపోయిది. అంటే లచ్చన్న ఒక్క సంవత్సరం లో సంపాదించినా సంపాదన సున్నా(0). చేసేది ఏమి లేక 100 రోజుల పని ఉంటె దానికి వెళ్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు.

అంతలోనే ఒక్క శుభవార్త....!, పెద్దకూతురికి పెళ్లి కుదిరింది. మంచి పెద్దింటి, మర్యాద పూర్వక కుటుంబం సంబంధం మరియు అబ్బాయి కి ప్రభుత్వ ఉద్యోగం ఉంది. నేను ఎప్పటినుండో కష్టపడుతూ నా బిడ్డలను కూడా కష్టపెడుతూ ఉన్న కనీసం ఇప్పుడన్నా ఒక్క మంచి కుటుంబం లో నా బిడ్డ అడుగు పెడితే మంచిగా బ్రతుకుతుందనుకొని ఈ సంబంధం ఎలాగైనా కుదుర్చుకోవాలనుకున్నాడు. లచ్చన్న కు ఈ సంబంధం వాదులుకోవడం ఇష్టం లేదు. కానీ, చేతిలో చిల్లి గవ్వ లేదు పెళ్లి చెయ్యడానికి.... అబ్బాయి వాళ్ళు అందరికి నచ్చిండ్రు. కానుకలుగా మొత్తం 5 లక్షలు అడిగారు. ఏం చెయ్యాలో అర్థం కాకా.... ఊళ్ళో కొందరి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. పెళ్లి చేసాడు.

ఇప్పుడు మొదలయింది అసలయిన కష్టం లచ్చన్నకు.అప్పు... అప్పు .... అప్పు.... ఎలా తీర్చాలో తెలియట్లేదు. మల్లి జూన్ లో బ్యాంకు లో వడ్డీకి పైసల్ తీసుకొని పంట వేసాడు. మల్లి విధి కాటేసింది. వర్షాలు పడట్లేదు... ఊళ్ళో వాళ్ళ అందరి పరిస్థితి అలాగే ఉంది. కానీ లచ్చన్న పరిస్థితి మాత్రం ఇంకా చాల దీన స్థితి లో ఉంది. ఒక్క పక్క పెళ్లి కి చేసిన అప్పు ఇయ్యకపోతే ఇల్లు తీసుకుంటారు మరియు ఇంకో పక్క బ్యాంకు లో తీసుకున్న loan ఇయ్యకపోతే పంట పొలం తీసుకుంటారు... చాల తికమకలో ఉన్నాడు. పంట చేతికి వచ్చేలా లేదు మొత్తం ఎండి పోవడం మొదలయింది. ఏం చెయ్యాలో అర్థం కాలే... దెబ్బ మీద దెబ్బ పడ్తూనే ఉంది లచ్చన్నకు .అదే సమయం లో లచ్చన్నకు రాకూడని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన తన మంచిదా...! కదా...! అని కూడా ఆలోచించకుండా అమలు పర్చడానికి ముందుకెళ్లాడు. ఒక్కటి గుర్తుంచుకోండి... మనం ఏం ఆలోచించిన అందులో మనకు మరియు మనతో ఉన్న వాళ్లకు మంచి జరగపోయిన పర్లేదు కానీ చేడు కానీ దుఃఖం కానీ జరిగే విధంగా ఉండకూడదు.....దయచేసి గమనించండి. లచ్చన్న కు వచ్చిన ఆలోచనను రైతులందరూ అవలంబించితే.... అన్నం పెట్టడానికి ఒక్క రైతు కూడా మిగలడు. అలాగే ఈ ప్రపంచం లో ఏ ఒక్క మనిషి కూడా బ్రతికి బట్ట కట్టలేడు.

లచ్చన్న కు వచ్చిన ఆ ఆలోచనే అతని కుటుంబానికి చీకటిని మిగిల్చింది. ఆ ఆలోచనే "పురుగుల మందు త్రాగడం".

గమనించండి మిత్రులారా....!, లచ్చన్న చనిపోవడం తోనే సమస్య అనేది పరిష్కరింపపడలేదు. Never Never Never give up..!!!!! అతను చనిపోవడం వల్లే అతను మోస్తున్న బరువు అతని కుటుంబం మోస్తుంది. లచ్చన్న కు వచ్చిన ఆలోచన ప్రతి చిన్నకారు రైతుకి రావడం సహజమే ఎందుకంటె మన చుట్టూ ఉన్న ప్రపంచం ఆలా ఉంది మరి. రైతులు పోరాటం చేస్తే దాన్ని అణగదొక్కే శక్తులు చాలా ఉన్నాయి. దయచేసి రైతులకు చేతనైనంత సహాయం చెయ్యండి. ఇలాంటి ఆలోచన ఏ రైతుకి రాకుండ చెయ్యండి. రైతు అనేవాడు దేశానికి వెన్ను ముక్క అని అంటారు కానీ నేను "రైతు అనే వాడు దేశనికి ఊపిరి " అని నమ్ముతాను. రైతు లేకుండా దేశం ఆర్థికంగా నిలబడొచ్చేమో కానీ అన్నం లేకుండ దేశం లో ఉండే ఏ వ్యక్తి నిలబడలేడు. ఒక్కో వ్యక్తి సముహంల మారి కొన్ని సమూహాలను కలిపి ఒక్క దేశంగా ఏర్పడుతుంది. ఒక్క వ్యక్తే నిలబడనప్పుడు ఇక దేశం ఎలా నిలబడుతుంది.

By

M.V`RESH

MAHAMMADABAD

JANNARAM.